2-3 రోజులు ఏటీఎం సర్వీసులు రద్దు..? | PIB Fact Check confirmed that ATMs will function as usual | Sakshi
Sakshi News home page

2-3 రోజులు ఏటీఎం సర్వీసులు రద్దు..?

May 9 2025 1:03 PM | Updated on May 9 2025 2:55 PM

PIB Fact Check confirmed that ATMs will function as usual

టెక్నాలజీ, సామాజిక మాధ్యమాల వాడకం పెరుగుతున్న ఈ రోజుల్లో ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి కూడా అధికమవుతుంది. భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో ఇండియాలోని ఏటీఎంలపై రాన్సమ్‌వేర్‌ దాడి కారణంగా మూడు రోజులపాటు సర్వీసులు పని చేయవన్నట్లు ఫేక్‌ వార్తలొస్తున్నాయి.  వచ్చే వారం మే 12 సోమవారం వరకు ఏటీఎం సర్వీసులు నిలిపేస్తున్నారని అందులో ఉంది. అయితే ఈ రాన్సమ్‌వేర్‌ దాడులు కేవలం భారత్‌ను మాత్రమే కాకుండా 74 ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అబద్ధపు వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఈ వార్తలను కోట్‌ చేస్తూ ఫేక్‌ న్యూస్‌ అని స్పష్టం చేసింది. వాట్సప్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను గుడ్డిగా నమ్మకూడదని తెలిపింది. దేశంలోని ఏటీఎంలపై ఎలాంటి సైబర్‌ దాడులు జరగలేదని తెలిపింది. గతంలోలాగే యథావిధిగా ఏటీఎం సర్వీసులు కొనసాగుతాయని పేర్కొంది. 

ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్‌మెంట్‌ వయసు?

ప్రజలు సాధారణ రోజులతోపాటు ఇలాంటి భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ సమయాల్లో ఫేక్‌ న్యూస్‌కు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి అంశాన్ని ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుని వార్తలపై ఓ నిర్ణయానికి రావాలని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement