సాక్షి, కాకినాడ జిల్లా: ప్రభుత్వ తీరుపై ముద్రగడ పద్మనాభం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక లాంఛనాలు వద్దన్నా కానీ, ప్రభుత్వం.. గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదంటూ ముద్రగడ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులు గోబ్యాక్ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేశారు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ముద్రగడలేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. ‘‘ఈ దుష్ట ప్రభుత్వ లాంఛనాలు వద్దని ముద్రగడ ఎప్పుడో చెప్పారు. అధికార లాంఛనాలు వద్దన్నా పోలీసులు తుపాకులతో వచ్చారు. ముద్రగడ చనిపోయినా చంద్రబాబు కక్ష సాధిస్తూనే ఉన్నారంటూ అంబటి మండిపడ్డారు.


