సాక్షి, తాడేపల్లి: రేపు (గురువారం 16, జులై) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు.
త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.


