
ఆపరేషన్ సిందూర్‌పై పార్టీ నేతలతో చర్చించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు ఆపరేషన్ సిందూర్‌పై పార్టీ ముఖ్య నేతలతో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ..
ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
కశ్మీర్‌లోని పహల్గాంలో ఉన్న బైసరన్ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్‌దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.
