
మన దేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వల్ల 80 మంది పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ కామెంట్స్ చేయడంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వీరిని తక్షణమే బాలీవుడ్ నుంచి నిషేధిస్తున్నట్లు లేఖ విడుదల చేసింది. ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది.
'వారి (ఫవాద్-మహిరా) కామెంట్స్ మన దేశాన్ని అగౌవరపరిచేలా ఉన్నాయి. అలానే ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులని కూడా అవమానించేలా ఉన్నాయి. మన ఇండస్ట్రీలో పనిచేసే పాక్ నటీనటులు, చిత్రనిర్మాతలపై పూర్తిగా నిషేధం విధించాలి. భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దు'
(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు)
'కళ పేరుతో ఇలాంటి నటీనటుల్ని గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌవరపరచం లాంటిదే. చిత్రపరిశ్రమ దీన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం' అని ఆల్ ఇండియా సినీ వర్కర్క్ అసోసియేషన్ పేర్కొంది.
గత నెలలో పహల్గామ్ లో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా.. మంగళవారం అర్థరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్ పై 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడి చేసింది. 9 స్థావరాలపై దాడి చేయగా 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇకపోతే ఫవాద్ ఖాన్ నటించిన హిందీ సినిమా 'అబిర్ గులాల్'. మే 9న రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడా సినిమా అటకెక్కిపోయినట్లే.
(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా)