
లండన్: పాకిస్తాన్‌పై భారత్ తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాల నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు భారత్‌కు మద్దతు ప్రకటించారు. ఇక, తాజాగా భారత సంతతి, యూకే ఎంపీ ప్రీతి పటేల్.. బ్రిటన్ పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మరక్షణలో భాగంగా పాకిస్తాన్‌పై దాడి జరిపే హక్కు భారత్‌కు ఉందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో భారత్‌కు మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బ్రిటన్ పార్లమెంట్‌లో తాజాగా భారత సంతతి ఎంపీ ప్రీతి పటేల్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రీతి పటేల్.. భారత్‌తో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేక బ్రిటన్ పోరాడాల్సిన అవసరం ఉందనన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల వల్ల సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాద ముప్పును బ్రిటన్ ప్రభుత్వం గుర్తించాలని కోరారు. పహల్గాం ఘటనలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను దారుణంగా హతమార్చారని గుర్తు చేశారు. ముంబై, న్యూఢిల్లీ వంటి ఉగ్రవాద ప్రభావిత నగరాల జాబితాలో ఇప్పుడు పహల్గాం కూడా చేరిపోయింది.
పహల్గాం దాడిని ఉగ్రవాద చర్యగా ప్రపంచ దేశాలు సైతం గుర్తించాయి. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని నేను కోరుకుంటున్నాను. దేశాల మధ్య సైనిక చర్య, యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఏర్పడకూడదు. ఆత్మరక్షణలో భాగంగా తమను తాము రక్షించుకోవడానికి, ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేయడానికి భారత్‌కు సహేతుక కారణాలు ఉన్నాయి. ఇది భారత్ హక్కు. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదుల ముప్పు భారత్‌కు మాత్రమే కాదని, అనేక దేశాలు ప్రభావితమవుతున్నాయి. ఒసామా బిన్ లాడెన్ వంటి వ్యక్తి పాకిస్తాన్‌లోనే దాక్కున్నాడు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ విషయమేనని అన్నారు.
Today in the House of Commons I reiterated my condolences for those impacted by the atrocity that took place in Pahalgam. We must stand with those affected by terrorism. The UK must work with our friends in India to tackle terrorist threats and engage with India, Pakistan and key… pic.twitter.com/8RXezaJHx0
— Priti Patel MP (@pritipatel) May 7, 2025
ఇక, బ్రిటన్- భారత్ నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడి తర్వాత బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు ఏదైనా ప్రత్యేక భద్రతా సహాయం అందించిందా? ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి బ్రిటన్ ప్రత్యేక మద్దతును అందించగలదా?" అని ప్రీతి పటేల్ ప్రశ్నించారు. చివరగా.. భారత్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడులు, సృష్టించిన హింసాత్మక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ తన వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.