Actress
-
నాలుగు పదుల వయసులో మరింత బొద్దుగా ఛార్మి.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
హల్దీ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్ (ఫొటోలు)
-
ఫ్లవర్ గర్ల్‌లా నయనతార (ఫొటోలు)
-
నటి పూర్ణ ఇంట్లో శుభకార్యం.. ఈమె పిల్లలు వీళ్లే (ఫొటోలు)
-
44 ఏళ్ల త్రిషకు ఎందుకింత క్రేజ్... ఇంకా అదే డిమాండ్
-
మరింత ఫ్యాషన్ లుక్‌లో అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)
-
శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ లయ.. ఫోటోలు
-
అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)
-
సీఎం విజయ్ కోసం త్రిష రెడీ అయిందిలా (ఫొటోలు)
-
కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)
-
కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)
-
రోజురోజుకీ మరింత అందంగా కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకం
న్యూఢిల్లీ : నటి ఆకాంక్ష రంజన్ కపూర్ (32) తాను తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్న విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న శారీరక ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే తన ఎగ్ ఫ్రీజింగ్ నిర్ణయం వెనుక గల కారణాన్ని ఆమె మరింత వివరంగా తెలియజేశారు.సోహాఅలీ ఖాన్ పాడ్‌కాస్ట్ 'ఆల్ అబౌట్ హర్' తాజా ఎపిసోడ్లో, ఆకాంక్ష కపూర్ తాను తన అండాలను ఎందుకు ఫ్రీజ్ చేయించుకోవాలనుకున్నదీ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో, ఆకాంక్ష తన అండాలను ఫ్రీజ్ చేయించుకున్నారు. కడుపులో పెద్ద బెలూన్ ఉన్నట్టేఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో భాగంగా ఇచ్చే ఇంజెక్షన్ల వల్ల తాను చాలా నొప్పిని అనుభవించానని ఆకాంక్ష తెలిపారు. శారీరకంగా తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. అయితే ఇది అందరికీ ఇలాగే జరుగుతుందనుకోను, కానీ తన విషయంలో మాత్రం విపరీతమైన నొప్పి ని భరించాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. 2-3 రోజుల పాటు నేను సరిగ్గా నడవలేకపోయాను. కడుపులో ఏదో పెద్ద బెలూన్ ఉన్నట్లుగా అనిపించేది, కనీసం నిటారుగా నిలబడలేకపోయేదాన్ని. తాను చాలా సన్నగా ఉండటం వల్ల అలా అనిపించి ఉండవచ్చని డాక్టర్ చెప్పారని వివరించింది.ఎగ్ ఫ్రీజింగ్ వెనుక రెండు ప్రధాన కారణాలుతన స్నేహితులు గర్భం దాల్చుతున్న సమయంలో అందరూ పలకరిస్తుండటంతో, ఆమె కూడా AMH (Anti-Mullerian Hormone) టెస్ట్ చేయించుకున్నారు. తన వయస్సుతో పోలిస్తే ఆమెలో ఈ హార్మోన్ స్థాయి చాలా తక్కువగా ఉందని తేలింది. (AMH టెస్ట్ ద్వారా ఒక మహిళలో అండాల నిల్వ ఎంత ఉందో తెలుసుకోవచ్చు). తన చుట్టూ ఉన్న చాలా మంది మహిళలు గర్భం దాల్చడానికి ఇబ్బంది పడుతుండటం, సంతానలేమి సమస్యలు ఎదుర్కోవడం చూసి ఆమె ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆకాంక్ష తెలిపారు.ఇది భయం కాదు..ఇన్సూరెన్స్ భయంతో తీసుకున్న నిర్ణయం కాదని, తన భవిష్యత్తు కోసం చేసిన అని స్పష్టం చేసిన ఆకాంక్ష, పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేమన్నారు. ఇదొక బీమా లాంటిదని పేర్కొన్నారు.ముందే చేసి ఉండాల్సింది..ప్రస్తుతం తనకు 32 ఏళ్లని, అసలైతే 20 ఏళ్ల వయస్సులోనే లేదా 20ల మధ్యలో ఈ ప్రక్రియ చేసి ఉంటే అండాలు మరింత ఆరోగ్యంగా ఉండేవని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ఇప్పటికే ఆలస్యం చేశానని ఇది ఎగ్ ఫ్రీజింగ్ గురించి ముందే తెలిసి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. కాగా ఆకాంక్ష రంజన్ కపూర్, దర్శకుడు శరణ్ శర్మ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త బీ-టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆకాంక్ష రంజన్ కపూర్ 'గిల్టీ' (Guilty) వంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్! -
టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష్మి శరత్‌కుమార్ (ఫొటోలు)
-
మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)
-
హీరోయిన్ మెహ్రీన్ మెహందీ వేడుక (ఫొటోలు)
-
అభిమానులతో కలిసి సమంత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సొంతూరిలో పూజాహెగ్డే.. భక్తిలో మునిగిపోయి (ఫొటోలు)
-
ఏప్రిల్ గడిచిందిలా.. హీరోయిన్ రీతూవర్మ (ఫొటోలు)
-
ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)
-
సరైన తిండి పెట్టలేదు.. రెమ్యునరేషన్ అడిగితే బెదిరిస్తున్నారు
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. సినిమాల్లో మాత్రమే అని కాకుండా వెబ్ సిరీస్‌లతోనూ చిన్న చిన్న నటీనటులకు అవకాశాలు దొరుకుతున్నాయి. అలానే ఓ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న మలయాళ యువనటి అనుగ్రహ నంబియార్.. షూటింగ్ సందర్భంగా తనకెదురైన ఇబ్బందుల గురించి, హీరో అతడి భార్యపై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: ఓటీటీలో రాకాస.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది)కేరళకు చెందిన 23 ఏళ్ల నటి అనుగ్రహ ఎస్ నంబియార్.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. 'అడిపోలి' అనే మూవీ కూడా చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో వారం వారం ప్రసారమవుతున్న 'రిసార్ట్' అనే వెబ్ సిరీస్‌లో శ్రీనిధి అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని చెబుతూ ఇన్ స్టాలో దాదాపు 6 నిమిషాల వీడియోని అనుగ్రహ పోస్ట్ చేసింది.'సిరీస్ కోసం అగ్రిమెంట్‌పై సంతకం చేసినప్పటికీ నా పాత్రకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టలేదు. మరే సినిమాల్లోనూ నటించొద్దని చెప్పారు. దీంతో గత నాలుగు నెలలుగా పనిలేకపోయేసరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నిర్మాణ సంస్థని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పట్లేదు. వాళ్లు వీళ్లు అని తప్పించుకుంటున్నారు. నేను చిన్న గ్రామం నుంచి వచ్చిన సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా కలలు అడ్డుకోవడానికి మీకెవరికీ హక్కు లేదు''ఇంకా చెప్పాలంటే షూటింగ్ టైంలో సరైన సౌకర్యాలు లేవు. సరైన భోజనం కూడా పెట్టలేదు. పారితోషికం గురించి అడిగితే బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో కూడా చేరాను. తన పరిస్థితి విషమించి ఉంటే చనిపోయేదాన్ని. నేను ఆస్పత్రిలో చేరితే విజయ్ నిర్లక్ష్యంగా స్పందించాడు. తనపై విజయ్, అతడి భార్య నక్షత్ర అనుచితంగా మాట్లాడిన ఆధారాలు కూడా ఉన్నాయి. నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు. ఈ వ్యవహారంపై నిర్మాతలు, సంబంధిత వ్యక్తులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను' అని అనుగ్రహ చెప్పుకొచ్చింది. సిరీస్ దర్శకనిర్మాతలు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.(ఇదీ చదవండి: రూ. 9 కోట్ల మోసం.. ఫోటోలతో స్పందించిన అషురెడ్డి) View this post on Instagram A post shared by Anugraha S Nambiar (@anugraha_s_nambiar_) -
మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)
-
ఫ్యామిలీతో బుల్లితెర బ్యూటీ మంజుల సమ్మర్ చిల్ (ఫోటోలు)
-
తారలెందరో...తాగుబోతులు కొందరే..
సినిమా సెలబ్రిటీల్లో మద్యపానం చాలా సార్లు ‘‘సోషల్ ఫన్’’గా మొదలై, ఆ తర్వాత అలవాటుగా మారిపోతుంది. షూటింగ్‌ల మధ్య రిలాక్స్ కావడానికి లేదా ఫ్రెండ్స్‌తో కాసేపు టైమ్ స్పెండ్ చేయడానికి సాకుగా మొదలయే డ్రింకింగ్, తర్వాత తర్వాత పలు సందర్భాల్లో కంట్రోల్ తప్పే పరిస్థితులు తీసుకువస్తుందని పెద్ది హీరోయిన్ జాన్వీకపూర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఎప్పుడు ఆపాలో తెలుసుకోవడం అవసరం అంటారామె‘‘లైఫ్‌లో బ్యాలెన్స్ చాలా ముఖ్యం’’ అన్నదే ఆమె మెసేజ్. ‘‘మద్యం అలవాటు గురించి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు’’ అని చెప్పింది. ఆమె సందేశం స్పష్టంగా ఉంది ‘‘అడిక్షన్ అంటే తప్పు కాదు అది ఒక సమస్య. దానికి పరిష్కారం అవసరం. అంటూ అమహ అనే స్వఛ్చంద సంస్థతో కలిసి ఇటీవలే ఆమె ఆఫ్ ద రాక్స్ పేరుతో మద్యపానంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ నేపధ్యంలో మద్యం తాగి పడిపోయి మృతి చెందారని తన తల్లి శ్రీదేవి మరణం గురించి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా మహానటి సావిత్రి సహా అనేక మంది స్టార్ల జీవితాలను మద్యం మహమ్మారి పొట్టన బెట్టుకున్న కధలూ మనకు తెలుసు. సినీ ప్రముఖుల్లో కొందరు ఆ అలవాటుకే జీవితాన్ని అర్పించుకుంటే మరికొందరు మాత్రం తొలుత మత్తు కోరల్లో చిక్కినప్పటికీ ఆ తర్వాత దాని నుంచి విజయవంతంగా తప్పించుకోగలుగుతారు. అలాంటి వారే యువ తారలకు స్ఫూర్తిగా నిలుస్తారు. సీసా వదిలేశాకే....సీన్ మారింది...‘‘బాటిల్ నుంచి బయటపడిన తర్వాతే నిజమైన నన్ను తిరిగి పొందాను’’అంటూ చెప్పారు నటి, దర్శకురాలు పూజా భట్. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మద్యం అలవాటుపై ఓపెన్ గా మాట్లాడారు యుక్త వయసులో మద్యానికి అలవాటు పడిన తాను 45 ఏళ్ల వయసులో దాని నుంచి బయటపడాలనే కీలక నిర్ణయం తీసుకున్నానని ఆమె చెప్పారు. ‘‘నేను ఇంకో 10 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలంటే ఇప్పుడే మద్యం వదలేయాలి అనిపించింది. లేదంటే అదే నన్ను నాశనం చేసేస్తుందని అర్ధమైంది’’ అని అన్నారామె.తన జీవితంలో మద్యం ఒక ‘బ్యాండ్ఎయిడ్’లా (ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే దానికి చేసే ప్రాధమిక చికిత్స) మారిపోయిందని, ప్రతీసారీ తన బాధను మర్చిపోవడానికి దానిని ఉపయోగించేదానినని ఆమె పంచుకుంది.‘‘చెడు సంబంధం, మద్యం ఇవి రెండూ నన్ను బాధ నుంచి తప్పించడానికి నేను వాడుకున్న సాధనాలే,’’ అని ఆమె చెప్పింది. అయితే చివరకు తనను తాను అర్థం చేసుకుని, జీవితంలో ఎదురైన ఖాళీని ఎదుర్కొని ముందుకు సాగానని చెప్పింది. ‘‘నేను బాటిల్‌ను పూర్తిగా వదిలేశాను ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా సోబర్‌గా ఉన్నాను,’’ అని ఆమె సగర్వంగా ప్రకటించింది.నమ్మించి నాశనం చేస్తుంది‘‘మద్యం నెమ్మదిగా నా జీవితంలోకి వచ్చింది. ఒక దశలో దానివల్ల నా జీవితం తలకిందులైంది, ఈ అలవాడు మొదట మనకు ఎంతో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంత కాలం తర్వాతే దాని వల్ల మనం నాశనం అవుతున్నాం అనేది తెలుస్తుంది. అది నిజానికి ఏ సమస్యకు పరిష్కారం కాదు’’ అంటారు ఒకనాటి అందాల తార మనీషా కొయిరాలా.. హౌ కేన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్ పేరిట తను రాసిన పుస్తకంలో ఆమె తన జీవితానుభవాల్లో మద్యం వ్యసనం గురించి వివరించారు. ‘‘ సంబంధాలు కావచ్చు, మద్యం లాంటి అలవాట్లు కావచ్చు జీవితంలో ఏదైనా పరే... మనమే నియంత్రించాలి. లేదంటే మనమే బాధితులం అవుతాం,’’ అని స్పష్టంగా చెబుతారు.విస్కీ నుంచి విముక్తి...‘‘ఒకప్పుడు విస్కీకి బాగా అలవాటు పడిపోయాను ఓ రకంగా చెప్పాలంటే విస్కీకి బానిసయ్యాను’’ అంటూ గుర్తు చేసుకుంటారు శృతిహాసన్. క్రమక్రమంగా దాని వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్... ఇంకా ఎన్నో చుట్టుముట్టాయని తాను గుర్తించానని తెలిపారు. మద్యం తన జీవితాన్ని నియంత్రిస్తున్నదని గ్రహించి దాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆమె తన జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నారు. ముఖ్యంగా నైట్ పార్టీలు, మద్యం ఉప్పోంగే విందు వినోదాల వాతావరణానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకుంది. ‘‘ఇప్పుడు వ్యసనం నుంచి పూర్తిగా స్వేచ్ఛ లభించింది. దీని గురించి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు నా జీవితం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది,’’ అని సంతోషం వ్యక్తం చేశారు. -
రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న హీరోయిన్ మానస వారణాసి (ఫొటోలు)
-
విషాదం.. గుండెపోటుతో 30 ఏళ్ల నటి మృతి
చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గుండెపోటుతో హర్యానా నటి దివ్యాంక శిరోహి(30) మృతి చెందారు. మంగళవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం ఘజియాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్దివ్యాంక స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఆమెకు సోదరుడు హిమాంశు, సోదరీమణులు దీపాంశు. జస్మీత్ ఉన్నారు. 1996 నవంబర్ 19న జన్మించిన దివ్యాంక.. మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో బీసీఏ, సిక్కింలో ఎంబీఏ డిగ్రీని పూర్తి చేసి చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. గాయకుడు మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్ కూడా చేశారు. 50కి పైగా హర్యానా పాటలలో నటించడమే కాదు, మాసూమ్ శర్మ, అమిత్ సైని రోహ్తకియా, కేడీ వంటి ప్రముఖులతో కలిసి తెరను పంచుకున్నారు.టిక్‌టాక్‌తో ఫేమస్..టిక్‌టాక్‌తో ఫేమస్ అయిన నటి దివ్యాంక. పంజాబీ గాయని సునంద శర్మ పాడిన 'మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ' అనే పాటకు దివ్యాంక చేసిన టిక్‌టాక్ బాగా వీడియో వైరల్ అయింది. ఆ వీడియోకు దాదాపు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత టిక్‌టాక్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 5 కోట్లకు చేరింది. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయిపోయాక ఆమె ఇన్ స్టాగ్రాం బాట పట్టింది. ఇన్‌స్టాగ్రాంలో కూడా 1.3 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల వయసులోనే దివ్యాంక ఇలా గుండెపోటుతో చనిపోవడంతో ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. View this post on Instagram A post shared by Divyanka (@divyankaasirohi) -
మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)
-
హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)
-
కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్ (ఫొటోలు)
-
ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)
-
నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)
-
టాలీవుడ్ నటి అభినయ పెళ్లికి ఏడాది.. సోషల్ మీడియాలో పోస్ట్ (ఫోటోలు)
-
బర్త్‌డే స్పెషల్.. రష్మిక చిన్నప్పటి క్యూట్ ఫోటోలు
-
నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)
-
డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)
-
'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
రూటు మార్చిన శృతి హాసన్.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)
-
పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)
-
నటీమణులు షాకింగ్ వెయిట్ లాస్ : కేవలం నీళ్లు, మద్యం
గంటల కొద్దీ జిమ్‌లో కసరత్తు, ఆహార నియమాలు పాటించిన వారికే బరువు తగ్గడం అంత సులువు కావడం లేదు. తాము నటించే పాత్రలకోసం విపరీతంగా బరువు తగ్గిన వారిని చాలామందిని చూశాం. కానీ విచిత్రమైన పద్దతుల్లో కొరియన్ నటీమణుల విపరీతమైన బరువు తగ్గుదల అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది. వివరాలు ఉన్నాయి.కొరియన్ నటీమణుల విపరీతమైన బరువు తగ్గుదల, వారు పాటిస్తున్న కఠినమైన డైట్ ప్లాన్ ఇపుడు నెట్టింట చర్చనీ యాంశంగా మారాయి. ప్రముఖ కొరియన్ నటీమణులు కిమ్ జి-వోన్, హా జి-వోన్, పార్క్ మిన్-యంగ్ ఇటీవల బాగా బరువు తగ్గి ఆన్లైన్లో ట్రెండింగ్‌లో ఉన్నారు. వీరు గతం కంటే చాలా సన్నగా కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు వారి అంకితభావాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు వారి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అభిమానులలో ఆందోళన పుట్టిస్తున్న డైట్ వివరాలు ఇలా ఉన్నాయి కిమ్ జి-వోన్ (Kim Ji-won): మిలన్లో జరిగిన బల్గారి (Bvlgari) జ్యువెలరీ ఈవెంట్లో ఈమె కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. మునుపటి కంటే చాలా సన్నగా మారడంతో అభిమానులు సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by BVLGARI Official (@bvlgari) హా జి-వోన్ (Ha Ji-won): తన కొత్త డ్రామా 'క్లైమాక్స్' (Climax) కోసం ఈమె కావాలనే బరువు తగ్గారు. సాధారణంగా ఆరోగ్యకరమైన ఇమేజ్ ఉన్న ఈమె, తన పాత్ర కోసం కండరాల శాతాన్ని తగ్గించుకుని మరీ బలహీనంగా కనిపించేలా శరీరాన్ని మార్చుకున్నారు. "నన్ను నేను మార్చుకోవడం నటన కంటే కష్టమైంది" అని ఆమె పేర్కొన్నారు.పార్క్ మిన్-యంగ్ (Park Min-young): ఈమె డైట్ పద్ధతి అందరినీ షాక్‌కు గురిచేసింది. గతంలో 'మ్యారీ మై హస్బెండ్' అనే ప్రాజెక్ట్ కోసం 37 కిలోలకు తగ్గిన ఆమె, తాజా డ్రామా 'సైరన్' (Siren) కోసం అదే పద్ధతిని కొనసాగించారు. ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!కేవలం నీళ్లు , ఆల్కహాల్ డైట్?పార్క్ మిన్-యంగ్ తన పాత్ర కోసం వివరిస్తూ, "నేను బరువు పెరిగితే ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే కేవలం నీళ్లు , ఆల్కహాల్‌ను మాత్రమే ఆహారంగా తీసుకున్నాను. షూటింగ్ సమయంలో రోజుకు 3 లీటర్ల నీరు తాగేదాన్ని" అని వెల్లడించారు. అయితే షూటింగ్ ముగిసిన తర్వాత తిరిగి సాధారణ ఆహారం తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు.నటీనటులు తమ పాత్రల కోసం ఇలాంటి ప్రాణాంతకమైన డైట్లు చేయడం, చాలా కఠినమైన వ్యాయామాలు చేయడం కేవలం నీటిపైనే ఆధారపడటం వంటివి సమాజంలో ఎలాంటి ప్రమాణాలను నెలకొల్పుతున్నాయనే చర్చకు దారితీసింది. నటన కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
ఉగాండా ఏజెంట్‌తో రన్యారావు డీల్
బెంగళూరు: కన్నడ నటి రన్యారావు, ఆమె అనుచరులు నిర్వహిస్తున్న బంగారం స్మగ్లింగ్ దందాలో ఈడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.102 కోట్ల విలువచేసే బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తరలించారని ఈడీ కోర్టులో చార్జిïÙట్ వేసింది. ఇందులో ఉగాండా దేశానికి చెందిన ఏజెంటుతో నటి రన్యకు లింకులు ఉన్నట్లు తెలిపింది. ఈడీ చార్జిషిటులో పేర్కొన్న ప్రకారం ఆమె దుబాయ్ నుంచే కాకుండా ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా బంగారాన్ని అక్రమంగా తరలించేది. దీనికోసం ఉగాండా ఏజెంట్‌తో సంప్రదించింది. దీనికోసం దుబైలో వీరా డైమండ్ ట్రేడింగ్ అనే పేరుతో కంపెనీని కూడా తెరిచింది. రన్యారావు స్నేహితుడు రాజు, సదరు ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.33 లక్షలు చెల్లించారు. 2024, జనవరిలో రాజు బంగారం తేవడానికి ఉగాండాకు వెళ్లగా ఆ ఏజెంట్ తనకు మరింత ఎక్కువ డబ్బు.. అంటే రూ.1.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు తెలిసింది. రాజు వట్టిచేతులతో వచ్చాడు. స్మగ్లింగ్ కేసుల్లో అరెస్టయిన రన్య బెంగళూరు పరప్పన జైల్లో గడుపుతోంది. -
వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్.. ఇప్పుడు నేను (ఫొటోలు)
-
ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)
-
ఫేమస్ వినాయక దేవాలయంలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మాళవిక (ఫొటోలు)
-
'అవకాశాలు తర్వాత.. బరువు తగ్గు'.. ఏడ్చుకుంటూ వెళ్లా!
నటి సంభావన సేత్.. భోజ్‌పురి సినిమాల్లో ఎన్నో ఐటం సాంగ్స్ చేసింది. హిందీలోనూ నటిగా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్పెషల్ సాంగ్స్‌లో స్టెప్పులేసింది. అటు బుల్లితెరపై బిగ్‌బాస్, రాజ్ పిచ్లే జనం కా, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్కె ఖిలాడీ 4 ఇలా అనేక రియాలిటీ షోలలో పాల్గొంది.రెండో సీజన్లో పార్టిసిపేషన్అయితే తనకు ఓ స్టార్ హీరో అవకాశాలిస్తానని చెప్పి ఆ తర్వాత తన ఆశలపై నీళ్లు చల్లాడంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంభావన సేత్ మాట్లాడుతూ.. నేను హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొన్నాను. నాలుగో సీజన్లో స్టేజీపై పర్ఫామెన్స్ చేశాను. అప్పుడు నటుడు రవికిషన్.. నేను భోజ్‌పురిలో మంచి పేరున్న డ్యాన్సర్ అని సల్మాన్ ఖాన్‌కు పరిచయం చేశాడు. ఫోన్ నెంబర్ కూడా..అందుకాయన.. ఇప్పుడే చూశాగా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తోందని మెచ్చుకున్నాడు. నేను కొంత ధైర్యం తెచ్చుకుని తన సినిమాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగాను. వెంటనే ఆయన తప్పకుండా ఇస్తానన్నాడు. తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. షో అయిపోయిన కొంతకాలానికి నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లాను. అప్పుడతడు కాస్త చిరాకుగా ఉన్నాడు. కానీ బానే మాట్లాడాడు. ఏడ్చుకుంటూ వెళ్లా.సినిమా అవకాశం ఇస్తానన్నారు కదా అని గుర్తు చేశాను. అందుకు సల్మాన్.. నాకు గుర్తు లేదు కానీ మీరు కాస్త బరువు తగ్గాలి.. మరో విషయమేంటంటే ఇండస్ట్రీలో నేనెవర్నీ ప్రమోట్ చేయను అని ముక్కుసూటిగా చెప్పాడు. ఆ మాటలు నన్నెంతో బాధపెట్టాయి. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. కానీ, ఇప్పటికీ నేను సల్మాన్ ఖాన్ అభిమానినే అని చెప్పుకొచ్చింది.చదవండి: 66 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్? నటి ఏమందంటే? -
వాళ్లిద్దరి వల్లే ట్రిప్ ఎంతో స్పెషల్: మెహరీన్ (ఫోటోలు)
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్.. ఇబ్బందిపడ్డా: హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కంటే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అంటుంది నటి సమీరా రెడ్డి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. కలర్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుందని, తాను కూడా ఇది ఫేస్ చేశానని చెబుతోంది. తెలుగులో `నరసింహుడు`, `అశోక్` ‘జై చిరంజీవా’ లాంటి సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ.. 2014లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శరీరంలో భారీ మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా మారడంతో..సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ట్రోల్స్ గురించి, ఇండస్ట్రీలో హీరోయిన్గా తాను ఎదుర్కొన్న సవాళ్లను గురించి వివరించింది.‘సినిమా ఇండస్ట్రీలో అందానికే ఎక్కువ ప్రాధాన్యత. టాలెంట్ గురించి పట్టించుకోరు. తెల్లతోలు వ్యామోహం నన్ను చాలా ఇబ్బందికి గురి చేసింది. సాధారణంగా ఓ నటిగా, మహిళగా ఎప్పుడూ అందంగా ఉండడానికే ప్రయత్నించాను. కానీ మరింత అందంగా కనబడాలంటూ నాకు మేకప్ వేసేవాళ్లు. ముఖానికి మాత్రమే కాకుండా.. శరీరానికి కూడా మేకప్ వేసుకోవాలని ఒత్తిడి చేశారు. అలా చెప్పడం నన్ను చాలా బాధించింది. నిజంగానే నేను అందంగా లేనేమో అనే భావన నాలో కలిగింది. అంతేకాదు, నేను స్లిమ్‌గా లేనని బాధపడేదాన్ని. నేను చాలా పొడుగ్గా ఉండడంతో.. వయసులో పెద్దదిగా చూసేవాళ్లు. అది నా మైండ్‌లో అలా ఉండిపోయేది. ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు నా బాడీ సైజు గురించే మాట్లాడేవాళ్లు కానీ.. టాలెంట్, యాక్టింగ్ గురించి చర్చ జరిగేది కాదు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తే.. 'అసలు వాళ్లు చెప్పినట్లు ఎందుకు చేశాను. అలా అనుమతి ఇవ్వకుండా ఉండాల్సింది అనిపిస్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో కామన్. అలా చేయకతప్పదు’ అని సమీరా(Sameera Reddy) చెప్పుకొచ్చింది.ఇక బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ.. ‘పిల్లలు పుట్టిన తర్వాత నా శరీరంలో మార్పు వచ్చింది. వెయిట్ గైన్ అవ్వడం వల్ల నా ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయాను.. ఆ సమయంలో నెటిజన్స్ నుంచి ఎదురైన విమర్శలు మానసికంగా నన్ను ఆవేదనకు గురి చేశాయి. ఇక రెండోసారి తల్లి అయినప్పుడు మాత్రం నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతటి దారుణమైన కామెంట్స్ చేసినా.. ఆ నెగిటివ్ కామెంట్స్ చూస్తే నాకేమీ అనిపించడం లేదు. నేను ప్రస్తుతం న్యూట్రల్ గానే ఉన్నాను' -
బాక్సర్‌లా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
-
గ్రాండ్‌గా హీరోయిన్ శ్రద్ధాదాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ట్రెండింగ్ బ్యూటీ గిరిజా ఓక్ ఫన్నీ మూమెంట్స్ (ఫొటోలు)
-
తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
-
ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)
-
ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు
-
జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)
-
మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి.. మేము ఆడవాళ్ళం బొమ్మలు కాదు
-
బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో గ్లామరస్ హీరోయిన్ సందడి (ఫొటోలు)
-
వాడు అమ్మాయిల పిచ్చోడు అందుకే వదిలేసా బ్రేకప్ పై తొలిసారి స్పందించిన హీరోయిన్
-
కొత్త ప్రియుడుతో కలిసి పాత లవర్ హత్య
బెంగళూరులోదారుణం చోటు చేసుకుంది. టీవీ నటి పార్టీ పేరుతో పిలిచి ప్రియుడిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని మంజునాథనగర్‌లో ఫిబ్రవరి 18న జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన హత్య దాదాపు 12 రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.గత కొన్ని రోజులుగా టీవీ నటి నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ కృష్ణా రావు (40) కొంత కాలంగా 'లివ్-ఇన్' రిలేషన్షిప్లో ఉన్నారు. తాజాగా లారీ డ్రైవర్ వినయ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మోహన్ రావు వ్యతిరేకించడంతో అతని హత్యకు పూనుకున్నారని నార్త్-వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) డీల్ నాగేష్ తెలిపారు.ఇదీ చదవండి: న్యూక్లియర్ వాచ్ డాగ్ వార్నింగ్, స్పందించని ఇరాన్దీంతో తన పెళ్లికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా మోహన్ రావును వదిలించుకోవడానికి ప్లాన్ వేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం బిందు, మోహన్ కలిసి ఉంటున్న ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారు. ఫుల్‌గా మద్యం సేవించిన తర్వాత, వినయ్ తన స్నేహితుడు ధనుష్‌తో కలిసి మోహన్ రావుపై ఎటాక్ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి, నోటికి, ముక్కు టేపులు వేసి మరీ మోహన్ రావును పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో ఊపిరి ఆడకపోవడంతో మోహన్ రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.అయితే హత్య జరిగిన 12 రోజుల తర్వాత, ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మోహన్ రావు మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఈ క్రైమ్‌లో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ జరుపుతున్నారు. బిందు 'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. -
తీహార్ జైల్లో 4 నెలలు.. చావు కోసం ఎదురుచూశా: నటి
మనీలాండరింగ్ కేసులో నాలుగు నెలలపాటు తీహార్ జైలులో శిక్ష అనుభవించింది నటి, ఇన్ఫ్లుయెన్సర్ సందీప విర్క్. తాజాగా తన జైలు జీవితం గురించి చెప్తూ భావోద్వేగానికి లోనైంది. సందీప మాట్లాడుతూ.. నా శత్రువు కూడా అలాంటి ప్రదేశంలో ఉండకూడదని కోరుకుంటున్నాను. తొలిసారి తీహార్ జైలులో అడుగుపెట్టినప్పుడు దేవుడెందుకింత శిక్ష విధించాడని ఎంతో బాధపడ్డాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో..అక్కడి వాతావరణం కూడా భయానకంగా ఉంది. గత జన్మలో తెలిసో తెలియకో ఏదో పాపం చేసుంటాను, ఆ కర్మ నన్ను ఇలా వెంటాడుతోందని భావించాను. దేవుడా, నన్ను త్వరగా తీసుకెళ్లు అని ఎన్నోసార్లు వేడుకున్నాను. జైల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ వచ్చి మనల్ని కలుస్తుంటే మరింత బాధేసేది. నా వల్ల వారు జైలుకు రావాల్సి వచ్చినందుకు క్షమాపణలు చెప్పాను. కానీ నేనేంటో తెలిసిన నా పేరెంట్స్, కుటుంబం నాకు అండగా నిలబడ్డారు.కన్నీళ్లు ఆగవుతీహార్ జైల్లో ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా కుంగిపోయాను. తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పటికీ ఆ జైలు జీవితం గుర్తొస్తుంటే కన్నీళ్లు ఆగవు. వాష్‌రూమ్స్ ఎంతో మురికిగా ఉంటాయి. నేలపై పడుకోవాలి. తిండి దారుణంగా ఉంటుంది. నాలుగు రోటీలు, అన్నం, పప్పు.. రోజూ ఇదే ఉంటుంది. ఏమీ తినాలనిపించదు. కొందరు పోలీసులు జాలి చూపిస్తారు. మరికొందరు వారి ఫ్రస్టేషన్, కోపాన్నంతా ఖైదీలపై చూపిస్తారు. ఇద్దరు మహిళలకు సాయంకానీ జైల్లో డబ్బు లేకుండా ఏ పనీ జరగదు. పైసా లేదం,న టే వాళ్లను ఎవరూ పట్టించుకోరు. ఒక మహిళ రూ.3000 దొంగతనం చేసిన కేసులో నాలుగునెలలుగా జైల్లో ఉంటోంది. తనకు అంధురాలైన తల్లి ఉంది, తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. నేను బయటకు వచ్చాక తనకు సాయం చేస్తానని మాటిచ్చాను, ఆ మాట నిలబెట్టుకున్నాను. మరో మహిళ.. భర్త చేసిన ఆర్థిక మోసానికిగానూ ఆరునెలలుగా శిక్ష అనుభవిస్తోంది. తనకు కూడా మధ్యంతర బెయిల్ వచ్చేందుకు సహకరించాను అని చెప్పుకొచ్చింది.చదవండి: లక్కీ మూవీ.. ఓటీటీ రివ్యూ -
వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మృణాల్ (ఫొటోలు)
-
జాలీగా గడిపేస్తున్న మెహరీన్ (ఫోటోలు)
-
పిల్లాడే కాదు, మేమూ మిస్ అవుతాం: కాజల్ (ఫోటోలు)
-
ప్రియుడితో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఒకదానికొకటి సంబంధమే లేదు.. మీనాక్షి చౌదరి ఫన్నీ (ఫొటోలు)
-
థాయ్‌ల్యాండ్ ఏనుగులతో రీతూవర్మ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)
-
హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో బ్రిటీషర్‌ని పెళ్లాడిన నటి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
-
ట్రెండింగ్‌లో రుక్మిణి వసంత్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష (ఫోటోలు)
-
ఉంగరాల జుట్టుతో ఎపిక్ హీరోయిన్ (ఫోటోలు)
-
హ్యాపీ బర్త్ డే కేరళ కుట్టీ.. అనుపమ పరమేశ్వరన్ స్పెషల్ (ఫొటోలు)
-
డాక్టర్‌గా హీరోయిన్ శ్రీలీల.. పట్టా అందుకున్న మధుర క్షణాలు (ఫొటోలు)
-
కశ్మీర్ అందాలు ఆస్వాదిస్తోన్న హీరోయిన్ లక్ష్మీరాయ్ (ఫోటోలు)
-
హీరోయిన్ స్నేహ బిజినెస్.. సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఎల్లో డ్రెస్‌లో నిహారిక కొణిదెల అందాలు (ఫొటోలు)
-
రెండోసారి ప్రెగ్నెన్సీ.. నటి పూర్ణ బేబీ బంప్ (ఫొటోలు)
-
తెలుగు తెరపై కొత్తందం
ప్రతి ఏడాది తెలుగు తెరపై కొత్త అమ్మాయిలు మెరుస్తుంటారు. కొత్త కథానాయికలు ఎందరొచ్చినా అందరికీ తెలుగు తెర చోటు కల్పిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది వెండితెరను మెరిపించేందుకు, తమలోని నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కొంతమంది కథానాయికల వివరాలపై ఓ లుక్ వేద్దాం.లక్కీ చాన్స్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌తో తొలి సినిమా అంటే ఏ హీరోయిన్‌కు అయినా లక్కీ చాన్స్ అనే చెప్పోచ్చు. ఈ లక్కీ చాన్స్ ఇమాన్వీ ఇస్మాయిల్‌కు దక్కింది. ‘సీతారామం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ఫౌజి’. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్గా చేస్తున్నారు. దేశభక్తి, ప్రేమ, కర్తవ్యం వంటి అంశాల మేళవింపుతో 1940 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.తొలి సినిమాయే ప్రభాస్ వంటి టాప్ హీరోతో నటిస్తుండటం, పైగా జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఇమాన్వీకి కెరీర్ పరంగా ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘ఫౌజి’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. ఈ సినిమాకు సహ– నిర్మాతగా శివ చనన వ్యవహరిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.వెల్కమ్ జోయా రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలోని ‘యానిమల్’ చిత్రం 2023లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో గీతాంజలి పాత్రలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించగా, కథలో కీలకమైన జోయా పాత్రధారిగా త్రిప్తీ దిమ్రి నటించారు. జోయా పాత్రలో త్రిప్తి నటనకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ ‘యానిమల్’ సినిమా తెలుగులో కూడా విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో కూడా పడ్డారు త్రిప్తి. అప్పట్నుంచి ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఫలానా హీరోతో ఉంటుందనే ప్రచారం సాగింది.కానీ ఫైనల్‌గా ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘స్పిరిట్’ చిత్రంతో త్రిప్తీ దిమ్రి టాలీవుడ్‌కు వస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ చేస్తున్న తొలి స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ‘స్పిరిట్’ కావడం విశేషం. అంతేకాదు... ‘యానిమల్’ సినిమాతో త్రిప్తీకి పాపులారిటీ తెచ్చిపెట్టిన సందీప్ రెడ్డివంగాయే ‘స్పిరిట్’ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది.తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ వంటి భారతీయ భాషలతో పాటు జపాన్ వంటి విదేశీ భాషల్లోనూ ‘స్పిరిట్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిపోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. డాక్టర్ పాత్రలో నటిస్తున్నారట త్రిప్తీ దిమ్రి. ప్రభాస్, త్రిప్తి ఈ చిత్రంలో భార్యాభర్తలుగా నటిస్తున్నారని సమాచారం. ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ప్రకాశ్‌రాజ్, కాంచన, వివేక్ ఓబెరాయ్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సీతా పయనం యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యా అర్జున్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన బహుభాషా చిత్రం ‘సీతా పయనం’ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోనే ఐశ్వర్యా అర్జున్ హీరోయిన్గా నటించారు. ఐశ్వర్యకు తొలి తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. ఇలా తన తండ్రి డైరెక్షన్ వహించి, నటించిన సినిమాతో ఐశ్వర్య తెలుగులోకి వస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ధ్రువ సర్జా గెస్ట్ రోల్ చేశారు.ఆకాశంలో ఒక తార ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సినీ తారగా తెలుగుకి వస్తున్నారు సాత్విక వీరవల్లి. ఈ సినిమాలో ఓ చాలెంజింగ్ రోల్ చేస్తున్నారు సాత్విక. ఓ మారుమూల పల్లె నుంచి వచ్చి, తన కలలను సాకారం చేసుకోవాలని తాపత్రయపడే అమ్మాయి పాత్రలో సాత్విక నటిస్తున్నారని తెలిసింది. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా, సాత్విక వీరవల్లి హీరోయిన్గా చేస్తున్నారు. మరో హీరోయిన్ శ్రుతీహాసన్ ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో పవన్ సాధినేని దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ 80 శాతం పూర్తయింది. ఈ వేసవిలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ పీరియాడికల్ ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ మూవీకి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు.శ్రీను–మంగల లవ్‌స్టోరీ బాలీవుడ్లో వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ అయిన రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ వంటి సినిమాలను తెరకెక్కించిన అజయ్ భూపతి డైరెక్షన్లో రానున్న ఇంటెన్స్ లవ్‌స్టోరీ సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్‌స్టార్ కృష్ణ, మహేశ్‌బాబుల నటవారసత్వాన్ని కొనసాగిస్తూ, జయకృష్ణ ఘట్టమనేని ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.ఈ సినిమాలోనే రషా తడానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ పీరియాడికల్ లవ్‌స్టోరీ చిత్రంలో శ్రీను పాత్రలో జయకృష్ణ ఘట్టమనేని నటిస్తుండగా, మంగ పాత్రలో రషా తడానీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి మంగ ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా రెండో షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. సి. అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పతాకంపై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలిసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరకర్త.లెగసీ ‘లెగసీ’ అనే ΄పొలిటికల్ మూవీతో టాలీవుడ్‌కి వస్తున్నారు కన్నడ హీరోయిన్ ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ హీరోగా సాయికిరణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ΄పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘లెగసీ’. ‘పాలిటిక్స్ ఈజ్ పర్సనల్’ అనేది ఉపశీర్షిక. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంతోనే ఏక్తా రాథోడ్ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. గతంలో ‘సిలికాన్ సిటీ, మాస్టర్ పీస్’ వంటి చిత్రాల్లో నటించారు ఏక్తా రాథోడ్. విశ్వక్ సేన్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తెలుగు అమ్మాయి హరికృష్ణ మనవడు, జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘సీతయ్య, దేవదాసు, లాహిరి లాహిరి లాహిరిలో, యువరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వైవీఎస్ చౌదరి కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి వీణా రావు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. వీణ మంచి కూచిపూడి డ్యాన్సర్ కూడా. నటనలో దాదాపు ఏడాదిన్నర కాలం శిక్షణ తీసుకున్న తర్వాత హీరోయిన్గా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లుగా వీణ చెప్పారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ, రిలీజ్ వంటి అంశాలపై అప్డేట్ రావాల్సి ఉంది. ⇒ పదేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్లో నటించిన ‘దాగుడు మూత దండాకోర్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు సారా అర్జున్. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘΄పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో నందిని (నందిని రోల్‌ను ఐశ్వర్యా రాయ్ చేయగా, ఈ రోల్ యంగ్‌గా ఉన్నప్పటి సీన్స్‌లో సారా అర్జున్ నటించారు) పాత్రలో నటించి, యంగ్ యాక్టర్‌గా పాపులర్ అయ్యారు సారా. కాగా ఈ ఫిబ్రవరి 6న థియేటర్స్‌లో విడుదలైన ‘యుఫోరియా’ సినిమాతో ఓ లీడ్ యాక్టర్‌గా తెలుగు చిత్రపరిశ్రమకు సారా అర్జున్ పరిచయం అయ్యారు.గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రంలోని సారా నటన తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. అలాగే సారా అర్జున్ ఓ లీడ్ రోల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘మ్యాజిక్’ విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఇంకా రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా గత ఏడాది డిసెంబరులో విడుదలై, ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర యాలినా జమాలిగా సారా నటించారు. హీరోయిన్గా హిందీలో సారా అర్జున్‌కు ఇది తొలి చిత్రం కావడం విశేషం.⇒ ‘ది రాజాసాబ్’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు హీరోయిన్ మాళవికా మోహనన్. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో భైరవి అనే పాత్రలో కనిపించారు మాళవిక. ఈ చిత్రంలో భైరవిగా ఓ యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశారు మాళవిక. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ది రాజాసాబ్’ సినిమా కంటే ముందే మాళవికా మోహనన్ ఎంట్రీ తెలుగులో జరగాల్సింది. విజయ్ దేవరకొండ, మాళవికా మోహనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కాల్సిన ఓ సినిమా క్యాన్సిలైంది. ఆ తర్వాత ప్రభాస్ ‘సలార్’ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం మాళవికా మోహనన్ పేరును ఈ చిత్రదర్శకుడు ప్రశాంత్ నీల్ పరిశీలించారు. కానీ ఈప్రాజెక్ట్‌లో మాళవిక పేరు ఫైనలైజ్ కాలేదు. ఈ చాన్స్ శ్రుతీహాసన్‌కు దక్కింది. ఇలా... మాళవిక టాలీవుడ్ రాక కాస్త ఆలస్యమైంది. ఇలా ఈ ఏడాది తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్న హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)
-
ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)
-
ఎవరూ సాయం చేయలేదు.. ప్రముఖ నటి మృతి
టాలీవుడ్లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క అనారోగ్యంతో మరణించారు. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తన వైద్యం కోసం రూ. 35 లక్షలు ఖర్చు అవుతుందని నటి కరాటే కల్యాణి సోషల్‌మీడియా వేదికగా కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేశారు కూడా.. ఆయితే, దాతల నుంచి సరైన సాయం అందకపోవడంతో వాహిని మరణించడం బాధాకరం.ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వాహిని బుధవారం సాయంత్రం (2026 ఫిబ్రవరి 4న) తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని నటి కరాటే కల్యాణి తెలిపారు. తనను కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశానని బాధతో ఆమె పోస్ట్ చేశారు. తన సొంత ఊరు విజయనగరంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కళ్యాణి చేసిన పోస్ట్, సినీ అభిమానులను, నెటిజన్లని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.ఎవరీ వాహిని?విజయనగరంలో జన్మించిన వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. చివరగా పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నటించింది. నరేశ్, విజయకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో కథానాయికగా వాహిని నటించి ప్రశంసలు పొందింది.కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారని తనకు ఆర్థిక సాయం చేయాలని కరాటే కల్యాణి కోరారు. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదని కల్యాణి చెప్పుకొచ్చారు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు ఇవ్వాలని కల్యాణి కోరారు. కానీ, సరైన సమయంలో ఆమెకు ఎవరూ సాయం చేయకపోవడంతో మరణించారు. కేవలం డబ్బు కారణంగా వాహిని మరణించారని తెలుసుకున్న నెటిజన్లు బాధతో పోస్టులు పెడుతున్నారు. -
నేను తప్పు చేసినా సహించావ్.. సంఘవి ఎమోషనల్ (ఫోటోలు)
-
జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)
-
హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
చీరలో వావ్ అనేలా స్రవంతి (ఫొటోలు)
-
రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ లేటేస్ట్ పిక్స్ (ఫొటోలు)
-
ప్రియాంక చోప్రా జనవరి జ్ఞాపకాలు.. కూతురు, భర్తతో చిల్ మోడ్ (ఫొటోలు)
-
కొంచెం నాటీ కొంచెం స్వీట్.. లంగా ఓణీలో మీనాక్షి (ఫొటోలు)
-
ఈ టాలీవుడ్ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
యంగ్ లుక్‌లో హీరోయిన్ సదా పోజులు (ఫొటోలు)
-
బ్లాక్ డ్రస్‌లో భాగ్యశ్రీ డిఫరెంట్ లుక్స్ (ఫొటోలు)
-
మ్యాడ్ నటి 'రెబా జాన్' ట్రెండింగ్ ఫోటోలు
-
కొండల్లో తిరిగేస్తున్న తేజస్విని (ఫొటోలు)
-
ఫారిన్ ట్రిప్‌లో 'ఓజీ' బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
-
ముద్దుగుమ్మలు ఒకేచోటు.. మాజీ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ (ఫోటోలు)
-
స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బా (ఫోటోలు)
-
అదే మొదటిసారి అంటున్న రుక్మిణి వసంత్ (ఫోటోలు)
-
ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో హీరోయిన్ లక్ష్మీరాయ్ పూజలు (ఫొటోలు)
-
14 ఏళ్లకే మద్యం.. ఇప్పుడు గ్రీన్ టీతో పార్టీలు: నిధి అగర్వాల్
సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటి నిధి అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవల వెల్లడించింది. చిన్న వయసులోనే మద్యం సేవించడం ప్రారంభించినప్పటికీ, ఆ అలవాటును పూర్తిగా విడిచిపెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకున్నట్లు ఆమె తెలిపింది. నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. తాను 14 ఏళ్ల వయసులోనే తొలిసారి మద్యం సేవించాను. ఆ సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి తాగడం సరదాగా అనిపించేది. అప్పట్లో అది ఫన్‌గా అనిపించింది. కానీ కాలక్రమేణా మద్యం నాకు సరిపడదని అర్థమైంది. తాగిన తర్వాత తనకు అసౌకర్యంగా, కొన్నిసార్లు భయంగా కూడా అనిపించేది.ఆ అనుభవాలే నన్ను ఆలోచనలో పడేశాయి. చివరకు మద్యం పూర్తిగా మానేయాలనే నిర్ణయం తీసుకున్నాను. నేను చివరిసారి మద్యం తాగి దాదాపు ఆరేళ్లు పూర్తయింది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఆలస్యంగా అయినా గ్రహించాను. నా శరీరం కూడా ఆల్కహాల్‌ను అంగీకరించడం లేదని అర్థమైంది. అందుకే వెంటనే మానేశాను.ప్రస్తుతం పార్టీలకు వెళ్లినప్పటికీ మద్యం జోలికి మాత్రం వెళ్లడం లేదు. అయితే దాని బదులు గ్రీన్ టీతో ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది ఆల్కహాల్ తాగుతారు. కానీ నేను మాత్రం తాగను. మద్యం లేకుండానే పార్టీల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చని నిధి స్పష్టం చేసింది. -
హీరోయిన్ సంఘవి కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బుడ్డోడితో బీచ్‌లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)
-
థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)
-
అందంగా కవ్విస్తూనే యాక్షన్ మోడల్లో రాజాసాబ్ బ్యూటీ (ఫోటోలు)
-
ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)
-
పూల స్కర్ట్‌లో ఆహా అనేలా జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు
-
పెళ్లాడితే కారు, బంగళా, రూ.10 లక్షలపైగా జీతం
కోట్లు ఉంటే చాలు కొండ మీది కోతిని కూడా కిందకు దిగొస్తుంది అని సంపన్నులతో పాటు చాలా మంది నమ్మకం. అయితే కోతి అయినా వస్తుందేమో గానీ, ఆత్మవిశ్వాసం ఉన్న అందమైన అమ్మాయి మాత్రం రాదని ఓ యువతి నిరూపించింది. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ఆస్తి, భూమి ఐదు అంకెల నెలవారీ భత్యంతో పాటు మరెన్నో అద్భుతమైన విలాసాలను ఆశ చూపించినప్పటికీ... ఆమె ఒప్పుకోలేదు.ఆమె పేరు అమీ నూర్ టినీ( Amy Nur Tinie). ఈ 29 ఏళ్ల మలేషియా నటి మాజీ అందాల రాణి కూడా. ఆమె ఇటీవల మలేషియా కంటెంట్ క్రియేటర్ సఫ్వాన్ నజ్రీ పాడ్‌కాస్ట్ లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని పంచుకుంది. ఈ ప్రతిపాదన తమ దేశానికే చెందిన ఓ పెద్ద వివిఐపి నుంచి వచ్చిందని ఆమె వెల్లడించింది. మలేషియాలో సాధారణంగా చాలా ఉన్నత సామాజిక ఆర్థిక హోదా కలిగిన వ్యక్తులను వివిఐపీలుగా అభివర్ణిస్తారు.కార్పొరేట్ ఈవెంట్లను నిర్వహిస్తున్నప్పుడు తాను తరచుగా అలాంటి వివిఐపిలను కలుస్తుండడం జరుగుతుందని, ఆ సమయంలో వారిలో చాలామంది తన ఫోన్ నంబర్ అడగడం సర్వసాధారణం అని తెలిపింది. అంతేకాకుండా తనను వ్యక్తిగతంగా కలవాలని కూడా ఆహ్వానిస్తారని అమీ వివరించింది. అదే విధంగా ఒక వ్యక్తి తనను కలిశాడని, నేరుగా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడని గుర్తు చేసుకుంది. ఆ వ్యక్తి ప్రపోజల్‌ను అంగీకరిస్తే ఆమెకు ఒక బంగ్లా, కారు, 10 ఎకరాల (40,000 చదరపు మీటర్లు) భూమి, 50,000 రింగిట్స్ (సుమారు రూ.11 లక్షలు) నెలవారీ భత్యం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని తెలిపింది.ప్రస్తుతం మలేషియాలో ఈ పాడ్ కాస్ట్ సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తున్నవారు గతంలో ఇదే నటి ఇచ్చిన మరో ఇంటర్వ్యూను వెలుగులోకి తెచ్చారు. అందులో మరింత వివరంగా ఆమె తాను అందుకున్న ప్రతిపాదనకు సంబంధించిన విశేషాలను వెల్లడించింది. దాని ప్రకారం... ఈ ప్రతిపాదన 2019లో జరిగిందని, ఆమె 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆఫర్ అందుకుందని తేలింది. ఆసమయంలో ఆమె అందాల పోటీలలో చురుకుగా పోటీ పడుతోందని వెల్లడైంది. ఆ వ్యక్తి ని డాతుక్ అంటూ ఆమె పేర్కొనడం గమనార్హం. అందాల పోటీలలో పాల్గొనడానికి నిధులు సమకూర్చడానికి కార్పొరేట్ స్పాన్సర్‌షిప్‌ల అవసరం ఏర్పడడంతో...ఆ విషయంలో దాతుక్ తనకు మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చాడని అయితే అతని ఆఫర్‌ను తాను వెంటనే తిరస్కరించినట్టు చెప్పింది. సదరు వ్యక్తికి దాదాపు తన తండ్రి వయస్సు ఉంటుందని అంతే కాకుండా అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు కూడా ఆయ్యాయని కూడా వివరించింది. అయితే తన తల్లి తనను అమ్మేయాలని అనుకోలేదని ఆమె చెప్పింది. ఇంకా అవివాహిత గానే ఉన్న అమీ...పాడ్‌కాస్ట్‌లో, తన జీవిత భాగస్వామిగా కాబోయేవాడు బాధ్యతాయుతంగా ఆర్థికంగా స్థిరపడి ఉంటే చాలని మరీ విపరీతమైన సంపద అవసరం లేదని చెప్పారు. ఆ ఆఫర్ ని అంగీకరించి ఉంటే తన జీవితం మరింత సుఖంగా ఉండి ఉండేదని ఆమె అంగీకరించింది, కానీ అది తాను కోరుకున్న జీవన మార్గం కాదని చెప్పింది. -
కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)
-
భర్తతో హనీమూన్ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)
-
ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చిన చీరలో హీరోయిన్ రిద్ధి (ఫొటోలు)
-
థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు
-
'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)
-
చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)
-
కాజల్ అగర్వాల్ డిసెంబరు జ్ఞాపకాలు (ఫొటోలు)
-
ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)
-
వారణాసి ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)
-
ఫుడ్.. షాపింగ్.. ఇంకేం కావాలంటున్న రెజీనా! (ఫోటోలు)
-
హ్యాపీ బర్త్ డే మై హార్ట్‌బీట్.. భర్తకు జెనీలియా విషెస్ (ఫొటోలు)
-
సినిమా స్టోరీలా మారిన సెలబ్రిటీ లైఫ్
బెంగళూరు: నటి చైత్ర, ప్రముఖ నిర్మాత హర్షవర్ధన్‌కు సంబంధించిన కుటుంబ వివాదం ఇప్పుడు పోలీస్ కేసుగా మారింది. సొంత భార్యను నిర్మాత కిడ్నాప్ చేశాడంటూ చైత్ర తల్లి బెంగళూరులోని బ్యాటరాయనపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. నటి చైత్ర, నిర్మాత హర్షవర్ధన్ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. కుటుంబ కలహాల కారణంగా దంపతులు వేరుగా నివసిస్తున్నారు. చైత్ర తన కుమార్తెను వెంట తీసుకుని మైసూరులో ఉంటుండగా, హర్షవర్ధన్ బెంగళూరులో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో తన కుమార్తెను చూడాలనే కారణంతో హర్షవర్ధన్ చైత్రను బలవంతంగా కిడ్నాప్ చేశాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై బ్యాటరాయనపుర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇది కుటుంబ వివాదమా? లేక నేరుగా కిడ్నాప్ కేసా? అన్న కోణంలో పోలీసులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై చైత్ర, హర్షవర్ధన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Chaitra R (@chaitraram1998official) -
తిరుమలలో నటి స్వాతి దీక్షిత్ (ఫోటోలు)
-
ప్రపంచంలో అందమైన టాప్ టెన్ హీరోయిన్స్ వీళ్లే.. ఇండియా నుంచి ఆమె ఒక్కరే..!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్రలకు గ్లామరస్ చాలా ముఖ్యం. టాలెంట్‌తో పాటు గ్లామర్ కూడా కలిసొస్తే ఇక వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు నల్లేరు మీద నడకే. కానీ అందంగా ఉన్నప్పటికీ సరైన హిట్ పడకపోయినా ఛాన్స్ రావడం కష్టమే. సినిమా అనే రంగుల ప్రపంచంలో అందానికి ఉన్న ప్రముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అలా ఈ ఏడాది అత్యంత అందమైన తారల గురించి చర్చించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే టాప్ టెన్ అందమైన హీరోయిన్ల లిస్ట్‌లో ఇండియా నుంచి కేవలం ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. ఆమె మరెవరో కాదు.. ఆదిపురుష్ భామ కృతి సనన్ మాత్రమే టాప్-5లో నిలిచింది. ఈ ఏడాదితో గానూ ఐఎండీబీ ప్రకటించిన అందాల తారల లిస్ట్‌లో కృతి సనన్ ఐదో స్థానం దక్కించుకుంది.మొదటి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మార్గోట్ రాబీ నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అమెరికా బ్యూటీ షైలీన్ వుడ్లీ, చైనాకు చెందిన దిల్రుబా దిల్మురాత్, సౌత్ కొరియా బ్యూటీ నాన్నీ మెక్‌డోనీ నిలిచారు. టాప్-5 లో బాలీవుడ్ భామ కృతి సనన్ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హానియా అమీర్ ఆరోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా స్పెయిన్‌కు చెందిన అనా డి అర్మాస్, పారిస్‌కు చెందిన ఎమ్మా వాట్సన్, అమెరికాకు చెందిన అంబర్ హెర్డ్, టర్కీ బ్యూటీ హ్యాండే ఎర్సెల్ నిలిచారు.Top 10 Most Beautiful Actresses in the World 2025/261. 🇦🇺 Margot Robbie2. 🇺🇸 Shailene Woodley3. 🇨🇳 Dilraba Dilmurat4. 🇰🇷 Nancy McDonie5. 🇮🇳 Kriti Sanon6. 🇵🇰 Hania Aamir7. 🇨🇺/🇪🇸 Ana de Armas8. 🇬🇧 Emma Watson9. 🇺🇸 Amber Heard10. 🇹🇷 Hande Erçel(Source: IMDb List - Top… pic.twitter.com/DlW1Hj9Pzy— Infodex (@infodexx) December 15, 2025 -
విశాఖపట్నంలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేష్ (ఫొటోలు)
-
హ్యాపీ బర్త్ డే లవర్.. భర్తకు హీరోయిన్ లవ్లీ విషెస్ (ఫొటోలు)
-
పెళ్లయి ఏడాది.. కీర్తి సురేశ్ ఇంత హంగామా చేసింది? (ఫొటోలు)
-
క్యాన్సర్‌తో పోరాటం.. నటి పరిస్థితి విషమం!
టాలీవుడ్లో సహాయనటిగా గుర్తింపు తెచ్చుకున్న వాహిని అలియాస్ పద్మక్క చావుబతుకుల మధ్య పోరాడుతోంది. ఆమె కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కీమోథెరపీ, ఆపరేషన్, ఐసీయూలో ట్రీట్మెంట్ కోసం రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.కరాటే కల్యాణి ఎమోషనల్ పోస్ట్ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు, ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మద్రాస్ నడిగర సంఘం సభ్యత్వం ఉండి తెలుగు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వేసి.. అప్పుడప్పుడు సీరియల్స్‌లో మెరుస్తోంది పద్మక్క అలియాస్ వాహిని. ఆమె మా విజయనగంలో మా పెదనాన్న ఇంటి పక్కనే ఉండేవారు. చిన్నప్పుడు ఆమె సినిమాల్లోకి వెళ్లినప్పుడు నేను స్కూల్లో ఉన్నాను. ఈరోజు అక్కకి ఇలా క్యాన్సర్ సోకి ప్రాణాంతకంగా మారింది. మనల్ని అందరినీ అలరించిన ఈ నటి కష్టంలో ఉంది.. ఆమెను మనందరం ఆదుకుందాం..దయచేసి కాపాడండికొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ ఆమె ఆరోగ్యం విషమించింది. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్స మొత్తానికి రూ. 25 లక్షల నుంచి రూ.35 లక్షల మేర అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇంత ఖర్చు ఆమె కుటుంబం భరించలేదు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి అంటూ విరాళాలు పంపేందుకు ఫోన్‌పే, గూగుల్‌పే నంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు వాహిని క్యాన్సర్‌ను జయించి త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.ఎవరీ వాహిని?వాహిని.. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసింది. వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. జయవాహిని పేరుతో ఎక్కువ ఫేమస్ అయింది. చివరగా పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో నటించింది.చదవండి: భరణి అవుట్.. సెకండ్ ఫైనలిస్ట్‌గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్ -
Karthika Nair : నాలో ఓ భాగం కోల్పోయా.. నటి రాధ కూతురు కార్తీక ఎమోషనల్ (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ (ఫొటోలు)
-
చేతి వేళ్లన్నంటికీ రింగ్స్.. మృణాల్ ఠాకుర్ ఫ్యాషన్ (ఫొటోలు)
-
హోటల్లో 'పాయల్ రాజ్‌పుత్' బర్త్‌డే.. ఫోటోలు వైరల్
-
తెలుగు నటి జ్యోతి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
చైతూ- శోభిత పెళ్లి వీడియో.. లవ్లీ మూమెంట్స్ షేర్ చేసిన శోభిత! (ఫొటోలు)
-
హీరోయిన్ రాశీఖన్నా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
ఫ్యామిలీతో కరీబియన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న లయ (ఫొటోలు)
-
న్యూజిలాండ్ ట్రిప్‌లో నభా నటేశ్ (ఫొటోలు)
-
ఫ్రెండ్స్‌తో హీరోయిన్ అనిక బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
-
తమన్నా డైలీ రొటీన్ ఇలా ఉంటుందా! (ఫొటోలు)
-
దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)


