ఉరవకొండ గవిమఠం పీఠాధిపతి మృతిపై వైఎస్‌ జగన్‌ సంతాపం | Ys Jagan Mourns Passing Of Uravakonda Channa Basava Rajendra Swamiji | Sakshi
Sakshi News home page

ఉరవకొండ గవిమఠం పీఠాధిపతి మృతిపై వైఎస్‌ జగన్‌ సంతాపం

Jul 18 2026 7:44 PM | Updated on Jul 18 2026 8:23 PM

Ys Jagan Mourns Passing Of Uravakonda Channa Basava Rajendra Swamiji

సాక్షి, తాడేపల్లి: ఉరవకొండ గవిమఠం పీఠాధిపతి చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి శివైక్యంపై వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘మహాస్వామి సుదీర్ఘ కాలం పాటు ఆధ్యాత్మిక, ధార్మిక సేవలతో భక్తులకు మార్గదర్శనం చేశారు. గవిమఠం అభివృద్ధికి, సనాతన ధర్మ పరిరక్షణకు విశేషంగా కృషి చేశారు. సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించారు.

..మహా స్వామి భక్తులకు అందించిన సందేశాలు చిరస్మరణీయం. చెన్న బసవ రాజేంద్ర మహాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.. గవిమఠం ఉత్తరాధికార కరిబసవ రాజేంద్ర స్వామికి, మఠం భక్తులకు, శిష్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’’ అని వైఎస్‌ జగన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement