
భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. పాక్.. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో సరిహద్దులో ఉన్న అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లలు సైతం చనిపోతుండటం ఎంతో బాధాకరమని జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి 'మెహబూబా ముఫ్తీ' పేర్కొన్నారు.
పాకిస్తాన్ సైనిక చర్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ కాల్పుల్లో పిల్లలు.. మహిళలు మరణిస్తున్నారని అన్నారు. ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ''అప్పటి వరకు ఆడుకుంటున్న కవలలు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయారు''. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? జమ్మూ & కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవారు ఎంతకాలం ఈ బాధను అనుభవించాలి?.. తల్లులకు ఎంతకాలం ఈ కడుపుకోత? అని ప్రశ్నిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
పూంచ్, రాజౌరి, జమ్మూ జిల్లాల్లో పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయి. పాక్ కాల్పులకు 16 మంది మరణించారు. ఇందులో ఐదుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ చర్యకు భారత సైన్యం కూడా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రోన్లు & క్షిపణులను ఉపయోగించి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ మరో ప్రయత్నం చేసింది. అయితే వీటన్నింటి కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది.
#WATCH | Srinagar, J&K | On India-Pakistan tensions, PDP chief Mehbooba Mufti says, "What is the fault of the children and women that they are getting trapped in this crossfire?... Military action treats symptoms, not the root cause. It never provides a solution or peace. Both… pic.twitter.com/n6lCwYlwuj
— ANI (@ANI) May 9, 2025