సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.నాగలక్ష్మి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు డి.సతీష్‌బాబుకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పి.. సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాగలక్ష్మి, సతీష్‌బాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వం, సిద్ధాంతాలు, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత తమను ఆకర్షించాయని చెప్పారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో టి.నాగలక్ష్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు.


