భారత్‌-పాక్‌ యుద్ధం.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock Market Updates On May 09 2025, Market Indices In Losses Due To India-pakistan Tensions | Sakshi
Sakshi News home page

Stock Market Updates: భారత్‌-పాక్‌ యుద్ధం.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

May 9 2025 9:28 AM | Updated on May 9 2025 10:51 AM

stock market updates on may 09 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:26 సమయానికి నిఫ్టీ(Nifty) 211 పాయింట్లు నష్టపోయి 24,063కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 542 పాయింట్లు దిగజారి 79,805 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.81 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 63 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.36 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో గతంతో పోలిస్తే లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 1.07 శాతం ఎగబాకింది.

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌–పాకిస్థాన్‌ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమవడంతో స్టాక్‌ సూచీలు ఒడిదొడులకు లోనవుతున్నాయి. ఇటీవల భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా దాడులు చేసిన పాక్‌పై ప్రతీకార చర్యగా లాహోర్‌ గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు భారత రక్షణ శాఖ ప్రకటనతో దలాల్‌ స్ట్రీట్‌ సెంటిమెంట్‌ నిన్న ఒక్కసారిగా మారిపోయింది. ట్రేడింగ్‌ మరో గంటలో ముగుస్తుందనే సమయంలో ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంకింగ్‌ షేర్లలో భారీ విక్రయాలు తలెత్తాయి. అమెరికాతో చైనా, తాజాగా బ్రిటన్‌ వాణిజ్య ఒప్పంద చర్చలు సఫలం అవ్వొచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ

పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్‌ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్‌ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement