823 మెడికల్‌ కాలేజీల్లో 1.36 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లు | MBBS Admissions 2026–27, NMC Announces 1,36,939 Seats Across 823 Medical Colleges, AP Gets 7,465 Seats | Sakshi
Sakshi News home page

823 మెడికల్‌ కాలేజీల్లో 1.36 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లు

Jul 16 2026 5:41 AM | Updated on Jul 16 2026 9:07 AM

136939 MBBS seats available in 823 medical colleges across the country

సాక్షి, అమరావతి: 2026–27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా 823 వైద్య కళాశాలల్లో 1,36,939 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉ­న్నా­యని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) ప్ర­కటించింది. వీటిలో 441 ప్రభుత్వ వైద్య కళాశాల­లు కాగా, వాటిలో 63,296 సీట్లు ఉన్నాయని వె­ల­్లడించింది. ఈ మేరకు 2026–27 విద్యా సంవత్స­రం ఎంబీబీఎస్‌ సీట్‌ మ్యాట్రిక్స్‌ను ఎన్‌ఎంసీ విడుదల చేసింది. ఏపీలో 19 ప్రభు­త్వ, 21 ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో 7,465 సీట్లు ఉన్నాయి. పక్కనున్న తెలంగాణలో 66 కళాశాలల్లో 10,250 సీట్లు ఉన్నాయి. 

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల వారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ఎన్‌ఎంసీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ క్రమంలో పాడేరు, పిడుగురాళ్ల వైద్య కళాశాలల్లో 50 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. వాస్తవానికి గతేడాదే పాడేరు కళాశాలకు 50 సీట్లు అదనంగా మంజూరయ్యాయి. ఇక పిడుగురాళ్లకు 100 సీట్లు మంజూరైనట్టు ఇటీవలే ఎన్‌ఎంసీ లేటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌(ఎన్‌ఎంసీ) ఇచ్చింది. అయితే సీట్‌ మ్యాట్రిక్స్‌లో మాత్రం 50 చొప్పున మాత్ర­మే చూపించడంతో ఎన్‌ఎంసీతో సంప్రదింపులు జ­రి­పామని డీఎంఈ కార్యాలయ అధికారులు తె­లి­పారు. సీట్ల వివరాల నమోదులో పొరపాటు జ­రిగిందని ఎన్‌ఎంసీ స్పష్టం చేసినట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement