ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. మరోసారి హోంమంత్రి అనిత శాఖలో పవన్ జోక్యం చేసుకున్నారు. పోక్సో చట్టం అమలుపై ఏపీ సీఎస్, డీజీపీకి పవన్ లేఖ రాశారు. సీఎంకు రాయకుండా సీఎస్, డీజేపీలకు పవన్ లేఖ రాయడం గమనార్హం.
మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా పవన్ లేఖ రాశారు. ఏపీలో మాత్రం సీఎంకు కాకుండా అధికారులకు లేఖ రాశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేసింది పవన్ లేఖ.
తమ పాలనలో మైనర్ బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో విచారణ అలస్యమవుతుందని పవన్ కల్యాణ్ అంగీకరించారు. చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోక్సో కేసుల దర్యాప్తును 60 నుంచి 90 రోజుల్లోగా పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేయాలని పవన్ సూచించారు. ఈ అంశంలో తీసుకున్న చర్యలపై 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు.


