Operation Sindoor
-
అమరుడా.. నీకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ/గోరంట్ల/కర్నూలు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్ భారత ప్రజానీకం ఈ వీర జవాన్‌కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ దంపతులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్‌లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్‌కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు మురళీ నాయక్ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్‌పోర్టుకు వర్పింన ఆయన.. అక్కడే మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరచిపోదు ‘సైనికుడు మురళీనాయక్ అమరుడవ్వడం చాలా బాధగా ఉంది. వీరోచిత పోరాటంలో తనువు చాలించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. మురళీ నాయక్ భారతమాత నుదుటిన అద్దిన సింధూరమని ఏపీ ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో చనిపోవాలనేవాడుమురళీ నాయక్ చిట్టచివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళీకి సూచించారు. అంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీ నాయక్‌కు చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది. ఒక్క రోజైనా భారత సైన్యంలో పనిచేసి.. మిలటరీ దుస్తులతో చనిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతుండేవాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫాంతోనే వీర మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.నీ త్యాగాన్ని మరువలేంవైఎస్ జగన్ దిగ్భ్రాంతియుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బా«ధాకరం అన్నారు. ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. -
ప్రతీ దాడికి పక్కా రికార్డు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను బాంబులు, క్షిపణులతో ధ్వంసం చేస్తున్న భారత బలగాలు.. ఆ దాడుల వివరాలను పక్కాగా రికార్డు చేస్తున్నాయని సమాచారం. ఈ నెల 7న పాక్, పీవోకేలోని 9 లక్ష్యాలపై భారత్ దాడి చేసింది. ఆయా స్థావరాలు ఎవరివి? ఏ ఉగ్రవాద సంస్థ వాడుతోంది? ప్రస్తుతం అందులో ఎవరు ఉంటున్నారు? అనే వివరాలను భారత బలగాలు రికార్డు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాడులకు సంబంధించిన వీడియోలను కూడా చిత్రీకరించి భద్రపరిచినట్లు వెల్లడించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు సమాచారం. పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ ఆధారాలను ఉపయోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
పాశుపతాలు
పాక్ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్–400, ఆకాశ్ ఎన్జీ, ఎంఆర్‌ఎస్‌ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. పెచోరా : దశాబ్దాలుగా సేవలు ఇది సోవియట్ కాలంనాటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ (ఎస్ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. → పెచోరాలో రాడార్ ఆధారిత మిసైల్ లాంచర్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. → ఐదు హై ఇంటర్‌సెప్టివ్ యాంటెన్నాలతో కూడిన 4ఆర్90 యత్నాగన్ రాడార్ దీని ప్రత్యేకత → ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. → రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. → ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. → ఎలక్ట్రానిక్ జామింగ్ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. → గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. → కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్ కేపబిలిటీ (హెచ్‌కేకే) వ్యవస్థగా పిలుస్తారు. → ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. → వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్‌ను నేలకూలుస్తాయి.కాజ్ : మన ఇంద్రజాలం కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (సీఏయూఎస్). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. → ప్రత్యేకతలు: ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోట్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. → లేయర్డ్ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్ డిటెక్షన్, సాఫ్ట్/హార్డ్ కిల్ సామర్థ్యం దీని సొంతం. → రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్ (ఎలక్ట్రో–ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. → ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్ కిల్ (డ్రోన్ల కమ్యూనికేషన్ సిగ్నల్స్ జామింగ్), హార్డ్ కిల్ (నేలకూల్చడం) చేస్తుంది.సమర్: వైమానికాస్త్రం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ (సమర్). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. → వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్ కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. → స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. → డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్జెట్లు నేలకూలినట్టే లెక్క. → సమర్–1 వ్యవస్థ ఆర్–73ఈ, సమర్–2 ఆర్–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. → ఆర్–73ఈ మిసైళ్ల రేంజ్ 8 కి.మీ. ఆర్–27లది 30 కి.మీ. → ముప్పును బట్టి ఒకే ప్లాట్‌ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.ఏడీ గన్స్: లక్ష్యమేదైనా తుత్తునియలే ఎయిర్ డిఫెన్స్ గన్స్. ఎల్–70, షిల్కా తదితరాలు మన ఏడీ వ్యవస్థలో ప్రధానమైనవి. → ఎల్–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్. తొలుత స్వీడిష్ కంపెనీ బోఫోర్స్ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయి. → రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివాటి ద్వారా ఎల్–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. → ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. → ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. → షిల్కా: జెడ్‌ఎస్‌యూ–24–4 గన్స్. షిల్కా అనేది వీటి రష్యన్ నిక్‌నేమ్. → ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్ ప్రొపెల్డ్ వ్యవస్థలు. → నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దాయాది.. మళ్ళీ బరితెగింపు
దాయాది బుద్ధి మారలేదు. తొలిరోజు భారత్‌పై విరుచుకుపడేందుకు విఫలయత్నం చేసి చావుదెబ్బ తిన్న పాకిస్తాన్.. రెండోరోజూ సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయతి్నంచింది. శుక్రవారం చీకట్లు పడుతూనే జమ్మూకశీ్మర్ మొదలు రాజస్తాన్ దాకా 26కుపైగా ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఈ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జో«ద్‌పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులతో శుక్రవారం రాత్రి సమీక్షించారు. న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాలపై పాక్ దాడులు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగాయి. చీకట్లు పడుతూనే జమ్మూ కశ్మీర్ మొదలుకుని రాజస్తాన్ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జో«ద్‌పూర్ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్ అలర్టులు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్‌తో పాటు త్రివిధ దళాధిపతులు భేటీలో పాల్గొన్నారు. భావి కార్యాచరణపై లోతుగా చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆ శాఖ కార్యదర్శి మిస్రీ, దోవల్‌తో కూడా మోదీ గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అంతకుముందు త్రివిధ దళాల మాజీ అధిపతులు, ఉన్నతాధికారులతో కూడా ఆయన సమావేశమై పరిస్థితిపై చర్చించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సరిహద్దుల వెంబడి పరిస్థితిపై కూలంకషంగా సమీక్ష జరిపారు. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా పూర్తిస్థాయిలో విధుల్లో నియోగించాల్సిందిగా ఆర్మీ చీఫ్‌ను కేంద్రం ఆదేశించింది. శత్రువుకు మర్చిపోలేని రీతిలో బుద్ధి చెప్పాలని సైన్యాన్ని రాజ్‌నాథ్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీ వివేక్ శ్రీవాత్సవ సర్క్యులర్ పంపారు. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లోని పలు విమానాశ్రయాల మూసివేతను మే 15 దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది.పేలుళ్లు, సైరన్లు శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్ దాడులకు పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి. పాక్ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలను పాక్ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాట్రా అభిప్రాయపడ్డారు. -
ఈ నెల 13న కళ్లితండాకు వైఎస్ జగన్
తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా 13వ తేదీన కళ్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ద దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందారు. -
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన: ఈ నెల 15 వరకు విమానాలు రద్దు
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్కోట్లకు ఈ నెల 15 వరకు ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసింది. ఆ తరువాత విమానాలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని సంస్థ వెల్లడించాల్సి ఉంది.ఈ సమయంలో ప్రయాణించడానికి ప్రయాణికులు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే.. రీషెడ్యూలింగ్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం.. ఎయిర్ ఇండియా కాంటాక్ట్ సెంటర్లకు కాల్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.#TravelAdvisoryFollowing a notification from aviation authorities on continued closure of multiple airports in India, Air India flights to and from the following stations – Jammu, Srinagar, Leh, Jodhpur, Amritsar, Chandigarh, Bhuj, Jamnagar and Rajkot – are being cancelled till…— Air India (@airindia) May 9, 2025 -
'పిల్లల చనిపోతున్నారు': కన్నీళ్లు పెట్టుకున్న జమ్మూ & కాశ్మీర్ మాజీ సీఎం
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. పాక్.. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో సరిహద్దులో ఉన్న అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లలు సైతం చనిపోతుండటం ఎంతో బాధాకరమని జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి 'మెహబూబా ముఫ్తీ' పేర్కొన్నారు.పాకిస్తాన్ సైనిక చర్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ కాల్పుల్లో పిల్లలు.. మహిళలు మరణిస్తున్నారని అన్నారు. ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ''అప్పటి వరకు ఆడుకుంటున్న కవలలు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయారు''. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? జమ్మూ & కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవారు ఎంతకాలం ఈ బాధను అనుభవించాలి?.. తల్లులకు ఎంతకాలం ఈ కడుపుకోత? అని ప్రశ్నిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.పూంచ్, రాజౌరి, జమ్మూ జిల్లాల్లో పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయి. పాక్ కాల్పులకు 16 మంది మరణించారు. ఇందులో ఐదుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ చర్యకు భారత సైన్యం కూడా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రోన్లు & క్షిపణులను ఉపయోగించి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ మరో ప్రయత్నం చేసింది. అయితే వీటన్నింటి కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది.#WATCH | Srinagar, J&K | On India-Pakistan tensions, PDP chief Mehbooba Mufti says, "What is the fault of the children and women that they are getting trapped in this crossfire?... Military action treats symptoms, not the root cause. It never provides a solution or peace. Both… pic.twitter.com/n6lCwYlwuj— ANI (@ANI) May 9, 2025 -
పాక్.. ప్రపంచాన్ని మోసం చేసే కుట్ర
-
ఆ డ్రోన్లు టర్కీవే.. పాకిస్తాన్ కుట్రలను బయటపెట్టిన విదేశాంగ శాఖ
పాకిస్తాన్ దుశ్చర్యలను భారత విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. గత రాత్రి(గురువారం) పాకిస్తాన్ చేపట్టిన దుస్సాహసాన్ని భారత్ ఎండగట్టింది. భారత సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసి 300 నుంచి 400 డ్రోన్లను పాక్ ప్రయోగించిందని స్పష్టం చేసింది. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన ఈ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిందని పేర్కొంది.. జమ్మూలో సుమారు 34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందని.. పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీకి చెందినవిగా బహిర్గతం చేసింది.‘నాలుగు ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసుకుని.. భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. అయితే భారత్ చేసిన దాడితో పాకిస్తాన్ తీవ్ర నష్టాన్ని చూసింది. పౌర విమానాలను సైతం పాక్ టార్గెట్ చేసి దాడులు చేసింది., వాటన్నింటిని పేల్చేశాం.లేహ్ నుంచి సర్‌క్రీక్ వరకు 36 చోట్ల పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. పాక్ డ్రోన్లన్నింటిని భారత్ ధ్వంసం చేసింది. డ్రోన్ శిధిలాలను పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి.. ఈ ఘర్షణలకు మత రంగు పులిమెందుకు పాక్ ప్రయత్నం చేస్తోంది. గత రాత్రి పాకిస్తాన్ భారత నగరాలపై.. పౌరులపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరిపింది. కానీ భారత్ ఉద్రిక్తతను పెంచకుండా, బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చింది.పాక్ దాడులకు సంబంధించి ప్రభుత్వ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. పూంఛ్‌లో గుడ్వారాపై జరిపిన దాడిలో స్థానిక సిక్కులతో పాటు.. ధార్మిక గాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ పాక్ ఈ దాడిని ఒప్పుకోకుండా నాటకాలు ఆడుతోంది. నన్కానా సాహిబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసినట్టు పాక్ అబద్ద ప్రచారం చేస్తోంది. పాక్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ, నన్కానా సాహిబ్ గురుద్వారాపై భారత్ దాడి చేసిందని అబద్ద ఆరోపణలు చేస్తూ.. భారత్‌ను అంతర్జాతీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, "... IMF meeting is going on today, we will present our side in the meeting. Our perspective on these things will be shared with the fellow members. It is on the board to decide further... India has responsibly and adequately… pic.twitter.com/dyEevy8wfa— ANI (@ANI) May 9, 2025 -
జవాన్ మురళి నాయక్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్భ్రాంతి
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో మరణించిన మురళీ నాయక్ మృతి పట్ల కేంద్ర మంత్రి 'బండి సంజయ్' దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మురళి నాయక్ వీరమరణాన్ని యావత్ భారతదేశం గుర్తుంచుకుంటుంది. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం వెలకట్టలేనిది. మురళీనాయక్ త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని బండి సంజయ్ అన్నారు. మురళీ నాయక్ తండ్రితో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పిన సంజయ్.. వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు.శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరిన మురళీ నాయక్.. నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు.మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపులు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్ తమ సైనిక చర్యలతో దాయాది దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ.. డ్రోన్లు, క్షిపణులతో ఉగ్ర శిబిరాలు, సైనిక స్థావరాలపై దాడి చేస్తూ పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది.పాక్ కూడా సరిహద్దు వెంబడి తీవ్ర స్ధాయిలో కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేకాకుండా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ముఖ్య నగరాల్లో డ్రోన్ దాడికి యత్నించి పాక్ విఫలమైంది. ప్రస్తుతం ఇరు దేశాల్లోనూ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అరుణ్ జైట్లీ స్టేడియంను పేల్చివేస్తామని పేర్కొంటూ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కు శుక్రవారం బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని డీడీసీఎ అధికారి ఒకరు ధ్రవీకరించారు."మీ స్టేడియంలో బాంబు పేలుడు జరుగుతుంది. భారత్‌లో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ బ్లాస్ట్‌తో ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చు కుంటామని" మెయిల్లో రాసి ఉన్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌గా ఉంది. ఈ అరుణ్ జైట్లీ స్టేడియం మే 11న గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా నిలిపివేసింది. -
మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే
ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. మన సైనికులకు అండగా ఉంటానని మాటిచ్చారు. తన లేటెస్ట్ మూవీ వసూళ్ల నుంచి వచ్చే లాభాల్లో కొంత భాగం మన సైనికులకు విరాళంగా ఇస్తానని మాటిచ్చారు.(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అల్లు అరవింద్.. గతంతో పోలిస్తే సినిమాలు తీయడం బాగా తగ్గించేశారు. కొన్ని చిన్న చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలా తీసిన లేటెస్ట్ మూవీ '#సింగిల్'. శ్రీ విష్ణు, కేతిక, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది.సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సందర్భంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాను భారత ఆర్మీకి అండగా ఉంటానని, సినిమాకు వచ్చిన లాభాల్లో కొంతమేర ఆర్థిక సాయం చేస్తానని చెప్పుకొచ్చారు. ఈయనలానే మిగతా దర్శక నిర్మాతలు హీరోహీరోయిన్లు కూడా సాయం చేసి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరుకుందాం.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) -
మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో భారత ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ సోషల్ మీడియాలో లెక్కకు మించి ఫేక్ వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ప్రజలకు తనవంతు బాధ్యతగా ఓ సూచన చేశారు.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) 'పాజిటివ్, అప్రమత్తంగా ఉంటే విజయం మనదే. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సాయుధ దళాలని మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ భారత సైనిక చర్యలని మీరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీరు శత్రువలకు సాయం చేసినవాళ్లు అవుతారు. అనధికారిక ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.మొన్నటివరకు రాజమౌళి.. మహేశ్ బాబుతో సినిమా షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి జూన్ లో ప్రారంభించనున్నారు. అప్పటిలోపు పరిస్థితులు సద్దుమణిగితే సరేసరి. లేదంటే సినిమాల షూటింగ్స్ కూడా వాయిదా పడొచ్చేమో? ఇకపోతే రాజమౌళి.. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్ గా ఆపరేషన్ సిందూర్ అని రాసి ఉన్న ఫొటోని పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) If you see any movement of the Indian Army, don’t take pictures or videos.Don’t share them as you might be helping the enemy. Stop forwarding unverified news or claims. You’ll only create noise, which the enemy wants.Stay calm, alert and positive.Victory is ours. 🇮🇳— rajamouli ss (@ssrajamouli) May 9, 2025Saluting our Brave Indian Armed Forces for their unwavering courage in protecting our nation from terrorism. Let’s stand together as a nation, inspired by their valor, to build a future of peace and unity. Jai Hind! 🇮🇳— rajamouli ss (@ssrajamouli) May 9, 2025 -
మన రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది: పాక్ రక్షణమంత్రి
లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. తమ దళాలు అడ్డగించి కూల్చివేసాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత డ్రోన్లను పాక్ అడ్డుకోలేకపోయిందంటూ క్లారిటీ ఇచ్చారు. ‘మన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలమైంది. పాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసింది. మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరణ ఇవ్వలేను’ అని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై పాక్ ప్రతిపక్ష ఎంపీలు(పీటీఐ పార్టీకి చెందిన వారు) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్ఏ దాడులతో ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు.పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు. పాక్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్ పిరికిపంద అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.“We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 “We didn’t intercept Indian drones as it would have given away our defence positions”This isn’t parody, this is scene from Pakistani parliamentPakistani parliament is funnier than parody 😹 pic.twitter.com/7zWbzXzyKA— BALA (@erbmjha) May 9, 2025 -
ఇండియా-యూఎస్ వయా యూరప్
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడం ఎయిరిండియాకు కొత్త రూట్లలో తమ కార్గో విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది. కార్గో సర్వీసుల్లో భాగంగా యూరప్ మీదుగా యూఎస్, కెనడాకు విమానాలను నడపవలసి వస్తుంది. అయితే పాకిస్థాన్ మీదుగా కాకుండా చుట్టూ తిరిగి అమెరికా వెళ్తుండడంతో కార్గో రవాణాకు ఎక్కువ సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఫలితంగా ఇంధన వినియోగం పెరుగుతున్నట్లు పేర్కొంది. అందుకు కొన్ని నాన్‌స్టాప్ విమానాలు, వన్-స్టాప్ విమానాలను నడుపుతున్నట్లు చెప్పింది.ఆపరేషనల్ మార్పులుముంబై-న్యూయార్క్ విమాన సర్వీసులను నాన్ స్టాప్ సర్వీసులకు పునరుద్ధరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీ-అమెరికా/కెనడా విమానాలు వియన్నా లేదా కోపెన్ హాగన్‌లో ఇంధనం నింపుకుంటున్నాయని చెప్పింది. ఢిల్లీ-యూఎస్ మార్గంలో నాన్‌స్టాప్ విమానాల్లో ఇంధనం సాధారణంగా 90-130 టన్నుల వరకు ఖర్చవుతుంది. కానీ వన్-స్టాప్ విమానాలు ఈ ఇంధన భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దాంతోపాటు ఎక్కువ సరుకు రవాణాకు వీలుంటుంది.కార్గో సామర్థ్యం పెంపుయూరప్గుండా ప్రయాణించే వన్-స్టాప్ విమానాలు నాన్‌స్టాప్ విమానాల కంటే 2-3 రెట్లు అధికంగా కార్గోను మోసుకెళ్లగలవని కంపెనీ తెలిపింది. దాంతో ఈమేరకు కొన్ని నాన్‌స్టాఫ్, నాన్ స్టాఫ్ విమానాలను నడుపుతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?పెరుగుతున్న మామిడి ఎగుమతులుదేశంలో ఉత్పత్తవుతున్న మామిడి ఎగుమతులు పెరుగుతున్నాయి. దాంతో కార్గో అవసరాలు అధికమయ్యాయి. గత వారం ఎయిరిండియా వన్ స్టాప్ విమానాల ద్వారా 20 టన్నుల మామిడిని అమెరికాకు ఎగుమతి చేశారు. ఈ సీజన్లో తమ సంస్థ ఇప్పటికే 350 టన్నుల మామిడి పండ్లను రవాణా చేసిందని కేబీ ఎక్స్‌పోర్ట్స్ సీఈఓ కౌశల్ కఖర్ పేర్కొన్నారు. జూన్ నాటికి ఇది 1,200 టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రీ-రూట్ చేసిన కొన్ని సంస్థల విమానాలు వాటి ప్రయాణాల్లో అసౌకర్యాన్ని ఎదుర్కొంటుండగా, ఎయిరిండియా కార్గో ఆదాయాన్ని పెంచుకోవడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. -
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు మన టెర్రరిస్టులకు చెప్పాల్సిందేమో సార్..! -
దెబ్బ మీద దెబ్బ.. భారత్ దాడులతో పాక్ బెంబేలు
పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతమయ్యారు. ఇదిలా ఉండగా, పాక్ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్ చేశారు. పాక్ పార్లమెంట్ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్ పిరికిపంద అంటూ పాక్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.హెచ్‌క్యూ–9పీ, హెచ్‌క్యూ–9బీఈ, ఎఫ్ డీ– 2000, హెచ్‌క్యూ–16ఎఫ్ఈ గగనతల రక్షణ వ్యవస్థలపై పాక్ ఆధారపడుతోంది. వీటితోపాటే పాతతరం ఎల్వై–80, ఎఫ్ఎం–90 రకాలూ ఎంతోకొంత పాక్‌కు సాయపడుతున్నాయి. 40 కిలోమీటర్ల స్థాయిలో లక్ష్యాలను ఛేదించడానికి ఎల్వై–80ను పాక్ వాడుతోంది. మే 7వ తేదీ అర్థరాత్రి దాటాక భారత్ చేసిన దాడిలో హెచ్‌క్యూ–16 వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి 2021లో హెచ్‌క్యూ–9పీ దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను దిగుమతి చేసుకుంది. తమ గగనతలంలోకి వచ్చిన శత్రు క్షిపణులను 125 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి నేలమట్టంచేయగలదు. యుద్ధ విమానాలనూ అడ్డుకోగలదు. -
మరో పెద్ద తలకాయ లేచింది!
-
పాక్ ఆర్మీ బేస్ పై విరుచుకుపడిన భారత్ డ్రోన్లు
-
'థగ్ లైఫ్' ఈవెంట్ వాయిదా.. ఇది వేడుకల సమయం కాదు: కమల్
కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. మే 16న ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో జరగాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో భారత పౌరలకు ఇబ్బంది కలిగించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.'ఆర్ట్ కెన్ వెయిట్.. ఇండియా కమ్స్ ఫస్ట్' అనే శీర్షికతో కమల్ హాసన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'మన దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మే 16న జరగాల్సిన 'థగ్ లైఫ్' ఆడియో విడుదలను వాయిదా వేస్తున్నాం. తిరిగి షెడ్యూల్ వివరాలను తెలుపుతాము. మన సైనికులు మన మాతృభూమి రక్షణలో అచంచలమైన ధైర్యంతో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్నారు. ఇది నిశ్శబ్ద సంఘీభావం కోసం నిర్ణయం తీసుకున్నాం. వేడుకలకు ఇదీ సరైన సమయం కాదని నేను నమ్ముతున్నాను. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం' అని ఆయన పంచుకున్నారు.‘నాయగన్’ (1987) వంటి హిట్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకు మళ్లీ కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో ‘థగ్ లైఫ్’ సినిమా వస్తుంది. శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్, అభిరామి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతదర్శకుడిగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. Statement from Kamal Haasan#Thuglife #ThuglifeFromJune5 #KamalHaasan #SilambarasanTR @ikamalhaasan #ManiRatnam @arrahman @SilambarasanTR_ #Mahendran @bagapath @trishtrashers @AishuL_ @AshokSelvan @abhiramiact @C_I_N_E_M_A_A #Nasser @manjrekarmahesh @TanikellaBharni… pic.twitter.com/jkMiXDBNG0— Raaj Kamal Films International (@RKFI) May 9, 2025 -
ఐదేళ్ల క్రితమే కల్నల్ సోఫియా ఘనత!
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల అణచివేతకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరు దేశంలో ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందో.. ఆ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న మహిళా సైనికాధికారులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పేర్లు కూడా అంతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా కల్నల్ సోఫియా ఖురేషీ గొప్పతనం గురించి ఐదేళ్ల క్రితమే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. సైన్యంలో మహిళా అధికారుల శాశ్వత నియామకానికి (పర్మనెంట్ కమిషన్) సంబంధించిన కేసులో ఈమె ట్రాక్ రికార్డును న్యాయస్థానం ఉదాహరణగా చూపటం విశేషం.ఆడవాళ్లన్న కారణంతో సైన్యంలో పర్మనెంట్ కమిషన్ (పీసీ)కు అనర్హులుగా నిర్ధారించటం చట్టవ్యతిరేకమని 2020 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. ఆ కేసులో మహిళల పీసీకి వ్యతిరేకంగా సైన్యం, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై నాడు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 పేరుతో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద అంతర్జాతీయ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత కంటింజెంట్‌కు న్యాయకత్వం వహించిన మొదటి మహిళ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi).2006లోనే ఆమె కాంగోలో ఐక్యరాజ్యసమితి (United Nations) శాంతి పరిరక్షక దళంలో సేవలందించారు. ఆ సమయంలో కాల్పుల విరమణకు అక్కడి దేశాలను ఒప్పించటంతోపాటు మానవతా సాయంలో కూడా ఆమె కీలకపాత్ర పోషించారు. తన శక్తియుక్తులతో అక్కడ శాంతి సాధనకు కృషిచేశారు. సైన్యంలో పురుషులతోపాటు భుజంభుజం కలిపి పనిచేస్తున్న మహిళలకు.. వారి శరీర నిర్మాణాన్ని సాకుగా చూపి పీసీకి అనర్హులుగా ప్రకటించటం సరికాదు’ అని సుప్రీంకోర్టు నాటి తీర్పులో పేర్కొంది.చదవండి: అది ఇల్లు కాదు.. చిన్నపాటి సైనిక శిబిరం! -
పాక్‌తో యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం
-
పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఫైర్
పాక్ నటుడు ఫవాద్ ఖాన్‌పై బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ (Rupali Ganguly) మండిపడ్డారు. పహల్గాం ఘటనతో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడులను ఫవాద్ ఖండించాడు. ఈ సిగ్గుచేటైన దాడిలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అంటూ పాక్‌కు పూర్తి మద్ధతుగా వ్యాఖ్యలు చేశాడు. ఆపై భారత్‌ను తక్కవ చేస్తూ కామెంట్లు చేశాడు. దీంతో బాలీవుడ్ నటి రూపాలీ గంగూలీ ఫైర్ అయింది.సోషల్ మీడియా వేదికగా ఫవాద్ గురించి ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ' మీలాంటి వాళ్లు ఇండియన్ సినిమాల్లో నటించడం మాకు సిగ్గుచేటు' అని అతని ఫోటోను షేర్ చేసింది. దానికి ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హ్యాష్ ట్యాగ్‌లను ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఫవాద్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. భారతీయ సినిమాల మీద ఆధారపడి బతికిన నువ్వు మా గురించి మాట్లాడటం ఏంటి అంటూ విరుచుకుపడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ కూడా అతన్ని విమర్శించకపోవడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్‌పై వ్యాఖ్యలు చేసిన పాక్ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్‌లను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వారిని వెంటనే పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కోరింది. సినిమాల పేరుతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఇలాంటివారికి గుడ్డిగా ఎవరూ మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్ కోరింది. ఫహల్గామ్ దాడి తర్వాత వెంటనే ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను భారత్‌లో బ్యాన్ చేశారు. ఆపై పాక్ యూట్యూబ్, ఓటీటీ సంస్థల కంటెంట్‌ను ఇండియాలో స్ట్రీమింగ్ కాకుండా పూర్తిగా బ్యాన్ చేశారు. You working in Indian films was also 'shameful' for us.#OperationSindoor #IndianArmy #IndianAirForce pic.twitter.com/B7CeuQcb2t— Rupali Ganguly (@TheRupali) May 7, 2025 -
2-3 రోజులు ఏటీఎం సర్వీసులు రద్దు..?
టెక్నాలజీ, సామాజిక మాధ్యమాల వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ వ్యాప్తి కూడా అధికమవుతుంది. భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలోని ఏటీఎంలపై రాన్సమ్వేర్ దాడి కారణంగా మూడు రోజులపాటు సర్వీసులు పని చేయవన్నట్లు ఫేక్ వార్తలొస్తున్నాయి. వచ్చే వారం మే 12 సోమవారం వరకు ఏటీఎం సర్వీసులు నిలిపేస్తున్నారని అందులో ఉంది. అయితే ఈ రాన్సమ్వేర్ దాడులు కేవలం భారత్‌ను మాత్రమే కాకుండా 74 ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అబద్ధపు వార్తలు వైరల్ అవుతున్నాయి.ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తలను కోట్ చేస్తూ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను గుడ్డిగా నమ్మకూడదని తెలిపింది. దేశంలోని ఏటీఎంలపై ఎలాంటి సైబర్ దాడులు జరగలేదని తెలిపింది. గతంలోలాగే యథావిధిగా ఏటీఎం సర్వీసులు కొనసాగుతాయని పేర్కొంది. ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?Are ATMs closed⁉️A viral #WhatsApp message claims ATMs will be closed for 2–3 days.🛑 This Message is FAKE✅ ATMs will continue to operate as usual❌ Don't share unverified messages.#IndiaFightsPropaganda pic.twitter.com/BXfzjjFpzD— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025ప్రజలు సాధారణ రోజులతోపాటు ఇలాంటి భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ సమయాల్లో ఫేక్ న్యూస్‌కు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి అంశాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని వార్తలపై ఓ నిర్ణయానికి రావాలని చెబుతున్నారు. -
ఆపరేషన్ సిందూర్ పై కేఏ పాల్ రియాక్షన్
-
ఐపీఎల్ రద్దు
-
తెలుగు జవాన్ వీర మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు. మురళీనాయక్ కుటుంబీకులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు.భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.Deeply pained by the martyrdom of our brave Telugu Jawan, Murali Nayak, from Penukonda, Satyasai district, in the India-Pakistan battlefield in J&K.His supreme sacrifice for the nation will forever inspire us.My heartfelt condolences to his family.We stand with them in this… pic.twitter.com/HfoFixNnZd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 9, 2025దేశ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా.. అధికారిక ప్రకటన
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక, తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ద పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు. ఉద్రిక్తతల కారణంగా పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దునిన్న (మే 8) ధర్మశాల వేదికగా పంజాబ్-ఢిల్లీ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దైంది. షెడ్యూల్ ప్రకారం ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్ అవుట్ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక్ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ ప్రకటించాడు.మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్ ద్వారా పఠాన్‌కోట్ గుండా ఢిల్లీకి తరలించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ స్కోర్ 122/1గా (10.1 ఓవర్లలో) ఉండింది. పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (28 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు.ఏం జరిగిందంటే..?ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కొద్ది రోజుల కామ్‌గా ఉన్న భారత్.. ఈ మంగళవారం అర్దరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరిట సాగిన ఈ ప్రతి దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇందుకు బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. రాకెట్లు, మిసైళ్లతో జనావాసాలను టార్గెట్ చేసింది. పాక్ దుశ్చర్యకు భారత్ సైతం ధీటుగా బదులిస్తోంది. భారత బలగాలు పాక్ మిస్సైల్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. సమాంతరంగా పాక్‌లోని కీలక నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే భారత బలగాలు పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. అయినా పాక్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. కాల్పులకు పాల్పడుతూనే ఉంది. -
భారత్-పాక్ యుద్ధంపై చైనా రియాక్షన్
భారత్-పాక్ యుద్ధంపై చైనా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.పొరుగు దేశాలైన భారత్-పాక్ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ.. శాంతి, స్థిరత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి.. అంతర్జాతీయ సమాజంతో కలిసి.. నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.కాగా, భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు.ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తన విజ్ఞప్తిని మన్నించి దాడులకు తెరదించాలని భారత్, పాక్‌లకు సూచించారు. -
సీఏ (CA) పరీక్షలు వాయిదా
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరగాల్సిన సీఏ (CA) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధికారికంగా ప్రకటించింది. మే 9 నుంచి మే 14 మధ్య జరగాల్సిన మిగిలిన CA ఫైనల్, ఇంటర్మీడియట్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలు వాయిదా పడ్డాయని తెలిపింది. ప్రస్తుతం ఈ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు మరిన్ని పూర్తి వివరాల కోసం ICAI వెబ్సైట్ icai.orgలో ద్వారా తెలుసుకోగలరు. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని పేపర్లను తిరిగి షెడ్యూల్ చేస్తామని ICAI ధృవీకరించింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ఖరారు చేసి విడుదల చేస్తామని ICAI విద్యార్థులకు హామీ ఇచ్చింది. -
ఛండీగఢ్ ఎయిరైడ్ సైరన్ల మోత
-
భారత్ సహనాన్ని పాక్ పరీక్షిస్తోందా! ఆపరేషన్ సిందూర్ 2.0 ఎలా ఉంటుందంటే ?
-
Operation Sindoor 2: పాక్ భవిష్యత్తు తల్చుకుని పార్లమెంట్ లో ఎంపీ కన్నీళ్లు
-
ఆపరేషన్ సిందూర్ 2.0పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్ దుశ్చర్యలకు బదులుగా ఆపరేషన్ సిందూర్ 2.0 పేరిట భారత బలగాలు ఇస్తున్న ధీటైన సమాధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కంటికి కన్ను అనుకుంటూ పోతే ప్రపంచం గుడ్డిదవుతుందని ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డాడు. రాయుడు చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో దుమారం రేపుతుంది. రాయుడును నెటిజన్లు ఆడుకుంటున్నారు.“An eye for an eye makes the whole world blind.”Let’s remember — this isn’t a call for weakness, but a reminder of wisdom.Justice must stand firm, but never lose sight of humanity.We can love our nation fiercely and still hold compassion in our hearts.Patriotism and peace can…— ATR (@RayuduAmbati) May 8, 2025విషయం పూర్తిగా తెలిసే ఇలాంటి కామెంట్లు చేస్తున్నావా అని మండిపడుతున్నారు. ఎవరు మొదలుపెట్టారో తెలిసే వాగుతున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రమూకలపై ప్రతి చర్యకు దిగికపోతే వారు మనల్ని మట్టుబెడతారని అంటున్నారు. పాక్ సానుభూతిపరుడిలా ఉన్నావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. భారత దళాలు పాక్ దుశ్చర్యలను కేవలం తిప్పికొడుతున్నారన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో భారత దళాలకు మద్దతుగా నిలవాలి కాని, శాంతి అంటూ ఉపోద్ఘాతాలు ఇవ్వకూడదని చురకలంటిస్తున్నారు.Prayers for peace and safety in Jammu & Kashmir, Punjab and other parts of India along the border. Hoping for strength, security and swift resolution for everyone affected. Jai Hind!— ATR (@RayuduAmbati) May 8, 2025తన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాయుడు డిఫెన్స్‌లో పడ్డాడు. సదరు ట్వీట్‌ను తొలగించకపోయినా, జనాలను శాంతింప జేసేందుకు మరో రెండు ట్వీట్లు చేశాడు. వీటిలో మొదటి దాంట్లో ఇలా రాసుకొచ్చాడు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ మరియు భారతదేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రత కోసం ప్రార్ధిస్తున్నాను. ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, భద్రత మరియు త్వరిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.In moments like these, we stand united not in fear, but in resolve. I feel immense gratitude to our Indian Army who are the real heroes who carry the weight of a nation with unmatched courage, discipline, and selflessness🙏🏻Your sacrifices don't go unnoticed. Your bravery is what…— ATR (@RayuduAmbati) May 8, 2025రెండో ట్వీట్లో ఇలా రాశాడు. ఇలాంటి క్షణాల్లో మేము భయంతో కాదు, దృఢ సంకల్పంతో ఐక్యంగా ఉన్నాము. అసమాన ధైర్యం, క్రమశిక్షణ మరియు నిస్వార్థతతో దేశ భద్రతను కాపాడుతున్న మన భారత సైన్యానికి అపారమైన కృతజ్ఞతలు. మీ త్యాగాలు గుర్తించబడకుండా ఉండవు. మీ ధైర్యమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంది. మీ ధీరత్వమే మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. మీ బలం ఎల్లప్పుడూ మమ్మల్ని భద్రంగా ఉంచాలి. మీ సేవ మరింత శాంతియుత రేపటికి మార్గం సుగమం చేయాలి. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.రాయుడు ముందు చేసిన ట్వీట్‌కు డ్యామేజ్ కంట్రోల్‌గా ఈ ట్వీట్లు చేసినప్పటికీ జనాల ఆగ్రహం తగ్గలేదు. మొదటి ట్వీట్‌నే ఆసరగా చేసుకుని ఏకి పారేస్తున్నారు. టీమిండియా, ఐపీఎల్, రాజకీయాలతో ముడిపెట్టి తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తాన్ని ఐపీఎల్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేల రాయుడు క్రికెట్ అభిమానులకు మంచి స్టఫ్‌గా మారాడు. -
ఐపీఎల్ కు ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్
-
భారత్-పాక్ యుద్ధం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 211 పాయింట్లు నష్టపోయి 24,063కు చేరింది. సెన్సెక్స్(Sensex) 542 పాయింట్లు దిగజారి 79,805 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.81 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.36 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్డాక్ 1.07 శాతం ఎగబాకింది.ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవడంతో స్టాక్ సూచీలు ఒడిదొడులకు లోనవుతున్నాయి. ఇటీవల భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడులు చేసిన పాక్‌పై ప్రతీకార చర్యగా లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు భారత రక్షణ శాఖ ప్రకటనతో దలాల్ స్ట్రీట్ సెంటిమెంట్ నిన్న ఒక్కసారిగా మారిపోయింది. ట్రేడింగ్ మరో గంటలో ముగుస్తుందనే సమయంలో ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్ షేర్లలో భారీ విక్రయాలు తలెత్తాయి. అమెరికాతో చైనా, తాజాగా బ్రిటన్ వాణిజ్య ఒప్పంద చర్చలు సఫలం అవ్వొచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువపరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హైదరాబాద్ : సైన్యానికి సంఘీభావం..సీఎం రేవంత్ క్యాండిల్ ర్యాలీ (ఫొటోలు)
-
Operation Sindoor 2.0: భారత్ దెబ్బకు పాకిస్తాన్ సూపర్ లీగ్ వేదిక మార్పు
ఆపరేషన్ సిందూర్ 2.0 పేరిట భారత దళాలు పాక్‌పై దాడులు జరుపుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 వేదికను మార్చారు. పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే కొనసాగుతున్న పీఎస్ఎల్ 10వ ఎడిషన్‌ను యూఏఈకి మార్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఈ లీగ్ మరో ఎనిమిది మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. నిన్న (మే 8) భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్ఎల్ వేదికను పాక్ నుంచి యూఏఈకి తరలించారు. పీఎస్ఎల్లో తదుపరి జరగాల్సిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పీఎస్ఎల్ను యూఏఈకి తరలిస్తున్నట్లు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ ప్రకటించాడు.జనావాసాలపై పాక్ దళాల దాడులకు బదులిచ్చే క్రమంలో నిన్న రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత దళాలు డ్రోన్ దాడి చేశాయి. ఈ దాడి తర్వాత కొద్ది గంటల్లోనే పీఎస్ఎల్లో భాగంగా పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది. భారత్ దాడుల తీవ్రతను పెంచిందని గ్రహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించి, అప్పటికప్పుడు ఆ మ్యాచ్‌ను రద్దు చేసింది. తాజాగా లీగ్ మొత్తాన్నే యూఏఈకి తరలిస్తున్నట్లు ప్రకటించింది.కాగా, పీఎస్ఎల్లో దాదాపు 40 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. వారి భద్రత ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. విదేశీ క్రికెటర్ల జాబితాలో కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ లాంటి ప్రముఖులు ఉన్నారు. పాక్ నుండి తమ స్వదేశాలను వెళ్లడం ప్రస్తుతం విదేశీ ఆటగాళ్లకు సవాలుగా మారింది. భారత దాడుల నేపథ్యంలో పాక్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలన్నీ మూతపడ్డాయి. విదేశీ క్రికెటర్లకు ఎక్కడ తల దాచుకోవాలో అర్దం కావడం లేదు. పాక్ ప్రభుత్వం విదేశీ క్రికెటర్ల భద్రతను గాలికొదిలేసింది. పీసీబీ అధికారులు, పీఎస్ఎల్ ఫ్రాంచైజీ యజమానులు చేతులెత్తేశారు. ప్రస్తుతం పాక్‌లో విదేశీ క్రికెటర్లు బిక్కుబిక్కుమంటున్నారు.మరోవైపు పాక్ దాడుల దృష్ట్యా భారత్‌లో ఐపీఎల్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. నిన్న ధర్మశాలలో జరగాల్సిన ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ అర్దంతరంగా రద్దైంది. ధర్మశాలలో బ్లాక్ అవుట్ ప్రకటించడంతో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆర్పేశారు. తొలుత ప్రేక్షకులను బయటకు పంపించిన అధికారులు, ఆతర్వాత పరిస్థితిని వివరించారు. ఐపీఎల్-2025 భవితవ్యంపై ఇవాళ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తొలుత మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఇందులో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.అనంతరం పాక్ దళాల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడటంతో పాటు మిసైళ్లతో దాడికి దిగారు. జనావాసాలపై దాడికి దిగడంతో సహనం కోల్పోయిన భారత్ పాక్‌కు ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ 2.0ను మొదలుపెట్టింది. ఇప్పటికే భారత దళాలు పాక్‌కు తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. రావల్పిండి, ఇస్లామాబాద్, ముల్తాన్, కరాచీ లాంటి నగరాలపై దాడులతో విరుచుకుపడ్డాయి. -
ఢిల్లీలో హై అలర్ట్.. రైళ్లన్నీ నిలిపివేత
ఢిల్లీ: నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గర భద్రతను మరింత పెంచారు. ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలను కూడా బంద్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 90 విమానాలను వివిధ విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలను ఇప్పటికే మూసివేశారు. దీంతో గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు పలు విమానాలు రద్దయ్యాయి. మొత్తం 46 దేశీయ ప్రయాణాలు, 33 రాకపోకలు రద్దయ్యాయి.మరో వైపు, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్‌తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1,070 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల్లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల ముందు క్యూ కట్టారు. పంజాబ్‌లోని సరిహద్దుకు సమీపంలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్‌పూర్, తార్న్ తరన్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు.ఇక అమృత్‌సర్‌లో నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం ఒక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నిత్యావసర వస్తువుల కొరత లేదని, బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించవద్దని, ప్రజలు అనవసరంగా అదనపు వస్తువులను కొనుగోలు చేయవద్దని అధికారులు కోరారు. మరోవైపు పప్పులు, వంటనూనె, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి వస్తువులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అమృత్‌సర్‌లోని కిరాణా దుకాణాలు, డిపార్ట్మెంటల్ స్టోర్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. సరిహద్దు జిల్లాల్లో ఒకటైన గురుదాస్‌పూర్‌లో గురువారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాకవుట్ విధించారు. ప్రజల భద్రత కోసం పోలీసు స్క్వాడ్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలను నియమించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసింది.ప్రజల భద్రత దృష్ట్యా పాక్ సరిహద్దుల్లో రిట్రీట్ వేడుకలను బీఎస్ఎఫ్ నిలిపివేసింది. పంజాబ్‌లోని పాకిస్తాన్ వెంబడి ఉన్న మూడు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రిట్రీట్ వేడుకలను నిర్వహించబోమని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. పాకిస్తాన్ వాఘాకు ఎదురుగా ఉన్న అట్టారీ (అమృత్సర్), ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా, ఫజిల్కా జిల్లాలోని సద్కీ వద్ద ఉన్న జేసీపీల వద్ద పాకిస్తాన్ రేంజర్లతో కలిసి బీఎస్ఎఫ్ దళాలు ప్రతిరోజూ సాయంత్రం రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వమిస్తాయి.ఇక గుజరాత్ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. తీరం వెంబడి ఉన్న రాజ్‌కోట్ రేంజ్‌లోని జామ్‌నగర్, మోర్బి, దేవభూమి, ద్వారకాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు తీరప్రాంత గ్రామాలు, బోట్‌ల్యాండింగ్ పాయింట్లను సందర్శిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను పోలీసులు కోరుతున్నారు. -
'ఆపరేషన్ సిందూర్'పై నోరెత్తని బాలీవుడ్ ప్రముఖులు
పహల్గామ్లో 26 మంది భారతీయులను కాల్చి చంపిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు 'ఆపరేషన్ సిందూర్'ను భారత్ ప్రారంభించింది. పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత్ 100 మందికి పైగానే ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. జమ్మూ ఎయిర్‌పోర్టుతో పాటు జైసల్మేర్ విమానాశ్రయం లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. వాటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. దీంతో మన సైనికులపై చాలామంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ మాతాకీ జై అంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటులు పోస్టులు పెడుతున్నారు. కానీ హిందీ చిత్రపరిశ్రమలో టాప్ హీరోలుగా ఉన్న అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు కనీసం తమ మద్ధతు ఇస్తూ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో వారి అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులకు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా వారికి మనసు రావడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కూడా ఆపరేషన్ సిందూర్‌పై ఎలాంటి పోస్ట్ చేయలేదు. దీంతో ఆయనపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదైన ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి దానిని వెంటనే తమ సోషల్‌మీడియాలో షేర్ చేసి కోట్ల రూపాయాలు సంపాధిస్తారు. అలాంటిది దేశంలో ఇంత జరుగుతున్నా కూడా కనీసం మన ఆర్మీ కోసం మద్ధతుగా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు. దేశ ప్రజల పట్ల, మన ఆర్మీ పట్ల వారికి ఉన్న గౌరవం ఏపాటిదో సులభంగా అర్థం అవుతుంది అంటూ వారు చెప్పుకొస్తున్నారు. -
భారత్ దెబ్బ.. బంకర్ లో దాక్కున్న పాక్ ప్రధాని
-
ఢిల్లీలో హై అలర్ట్.. సెలవులు రద్దు
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. నగరంలో హై అలర్ట్ ప్రకటించి అత్యవసర పరిస్థితులకు సన్నద్ధంలో భాగంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులకు సెలవులు రద్దు చేసింది.ఢిల్లీ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ కనిపించారు. ప్రముఖ సందర్శనా స్థలం ఇండియా గేట్ లోని సి-హెక్సాగాన్ చుట్టూ ఉన్న రహదారిలో జనాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. అయితే, ఈ ప్రాంతంలో సాధారణంగా నిర్వహించే సాధారణ ట్రాఫిక్ నియంత్రణ కసరత్తులో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ అధికారికి సెలవులు మంజూరు చేయరాదని కాంపిటెంట్ అథారిటీ ఆదేశించిందని సర్వీసెస్ డిపార్ట్మెంట్ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల సెలవులను కూడా రద్దు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. -
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కామెంట్స్ వైరల్
-
వైరల్ వీడియో.. ఆపరేషన్ సిందూర్.. ఏడ్చేసిన పాక్ ఎంపీ
ఢిల్లీ: భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్లో సామాన్యులతోపాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్ మేజర్, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.‘భగవంతుడా.. మేమంతా నీముందు మోకరిల్లామ్.. దయచేసి ఈ దేశాన్ని కాపాడు’అని ఇక్బాల్ మొరపెట్టుకున్నాడు. ‘మనదేశం ఇప్పుడు ఎంతో వేదనలో ఉంది. ప్రజాప్రతినిధులంతా ఏకమై, ఈ దేశాన్ని కాపాడాలని భగవంతున్ని ప్రార్థిద్దాం’అని సహచర ఎంపీలకు సూచించారు. అధికార పార్టీ ఎంపీనే ఏడ్చేయటం ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. Pakistani Parliament Member breaks down inside National Assembly of Pakistan after #OperationSindoor impact. Cries for help to Allah. This is Major Tahir Iqbal, former officer of Pakistan Army, now a Pakistani politician. This is the real mood in Pakistan. pic.twitter.com/Xeg7GzxRx4— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 8, 2025 -
భారత్, పాక్ యుద్ధం.. అమెరికా మద్ధతుపై జెడి వాన్స్ క్లారిటీ
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వాన్స్ మాట్లాడుతూ.. నన్ ఆఫ్ అవర్ బిజినెస్ (అది ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు) అని అన్నారు.ఈ రెండు దేశాలను తాము నియంత్రించలేమని జెడి వాన్స్ అన్నారు. ఇరుదేశాలు దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. రెండు అణుశక్తి దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు అందరికీ ఆందోళనకరమేనని అమెరికా ఉపాధ్యక్షుడు అన్నారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గాలని తాము కూడా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. సాధరణ ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా కలుగజేసుకోదని క్లారిటీ ఇచ్చారు. తమ సైన్యం ఎవరికి సాయం చేయదని ప్రకటించారు. ఆపై అటు భారత్‌కు గాని పాకిస్థాన్‌కు గాని యుద్ధం ఆపమని చెప్పలేమన్నారు. అలా అని అణ్వాయుధాల ఉపయోగం ఎట్టిపరిస్థితిల్లోనూ జరగదని ఆయన తేల్చి చెప్పారు. 🚨🇺🇸 ‘NONE OF OUR BUSINESS’: JD Vance on 🇮🇳Indo-🇵🇰Pak escalation pic.twitter.com/EgQuySKbLt— Sputnik India (@Sputnik_India) May 8, 2025 -
సాయుధ దళాల వీరత్వానికి గర్విస్తున్నా: ముఖేష్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలను చూసి గర్విస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ డి అంబానీ పేర్కొన్నారు. భారతదేశం అన్ని రకాల ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిలుస్తుందని ఆయన తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహసోపేతమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో, భారత సాయుధ దళాలు సరిహద్దు అవతలి నుండి వచ్చే ప్రతి రెచ్చగొట్టే చర్యకు కచ్చితత్వం, అసమాన శక్తితో ప్రతిస్పందించాయని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో భాగంగా రిలయన్స్ కుటుంబం ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. -
ఆ 24గంటలు.. ఏం జరిగింది?
-
ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తం
-
పరారీలో పాక్ ప్రధాని?
-
జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు
India-Pakistan War Updates:పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. శుక్రవారం(మే9వ తేదీ) రాత్రి కాగానే పాకిస్తాన్ మళ్లీ భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఓసీలో పాక్ సైన్యం కాల్పులకు దిగడమే కాకుండా, డ్రోన్లను ప్రయోగిస్తూ సరహద్దు ప్రాంతాల్లో దాడులకు దిగింది. వీటిని భారత్ రక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను భారత్ సైన్యం కూల్చివేసింది. దాంతో భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శ్రీనగర్ లో భారీ పేలుడు శబ్దాలుపాక్ దాడులు.. ఇప్పటివరకూ దాయాదికి చెందిన 100 డ్రోన్లను కూల్చివేసిన భారత్‌ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన కీలక సమావేశంసమావేశంలో పాల్గొన్న రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్సమావేశానికి హాజరైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులుతాజా పరిణామాలను మోదీకి వివరించిన త్రివిధ దళాధిపతులు ఢిల్లీ :జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపై డ్రోన్లు,మిస్సైల్స్ తో భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా పాక్ దాడులుపాక్ డ్రోన్లను గగనతలం లో నిలువరిస్తున్న భారత రక్షణ వ్యవస్థకొనసాగుతున్న బ్లాక్ అవుట్సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న భద్రతా బలగాలుఎల్ వో సి వద్ద కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘిస్తూ భారీగా కాల్పులుపాక్ కాల్పులను తిప్పి కొడుతున్న భారత సైన్యంఒమర్ అబ్దుల్లా ట్వీట్కాల్పులకు తెగబడుతున్న పాకిస్తాన్ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలి: ఒమర్ అబ్దుల్లాIt’s my earnest appeal to everyone in & around Jammu please stay off the streets, stay at home or at the nearest place you can comfortably stay at for the next few hours. Ignore rumours, don’t spread unsubstantiated or unverified stories & we will get through this together.— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025 ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశంహాజరైన నేవీ చీఫ్, జాతీయ భద్రతా సలహాదారుసరిహద్దుల్లో తాజా పరిస్థితిపై చర్చ సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్భారత్ - పాక్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతజమ్మూకశ్మీర్‌లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులుసాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్ దాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ కాల్పులుఫిరోజ్పూర్లో పాక్ డ్రోన్లను కూల్చేసిన భారత్జైసల్మీర్, యూరీలో మోగిన సైరన్లు, బ్లాకౌట్ఎల్వోసీలో మళ్లీ పాక్ సైన్యం కాల్పులు యూరీ సెక్టార్ హెవీ షెల్లింగ్‌పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.నేవీ చీఫ్, జాతీయ భద్రతా సహదారు తాజా పరిణామాలను వెల్లడించారు.సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు.విశాఖ:విశాఖలో అప్రమత్తమైన బలగాలుకేంద్ర హోం శాఖ ఆదేశాలతో.. విశాఖ విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత పెంపుప్రతి ఒక్క ప్రయనికుడుని పూర్తిగా తనిఖీ చేస్తున్న CISF సిబ్బందివిమానాశ్రయం ఎంట్రీ లోనే చెకింగ్ చేస్తున్న CISF బలగాలుఆపరేషన్ సిందూర్‌పై విదేశాంగ శాఖ మీడియా సమావేశంగత రాత్రి పాక్.. సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసింది300 నుంచి 400 వరకూ డ్రోన్లను ప్రయోగించిందిఎల్‌ఓసీ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందిజమ్మూ, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ లక్ష్యంగా పాక్ దాడులు చేసిందిజమ్మూలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేశారు34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందిపాక్ దాడులను తిప్పికొట్టాంపౌర విమానాలను టార్గెట్ గా పాక్ దాడులు చేసిందిఆ డ్రోన్లు టర్కీకి చెందినవి తెలుస్తోందిలేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారులేహ్ నుంచి సర్ క్రీక్ వరకూ పాక్ దాడులకు ప్రయత్నించిందిబటిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారుకశ్మీర్‌లోని తంగ్దర్, యూరీలో పాక్ దాడులకు పాల్పడిందిభారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌పై దాడికి యత్నించారుపాక్ ఉపయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవిపాక్ సైన్యం కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు.పాక్ దాడులను భారత వాయుసేన సమర్థవంతంగా అడ్డుకుందికర్తర్‌పూర్ కారిడార్ ను తాత్కాలికంగా మూసివేశాం అమృత్‌సర్‌లో పాక్ బాంబును నిర్వీర్యం చేసిన ఇండియన్ ఆర్మీమక్నా దిండి విలేజ్‌ను టార్గెట్ చేసిన పాకిస్తాన్‌బాంబును నిర్వీర్యం చేసిన భారత సైనికులుసరిహద్దుల్లో పాక్ దాడిని తిప్పికొడుతున్న భారత సైన్యంతిరుమలభారత్- పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో తిరుమలలో భద్రత బలగాలు మాక్ డ్రిల్..తిరుమల ప్రవేశ మార్గంలో ఆక్టోపస్, పోలీస్, విజిలెన్స్, ఇతర బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహణఢిల్లీ:అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ లేఖసివిల్ డిఫెన్స్ రూల్స్ కు సంబంధించి అత్యవసర అధికారాలు ఉపయోగించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశంఅత్యవసర సమయంలో కావలసిన అన్ని వస్తువులను సేకరణకు అనుమతిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్న 1968 సివిల్ డిఫెన్స్ రూల్స్ఢిల్లీ ;ఢిల్లీలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ఐటీఓ వద్ద టెస్ట్ సైరెన్ చేసిన అధికారులువైమానిక దాడి సైరన్లను పరిశీలించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పరవేశ్ వర్మ8 కి.మీ వరకు వినిపించేలా సైరన్ ఏర్పాటుఅమరావతి:ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఏపీ సచివాలయ ఉద్యోగులుఅమరుడైన మురళి నాయక్ అమర్ రహే అంటూ నినాదాలుపాక్‌స్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్‌జమ్మూకశ్మీర్, రాజస్తాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీఢిల్లీ, హరియాణా, హిమాచల్‌లోనూ భద్రత కట్టుదిట్టంపోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేసిన సరిహద్దు రాష్ట్రాలుగుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలుఅవసరమైతే టరిటోరియల్ ఆర్మీని పిలిపించుకునేందుకు అనుమతిఆర్మీ చీఫ్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చిన రక్షణమంత్రి రాజ్ నాథ్‌టెరిటోరియల్ ఆర్మీలో ధోనీ, మోహన్‌లాల్, సచిన్ పైలట్, అనురాగ్ ఠాకూర్ దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంపుభద్రతను రెండోస్థాయికి పెంచుతూ కేంద్రం ఆదేశాలు పోర్టులు, టర్మినళ్లు, నౌకలకు భద్రత పెంచిన కేంద్రంఇస్రో కేంద్రాల దగ్గర హైఅలర్ట్‌ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ భద్రత పెంపుశ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్‌పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది జాతీయ రక్షణ నిధికి తెలంగాణ నేతల విరాళంనెల వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచననెల వేతనం విరాళంగా ప్రకటించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌అప్రమత్తమైన అధికారులుఎయిర్ పోర్ట్ లో తనిఖీలు సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్‌గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సీఎంలతో మాట్లాడిన మోదీసరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలని సూచనప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీఢిల్లీ:అమిత్ షా నివాసంలో హైలెవల్‌మీటింగ్‌హాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దుల్లో పరిస్థితులపై అమిత్ షా రివ్యూ ఢిల్లీ:ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ భేటీపాక్ పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చ బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతపై నిర్మలా సీతారామన్ రివ్యూసైబర్ భద్రత సన్నద్ధతపై సమీక్షించనున్న నిర్మాలా సీతారామన్ పాక్ పార్లమెంట్ లో రక్షణ మంత్రి అసిఫ్ కీలక వ్యాఖ్యలుమన ఎయిర్ డిఫన్స్ వ్యవస్థ విఫలంపాక్ రక్షణ వ్యవస్థను భారత్ తునాతునకలు చేసిందిమన రక్షణ విభాగం పూర్తి విఫలమైందిపాక్ ప్రభుత్వంపై ఎంపీలు విమర్శలుచేతగాని ప్రభుత్వం అంటూ మండిపాటు👉కాసేపట్లో ప్రధాని మోదీతో రాజ్‌నాథ్ భేటీపాక్‌పై దాడి, తదనంతర వ్యూహంపై చర్చఉదయం త్రివిధ దళాధిపతులతో రెండున్నర గంటల పాటు భేటీఅమిత్‌షా అత్యున్నతస్థాయి సమావేశంహాజరైన ధోవల్, ఐబీ చీఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలుసరిహద్దు పరిస్థితులపై అమిత్‌షా సమీక్ష 👉పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్ బెంబేలుమరో పక్క బీఎల్ఏ దాడులతో ఉక్కిరిబిక్కిరితెహ్రిక్‌ఇ-తాలిబన్ దాడుల్లో 20 మంది పాక్ సైనికులు హతం👉జమ్మూకశ్మీర్ లో తెలుగు జవాన్ వీర మరణంభారత్-పాక్ యుద్ధభూమిలో మురళీ నాయక్ మృతిజవాన్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండా గ్రామం 👉ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదాఐపీఎల్ నిరవధిక వాయిదా వేసిన బీసీసీఐభారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం👉జమ్మూ కశ్మీర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యే రైళ్లుపాకిస్థాన్ సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హై అలర్ట్‌ఇండియా గేట్, వార్ మెమోరియల్ వద్ద భద్రత కట్టుదిట్టంసరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సూచనబోర్డర్ వెళ్లిన 10 మంది పంజాబ్ మంత్రులుదేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఆదేశాలు👉జమ్మూలో భద్రతా బలగాల భారీ ఆపరేషన్‌సాంబా సెక్టార్లో ఏడుగురు అనుమానిత ఉగ్రవాదుల హతంచైనా తయారీ పీఎల్-15 మిస్సైల్‌ను కూల్చేసిన భద్రతా బలగాలుపంజాబ్ పంట పొలాల్లో కూలిన పీఎల్-15 మిస్సైల్‌భారత్ భీకర దాడులతో పాక్ కకావికలంకంటోన్మెంట్లను ఖాళీ చేస్తున్న పాక్ ఆర్మీ కుటుంబాలు👉చండీగఢ్‌లో మోగిన సైరన్లుప్రజలు ఇళ్లలోనే ఉండాలిదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఎయిర్ ఫోర్స్👉త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీసరిహద్దులో ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్షప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న రక్షణ మంత్రితదనంతర వ్యూహాలపై చర్చిస్తున్న రాజ్‌నాథ్ సింగ్👉అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటనభారత్ - పాక్ యుద్ధం మధ్యలో మేం జోక్యం చేసుకోంఇది మాకు సంబంధం లేని విషయంఆయుధాలు పక్కన పెట్టమని మేము ఎవరిని కోరంఏదైనా ఉంటే దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు చేస్తాంఈ ఘర్షణలు అణు యుద్ధానికి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాం👉ఢిల్లీలో హైఅలర్ట్.. ఇండియా గేట్ దగ్గర భద్రత పెంపుఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేతఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలు బంద్👉కాసేపట్లో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ సింగ్ భేటీపాకిస్థాన్ దాడులు, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించనున్న రక్షణ మంత్రిజమ్మూ చేరుకున్న సీఎం ఒమర్ అబ్ధుల్లాపరిస్థితిని సమీక్షిస్తున్న ఒమర్ అబ్ధుల్లాహోంమంత్రి అమిత్‌షాతో బీఎస్ఎఫ్ చీఫ్ భేటీ 👉ఆపరేషన్ సిందూర్.. పాక్ దాడులపై ఇండియన్ ఆర్మీ ప్రకటనపాకిస్థాన్ సాయుధ దళాలు నిన్న మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామగ్రితో అనేక దాడులను చేశాయి.జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను పాల్పడ్డాయిడ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయిభారత సైన్యం దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందిదుర్మార్గపు కుట్రలకు దీటుగా స్పందిస్తాం👉పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్ ఆర్మీ దాడిహజారా, క్వెట్టాపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు👉పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభంపాకిస్తాన్ వ్యాప్తంగా పీటీఐ నిరసన ర్యాలీలుప్రధాని షెహబాజ్ అసమర్థ ప్రధాని అంటూ నినాదాలుఇప్పటికే సురక్షిత ప్రాంతానికి పారిపోయిన షెహబాజ్👉ఆపరేషన్ సింధూర్ .3.o పై ఉదయం 10 గంటలకి మీడియా సమావేశంరాత్రి నిర్వహించిన దాడులపై బ్రీఫింగ్కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి, ఆర్మీ ప్రతినిధుల మీడియా బ్రీఫింగ్జమ్ము సరిహద్దు గ్రామాల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటనపాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయిన గాయపడిన కుటుంబాలను పరామర్శించనున్న ఒమర్ 👉నేడు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలుపాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై ప్రధాని మోదీ సమీక్షసరిహద్దులతో పరిస్థితులపై అజిత్ ధోవల్‌తో చర్చసరిహద్దు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీపాకిస్థాన్‌పై కౌంటర్ ఎటాక్ దిగిన భారత్‌లాహోర్, సియాల్కోట్, కరాచీపై భారత్ ప్రతిదాడిజమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌లో హై అలర్ట్‌ఆరేబియా సముద్రంలో భారత నౌకాదళం గర్జనపాక్‌పై గురిపెట్టిన 26 యుద్ధనౌకలుపాక్‌లోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసిన ఇండియన్ నేవీఇప్పటికే కరాచీ సీ పోర్టును ధ్వంసం చేసిన భారత్ నేవీ👉సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్ మొదలుకుని జమ్మూ కశ్మీర్ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి.👉శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది.👉మన ‘ఆకాశ్’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని ఎస్–400 వ్యవస్థ నేలకూలి్చంది. వాటిలో రెండు జేఎఫ్–17, ఒక ఎఫ్–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది.👉ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావలి్పండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్ తదితర నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను తుత్తునియలు చేసింది. పాక్ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచి్చతత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.👉సరిహద్దు భద్రతా చీఫ్‌లతో అమిత్ షా భేటీ ఇరువైపులా పరస్పర దాడుల వేళ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సహా వేర్వేరు సరిహద్దు భద్రతా చీఫ్‌లతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. గురువారం రాత్రి ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) బలగాల అధినేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంట తాజా పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు.దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాల వద్ద భద్రతా పరిస్థితులపై సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) చీఫ్‌తో అమిత్ షా చర్చించారు. ఇండో–పాక్ సరిహద్దుసహా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట భద్రతను బీఎస్ఎఫ్ బలగాలు చూసుకుంటున్నాయి. ఇక చైనాతో సరిహద్దు వెంట పహారా బాధ్యతలను ఐటీబీపీ, నేపాల్, భూటాన్లతో సరిహద్దు భద్రతను సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) బలగాలు పర్యవేక్షిస్తున్న విషయం విదితమే. -
తోక జాడించిన పాక్.. తాట తీసిన భారత్
-
రంగంలోకి INS విక్రాంత్.. కరాచీ పోర్ట్ ఖతం
-
‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం క్యూ!
ముంబై: ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే.. ఆ పేరు కోసం బాలీవుడ్ దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’, ‘మిషన్ సిందూర్’, ‘సిందూర్ : ది రివెంజ్’అంటూ ఆపరేషన్ కోడ్‌నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆపరేషన్ తరువాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్‌టీపీసీ), వెస్ట్రన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ‘ఇది భారతదేశం గరి్వంచదగ్గ విషయం. అందుకే ఈ కథను సినిమా తీయాలని చాలామంది అనుకుంటున్నారు’ అని ఐఎంపీపీఏ కార్యదర్శి అనిల్ నగ్రాత్ తెలిపారు. ఒక వ్యక్తి ఎన్ని టైటిల్స్కైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే మొదట దరఖాస్తు చేసుకున్న వ్యక్తికే టైటిల్ కేటాయిస్తామని తెలిపారు. గతంలో కార్గిల్, ఉరీ, కుంభమేళాలకు కూడా ఇలాగే టైటిల్ అప్లికేషన్లు అధికంగా వచ్చాయి. టైటిల్ నమోదుకు దరఖాస్తు రుసుము రూ.300 ప్లస్ జీఎస్టీ, అత్యవసర ప్రాతిపదికన అయితే రూ.3,000 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. ఒక్కసారి టైటిల్ వచి్చన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు. ఈ పేరుతో ట్రేడ్‌మార్క్ రిజి్రస్టేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్‌మార్క్‌ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది. -
పిల్లలకు సిందూర్ పేరు
కతిహార్: పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి నివాళిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను యావత్ భారతం స్వాగతించింది. అయితే.. ఆ పేరుపై ట్రేడ్‌మార్క్ కోసం వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటే.. ప్రజలు మాత్రం ఆ ఆపరేషన్‌ను మరింత గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. పాక్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపిన బుధవారం రోజే పుట్టిన తమ బిడ్డలకు ఆపరేషన్ పేరు పెట్టుకుంటున్నారు. అమ్మాయిలయితే సిందూరి అని, అబ్బాయికయితే సిందూర్ అని పేరు పెట్టుకుంటున్నారు. బిహార్‌లో ఉన్న కతిహార్ జిల్లాలోని ఓ చిన్న ఆసుపత్రిలో కుందన్ కుమార్ మండల్ తన కూతురుకు సిందూరి పేరు పెట్టాడు. భారత సాయుధ దళాల ఆపరేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన కుందన్.. ఆ పేరు తన కూతురుకు పెట్టుకోవడం గర్వంగా ఉందన్నారు. ఒక్క కుందన్మాత్రమే కాదు.. ఆ పేరు పెట్టినందుకు కుటుంబమంతా సంతోషంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ పేరును ఆమోదించారు. పెరిగి పెద్దయ్యాక అమ్మాయి తన పేరు వెనుక ఉన్న ప్రాముఖ్యతను, చరిత్రను తెలుసుకుంటుందని కుటుంబం ఆశిస్తోంది. ఒక్క కుందన్ మాత్రమే కాదు.. బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో 12 మంది ఈ పేరు పెట్టుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’జరిపిన రోజు పుట్టిన 12 మంది పిల్లలకు ముజఫర్‌పూర్‌లో ఈ పేరే పెట్టుకున్నారు. రెండు ఆనందాలు కలిసి వచ్చాయని సంబరపడిపోతున్నారు. పెద్దయ్యాక తమ పిల్లలను సైన్యంలో చేరి్పస్తామని అంటున్నారు. కన్హారా నివాసి హిమాన్షు రాజ్ కూడా తన కూతురికి ‘సిందూరి’అని నామకరణం చేశాడు. ‘సిందూరి’పేరు కుటుంబానికి గర్వకారణంగా మారింది. జాఫర్పూర్కు చెందిన పవన్ సోనీతన కొడుకుకి సిందూర్ అని పేరు పెట్టాడు. ‘సిందూర్’కేవలం పేరు కాదు.. అదొక గర్వమని చెబుతున్నారు. -
బెంగళూరులో సిద్ధమైన ఆర్మీ డ్రోన్లు!
సాక్షి, బెంగళూరు: భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’లో ఉపయోగించిన ఆత్మాహుతి డ్రోన్లను బెంగళూరులో తయారు చేశారు. స్వయం చాలితమైన ఈ డ్రోన్లు పాక్ ఆక్రమిత కశీ్మర్, పాకిస్తాన్లలోని 9 ఉగ్రవాద స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో నేలమట్టం చేశాయి. బాలాకోట్ దాడి తర్వాత వీటిని ఆర్మీలో చేర్చారు. పశి్చమ బెంగాల్‌కు చెందిన ఆల్ఫా డిజైన్, ఇజ్రాయెల్ ఎల్బిట్ సెక్యురిటీ సిస్టమ్స్ సంయుక్తంగా ఈ డ్రోన్లను తయారు చేసినట్లు తెలిసింది. ఈ కంపెనీల ప్రధాన కార్యాలయాలు బెంగళూరులోనే ఉండడం గమనార్హం. భారత ఆర్మీ ప్రత్యేకంగా 100 డ్రోన్ల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. ఎలాంటి శబ్దం లేకుండా, తక్కువ ఎత్తులో ఎగురుతూ 5–10 కిలోల బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల ఈ డ్రోన్లకు 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల సత్తా ఉంది. -
సరిహద్దు జిల్లాల్లో 'హై అలర్ట్'
చండీగఢ్/అహ్మదాబాద్: భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్‌తో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1,070 కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల్లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల ముందు క్యూ కట్టారు. పంజాబ్‌లోని సరిహద్దుకు సమీపంలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆరు సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్‌పూర్, తార్న్ తరన్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు. ఇక అమృత్‌సర్‌లో నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి జిల్లా యంత్రాంగం ఒక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాలో నిత్యావసర వస్తువుల కొరత లేదని, బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్సహించవద్దని, ప్రజలు అనవసరంగా అదనపు వస్తువులను కొనుగోలు చేయవద్దని అధికారులు కోరారు. మరోవైపు పప్పులు, వంటనూనె, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి వస్తువులను పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అమృత్‌సర్‌లోని కిరాణా దుకాణాలు, డిపార్ట్మెంటల్ స్టోర్ల వద్ద ప్రజలు క్యూ కట్టారు. సరిహద్దు జిల్లాల్లో ఒకటైన గురుదాస్‌పూర్‌లో గురువారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాకవుట్ విధించారు. ప్రజల భద్రత కోసం పోలీసు స్క్వాడ్లు, క్విక్ రెస్పాన్స్ బృందాలను నియమించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసింది. రిట్రీట్ నిలిపివేత.. ప్రజల భద్రత దృష్ట్యా పాక్ సరిహద్దుల్లో రిట్రీట్ వేడుకలను బీఎస్ఎఫ్ నిలిపివేసింది. పంజాబ్‌లోని పాకిస్తాన్ వెంబడి ఉన్న మూడు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రిట్రీట్ వేడుకలను నిర్వహించబోమని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. పాకిస్తాన్ వాఘాకు ఎదురుగా ఉన్న అట్టారీ (అమృత్సర్), ఫిరోజ్‌పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా, ఫజిల్కా జిల్లాలోని సద్కీ వద్ద ఉన్న జేసీపీల వద్ద పాకిస్తాన్ రేంజర్లతో కలిసి బీఎస్ఎఫ్ దళాలు ప్రతిరోజూ సాయంత్రం రిట్రీట్ కార్యక్రమాన్ని నిర్వమిస్తాయి. తీరప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత.. ఇక గుజరాత్ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసింది. పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేసింది. తీరం వెంబడి ఉన్న రాజ్‌కోట్ రేంజ్‌లోని జామ్‌నగర్, మోర్బి, దేవభూమి, ద్వారకాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. పోలీసులు తీరప్రాంత గ్రామాలు, బోట్‌ల్యాండింగ్ పాయింట్లను సందర్శిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులను పోలీసులు కోరుతున్నారు. -
ఉగ్రవాదులకు అధికారిక అంత్యక్రియలా?
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్ సిందూర్‌పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాక్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు. ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు. ‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్‌తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచీ అబద్ధాలే ∙ పాకిస్తాన్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ ధ్వజం న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాదుల శిబిరా లు, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తేల్చిచెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా ముష్కర మూకలకు పాకిస్తాన్ నిస్సిగ్గుగా మద్దతిస్తోందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు. పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్టు క్యాంపులపై జరిగిన దాడికి మతం రంగు పులుముతోందని పాక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పుట్టినప్పటి నుంచి పాకిస్తాన్ అబద్ధాలే చెబుతోందని విమర్శించారు. 1947 నుంచి పాకిస్తాన్ అబద్ధాలు వినడం అందరికీ అలవాటైపోయిందని అన్నారు. విక్రం మిస్రీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడా రు. పాకిస్తాన్ తీరుపై విరుచుకుపడ్డారు. ‘‘1947లో పాకిస్తాన్ సైన్యం జమ్మూకశ్మీర్‌పై దాడికి దిగింది. కానీ, ఆ దాడితో సంబంధం లేదంటూ ఐక్యరాజ్యసమితికి అబద్ధాలు చె ప్పింది. కేవలం గిజరినులే జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డారని నమ్మబలికింది. భారత సైన్యం, ఐరాస బృందం అక్కడికి చేరుకుంటే అసలు సంగతి తెలిసింది. చివరకు చేసేది లేక తమ సైన్యమే జమ్మూకశ్మీర్‌పై దాడి చేసినట్లు పాకిస్తాన్ అంగీకరించింది. పాకిస్తాన్ అబద్ధాల ప్రయాణం 75 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి ఇది మాకు ఆశ్చర్యం కలిగించడం లేదు. పహల్గాంపై పాక్ అలాంటి అబద్ధాలే చెబుతోంది. తప్పుడు ప్రచారంతో నమ్మించాలని చూస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. పుట్టుక నుంచే అబద్ధాలు మొదలు పెట్టిన పాకిస్తాన్‌ను నమ్మాల్సిన అవసరం లేదు. మసీదులపై భారత్ సైన్యం దాడి చేయలేదు భారత్‌కు చెందిన 15 సైనిక స్థావరాలపై దాడిచేసేందుకు పాక్ ప్రయతి్నంచగా భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంది. భారత్‌ను ఎదుర్కొనే సత్తా లేని పాకిస్తాన్ మత ఉద్రిక్తతలు సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. ప్రజలను రెచ్చగొట్టడానికి మతంకార్డు వాడుతోంది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో సిక్కు మతస్తులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులు చేసింది. గురుద్వారాతోపాటు సిక్కు ఇళ్లపై దాడికి దిగింది. ఈ దాడుల్లో 16 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మసీదులపై భారత సైన్యం దాడి చేసిందంటూ పాక్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఉగ్రవాదుల క్యాంపులే ఇండియన్ ఆర్మీ లక్ష్యం. నిజానికి ఉగ్రవాదులకు మసీదుల్లో ఆశ్రయం కలి్పంచింది పాకిస్తానే. మసీదులను రక్షణగా వాడుకోవడం నిజం కాదా? ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడం దారుణం. పహల్గాంలో పర్యాటకుల మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భారత్‌లో పాక్ ఆటలు సాగవు. ఇక్కడ మతం పేరిట రెచ్చగొట్టాలని చూస్తే ఎవరూ రెచ్చిపోరు. పహల్గాంలో ఉగ్రదాడిని మతాలకు అతీతంగా భారతీయులంతా ఖండించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం–జీలం ప్రాజెక్టును ఇండియా టార్గెట్ చేసిందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. ఈ సాకుతో ఇండియాలోని మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే జరగబోయే పరిణామాలకు పాకిస్తానే బాధ్యత వహించాలి’’అని విక్రం మిస్రీ స్పష్టంచేశారు. -
మా సహనాన్ని పరీక్షించొద్దు
న్యూఢిల్లీ: భారత్ సహనాన్ని పరీక్షించవద్దని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. రెచ్చగొడితే తగు రీతిలో సమాధానం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు బదులుగా భారత్‌లోని 15 సైనిక లక్ష్యాలపై పాక్ దాడికి యత్నించడం బదులుగా గురువారం పాక్ వ్యాప్తంగా ఉన్న మిలటరీ రాడార్లతోపాటు లాహోర్‌లోని రాడార్ వ్యవస్థను భారత వైమానిక దళం ధ్వంసం చేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ పైవిధంగా స్పందించారు. నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ..‘మనం ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా, ఎంతో సంయమనంతో వ్యవహరిస్తూ వచ్చాం. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలనే నమ్ముతున్నాం. దీనిని అలుసుగా తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం దీటుగా బదులిస్తాం’అని ఆయన స్పష్టం చేశారు. పాక్‌తోపాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా చేసిన వీర సైనికులను ఆయన అభినందించారు. దాడుల సమయంలో సామాన్యులకు హాని వాటిల్లకుండా అనితర సాధ్యమైన కచ్చితత్వంతో దాడులు జరిపామన్నారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించుకునే విషయంలో ఏ శక్తీ ఆపజాలదన్నారు. పాక్, పీవోకేల్లోని ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడుల్లో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారని వెల్లడించారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య స్పష్టమైన సమాచార వ్యవస్థ, సంసిద్ధత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. జాతీయ భద్రత పట్ల ప్రభుత్వం పూర్తి అంకితభావంతో ఉందని పునరుద్ఘాటించారు. గురువారం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు, రక్షణ, హోం, విదేశాంగ వ్యవహారాలు, సమాచార, విద్యుత్, ఆరోగ్యం, టెలికమ్యూనికేషన్స్ వంటి కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. జాతీయ భద్రత, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను ప్రధాని మోదీ సమీక్షించారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల సన్నాహాలు, ప్రణాళికలను ఆరా తీశారు. కార్యదర్శులు తమ మంత్రిత్వ శాఖల కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని పేర్కొన్నారు. అత్యవసర ప్రతిస్పందన, కమ్యూనికేషన్ ప్రొటోకాల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పౌర రక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతోపాటు తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తిని సమర్థంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రాల అధికారులతో పాటు క్షేత్రస్ధాయి సంస్థలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా తగిన రీతిలో ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు కార్యదర్శులు చెప్పారు. -
పూర్తిస్థాయి యుద్ధమే వస్తే...
పాకిస్తాన్ దుశ్చర్యల కారణంగా ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ అనివార్యంగా చేపట్టింది. అయితే దీనికి ప్రతి చర్యగా పాకిస్తాన్ ఉత్తర, పశ్చిమ భారత్‌లలోని 15 లక్ష్యా లపై దాడికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను దీటుగా ఎదుర్కొని పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చివేసింది. అలాగే పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ లక్ష్యంగా చేసుకోవడంతో లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నిర్వీర్యమయ్యింది. భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంచేసుకుని ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. కానీ పాక్... తన పౌరులపై దాడి చేసినట్లు దుష్ప్రచారం మొదలు పెట్టింది. నిజానికి పాకిస్తానే సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపి 16 మంది భారత పౌరులను పొట్టన పెట్టుకుందని విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రకటించడం గమనార్హం.పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో సహా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారత్ దాడి చేయడంతో ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ విచ్చ లవిడిగా కాల్పులు ప్రారంభించింది. ఈ దాడిలో అమాయకులైన సరిహద్దు గ్రామాల ప్రజలు చని పోతున్నారు, గాయపడుతున్నారు. శ్రీనగర్, జమ్మూల లెఫ్టినెంట్ గవర్నర్లు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి పాకిస్తాన్ దుశ్చర్యలు దానికి మరిన్ని కష్టాలు తీసుకువస్తాయి తప్ప పరిస్థితి సద్దు మణిగే అవకాశం లేదు. ఈ దాడుల్లో జైష్ ఏ మహ మ్మద్‌కు చెందిన మౌలానా మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చనిపోవడంతో అతడు ఆగ్రహావేశాలతో రగిలిపోతూ మన ప్రధానికి ఒక హెచ్చరిక లేఖను పంపాడు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ తిరిగి తన పరువును నిలబెట్టుకోవడం కోసం మూడు స్థాయి లలో భారత్‌పై దాడి చేస్తోంది. ఇవి: ఒకటి, భారత సరి హద్దు ప్రాంతాల్లో తీవ్ర చర్యలు చేపట్టడం, రెండు, భారత్‌పై ఆక్రమణ చర్యలకు పూనుకోవడం, మూడు, ప్రతీకారంతో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడం.గతంలో ఈ ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడానికి మాత్రమే మనం వ్యూహాన్ని రచించేవాళ్ళం. అయితే గత కొన్ని దశాబ్దాలుగా మన వ్యూహం కూడా మారింది. రాజ్యాంగ అధికరణ 370ను రద్దు చేయడంతో కశ్మీర్లో 90 శాతం తీవ్రవాదం తగ్గిపోయింది. అక్కడ సాధారణ జనజీవన స్రవంతి నెలకొంది. దీనిని ఈర్ష్యతో, పగతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. అందుకే కొత్తగా ఉగ్రదాడులకు తెరలేపింది. ఈసారి జరిగిన దాడులకు ఇజ్రాయెల్ తరహాలో భారత్ ప్రతిస్పందించింది. భారత్ తన యుద్ధతంత్రం మార్చి దౌత్యపరంగా, ఆర్థికంగా, సాంకేతికంగా, మానసికంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ సమాజంలో పాక్‌ను ఒక ఉగ్రవాద దేశంగా నిరూపించడంలో కొంత విజయం సాధించగలిగింది. 53 దేశాలు భారత్‌కి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు తెలియజేయడం విశేషం. అమెరికా పాత్ర పాకిస్తాన్, భారత్‌ల విషయంలో గోడ మీద పిల్లిలా కనిపిస్తోంది. ఇదే మంచి అవకాశంఈ సమయంలో పాకిస్తాన్ ఏ ఒక్క చిన్న పొర పాటు చేసినా అది పూర్తిస్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఉగ్రవాద స్థావరాలకు నెలవుగా మారిన పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అవుతుంది. అయితే యుద్ధం తలెత్తితే చైనా కచ్చితంగా పాకిస్తాన్‌కు సహాయం చేస్తుంది. కారణం భారత్‌ను చైనా చిరకాల శత్రువుగా భావించడం. అలాగే బంగ్లా దేశ్‌ను మతం పేరుతో పాక్ దగ్గర తీసుకునే అవకాశం లేకపోలేదు. అంటే యుద్ధం వస్తే భారత్ మూడు వైపుల నుంచి ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. కేవలం పంజాబ్, రాజస్థాన్, కశ్మీర్, గుజరాత్ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు కూడా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారమైన ‘చికెన్ నెక్’ లేదా సిల్గురి కారిడార్‌పై చైనా ఎప్పటి నుంచో కన్ను వేసిన విషయం గుర్తుంచుకోవాలి. భారత్‌పై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పాక్ పదేపదే హెచ్చరిస్తోంది. ఇదే జరిగితే భారత్‌కు ఎక్కువ నష్టం కలగకపోవచ్చు కానీ పాకిస్తాన్ ‘మరుసటి రోజు సూర్యోదయం చూడదు’ అనే మాట అతిశయోక్తి కాదు. మనం అణ్వాయుధాల విషయంలో ‘మొదట మేం ప్రయోగించం’ అని చెప్పాము గాని ‘ఇతర దేశాలు ప్రయోగించినా మేం ప్రయోగించం’ అని ఎప్పుడూ చెప్పలేదు. ప్రపంచంలో నాలుగవ రక్షణ శక్తిగా ఉన్న భారతదేశం అన్ని రకాలుగానూ పాకి స్తాన్‌ను ఎదుర్కోగలుగుతుంది. పౌరులు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించి, అనుమానాస్పదమైన సంఘటనలను ప్రభుత్వ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తెలియచేయాలి. అవసరమైతే కదనరంగంలో కాలు పెట్టాలి. అప్పుడే ఉగ్రవాదంపై చేస్తున్న పోరులో విజయం సాధించ గలుగుతాం.మేజర్ (రిటైర్డ్) శ్రీనివాస్ వ్యాసకర్త అంతర్జాతీయ వ్యవహారాలు, రక్షణ రంగ నిపుణులు -
Rajnath Singh: ‘ఆపరేషన్ సిందూర్’ ఆగలేదు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు హతమయ్యారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్ ఆగిపోలేదని, ఇంకా కొనసాగుతూనే ఉందని వెల్లడించారు. భారత్ ఘర్షణలు కోరుకోవడం లేదని, పాకిస్తాన్ దాడి చేస్తే మాత్రం గట్టిగా బుద్ధిచెప్పడం ఖాయమని అన్నారు. రెచ్చగొడితే ఎదురుదాడి చేయక తప్పదని తేల్చిచెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్యకు పారీ్టలకు అతీతంగా వారంతా మద్దతు పలికారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, మనమంతా ఐక్యంగా ఉండాలని నిర్ణయానికొచ్చారు. భారత సైనిక దళాల పరాక్రమాన్ని ప్రశంసించారు. అన్ని పారీ్టల నాయకులు ఏకగ్రీవంగా అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. విపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటిదాకా అనుకున్న లక్ష్యాలు సాధించినట్లు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల భద్రత కోసం చేపట్టిన చర్యలను అఖిలపక్ష భేటీలో రాజ్‌నాథ్ వెల్లడించారు. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, జేడీ(యూ), ఎంఐఎం, సీపీఎం తదితర నేతలు ప్రకటించారు. లష్కరే తోయిబా ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) అరాచకాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవెసీ సూచించారు. టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి విజ్ఞప్తి చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుండడం పట్ల ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో మత సామరస్యం కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని విపక్ష నేతలు పిలుపునిచ్చారు. భారత వైమానికి దళానికి చెందిన ఐదు యుద్ధ విమానాలు కూల్చివేసినట్లు పాకిస్తాన్ చెబుతోందని, ఈ తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని పలువురు నాయకులు కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని, దేశమంతా ఐక్యంగా ఉందన్న సందేశాన్ని ప్రపంచానికి అందించాలని సూచించారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాకపోవడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తంచేశారు. -
Operation Sindoor: 15 భారత సైనిక స్థావరాలపై గురి
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోబోయి పాక్ బొక్కబోర్లా పడింది. భారత్‌లోని 15 సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఉదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్లాయ్, భుజ్ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. అందుకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను తుత్తునియలు చేసింది. గురువారం మధ్యాహ్నం పాక్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, రావల్పిండిలపై విరుచుకుపడింది. లాహోర్‌లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన హెచ్‌క్యూ–9 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను హర్పీ కామికాజ్ డ్రోన్లతో నేలకూల్చింది. ఈ దాడులను పాక్ కూడా ధ్రువీకరించింది. ‘‘లాహోర్ సమీపంలో ఒక డ్రోన్ నేలకూలింది. గుర్జన్‌వాలా, చాక్వాల్, బహవల్పూర్, మియానో, కరాచీ, ఛోర్, రావల్పిండి, అతోక్ ప్రాంతాల్లో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయి’’ అని అంగీకరించింది. లాహోర్‌లో నలుగురు సైనికులు గాయపడ్డారని, ఒక పౌరుడు మరణించాడని చెప్పింది. ‘‘పాక్ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. ఎస్–400తో పాటు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్‌తో పాక్ క్షిపణులు, డ్రోన్లను కూల్చేశాం’’ అని సైన్యం ప్రకటించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను నాశనం చేసినట్లు కేంద్రం పేర్కొంది. యుద్ధ వాతావరణం భారత దాడులతో లాహోర్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. వాల్టన్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగడంతో జనం భయభ్రాంతులయ్యారని తెలిపింది. గాల్లో దట్టమైన పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. యుద్ధ భయంతో పాక్‌లో సియాల్కోట్, కరాచీ, లాహోర్ సహా పలు ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. పాక్ నగరాల్లోని తమ పౌరులు తక్షణం దేశం వీడాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలాలని అమెరికా సూచించింది. పీఎంఓ భేటీ జరుగుతుండగానే! ఇస్లామాబాద్‌పై భారత్ దాడుల సమయంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లతో నగరమంతా దద్దరిల్లిపోయింది. దాంతో సమీక్షను అర్ధంతరంగా నిలిపేసి ప్రధాని బృందం సురక్షిత ప్రాంతానికి తరలినట్టు సమాచారం. కాసేపటికే షహబాజ్ నివాస పరిసరాలు నేలమట్టం కావడంతో ఆయనను హుటాహుటిన పాతిక కి.మీ. దూరంలోని బంకర్లోకి తరలించినట్టు చెబుతున్నారు. -
Operation Sindoor: సుదర్శన చక్రమే రక్ష
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముష్కరమూకల శిబిరాలు, స్థావరాలను భారత సాయుధబలగాలు నేలమట్టం చేయడంతో వెర్రెక్కిపోయి పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను మన గగనతల రక్షణ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంది. రక్షణ చట్రంగా యావత్ భారతగగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేసింది. పాక్ మిస్సైళ్లను క్షణాల్లో పేల్చేసి దాని వైమానిక బలగాలను అయోమయానికి గురిచేసిన ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ గురించే ఇప్పుడు అంతటా చర్చ మొదలైంది. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవ రహిత విమానాలను కూల్చేసే వ్యవస్థగా ప్రపంచంలోనే గొప్ప ఆయుధ వ్యవస్థగా పేరొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసిన సమస్టి ఆయుధ వ్యవస్థ ఇది. శత్రు క్షిపణులు కనీసం నేలనైనా తాకకుండా మార్గమధ్యంలోనే ముక్కలుచెక్కలు చేసేస్తున్న ఈ సుదర్శన చక్ర విశేషాలు ఓసారి చూద్దాం... ఏమిటీ చక్ర? రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్‌కు భారత బలగాలు ‘సుదర్శన చక్ర’ అని నామకరణం చేశాయి. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్రం మహాశక్తివంతం. ఒకసారి ప్రయోగిస్తే శత్రుసంహారం జరగాల్సిందే. సుదర్శన చక్రం అమేయ శక్తికి, విజయానికి, అసాధారణ వేగానికి, శత్రు వినాశకానికి మారుపేరు. అందుకే ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థకు ఈ పేరు పెట్టారు. శత్రుసైన్యం నుంచి దూసుకొస్తున్న క్షిపణులను ‘సుదర్శన చక్ర’లోని క్షిపణులు విజయవంతంగా అడ్డుకుంటాయి. మార్గమధ్యంలోనే పేల్చేస్తాయి. ఒకేసారి వేర్వేరు ప్రాంతాలపై రక్షణచట్రంగా నిఘా పెట్టడం ‘సుదర్శన చక్ర’ ప్రత్యేకత. వాయుసేనతో అనుసంధానం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వారి కమాండ్ అండ్ కంట్రోల్ నెట్‌వర్క్‌తో ఈ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఒక చోట నిలిపి ఉంచిన ఈ వ్యవస్థలో రెండు ఆయుధసహిత వాహనాలు(బ్యాటరీలు) ఉంటాయి. ఒక్కో దాంట్లో ఆరు లాంఛర్లు ఉంటాయి. వీటితోపాటు అధునాతన రాడార్ వ్యవస్థ, కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఒక్కో వాహనం నుంచి గరిష్టంగా 128 క్షిపణులను ప్రయోగించవచ్చు. ఇలాంటి పెద్ద వ్యవస్థలను ఐదింటిని ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేసి సరిహద్దుల వెంట అత్యంత వ్యూహాత్మక ప్రదేశాల్లో భారత్ సంస్ధించేసింది. ఈ వ్యవస్థలే బుధవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన పలు రకాల క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చాయి. సుదర్శన చక్ర లాంఛర్ వాహనాలను ఎప్పటికప్పుడు అవసరమైన చోటుకు సులభంగా తరలించవచ్చు. వీటి జాడను శత్రు దేశాల రాడార్లు అస్సలు కనిపెట్టలేవు. అన్ని రకాలుగా రక్షణ శత్రు దేశాల స్టెల్త్ విమానాలు, యుద్ధ విమానాలు, ఆత్మాహుతి డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణుల రాకను గగనతలంలో ఉండగానే ఈ సుదర్శన చక్ర వ్యవస్థ పసిగడుతుంది. ఆ క్షిపణులు, డ్రోన్లు ఏ మార్గంలో వస్తున్నాయి? ఎంత వేగంతో వస్తున్నాయి? ఒకేసారి ఎన్ని వస్తున్నాయి? ఏఏ ప్రాంతాలపై పడొచ్చు? అనే వివరాలను కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఇవి అత్యంత ఖచ్చితత్వంతో అంచనావేయగలవు. వెంటనే వాయుసేన అధికారులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా లాంఛర్ల నుంచి క్షిపణులను ఈ వ్యవస్థ ప్రయోగిస్తుంది. ఈ క్షిపణులు శత్రు ఆయుధాలను గాల్లోనే తుత్తునియలు చేస్తాయి. ఒకే దిశ నుంచి వచ్చే శత్రు క్షిపణులను మాత్రమే కాదు వేర్వేరు దిశల నుంచి దూసుకొచ్చే క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ ఒకేసారి పసిగట్టి ఒకేసారి వాటిని నిలువరించేందుకు ఎక్కువ సంఖ్యలో క్షిపణులను భిన్న దిశల్లో ప్రయోగించగలదు. ఎక్కడ మోహరించారు? పాక్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఈ ఆయుధ వ్యవస్థను భారత్ మోహరించింది. నాలుగు ‘సుదర్శన చక్ర’ వ్యవస్థలను భారత్ మోహరించింది. వందల కిలోమీటర్ల విస్తీర్ణంపై కేవలం ఒక్క స్వాడ్రాన్ నిఘా పెట్టగలదు. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల గగనతల నిఘాపై ఒకటి, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపై మరోటి మోహరించినట్లు తెలుస్తోంది. చైనా సైతం తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోనూ సుదర్శన చక్రను సిద్ధంగా ఉంచినట్లు రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. ఏకంగా 600 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను ఇది ముందే పసిగట్టగలదు. వెంటనే ప్రయాణం మొదలెట్టి గరిష్టంగా 450 కిలోమీటర్ల దూరంలోనే వాటిని నేలకూల్చగలదు. ఒకేసారి భిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యంత వేగంగా, చాకచక్యంగా పని పూర్తిచేయగలదు. తికమకపెట్టే శత్రుదేశాల ‘ఏమార్చే’ వ్యవస్థలు ఈ సుదర్శన చక్రను మభ్యపెట్టలేవు. గగనతలంపై 360 డిగ్రీల కోణంలో ఇది నిఘా పెట్టగలదు. తన కనుసన్నల్లోకి ఏ చిన్నపాటి వస్తువు ఆకాశంలోకి ప్రవేశించినా దాని పరిమాణం, పథాన్ని పసిగట్టి వెంటనే క్షిపణిని ప్రయోగించి ధ్వంసంచేయగలదు. ప్రపంచంలోని అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఇదీ ఒకటి. సుదూరాలు సురక్షితం జామింగ్ వంటి వ్యతిరేక వ్యూహాలను తట్టుకోగలదు. ఒకేసారి బహళ లక్ష్యాలను ఎంచుకుని పనిచేస్తుంది. అత్యంత సుదూరాలు, సువిశాల ప్రాంతాలకు రక్షణగా నిలుస్తుంది. గగనతల లక్ష్యాలను కేవలం భూతలం మీద నుంచే గురిపెట్టి చేధించగలదు. ముఖ్యంగా దీర్ఘశ్రేణి అస్ట్రాలను నిర్వీర్యంచేయగలదు. రష్యా నుంచి కొనుగోలు తర్వాత వీటి రాకతో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దాయాది దుస్సాహసం.. దీటుగా బదులిచ్చిన భారత్
ఆపరేషన్ సిందూర్‌తో కూడా దాయాది బుద్ధి తెచ్చుకోలేదు. పైపెచ్చు పనిగట్టుకుని యుద్ధ జ్వాలలను రగులుస్తోంది. భారత్‌పై భారీ స్థాయిలో సైనిక దాడులకు తెగించింది. హమాస్ ఉగ్ర సంస్థను తలపిస్తూ పౌర లక్ష్యాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. రాజస్తాన్ నుంచి కశ్మీర్ దాకా సరిహద్దుల వెంబడి దాడులకు పాక్ చేసిన యత్నాలను భారత్ పూర్తిస్థాయిలో తిప్పికొట్టింది. భారీ ప్రతి దాడులతో ముచ్చెమటలు పట్టించింది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, పెషావర్, రావల్పిండిలపై 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు విరుచుకుపడి కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలను తుత్తునియలు చేసింది. దాడుల ధాటికి ప్రధాని షహబాజ్ షరీఫ్ బంకర్లో తలదాచుకున్నారు! కరాచీ నౌకాశ్రయంపై మన నేవీ బాంబుల వర్షం కురిపించింది. పరిస్థితులు ఇరు దేశాల నడుమ పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి... న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్‌ను సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకుని అభాసుపాలైంది. బుధవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచీ భారత్‌పై ఎడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు, డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర, సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నింటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే గాక మూడు పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. ఇద్దరు పాక్ పైలట్లను బందీలుగా పట్టుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు కీలక పాక్ నగరాలపై ఒకే రోజు రెండుసార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలను నేలమట్టం చేసింది. రెండు రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా రెండో పరాభవం రుచిచూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. మరోవైపు నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నౌకాశ్రయంపై ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక బాంబుల వర్షం కురిపించి 10కి పైగా నౌకలను ధ్వంసం చేసినట్టు సమాచారం. 1971 పాక్ యుద్ధం తర్వాత కరాచీ నౌకాశ్రయంపై దాడి ఇదే తొలిసారి. అంతేగాక ఏకంగా 20కి పైగా భారత యుద్ధ నౌకలు పాక్ వైపు కదులుతున్నట్టు చెబుతున్నారు. ఎల్లలు దాటిన ఉద్రిక్తతల నడుమ పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరువైపుల నుంచీ కాల్పుల మోతతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. పౌర లక్ష్యాలపై పాక్ సైన్యం విచక్షణారహిత కాల్పులకు తెగబడుతోంది. అందుకు మన సైన్యం దీటుగా బదులిస్తోంది. ఇరు దేశాల్లోనూ సరిహద్దు రాష్ట్రాలు ఎయిర్ సైరన్లు, బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. పలు విమానాశ్రయాలు మూతబడ్డాయి. ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా భద్రతా బలగాలను కేంద్రం ఆదేశించింది. సైనికులకు సెలవులు రద్దు చేశారు. కీలకమైన సైనిక తదితర మౌలిక వ్యవస్థల వద్ద రక్షణను కట్టుదిట్టం చేశారు. పాక్ అత్యంత అనాగరికంగా వ్యవహరిస్తోందంటూ కేంద్రం మండిపడింది. పౌర ఆవాసాలపై విచక్షణారహితంగా డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగిస్తూ హమాస్ ఉగ్ర సంస్థను తలపిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు దుయ్యబట్టాయి. జమ్మూ, పఠాన్‌కోట్, ఉద్ధంపూర్‌ల్లో పాక్ క్షిపణి, డ్రోన్ దాడి యత్నాలను పూర్తిగా తిప్పికొట్టినట్టు సైన్యం ప్రకటించింది. పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. సంయమనం పాటించాల్సిందిగా ఇరు దేశాలకూ సూచించింది.పేట్రేగిన పాక్ సరిహద్దుల వెంబడి 15 సైనిక స్థావరాలపై దాడి యత్నాలు విఫలం కావడంతో గురువారం పాక్ మరింతగా పేట్రేగిపోయింది. రాత్రివేళ పాక్ ఫైటర్ జెట్లు భారత్‌పై తీవ్రస్థాయిలో దాడులకు తెరతీశాయి. రాజస్తాన్ మొదలుకుని జమ్మూ కశ్మీర్ దాకా సరిహద్దుల పొడవునా పలుచోట్ల సైనిక లక్ష్యాలతో పాటు విచక్షణారహితంగా పౌర ఆవాసాలపైనా గురిపెట్టాయి. శ్రీనగర్, జమ్మూ విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేశాయి. జమ్మూ–శ్రీనగర్ హైవేపై భారీ పేలుడు చోటుచేసుకుంది. రాజౌరీ జిల్లాలో పలుచోట్ల పేలుళ్లు విని్పంచాయి. పాక్ దాడులన్నింటినీ సైన్యం సమర్థంగా అడ్డుకుంది. సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం, సాంబా, ఆర్ఎస్ పుర, అరి్నయా తదితర ప్రాంతాలపైకి కనీసం 8కి పైగా క్షిపణులు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా మధ్యలోని అడ్డుకుని కూల్చేసినట్టు ప్రకటించింది. మన ‘ఆకాశ్’, ఎంఆర్‌ఎస్‌ఏఎంతో పాటు అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎక్కడివక్కడ కూల్చేశాయి. పఠాన్‌కోట్‌లో రెండు, జమ్మూలో ఒక పాక్ యుద్ధ విమానాన్ని ఎస్–400 వ్యవస్థ నేలకూల్చింది. వాటిలో రెండు జేఎఫ్–17, ఒక ఎఫ్–16 ఉన్నాయి. రెండు యుద్ధ విమానాలను నష్టపోయినట్టు పాక్ కూడా అంగీకరించింది. పఠాన్‌కోట్‌లో ఇద్దరు పైలట్లు మన బలగాలకు చిక్కినట్టు సమాచారం. ఆ వెంటనే పాక్‌పై సైన్యం విరుచుకుపడింది. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, కరాచీ, రావల్పిండిలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో రెండోసారి భారీస్థాయిలో దాడులకు దిగింది. లాహోర్ తదితర నగరాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ సమూలంగా నాశనం చేసేసింది. పాక్‌లోని పంజాబ్ ప్రాంతంలో నెలకొన్న కీలక ఎయిర్‌బోర్న్ వారి్నంగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏడబ్ల్యూఏసీఎస్)ను తుత్తునియలు చేసింది. పాక్ నగరాలు బాంబు పేలుళ్లతో దద్దరిల్లినా పౌర ఆవాసాలు, వ్యవస్థలకు నష్టం కలగని రీతిలో సైనిక వ్యవస్థలను మాత్రమే ఎంచుకుని అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్టు సైన్యం పేర్కొంది.పలుచోట్ల బ్లాకౌట్ పాక్ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్సర్, హోషియార్పూర్, మొహాలీ, చండీగఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి. -
ఐపీఎల్ వాయిదా?
ధర్మశాల: ఉగ్రవేటకు తలపెట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఏమాత్రం జీర్ణించుకోలేని పాకిస్తాన్ మిలిటరీ కుటిలబుద్ధితో క్రూరమైన దాడులకు తెగబడుతోంది. సరిహద్దు రాష్ట్రాల పౌరులపై విచక్షణారహితంగా మోర్టార్లు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. దీంతో భారత బలగాలు దీటుగా బదులిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కాస్తా యుద్ధభూమిని తలపించడంతో భారత రక్షణ దళాలు కీలక నగరాల్లో విద్యుత్ సరఫరా (పవర్ బ్లాక్ అవుట్)ను నిలిపివేసింది. ఇంటర్నెట్, మొబైల్ సేవల్ని నిలిపివేసింది. పాక్ ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లను నిర్వీర్యం చేసేందుకు భారత సాయుధ బలగాలు రాత్రంతా శ్రమిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం దేశం కోసం భారత త్రివిధ దళాలు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే స్టేడియాల్లో ఐపీఎల్ వినోదం పట్ల నెట్టింట తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. భారత పౌరులు, ప్రధాన నగరాలే లక్ష్యంగా పాక్ ఆర్మీ విచక్షణా రహితంగా జరిపే దాడుల్ని తిప్పికొడుతున్నప్పటికీ... పొరపాటున ఏ మిసైల్, డ్రోన్ దాడి అయిన స్టేడియంలో పడితే... వేలల్లో ప్రేక్షకులు, పదుల సంఖ్యలోని విదేశీ, భారత క్రికెటర్లకు జరిగే ప్రాణనష్టం ఊహకందదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను రద్దు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వినోదం కంటే కూడా దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమకు ప్రధానమని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అందుబాటులో ఉన్న బీసీసీఐ ఉన్నతాధికారులతో నేడు సమావేశమై ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకుంటారు. శుక్రవారం ఐపీఎల్ రద్దు లేదంటే వాయిదా ప్రకటన వెలువడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నేటి మ్యాచ్ యథాతథం ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తాం. ఇప్పటివరకైతే కేంద్రం నుంచి మాకెలాంటి సూచనలు రాలేదు. ఆటగాళ్ల భద్రత, రవాణా తదితర పరిస్థితుల్ని సమీక్షించాకే తుది నిర్ణయం తీసుకుంటాం. లక్నోలో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే ఉన్నాయి. –ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఐపీఎల్లో నేడులక్నో X బెంగళూరువేదిక: లక్నోరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారత సైన్యం దాడితో భారీ పేలుళ్లు జరిగాయి. దాంతో ఇస్లామాబాద్‌లోని తన నివాసం నుంచి షెహబాజ్ షరీఫ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ డ్రోన్లు, మిస్సైల్లతో దాడికి దిగింది. పాక్ మిస్సైల్లను గాల్లోనే కూల్చి వేసిన భారత సైన్యం. జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై 8 సూసైడ్ డ్రోన్లతో పాక్ దాడి చేయగా వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. జైసల్మేర్, అక్నూర్లో ఇద్దరు పాక్ పైలట్లను పట్టుకున్న భారత ఆర్మీ. మొత్తం 20కి పైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం. లాహోర్ , సియాల్ కోర్టులో కౌంటర్ ఎటాక్‌కు దిగిన భారత్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 14 మంది పాక్ సైనికులు హతమైనట్టు సమాచారం.S-400, L-17 సిస్టమ్‌ను యాక్టివేట్ చేసిన భారత్. జమ్మూ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాక్ దాడులు. ఈ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను హై అలర్ట్ చేసిన భారత్ సైన్యం. వరుస డ్రోన్ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇదిలా ఉండగా అమెరికా, యూకే, యూఏఈలతో టచ్‌లో భారత్. రంగంలోకి SZU-23, శిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తాజా పరినామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. త్రివిధ దళాధిపతులు, CDSతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. రంగంలోకి భారత నౌకాధళం రంగంలోకి దిగిన భారత నౌకాధళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీ పోర్టుపై ప్రతీకార దాడి చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత నుంచి మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. ఈ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు, ఎగిసిపడుతున్న మంటలు. కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్ కార్గో నౌకలను ద్వంసం చేసిన ఇండియన్ నేవీ. ఈ దాడుల్లో అనేక షిప్పులు ధ్వంసం అయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్‌పై గురి పెట్టిన భారత నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ పాక్‌ను వణికిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేతతాజా పరినామాలతో దేశంలో ఢిల్లీ నుంచి జమ్మూ,గుజరాత్, రాజస్థాన్ వెళ్లే రైళ్లన్నీ రద్దు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్తాజా పరినామాలతో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ధ భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. భారీగా NSG కమాండర్ల మోహరింపు.మరోవైపు పాకిస్తాన్‌పై బలూచిస్తాన్ దాడిఓవైపు భారత సైన్యం, ఇండియన్ నేవీ జరుపుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్‌కు మరోవైపు నుంచి బలూచిస్తాన్ దాడికి దిగింది. పాక్ చమురు క్షేత్రాలపనా బలూచిల దాడులు. ఇదిలా ఉండగా పాక్‌పై భారత్ దాడులను బలూచి రేడియో హైలెట్ చేస్తోంది.పాక్ రక్షణ వ్యవస్థల కూల్చివేతపాక్లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్. సర్గోదా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించిన భారత్. భారత్ దాడులతో దిక్కు తోచని పాక్ బలగాలు.15 భారత సైనిక స్థావరాలపై గురిన్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోబోయి పాక్ బొక్కబోర్లా పడింది. భారత్‌లోని 15 సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఉదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్లాయ్, భుజ్ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. అందుకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను తుత్తునియలు చేసింది. గురువారం మధ్యాహ్నం పాక్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, రావల్పిండిలపై విరుచుకుపడింది. లాహోర్‌లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన హెచ్‌క్యూ–9 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను హర్పీ కామికాజ్ డ్రోన్లతో నేలకూల్చింది. ఈ దాడులను పాక్ కూడా ధ్రువీకరించింది. ‘‘లాహోర్ సమీపంలో ఒక డ్రోన్ నేలకూలింది. గుర్జన్‌వాలా, చాక్వాల్, బహవల్పూర్, మియానో, కరాచీ, ఛోర్, రావల్పిండి, అతోక్ ప్రాంతాల్లో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయి’’ అని అంగీకరించింది. లాహోర్‌లో నలుగురు సైనికులు గాయపడ్డారని, ఒక పౌరుడు మరణించాడని చెప్పింది. ‘‘పాక్ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. ఎస్–400తో పాటు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్‌తో పాక్ క్షిపణులు, డ్రోన్లను కూల్చేశాం’’ అని సైన్యం ప్రకటించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను నాశనం చేసినట్లు కేంద్రం పేర్కొంది. యుద్ధ వాతావరణం భారత దాడులతో లాహోర్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. వాల్టన్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగడంతో జనం భయభ్రాంతులయ్యారని తెలిపింది. గాల్లో దట్టమైన పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. యుద్ధ భయంతో పాక్‌లో సియాల్కోట్, కరాచీ, లాహోర్ సహా పలు ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. పాక్ నగరాల్లోని తమ పౌరులు తక్షణం దేశం వీడాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలాలని అమెరికా సూచించింది. పీఎంఓ భేటీ జరుగుతుండగానే!ఇస్లామాబాద్‌పై భారత్ దాడుల సమయంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లతో నగరమంతా దద్దరిల్లిపోయింది. దాంతో సమీక్షను అర్ధంతరంగా నిలిపేసి ప్రధాని బృందం సురక్షిత ప్రాంతానికి తరలినట్టు సమాచారం. కాసేపటికే షహబాజ్ నివాస పరిసరాలు నేలమట్టం కావడంతో ఆయనను హుటాహుటిన పాతిక కి.మీ. దూరంలోని బంకర్లోకి తరలించినట్టు చెబుతున్నారు. పలుచోట్ల బ్లాకౌట్పాక్ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్సర్, హోషియార్పూర్, మొహాలీ, చండీగఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి. -
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. దుబాయ్ వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్‌లు?
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరిట దాయాది పాకిస్తాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తొలుత మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది.ఈ ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడటంతో పాటు.. మిసైళ్లతో దాడికి దిగింది. ఇందుకు భారత్ సైతం ధీటుగా బదులిస్తోంది. భారత బలగాలు పాక్ మిస్సైల్ ను గాల్లోనే పేల్చివేశాయి. పాక్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. లాహోర్ లోని కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో ఓ డ్రోన్ కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇదే మైదానంలో గురువారం రాత్రి పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్ జరగాల్సి ఉంది.షెడ్యూల్ ప్రకారం పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ తలపడాల్సింది. కానీ రావల్పిండిలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాయిదా వేసింది. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు పీసీబీ లహోర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. క్రిక్‌బజ్ రిపోర్ట్ ప్రకారం.. పీఎస్ఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లను వేరో చోటకు తరలించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దుబాయ్ లేదా దోహాలను వేదికగా మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించాలని పీసీబీ భావిస్తోందంట. దీనిపై ఒకట్రెండు రోజుల్లో పీసీబీ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. అయితే టోర్నీని వేరో చోటకు మార్చడం పాకిస్తాన్‌కు అదనపు ఖర్చుతో కూడుకున్న వ్యవహరం. మరి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమి చేస్తుందో వేచి చూడాలి. -
జమ్మూపై పాక్ డ్రోన్లతో దాడి.. తిప్పికొట్టిన భారత్
జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్‌గా పాక్ డ్రోన్లతో దాడి చేసింది. ఎఫ్-16ను పాక్ ఆర్మీ ప్రయోగించింది. భారత్ బలగాలు ధీటుగా ఎదుర్కొన్నాయి. 10 పాక్ డ్రోన్లను భారత్ కూల్చివేసింది. సైరన్లతో ప్రజలను ఆర్మీ అప్రమత్తం చేసింది. సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో రాకపోకలు బంద్ చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. జమ్మూ నగరమంతా విద్యుత్‌ను నిలిపివేశారు. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.జమ్మూ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. సాంబ సెక్టార్లో పాక్ కాల్పులకు తెగబడింది. ఎస్-400 సిస్టమ్‌తో పాక్ మిస్సైళ్లను భారత్ ధ్వంసం చేసింది. సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించిన ఎఫ్-16, రెండు జేఎఫ్-17లను కూల్చివేసిన ఇండియన్ ఆర్మీ.. పాక్‌ను మరో చావు దెబ్బ కొట్టింది. మూడు ఫైటర్ జెట్లను భారత్ సైన్యం కూల్చివేసింది.జమ్మూ, సివిల్ ఎయిర్పోర్ట్, సాంబ, ఆర్ఎస్పుర, చానీ మహిత్, అర్నియా ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు పాల్పడింది. పఠాన్ కోట్ ఎయిర్‌బేస్‌పై ఎఫ్-16 దాడికి ప్రయత్నించింది. పాక్ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని భారత్ ఆర్మీ ప్రకటించింది. పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టామని పేర్కొంది.కాగా, పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం ఇవాళ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి. యాంటి మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే భారత్ పేల్చేసింది. ఎస్-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి. -
Operation Sindoor: వెనక్కి తగ్గిన రిలయన్స్.. ట్వీట్ వైరల్
ఆపరేషన్ సిందూర్ కోసం రిలయన్స్ కంపెనీ ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేసిందని వస్తున్న వార్తలపై సంస్థ స్పందించింది. ''ఆపరేషన్ సిందూర్'' అనే పదాన్ని ట్రేడ్‌మార్క్ చేసే ఉద్దేశ్యం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ అయిన జియో స్టూడియోస్ అనుమతి లేకుండా ఒక జూనియర్ వ్యక్తి అనుకోకుండా దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్.. దాని వాటాదారులందరూ చాలా గర్వంగా ఉన్నారు. ఉగ్రవాదం అనే దుష్టత్వానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న రాజీలేని పోరాటమే ఈ ''ఆపరేషన్ సిందూర్" అని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: నెలకు వారం రోజులే పని: ఏడాదికి రూ.66 లక్షల సంపాదనఉగ్రవాదంపై పోరాడుతున్న భారత ప్రభుత్వానికి, సాయుధ దళాలకు రిలయన్స్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇండియా ఫస్ట్ అనే నినాదానికి మేము కట్టుబడి ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది.ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తులుమే 7న ఉదయం 10:42 గంటల నుంచి సాయంత్రం 6:27 గంటల మధ్య, 'ఆపరేషన్ సిందూర్' కోసం నాలుగు వేర్వేరు ట్రేడ్‌మార్క్ దాఖలు అయ్యాయి. ఇందులో రిలయన్స్ మాత్రమే కాకుండా.. ముంబై నివాసి ముఖేష్ చెత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్హ్, ఢిల్లీలోని న్యాయవాది అలోక్ కొఠారి ఉన్నారని బార్ అండ్ బెంచ్ నివేదించింది. అయితే ఇప్పుడు ట్రేడ్‌మార్క్ దాఖలు రిలయన్స్ కంపెనీ ఉపసంహరించుకుంది. మిగిలినవాళ్లు ఉంసంహరించుకున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.Media StatementReliance Industries has no intention of trademarking Operation Sindoor, a phrase which is now a part of the national consciousness as an evocative symbol of Indian bravery.Jio Studios, a unit of Reliance Industries, has withdrawn its trademark application,…— Reliance Industries Limited (@RIL_Updates) May 8, 2025 -
పాక్ కుయుక్తులు.. భారత్ సీరియస్ వార్నింగ్
ఢిల్లీ: భారత్‌లోని పలు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేసిందని.. ఉత్తర, పశ్చిమ, భారత్‌లోని 15 ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ సైన్య స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని.. ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని ఆమె స్పష్టం చేశారు. విదేశాంగశాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాక్ దాడులను తిప్పికొట్టామని.. పాక్ మిస్సైళ్లను కూల్చేశామని వెల్లడించారు.నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరుపుతున్న విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 16 మంది మృతి చెందినట్లు ఆమె వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి,భుజ్‌లో పాక్ సైన్యం దాడులు చేసిందని.. మేం చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవన్నారు.నియంత్రణ కచ్చితత్వంతో మేం కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశాం. మిలటరీ స్థావరాలపై మేం దాడి చేయలేదు. పాక్ దాడుల్లో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. కుప్పారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ సెక్టార్లలో పాక్ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ తనకేమీ సంబంధం లేదంటూ చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తోందని విక్రమ్ మిస్త్రీ అన్నారు.‘‘పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. ఇంతకంటే ధీటుగా సమాధానం ఇస్తాం. 65 ఏళ్ల నుంచి భారత్‌ను పాక్ రెచ్చగొడుతున్నా సహనంగా ఉన్నాం. పాకిస్థాన్‌తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరపడం లేదు. ఐరాసతోనే పాకిస్థాన్ అబద్ధాలు చెప్పింది. పాక్‌లో ఉన్న టీఆర్ఎఫ్.. లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థ. ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని పాక్ బుకాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ కేంద్రం. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదులు పాక్‌లో రక్షణ పొందుతున్నారు.బిన్ లాడెన్‌కు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పించింది. పాకిస్థాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులే.. పఠాన్‌కోట్, ముంబైలో దాడులు చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ అధికారులు హాజరయ్యారు. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో పాక్ అంత్యక్రియలు చేసింది. ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేశామని అబద్ధాలు చెప్తోంది. మేం ఎక్కడా ప్రార్థనా కేంద్రాలను టార్గెట్ చేయలేదు. పూంఛ్‌లో సిక్కు పౌరులపై పాక్ కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారు, పహల్గాం ఉగ్రదాడి వల్లే ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. పల్గాహం ఉగ్రదాడికి నిన్న భారత్ సమాధానం చెప్పింది’’ అని విక్రమ్ మిస్త్రీ చెప్పారు. -
Operation Sindoor: భయాందోళనలలో విదేశీ క్రికెటర్లు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత దళాలు ఇవాళ (మే 8) పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ఇవాళ జరగాల్సిన పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మ్యాచ్ రద్దైంది. ఈ లీగ్‌లో మున్ముందు జరగాల్సిన మ్యాచ్‌లపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.ఈ దాడి అనంతరం పీఎస్ఎల్ 2025 ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన దాదాపు 40 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ పాక్‌పై కన్నెర్ర చేయడంతో పీఎస్ఎల్ ఆడుతున్న విదేశీ క్రికెటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్ దాడుల తీవ్రతను పెంచిన తర్వాత చాలామంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అయితే పాక్‌లో విమానాశ్రయాలు మూత పడటంతో వారు ఎటూ వెళ్లలేకపోతున్నారు. ఈ లీగ్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.PSL 2025 ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు..ఇస్లామాబాద్ యునైటెడ్: ఆస్ట్రేలియా - మాథ్యూ షార్ట్, రిలే మెరిడిత్, బెన్ డ్వార్హుయిస్; న్యూజిలాండ్ - కాలిన్ మున్రో; దక్షిణాఫ్రికా - రాస్సీ వాన్ డెర్ డస్సెన్; యూఎస్ఏ - ఆండ్రీస్ గౌస్; వెస్టిండీస్ - జాసన్ హోల్డర్కరాచీ కింగ్స్: ఆఫ్ఘనిస్తాన్ - మొహమ్మద్ నబీ; ఆస్ట్రేలియా - డేవిడ్ వార్నర్, బెన్ మెక్‌డెర్మాట్; ఇంగ్లాండ్ - జేమ్స్ విన్స్; న్యూజిలాండ్ - టిమ్ సీఫెర్ట్, ఆడమ్ మిల్నే, కేన్ విలియమ్సన్.లాహోర్ ఖలందర్స్: బంగ్లాదేశ్ - రిషద్ హొస్సేన్; ఇంగ్లాండ్ - సామ్ బిల్లింగ్స్, టామ్ కుర్రాన్; నమీబియా - డేవిడ్ వైస్; శ్రీలంక - కుసల్ పెరెరా; న్యూజిలాండ్ - డారిల్ మిచెల్, జింబాబ్వే - సికందర్ రజా.ముల్తాన్ సుల్తాన్స్: ఆస్ట్రేలియా - ఆష్టన్ టర్నర్; ఇంగ్లాండ్ - డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్; న్యూజిలాండ్ - మైఖేల్ బ్రేస్‌వెల్; వెస్టిండీస్ - గుడకేష్ మోటీ, షాయ్ హోప్, ఐర్లాండ్ - జోష్ లిటిల్.పెషావర్ జల్మీ: ఆఫ్ఘనిస్తాన్ - నజీబుల్లా జద్రాన్; ఆస్ట్రేలియా - మాక్స్ బ్రయంట్, బంగ్లాదేశ్ - నహిద్ రానా, ఇంగ్లాండ్ - టామ్ కోహ్లర్-కాడ్మోర్; దక్షిణాఫ్రికా - లిజాడ్ విలియమ్స్, వెస్టిండీస్ - అల్జరీ జోసెఫ్.క్వెట్టా గ్లాడియేటర్స్: న్యూజిలాండ్ - ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, కైల్ జామీసన్; దక్షిణాఫ్రికా - రిలీ రోసౌ; వెస్టిండీస్ - అకేల్ హోసేన్ -
Operation Sindoor సలాం, హస్నాబాద్!
దేశ రక్షణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్మీనే. కుటుంబాలకు దూరంగా ఉంటూ భరతభూమికి వారు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. రేయింబవళ్లు శత్రు మూకల బుల్లెట్లు, బాంబుల మోతల మధ్య నిత్యం పోరాటం చేసే సైనికులే మన ధైర్యం. ఆ సైన్యంలో దాదాపుగా వంద మందికి పైగా హస్నాబాద్ వాసులు విధులు నిర్వహిస్తున్నారు. దుద్యాల్: యువత సరిహద్దులో సేవ చేసేలక్ష్యంతో ఆర్మీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామం నుంచి వంద మందికి పైగా దేశ రక్షణలో సైనికులుగా చేరారు. ప్రతీ సెలక్షన్ నుంచి ఇద్దరి నుంచి ఐదుగురు వరకు సైన్యంలో చేరడం ఆనాయితీగా మారింది. 70 ఏళ్ల క్రితం ప్రారంభమైన చేరికలు నేటికీ కొనసాగుతూ దేశ సేవలో తరిస్తున్నారు. ప్రతీ ఏడాది పది మంది పదవీ విరమణ పొందుతుంటే మరో పది మంది సైన్యంలో చేరుతుంటారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున సైన్యంలో విధులు నిర్వహిస్తున్న వారు వంద మందికి పైగా ఉన్నారు. రక్తం ఉరకలేస్తోంది ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం ప్రారంభమైంది. దీంతో వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన దాదాపు 50 మంది వరకు సైనికులను జమ్మూకశ్మీర్ ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా సాధారణ విధులు నిర్వహించిన తమకు ప్రస్తుతం మధురానుభూతి కల్గుతోందని కుటుంబ సభ్యులతో అభిప్రాయాలను పంచుకుంటున్నారు. శత్రు దేశం పాకిస్తాన్‌తో యుద్ధం అంటే రక్తం ఉరకలేస్తుందంటున్నారు. హైదరాబాద్, నాసిక్, బెంగళూర్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ వంటి ప్రధాన నగరాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని యుద్ధ పరిసర ప్రాంతాలకు తరలించినట్లు అందులో హస్నాబాద్‌కు చెందిన వారు సైతం ఉన్నారని సైనికులు చెబుతున్నారు. ప్రాణభయం లేకుండా దేశసేవకు సిద్ధంగా ఉన్నామని.. ఉగ్రవాదులను అంతం చేయడానికి మంచి అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఘఇదీ చదవండి : వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్న కార్గిల్ యుద్ధంలో నేను సైతం ఇంతియాజ్ అలీ 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్ధ సమయంలో పాక్–బంగ్లా దేశాలు కొన్ని ప్రాంతాలు విడుపోయాయని ఆయన చెప్పారు. భారత్ నుంచి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనడం ఆత్మ సంతృప్తినిచ్చిందన్నారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్దంలోనూ పాలుపంచుకున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుత ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొనే అవకాశం హస్నాబాద్‌కు చెందిన సైనికులకు దక్కిందని ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు. ఇదీ చదవండి : Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!గర్వంగా ఉంది భారత్–పాక్ మధ్య జరుగుతున్న యుద్ధ విధుల్లో ఉన్నా. ప్రస్తుతం చైనా సరిహద్ధులోని లడక్ ప్రాంతంలో భద్రత బలగాల్లో ఉన్నాను. ఇన్నాళ్ల విధుల కంటే ఇప్పుడే సంతృప్తిగా ఉంది. ప్రాణాలకు తెగించి ప్రత్యర్థిపై యుద్ధం చేయడమే లక్ష్యం. దేశసేవలో పాల్గొంటున్నందుకు గర్వంగా ఉంది. -జి.ఆశప్ప, నాయక్ సుబేదార్ పిలుపు వస్తే పరుగెత్తుతాం ప్రస్తుతం భారత్–మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. మన దేశం శత్రుమూకపై దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులను పూర్తిగా మట్టుబెట్టేందుకు భారత సైన్యం తలమునకలైంది. మాజీ సైనికులకు పిలుపువస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా. యుద్ధం చేయాలనే ఆసక్తితో ఉన్నాం. – బసప్ప, మాజీ సైనికుడు, హస్నాబాద్ -
ఆపరేషన్ సిందూర్ కొనసాగించాలి
హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఇదే సరైన చర్య అని మాజీ ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే తాము కూడా యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఆర్మీ, నేవీ, వాయుసేన (Air Force) సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌పై కంటోన్మెంట్‌లోని పలువురు ఆర్మీ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈసారి యుద్ధం వస్తే, అధికారుల నుంచి పిలుపు వస్తే పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నామని రిటైర్డ్ ఆర్మీ జవాన్లు తెలిపారు. దాడులు చేస్తే సహించేది లేదు ఆపరేషన్ సిందూర్ సమర్థనీయమే. శక్తివంతమైన మన త్రివిధ దళాల సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుసు. 1948 మొదలు 1965, 1975, 1999లో పాకిస్థాన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పినా తీరు మార్చుకోలేదు. ఉగ్రవాదులు మనదేశంపై దాడులు చేయకుండా పాకిస్తాన్‌లోని వారి శిబిరాలపై దాడులు చేసేందుకు ఆపరేషన్ సిందూర్ కొనసాగించాలి. – ఆర్ఆర్ మహాపాత్రో, రిటైర్డ్ ఆర్మీ అధికారిమరోసారి యుద్ధానికి సిద్ధం ఒకవేళ పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే మనదేశం తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. గత కార్గిల్ యుద్ధంలో మద్రాస్ రెజిమెంట్ 27 తరఫున పూంచ్ సెక్టార్ నుంచి పాల్గొన్నాను. పాక్ ముష్కరులపై దాడులు చేశాం. 2006లో ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందాను. తాజాగా ఉగ్రవాదులు దాక్కున్న తొమ్మిది స్థావారాలపై మన దళాలు దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుపెట్టి వారి స్థైర్యాన్ని దెబ్బతీశాయి. – పరమేశ్వర్ సింగ్ సిపాయి, రిటైర్డ్పాక్కు తట్టుకునేశక్తి లేదు..ఈసారి పాక్‌తో యుద్ధం వస్తే మరోసారి పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో యుద్ధ ట్యాంకర్ డ్రైవర్‌గా 21 మెకనైజ్డ్ ఎనిఫెంట్రి రెజిమెంట్ తరఫున పదకొండు రోజులపాటు జమ్ము, కశ్మీర్‌లోని మేరినాగ్ బటాపూర్ నుంచి పాల్గొన్నాను. పదకొండు మంది పాక్ సైనికులను అంతమొందించాం. మనదేశానికి చెందిన ఆర్మీ, నేవీ, వాయుసేనను తట్టుకునే శక్తి పాకిస్తాన్‌కు లేదు. – కామేశ్వర్ రావు, కార్గిల్ యుద్ధవీరుడుచదవండి: పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే పేల్చేసిన భారత్ -
లాహోర్‌ను వీడండి.. తమ పౌరులకు అమెరికా హెచ్చరిక
పాక్ ఉన్న తమ పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. ఈ మేరకు పాక్‌లోని తమ పౌరులు, దౌత్యవేత్తలను అప్రమత్తం చేసింది. వెంటనే లాహోర్‌ను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఈ మేరకు లాహోర్‌లోని యూఎస్ ఎంబసీ సూచనలు జారీ చేసింది. లాహోర్‌లో విమానాశ్రయం మూసివేయడంతో దౌత్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచించింది.కాగా, మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. పీవోకేలో ఉగ్ర వాదులను వేటాడుతున్నామని ఆయన తెలిపారు. పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా భారత్ ప్రతీకార దాడులు చేస్తోంది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసమైనట్లు తెలుస్తోందని భారత్ ఇప్పటికే వెల్లడించింది. పాకిస్థాన్ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి.యాంటి మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే భారత్ పేల్చేసింది. ఎస్-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు తెలిసిందని భారత రక్షణశాఖ వెల్లడిచింది. -
పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ గురించి భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పలు విషయాలను పంచుకున్నారు. తాజాగా జరిగిన అఖిలపక్ష భేటీలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలతో పాటు ఆయన అభినందించారు. ఆపై మీడియా సమావేశం నిర్వహించారు. భారత్ చేసిన మెరుపుదాడిలో దాదాపు 100 మంది ఉగ్రవాదలు మరణించారని ఆయన తెలిపారు. అయితే, ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదని.. కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ తీరు మార్చుకోకుంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.POK ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ పూర్తిగా ధ్వంసం చేసిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యంపై రాజ్‌నాథ్‌సింగ్ అభినందనలు తెలిపారు. భారత్ చేసిన దాడిలో పాక్ పౌరలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. తాము కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఔట్సోర్సింగ్ చేస్తోందని ఆయన విమర్శించారు.భారత్ వద్ద నైపుణ్యం పొందిన సైన్యంతో పాటు బలమైన ఆయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. సైనికులు చూపిన సాహసాలకు దేశం గర్విస్తుందన్నారు. భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రధాని మోదీ పదేళ్ల క్రితం చెప్పారని గుర్తుచేశారు. రక్షణ పరికరాల కోసం తీవ్రంగా శ్రమించామన్నారు. నేడు భారత్ ఉత్పత్తి చేస్తున్న రక్షణ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయన్నారు. భారత రక్షణ రంగంలో క్వాలిటీ, క్వాంటిటీని పెంచుతూ వచ్చామన్నారు. -
పాక్ మిస్సైళ్లను కూల్చేసిన భారత్
-
ఆపరేషన్ సిందూర్.. జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతం
ఐసీ-814 విమానం హైజాక్‌లో కీలక సూత్రధారి జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజార్ హతమయ్యారు. భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో అజార్ స్థావరం సైతం ధ్వంసమయ్యింది. జైషే మహ్మద్ ఉగ్రమూకలో అబ్దుల్ రవూఫ్ పనిచేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారు. వారిలో అబ్దుల్ రవూఫ్ అజార్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జైషేను స్థాపించిన మసూద్ అజార్ సోదరుడే అబ్దుల్ రవూఫ్ అజార్.కాగా, పాకిస్తాన్‌లోని బహావల్పూర్ నగరంలో భారత్ జరిపిన దాడుల్లో ఉగ్రసంస్థ జైషే మొహహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. మసూద్ అజార్ కుటుంబంలో పది మంది హతమయ్యారు. బహావల్పూర్లోని జామియా మసీద్ సుభాన్ అల్లాహ్ శిబిరం సముదాయంపై భారత్ జరిపిన క్షిపణి దాడిలో అజార్ సోదరి, ఆమె భర్త, అజార్ మేనల్లుడు, అతని భార్య, మరో మేనల్లుడు, ఉమ్మడి కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు చనిపోయారు. వీరితోపాటే అజార్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అతని తల్లి, మరో ఇద్దరు వ్యక్తులూ మరణించారు. ఈ దాడిలో అబ్దుల్ రవూఫ్ అజార్ గాయపడ్డారు. చికిత్స పొందుతూ గురువారం అజార్ కన్నుమూశాడు.1999లో ఐసీ–814 విమానాన్ని హైజాక్ చేశాక దానిని విడిచిపెట్టాలంటే మౌలానా మసూద్ అజార్‌ను వదిలేయాలని హైజాకర్లు డిమాండ్ చేయడం, తప్పని పరిస్థితుల్లో అజార్‌ను జైలు నుంచి వదిలేయడం తెల్సిందే. విడుదలైన నాటి నుంచి అజార్ పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలను ఉధృతం చేశాడు. సుభాన్ శిబిరం అలియాస్ ఉస్మానో అలీ క్యాంపస్‌గా పిలుచుకునే ఈ ప్రాంగణాన్ని జైషే ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయంగా అజార్ వినియోగించుకుంటున్నాడు.18 ఎకరాల ఈ ప్రాంతం నుంచే జైషే ఉగ్రసంస్థలోకి కొత్త వాళ్ల రిక్రూట్మెంట్లు, విద్వేష బోధన, శిక్షణ, నిధుల సేకరణ తదితర కార్యకలాపాలు కొనసా గుతుంటాయి. 2019 మేలో అజార్‌ను ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019 ఏప్రిల్ తర్వాత అజార్ పెద్దగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. బహావల్పూర్లోనే ఉంటున్నట్లు గతంలోనే నిఘా సమాచారం భారత్‌కు అందింది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2000లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడులకు మసూద్ అజార్ సూత్రధారి అని తెలుస్తోంది. -
పీసీబీకి మరో దెబ్బ!.. రావల్పిండి స్టేడియంపై డ్రోన్ దాడి?.. PSLపై నీలినీడలు!
పహల్గామ్ ఉగ్రదాడికి బదులిచ్చేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొనసాగుతోంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి.ఇందుకు బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడటంతో పాటు.. మిసైళ్లతో దాడికి దిగింది. ఇందుకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. యాంటీ మిసైల్ స్టిసమ్‌తో గాల్లోనే పాక్ క్షిపణులను పేల్చివేసింది. ఇందులో భాగంగా లాహోర్, రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు సమాచారం.రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలోఈ క్రమంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో భారత్ డ్రోన్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. మైదానానికి దగ్గర్లోనే దాడి జరిగినట్లు సమాచారం. కాగా ఇక్కడే గురువారం రాత్రి పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్ జరగాల్సి ఉంది. బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్సీలోని పెషావర్ జల్మీ- డేవిడ్ వార్నర్ సారథ్యంలోని కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది.అయితే, స్టేడియానికి దగ్గర్లోనే డ్రోన్ దాడి జరగడంతో అప్రమత్తమైన పాక్ బోర్డు.. క్రికెటర్లు రావల్పిండి విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.డ్రోన్ దాడి నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమైన పీసీబీ అధికారులు పీఎస్ఎల్ కొనసాగింపు , వేదికల మార్పు తదితర అంశాల గరించి చర్చినట్లు తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన పలువురు క్రికెటర్లు ప్రస్తుతం పాక్‌లోనే ఉన్నారు. కరాచీలోమరోవైపు.. భారత్- పాక్ పరస్పర దాడుల నేపథ్యంలో తమ పౌరులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా చెప్పడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.ఇలాంటి సమయంలో పాక్ టీ20 లీగ్ కొనసాగకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. రావల్పిండిలో ఈరోజు జరగాల్సిన మ్యాచ్‌ను కరాచీకి తరలించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులు దక్కించుకు న్న పాక్.. ఇటీవలే భారీగా డబ్బు ఖర్చు పెట్టి స్టేడియాలను పునరుద్ధరించింది.చదవండి: Operation Sindoor: సానియా మీర్జా పోస్ట్ వైరల్ -
ఆపరేషన్ సిందూర్... మసూద్ అజార్ కు కోలుకోలేని దెబ్బ
-
Operation Sindoor: కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు..
భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. గురువారం పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ గంటసేపు నిలిచిపోయింది. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో భయాందోళనలు చెలరేగాయి. దీంతో పాకిస్తాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కేఎస్ఈ -30 గురువారం 7.2 శాతం వరకు పడిపోయి.. వరుసగా రెండవ సెషన్లో కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, కేఎస్ఈ 100 13 శాతం క్షీణించగా, కేఎస్ఈ 30 ఇప్పటివరకు 14.3 శాతం పడిపోయింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ జరిపిన దాడుల నేపథ్యంలో పాక్ బెంచ్ మార్క్ షేర్ ఇండెక్స్ బుధవారం దాదాపు 6 శాతం నష్టంతో ప్రారంభమై, చివరకు 3.1 శాతం నష్టంతో సెషన్ ముగిసింది. ఈ రోజు కూడా భారీ నష్టాలనే చవిచూడాల్సి వచ్చింది. -
Operation Sindoor: ఐపీఎల్-2025లో ఓ మార్పు
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్- పంజాబ్ కింగ్స్ (MI Vs PBKS)జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ వేదిక మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం (మే 11) ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో వేదికను ధర్మశాల (Dharmashala) నుంచి అహ్మదాబాద్‌కు మార్చారు.సిద్ధంగా ఉన్నాంగుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ఈ విషయం గురించి స్పోర్ట్‌స్టార్‌కు వెల్లడించారు. ‘‘చివరి నిమిషంలో ధర్మశాల నుంచి వేదికను మార్చాల్సి వచ్చినపుడు.. బీసీసీఐ మమ్మల్ని సంప్రదించింది. మ్యాచ్ నిర్వహణకు మేము సిద్ధంగా ఉన్నామని వారికి సమాచారం ఇచ్చాము’’ అని తెలిపారు.కాగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పంజాబ్ కింగ్స్‌కు రెండో సొంత మైదానం. ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ శ్రేయస్ సేన ఓ మ్యాచ్ ఆడింది. మే 3న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడి 37 పరుగులు తేడాతో గెలిచింది.ఇక ఈ రోజు అంటే మే 8న ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో మే 11న ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టాల్సి ఉంది. అయితే, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రెండు రోజుల పాటు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు అక్కడికి ప్రయాణించే పరిస్థితి లేదు.వాంఖడేకు మారుస్తారనుకుంటేఈ నేపథ్యంలో వేదికను ముంబైలోని వాంఖడేకు మారుస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఏ జట్టుకు హోం అడ్వాంటేజీ ఉండకూడదనే ఉద్దేశంతో వేదికను తటస్థంగా అహ్మదాబాద్‌కు మార్చినట్లు సమాచారం. నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు ముంబై గురువారమే అక్కడికి చేరుకునే అవకాశం ఉండగా.. పంజాబ్ ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకోనుంది.భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లుకాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట ముష్కరులకు బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో దాయాది దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాద శిబిరాలపై దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. మిసైళ్లతోనూ దాడి చేయగా భారత్ విజయవంతంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ధర్మశాలలో పంజాబ్- ఢిల్లీ మ్యాచ్‌కు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.ఇదిలా ఉంటే.. పంజాబ్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ప్రస్తుతం 15 పాయింట్లు కలిగి ఉన్న పంజాబ్.. పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ముంబై నాలుగో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!The many colours of IPL 🎨From the eyes of Painter Andy Brown 🧑🎨Presenting - 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗮𝗻𝗱 𝗖𝗮𝗻𝘃𝗮𝘀 ft. #TATAIPL 🌄WATCH the full video 🎥 🔽 -By @mihirlee_58 | #PBKSvDChttps://t.co/EfOvuYOD86 pic.twitter.com/wtbw0VMNMS— IndianPremierLeague (@IPL) May 8, 2025 -
కర్రిగుట్టలో శవాల గుట్టలు.. ఆపరేషన్ కగార్ వెనుక..?
-
'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. పాక్ నటులపై నిషేధం
మన దేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వల్ల 80 మంది పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ కామెంట్స్ చేయడంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వీరిని తక్షణమే బాలీవుడ్ నుంచి నిషేధిస్తున్నట్లు లేఖ విడుదల చేసింది. ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది.'వారి (ఫవాద్-మహిరా) కామెంట్స్ మన దేశాన్ని అగౌవరపరిచేలా ఉన్నాయి. అలానే ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులని కూడా అవమానించేలా ఉన్నాయి. మన ఇండస్ట్రీలో పనిచేసే పాక్ నటీనటులు, చిత్రనిర్మాతలపై పూర్తిగా నిషేధం విధించాలి. భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దు'(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు)'కళ పేరుతో ఇలాంటి నటీనటుల్ని గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌవరపరచం లాంటిదే. చిత్రపరిశ్రమ దీన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం' అని ఆల్ ఇండియా సినీ వర్కర్క్ అసోసియేషన్ పేర్కొంది.గత నెలలో పహల్గామ్ లో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా.. మంగళవారం అర్థరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్ పై 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడి చేసింది. 9 స్థావరాలపై దాడి చేయగా 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇకపోతే ఫవాద్ ఖాన్ నటించిన హిందీ సినిమా 'అబిర్ గులాల్'. మే 9న రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడా సినిమా అటకెక్కిపోయినట్లే.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా) -
ఆపరేషన్ సిందూర్ పై అఖిలపక్ష నేతలకు వివరిస్తున్న కేంద్రం
-
'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు
'ఆపరేషన్ సిందూర్' టైటిల్ హక్కుల కోసం బాలీవుడ్‌లోని టాప్ సినీ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ విరుచుకుపడింది. ఈ పేరు చాలా శక్తివంతంగా ఉందని గుర్తించిన సినీ మేకర్స్ టైటిల్ హక్కుల కోసం క్యూ కడుతున్నాయి.ఇప్పటికే అనేక మంది నిర్మాతలు ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు BN తివారీ ఇండియా టుడేతో ధృవీకరించారు. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం పనిచేసే సంఘాలలో ఒకటి)లో దాదాపు 15 మంది చిత్రనిర్మాతలు, స్టూడియోలు కూడా ఇదే టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు.హిందీ చిత్ర పరిశ్రమ నిర్మాతలు నిన్నటి నుంచి "ఆపరేషన్ సిందూర్" అనే టైటిల్ రేసులో మహావీర్ జైన్ ఫిల్మ్స్ ముందంజలో ఉందని, ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసిన మొదటి బ్యానర్ అని సమాచారం. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ఆపై ప్రముఖ బ్యానర్లు జీ స్టూడియోస్, టి-సిరీస్ ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసిన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ బ్యానర్లన్నీ కూడా ఇటీవలనే పహల్గామ్ దాడిని ప్రపంచానికి చూపాలని పహల్గామ్ పేరుతో టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నాయి. అయితే, "ఆపరేషన్ సిందూర్" అనేది ఒక శక్తివంతమైన టైటిల్ కావడంతో చాలామంది పోటీపడుతున్నారు. -
Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్!
భారతదేశం 'ఆపరేషన్ సిందూర్' సైనిక ఆపరేషన్‌ను ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పదంపై ట్రేడ్ మార్క్‌కోసం కొన్నిసంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో కుబేరుడు ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలి సంస్థగా నిలిచింది. ఈ మేరకు బార్ అండ్ బెంచ్ నివేదించింది.ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ బుధవారం (మే 7) ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ముందు 'ఆపరేషన్ సిందూర్' ను వర్క్ మార్క్ గా నమోదు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకుంది.విద్య మరియు వినోద సేవలను కవర్ చేసే క్లాస్ 41 కింద 'వస్తువులు మరియు సేవలు' కోసం ఈ పదాన్ని వాడుకునే హక్కు కోసం రిజిస్ట్రేషన్ కోరింది.అంబానీతోపాటు, మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఈ పదంరిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇందులో ముంబై నివాసి ముఖేష్ చెత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్హ్ ,ఢిల్లీలోని న్యాయవాది అలోక్ కొఠారి ఉన్నారు.ఇదీ చదవండి: Thalassemia Day: బడికి వెళ్లే వయసులోనే..రక్త కన్నీటి గాథ..!పహల్గామ్ ఉగ్రవాద దాడి,25 మంది భారతీయులు మరణించిన నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ కింద మే 6-7 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం భారత సాయుధ దళాలు ప్రారంభించిన ఆపరేషన్. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా వైమానిక దాడులు ప్రారంభించింది. ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు నివాళిగా కేంద్రం ఈ మిషన్‌ను ఈ పేరు పెట్టింది. సైనిక కార్యకలాపాల పేర్లకు ఆటోమేటిక్ రక్షణ లేదుభారతదేశంలో, 'ఆపరేషన్ సిందూర్' వంటి సైనిక కార్యకలాపాల పేర్లను ప్రభుత్వం స్వయం చాలకంగా రక్షించదు. రక్షణ మంత్రిత్వ శాఖ సాధారణంగా అటువంటి పదాలను నమోదు చేయదు లేదా వాటిని మేధో సంపత్తిగా పరిగణించదు. నిర్దిష్ట చట్టపరమైన రక్షణ లేకుండా, ఈ పేర్లను ప్రైవేట్ వ్యక్తులు లేదా కంపెనీలు ట్రేడ్‌మార్క్ దాఖలు ద్వారా క్లెయిమ్ చేయవచ్చని నివేదిక పేర్కొంది.చట్టపరమైన అడ్డంకులు ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కోసం ఈ పదం అందుబాటులో ఉన్నప్పటికీ, ట్రేడ్ మార్కుల చట్టం, 1999 కొన్ని కారణాల వల్ల దరఖాస్తులను తిరస్కరించడానికి రిజిస్ట్రీకి అధికారం ఉంది. సెక్షన్లు 9(2) మరియు 11 ప్రకారం, రిజిస్ట్రార్ తప్పుదారి పట్టించే, తప్పుడు ప్రభుత్వ అనుబంధాన్ని సూచించే లేదా ప్రజల మనోభావాలకు హాని కలిగించే ట్రేడ్‌మార్క్‌ను తిరస్కరించవచ్చు. అయితే, ప్రభుత్వం లేదా ప్రభావిత పార్టీ ద్వారా అధికారిక అభ్యంతరం లేవనెత్తకపోతే అటువంటి నిబంధనలను నమోదు చేయడంపై ఎటువంటి నిషేధం లేదు. మరి ఇది ఎవరికి దక్కనే భవిష్యత్తులో తేలనుంది. చదవండి: వాడిన నూనెను ఇంత బాగా క్లీన్ చేయొచ్చా.. సూపర్ ఐడియా! -
'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం
పహల్గాం ఉగ్రవాద దాడికి భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి తగిన రీతీలో బదులిచ్చింది. దీనిపై యావత్ దేశం హర్షాతీరేకాలు వ్యక్తం చేసింది. అన్నింటికంటే ఈ ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా ముందు వెల్లండించిన ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది ఒకరకంగా భారత రక్షణదళం ఎవరి సారథ్యంలో కొనసాగుతోంది అనేది ప్రపంచానికి తెలిసేలా చేసింది. వారే కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌లు. అయితే తాతా ముత్తాతల నుంచి ఆర్మీలో సేవలందిస్తున్న సోఫియా కుటుంబం తమ కుమార్తె చేసిన పనికి ఆనందపారవశ్యంలో మునిగితేలుతోంది. 'ఇది మాకెంతో గర్వం' అని భావోద్వేగంగా చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి సైతం ఇలాంటి గొప్ప అవకాశం తన కుమార్తెకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదన్నారు. ఆమె కారణంగా ఈ రోజు యావత్ దేశానికి తమ కుటుంబం గురించి తెలిసేలా వార్తల్లో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోఫియాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఆమె కుటుంబసభ్యుల మాటల్లోనే చూద్దామా..!.తమ కుమార్తె భారత ఆర్మీ, నేవీ, వైమానిక బలగాలు సంయుక్తంగా నిర్వహించి ఈ సిందూర్ ఆపరేషన్ గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు కల్నల్ సోఫియా తల్లి హనిమా ఖురేషి. అంతేగాదు తమ కుమార్తె సోపియా కొడుకు(18) కూడా ఐఏఎఫ్(IAF)లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారామె. ఇక కల్నల్ సోషియా తండ్రి తాజ్ ఖురేషి మాట్లాడుతూ.."నా కుమార్తె పట్ల నాకు గర్వంగా ఉంది" నా కుటుంబం ఎల్లప్పుడూ 'వయం రాష్ట్రే జాగ్రయం ( జాతి మొత్తాన్ని సజీవంగా, జాగరూకతతో ఉండేలా చేస్తాం)' అనే సూత్రాన్ని పాటిస్తుంది. 'ముందు మేము భారతీయులం ఆ తర్వాతే ముస్లీంలం' అని సగర్వంగా అన్నారు తాజ్ మొహ్మద్ ఖురేషి. అంతేగాదు ఆమె తాతతో ప్రారంభమైన ఈ దేశ సేవను..సోపియా మూడవ తరం సైనిక అధికారిగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. Meet Taj Qureshi, the proud father of Colonel Sofiya Qureshi 🇮🇳“My grandfather, father & I were all in the #IndianArmy If I get a chance today, I will destroy Pakistan”Imagine RW & Godi Media question their patriotism everyday 💔Mad respect for the REAL HEROES OF INDIA 🫡🇮🇳 pic.twitter.com/CDHH2XoJkt— Ankit Mayank (@mr_mayank) May 7, 2025 ఇక సోఫియా తండ్రి తాజ్ ఖురేషి వడోదరలో ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ఫ్స్ పనిచేయడమే గాక 1971 యుద్ధంలో సేవలందించారు. అలాగే సోఫియా తండ్రి (తాజ్)గారి అమ్మమ్మ తాతయ్య బ్రిటిష్ సైన్యంలో పనిచేయడమే గాక 1857 స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు కూడా. ఇక ఆమెకు ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒకరైన మొహమ్మద్ సంజయ్ ఖురేషి మాట్లాడుతూ..'దేశ భక్తి మా రక్తంలోనే ఉంది' అని సగర్వంగా చెప్పారు. ఎందుకంటే సోఫియా ప్రొఫెసర్ కావాలనుకుంని, అనివార్య కారణాలతో భారత ఆర్మీ యూనిఫాం ధరించిందని అన్నారు. అలా ఆమె కుటుంబ సంప్రదాయన్ని పుణికి పుచ్చుకుందని అన్నారు. ఇక ఆమె భర్త తాజుద్దీన్ ఆర్మీ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారి కావడం విశేషం. చివరిగా కుటుంబ సభ్యులంతా.."ఆమె మాకు ఆదర్శం... ప్రతీకారం తీర్చుకోవడానికి మేము చాలా కాలంగా ఎదురుచూశామం కానీ, ఇలాంటి అద్భుత అవకాశం మా కుటుంబ సభ్యల్లో ఒకరికి దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ పహల్గాం ఘటనలో భర్తలను కోల్పోయిన సోదరీమణులు, తల్లుల ఆక్రందనలకు సిందూరంతో ప్రతీకారం తీర్చుకున్నాం" అని అన్నారు. కాగా, సోఫియా పేరు మీద అనేక అవార్డులు కూడా ఉన్నాయట. అలాగే భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక కవాతులో పాల్గొన్న 18 కంటింజెంట్లలో ఏకైక మహిళా కమాండర్ సోఫియానే అట.విద్యా నేపథ్యం:కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ మీడియంలో పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత 1995లో బీఎస్సీ, 1997లో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరేందుకు తన పీహెచ్డీ ప్రోగ్రామ్ని మధ్యలోనే విడిచిపెట్టినట్లు వివరించారు. ఇక సైన్యంలో చేరాక తన కెరీర్లో ఆరేళ్లు యూఎన్ శాంతి పరిరక్షక దళాలలో పని చేయడం, సంఘర్షణ ప్రాంతాలలో పనిచేయడం, మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం వంటి ఎన్నో అద్భుత సేవలందించారామె.చదవండి: నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా.. -
Operation Sindoor: పాక్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ!
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) నిర్వాహకులకు మరో భారీ ఎదురుదెబ్బ! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పోటీ పడుతూ.. క్యాష్ రిచ్ లీగ్‌కు సమాంతరంగా పీఎస్ఎల్ నిర్వహిస్తూ పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే.ఐపీఎల్‌కు ఎప్పటిలాగే ప్రేక్షకుల నుంచి అమితాదరణ లభిస్తుండగా.. పీఎస్ఎల్ను చూసే వాళ్లే కరువయ్యారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ దాయాదిపై తీసుకున్న చర్యల్లో కఠిన చర్యల్లో భాగంగా.. పీఎస్ఎల్ ప్రసారాలను ఇక్కడ నిలిపివేశారు. దీంతో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అయింది.ఏడుగురు ఆటగాళ్లు స్వదేశానికి?తాజాగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. విదేశీ ఆటగాళ్లు ఈ లీగ్ నుంచి నిష్క్రమించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌కు చెందిన ఏడుగురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సామ్ బిల్లింగ్స్, జేమ్స్ విన్స్, టామ్ కరన్, డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్ వంటి స్టార్ ప్లేయర్లతో పాటు టామ్ కొలర్-కాన్మోర్, ల్యూక్ వుడ్ కూడా పీఎస్ఎల్ను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వెళ్లిపోతాంవీరిలో ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్ ఇప్పటికే తమ నిర్ణయం గురించి ఫ్రాంఛైజీ యాజమాన్యానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఎలాగూ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం.. అదే విధంగా.. తమకు ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండటంతో ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోతామని చెప్పినట్లు సమాచారం.మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ప్రొఫెషనల్ క్రికెట్ అసోసియేషన్ పాక్‌లో ఉన్న తమ ఆటగాళ్ల బాగోగుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సమాచారం.సంతృప్తిగానే ఉన్నారు!ఇక ఈ పరిణామాల గురించి పీఎస్ఎల్ విదేశీ ఆటగాళ్ల వ్యవహారాల ఏజెంట్ స్పందిస్తూ.. ‘‘భద్రత పరంగా మేము చేసిన ఏర్పాట్లపై మెజారిటీ మంది సంతృప్తిగానే ఉన్నారు. అయితే, మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే ఆటగాళ్లను పాక్‌ను వీడరనే అనుకుంటున్నా’’ అని ది టెలిగ్రాఫ్‌తో పేర్కొన్నారు. అదే విధంగా పీసీబీ వర్గాలు స్పందిస్తూ.. ఇప్పట్లో ఎవరూ పాక్‌ను వీడరని.. లీగ్ పూర్తైన తర్వాతే వెళ్తారని పేర్కొన్నాయి.కాగా జమ్మూకశ్మీర్‌లోని ప్రశాంతమైన బైసరన్ లోయలో గత నెలలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. లోయ అందాలను ఆస్వాదించేందుకు వచ్చి సరాదాగా గడుపుతున్న 26 మంది అమాయకులను కాల్చి చంపేశారు. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు ముచ్చెమటలుఇందుకు ప్రతిగా భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది స్థావరాలను పేల్చి వేసింది. దీంతో బాధితులకు న్యాయం జరిగిందంటూ యావత్ భారతావని సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్నట్లుగా కనిపిస్తున్న ఫొటోలతో పాక్ సైనికాధికారులు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు.ఇదిలా ఉంటే.. మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025 ఎడిషన్ మే 25న ఫైనల్‌తో ముగుస్తుంది. అయితే, ఎప్పుడూ ఇండియన్ లీగ్‌తో పోటీకి రాని పాక్ బోర్డు.. ఈసారి మాత్రం క్యాష్ రిచ్ లీగ్‌ను ఢీకొట్టింది. ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో ఐపీఎల్లో ఆడేందుకు కొంత మంది ప్లేయర్లు ఇప్పటికే పీఎస్ఎల్ను వీడగా.. తాజాగా మరికొంత మంది స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చదవండి: Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్ -
భారత్ ప్రతీకారం తీర్చుకుంది - సినీ ప్రముఖులు
-
ఆపరేషన్ సిందూర్ శాటిలైట్ చిత్రాల్ని విడుదల చేసిన భారత్
-
సరిహద్దుల్లో హై అలర్ట్ 400కిపైగా ఫ్లైట్స్ క్యాన్సిల్
-
విజయ సిందూరం పెరిగిన భారత్ ప్రతిష్ట
-
దేశ సరిహద్దుల్లో హైఅలర్ట్.. సిద్ధంగా క్షిపణులు
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఉగ్రవాదదేశం ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకంటించారు. రిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీచేశారు.పాకిస్థాన్‌తో రాజస్థాన్ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. దీనిని పూర్తిగా మూసివేశారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే స్పాట్లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హైఅలర్ట్ ప్రకటించింది. ఫైటర్ జెట్స్ ప్రొటోకాల్ నేపథ్యంలో జోధ్‌పూర్, కిషన్‌గఢ్, బికనీర్‌లో విమానాల రాకపోకలపై ఈ నెల 9 వరకు నిషేధం విధించారు.సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థతోపాటు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. గంగానగర్ నుంచి రాణా ఆఫ్ కట్ వరకు సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఎయిర్ పొట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో బికనీర్, గంగానగర్, జైసల్మేర్, బర్మేర్‌లో జిల్లాల్లో స్కూళ్లను మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదావేశారు. అత్యవసర సేవల్లో ఉండే ఉద్యోగుల సెలవులను రద్దుచేశారు. -
ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
-
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది.. కేంద్రం ప్రకటన
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆపరేషన్ సిందూర్‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు ఆపరేషన్ సిందూర్ వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇక, వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.అఖిలపక్ష సమావేశంలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అన్నారు. అనంతరం, కేంద్రమంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌ను అన్ని పార్టీలు సమర్థించాయి. కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఆపరేషన్ సిందూర్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతం. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేం. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు’ అని చెప్పుకొచ్చారు.పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట భారత్ గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని వినిపించింది. ఈ భేటీకి ముందు ప్రధాని మోదీ నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులను ప్రధానికి వెల్లడించారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరఫున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు.#WATCH | Centre holds all-party meeting to brief all political parties on #OperationSindoor pic.twitter.com/q96NZnhUY6— ANI (@ANI) May 8, 2025 -
ఆపరేషన్ సిందూర్ తో సరిహద్దుల్లో పాక్ కాల్పులు
-
పాకిస్తాన్ లో 9 ఉగ్రవాద స్థావరాల పై భారత్ దాడులు
-
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో స్పందించిన తీరు వైరల్ అవుతోంది. ఈ దేశ ఐక్యతకు ఇదే సరైన నిదర్శనం అంటూ ఆమె పంచుకున్న ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ముష్కరులకు మెరుపు దాడులతో మన సైన్యం సమాధానమిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దాదాపు తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది. తద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదని మరోసారి భారత్ స్పష్టమైన సందేశాన్ని దాయాదికి అందించింది.పేరు సరిగ్గా సరిపోయిందంటూఇక ఈ ఆపరేషన్‌కు సిందూర్ అనే పేరు సరిగ్గా సరిపోయిందంటూ బాధిత కుటుంబాలతో పాటు యావత్ భారతావని ప్రశంసిస్తోంది. అమాయకపు ఆడపడుచుల నుదిటి సిందూరం చెరిగేపోయేలా పాశవిక దాడికి తెగబడిని ఉగ్రవాదులకు ‘రక్త సిందూరం’తో సమాధానమిచ్చారని.. ఇది సరైన నివాళి అని ఉద్వేగానికి లోనవుతున్నారు.మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగాఅదే విధంగా.. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్‌కు ఇద్దరూ మహిళా సైనికాధికారులు నాయకత్వం వహించడం కూడా జాతి హృదయాలు ఉప్పొంగేలా చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్... భారత దేశపు మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా తాము చేపట్టిన ఆపరేషన్ గురించి వివరిస్తూ ఉంటే భారతీయల గుండెలు గర్వంతో నిండిపోయాయి.ఈ ఒక్క ఫొటో చాలువాళ్లిద్దరు అలా చెరోవైపు ప్రెస్ మీట్లో కూర్చుని ఐక్యతకు ప్రతీకలా నిలిచిన తీరు నిజమైన దేశభక్తుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈ దృశ్యాన్ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘ఈ శక్తివంతమైన ఫొటో.. మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది’’ అని సానియా మీర్జా పేర్కొన్నారు.మరోవైపు.. సరిహద్దుల్లో తీవ్రవాదులను తుదముట్టించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై క్రీడాలోకం హర్షం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పలువురు క్రీడాకారులు స్పందిస్తూ మన దేశ ఘనతను కీర్తించారు. ఏకత్వంలో నిర్భీతిఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ‘ఏకత్వంలో నిర్భీతి. ఎల్లలెరుగని బలం. మన ప్రజలే మన దేశానికి బలం. మనమంతా ఒక్కటే. ప్రపంచంలో తీవ్రవాదానికి చోటు లేదు. జైహింద్’ అంటూ వ్యాఖ్యానించాడు. పేసర్ షమీ, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ కూడా ఇదే తరహాలో స్పందించారు.‘మీపై ఎవరైనా రాళ్లు విసిరితే మీరు పూలు విసరండి. అయితే అది పూలకుండీతో సహా విసరండి’ అని సెహ్వాగ్ ట్వీట్ చేయగా, ‘ప్రతికూల పరిస్థితులను కూడా భారత సైన్యం తమకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించింది. ప్రమాదకర సమయంలో వారి ధైర్యాన్ని చూసి గర్విస్తున్నాం’ అని షమీ స్పందించాడు.బాక్సింగ్‌లో ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ ‘భారత్ మాతాకీ జై’ అని ట్వీట్ చేయగా... పఠాన్, సైనా నెహ్వాల్ ‘జైహింద్’ అంటూ మద్దతు పలికారు. ‘మన సైనికులు కేవలం భయపెట్టడంతో ఆగిపోరు. వారు ఏదైనా చేసి చూపిస్తారు’ అని బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. మన సైనికుల భద్రత గురించి తాను ప్రార్థన చేస్తున్నట్లు ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వెల్లడించింది.చదవండి: సరైన సమాధానం.. సాక్ష్యం కనబడుతోందా?.. ఆపరేషన్ సిందూర్‌పై స్పందనలు -
భారత్‌కు దాడి చేసే హక్కు ఉంది.. బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్ సపోర్ట్
లండన్: పాకిస్తాన్‌పై భారత్ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాల నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు భారత్‌కు మద్దతు ప్రకటించారు. ఇక, తాజాగా భారత సంతతి, యూకే ఎంపీ ప్రీతి పటేల్.. బ్రిటన్ పార్లమెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మరక్షణలో భాగంగా పాకిస్తాన్‌పై దాడి జరిపే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో భారత్‌కు మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు.పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బ్రిటన్ పార్లమెంట్లో తాజాగా భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రీతి పటేల్.. భారత్‌తో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేక బ్రిటన్ పోరాడాల్సిన అవసరం ఉందనన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల వల్ల సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాద ముప్పును బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని కోరారు. పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చారని గుర్తు చేశారు. ముంబై, న్యూఢిల్లీ వంటి ఉగ్రవాద ప్రభావిత నగరాల జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరిపోయింది.పహల్గాం దాడిని ఉగ్రవాద చర్యగా ప్రపంచ దేశాలు సైతం గుర్తించాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని నేను కోరుకుంటున్నాను. దేశాల మధ్య సైనిక చర్య, యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఏర్పడకూడదు. ఆత్మరక్షణలో భాగంగా తమను తాము రక్షించుకోవడానికి, ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేయడానికి భారత్‌కు సహేతుక కారణాలు ఉన్నాయి. ఇది భారత్ హక్కు. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదుల ముప్పు భారత్‌కు మాత్రమే కాదని, అనేక దేశాలు ప్రభావితమవుతున్నాయి. ఒసామా బిన్ లాడెన్ వంటి వ్యక్తి పాకిస్తాన్‌లోనే దాక్కున్నాడు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ విషయమేనని అన్నారు.Today in the House of Commons I reiterated my condolences for those impacted by the atrocity that took place in Pahalgam. We must stand with those affected by terrorism. The UK must work with our friends in India to tackle terrorist threats and engage with India, Pakistan and key… pic.twitter.com/8RXezaJHx0— Priti Patel MP (@pritipatel) May 7, 2025ఇక, బ్రిటన్- భారత్ నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడి తర్వాత బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు ఏదైనా ప్రత్యేక భద్రతా సహాయం అందించిందా? ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి బ్రిటన్ ప్రత్యేక మద్దతును అందించగలదా?" అని ప్రీతి పటేల్ ప్రశ్నించారు. చివరగా.. భారత్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడులు, సృష్టించిన హింసాత్మక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ తన వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. -
భారత్-పాక్ యుద్ధం.. బిగ్ ట్విస్ట్ ఇస్తూ ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం ఆపేయాలని కోరారు. అలాగే, ఇరు దేశాలు సాయం కోరితే తాను అందుబాటులో ఉంటానని ట్రంప్ వెల్లడించారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యం భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు దేశాధినేతలు, రాయబారులు దాడుల ఘటనపై స్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని భారత్, పాక్‌లను కోరారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మరోసారి స్పందించారు.ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. దాడులు చేయడం అవమానకరం. రెండు దేశాల గురించి నాకు చాలా తెలుసు. ఎప్పటి నుంచో వారి మధ్య వైరం ఉంది. అయితే, రెండు దేశాలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, వాటిని ఆపేయాలని కోరుకుంటున్నాను. వారు అనుకుంటే ఇప్పుడే ఇది చేయగలరు. రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వాయి. అమెరికాతో భారత్, పాక్‌కు మంచి సంబంధాల దృష్ట్యా వారికి సహాయం చేయాల్సి వస్తే నేను అందుబాటులో ఉంటాను. ఏ సహాయమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.U.S. President Donald Trump has condemned India's attack, calling it shamefulPakistan Zindabad!#Pakistan #PakistanismyRedLine #donaldjtrump #PakistanZindabad #IndiaPakistanWar pic.twitter.com/iDl8SwVeLH— Anmol Sheraz (@iamanmolsheraz) May 6, 2025 చైనాకు భారత్ వార్నింగ్మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌పై విషం గక్కే ప్రయత్నం చేసిన పొరుగు దేశం చైనా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత్‌కు చెందిన మూడు విమానాలను పాక్ కూల్చేసిదంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసిన కథనంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి కథనాలు రాయడం మానుకోవాలని హెచ్చరించింది. -
హైదరాబాద్‌లో ఉత్కంఠభరితంగా ‘ఆపరేషన్ అభ్యాస్’ మాక్ డ్రిల్ (ఫొటోలు)
-
ఆపరేషన్ సిందూర్.. తొలిసారి స్పందించిన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: పహల్గాంలో ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఇక, ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. పాకిస్తాన్ జాతినుద్దేశించి ప్రసంగించిన షరీఫ్..తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. భారత్ ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని వారు (భారత్) అనుకుంటోంది. కానీ, ఇది ధైర్యవంతుల దేశమని వారు మరచిపోయారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత దళాలు బాంబుల వర్షం కురిపించాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నేలమట్టం చేశాయి. విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిపిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులే ఉన్నారు. మసూద్ అజార్ సోదరి - ఆమె భర్త, మసూద్ మేనల్లుడు - అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈమేరకు జైషే వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు కూడా నలుగురు మరణించినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు.Shehbaz Sharif says Pakistan will Retaliate & Avenge the blood🤣~ He is stammering. Unable to read the script given by Pakistan Army. Multiple CUTS just in 30 seconds. This is not Shehbaz. This is Asif Munir. This is Pakistan Army. P*gets have gone mad. pic.twitter.com/WbwQz83KPw— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 7, 2025మరోవైపు, ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఇస్లామాబాద్, పంజాబ్‌లలో విద్యాసంస్థలు మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది. -
పాకిస్తాన్ ఉగ్రవాద తండాలపై 'రక్త సిందూరం' 100 మందికి పైగా ముష్కరులు హతం..
-
పహల్గాం దాడికి తగిన నివాళి
‘ఆపరేషన్ సిందూర్’పై పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ నుదుటన సిందూరాన్ని తుడిపేసినవారిపై దాడితో న్యాయం జరిగిందని మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దాడులతో మరోసారి దాడి చేయాలంటే ఉగ్రవాదులు వణికిపోతారంటూ బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కొంత ఉపశమనం పొందారు. భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వాలను ప్రశంసించారు. మోదీని అడగండి అన్నారు.. ఆయన సమాధానం ఇచ్చారు: హిమాన్షి నర్వాల్ ఆపరేషన్ సిందూర్‌ను పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్వాగతించారు. ‘నా పెళ్లి జరిగి ఆరు రోజులే అయింది.. మమ్మల్ని వదిలేయండని ఉగ్రవాదులను వేడుకున్నా. కానీ ఉగ్రవాదులు మాత్రం ‘మోదీని అడగండి’ అని బదులిచ్చారు. ఈ రోజు మోదీ, మన సైన్యం వారికి సమాధానం చెప్పారు’ అని హిమాన్షి వ్యాఖ్యానించారు.బాధితులకు సరైన నివాళి: ప్రగతి జగ్దాలే ‘ఆపరేషన్ సిందూర్’ పహల్గాం దాడిలో మరణించిన వారికి సరైన నివాళి అని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన పుణేవాసి సంతోష్ జగ్దాలే భార్య ప్రగతి జగ్దాలే అభివరి్ణంచారు. ‘మా సిందూరాన్ని ఉగ్రవాదులు తుడిచిపెట్టేశారు. మన సాయుధ దళాలు పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినందుకు సంతోషిస్తున్నా. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని నాకు తెలుసు’’అని ఆమె వ్యాఖ్యానించారు.ప్రతీకారం తీర్చుకున్నాం..: సంగీతా గన్బోటే ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని పహల్గాం దాడిలో మరణించిన మరో పుణే వాసి కౌస్తుభ్ గన్బోటే భార్య సంగీతా గన్బోటే అన్నారు. ‘‘ఉగ్రదాడికి భారత్ ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందోనని మేమంతా ఎదురు చూశాం. ఈ రోజు ఆపరేషన్ సిందూర్‌తో భారత సాయుధ దళాలు పహల్గాంలో పిరికిపంద దాడికి ధీటైన సమాధానం ఇచ్చాయి’’అని తెలిపారు. ఇదే నిజమైన నివాళి: అషన్య ద్వివేది ఉగ్రవాదులు భవిష్యత్తులో అమాయకులపై ఎలాంటి దాడులకు పాల్పడకుండా ఆపరేషన్ సింధూర్ బుద్ధి చెప్పిందని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కాన్పూర్ వాసి శుభమ్ ద్వివేది భార్య అషన్య సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇదే నా భర్తకు, పహల్గాం దాడిలో మరణించిన వారికి నిజమైన నివాళి. నా భర్త ఎక్కడున్నా ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘పహల్గాం’ఉగ్రవాదులను కూడా అంతమొందించాలి: జెన్నీఫర్ ఆపరేషన్ సిందూర్ బాగుందని, కానీ.. తన భర్తను చంపిన నలుగురు ఉగ్రవాదులను కూడా అంతమొందించాలని పహల్గాం దాడిలో మృతి చెందిన సుశీల్ నథానియేల్ భార్య జెన్నీఫర్ అన్నారు. ఒక జంతువు కూడా చేయని పనిని ఆ నలుగురూ చేశారని, వారు కూడా అదే శిక్షను పొందాలని, నలుగురూ చనిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. నా కుమారుడి హత్యకు ప్రతీకారం తీరింది: పోనీవాలా ఆదిల్ తండ్రి హైదర్ షాఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడులు తన కుమారుడి హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాయని పహల్గాం ఉగ్రదాడి సమయంలో పర్యాటకులను కాపాడుతూ ప్రాణాలు అరి్పంచిన పోనీవాలా సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తండ్రి హైదర్ షా అన్నారు. ఇప్పుడు తనకు సంతోషంగా ఉందన్నారు. తన సోదరునితోపాటు మరో 25 మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేశారని ఆదిల్ సోదరుడు సయ్యద్ నౌషాద్ వ్యాఖ్యానించారు.ప్రాణాల విలువ ఇప్పుడు తెలిసొస్తుంది: ప్రియదర్శిని ఆచార్య ప్రాణాల విలువేంటో ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసొస్తుందని పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశాకు చెందిన ప్రశాంత్ సత్పతి భార్య ప్రియదర్శని ఆచార్య అన్నారు. చర్యలు తీసుకుంటామని భర్త మృతదేహం వద్ద ఆర్మీ సిబ్బంది తనకు హామీ ఇచ్చారని, ఈరోజు అది చేసి చూపించారని సంతోషం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమికొట్టాలని, ఈ భూమ్మీద ప్రజలు స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేవారు. సరైన నిర్ణయం: మంజునాథ్ రావు తల్లి సుమతి ఆపరేషన్ సిందూర్‌తో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని పహల్గాంలో హత్యకు గురైన కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ రావు తల్లి సుమతి అన్నారు. అమాయకులకు ఏమీ జరగకూడదని, అణచివేతకు, దౌర్జన్యాలకు పాల్పడేవారిని వదిలిపెట్టకూడదని చెప్పారు. ఎంతోమంది నుదుటి తిలకాన్ని చెరిపేసినవారిని తుదముట్టించడానికి ఆపరేషన్ సింధూర్ సరైనదని పహల్గాం దాడిలో మరణించిన బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ తండ్రి చెన్నవీరప్ప అన్నారు. కొంత ఉపశమనం: ఆరతి ఆపరేషన్ సిందూర్ బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని పహల్గాం దాడిలోమృతి చెందిన కొచి్చకి చెందిన ఎన్ రామచంద్రన్ కుమార్తె ఆరతి ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను సంతృప్తిగా ఉన్నాను. నా దివంగత తండ్రి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు. విడిచిపెట్టాలంటూ మా మేనమామలు ఉగ్రవాదులను వేడుకున్నారు. కానీ వారు కనికరం చూపలేదు. వారిని కాల్చి చంపారు’అంటూ దాడి రోజును గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలి: బాధిత కుటుంబాలు ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టేంతవరకూ దాడులు కొనసాగించాలని పహల్గాం దాడిలో మరణించిన పశి్చమబెంగాల్ వాసులు సమీర్ గుహా, బితాన్ అధికారి కుటుంబీకులు కోరారు. పాకిస్తాన్ తుడిచిపెట్టుకుపోయే వరకు ఆ దేశంపై చర్యలు కొనసాగించాలని ఉగ్రదాడిలో భర్త యతీష్ పర్మార్, కుమారుడు స్మిత్‌లను కోల్పోయిన గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన కాజల్ బెన్ పర్మార్ ప్రభుత్వాన్ని కోరారు. పాక్‌పై భారత్ చర్య పట్ల తనకు సంతృప్తిగా ఉందని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సూరత్‌కు చెందిన శైలేష్ కలతియా భార్య శీతల్ బెన్ కలతియా చెప్పారు. హిందువులు, ముస్లింల పేరుతో నా భర్తను, ఇతరులను కాల్చి చంపిన ప్రజలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం ఏం చేసినా సరేనన్న శీతల్‌బెన్.. ప్రభుత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. -
ముష్కరులపై తిరుగులేని అస్త్రాలు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ముష్కరుల భరతం పట్టడానికి భారత సైన్యం అత్యాధునిక క్షిపణులు ప్రయోగించింది. స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైళ్లు, హ్యామర్ క్షిపణులను రంగంలోకి దించింది. వీటిని రఫేల్ యుద్ధ విమానాల నుంచి ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కచ్చితత్వంతో లక్ష్యాలపై దాడులు చేయడంలో స్కాల్ప్ క్షిపణులు పేరుగాంచాయి. వీటిని స్టార్మ్ షాడో అని కూడా అంటారు. పగటిపూట, రాత్రిపూట మాత్రమే కాకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయోగించేలా ఉండడం వీటి ప్రత్యేకత. సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. స్కాల్ప్ మిస్సైల్స్ రేంజ్ 450 కిలోమీటర్లు. జీపీఎస్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ వల్ల గురి తప్పదు. యూరోపియన్ కన్సార్టియం ఎంబీడీఏ ఈ క్షిపణులను తయారు చేసింది. దృఢమైన బంకర్లు, ఆయుధాగారాలను ధ్వంసం చేయడానికి ఇవి చక్కగా తోడ్పడతాయి. గత ఏడాది ఉక్రెయిన్ సైన్యం ఇలాంటి క్షిపణులనే తొలిసారిగా రష్యాపై ప్రయోగించింది. స్కాల్ప్ మిస్సైల్ 450 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. తక్కువ ఎత్తులో ప్రయోగించగల వీలుంది కాబట్టి శత్రువుల నిఘా వ్యవస్థలు వీటిని గుర్తించడం కష్టం. -
Khawaja Asif: పూర్తిస్థాయి యుద్ధం వద్దు
ఇస్లామాబాద్: భారత్‌తో పూర్తిస్థాయి యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ బుధవారం చెప్పారు. పూర్తిస్థాయి యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత్–పాక్ మధ్య మొదలైన ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయని, అది తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. పరిస్థితి మారిపోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఉద్రిక్తతలు నివారించుకుందామని భారత్‌కు విజ్ఞప్తి చేశారు. భారత్‌తో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. భారత్ వెనక్కి తగ్గితే తాము సైతం వెనక్కి తగ్గి ఉంటామని సూచించారు. యుద్ధం ఇంకా కొనసాగడం మనకు మేలు చేయదని చెప్పారు. భారత్ మొండిగా ముందుకెళ్తే యుద్ధం చేయడం తప్ప తమకు మరో మార్గ లేదని ఖవాజా అసిఫ్ స్పష్టంచేశారు. ఆయుధాలు వదిలేసి భారత్‌కు లొంగిపోలేం కదా? అని వ్యాఖ్యానించారు. -
Operation Sindoor: అజార్ కుటుంబసభ్యులు హతం
లాహోర్: పాకిస్తాన్‌లోని బహావల్పూర్ నగరంలో భారత్ జరిపిన దాడుల్లో ఉగ్రసంస్థ జైషే మొహహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుటుంబంలో పది మంది హతమయ్యారు. ఈ వివరాలను స్వయంగా ఆయనే పాకిస్తాన్ మీడియాకు వెల్లడించినట్లు సంబంధిత ప్రకటన పేర్కొంది. బహావల్పూర్లోని జామియా మసీద్ సుభాన్ అల్లాహ్ శిబిరం సముదాయంపై భారత్ జరిపిన క్షిపణి దాడిలో అజార్ సోదరి, ఆమె భర్త, అజార్ మేనల్లుడు, అతని భార్య, మరో మేనల్లుడు, ఉమ్మడి కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు చనిపోయారు. వీరితోపాటే అజార్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అతని తల్లి, మరో ఇద్దరు వ్యక్తులూ మరణించారు. ఈ దాడిలో గాయపడిన వారిని దగ్గర్లోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. 1999లో ఐసీ–814 విమానాన్ని హైజాక్ చేశాక దానిని విడిచిపెట్టాలంటే అజార్‌ను వదిలేయాలని హైజాకర్లు డిమాండ్‌చేయడం, తప్పని పరిస్థితుల్లో అజార్‌ను జైలు నుంచి వదిలేయడం తెల్సిందే. విడుదలైన నాటి నుంచి అజార్ పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలను ఉధృతం చేశాడు. సుభాన్ శిబిరం అలియాస్ ఉస్మానో అలీ క్యాంపస్‌గా పిలుచుకునే ఈ ప్రాంగణాన్ని జైషే ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయంగా అజార్ వినియోగించుకుంటున్నాడు. 18 ఎకరాల ఈ ప్రాంతం నుంచే జైషే ఉగ్రసంస్థలోకి కొత్త వాళ్ల రిక్రూట్మెంట్లు, విద్వేష బోధన, శిక్షణ, నిధుల సేకరణ తదితర కార్యకలాపాలు కొనసా గుతుంటాయి. 2019 మేలో అజార్‌ను ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019 ఏప్రిల్ తర్వాత అజార్ పెద్దగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. బహావల్పూర్లోనే ఉంటున్నట్లు గతంలోనే నిఘా సమాచారం భారత్‌కు అందింది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2000లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడులకు అజార్ సూత్రధారి అని తెలుస్తోంది. -
ప్రతిదాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరింతగా పెచ్చరిల్లకుండా చూసుకుంటూనే సరైన రీతిలో ప్రతీకార చర్యలు చేపట్టామని ప్రపంచ దేశాలకు భారత్ స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో దాడి వివరాలను మీడియాకు వెల్లడించారు. తొలుత విక్రమ్ మిస్రీ మాట్లాడారు. ‘‘ ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందుకు ఈడ్చుకురావాల్సిన అత్యావశ్యక పరిస్థితుల్లో ఈ దాడులు చేయాల్సి వచ్చింది. తమ భూభాగంలో ఉగ్ర వ్యవస్థపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా మేం ‘బాధ్యతాయుతమైన’ దాడులు చేశాం. పహల్గాం ఉదంతం తర్వాత సైతం మరోసారి భారత్‌లో దాడులతో తెగించేందుకు ఉగ్రసంస్థలు కుట్రలు పన్నినట్లు విశ్వసనీయ నిఘా సమాచారం అందటంతో ముందస్తుగా మెరుపుదాడులు చేశాం. పౌర, జనావాసాలకు ఏమాత్రం హాని కలగకుండా కేవలం ఉగ్రవాదుల మౌలికవసతులే లక్ష్యంగా దాడులు జరిపాం. సీమాంతర దాడులు, సీమాంతర చొరబాట్లను నిరోధించడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాడులు కొనసాగాయి. బైసారన్‌లో హేయమైన ఉగ్రదాడి జరిగింది. అమాయకులను తమ కుటుంబసభ్యుల కళ్లెదుటే తలపై గురిపెట్టి కాల్చిచంపారు. దీంతో కుటుంసభ్యుల్లో అంతులేని విషాదం, భయం అలుముకున్నాయి. భారత్ అదే స్థాయిలో ఉగ్రవాదులకు దీటైన సమాధానం చెప్పదల్చుకుంది’’ అని మిస్రీ స్పష్టంచేశారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఇష్టంలేకే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కోట్ల మంది పర్యాటకులతో వృద్ధిబాటలో పయనిస్తున్న కశ్మీర్ ఆర్థికవ్యవస్థను ఉగ్రవాదులు కూలదోయాలనున్నారు. ప్రత్యేకంగా హిందువులను చంపేసి కశ్మీర్ లోయలో, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూశారు. కానీ భారతీయులు వీళ్ల నమ్మకాన్ని వమ్ముచేశారు. ఈ విషయంలో మన ప్రజలను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే’’ అని మిస్రీ అన్నారు. నారీశక్తి.. నాయకత్వం ‘ఆపరేషన్ సిందూర్’ దాడి వివరాలను ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వివరించడం అక్కడి వారందర్నీ ఆశ్చర్యపరిచింది. భారత్ ఏఏ ప్రాంతాలపై దాడి చేసిందనే పూర్తి వివరాలను భారత ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషి, భారత వాయుసేన తరఫున వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు మీడియాకు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), పాకిస్తాన్‌లోని ఏఏ ప్రాంతాల్లో ఏ విధంగా భారత్ దాడులు చేసిందో ఈ అధికారిణులు ఇద్దరూ సవివరంగా చెప్పారు. ధైర్యసాహసాలతో దాడులు చేసిన వైనాన్ని వనితలతో చెప్పించడం వెనుక భారత సర్కార్ దౌత్య పాటవం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లింగవివక్షకు తావులేకుండా కీలక సమయాల్లోనూ భారత్ సమానత్వానికి, మహిళా సాధికారతకు జై కొడుతుందని ఈ మీడియా సమావేశంలో భారత్ మరోసారి చాటిచెప్పిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. సోఫియా ఖురేషి ప్రస్తుతం ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో కల్నల్‌గా ఉన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా ప్రస్తుతం హెలికాప్టర్ పైలట్‌గా సేవలందిస్తున్నారు. ఖురేషీ హిందీలో, వ్యోమికా ఇంగ్లిష్ లో మాట్లాడారు. ‘‘ పహల్గాం దాడికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టాం. 9 ఉగ్రస్థావరాలపై దాడులు జరిపాం. గత మూడు దశాబ్దాల్లో పాకిస్తాన్లో ఎన్నో ఉగ్ర స్థావరాలు నెలకొల్పారు. ఇక్కడ రిక్రూట్మెంట్, భారత్‌పై విద్వేషాన్ని నూరిపోసేలా ప్రసంగాలు ఇవ్వడం, శిక్షణ కేంద్రాలున్నాయి’’ అని సోఫియా ఖురేషీ చెప్పారు. ‘‘ ఈ దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీ సంబంధ ప్రాంతాల జోలికి వెళ్లలేదు. అత్యంత కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడులు చేశాం. దాడి ప్రాంత పరిధికి తగ్గట్లుగా సరైన ఆయుధాలను, అనువైన సాంకేతకతను వినియోగించాం. దీని వల్ల లక్ష్యాలను మాత్రమే ధ్వంసంచేశాం. చుట్టుపక్కల ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగలేదు. ముందుగా నిర్ణయించుకున్న భవనాలను మాత్రమే నేలమట్టంచేశాం. ఆ శిబిరాల్లోని ఉగ్రవాదులను హతమార్చాం. లక్ష్యాల ఛేదనలో భారత సాయుధ బలగాల ప్రణాళికా రచన, దాడి, సామర్థ్యాలను ఈ దాడులు మరోసారి చాటిచెప్పాయి. ఇకమీదట పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచుతూ దాడులు చేయాలని చూస్తే భారత్ కనీవినీ ఎరుగని రీతిలో దాడులతో విరుచుకుపడుతుందని మరోసారి స్పష్టంచేస్తున్నా. జై హింద్’’ అని వ్యోమికా సింగ్ తన మీడియా బ్రీఫింగ్ను ముగించారు. ఈ ఇద్దరు మహిళాధికారుల మధ్యలో కూర్చొని మీడియాకు వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక కశ్మీరీ పండిట్. కీలక ప్రెస్మీట్లో ఎవరెవరు వేదికపై ఆసీనులై భారతవాణిని ప్రపంచానికి వినిపించాలనే విషయంలో కేంద్రప్రభుత్వానికి అత్యంత స్పష్టత ఉందని ఈ ముగ్గురిని చూస్తే తెలుస్తోంది. -
Operation Sindoor: పేరు పెట్టింది మోదీనే
న్యూఢిల్లీ: దేశమంతటా ఎక్కడ విన్నా ‘ఆపరేషన్ సిందూర్’ ప్రతిధ్వనులే. అతికినట్టుగా సరిపోయిన ఆ పేరును స్వయంగా ప్రధాని మోదీయే సూచించారు. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని భార్యల ముందే వారిని కాల్చి చంపడం తెలిసిందే. వాళ్లలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షికైతే కనీసం కాళ్ల పారాణి కూడా ఆరలేదు. పెళ్లయిన ఆరు రోజులకే నూరేళ్లూ నిండిన భర్త మృతదేహం వద్ద ఆమె ఆక్రందన అందరినీ కలచివేసింది. ఉగ్రవాదులు అమాయక మహిళల నుదుటి సిందూరాన్ని తుడిపేసినందున ప్రతీకార చర్యకు ఆ పేరే బాగుంటుందని సూచించినట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి. దాడుల విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ఆ యన, ఆపరేషన్‌ను ఆద్యంతం పర్యవేక్షించారు. కేబినెట్ అభినందనలుప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం కీలక సమావేశాలు జరిగాయి. తొలుత కేంద్ర కేబినెట్, అనంతరం భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీ అయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌ను ముక్త కంఠంతో అభినందిస్తూ కేబినెట్ తీర్మానం ఆమోదించింది. మన సైన్యం దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. దాడులు జరిపిన తీరును కొనియాడారు. మరోవైపు కేంద్రం గురువారం ఉదయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. -
Operation Sindoor: ఉగ్ర తండాలపై 'రక్త సిందూరం'
అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సిందూరం వారి పాలిట రక్తసిందూరమే అయింది. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్‌కు, దాని ప్రేరేపిత ఉగ్ర ముఠాలకు తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్ర దాడికి భారత్ అంతకంతా బదులు తీర్చుకుంది. పాక్, పీఓకేల్లోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. లష్కరే, జైషే వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి ‘ఆపరేషన్ సిందూర్’ను దిగి్వజయంగా పూర్తి చేసింది. ‘జైహింద్’ అంటూ పహల్గాం మృతులకు ఘనంగా నివాళులు అర్పించింది.న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి పక్షం రోజుల్లోనే భారత్ బదులు తీర్చుకుంది. అమాయక పర్యాటకులను పాశవికంగా పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముష్కరులకు జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేరి్పంది. వారిని ప్రపంచం అంచుల దాకా వేటాడైనా కలలో కూడా ఊహించనంత కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ప్రతిజ్ఞను సైన్యం దిగి్వజయంగా నెరవేర్చింది. ప్రతీకార దాడుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్ సారథ్యంలోని జైషే మహ్మద్, హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తొయిబాతో పాటు హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్ర తండాల వెన్ను విరిచింది. వాటి ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను కూడా నేలమట్టం చేసేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట 25 నిమిషాల దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించాయి. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్‌తో వైమానిక దళం, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులతో ఆర్మీ ద్విముఖ వ్యూహంతో ఏక కాలంలో దాడులకు దిగాయి. అత్యాధునిక స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ ప్రెసిషన్ బాంబులు, గైడెడ్ బాంబ్ కిట్లు, ఆత్మాహుతి డ్రోన్లతో 9 ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. వీటిలో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండగా నాలుగు స్వయానా పాక్ గడ్డ మీదే ఉండటం విశేషం! బాలాకోట్ దాడుల మాదిరిగా పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మన ఎయిర్‌ఫోర్స్ అమ్ములపొదిలోని అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు సరిహద్దులకు ఇవతలి నుంచే అరగంట లోపే పని ముగించేశాయి. అర్దరాత్రి 1:05కు మొదలైన దాడులు 1:30కు ముగిశాయి. ఆ వెంటనే 1:44 గంటలకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘కాసేపటి క్రితం ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. పాక్, పీఓకేల్లో నుంచి భారత్‌పై ఉగ్ర దాడులకు వ్యూహరచన చేసిన ఉగ్రవాద మౌలిక వ్యవస్థలపై దాడులు చేశాం. ఉద్రిక్తతలకు తావులేని రీతిలో, పూర్తి కచ్చితత్వంతో కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. పాక్ సైన్యాన్ని, సైనిక వ్యవస్థలను, పౌరులను ఏ మాత్రమూ లక్ష్యం చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, దాడిలో ఆ మేరకు పూర్తి సంయమనం పాటించాం’’ అని వెల్లడించింది. ‘‘ఈ రోజు మనం చరిత్ర సృష్టించాం. భారత్ మాతా కీ జై’’ అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘పహల్గాం బాధితులకు న్యాయం జరిగింది. జైహింద్’’ అని సైన్యం పేర్కొంది. దాడుల వీడియోను ఎక్స్‌లో ఉంచింది. మృతుల్లో జైషే చీఫ్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు. దీన్ని అజర్ కూడా ధ్రువీకరించాడు. జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో వారితో పాటు తన నలుగురు సన్నిహిత సహచరులు కూడా మరణించినట్టు చెప్పుకొచ్చాడు. పాక్ ప్రేరేపిత ఉగ్ర తండాల పీచమణచేలా అద్భుతంగా సాగిన సైనిక చర్య భారతీయులందరికీ గర్వకారణమంటూ ప్రధాని మోదీ ప్రస్తుతించారు. భారత దాడుల్లో 26 మందే మరణించారని, 46 మందికి పైగా గాయపడ్డారని పాక్ చెప్పుకుంది. సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ తొలుత ప్రగల్భాలకు దిగినా కాసేపటికే దిగొచ్చింది. గట్టి ప్రతి చర్యలు తప్పవంటూ బీరాలు పలికిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ‘ఇప్పటికైనా ఉద్రిక్తతలు పెరగకుండా భారత్ చూస్తే మేమూ సహకరిస్తాం’ అంటూ సాయంత్రానికల్లా మాట మార్చారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో బైసారన్ మైదానంలో 26 మంది పర్యాటకులను లష్కరే ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపడం తెలిసిందే.అద్భుత నైపుణ్యం దాడులపై నిపుణులు సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను అమలు చేసిన తీరును రక్షణ నిపుణులు ఎంతగానో కొనియాడుతున్నారు. ఉగ్ర శిబిరాల పరిసరాల్లోని నివాసాలు తదితరాలకు ఏమాత్రమూ నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాలను మాత్రమే నేలమట్టం చేస్తూ అత్యంత కచ్చితత్వంతో దాడులు జరపడం అద్భుతమని చెబుతున్నారు. ‘‘పాక్ సైనిక స్థావరాలు, కీలక మౌలిక వ్యవస్థల వంటివాటి జోలికే వెళ్లకుండా సంయమనం పాటించడం నిస్సందేహంగా అద్భుతమైన దౌత్య ఎత్తుగడే. తద్వారా ప్రతీకార దాడులకు దిగేందుకు పాక్‌కు ఎలాంటి సాకూ లేకుండా పోయింది. పైగా 9 ఉగ్ర శిబిరాల్లో 4 స్వయానా పాక్ భూభాగంలోనే ఉండటంతో ఆ తండాలను దాయాది ఇప్పటికీ పెంచి పోషిస్తోందని నిర్ద్వంద్వంగా నిరూపణ అయింది. దాంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి ధూర్త దేశంగా మిగిలింది’’ అని వారు వివరించారు. దాడులు చేసిన ప్రాంతాల్లో కొన్ని సరిహద్దుల నుంచి ఏకంగా 100 కి.మీ. లోపల ఉండటం విశేషం. తద్వారా పాక్‌లో ఏ లక్ష్యాన్నైనా, ఎప్పుడైనా అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సత్తా తనకుందని భారత్‌కు మరోసారి నిరూపించింది. 25 నిమిషాలు.. 9 లక్ష్యాలుదాడుల విషయంలో సైన్యం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పక్కాగా వ్యవహరించి అత్యంత విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. నిఘా వర్గాలు పక్షం రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి లష్కరే, జైషే తదితర ఉగ్రవాద సంస్థ శిబిరాలతో పాటు ప్రధాన కార్యాలయాల ఆనుపానులను పక్కాగా సేకరించాయి. వాటి ఆధారంగా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. సరిహద్దులకు ఆవల క్షిపణి నిరోధక వ్యవస్థలు తదితరాలతో కాచుకుని కూచున్న శత్రు సైన్యం అంచనాలకు అందకుండా వ్యవహరించాయి. సరిహద్దులు దాటకుండానే ఆపరేషన్ నిర్వహించాయి. మురిద్కే, బహావల్‌పూర్‌ల్లోని లష్కరే, జైషే ప్రధాన స్థావరాల్లో ఒక్కోచోట కనీసం 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. -
Operation Sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైనికాధికారులు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని, ఉగ్రవాదులను పెంచిపోషించడం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం నమ్మబలుకుతోంది. తమ దేశంలో ఉగ్రవాదుల క్యాంపులే లేవని కబుర్లు చెబుతోంది. అబద్ధాలతో ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టాలని చూస్తోంది. కానీ, పాక్ అసలు రంగు ప్రత్యక్షంగా బయటపడింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం దాడిలో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలు బుధవారం జరిగాయి. పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిక కాశ్మీర్లో ముష్కరుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ సైనికాధికారులు, జవాన్లు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు సైతం పాల్గొనడం గమనార్హం. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాహోర్ సమీపంలోని మురిడ్కేలో ముగ్గురు ఉగ్రవాదులు అబ్దుల్ మాలిక్, ఖలీద్, ముదాస్సిర్‌ల అంత్యక్రియల్లో లష్కరే తోయిబా సభ్యుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ప్రార్థనలు చేశాడు. ఈ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సైనికాధికారులు, పోలీసులు హాజరయ్యారు. పాకిస్తాన్ జాతీయ జెండాతో చుట్టిన ఉగ్రవాదుల శవపేటికలను సైనికాధికారులు, జవాన్లు స్వయంగా మోశారు. ప్రార్థనల అనంతరం ఖననం కోసం మృతదేహాలను ఉగ్రవాదుల స్వస్థలాలకు పంపించారు. పీఓకేలోని ముజఫరాబాద్‌లో జరిగిన అంత్యక్రియల్లోనూ పాక్ అధికారులు హాజరైనట్లు తెలిసింది. -
Jammu and Kashmir: దశాబ్దాలుగా నరమేధమే
అందాల కశ్మీరం ఉగ్రవాదులతో దశాబ్దాలుగా అగ్నిగుండంగా మారింది. 2000 నుంచి అక్కడ జరిగిన దాడులకు 700 మందికి పైగా భద్రతా సిబ్బంది, పౌరులు బలయ్యారు. వాటిలో ముఖ్యమైనవి.. 2000 మార్చి 21: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ టెర్రరిస్టులు చెలరేగిపోయారు. అనంత్‌నాగ్ జిల్లా చట్టీసింగ్పురా గ్రామంలో 36 మంది సిక్కులను కాల్చి చంపారు. ∙ 2000లోనే అమర్నాథ్ యాత్రికులపై పహల్గాం బేస్ క్యాంప్ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 32 మంది మరణించారు. ∙ 2001లో 13 మంది, 2002లో 11 మంది అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ∙ 2001 అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ప్రాంగణంపై జరిగిన ఆత్మాహుతి దాడికి 36 మంది బలయ్యారు. ∙ 2002లో జమ్మూ–శ్రీనగర్ హైవేపై ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు భద్రతా సిబ్బందితో పాటు 19 మంది మరణించారు. ∙ 2003లో పుల్వామా జిల్లా నందిమార్గ్‌లో 24 మంది కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ∙2014: ఉరిలో ఆత్మాహుతి దాడికి దిగి 17 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ∙2015: కథువా పోలీస్ స్టేషన్‌పై దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. ∙2016: ఉరిలో సైనిక క్యాంపుపై దాడికి తెగబడి 18 మంది సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. ∙2017లో అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగొస్తున్న భక్తులపై కాల్పుల్లో 18 మంది మరణించారు. ∙2019: పుల్వామాలో సీఆరీ్పఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడికి 40 మంది జవాన్లు బలయ్యారు. ∙2025 ఏప్రిల్ 22: బైసారన్‌లో 26 మంది పర్యాటకులను కాల్చిచంపారు. -
ఐదు విమానాలు కూల్చేశాం: పాక్ ప్రధాని షరీఫ్
ఇస్లామాబాద్: భారత్ చేపట్టిన వైమానిక దాడులను తమ సైన్యం గట్టిగా తిప్పికొట్టిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. భారత్ చేసే దాడి కోసం పాక్ సైనిక దళాలు ముందుగానే సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. భారత్ దాడి చేయగానే అత్యంత వేగంగా ప్రతిస్పందించాయని అన్నారు. తమ సైన్యం ఐదు భారత యుద్ధ విమానాలను ధ్వంసం చేసిందని తేల్చిచెప్పారు. అయితే, అందుకు ఎలాంటి ఆధారాలు ఆయన చూపలేకపోయారు. షెహబాజ్ షరీఫ్ బుధవారం పాకిస్తాన్ పార్లమెంట్లో మాట్లాడారు. తాజా పరిణామాలను వివరించారు. ఇండియా యుద్ధ ప్రణాళికల గురించి తమ సైనిక దళాలకు ముందస్తుగానే సమాచారం ఉందన్నారు. ఇండియా దాడుల పట్ల పాక్ వైమానిక దళం ప్రతిస్పందన అద్భుతం అని కొనియాడారు. ఇండియాకు సంబంధించిన రఫేల్ జెట్లు సహా ఐదు యుద్ద విమానాలకు కూల్చేసినట్లు ప్రకటించారు. అలాగే రెండు ఇండియన్ డ్రోన్లను సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. గత రాత్రి 80 ఇండియన్ యుద్ధ విమానాలు దాడికి దిగాయని, తమ సైన్యం గట్టిగా బదులివ్వడంతో అవి తోకముడిచాయని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. మాతృభూమిని రక్షించుకోవడానికి తమ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టంచేశారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని చెప్పారు. దర్యాప్తునకు సహకరించాల్సిన భారత ప్రభుత్వం ఆవేశంతో తమపై దాడికి దిగిందని మండిపడ్డారు. భారత్ దాడిని యుద్ధ చర్యగా పరిగణిస్తున్నాం భారత ప్రభుత్వం తమపై యుద్ధం ప్రారంభించిందని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. పాక్‌తోపాటు పీఓకేలో భారత సైన్యం జరిపిన క్షిపణి దాడులను ‘యుద్ధ చర్య’గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. భారత్‌కు తగిన సమాధానం చెప్పే హక్కు తమకు ఉందని స్పష్టంచేశారు. పాకిస్తాన్లో ఐదు చోట్ల భారత సైన్యం దాడులు చేసినట్లు తెలిపారు. ఇందుకు గట్టిగా బదులివ్వక తప్పదని అన్నారు. ఈ మేరకు షహబాజ్ షరీఫ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శత్రువుకు ఎలా బుద్ధి చెప్పాలో తమ సైన్యానికి బాగా తెలుసని ఉద్ఘాటించారు. శత్రువు ఆటలు సాగవని అన్నారు. తమపై హేయమైన దాడులకు పాల్పడినవారిని నెగ్గనిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమ చేతిలో భారత్‌కు ఓటమి తప్పదని పరోక్షంగా హెచ్చరించారు. ఇదిలా ఉండగా, క్షిపణి దాడులను పాక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాఖ్ దార్ ఖండించారు. పాకిస్తాన్ సార్వభౌమతాన్ని దెబ్బతీయడానికి భారత్ కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు. ప్రాంతీయంగా శాంతి ప్రమాదంలో పడిందని, ఇందుకు భారత్ పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. -
భారత్‌ను దెబ్బకొట్టాల్సిందే: పాకిస్తాన్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. భారత్‌ను గట్టిగా దెబ్బకొట్టాల్సిందేనని నిర్ణయానికి వచ్చింది. భారత్‌పై ప్రతీకార చర్యల విషయంలో సైన్యానికి పూర్తిస్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలన్న దానిపై బాధ్యతను సైన్యానికే అప్పగించింది. పాక్ ప్రధానమంత్రి షెహవాజ్ షరీఫ్ నేతృత్వంలో బుధవారం పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎన్ఎస్సీ) సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, సీనియర్ ఆర్మీ అధికారులు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్‌తో పాటు తదనంతర పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. భారత సైన్యం నిర్వహించిన తాజా దాడుల్లో సామాన్య ప్రజలు బలైనట్లు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆరి్టకల్–51 ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసే హక్కు తమకు ఉందని ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. అమాయక ప్రజలను బలితీసుకున్నందుకు భారత్‌పై ప్రతీకారం తప్పదని తేల్చిచెప్పింది. ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టే అధికారాన్ని తమ సైనిక దళాలకు అప్పగించినట్లు వెల్లడించింది. సామాన్యులపై దాడులు సిగ్గుచేటు పాక్‌తోపాటు పీఓకేలో భారత్ దాడులను ఎన్ఎస్సీ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీయాలని చూస్తే సహించబోమని హెచ్చరించింది. భారత్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని, ఇది ముమ్మాటికీ తమపై యుద్ధ ప్రకటనేనని పేర్కొంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం భారత్ దాడిని యుద్ధ చర్యగానే పరిగణిస్తున్నామని వెల్లడించింది. మహిళలు, చిన్నారులు సహా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం అత్యంత హేయం, దారుణం, సిగ్గుచేటు అని మండిపడింది. మానవత్వానికి సంబంధించిన అన్ని నియమాలను భారత సైన్యం ఉల్లంఘించినట్లు ఆరోపించింది. భారతదేశ చట్టవ్యతిరేక చర్యలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని ఎన్ఎస్సీ విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించినందుకు భారత్ దోషిగా పరిగణించాలని స్పష్టంచేసింది. ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయన్న సాకుతో సాధారణ జనావాసాలపై భారత సైన్యం దాడులు చేసిందని ఆక్షేపించింది. ఈ దాడుల్లో మసీదులు సహా పౌర సదుపాయాలు ధ్వంసమయ్యాయని ఆందోళన వ్యక్తంచేసింది. -
Operation Sindoor: ఆ 9 లక్ష్యాలు ఇవే..
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కోసం ఎంపిక చేసిన 9 లక్ష్యాలను పక్కాగా సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం నిర్ణయించుకుంది. ఇవన్నీ ఆరోగ్య కేంద్రాలు తదితర ముసుగుల్లో నడుస్తున్నాయి. వీటిని కచ్చితంగా గుర్తించడం మన నిఘా వర్గాలకు సవాలుగా నిలిచింది. ఈ ఉగ్ర కేంద్రాలు, శిబిరాలను బయటి ప్రపంచం దృష్టి నుంచి దాచి ఉంచేందుకు పాక్ ప్రభుత్వం, సైన్యం అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటాయి. ఇందుకోసం ఎప్పటికప్పుడు వాటి గుర్తింపులు మార్చడం వంటి పనులు చేస్తుంటాయి. పాకిస్తాన్ భూభాగంలో ఉన్నవి (4) 1: మర్కజ్ సుభాన్జైషే మహ్మద్ ప్రధాన స్థావరం. అంతర్జాతీయ సరిహద్దులకు 100 కి.మీ. దూరంలో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో బహావల్పూర్ సమీపంలో నరోవల్ జిల్లా తెహ్రా కలాన్ గ్రామంలో ఉంది. ఉగ్రవాదుల చేరిక, శిక్షణ వంటివి ఇక్కడ జరుగుతాయి. జైషే చీఫ్ మసూద్ అజర్ ఇక్కడినుంచే కార్యకలాపాలు సాగిస్తుంటాడు. భద్రతా దళాలకు చిక్కిన అతన్ని 1999లో జైషే ఉగ్రవాదులు ప్రయాణికుల విమానాన్ని హైజాక్ చేసి విడిపించుకున్నారు. అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ తదితర అగ్ర నేతల నివాసాలు తదితరాలూ ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఇది అస్గర్ కనుసన్నల్లో నడుస్తోంది. సరిహద్దుల గుండా ముష్కరులు చొరబడేందుకు అనువైన ప్రాంతాలను ఇక్కడినుంచే గుర్తించడం, అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సొరంగాలు తవ్వడం జేషేకు నిత్యకృత్యం. అంతేగాక డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు, డ్రగ్స్ వంటివి పంపే లాంచ్‌ప్యాడ్ కూడా ఇదే. 2000లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2001లో పార్లమెంటుపై దాడి మొదలుకుని 2019లో 40 మంది సీఆరీ్పఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల దాకా ప్లానింగ్ జరిగిందిక్కడే. 2: మర్కజ్ తొయిబా‘టెర్రర్ ఫ్యాక్టరీ’గా పేరు పొందింది! నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో లాహర్ సమీపంలో మురిద్కేలో ఉంది. ఇది హఫీజ్ సయీద్ నేతత్వంలో పని చేసే లష్కరే తొయిబా ప్రధాన కేంద్రం. దానికి ఆయువుపట్టు కూడా. 1990లో ఉనికిలోకి వచ్చింది. నిత్యం కనీసం 1,000 మంది రిక్రూట్లకు ఇక్కడ 2 వారాల ప్రాథమిక కోర్సు నడుస్తుంటుంది. అందులో భాగంగా శారీరక, మతోన్మాద శిక్షణ ఇస్తారు. ముంబై ఉగ్ర దాడుల కుట్ర పురుడు పోసుకుంది ఇక్కడే. వాటికి పాల్పడ్డ కసబ్ బృందానికి దౌరా–ఎ–నిబ్బత్ (నిఘా) సంబంధిత శిక్షణ ఇక్కడే ఇచ్చారు. ముంబై దాడుల సూత్రధారులు డేవిడ్ హెడ్లీ, తహవ్వుర్ రాణా కూడా ఇక్కడ శిక్షణ పొందారు. ఇక్కడ ‘అతిథి గృహం’నిర్మాణానికి అప్పటి అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ రూ.10 లక్షలిచ్చాడు. జమ్మూ కశ్మీర్‌తో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల బాంబు పేలుళ్లు లష్కరే పనే. 3: సర్జాల్ అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 6 కి.మీ. దూరంలో సియాల్కోట్లో ఉంది. గత మార్చిలో నలుగురు జమ్మూ కశ్మీర్ పోలీసు సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శిక్షణ పొందింది ఇక్కడే. 4: మెహమూనా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 12 కి.మీ. దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉంది. హిజ్బుల్‌కు కీలక శిక్షణ కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముసుగులో పని చేస్తోంది. జమ్మూలోని కథువా ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కార్యకలాపాలకు ఇది కంట్రోల్ సెంటర్‌గా వ్యవహరిస్తోంది. పఠాన్‌కోట్ వైమానిక బేస్‌పై దాడుల వంటివాటికి ఇక్కడినుంచే వ్యూహరచన జరిగింది. జమ్మూ నగరంలో పలు ఉగ్ర దాడులకు కారకుడైన ఇర్ఫాన్ టండా ఈ కేంద్రానికి సారథి. పీఓకేలో ఉన్నవి (5) 5: అహ్నే హదీత్ (బర్నాలా) క్యాంప్ నియంత్రణ రేఖకు 9 కి.మీ. దూరంలో భీంబర్ వద్ద ఉంది. ఆయుధాల వాడకంతో పాటు అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ) తయారీలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. 150 మంది దాకా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వగలదు. 6: మర్కజ్ తొయిబాలష్కరే తొయిబా ముఖ్య కేంద్రాల్లో ఒకటి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో తాంగ్దార్ సెక్టర్లో ఉంది. కీలక ఉగ్ర శిక్షణకు ఇఎది కేంద్రం. ముంబైపై 26/11 దాడులకు తెగబడ్డ అజ్మల్ కసబ్ ఉగ్రవాద బృందం పూర్తిస్థాయి శిక్షణ పొందింది ఇక్కడే. ఇది 2000లో పుట్టుకొచ్చింది. పాక్ సైనిక, ఐఎస్ఐ అధికారులు ఇక్కడికి నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఏకకాలంలో 250 మందికి పైగా ఉగ్రవాదులు ఉండేందుకు ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. ఇక్కడినుంచి వారు ప్రధానంగా ఉత్తర కశ్మీర్లోకి చొరబడుతుంటారు. కొత్తగా చేర్చుకున్న వారికి మత, ఉగ్రవాద శిక్షణ కూడా ఇక్కడ అందుతుంది. పహల్గాంలో ఉగ్రవాదులపై దాడులకు తెగబడింది ఇక్కడినుంచి చొరబడ్డ ఉగ్రవాదులే! 2024లో కశ్మీర్‌లోని సోన్మార్గ్, గుల్మార్గ్లో భద్రతా బలగాలు, పౌరులపై దాడులు కూడా వారి పనే. 7: గుల్పూర్ క్యాంప్నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో కోట్లిలో ఉంది. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఆపరేట్ చేసే లష్కరే ఉగ్రవాదులకు బేస్. పూంచ్ 2023 దాడులు, 2024లో యాత్రికులపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ఈ శిబిరానికి తరచూ వచ్చి రిక్రూటీలకు మతోన్మాద ప్రసంగాలిచ్చేవాడు. 8: అబ్బాస్ క్యాంప్ నియంత్రణ రేఖకు 13 కి.మీ. దూరంలో కోట్లీలో ఉంది. లష్కరే ఆత్మాహుతి బాంబర్లకు ప్రధాన కేంద్రం. 150 మందికి పైగా ఉగ్రవాదులకు ఏకకాలంలో శిక్షణ ఇచ్చేందుకు వసతులున్నాయి. పూంచ్, రాజౌరీల్లో చొరబాట్లు, ఉగ్ర దాడులకు వ్యూహరచన మొత్తం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక్కడి వ్యవహారాలు చూసేది క్వారీ జరార్. జేషే చీఫ్ మసూద్ సోదరుడైన అస్గర్‌కు సన్నిహితుడు. పలు ఎన్ఐఏ కేసుల్లో జరార్ ప్రధాన నిందితుడు. హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తో పాటు స్నైపర్ దాడులు తదితరాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. 9: సయీద్నా బిలాల్ క్యాంప్జైషే ఉగ్ర శిబిరం. ముజఫరాబాద్‌లో ఉంది. తొలుత ఉగ్ర సామగ్రి నిల్వ కేంద్రం. తర్వాత ఆధునీకరించి ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాల వాడకం, అడవులు, ప్రతికూల పరిస్థితుల్లో సుదీర్ఘకాలం ఉండటం తదితరాల్లో శిక్షణ ఇచ్చే కేంద్రంగా మార్చారు. నిత్యం కనీసం 100 మందికి పైగా ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. పాక్ సైన్యానికి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ వీరికి నేరుగా శిక్షణ ఇస్తుంది! -
అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించే అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల నేపథ్యంలో మనమంతా సైన్యంతో ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని అన్నారు. మీడియా, సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రజల కోసం 24/7 టోల్ ఫ్రీ నంబర్ ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ వెంటనే ఏర్పాటు చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మూడు కమిషనరేట్లకు సంబంధించిన సీసీటీవీలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి. రక్తం, ఆహారం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం రెడ్ క్రాస్తో సమన్వయం చేసుకోవాలి. అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. ఆహార నిల్వలు కూడా తగినంత ఉండేలా చూడాలి. సైబర్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ న్యూస్ ప్రచా రం చేసే వారిపై ఉక్కు పాదం మోపాలి. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలి అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రత పెంచాలి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర కూడా భద్రత పెంచాలి. నగరంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల విషయంలో పోలీస్ విభాగం అప్రమత్తంగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించండి హైదరాబాద్‌లోని ఆర్మీ, నేవీ, వైమానిక కార్యాలయాలు, రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. నగరంలో మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని చెప్పారు. కేంద్ర నిఘా బృందాలతో , రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చంపినా చూస్తూ ఊరుకుంటే ఎలా..? ఐసీసీసీ వద్ద ఎండలో నిలబడిన మీడియాను చూసిన రేవంత్‌రెడ్డి తన వాహనం ఆపి వారితో ముచ్చటించారు. ‘భారత రక్షణ రంగంలో హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం. అన్ని విభాగాలను అప్రమత్తం చేశాం. దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? ’అని వ్యాఖ్యానించారు.సైన్యానికి సెల్యూట్: సీఎం రేవంత్ ఆపరేషన్ సిందూర్‌లో భారత సాయుధ దళాలు సాధించిన విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన సైన్యం దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ‘ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాలకు బలమైన అండగా నిలుస్తున్నా. ఉగ్రవాద నిర్మూలన దిశగా భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరంతో ప్రకటిద్దాం.. జై హింద్..’అని సీఎం తన ‘ఎక్స్’ఖాతాలో పోస్టు చేశారు. నేడు సంఘీభావ ర్యాలీ భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు. -
Operation Sindoor: యుద్ధ స్వరం... ఆ ఇద్దరు
‘ఆపరేషన్ సిందూర్’ ఒక సంచలనమైతే... ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్ చేసిన ఇద్దరు మహిళా సైనికాధికారులు మరో సంచలనం. ఆ ఇద్దరు... చెప్పకనే ఎన్నో చెప్పారు. వారిలో మతాలకతీతమైన జాతీయ సమైక్యత కనిపించింది. ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి జయించే మహిళాశక్తి కనిపించింది. ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం ప్రతీకాత్మకం. ఐక్యత, మత సామరస్యానికి సంబంధించిన శక్తిమంతమైన సందేశాన్ని తెలియజేసేలా ఇద్దరు మహిళా అధికారులు బ్రీఫింగ్‌కు నేతృత్వం వహించాలి అనే నిర్ణయం కూడా ప్రతీకాత్మకమైనదే. ప్రపంచ ఆసక్తి ఇప్పుడు రెండు పేర్లపై కేంద్రీకృతమైంది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్...భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకలుగా కనిపించారు. ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను పంచుకోవడానికి నిర్వహించిన విలేకరుల సమావేశానికి కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ నేతృత్వం వహించిన నేపథ్యంలో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. ‘పహల్గామ్లో ఇరవై ఆరుమందిప్రాణాలను బలిగొన్నారు. ఉగ్రవాద బాధితులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం’ అన్నారు సోఫియా ఖరేషీ. పాక్, పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా దాడి చేసినట్లు ఆమె తెలియజేశారు. సంక్షోభ పరిస్థితుల్లో సైన్యం, ప్రజల మధ్య కమ్యూనికేషన్‌ను కొనసాగించడంలో ప్రొఫెషనల్ ఆఫీసర్స్ పాత్రను వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ వివరించారు.ఆ ఇల్లు సైనిక శిబిరంఅది ఇల్లు అనడం కంటే... చిన్నపాటి సైనిక శిబిరం అంటే బాగుంటుంది! కొట్ట వచ్చినట్లు కనిపించే మిలిటరీ క్రమశిక్షణ ఒకవైపు...‘ఆ యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?’‘ఒక వీర సైనికుడి గురించి చెబుతాను విను..’ ఇలాంటి విశేషాలు మరోవైపు. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఖురేషిది సైనిక కుటుంబ నేపథ్యం. తాత, తండ్రీ సైన్యంలో పనిచేయడమే తాను సైన్యంలో పనిచేయాలనుకోవడానికి కారణం. బలం. ‘మహారాజా షాయాజీరావు యూనివర్శిటీ’లో బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన ఖురేషి 1999 లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భారత సైన్యంలో చేరారు.చరిత్ర సృష్టించి...పుణెలో జరిగిన ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పద్ధెనిమిది దేశాల సైనికులు పాల్గొన్నారు. ఈ విశిష్ట కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు ఖురేషీ. అంతేకాదు.. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పాల్గొన్న 18 బృందాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్.గర్వించదగిన కాలంఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక చర్యల్లో భాగంగా కాంగోలో ఆరేళ్లు పనిచేశారు ఖురేషీ. అక్కడ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణను పర్యవేక్షించారు. ఒకవైపు శాంతిపునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు సేవాకార్యమ్రాలకుప్రాధాన్యత ఇచ్చేవారు.‘ఘర్షణాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన ప్రయత్నాలు నాకు గర్వకారణం’ అంటారు ఖురేషీ.ఖురేషీలోని నాయకత్వ లక్షణాలు, చొరవ, ధైర్యసాహసాలను అప్పటి ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ గుర్తించారు. ‘సైన్యంలో పురుష, మహిళా అధికారులు అనే తేడా లేదు. జెండర్ప్రాతిపదికన కాకుండా బాధ్యతను భుజాన వేసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వల్లే ఆమె ఎంపిక జరిగింది’ అన్నారు రావత్. భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ పరాక్రమ్’లో ఖురేషీ కీలక పాత్ర పోషించారు. ఆమె ధైర్యసాహసాలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసలు అందుకున్నారు. కుటుంబ నేపథ్యం ఖురేషీకి సైన్యంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఇచ్చింది. విద్యానేపథ్యం విమర్శనాత్మక ఆలోచన దృష్టిని ఇచ్చింది. సమస్య పరిష్కారానికి శాస్త్రీయ దృష్టిని అందించింది. ఆకాశ పుత్రికఆకాశంలో కనిపించే విమానాలను చూస్తూ అందరు పిల్లల్లాగే చప్పట్లు కొడుతూ తెగ సంతోషించేది వ్యోమికా సింగ్. ఆ సంతోషానికి లక్ష్యం కూడా తోడైంది. ఆకాశంలో దూసుకు పోవాల్సిందే!‘నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడే పైలట్ కావాలనుకున్నాను. ఆకాశాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. మా పేర్ల అర్థాల గురించి క్లాసులో మాట్లాడుకుంటున్నప్పుడు వ్యోమిక... నీ పేరుకు అర్థం ఆకాశ పుత్రిక అని అరిచారో ఎవరో. దీంతో పైలట్ కావాలనే కోరిక మరింత బలపడింది’ అని ఒక టీవీ షోలో బాల్య జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు వ్యోమికా సింగ్.ఎన్సీసీ పునాదిపై...ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు ఎన్సీసీలో చేరిన వ్యోమికాకు సైనిక క్రమశిక్షణ అలవడింది. భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్‌గా తన కలను నిజం చేసుకున్న వ్యోమిక 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబంలో సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తిగా వ్యోమిక గుర్తింపు పొందారు.జమ్మూకశ్మీర్, ఈశాన్యప్రాంతాలతో సహా అత్యంత కఠినమైన భూభాగాల్లో చేతక్, చీతాలాంటి హెలికాప్టర్లు 2,500 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆమెకు ఉంది. 2021లో 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మణిరంగ్ పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు. కమాండర్ వ్యోమికా సాహసాన్ని, అంకితభావాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌తో సహా సీనియర్ డిఫెన్స్ అధికారులు గుర్తించారు. 2020లో అరుణాచల్‌ప్రదేశ్‌లో కీలక రెస్క్యూ ఆపరేషన్‌కు నేతృత్వం వహించి, విపత్కర పరిస్థితుల్లో ఉన్న పౌరులను సురక్షితప్రాంతాలకు తరలించారు. ఈశాన్య భారతంలో వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా చెరగని చిరునవ్వు ఆమె సొంతం. ప్రకృతి కల్లోలాలకు వెరవకుండా బాధితులకు అండగా ఉండడం ఆమె నైజం. ఆ ఇద్దరు... ది స్ట్రెంత్ ఆఫ్ ఇండియాకల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ పార్టీల నేతలు వీరిని అభినందించారు. ‘ఇది కేవలం బ్రీఫింగ్ మాత్రమే కాదు. సాహసోపేతమైన ప్రకటన. ప్రతి యుద్ధంలో, ప్రతి మిషన్‌లోనూ మహిళలు ముందుండి నడిపిస్తారు’ అని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ‘విలేకరుల సమావేశంలో ఎవరు ఉన్నారో గుర్తుంచుకోండి. వారు... ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భుజం భుజం కలిపి ఒకే జెండాను మోస్తున్నారు. ఇది భారతదేశం. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఐక్యత, శాంతి ముందు విద్వేషానికి మాటలు ఉండవు’ అని యాక్టివిస్ట్, రైటర్ గుర్మెహర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
గతానికి భిన్నంగా...
ఏప్రిల్ నెల చివరలో జమ్మూ–కశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది నిరాయుధులను దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా, మే 7 ఉదయం పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న తొమ్మిది ప్రదేశాలపై భారత సైన్యం దాడి చేసింది. పహల్గామ్ ఘాతుక చర్యకు సమాధానం ఇచ్చి తీరుతామని దేశ రాజకీయ నాయకత్వం స్పష్టం చేయడంతో సైనిక దాడి తప్పదని తేలిపోయింది. అయితే, పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు, కానీ సరిహద్దు రేఖలు మారుతున్నాయని సూచించే లక్షణాలు ‘ఆపరేషన్ సిందూర్’లో ఉన్నాయి.సరిహద్దును దాటి...పాకిస్తాన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చివరి ప్రధాన దాడి 2019 ఫిబ్రవరిలో చోటు చేసు కుంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌ను అప్పుడు భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ కేంద్ర బిందువైన పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రదేశాలపై భారతీయ సైన్యం దాడికి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత,భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. దక్షిణ పంజాబ్‌లోని బహావల్పూర్లో జైష్–ఎ–మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. పంజాబ్‌లోని మరొక ప్రదేశం మురీద్కే! ఇక్కడ లష్కరే తోయిబా చాలా కాలంగా ఉనికిలో ఉంది. అయితే కశ్మీర్లో వాస్తవ సరిహద్దును గుర్తించే ఎల్ఓసీకీ, పాకిస్తానీ పంజాబ్‌కు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్థిరపడిన అంతర్జాతీయ సరిహద్దు. సూటిగా చెప్పాలంటే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు చెందిన భౌగోళిక ప్రాంతం ఇప్పుడు విస్తరించింది. ప్రతీకారం తీర్చుకునే విషయంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశం కూడా భారత్ లక్ష్యాలకు దూరంగా లేదని తాజా దాడులు స్పష్టంగా సందేశమిస్తున్నాయి.1971 నాటి యుద్ధంలోని ముఖ్యాంశాలలో ఒకటి, భారత సైన్యంలోని త్రివిధ బలగాలూ పాల్గొనడమే! నాటి యుద్ధంలో పూర్తి విజయం సాధించడానికి త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. ఆపరేషన్ సిందూర్‌లో కూడా మూడు దళాలూ పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. వనరులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సైన్యం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లకు ఇది శుభ సూచకం.నిజానికి భారతదేశం నుండి ప్రతిస్పందన అని వార్యం అయింది. అయినా భారీ స్థాయి దళాల కదలికల ద్వారా భారత్ ప్రతిస్పందన ఉంటుందని చెప్పే సూచన లేవీ లేవు. పాకిస్తాన్ వైపు మాత్రం వారు ప్రతిస్పందన కోసం సిద్ధమవుతున్నప్పుడు గణనీయ స్థాయిలో దళాల కదలిక కనిపించింది. అదే సమయంలో భారత్ సంయమన మార్గాన్ని ఎంచుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడుల్లో ఏవీ పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడిని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకే పరిమితం చేశారు. దాడుల తర్వాత కూడా ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో భారతదేశం తీవ్ర స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా సూచించింది.ప్రతిదాడి చేయడానికి ముందు, భారతదేశం తాను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి గణనీయమైన స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించింది. చైనా మాత్రమే దీనికి మినహాయింపు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రధాన శక్తులు వాణిజ్య యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో, ఉక్రెయిన్‌లో దీర్ఘకాలిక సంఘర్షణ సవాలును ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఒక స్థాయికి మించి పెరగకూడదని అవి ఆశిస్తున్నాయి.వికసిత భారత్, రుణ సంక్షోభ పాక్‌భారతదేశం మూడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంతో పోరాడు తోంది. ఈ క్రమంలో రెండు దేశాలలోనూ, వేర్వేరు ఆర్థిక పథాల్లో అభివృద్ధి జరుగుతోంది. భారత్ తన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 1991 నాటికి, పాకిస్తాన్ తలసరి జీడీపీ భారత్ కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2023లో పాకిస్తాన్ తలసరి జీడీపీ 1,365 డాలర్లు కాగా, భారత్ జీడీపీ 82 శాతం ఎక్కువగా 2,481 డాలర్ల వద్ద ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక పథాలు వాటి వ్యూహాత్మక ఎంపికలను ప్రభావితం చేశాయి.భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ‘బ్రెగ్జిట్’ తర్వాత అది బ్రిటన్‌తో చేసుకున్న అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవలే ముగించింది. మరోవైపు, పాకిస్తాన్ ఒక రుణ సంక్షోభం నుండి మరొక రుణ సంక్షోభానికి గురవుతూ, ఐఎమ్ఎఫ్ ఆపన్న హస్తం కోసం విజ్ఞప్తి చేస్తోంది. అది దాదాపు చైనా కాలనీగా మారింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఎంచుకున్న ఎంపికలనూ, పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సార్వభౌమాధికారపు నిరంతర బలహీనతనూ పరిశీలించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ అసీమ్ మునీర్‌కు అది ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు.సంజీవ్ శంకరన్ వ్యాసకర్త ‘మనీ కంట్రోల్’ ఒపీనియన్స్–ఫీచర్స్ ఎడిటర్ -
దృఢసంకల్పంతో...
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ తగిన ప్రతీకారం తీర్చుకుంది. కుటుంబాల విచ్ఛిన్నమే లక్ష్యంగా పురుషులను మాత్రం ఎన్నుకుని... వారి మతం అడిగి మరీ భార్యల ఎదుటే భర్తలను ఉగ్రవాదులు చంపిన వైనం దేశాద్యంతం ప్రకంపనలు సృష్టించింది. ఇది కేవలం ఒక హింసాత్మక ఘటన కాదు. మానసిక యుద్ధ తంత్రం. ఈ విషయంపై భారత్ ఆచితూచి స్పందించింది. ఉద్రేకాలకు పోలేదు. కచ్చితమైన, వ్యూహాత్మకమైన, సమన్వయ యుతమైన మిలిటరీ ప్రతిచర్యకు దిగింది. నిఘా వర్గాల అంచనాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి మరీ ‘ఆప రేషన్ సిందూర్’ను నిర్వహించారు. పహల్గామ్ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదు లకు, పాకిస్తాన్‌లోని వారి గురువులను రూఢి చేసుకునేంతవరకూ అత్యంత ఓరిమితో వ్యవహరించారు. మిలటరీ భాషలో ఈ ఓరిమిని క్రమశిక్షణ అనాలి. మరోవైపు పాకిస్తాన్ యథావిధిగా పహల్గామ్ దాడి తరువాత సరిహద్దుల్లో తన పదాతి దళాలను పెంచుకుని భారత మిలిటరీ ప్రతిచర్య కోసం ఎదురు చూసింది. అయితే భారత్ ఈసారి తన వ్యూహాన్ని మార్చుకున్న విషయం పాక్‌కు తెలియలేదు.బయటకు కనిపించని అసలు వ్యూహంఏదో జరగబోతోందన్న సంకేతాలు రెండు వారాలుగా కనిపిస్తున్నా కచ్చితంగా ఏమిటన్నది చివరి క్షణం వరకూ బయటపడలేదు. ప్రధాని కేబినెట్ సమావేశాలు, ప్రతిపక్ష నేతలతోనూ మంతనాలు జరిపారు. భద్రతాదళ ఉన్నతాధికారులు, రక్షణ శాఖ మంత్రి అందరూ చర్చల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్కూ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరిపారు. బయటకు కనిపించిన ఈ వ్యూహం వెనుక అసలైన ప్రతీకార చర్య చోటు చేసుకుంది. అణుబాంబుల బెదిరింపులతో మన ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు జరిగిన విఫల యత్నాన్ని కూడా భారత్ అధిగమించింది. భారత రక్షణ దళాలు నియంత్రణ రేఖకు (ఎల్ఓసీ) ఆవల తొమ్మిది కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. ఇది భారత సత్తాను, కృత నిశ్చయాన్ని చాటే ప్రణాళికా బద్ధమైన ప్రతిదాడి. యుద్ధాల్లో ప్రతీకాత్మకతకు ప్రాముఖ్యం ఉంటుంది. మానసిక యుద్ధాల్లో మరీ ఎక్కువ. అందుకే అనూహ్యంగా ఇద్దరు మహిళా సైనికాధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి ఆపరేషన్ సిందూర్ గురించిన అధికారిక ప్రక టన వెలువరించారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్య దర్శితో ఇద్దరు మహిళ సైనికాధికారులు పాల్గొనడం పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటికీ బలమైన సంకేతం పంపినట్లు అయ్యింది. భారత్‌కు తన గౌర వాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు అన్న సందే శాన్ని స్పష్టం చేసింది. అయితే, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఉంది. భారత్ వీటికి అంతే స్థాయిలో ప్రత్యుత్తరమూ ఇస్తోంది. దురదృష్టవశాత్తూ ఈ క్రమంలో భారత పౌరులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఒకటి మాత్రం వాస్తవం: నిష్క్రియతో శాంతిని పొందలేమ న్నది అందరూ గుర్తించాలి.మునీర్‌పై విమర్శలుఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీమ్ మునీర్‌పై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. పాకిస్తాన్ భద్రతాంశాల విశ్లేషకురాలు అయేషా సిద్దిఖా ఆయన్ని ‘ఆలోచన లేని జనరల్’గా అభివర్ణించారు. మతానికి మాత్రమే కట్టుబడిన జనరల్‌కు వాస్తవిక కార్యాచరణ ప్రణాళికల గురించి ఏమీ తెలియదని విమర్శించారు. జనరల్ జియా–ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్‌ల మాదిరిగా తానూ ఏదో పేరు సంపాదించాలన్న తాపత్రయం ఆయనలో కనబడుతోంది. జియా, ముషారఫ్ ఇద్దరూ విభ జనకు ముందు భారత్‌లో పుట్టిన వారే. వాళ్లు సిద్ధాంతానికి వ్యూహాన్ని జోడించగల సమర్థులు. మునీర్ మతాన్ని, మాటలనే నమ్ముకున్నారు.ప్రస్తుతం జరుగుతున్నది రెండు సరిహద్దుల మధ్య యుద్ధం కాదు. సైద్ధాంతికమైనది. త్యాగమంటే ఏమిటో చెప్పేది. నష్టానికి దేశాలు న్యాయం పొందడం ఎలాగో చెప్పేది. ఆపరేషన్ సిందూర్ అన్న పేరు కేవలం ప్రతీకాత్మకమైంది మాత్రమే కాదు. భారతీయ సంప్రదాయంలో కుంకుమ బొట్టుకు ఉన్న ప్రాశస్త్యం తెలియంది కాదు. పహల్గామ్లో ఉగ్రవాదులు కుటుంబంలోని భర్తలే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అందుకే మహిళల నుదుటి బొట్టును కాపాడేందుకే ఈ దాడులు చేసిందన్న సంకేతాన్ని భారత్ పంపింది. బెదిరింపులు, బుల్లెట్లు భారత సంకల్పాన్ని దెబ్బతీయలేవని, అణ్వాయుధాల పేరుచెప్పినా ఇక వదిలేది లేదన్నది ఆపరేషన్ సిందూర్ ఇచ్చే స్పష్టమైన సందేశం. మరి ఈ దాడులకు పాక్ స్పందించకుండా ఉంటుందా? కచ్చితంగా స్పందిస్తుంది. కాకపోతే ఎప్పుడు, ఎలా అన్నది వేచి చూడాలి. ఇందుకు భారత రక్షణ దళాలు పూర్తి సన్నద్ధంగానే ఉన్నాయి. పాక్ కవ్వింపులకు దిగితే గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఇండియా స్పష్టమైన సంకే తాలిచ్చింది. అంతేకాదు... ఇదేదో పరిస్థితిని మరింత జటిలం చేసుకునేందుకు మాత్రం కాదనీ, పొరుగు దేశం తన హద్దుల్లో తానుండటం మేలన్న సంకేతాన్ని ఇచ్చేందుకేననీ స్పష్టం చేసింది. హద్దు మీరితే అంతే గట్టి సమాధానం దొరుకుతుందన్న హెచ్చరిక కూడా అందులో ఉంది. మనోజ్ కె. చన్నన్ వ్యాసకర్త భారత సైన్యంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ (రిటైర్డ్) -
‘పాకిస్తాన్ పాలకులు నోటికి వచ్చినట్లు ప్రేలాపనలు’
పశ్చిమగోదావరి జిల్లా: ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేసిన దాడి కేవలం ఉగ్రస్థావరాలపై మాత్రమేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. పాకిస్తాన్ దేశంపై దాడి చేయలేదని, అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదులపై దాడి మాత్రమేనన్నారు. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ పాలకులు నోటికి వచ్చినట్లు ప్రేలాపన ప్రేలుతున్నారని మండిపడ్డారు.‘భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ పెద్ద ఇష్యూ కాదు. పహల్గాంలో పర్యాటకుల పై దాడి చేసి 26 మంది మరణించడానికి కారణమైన ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశాం. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశ రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 ని రద్దు చేశాం. ఆర్టికల్ 35 ఏ రద్దు చేసాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదీదే. కాశ్మీర్లో పెద్ద ఎత్తున పర్యాటకులు పెరిగారు.పర్యాటకల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. కాశ్మీర్లో ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు కాశ్మీర్లో స్వేచ్ఛగా తిరుగుతున్న ప్రజలపై ఉగ్రవాదులు ఉద్దేశ్య పూర్వకంగా అభద్రత భావం భావం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక దేశాలు భారతదేశానికి మద్దతు ఇచ్చాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం పోరాటం చేస్తుంది. పాకిస్తాన్ కు ఏ సమయంలో అయినా బుద్ధి చెప్తాం.పాకిస్తాన్ ను అన్ని రకాలుగా దిగ్బంధనం చేసాం’ అని మంత్రి స్పష్టం చేశారు. -
‘ప్రధాని మోదీ చేతుల్లో భారత్ సురక్షితంగా ఉంది’
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడిని స్వాగతించారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించకూడదని, అది మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదమన్నారు రవిశంకర్. ఆపరేషన్ సిందూర్ పై రవిశంకర్ మాట్లాడుతూ.. ‘ మనం నాగరిక సమాజంలో ఉన్నాం. మానవాళిని నాశనం చేసే ఉగ్రవాదులు దాడులు కానీ మిలిటెంట్ల దాడులను కానీ ఎంతమాత్రం ఉపేక్షించకూడదుఉగ్రవాదం అనేది ఓ ఆటవిక చర్య. భారత్ కేవలం పాక్‌లోని ఉగ్రస్థాపరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు చేసింది. ఇది హర్షించదగ్గ విషయం. భారత్ చేసిన దాడులపై ఏ ఒక్కరు మాట్లాడాలన్నా మాట్లాడటానికి ఏమీ లేదు. ఎందుకంటే భారత్ కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసింది.ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని సహించబోమని పదే పదే చెబుతూ ఉన్నారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించలేదని చాలాసార్లు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేయాల్సి వచ్చింది. ఇది కచ్చితంగా తెలివైన నిర్ణయమే. ప్రస్తుతం భారత్ నరేంద్ర మోదీ చేతుల్లో సురక్షితంగా ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలతో భారత్ కు మేలే జరుగుతుంది. ఆయనకు మరింత ఆత్మస్థైర్యం కలగానికి ప్రార్దిద్దాం అని రవిశంకర్ అన్నారు. -
ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే: ఖర్గే
ఢిల్లీ: సైనికులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారత్ చేపట్టిన దాడుల నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ బుధవారం అత్యవసరంగా సమావేశం నిర్వహించింది.‘‘పీవోకే నుంచి ఉగ్రవాదులు పనిచేస్తున్నారనేది స్పష్టమైంది. ఉగ్రవాద శిబిరాలపై దాడులు సరైనవే. దేశ రక్షణ విషయంలో మనమంతా కలిసి ఉండాలి. సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికీ మద్దతిస్తాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న భారత సైనిక దళాలను చూసి తాము గర్విస్తున్నామని ఖర్గే అన్నారు.కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు రోజుల ముందే తెలుసునంటూ నిన్న(మంగళవారం) మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై దాడి జరగబోతున్నట్లు మోదీకి ఇంటెలిజెన్స్ రిపోర్టు అందిందని.. అందుకే ఆయన జమ్మూకశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. నిఘా వైఫల్యం వల్లే పహల్గాంలో ఉగ్రదాడి జరిగినట్లు అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, మోదీ సైతం స్వయంగా ఒప్పుకున్నారంటూ ఖర్గే వ్యాఖ్యానించారు. -
ఢిల్లీలో కరెంట్ కట్.. ఎప్పటినుంచి ఎప్పటి వరకు అంటే..?
ఢిల్లీ: సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌లో భాగంగా నగరంలో ఇవాళ రాత్రి 8 నుంచి 8.15 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ప్రజలంతా సహకరించాలని న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. అయితే, ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రాష్ట్రపతి భవన్, పీఎంవో, మెట్రో స్టేషన్లు, ఇతర ముఖ్య ప్రదేశాలకు ఇది వర్తించదని ఎన్డీఎంసీ వెల్లడించింది.పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. ఈ అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరిగాయి. దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది.వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్‌కు వేదికయ్యాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్ డ్రిల్స్ జరిగాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి. 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ ఉన్నాయి. -
9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం: ఆర్మీ
-
పాక్ పీఎం యాక్షన్.. ఆర్మీ చీఫ్ నో యాక్షన్!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ ‘యాక్టింగ్ కెప్టెన్’ పాత్రకు రెడీ అయ్యారు. భారత్‌తో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. భారత్ తమపై దాడి చేసిందని, అందుకు ప్రతీకారం తీర్చుకుంటామనీ అన్నారు. రైట్ టు రెస్పాండ్ హక్కు మాకూ ఉందన్నారు. ఈ మేరకు అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారు.ఆర్మీ చీఫ్ ఎక్కడ..?ఈ మేరకు హై లెవిల్ సెక్యూరిటీ మీటింగ్ కు పాక్ ప్రధాని షరీఫ్ పిలుపునిచ్చారు. అయితే దీనికి ఆ దేశ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ హాజరుకాలేదు. కనీసం మునీర్ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నడుమ మునీర్ ఎక్కడో కీలక ప్రాంతంలో దాక్కున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తో యుద్ధాన్ని ఆర్మీ చీఫ్ మునీర్ వద్దనుకునే కీలక మీటింగ్ లకు దూరంగా ఉంటున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది.ఇప్పుడు పాక్ ప్రధాని షరీప్ కాస్త యాక్టింగ్ లోకి దిగుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సైన్యం పూర్తిగా సహకరించడం లేదనడానికి మునీఫ్ గైర్హాజరీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం భారత్ పై తిరుగుబాటు చేస్తే పాక్ కే నష్టమని పలువురు దేశ, విదేశీ రాజకీయనాయకులు చెబుతున్న మాట. ఇదే ఫాలో అవుతున్నట్లున్నాడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్. పాక్ లో అత్యంత శక్తివంతుడుగా విస్తృత ప్రచారంలో ఉన్న మునీర్.. మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్లో పాక్ పెద్దలకు అర్థం కావడం లేదు. హైలెవిల్ మీటింగ్ కు రావాలని పాక్ భద్రతా దళాల అధికారులకు ప్రధాని ఆదేశాలు ఇచ్చిన తరుణంలో మునీర్ ఎందుకు దూరంగా ఉన్నట్లు. పాక్ పీఎం యాక్షన్ ప్లాన్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ నుంచి ఎటువంటి యాక్షన్ లేకపోవడం ఏంటనేది ఇప్పుడు ఆ దేశంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు..మునీర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తమ పార్టీ మాత్రం ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాల్లో పాల్గొదనే సంకేతాలిచ్చాడు. దాంతోనే ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీలోని పార్లమెంట్ సభ్యులు కూడా ప్రభుత్వంపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ కూడా కీలక సమయంలో పాక్ హ్యాండిచ్చాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మేకపోతు గాంభీర్య ప్రదర్శిస్తూ భారత్ వార్నింగ్ ఇచ్చిన మునీఫ్.. సరైన సమయానికి మాత్రం ఎస్కేపింగ్ ప్లాన్ చేసుకున్నట్లు కనబడుతోంది.మరో ముషారఫ్ రాజ్యం రాబోతుందా..?పాకిస్తాన్ లో ప్రభుత్వాలను కూల్చేసి ఆర్మీ చీఫ్ లు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గతంలో చూశాం. మరి మునీఫ్ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే మునీఫ్ అంత సీన్ లేదనే కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం పాక్ లో ప్రభుత్వాన్ని మునీర్ కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకే సైలెంట్ మోడ్ లోకి మునీఫ్ వెళ్లాడని, ఇది పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్ కు మేలు చేయడం కోసమేనని పాక్ లోనే వినిపిస్తోంది. గతంలో పాక్ మాజీ సైనాకాధికారి ముషారఫ్.. సైన్యం మద్దతు విశేషంగా కూడగట్టుకుని పాక్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధ్యక్షుడయ్యాడు.ముషారఫ్.. 1999 నాటి కుట్రలో ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి అధికారం హస్తగతం చేసుకొని, ‘ఛీఫ్ ఎగ్జిక్యూటివ్’గా, ఆ పైన సైనికాధ్యక్షుడిగా, చివరకు పౌర అధ్యక్షుడిగా తొమ్మిదేళ్ళ కాలం దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొన్నారు. ఆఖరికి మెడ మీద అభిశంసన కత్తితో 2008లో గద్దె దిగక తప్పలేదు. -
ఆపరేషన్ సిందూర్.. తెలంగాణ మంత్రి నినాదాలు
సిద్దిపేట, సాక్షి: పెహల్గాంలో 28 మంది అమాయక పౌరుల ప్రాణాలు తీసి పాకిస్తాన్లో నక్కిన ఉగ్రమూకలను ఏరివేయడమే లక్ష్యంగా భారత్ సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంపై దేశవ్యాప్తంగా జయజయధ్వానాలు మోరుమోగుతున్నాయి. అమాయకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు.సిద్దిపేట జిల్లా కోహెడ గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడి ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంపై గట్టి చప్పట్లతో అభినందనలు తెలుపుతున్నానన్నారు.రాజకీయాలు, పార్టీలకతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్న పొన్నం.. ‘కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు, అన్ని పార్టీల నాయకులు ఈ చర్యను సమర్థిస్తున్నాయి. ఉగ్రవాదుల చర్యలకు బుద్ధి చెప్పే విధంగా సైనిక చర్యలు ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తున్నాం. భారత సైనికులకు శుభాకాంక్షలు, అభినందనలు’ అని పేర్కొన్నారు. -
పహల్గాం దాడి అనంతరం ఉగ్ర పాకిస్థాన్ కు ప్రధాని మోదీ వార్నింగ్
-
Rajnath Singh: ప్రధాని మోదీ నేతృత్వంలో శత్రువులకు సరైన సమాధానం చెప్పాం
-
అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల్ని ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వేరివేత లక్ష్యంగా భారత్ ‘ ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్.. 90 మంది వరకూ టెర్రర్ మూకలను మట్టుబెట్టింది. అయితే భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూర్ పై చైనా మీడియా విషం కక్కింది. చైనాలోని గ్గోబల్ టైమ్స్’ అనే మీడియా సంస్థ ఆపరేషన్ సిందూర్ భారత్ విమానాలను పాక్ కూల్చిందంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కొన్ని పాత ఫోటోలను జత చేసి వాటిని ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ కు ఆపాదించింది. దీనిపై చైనాలోని భారత్ ఎంబాసీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అక్కడ జరిగింది ఏమిటి.. మీరు చేస్తున్నదేమిటి అంటూ మండిపడింది ఒక విషయాన్ని వార్త రూపంలో ప్రచురించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని, దానికి మూలాలను అన్వేషించి వార్తలు వేయాలని గ్లోబల్ టైమ్స్ కు చురకలంటించింది. అక్కడా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే మీరు దాన్ని వక్రీకరించడం తగదంటూ హితవు పలికింది. కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులు హతమయ్యారు. -
Operation Sindoor: ముంబై ఇండియన్స్‌పై ఎఫెక్ట్
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్‌పై పడింది. తమ తదుపరి మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ ఇవాళ (మే 7) సాయంత్రం ముంబై నుంచి చండీఘడ్ మీదుగా ధర్మశాలకు ప్రయాణించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ధర్మశాల ప్రయాణం వాయిదా పడింది. భారత ప్రభుత్వం సూచనల మేరకు చండీఘడ్ సహా దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేశారు. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో ముంబై ఇండియన్స్ ప్రయాణించాల్సిన విమాన సర్వీస్ కూడా ఉంది. బీసీసీఐ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలోనే ఉండనుంది.ఈ నెల 11న ముంబై ఇండియన్స్ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసమే వారు ధర్మశాల ప్రయాణానికి సిద్దమయ్యారు. ఈ లోపే విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ధర్మశాలలో రేపు (మే 8) ఓ మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇదివరకే ధర్మశాలకు చేరుకున్నాయి.కాగా, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం పలు విమానాశ్రయాలను మూసి వేయాలని సూచించింది. అయితే దీని ప్రభావం ఐపీఎల్ పడే అవకాశం ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం సాగాలంటే ఆయా జట్లు ఓ వేదిక నుంచి మరో వేదికకు విమానాల ద్వారా ప్రయాణించాల్సి ఉంది. దేశంలో పలు విమానాశ్రయాలు మూసివేసిన నేపథ్యంలో జట్ల ప్రయాణానికి ఆటంకం కలుగవచ్చు. దీని ప్రభావం ఐపీఎల్ షెడ్యూల్‌పై పడే అవకాశం ఉంది.స్పందించిన బీసీసీఐషెడ్యూల్ మార్పు అంశంపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశాయి. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.మ్యాచ్ ముగిసిన కొద్ది సేపటికే ఆపరేషన్ సిందూర్ మొదలైందిముంబై ఇండియన్స్ -గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న (మే 6) జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గత నెల 22వ తేదీన పాక్ ఉగ్రమూకలు దాడులకు తెగబడి 26 మంది అమాయకుల ఫ్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్‌కు బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. -
Operation Sindoor: భారత్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన ఉగ్రశిబిర శిథిలాలు
-
ఉగ్ర గుట్టు విప్పారు ఎవరీ సోఫియా, వ్యోమికా?
-
పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాం: అజిత్ దోవల్
ఢిల్లీ: ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యం భారత్‌కు లేదని.. పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ ఎన్ఎస్ఏలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో దోవల్ చర్చించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై ఇతర దేశాల మద్దతు కూడగట్టే క్రమంలో అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులతోచర్చించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై తీసుకున్న చర్యలు.. ఆపరేషన్ నిర్వహించడానికి గల కారణాలను ఆ దేశాల ప్రతినిధులకు వివరించారు.కాగా, పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. -
YS Jagan: ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య
-
‘అమాయకుల ప్రాణాలు తీసిన వారిని మట్టుబెట్టాం’
న్యూఢిల్లీ: అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఆపరేషన్ సిందూర్‌తో మట్టుబెట్టామని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో శత్రువుకు తగిన విధంగా బుద్ధి చెప్పామన్నారు. ఈ రోజు(బుధవారం) ప్రెస్ మీట్ లో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. ‘రైట్ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నాం. భారత సైనం తన సత్తాను చాటింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. పహల్గామ్ లో అమాయకుల ప్రాణాలు తీసిన వారు మూల్యం చెల్లించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెప్పాం. హనుమంతుడినే ఆదర్శంగా తీసుకున్నాం. భారత సైన్యం లక్ష్యం పాక్ పౌరులు కాదు.. ఉగ్రవాదుల స్థైర్యాన్ని దెబ్బతీశాం. ఆపరేషన్ సిందూర్‌తో రికార్డు సృష్టించాం. పాక్ పౌరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.. -
నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన కొన్ని వారాల తర్వాత మే 7 బుధవారం తెల్లవారుజామున భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టి బదులిచ్చింది. నాడు ఆ విషాదకర ఘటనలో మోదీకి చెప్పు అంటూ మహిళా పర్యాటకుల ముందే వారి భర్తలను కడతేర్చారు. వారి ఆక్రందనలు వినిపించేలా నేలరాల్చిన ఆ మహిళ 'సిందూరం' పేరుతోనే ఆపరేషన్ చేపట్టి ఉలిక్కిపడేలా సమాధానమిచ్చింది భారత్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరోజు ఆనందంగా గడపాలని వచ్చిన మహిళలకు కన్నీళ్లు మిగిల్చితే..ఈ ఆపరేషన్ పేరుతో సైనిక మహిళా శక్తితోనే సమాధానం చెప్పడం విశేషం. అంతేగాదు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది మీడియా ముందు వెల్లడించారు కూడా. మరీ ఆ ఆదిపరాశక్తులు ఎవరు? ఏవిధంగా ఈ ఆపరేషన్ని విజయవంతంగా ముగించారు తదితర విశేషాలు చూద్దామా..!వారే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు. ఈ సిందూర్ ఆపరేషన్ వారి నేతృత్వంలోనే విజయవంతంగా ముగిసింది. ఈ ఇద్దరు భారత సశస్త్ర దళాల్లో సీనియర్ మహిళా అధికారులు. ఈ సిందూర్ ఆపరేషన్‌కి సంబంధించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించింది వీరిద్దరే. సోఫియా ఖురేషీ ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించగా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పైలట్‌గా భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. సోఫియా భూమిపై సైన్యంతో విధ్యంసం సృష్టించగా, వ్యోమికా సింగ్ ఆకాశం నుంచి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ ఇరువురి మహళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై మెరుపులు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలతో సహా పాక్‌లో ఉన్న టెర్రర్ ఇండక్షన్లు, ట్రైనింగ్ సెంటర్లను కూడా మట్టుబెట్టింది. అంతేగాదు విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే గాక భారతదేశ రక్షణ దళాలలో మహిళల పాత్రను హైలెట్ చేసింది. సాహసాలకు కేరాఫ్ అడ్రస్ ఇరువురు..ఇక్కడ సోఫియా కుటుంబం మొత్తం సైనిక సేవలతో ముడిపడి ఉంది. అంతేగాదు సోఫియా ఫోర్స్ 18 అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.సోఫియా యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఆరు సంవత్సరాలు సేవలందించారు.ఐక్యరాజ్యసమితి మిషన్‌లో (2006) గణనీయమైన సేవలు అందించారువ్యోమిక తన పేరుకు తగ్గట్టే పైలట్ కావాలనే రంగాన్ని ఎంచుకుని సైన్యంలో చేరారామె. అంతేగాదు తన కుటుంబంలో ఆర్మీలో చేరిన తొలి వ్యక్తిగా వ్యోమిక పేరుగడించింది. డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. భారత్‌లో అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో చేతక్, చిరుత వంటి విమానాలను నడిపారామెఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు.2020లో అరుణాచల్‌ప్రదేశ్‌లో కీలకమైన రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహించింది2021లో త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారుహర్షం వ్యక్తం చేసిన పహల్గాం బాధితులు..ఆ ఆపరేషన్ గురించి వినగానే కళ్లల్లో నీళ్లు వచ్చేశాయన్నారు పహల్గామ్ బాధితులు. మా కుంకుమను నేలరాల్చిన వారికి అదే పేరుతో ఆపరేషన్ చేపట్టి మట్టికరిపించినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని గద్గద స్వరంతో అన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్‌తో ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం అని ధీమాగా చెప్పారు.(చదవండి: Operation Sindoor: మన కుమార్తెల సిందూరమే.. ఆపరేషన్ సిందూర్.. పహల్గాం బాధితుల రియాక్షన్) -
ఆపరేషన్ సింధూర్ వెనక అసలు కథ ఇదే!
-
IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు?.. స్పందించిన బీసీసీఐ!
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)నేపథ్యంలో ఐపీఎల్-2025లో షెడ్యూల్లో మార్పులు ఉంటాయా? లేదంటే క్యాష్ రిచ్ లీగ్ ప్రణాళిక ప్రకారమే ముందు సాగుతుందా? అని అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు స్పందించాయి.ఐపీఎల్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండవని.. లీగ్ యథావిథిగా ఉంటుందని స్పష్టం చేశాయి. కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ మొదలు కాగా.. మే 6 నాటికి 56 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో రెండు మాత్రమే వర్షం కారణంగా రద్దయ్యాయి.టాప్‌లో గుజరాత్ఈ క్రమంలో పదకొండింట ఎనిమిది విజయాలతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోకి కొనసాగుతుండగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా 16 పాయింట్లు ఉన్నా రన్‌రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు), ముంబై ఇండియన్స్ (14 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (13 పాయింట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ (11 పాయింట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (10 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఇక ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (7 పాయింట్లు), రాజస్తాన్ రాయల్స్ (6 పాయింట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (4 పాయింట్లు) ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు కాగా ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం నాటి మ్యాచ్ వర్షం వల్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన కాసేపటికే భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి.. వాటిని ధ్వంసం చేసింది.జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఇలాంటి సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా వేస్తారేమోనని సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యలో బీసీసీఐ వర్గాలు ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులను బీసీసీఐ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తాం’’ అని పేర్కొన్నాయి.దేశ ప్రయోజనాలే ముఖ్యంఇక ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ.. భారత ప్రభుత్వ నిర్ణయాలను బీసీసీఐ శిరసా వహిస్తుందని స్పష్టం చేశారు. సమయానికి తగినట్లు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తప్పక పాటిస్తామని పేర్కొన్నారు.‘‘ఐపీఎల్ పాలక మండలి ఈ పరిస్థితులను గమనిస్తోంది. ఐపీఎల్ షెడ్యూల్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే, ఏదీ మన చేతుల్లో లేదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా బీసీసీఐ అందుకు కట్టుబడి ఉంటుంది. మద్దతుగా ఉంటుంది’’ అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.సురక్షితం, భద్రంఇక టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందిస్తూ.. ‘‘భారత్‌లో ప్రతి ఒక్కరు సురక్షితంగా, భద్రంగా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు. మన దేశ సైన్యంపై అందరికీ అమితమైన విశ్వాసం ఉంది. విదేశీ ఆటగాళ్లు కూడా తాము భద్రంగా ఉన్నామని, ఉంటామని నమ్మకంగా ఉన్నారు. కాబట్టి లీగ్‌లో మార్పులు ఉండవనే అనుకుంటున్నా’’ అని ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్ -
ప్రధాని మోదీ విజయరహస్యం ఇదే..!
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ వ్యూహాలపైనే చర్చ నడుస్తోంది. ఎంత కఠినమైన సమయంలో కూడా తనలోని గాంభీర్యాన్ని ముఖంలో కనిపించనీయకుండా. పైకి తనపని తాను చేసుకుంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉండటమే మోదీ శైలి. అవతలి వాడికి అవకాశమివ్వడం, అవతలివాడిని మాట్లాడనీయడం మోదీకి తెలిసిన మరో విద్య. అది చెడు కానంతవరకే మోదీ భరిస్తారు.. ఒకవేళ అవతలి వాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న సమయంలో మాత్రం మోదీ వ్యవహరశైలి భిన్నంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమానం సందపాదించుకున్న మోదీ యుద్ధ వ్యూహాలను చూసి ప్రపంచ మిలిటరీ వ్యూహకర్తలు, విశ్లేషకులు నివ్వెరపోతున్నారు.ఎడమవైపు సంజ్ఞ చేస్తారు కుడివైపుకు తిరుగుతారు.. ఇది మనకు మోదీ ప్రసంగంలో తరుచు కనిపిస్తూ ఉంటుంది. మరి మోదీ వ్యూహాలు కూడా ఇలానే ఉంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే కాకుండా ఆ దేశ కవ్వింపు చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవతమైంది. గత కొన్నేళ్లుగా మోదీ యుద్ధ తంత్రాలను దాయాది దేశం పాకిస్తాన్ పసిగట్టలేకపోతోంది.బాలాకోట్, "ఆపరేషన్ సింధూర్" రెండింటికీ ముందు, ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ బహిరంగ ప్రదర్శనే గాక ఆయన ప్రసంగాలు కూడా ప్రశాంతంగా కనిపించాయి. మోదీ అసలు ఉద్ధేశాన్ని బహిర్గత పరచలేదు. ఈ రెండు సమయాల్లోనూ సూదిమొనంత కచ్చితత్వంతో తాను చేయబోయే అ దాడులను,కాయన అమాయక మొహం వెనక దాచిపెట్టారు.బాలాకోట్ దాడి వ్యూహం తరహాలోనే, ఈసారి కూడా ప్రధాని మోదీ వ్యూహాలు పాకిస్తాన్‌ను నివ్వెరపరచాయ్. దాడికి ముందు ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్‌తో మాస్టర్‌మైండ్ యుద్ధతంత్రంతో. ఆపరేషన్ సింధూర్ కు ముందు ప్రదర్శించిన వైఖరి.. బాలకోట్‌కు ముందు ఆయన ప్రదర్శించిన వైఖరి పాకిస్తాన్‌ను అయోమయంలో పడేసింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక వైపు చూపించి.. మరో వైపు నుంచి.. మధ్యందిన మార్తాండుని వలే అనన్యసామాన్యమైన శక్తితో శత్రువుపై పిడుగులు కురిపించే కళలో ప్రావీణ్యం సంపాదించినట్లే ఉంటుంది.. 2019లో బాలకోట్ దాడులకు ముందు ఆయన ప్రయాణ ప్రణాళికతో పాటు ఆయన ప్రసంగం, ప్రస్తుత "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా ఆయన వ్యూహాలు.. యుద్ధతంత్రంలో మాస్టర్‌క్లాస్‌లు.. శత్రువును అచేతనం చేసి.. మూగబోయేలా చేశాయి.ఒకసారి చేస్తే యాదృచ్ఛికం కానీ మళ్ళీమళ్ళీ పునరావృతం చేయడమంటే.. ప్రపంచమనే వేదికను నివ్వెరపరచడమే. ఇది మోదీకే సాధ్యమైన యుద్ధతాండవం. అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. రెండు దాడులకు మధ్య ఉన్న సారూప్యతలను పరిశీలిస్తే.. అవి కచ్చితంగా ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా ఉంటాయి. బాలకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రదర్శించిన తంత్రం నుండి ఎలాంటి పాఠం నేర్చుకోనందుకు పాకిస్తాన్ తన చెప్పుతో తననే కొట్టుకుంటుంది.బాలకోట్ కు 48 గంటల ముందు2019 ఫిబ్రవరి 26న.. తెల్లవారుఝామున భారతదేశం బాలకోట్ పై దాడి చేసింది. కానీ, ఆ దాడికి ముందు 48 గంటలు, మోదీ షెడ్యూల్ అంతా యథావిధిగా జరిగింది.ఫిబ్రవరి 25న, ఆయన న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి ఆయన మాట్లాడినప్పటికీ, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జిహాదిస్ట్ మౌలిక సదుపాయాలపై రాబోయే దాడి గురించి ఎటువంటి సూచన ఇవ్వలేదు.నిన్న(మంగళవారం, మే 6వ తేదీ) రాత్రి 9 గంటలకు, భారత విమానాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రధాని మోదీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారతదేశం యొక్క ఆకాంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాని సంకల్పం గురించి మోదీ మాట్లాడారు. ఆందోళన సూచించే ఒక్క ముడత కూడా అతని నుదిటిపై కనిపించలేదు. ప్రసంగంలో సందేహాస్పదమైన అంశాలకు ఏమాత్రం చోటివ్వలేదు.తుఫాను ఎదురైనప్పుడు ప్రశాంతత, అగ్ని గుండంలోనూ ధైర్యంగా నిలబడగలగడం గొప్ప నాయకుడి లక్షణాలు అని మనస్తత్వవేత్తలు అంటారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వం.. వారు సూచించే నాయకత్వ అంచనాలకు సరిపోవడం చూసి.. వారు నాయకత్వానికి ఇచ్చిన భాష్యం సరైందేనని భావిస్తారు.మోదీ వ్యూహాలు అర్థం కాలేదు,..చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే, అవే తప్పులను పునరావృతం చేస్తారు. బాలాకోట్‌కు ముందు ప్రధాని మోదీ తీరును పాకిస్తాన్ విశ్లేషించి ఉంటే.. మే 6వ తేదీ రాత్రి నియంత్రణ రేఖ వెంబడి తొమ్మిది లక్ష్యాలపై భారత్ దాడి చేసినప్పుడు ఆ దేశం ఎంతో కొంత ప్రతిఘటించే ఉండేది, కానీ మోదీ వ్యూహాలు అర్ధం కాకపోవడంతో పాకిస్తాన్ చూస్తూ ఉండిపోయింది.బాలకోట్‌కు ముందు ప్రధాని మోదీ వైఖరికి సంబంధించి కచ్చితత్వానికి ప్రతిరూపంగానే నిలుస్తుంది. దాడులకు కొన్ని గంటల ముందు, ఆయన ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొని 2047 నాటికి భారతదేశం ఆర్థికంగా గొప్ప దేశంగా ఎదగాలనే ఆకాంక్షల గురించి మాట్లాడారు.30 నిమిషాల పాటు జరిగిన ఆనాటి తన ప్రసంగంలో.. ఏమాత్రం ఆందోళన కానీ ఒత్తిడి లేని వ్యక్తిలా ప్రశాంతంగా ఆయన మాట్లాడారు, జోకులు వేస్తూ, భారతదేశంలో ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చినందుకు పొరుగువారిని విమర్శించడం వినడానికి ప్రేక్షకులు ఆసక్తిగా కనిపించినప్పటికీ, పాకిస్తాన్ అనే పదాన్ని మాత్రం ఒక్కసారి కూడా పలకలేదు. ఆ సందర్బంగా మోదీ బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలిస్తే ఎలాంటి అంచనాకు రాలేం.భారతదేశం అంతటా యుద్ధ విన్యాసాలు ప్రకటించడం అతిపెద్ద తంత్రం.. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికీ తన దేశాన్ని సైనిక చర్యకు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారని సూచిస్తుంది. కానీ, ఇది పాకిస్తాన్‌కు విలాసవంతమైన సమయం ఉందనే భ్రమను కలిగించడానికి ఒక వ్యూహం మాత్రమే అని ఉదయాన్నే తేలింది.యుద్ధ కళలో నిష్ణాతులు ఏమంటారంటే.. మీకు మీ శత్రువు గురించి పూర్తిగా తెలిస్తే, యుద్ధంలో ఓటమికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని చెబుతారు. పాకిస్తాన్‌ను మోదీ పూర్తిగా చదివేశారు... కానీ ఆయన్ను అంచనా వేయడంలో పాక్ మళ్లీ ఫెయిల్ అయ్యింది. అందుకే గెలుపు ప్రతీసారి మోదీనే వరిస్తుంది. -
ఆపరేషన్ సిందూర్ పై ముస్లింల రియాక్షన్
-
Operation Sindoor: పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ క్రాష్
ఉగ్రమూకలను ఏరివేసేందుకు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైన్యం చేసిన కచ్చితమైన దాడుల నేపథ్యంలో భారత ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 105.71 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 80,746.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34.80 పాయింట్లు (0.14 శాతం) లాభపడి 24,414.40 వద్ద ముగిసింది.బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.36 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ 1.16 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి.రంగాలవారీ సూచీల్లో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్ కేర్ మినహా మిగతా అన్ని రంగాలు గ్రీన్‌లో ముగియడంతో ఆటో, మీడియా, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 1 శాతానికి పైగా పెరిగాయి.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 17 షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్ 5.2 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.02 శాతం, ఎటర్నల్ 1.41 శాతం, అదానీ పోర్ట్స్ 1.41 శాతం, టైటాన్ 1.27 శాతం లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ 4 శాతం, సన్ ఫార్మా 1.95 శాతం, ఐటీసీ-1.3 శాతం, నెస్లే ఇండియా-1.06 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.01 శాతం నష్టపోయాయి.పాక్ స్టాక్ మార్కెట్ కుదేలుపాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత్ జరిపిన దాడుల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ బుధవారం కుప్పకూలింది. ఆ దేశ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కేఎస్ఈ 100 (కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్) ప్రారంభ ట్రేడింగ్‌లో 6,272 పాయింట్లు లేదా 6 శాతం పడిపోయింది. భారత్ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టిన కొన్ని గంటల్లోనే కేఎస్ఈ-100 సూచీ క్షీణించి 1,12,076.38 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. ప్రస్తుతానికి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్) కోలుకునే సూచనలు కనిపించలేదు. పీఎస్ఎక్స్ వెబ్సైట్ మూతపడింది. ఆ వెబ్సైట్ తెరిస్తే "తదుపరి నోటీసు వచ్చే వరకు నిర్వహణలో ఉంటుంది" అన్న సందేశం కనిపిస్తోంది. -
ఆపరేషన్ సిందూర్‌లో ఈ ఇద్దరే కీలకం!
-
భారత్ పై పాక్ అబద్ధపు ప్రచారం
-
ఆపరేషన్ సిందూర్.. మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతం
ఢిల్లీ: ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం.జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం.ముఖ్యంగా బవహల్పూర్లోని జైష్-ఎ-మహమ్మద్ శిబిరాలు, సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో ఆ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మందితో పాటు అనుచరులు మరణించినట్లు తెలుస్తోంది. మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతడి భార్య కూడా ఉన్నట్లు సమాచారం. -
ఆపరేషన్ సింధూర్ లో మసూద్ అజర్ ఫ్యామిలీ ఖతం
-
ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్ జెట్లు
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై ఈ రోజు తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపుదాడికి పాల్పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది స్థావరాలను భారత ఆర్మీ బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఘటనలో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆపరేషన్ సింధూర్‌లో రఫేల్, సుఖోయ్ ఎస్‌యూ -30 ఎంకేఐ, జాగ్వార్ యుద్ధ విమానాలను మోహరించింది. వాటి గురించి తెలుసుకుందాం.డసాల్ట్ రఫేల్డసాల్ట్ రాఫెల్ 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్. ఇది అధునాతన ఏవియానిక్స్, మెరుగైన పోరాట సామర్థ్యాలకు ప్రసిద్ది చెందింది. అటాక్ చేసే సమయంలో యుద్ధభూమిలో పరిస్థితుల అవగాహన కోసం ఆర్బీఈ2 ఏఈఎస్ఏ రాడార్, స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, ఫ్రంట్-సెక్టార్ ఆప్ట్రోనిక్స్ను అమర్చారు. రెండు ఎస్ఎన్సీఎంఏ ఎం88 టర్బోఫాన్ ఇంజిన్లను ఇందులో ఉపయోగించారు. ఇది సూపర్ క్రూయిస్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 9,500 కిలోల వరకు ఆయుధాలు, ఇంధనాన్ని మోసుకెళ్లగలదు. ఫైటర్ పైలట్లకు యుద్ధభూమిలో రియల్ టైమ్ సమాచారం అందించేందుకు బహుళ సెన్సార్లను ఉపయోగించారు. నౌకాదళం కోసం 26 రఫేల్-మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ గతంలో రూ.63,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఈ జెట్లను ఉంచాలని నిర్ణయించింది.సుఖోయ్ ఎస్ యూ-30 ఎంకేఐఈ ట్విన్ ఇంజిన్, మల్టీరోల్ ఎయిర్ సుపీరియరిటీ ఫైటర్ జెట్ సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకేఐను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం రష్యాకు చెందిన సుఖోయ్ డిజైన్ బ్యూరో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది భారతదేశ ఆయుధాగారంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటి.ఇది థ్రస్ట్ వెక్టరింగ్ కంట్రోల్‌తో ఏఎల్-31FP టర్బోఫాన్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఇది ఒకసారి ఇంధనం నింపితే గరిష్టంగా 3,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంధనం నింపితే 8,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.మల్టీ-మోడ్ రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆర్ఎస్టీ)ను కలిగి ఉంది. ఇజ్రాయెల్, ఫ్రెంచ్, ఇండియా ఏవియానిక్స్‌లో ఇవి ఉన్నాయి.గగనతల క్షిపణులు, గైడెడ్ బాంబులతో సహా 8,000 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగలదు.భారత వైమానిక దళంలో 260కి పైగా ఈ జెట్లు సేవలందిస్తున్నాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ రుణం దిగిరావాలిసెపెకాట్ జాగ్వార్సెపెకాట్ జాగ్వార్ అనేది ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్ ఇంజిన్, సూపర్ సోనిక్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్. తక్కువ ఎత్తులో హైస్పీడ్ ఆపరేషన్స్ కోసం రూపొందించారు. శత్రు భూభాగంలో దాడులకు అనువైనది. మెరుగైన రాడార్, జీపీఎస్ నావిగేషన్, నైట్ ఫ్లయింగ్ వ్యవస్థలను కలిగి ఉంది. రెండు రోల్స్ రాయిస్ టర్బోమెకా అడౌర్ టర్బోఫాన్ ఇంజిన్లతో దీన్ని రూపొందించారు. లేజర్ గైడెడ్ బాంబుల కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. భారత వైమానిక దళంలో జాగ్వార్ 1979 నుంచి కీలక స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్‌గా ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఇది కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అంబాలా, గోరఖ్‌పూర్, జామ్ నగర్ వైమానిక స్థావరాల్లో వీటిని మోహరించారు. -
ఆపరేషన్ సిందూర్, ఆ 9 ప్రాంతాలే టార్గెట్ ఎందుకంటే?
-
భారత్ ప్రధాన టార్గెట్ వీరే..!
-
ఉగ్రవాద స్థావరాలు,శిబిరాలపై దాడి అనివార్య చర్య: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు ఆపరేషన్ సిందూర్‌పై పార్టీ ముఖ్య నేతలతో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ..ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కశ్మీర్‌లోని పహల్గాంలో ఉన్న బైసరన్ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్‌దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
MLC Kavitha: భారత్ దెబ్బ అదిరింది