
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం ఆపరేషన్ సిందూర్‌కు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన జాతీయ సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, సచివాలయ ఉద్యోగులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.











