విషాదం.. గుండెపోటుతో 30 ఏళ్ల నటి మృతి | Haryanvi Actress Divyanka Sirohi Passes Away At 30 | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో 30 ఏళ్ల నటి మృతి.. ఎవరీ దివ్యాంక?

Apr 22 2026 6:58 PM | Updated on Apr 22 2026 7:04 PM

Haryanvi Actress Divyanka Sirohi Passes Away At 30

చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. గుండెపోటుతో హర్యానా నటి  దివ్యాంక శిరోహి(30) మృతి చెందారు. మంగళవారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం  ఘజియాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి.

మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్
దివ్యాంక స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఆమెకు సోదరుడు హిమాంశు, సోదరీమణులు దీపాంశు. జస్మీత్ ఉన్నారు. 1996 నవంబర్‌ 19న జన్మించిన దివ్యాంక.. మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో బీసీఏ,  సిక్కింలో ఎంబీఏ డిగ్రీని పూర్తి చేసి చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. గాయకుడు మాసూమ్ శర్మతో కలిసి కవర్ సాంగ్స్ కూడా చేశారు. 50కి పైగా హర్యానా పాటలలో నటించడమే కాదు, మాసూమ్ శర్మ, అమిత్ సైని రోహ్‌తకియా, కేడీ వంటి  ప్రముఖులతో కలిసి తెరను పంచుకున్నారు.

టిక్‌టాక్‌తో ఫేమస్‌..
టిక్‌టాక్‌తో ఫేమస్‌ అయిన నటి దివ్యాంక. పంజాబీ గాయని సునంద శర్మ పాడిన 'మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ' అనే పాటకు దివ్యాంక చేసిన టిక్‌టాక్‌ బాగా వీడియో వైరల్ అయింది. ఆ వీడియోకు దాదాపు 2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత టిక్‌టాక్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 5 కోట్లకు చేరింది. ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయిపోయాక ఆమె ఇన్ స్టాగ్రాం బాట పట్టింది. ఇన్స్టాగ్రాంలో కూడా 1.3 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల వయసులోనే దివ్యాంక ఇలా గుండెపోటుతో చనిపోవడంతో ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement