
రష్మిక మందన్నా.. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తోంది. వందకోట్లు, వెయ్యికోట్ల కలెక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ క్వీన్‌గా ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. అయితే ఇంతటి భారీ విజయాలను చూస్తున్న రష్మిక (Rashmika Mandanna).. సెలవు దినాల్లో మాత్రం కంటికి ధారగా ఏడ్చేస్తోందట! ఎందుకో రష్మిక మాటల్లోనే చదివేద్దాం.. నాకు ఓ చెల్లి ఉంది. నాకంటే 16 ఏళ్లు చిన్నది. తనకిప్పుడు 13 ఏళ్లుంటాయి. నా కెరీర్ ప్రారంభమైనప్పటినుంచి.. దాదాపు ఎనిమిదేళ్లుగా తనతో గడిపే సమయమే దొరకడం లేదు. తన ఎదుగుదలను దగ్గరుండి చూడలేకపోతున్నాను.
మిస్ అవుతున్నా..
ఇప్పుడు తను నా హైట్‌కు వచ్చేసింది. ఈ ప్రయాణంలో నేను ఆగకుండా పరిగెడుతూనే ఉన్నానని అర్థమైంది. ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఏం మిస్ అవుతున్నానో అర్థమవుతోంది. ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతోంది. నా స్నేహితులను కలిసి చాలాకాలమే అయిపోయింది. వాళ్లు ఏదైనా ప్లాన్ చేసినప్పుడు నన్నూ పిలిచేవారు. కానీ ఇప్పుడు నాకెలాగో అంత టైం ఉండదని వాళ్లే డిసైడ్ అయి దూరం పెట్టేస్తున్నారు. ఇవన్నీ నన్ను చాలా బాధిస్తున్నాయి. ఎవరూ లేనప్పుడు మనసు తేలిక చేసుకోవడానికి ఏడ్చేస్తున్నాను.
బ్యాలెన్స్ చేసేందుకు ట్రై చేస్తున్నా
మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది.. వృత్తిలో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలి.. అదే వ్యక్తిగత జీవితం కావాలంటే వృత్తిని త్యాగం చేసుకోక తప్పదు అని! నేను రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. అందుకోసం ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నాను అని భావోద్వేగానికి లోనైంది. రష్మిక చివరగా కుబేర సినిమాలో నటించింది. ప్రస్తుతం థామా, ద గర్ల్‌ఫ్రెండ్, మైసా చిత్రాలు చేస్తోంది.
చదవండి: ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజ్ ఏంటి?