గాదె సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు | Gade Saikrishna Case: Kanakadurga Sensational Comments | Sakshi
Sakshi News home page

గాదె సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు

Jul 15 2026 5:35 PM | Updated on Jul 15 2026 6:12 PM

Gade Saikrishna Case: Kanakadurga Sensational Comments

సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘విజయలక్ష్మి తప్పుకున్నా.. మేం పోరాటం  చేస్తాం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిపై ఒత్తిళ్లు ఉన్నాయి. అందుకే ఆమె మానవ హక్కుల కమిటీ  సాయం వద్దంది. కేసు  నుంచి ఆమె తప్పుకున్నా.. నేను పోరాడుతా’’ అంటూ కనకదుర్గ స్పష్టం చేశారు.

మేము సామాన్యులం.. ఏం చెప్పమంటే అది చెప్పిస్తున్నారు. నాక్కూడా చెప్పకుండా ఆమె కోర్టుకు వచ్చారు. ఒత్తిళ్ల వల్ల అడ్వకేట్స్‌ను మార్చుకుంది. సాయి కృష్ణ తల్లిని కోర్టుకు తీసుకుని రావడానికి కూడా హైడ్రామా నడిపించారు. హైడ్రామా ఎవ్వరు నడిపించారూ ఆమె వెనుక ఎవ్వరు ఉన్నారో మాకు తెలియడం లేదు. సాయికృష్ణ తల్లి వెనకడుగు వేసిన మా లీగల్ బ్యాటిల్ కొనసాగుతుంది. మా అక్క విజయలక్ష్మీ పోరాటం చేయకపోయినా..నేను పిన్నిగా సాయికృష్ణ కోసం మానవ హక్కుల కమిటీ తరపున పోరాటం చేస్తాం’’ అని కనకదుర్గ తెలిపారు.

సాయి కృష్ణ కేసుపై తల్లి వెనకడుగు అడ్వకేట్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement