మన రక్షణ వ్యవస్థను భారత్‌ తునాతునకలు చేసింది: పాక్‌ రక్షణమంత్రి | Pak Defence Minister Khawaja Asif Says We Didn't Intercept Indian Drones Because We Didn't Want To Leak Our Locations | Sakshi
Sakshi News home page

మన రక్షణ వ్యవస్థను భారత్‌ తునాతునకలు చేసింది: పాక్‌ రక్షణమంత్రి

Published Fri, May 9 2025 2:55 PM | Last Updated on Fri, May 9 2025 3:49 PM

Did Not intercept Indian Drones Says Khawaja Asif

లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారతదేశం పంపిన 25 డ్రోన్‌లను పాకిస్తాన్‌ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. 

తమ దళాలు అడ్డగించి కూల్చివేసాయని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత.. పాకిస్తాన్ రక్షణ మంత్రి  ఆసిఫ్ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. భారత డ్రోన్‌లను పాక్‌ అడ్డుకోలేకపోయిందంటూ క్లారిటీ ఇచ్చారు. 

‘మన ఎయిర్‌ డిఫన్స్‌ వ్యవస్థ విఫలమైంది. పాక్‌ రక్షణ వ్యవస్థను భారత్‌ తునాతునకలు చేసింది. మన రక్షణ విభాగం పూర్తిగా విఫలమైంది. ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. గోప్యత పాటించాల్సిన కారణంగా ఇంకా వివరణ ఇవ్వలేను’ అని పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టం చేశారు. దీనిపై పాక్‌ ప్రతిపక్ష ఎంపీలు(పీటీఐ పార్టీకి చెందిన వారు) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత పాకిస్తాన్‌ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. 

ఇదిలా ఉంచితే, ప్రస్తుతం పాకిస్తాన్‌ అన్ని రకాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క పక్క భారత ఆర్మీదాడులతో పాక్‌ బెంబేలెత్తిపోతుండగా.. మరో పక్క బీఎల్‌ఏ దాడులతో ఊపిరి తీసుకోలేని పరిస్థితికి చేరుకుంది.  తెహ్రిక్‌ఇ-తాలిబన్‌ దాడుల్లో 20 మంది పాక్‌ సైనికులు హతమయ్యారు.పాక్‌ ప్రధానిని ఆ దేశ ఎంపీలు టార్గెట్‌ చేశారు. పాక్‌ పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని షెహబాజ్‌పై విమర్శలు గుప్పించారు. షెహబాజ్‌ పిరికిపంద అంటూ పాక్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్‌లో సామాన్యులతో పాటు చట్టసభల సభ్యులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. సైనిక రిటైర్డ్‌ మేజర్, సీనియర్‌ ఎంపీ అయిన తాహిర్‌ ఇక్బాల్‌ ఆ దేశ పార్లమెంటులోనే ఏకంగా ఏడ్చేశారు. అధికార పార్టీ ఎంపీ అయిన ఇక్బాల్‌.. పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ ఇంటి సమీపంలో భారత్ దాడులకు దిగింది. దీంతో తన నివాసం నుంచి పాక్ ప్రధాని పరారైనట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement