సీఏ (CA) పరీక్షలు వాయిదా | ICAI Officially postponed CA Exams 2025 | Sakshi
Sakshi News home page

సీఏ (CA) పరీక్షలు వాయిదా

May 9 2025 11:33 AM | Updated on May 9 2025 11:57 AM

ICAI Officially postponed CA Exams 2025

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరగాల్సిన సీఏ (CA) పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్  ఆఫ్ ఇండియా (ICAI) అధికారికంగా ప్రకటించింది. మే 9 నుంచి మే 14 మధ్య జరగాల్సిన మిగిలిన CA ఫైనల్, ఇంటర్మీడియట్,  పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ పరీక్షలు వాయిదా పడ్డాయని తెలిపింది. ప్రస్తుతం ఈ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు మరిన్ని పూర్తి వివరాల కోసం ICAI వెబ్‌సైట్ icai.orgలో ద్వారా తెలుసుకోగలరు. ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని పేపర్‌లను తిరిగి షెడ్యూల్ చేస్తామని ICAI ధృవీకరించింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ఖరారు చేసి విడుదల చేస్తామని ICAI విద్యార్థులకు హామీ ఇచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement