
'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వాన్స్ మాట్లాడుతూ.. నన్ ఆఫ్ అవర్ బిజినెస్ (అది ప్రాథమికంగా మాకు సంబంధించినది కాదు) అని అన్నారు.
ఈ రెండు దేశాలను తాము నియంత్రించలేమని జెడి వాన్స్ అన్నారు. ఇరుదేశాలు దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. రెండు అణుశక్తి దేశాల మధ్య ఇలాంటి ఘర్షణలు అందరికీ ఆందోళనకరమేనని అమెరికా ఉపాధ్యక్షుడు అన్నారు. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గాలని తాము కూడా ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. సాధరణ ప్రజలకు నష్టం జరగకుండా చూడాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా కలుగజేసుకోదని క్లారిటీ ఇచ్చారు. తమ సైన్యం ఎవరికి సాయం చేయదని ప్రకటించారు. ఆపై అటు భారత్‌కు గాని పాకిస్థాన్‌కు గాని యుద్ధం ఆపమని చెప్పలేమన్నారు. అలా అని అణ్వాయుధాల ఉపయోగం ఎట్టిపరిస్థితిల్లోనూ జరగదని ఆయన తేల్చి చెప్పారు.
🚨🇺🇸 ‘NONE OF OUR BUSINESS’: JD Vance on 🇮🇳Indo-🇵🇰Pak escalation pic.twitter.com/EgQuySKbLt
— Sputnik India (@Sputnik_India) May 8, 2025
