సాక్షి, భీమవరం: సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ లూటీతో సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతుల పక్షాన బుధవారం భీమవరం వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి సభకు వేలాదిగా తరలివచ్చిన ఆక్వా రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులతో ఉదయం 8 గంటల సమయానికే భీమవరంలోని ఉండి బైపాస్‌రోడ్డు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, లోసరి, నరసాపురం రోడ్లు రద్దీతో నిండిపోయాయి. బైపాస్‌రోడ్డులోని డాక్టర్ బీవీ రాజు విగ్రహం సమీపంలో ఏర్పాటచేసిన సభా ప్రాంగణం, హెలీప్యాడ్ ఏర్పాటుచేసిన లూథరన్ గ్రౌండ్ జనంతో నిండిపోయాయి.
ఉదయం 10.30 గంటలకు జగన్ హెలీప్యాడ్‌కు చేరుకోగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాలుకా సెంటర్, ప్రకాశంచౌక్, అంబేడ్కర్ సెంటర్, బీవీరాజు విగ్రహం మీదుగా సభాస్థలికి చేరుకున్నారు. సంక్షేమ సారధిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన స్థానిక మహిళలు, అభిమానులతో తాలుకాఆఫీస్ రోడ్డు, ప్రకాశం చౌక్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి. జనం రద్దీతో హెలీప్యాడ్ నుంచి సభాప్రాంగణం వరకు దాదాపు కిలోమీటరు మేర దూరానికి గంటకు పైగా సమయం పట్టింది. దారిపొడవునా జనానికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు.
ముద్రగడకు నివాళి
సభ ప్రారంభానికి ముందుగా వేదికపై ఏర్పాటుచేసిన దివంగత వైఎస్సార్, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిత్రపటాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు.
ఆక్వా రైతులకు భరోసాగా..
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన జరిగిన సభలో జగన్ ప్రసంగం ఆద్యంతం ఆక్వా రైతులకు కొండంత భరోసానిస్తూ సాగింది. 2019–24 మధ్యకాలంలో ఆక్వా రైతులను ప్రోత్సహిస్తూ వైఎస్సార్ ప్రభుత్వం రూ. 1.50 రాయితీ విద్యుత్ అందించడం, సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు దోపిడీని అరికట్టేందుకు అప్సడాను తీసుకురావడం తదితర కృషిని వివరించారు. 2024 ఎన్నికల్లో ఆక్వా రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. జోన్‌తో సంబంధం లేకుండా ఎంతమంది రైతులకు రాయితీ విద్యుత్‌ను అందించారని జగన్ ప్రశ్నించగా ఎవరికి ఇవ్వలేదని రైతులు చెప్పారు.
కోల్డ్ స్టోరేజీలు కట్టించారా? ఏరియేటర్స్‌పై సబ్సిడీ ఇస్తున్నారా? అని ప్రశ్నించగా ఏమీ చేయలేదని రైతులు సమాధానమిచ్చారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు టీడీపీకి చెందిన వారే కావడంతో చంద్రబాబు వారి దోపిడీకి కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా పోరాడుతుందని, రాబోయే మన ప్రభుత్వంలో సిండికేట్‌ను నామరూపల్లేకుండా చేస్తానన్న జగన్ భరోసాతో సభాప్రాంగణం మొత్తం రైతుల హర్షధ్వానాలతో మార్మోగింది. జగన్ ప్రసంగిస్తున్నంతసేపు ఈలలు, చప్పట్లతో ప్రజలు, అభిమానులు మద్దతు పలికారు. సీఎం..సీఎం అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు.

పొగాకు రైతులకు అండ
పొగాకుకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని సభలో ఏలూరు జిల్లాకు చెందిన పలువురు రైతులు తమ వెంట తీసుకువచ్చిన పొగాకును జగన్‌కు చూపించారు. ధర అందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధైర్యపడవద్దని అండగా ఉంటామని జగన్ వారికి భరోసానిచ్చారు.
ఆక్వా రైతుల గోడు పట్టదా?
ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు విలవిల్లాడుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. రాజకీయాలకు అతీతంగా రైతులంతా రోడెక్కి ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లు లేదు. కూటమి నాయకులు ఆక్వా రైతులకిచ్చిన హామీలు మెడలు వంచి అమలు చేయించేందుకే జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అండగా పోరాటం చేస్తున్నారు.
– ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్‌సీపీ
పశి్చమగోదావరి జిల్లా అధ్యక్షుడు
ఆక్వా రైతులకు అండగా..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతిగా రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నారు. ముఖ్యమంత్రిగా రైతులకు పెట్టుబడి సహాయం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించడం, పంటలకు మద్దతు ధరలు కలి్పంచడంలో జగన్ ముందున్నారు. అనేక ఇబ్బందులతో పోరాటం చేస్తున్న ఆక్వా రైతులకు అండగా ఉండి ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే జగన్ పోరుబాట పట్టారు.
– దూలం నాగేశ్వరరావు,
వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు
రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ
వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుంది. పంటలకు గిట్టుబాటు ధర కలి్పంచడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రొయ్యలు, వరి, పొగాకు, టమోట, మిర్చి, మామిడి తదితర పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్ట్‌లతో వేధిస్తున్నారు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు.
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి, తణుకు
ఆక్వా సంక్షోభానికి ఈ ప్రభుత్వమే కారణం
ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోడానికి కూటమి ప్రభుత్వమే కారణం. ఆక్వా రైతులకు ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు. ఆక్వా జోన్స్‌తో సంబంధం లేకుండా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి రెండేళ్లు గడిచిపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫీడ్ ధరలు పెంచితే ముఖ్యమంత్రి కిలోకు రూ.4 తగ్గించాలని ఆదేశించినా మొక్కుబడిగా రూ.2 తగ్గించి చేతులు దులుపుకున్నా ఎలాంటి చర్యలు లేవు.
– పుప్పాల వాసుబాబు,
మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు
జగన్ హయాంలో ఆక్వాకు మంచిరోజులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రొయ్యల సమస్యలను పరిష్కరించడానికి ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా)ను ఏర్పాటుచేయడంతో రొయ్యల ధరలు నిలకడగా ఉండడమేగాక ఫీడ్, సీడ్ ధరలు అదుపులో ఉండేవి. రైతులకు ఉపయోగపడేలా నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. నేడు అప్సడా నిరీ్వర్యమైంది. ఎన్నడూలేని విధంగా ఫీడ్ ధరలు పెంచినా పట్టించుకున్న నాథుడే లేడు.
– వడ్డి రఘురామ్, అప్సడా మాజీ వైస్ చైర్మన్
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత ఏర్పడింది. ఇటీవల ఆక్వా రైతుల ఆక్రందనలు, పోరాటాలు చూస్తుంటే రైతుల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అవగతమవుతోంది. జగన్ ప్రభుత్వంలో జరిగిన మేలును అన్ని వర్గాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
– చినమిల్లి వెంకటరాయుడు,
వైఎస్సార్‌సీపీ భీమవరం సమన్వయకర్త
రైతుల నిరసనలు పట్టవా?
కొంతకాలంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోవడం వల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా రోడెక్కి ఆందోళన బాట పట్టారు. రోడ్లపై ఫీడ్ బస్తాలు తగలబెట్టడం, రొయ్యల రోడ్డుపై పారబోసి ఆందోళన చేయడం వంటి ఆందోళనలు చేపట్టారు. రైతుల ఆందోళనలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సైతం పాల్గొంటున్నారంటే ప్రభుత్వంపై రైతుల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది.
– మామిళ్లపల్లి జయప్రకాష్,
వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త
జగన్‌కి ఘన స్వాగతం
భీమవరం (ప్రకాశంచౌక్): ఆక్వా రైతుల సమస్యలపై భీమవరంలో ఏర్పాటు చేసిన పోరుబాట కార్యక్రమానికి భీమవరం విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భీమవరం లూథరన్ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు ఉదయం 10.30 గంటలకు జగన్ చేరకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు, ఇన్‌చార్జిలు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. హెలీప్యాడ్ ప్రాంగణంలో స్థానికంగా ఉండే మహిళలు, యువత ఉత్సాహంగా జగన్‌ను చూశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, ఉభయగోదావరి జిల్లాల ఇన్‌చార్జి గుడివాడ అమర్నాథ్, పార్టీ పశి్చమ, ఏలూరు జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ చింతా అనురాధ, జెడ్పీ చైర్మన్ ఉప్పాల రాధిక, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, కొఠారు అబ్బయ్యచౌదరి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, తలారి వెంకట్రావు, పొన్నాడ సతీష్ నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, ఇన్‌చార్జిలు చినమిల్లి వెంకటరాయుడు, పీవీఎల్ నర్సింహరాజు, గుడాల గోపి, వడ్డి రఘురాం, పేర్ని కిట్టు, కంభం విజయరాజు, పిల్లి సూర్యప్రకాష్, మామిళ్లపల్లి జయప్రకాష్ పొన్నాడ సతీష్ ఉప్పాల రాంప్రసాద్, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, పార్టీ నాయకులు గాదిరాజు సుబ్బరాజు, పెండ్ర వీరన్న, పాతపాటి శ్రీనివాసరాజు, వేండ్ర వెంకటస్వామి, మేడిది జాన్సన్, మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు, కర్రి సుభాíÙణి, చెరుకువాడ నరేష్, యడ్ల తాతాజీ, కోడే యుగంధర్, కోడే విజయలక్ష్మి, బంధన పూర్ణచంద్రరావు, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు, ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు, చెల్లెం ఆనంద ప్రకాష్ బర్రె శ్రీవెంకటరమణ, కొట్టు నాగు, గంటా రాహుల్, చవ్వాకుల సత్యనారాయణ మూర్తి, జల్లా కొండయ్య తదితరులు పాల్గొన్నారు.


