వైఎస్సార్‌సీపీలో చేరిన ఒంగోలు కాంగ్రెస్ నేతలు | Ongole Congress Leaders Join Ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన ఒంగోలు కాంగ్రెస్ నేతలు

Jul 22 2026 5:55 PM | Updated on Jul 23 2026 7:13 PM

Ongole Congress Leaders Join Ysrcp

సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఇవాళ (బుధవారం) వైఎస్సార్‌సీపీలో చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, జిల్లా కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ సీనియర్‌ నాయకుడు డి.సతీష్‌బాబు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.

ఈ సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైఎస్‌ జగన్‌ భవిష్యత్తులో సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వం, ఆయన సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితం తమను ఎంతగానో ఆకర్షించాయని నాగలక్ష్మి, సతీష్‌బాబు వెల్లడించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని.. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement