పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటి ఫైర్‌ | Rupali Ganguly Comments On Pakistani Actor Fawad Khan | Sakshi
Sakshi News home page

పాక్ నటుడు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటి ఫైర్‌

May 9 2025 1:09 PM | Updated on May 9 2025 3:40 PM

Rupali Ganguly Comments On Pakistani Actor Fawad Khan

పాక్ నటుడు ఫవాద్ ఖాన్‌పై బాలీవుడ్‌ నటి రూపాలీ గంగూలీ (Rupali Ganguly) మండిపడ్డారు.  పహల్గాం ఘటనతో భారత్‌  చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాక్‌ నటుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమె ఒక పోస్ట్‌ పెట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ చేసిన దాడులను ఫవాద్‌ ఖండించాడు. ఈ సిగ్గుచేటైన దాడిలో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అంటూ పాక్‌కు పూర్తి మద్ధతుగా వ్యాఖ్యలు చేశాడు. ఆపై భారత్‌ను తక్కవ చేస్తూ కామెంట్లు చేశాడు. దీంతో బాలీవుడ్‌ నటి రూపాలీ గంగూలీ ఫైర్‌ అయింది.

సోషల్‌ మీడియా వేదికగా ఫవాద్‌ గురించి ఆమె ఒక  పోస్ట్‌ పెట్టింది. ' మీలాంటి వాళ్లు ఇండియన్‌ సినిమాల్లో నటించడం మాకు సిగ్గుచేటు' అని అతని ఫోటోను షేర్‌ చేసింది. దానికి ఆపరేషన్‌ సిందూర్‌, ఇండియన్‌ ఆర్మీ, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ హ్యాష్‌ ట్యాగ్‌లను ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఫవాద్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. భారతీయ సినిమాల మీద ఆధారపడి బతికిన నువ్వు మా గురించి మాట్లాడటం ఏంటి అంటూ విరుచుకుపడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు బాలీవుడ్‌ ప్రముఖులు ఎవరూ కూడా అతన్ని విమర్శించకపోవడం గమనార్హం.  

ఆపరేషన్‌ సిందూర్‌పై వ్యాఖ్యలు చేసిన పాక్‌ నటీనటులు ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌లను  ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌  ఖండించింది. వారిని వెంటనే పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కోరింది. సినిమాల పేరుతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఇలాంటివారికి గుడ్డిగా ఎవరూ మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్‌ కోరింది. ఫహల్గామ్‌ దాడి తర్వాత వెంటనే  ఫవాద్ ఖాన్‌ హీరోగా నటించిన ‘అబీర్‌ గులాల్‌’ సినిమాను భారత్‌లో బ్యాన్‌ చేశారు. ఆపై పాక్‌ యూట్యూబ్‌, ఓటీటీ సంస్థల కంటెంట్‌ను ఇండియాలో స్ట్రీమింగ్‌ కాకుండా పూర్తిగా బ్యాన్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement