ఈ ప్రభుత్వం నిండా ముంచింది | - | Sakshi
Sakshi News home page

ఈ ప్రభుత్వం నిండా ముంచింది

Jul 16 2026 7:30 AM | Updated on Jul 16 2026 7:30 AM

ఈ ప్రభుత్వం నిండా ముంచింది ఆక్వా సాగు అధ్వానం మేత ధరలతో కుదేలు

ఆక్వా రైతుల ఆక్రందన

నేను గత 30 ఏళ్లుగా వంద ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నాను. నా సుదీర్ఘ అనుభవంలో ఆక్వా రంగం ఇంతటి సంక్షోభంలో పడడం ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి గారు సబ్సిడీలు ఇస్తూ, అప్సడా చట్టంతో మమ్మల్ని అన్ని విధాలా ఆదుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. నేడు ఆక్వా సాగు అధ్వాన్నంగా తయారైంది.

– ఎల్‌.అంజిరెడ్డి, ఆక్వా రైతు, ఒంగోలు

మా కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఆక్వా సాగులోనే ఉంది. ప్రస్తుతం నేను 12 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. మేత ధరలు విపరీతంగా పెరిగి, రొయ్యల ధరలు దారుణంగా పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదు. దీనికి తోడు పెరిగిన కరెంట్‌ కోతలతో జనరేటర్లపై అదనపు భారం పడుతోంది. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి గారు ఆదుకున్నారు. ఇప్పుడు మా పోరాటానికి ఆయన మద్దతు ధైర్యాన్నిచ్చింది.

– వన్నెంరెడ్డి రామకృష్ణ, ఆక్వా రైతు, మచిలీపట్నం

భీమవరం (ప్రకాశంచౌక్‌)/ వీరవాసరం: ఆక్వా రైతుల సమస్యలపై భీమవరంలో ఏర్పాటు చేసిన పోరుబాట కార్యక్రమానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఆక్వా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. జగన్‌ రాకతో తమకు ధైర్యం వచ్చిందని, ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరచి ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement