Pakistan
-
పాకిస్తాన్ ఎందుకు భ్రష్టు పట్టింది?
పాకిస్తాన్ వ్యవస్థాపకుడు, ఆ దేశ ప్రథమ గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా బతికున్నంత కాలం పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ ప్రజాస్వామ్యం అయినా ఇతర మతాలు,సంస్కృతులు అక్కడ సహజీవనం చేసేందుకు అవకాశం ఉండేది. జిన్నా మృతి అనంతరం ఈ భావన అంతరించిపోయింది. దేశంలో రాజకీయ–సైనిక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయి. అస్థిరత్వం వేరూనింది. పాకిస్తాన్ బ్రిటిష్ కాలనీ నుంచి ఒక ఆధునిక దేశంగా రూపొందే పరిణామ క్రమాన్ని ఈ పరిస్థితులు దెబ్బతీశాయి. పాక్ రాజకీయ–సైనిక సంబంధాలను మూడు ప్రధాన ఇతి వృత్తాలతో వివరించవచ్చు. వీటిలో మొదటిది: అక్కడి రాజకీయ నాయకత్వానికి ఏనాడూ సరైన విజ్ఞత లేదు. రాజకీయ పార్టీలు ఆది నుంచీ అవినీతికి మారుపేర్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితి సైనిక జోక్యా నికి తావిచ్చింది. ఆ దేశంలో రాజకీయ అస్థిరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇప్పటి వరకు ఇండియాలో 14 మంది ప్రధాని పదవి అలంకరించగా, పాకిస్తాన్ ప్రజలు ఇదే కాలంలో 24 మంది ప్రధానులను చూశారు.రెండోది: పాకిస్తాన్ సైన్యం రాజకీయ స్థాయికి ఎదిగి హింసా యుత రాజకీయాలపై క్రమంగా పట్టు సాధించడం. 1951లో అప్పటి ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ హత్య నుంచి 2022 నవంబర్‌లో ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం వరకు... ఈ ఘటనలు అన్నీ ఏదో రూపంలో పాక్ సైన్యంతో ముడిపడి ఉన్నాయి. రాజకీయ వేదిక మీద ప్రాబల్యం సంపాదించే ప్రక్రియలో పాక్ సైన్యం రెండు పద్ధతులు అనుసరించింది. వీటిలో మొదటిది– సైనిక నియంతృత్వం. ఈ పద్ధతిలో పాక్ సైనిక అధిపతులు నిస్సిగ్గుగా రాజకీయ అధికారం హస్తగతం చేసుకుని తమను తాము దేశాధ్య క్షులుగా ప్రకటించుకున్నారు. రాజకీయ సంక్షోభాలను సృష్టించి, వాటిని సాకుగా చూపిస్తూ తాము దేశానికి రాజకీయ సుస్థిరత అందిస్తామంటూ వారీ దుశ్చర్యకు పాల్పడ్డారు. మిలిటరీ జనరళ్లు అయూబ్ ఖాన్, యాహ్యా ఖాన్, జియా–ఉల్–హక్, పర్వేజ్ ముషా రఫ్ ఈ పద్ధతిలో రాజకీయ అధికారం చేపట్టారు. వీరి హయాంలో ప్రధానులు డమ్మీలుగా ఉండేవారు. ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఉంది. పాకిస్తాన్ ఏర్పాటు నుంచీ ఆ దేశ సైన్యానికి కేవలం 15 మంది ఆధిపత్యం వహించారు. వీరి పదవీ కాలం 2 నుంచి 12 ఏళ్లు. ఇదే సమయంలో ఇండియాకు 31 మంది సైనికాధిపతులుగా వ్యవహ రించారు. ఆర్మీ చీఫ్‌గా వీరి పదవీకాలం రెండేళ్లు/ 62 ఏళ్లకు రిటైర్మెంటు నిబంధనకు లోబడి ఉంటుంది.పాక్ సైన్యం ప్రాబల్యాన్ని జుల్ఫికర్ అలీ భుట్టో, నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వంటి శక్తిమంతులైన రాజకీయ నాయకులు సవాలు చేశారు. వీరు భారత వ్యతిరేకతనూ, కశ్మీర్ అంశాన్నీ రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం కొనసాగించాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియలను తిరిగి అమలులోకి తేవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చినప్పుడు ఆర్మీలోని కొన్ని ఫ్యాక్షన్లు వీరికి మద్దతు ఇచ్చాయి. అయితే, ఈ రాజకీయ నాయకులు తమ రాజకీయ బలం చూసుకుని సైన్యాన్ని ఖాతరు చేయలేదు. అటువంటి సమయంలో, సైనికాధిపతులు వారిని అధికారం నుంచి తప్పించారు. జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరి తీశారు. బేనజీర్ భుట్టోను హత్య చేశారు. నవాజ్ షరీఫ్‌ను దేశం నుంచి తరిమేశారు. ఇమ్రాన్ ఖాన్ జైలు పాలయ్యారు. వీరందరి దుర్గతికీ సైనికాధిపతులే కారకులు. మూడో చివరి ఇతివృత్తం గురించి ఇండియలో అంతగా చెప్పుకోం. పాకిస్తాన్ రాజ్యాంగం నిరంతరం సవరణలకు గురయ్యింది. తద్వారా అక్కడి రాజకీయ–సైనిక సంబంధాలను అవి ప్రభావితం చేశాయి. పాకిస్తాన్ సైన్యం రబ్బర్ స్టాంపు అధ్యక్షుల ద్వారా నేషనల్ అసెంబ్లీని రద్దు చేయించి తాజా ఎన్నికలు జరిపించేది. సర్వసాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సైన్యానికి అను కూల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేవి. 1987లో అప్పటి అధ్యక్షుడు జియా–ఉల్–హక్ దేశాధ్యక్షుడికి (అంటే తనకు) నేషనల్ అసెంబ్లీని రద్దు చేసే విశేష అధికారాన్ని కట్టబెడుతూ రాజ్యాంగానికి 8వ సవరణ చేశారు. బేనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్‌లు ప్రధానులుగా పదేళ్ల సుదీర్ఘ పౌరపాలన అందించిన కాలంలో రాజ్యాంగానికి 13వ సవరణ తీసుకువచ్చారు. 1997 నాటి ఈ సవరణతో 1987 నాటి 8వ సవరణ రద్దు అయ్యింది. ఇలా అధ్యక్షుడి తోక కత్తిరించారు. తరువాతి దశాబ్దంలో ఆర్మీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 2001లో, మూడేళ్లు సైనికాధిపతిగా పనిచేసిన అనంతరం, ముషారఫ్ తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అధికారంలో కొన సాగేందుకు అతడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. చిట్టచివరకు 2008లో అభిశంసన నుంచి తప్పించుకోవడానికి పదవికి రాజీనామా చేశారు.ముషారఫ్ అనంతరం, 2010లో 18వ రాజ్యాంగ సవరణ వచ్చింది. దేశంలో సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఈ సవరణ సైతం సైన్యం అధికారాలను బలహీనం చేయలేక పోయింది. ఇటీవలి సంవత్సరాల్లో జనరల్ కమర్ బాజ్వా వంటి సైనికాధిపతులు పౌర అధికారానికి లోబడి ఉన్నట్లు నటిస్తూ, తెలివిగా అధికారం చలాయించాలని ప్రయత్నించారు. బాజ్వా తర్వాతి వాడు జనరల్ అసీమ్ మునీర్. జనరల్ జియా మూసలో ర్యాడికలైజ్ అయిన మునీర్ పాక్ రాజకీయ–సైనిక సంబంధాలను సరికొత్త స్థాయికి దిగజార్చారు.ఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) అర్జున్ సుబ్రమణియం వ్యాసకర్త మిలిటరీ హిస్టారియన్, రిటైర్డ్ ఫైటర్ పైలట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ
-
పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్
బికనీర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పేరుతో 22 నిమిషాల్లోనే ప్రతీకారం తీర్చుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతీ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రధాన మోదీ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన అనంతరం పలానాలో జరిగిన ప్రజా ర్యాలీలో ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్(Pakistan) భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని, అది ఆ దేశ సైన్యం, ఆర్థిక వ్యవస్థ భరించాల్సి వస్తుందన్నారు. పాక్ ఉగ్రవాదం ఎగుమతిని కొనసాగిస్తే, ఆ దేశం ఒక్క రూపాయి కోసం కూడా తడబడే పరిస్థితి వస్తుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. భారతీయుల రక్తంతో ఆడితే పాకిస్తాన్ దానికి భారీ మొత్తంలో నష్టం చవిచూడాల్సి వస్తుందన్నారు.ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని, ఇకపై ఉగ్ర దాడి జరిగినట్లయితే, తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు.. ఇందుకు సమయాన్ని, విధానాన్ని, నిబంధనలను భారత సైన్యం స్వయంగా నిర్ణయిస్తుందన్నారు. అణ్వాయుధాల బెదిరింపులతో భారతదేశం వెనక్కి తగ్గబోదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వ్యక్తులను, ప్రభుత్వాన్నీ వేరు చేయలేమని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్లో ‘స్టేట్’, ‘నాన్-స్టేట్ యాక్టర్స్’ (గూండాలు) కలసి ఆడే ఆటలు ఇక కొనసాగవన్నారు. 22వ తేదీన జరిగిన పాక్ దాడికి ప్రతిగా 22 నిమిషాల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేశామని ప్రధాని పేర్కొన్నారు. భారత్ ప్రతీకార దాడి చేస్తే ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో ప్రపంచానికి స్పష్టంగా చూపించామని, ప్రతి భారతీయుడు(Indian) ఉగ్రవాదాన్ని నేలమట్టం చేయాలనే సంకల్పంతో ఉన్నారడన్నారు. భారత సైన్యం ప్రజల ఆశీర్వాదంతో ఆ సంకల్పాన్ని నెరవేర్చిందన్నారు. భారత ప్రభుత్వం మూడు దళాలకూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. పాకిస్తాన్‌ను మోకాళ్లపై సాగిలపడేలా చేయడానికి భారత సైన్యం చక్రవ్యూహం రచించిందని ప్రధాని మోదీ అన్నారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా మే 7న భారత్ ప్రతీకార సైనిక చర్య ప్రారంభించింది. ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ సమయంలో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద గ్రూపులతో సంబంధమున్న దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ -
8 రోజుల్లో మరో పాక్ అధికారి ఔట్
న్యూఢిల్లీ: భారతీయులను పలు విధాలుగా ప్రలోభపెట్టి గూఢచర్యానికి వినియోగించుకున్నాడన్న నేరానికి మే 13న ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిని భారత్ బహిష్కరించిన 8 రోజులకే మరో ఉద్యోగిపైనా భారత్ అదే వేటు వేసింది. అధికార విధులను మీరి ప్రవర్తిస్తున్నాడని, హోదాకు తగ్గట్లు ప్రవర్తించట్లేడనే కారణంగా 24 గంటల్లోపు భారత్‌ను వీడాలని బుధవారం ఆదేశించింది. ఈమేరకు పాక్ హైకమిషన్‌లో సంబంధిత వ్యవహారాల ఉన్నతాధికారి సాద్ వరాయిచ్‌కు ‘అధికారికంగా దౌత్య నిరసన’ నోటీసును అందజేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఐఎస్ఐ ఏజెంట్లను కలిశా
చండీగఢ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసు కస్టడీలో కొత్త విషయాలను బయటపెట్టారు. పాకిస్తాన్‌లోని నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని, పాకిస్తాన్లో వాళ్లను కలిశానని ఆమె ఒప్పుకున్నారు. మే 13న దేశ బహిష్కరణకు గురైన ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగి డ్యానిష్తో తాను తరచుగా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరిపానని ఆమె వెల్లడించారు. పాక్‌కు వెళ్లేందుకు అవసరమైన వీసా సాధించేందుకు ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు 2023 నవంబర్‌లో తొలిసారిగా వెళ్లినప్పుడు అక్కడి ఉద్యోగి డ్యానిష్ అలియాస్ ఎహ్సార్ ఉర్ రహీమ్‌తో పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపారు. అరెస్ట్ తర్వాత పోలీసులు జ్యోతికి చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జ్యోతిని జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లలో మూడుసార్లు పాకిస్తాన్‌కు వెళ్లడంతోపాటు చైనా, బంగ్లాదేశ్ ఇతర దేశాల్లో జ్యోతి పర్యటించారు. ఆపరేషన్ సిందూర వేళ భారత్, పాక్ సైనిక చర్యల సమయంలోనూ డ్యానిష్తో జ్యోతి సంప్రతింపులు జరిపినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె నాలుగు బ్యాంక్ అకౌంట్లను విశ్లేషిస్తున్నారు. జ్యోతి పాక్ జాతీయుడిని పెళ్లాడినట్టు, మతం మారినట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. -
పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కశ్మీర్ ఘటనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్ గాందీ, బీఆర్ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
గూఢచర్యం జాడలివిగో!
గూఢచర్యానికి నిర్దిష్టమైన రూపురేఖలుండవు. దాన్ని సకాలంలో గుర్తించటం, కట్టడి చేయటం ఆషామాషీ కాదు. మన వేషభాషలతోనేవుంటూ, నిత్యం మనతో సన్నిహితంగా మెలగుతూ ప్రాణ ప్రదమైన మన రహస్యాలను బయటికి చేరేసేవారిని ఆనవాలు కట్టడం అంత సులభం కూడా కాదు. పహల్గామ్లో గత నెల 22న అమాయక పౌరులు 26 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నాక మన త్రివిధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వ హించి దాదాపు వందమందిని మట్టుబెట్టాయి. సింధూ నదీజలాల ఒప్పందంనుంచి వెనక్కి రాదల్చుకున్నట్టు ప్రకటించటంతోసహా అనేక అంశాల్లో పాకిస్తాన్‌కు ఇన్ని దశాబ్దాలుగా అందుతున్న ప్రయోజనాలను మన దేశం నిలుపుచేసింది. దానికి అనుబంధంగా దేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు సాగటం, పహల్గామ్లో భద్రతాలోపాలపై ప్రశ్నించినవారినీ, జవాబుదారీ తనాన్ని కోరినవారినీ ఉగ్రవాద సమర్థుకులుగా ముద్రేయటం మొదలైంది. ఇది అవాంఛనీయమైన పరిణామం. ఈ నేపథ్యంలో నిఘానేత్రాల కళ్లుగప్పి కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరేస్తున్న 11 మందిని గుర్తించి అరెస్టు చేయటం కీలక మలుపు. అరెస్టయినవారిలో చాలామంది మధ్యతరగతి యువత. వారిలో జ్యోతి మల్హోత్రా అనే యువతి పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు కీలకమైన సమా చారం అందించిందన్నది పోలీసుల అభియోగం. సామాజిక మాధ్యమాల సందడి పెరిగాక ఒక కొత్త తరం బయల్దేరింది. విచక్షణా జ్ఞానం లోపించటం, లోతైన సమాచారం లేకుండానే దేనిపైన అయినా అభిప్రాయాలు ఏర్పర్చుకోవటం, ఆధారాలున్నాయా లేదా అనేదాంతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని వ్యాప్తిచేయటం, సామాజిక మాధ్యమాలపై మోజున్న యువతరానికి అలవాటుగా మారింది. సెల్‌ఫోన్‌తో దేన్నయినా చిత్రించటం, వెనకా ముందూ ఆలోచించకుండా అందరికీ చేరేయటం రివాజైంది. మనం కూడా ఏదో ఒకటి చేయాలన్న కుతూహలంతో మొదలై, అందరికన్నా ఎక్కువమంది వీక్షకుల్ని ఆకట్టుకోవటం లక్ష్యంగా మారటం, ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందటం, ప్రశంసలు, వాటి వెంబడే ఆదాయం మొదలవుతుంది. ఇక ఆ వ్యామోహం నుంచి వెనక్కిరావటం వాళ్లవల్ల కాదు. తాము చేసే పని ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడును ప్రోత్సహిస్తుందో గ్రహించేంత సామర్థ్యం లేకపోవటం సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన అత్యధిక యువతలో కనబడే ప్రాథమిక లక్షణం. ఇలాంటివారిని ఆకట్టుకుని, వీరితో సంబంధ బాంధవ్యాలు నెరపి దగ్గరకావటం పొరుగు దేశ గూఢచార సంస్థలకు సులభం. జ్యోతి మల్హోత్రా విషయంలో జరిగింది అదే. ఆమె తగిన పత్రాలను సమర్పించి ప్రభుత్వానికి తెలిసే విధంగానే పాకిస్తాన్ వెళ్లింది. అక్కడ వేర్వేరు వ్యక్తుల్ని కలిసింది. పాకిస్తాన్ జాతీయ దినోత్సవంలో పాల్గొన్నది. అక్కడున్నవారిని పరిచయం చేసింది. వారితో మాట్లాడించింది. విదేశాలకు పోవటం, అక్కడి ప్రాంతాలను సందర్శించటం, వారితో సంభాషించటం వగైరాలు సహజంగానే సాధారణ వీక్షకులకు ఎంతో ఆసక్తి అనిపిస్తాయి. జ్యోతి నిర్వహించే యూట్యూబ్ చానెల్‌కు దాదాపు 4 లక్షలమంది చందాదార్లుండటం, ఫేస్బుక్లో 3 లక్షలమందిపైగా ఆమె ఎప్పటికప్పుడు పెట్టే వీడియోలను వీక్షించటం, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్షన్నరమంది చూడటం ఇందువల్లే. తమ అరకొర పరిజ్ఞానంతో గంటల తరబడి దేనిపైన అయినా అనర్గళంగా మాట్లాడటం నచ్చటంవల్లే ఇన్నేసి లక్షలమంది వారిని అనుసరిస్తుంటారు. శత్రు దేశాల మధ్య యుద్ధాలు సరిహద్దుల్లోనే జరగవు. అవి కేవలం సైనికుల మధ్యే సాగవు. అనేక రూపాల్లో నిరంతరం కొనసాగుతుంటాయి. కనీసం జ్యోతి ప్రభుత్వానికి తెలిసేవిధంగా పాకిస్తాన్ వెళ్లింది. కానీ చడీచప్పుడూ లేకుండానే శత్రుదేశానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరేసేవారుంటారు. పాకిస్తాన్ హైకమిషన్‌లో ఇటీవల వరకూ పనిచేసి బహిష్కరణకు గురైన డానిష్ అనే ఉద్యోగి అడిగిన సమాచారమంతా ఆమె అందించిందని నిఘా వర్గాలంటున్నాయి. ఆ పని చేయటం పర్యవసానంగా తోటి పౌరులే ప్రమాదాల్లో చిక్కుకుంటారని, అది దేశద్రోహమని వారికి అనిపించదు. డబ్బుకు ఆశపడటం ఒక్కటే ఇలాంటి కార్యకలాపాలకు కారణం అనుకోవటానికి లేదు. వేరే దేశానికి చెందినవారు వీడియోలను చూడటం, పొగడ్తలు గుప్పించటం, తమ ప్రాంతాలకొచ్చి అక్కడి విశేషాలను కూడా చూపాలని అడగటం వగైరాలు వారిని ఆకర్షిస్తాయి. తమ ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్న భ్రమ వారిని నిలకడగా ఆలోచించనీయదు. గూఢచర్యం కేవలం అవతలి దేశాన్ని నష్టపరచటానికో, చికాకుపరచటానికో పరిమితం కాదు. వారి ఆయుధాగారాల్లో వచ్చి చేరుతున్న రక్షణ సామగ్రి సామర్థ్యం ఏమిటో, ఎక్కడెక్కడ వారి సైనిక స్థావరాలు పనిచేస్తున్నాయో తెలుసుకోవటంతోపాటు పారిశ్రామిక, ఆర్థిక, పరిశోధనారంగాల్లో ఆ దేశం ఏం చేస్తున్నదో సమాచారాన్ని సేకరిస్తుండటం గూఢచారుల పని. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఎక్కడ మన వైఫల్యం వున్నదో, అందుకు కారణమేమిటో తెలుసుకునే పనిలో ప్రభుత్వం తలమునకలై వుండగా దేశభక్తి పేరిట కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్ట జూశారు. ఇప్పుడు పట్టుబడినవారి నేపథ్యం గమనిస్తే ఫలానా మతంవారే దేశద్రోహానికి పాల్పడతారన్నది ఎంత బూటకమో తెలుస్తుంది. శత్రువు కీలకమైన సమాచారాన్ని ఒడుపుగా తస్కరించగలుగుతున్నాడంటే నిస్సందేహంగా అది మన వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చి అసత్యాలు ప్రచారం చేయటానికి బదులు, లోపాలను సరిదిద్దుకుని పటిష్టమైన వ్యవస్థలు రూపొందించటం వర్తమాన అవసరం. -
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
శత్రువుకి శత్రువు.. మిత్రుడు. అలాగే శత్రువుకి మిత్రుడు కూడా శత్రువే కదా!. కానీ, ఆ శత్రువునే తమ మిత్రుడిగా మార్చుకునేందుకు ఆఘమేఘాల మీద చైనా చేస్తున్న ప్రయత్నాలపై ‘‘అయ్యో.. పాపం’’ అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. సీపీఈసీ ప్రాజెక్టును ఆప్ఘనిస్థాన్ వరకు పొడిగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం.పాక్, అఫ్గనిస్తాన్ ప్రతినిధుల మధ్య బుధవారం చైనా ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఆ ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకుగానూ ఇరు దేశాల పరస్పరం రాయబారులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టు ఒప్పందం అదే విషయం. అయితే.. పాక్-అఫ్గన్ దేశాల మధ్య బంధం ఎంతటి ధృడమైందో యావత్ ప్రపంచానికి తెలుసు. అఫ్గనిస్తాన్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే అఫ్గన్ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబర్లో అఫ్గన్ పాక్టికా ప్రావిన్స్‌లో పాక్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపై దాడి చేశామంటూ పాక్ ప్రకటించుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై అఫ్గన్ రగిలిపోతూ వస్తోంది. అలాంటిది.. ఇప్పుడు, ఈ ఇరు దేశాలు ఇప్పుడు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఎందుకీ తొందర?2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. అయితే చైనా, పాక్, రష్యా,ఇరాన్ దేశాలు సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఉగ్రవాద లిస్ట్ నుంచి ఆ దేశాన్ని తొలగించాయి. అయితే తాలిబన్ సర్కార్‌కు గుర్తింపు ఇవ్వకున్నా.. ఆ దేశం తరఫున తమ దగ్గర రాయబారికి అనుమతించింది చైనా. ఇక..భారత్ అఫ్గన్ తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధానాంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిపాయి. వాటిలో పురోగతి లేకున్నా.. మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టిసారిస్తూనే వస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే.. దౌత్యపరమైన సమావేశాలు గత ఏడాది కాలంలో చాలానే జరిగాయి. ఈ ఏడాది జనవరిలో భారత విదేశాగం కార్యదర్శి విక్రమ్ మిస్రీ, తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టాఖితో దుబాయ్‌లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా అమీర్ ఖాన్ ముట్టాఖితో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం.. భారత్‌లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కాన్సులర్ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే అఫ్గన్ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలకు వేదికైంది. ఇది ఓర్వలేక.. కుటిల బుద్ధితో.. భారత్ వ్యతిరేకిస్తున్న సీపెక్‌లో అఫ్గన్‌ను భాగం చేసిందని, హడావిడిగా తాలిబన్లకు చైనా ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు. -
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్లో నీటి సంక్షోభంసింధు నది నుండి నీటిని మళ్లించి,పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్‌లోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు,తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు,ఐఎంఎఫ్ ఒత్తిడితో పంటలకు కనీస మద్దతు ధర (MSP) నిలిపివేయడంకార్పొరేట్ వ్యవసాయం కోసం వారసత్వ భూములను బలవంతంగా సేకరించడంలాభం కోసం పాకిస్తాన్ సైన్యం సైతం వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం.. వంటి అంశాలపై పాక్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. తాజాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంతో అక్కడ నిరసనలు మిన్నంటాయి. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆందోళనకు దారితీసింది. ఇది ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.పోలీసు అధికారులతో సహా అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు మోరోలోని హోంమంత్రి ఇంటిపై కూడా దాడి చేసి తగలబెట్టారు. House of Sindh Interior Minister Ziaul Hasan🇵🇰 pic.twitter.com/hQdD02tBBj— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) May 21, 2025పోలీసు చర్యకు ఆదేశించినందుకు స్థానికులు మంత్రిపై మండిపడుతున్నారు. నీటి కొరత కారణంగా సింధ్ విధ్వంసానికి దారితీసే విధానాలకు ఆయన మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులు ఆసుపత్రిలో గాయపడిన పోలీసు అధికారులపై దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు యూరియా ఇతర ఎరువులతో వెళ్తున్న ట్రక్కులను దోచుకుని ఆపై వాటిని తగలబెట్టారు.స్పందించిన పాక్ ప్రభుత్వంఈ ఆందోళనపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధ్‌లో భద్రతను బలోపేతం చేసే దిశగా పారామిలిటరీ దళాలను మోహరించారు. దాడులలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడితో పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.దీంతో పాక్‌లో నీటి సమస్య ఉత్పన్నమవుతున్నాయి. -
‘నన్ను పెళ్లి చేసుకోవా’.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ (Pakistan) ఐఎస్ఐ (isi)కు దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థలు జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాయి. వీరి విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది.అంతేకాదు వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా జరిగిన వాట్సప్ చాటింగ్‌ను గుర్తించారు. ఆ చాటింగ్‌లో ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్ తనని పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని (Get Me Married) జ్యోతి మల్హోత్రా కోరినట్లు తెలిపారు. ఆ చాట్‌లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్ చేసిందని,కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా, అవి గూఢచారి కార్యకలాపాలకు సంబంధించివే అని నిర్ధారించారు.దుబాయ్ నుంచి డబ్బులువాట్సప్ చాట్‌తో పాటు జ్యోతి మల్హోత్రా ఆర్దిక లావాదేవీలపై కన్నేశారు. ఆమెకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉండగా..అందులో ఒక అకౌంట్‌కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఖాతాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసుల అదుపులో పలువురుభారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత భద్రత వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. జ్యోతి మల్హోత్రా అరెస్టుతో భారత్‌కు చెందిన సైనిక రహస్యాల్ని పాక్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో దేశానికి చెందిన 10మందిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.వీరు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని తేలింది. -
Pakistan: స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. ఐదుగురు మృతి
క్వెట్టా: పాకిస్తాన్(Pakistan)లోని నైరుతి ప్రాంతంలో బుధవారం ఒక స్కూల్ బస్సుపై జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 38 మంది గాయపడ్డారు. ఈ వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఖుజ్దార్ జిల్లాలో ఒక బస్సు చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, ఈ దాడి జరిగిందని స్థానిక డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ తెలిపారు. పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని సీజ్ చేశాయి. గాయపడిన వారిని అంబులెన్స్(Ambulance)లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యతను ప్రకటించలేదు. అయితే పోలీసులు బలూచ్ వేర్పాటువాద గ్రూపులను అనుమానిస్తున్నారు. ఈ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో ఎక్కువ శాతాన్ని బీఎల్ఏనే చేసింది. గత మార్చిలో బలూచిస్తాన్‌లో రైలుపై జరిగిన దాడిలో బీఎల్ఏ తిరుగుబాటుదారులు 33 మందిని హతమార్చారు.తాజాగా జరిగిన దాడిని పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఖండించారు. చిన్నారుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడినవారిని మృగాలుగా అభివర్ణించారు. వారు ఎటువంటి దయకు అర్హులు కారని అన్నారు. ఇది అనాగరిక చర్య అని పేర్కొన్నారు. కాగా బలూచిస్తాన్‌లో చాలా కాలంగా వేర్పాటువాద హింస కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక అధికారులు, భద్రతా దళాలు ఈ దాడులకు బాధ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు? -
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్డేట్
-
ఈ వీధి పేరు ‘సిందూర్ స్ట్రీట్’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)సక్సెస్ కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలోని ఓ వీధికి ‘సిందూర్ స్ట్రీట్’(సిందూర్ వీధి) అని నామకరణం చేశారు. మంగళవారం ఆ వీధికి చెందిన ఇళ్ల యజమానులు సిందూర్ స్ట్రీట్ బోర్డు ఏర్పాటు చేసి ప్రారంభించుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తూ, మన దేశ త్రివిధ దళాలకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ విజయాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవాలన్న ఉద్దేశంతో ఆ వీధి వాసులు తమ వీధికి సిందూర్ స్ట్రీట్ అని నామకరణం చేసి సైనికులకు మద్దతు తెలిపారు. దేశం కోసం సైనికులు చేసిన పోరాట పటిమను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా తమ వీధికి సిందూర్ స్ట్రీట్ అని పేరు పెట్టినట్టు వారు పేర్కొన్నారు. -
జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన వివరాలు
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) కేసులో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. తన పాకిస్తాన్ పర్యటనలను వివరించే పలు వీడియోలను జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసిన దరిమిలా ఆమె వార్తల్లో నిలిచారు. 33 ఏళ్ల ఈ యూట్యూబర్‌ను పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో అరెస్టు చేశారు.ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau)లు జ్యోతి మల్హోత్రా కేసును దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఆమె డైరీలోని రెండు పేజీలు సంచలన వివరాలను వెల్లడిస్తున్నాయి. వీటిలో ఆమె పాకిస్తాన్లో 10 రోజుల పాటు ఎలా గడిపారనే వివరాలున్నాయని సమచారం. ఈ డైరీని హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ‘ఈ రోజు, నేను పాకిస్తాన్లో 10 రోజుల పర్యటన ముగించుకుని, నా దేశమైన భారతదేశానికి తిరిగి వచ్చాను. ఈ పర్యటనలో నాకు పాకిస్తాన్ ప్రజల నుండి ఎంతో ప్రేమ లభించింది. మా శ్రేయోభిలాషులు మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము లాహోర్‌ను సందర్శించడానికి రెండు రోజులు సరిపోలేదు’ అని తేదీ లేని ఆ పేజీలో జ్యోతి మల్హొత్రా రాసినట్లు ఉంది.పాకిస్తాన్‌ను రంగులమయంగా అభివర్ణించిన ఆమె అక్కడి తన అనుభవాలను మాటల్లో వర్ణించలేమని పేర్కొంది. డైరీలోని ఎంట్రీలలో ఆమె పాకిస్తాన్ అధికారులకు చేసిన ఒక అభ్యర్థన వివరాలు ఉన్నాయి. ‘పాక్‌లోని దేవాలయాలను కాపాడండి. 1947లో వారు విడిపోయిన కుటుంబాలను భారతీయులతో కలవనివ్వండి’ అని ఆమె పేర్కొంది. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను మే 16న అరెస్టు చేసిన అధికారులు.. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహితలోని వివిధ విభాగాల కింద కేసులు నమోదు చేశారు.ఇది కూడా చదవండి: ‘స్వర్ణదేవాలయంలో వైమానిక రక్షణ తుపాకులు మోహరించలేదు’ -
పాక్ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్
ఇస్లామాబాద్: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అత్యున్నత మిలటరీ హోదా అయిన ఫీల్డ్ మార్షల్‌గా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై చర్చించి, ఆమోదం తెలిపిందని పేర్కొంది.ఇటీవల భారత్‌తో తలెత్తిన సైనిక ఉద్రిక్తతల సమయంలో పాక్ బలగాలను విజయం దిశగా నడిపించిన మునీర్ పదోన్నతి పొందారని స్థానిక మీడియా తెలిపింది. ఈ విషయంలో ఆయన అద్వితీయమైన పాత్ర పోషించారని ప్రశంసించింది. యుద్ధంలో తమదే విజయమంటూ పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటుండగా, భారత్ మాత్రం సాక్ష్యాధారాలతో వివిధ అంతర్జాతీయ వేదికలపై వాస్తవాలను వివరిస్తూ వస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ తిరుగులేని అధికారాలను చెలాయిస్తున్న మునీర్‌కు ఇటీవల ఆ దేశ సుప్రీంకోర్టు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం తెల్సిందే. తాజాగా, ఆయనకు ప్రమోషన్ సైతం లభించడం గమనార్హం. Government of Pakistan has promoted Army Chief General Asim Munir to the rank of Field Marshal. ⭐⭐⭐⭐⭐ pic.twitter.com/NNrAM9Npzp— Ambassador Murad Baseer (@muradbaseer) May 20, 2025 -
‘అఖిలపక్షం వేళ’ అనైక్యత!
దేశం కోసం సమష్టిగా కదలాల్సిన సందర్భాల్లో సైతం కలవలేనంతగా అధికార విపక్షాలు ఎడ మొహం పెడమొహంగా మారాయి. పెహల్గామ్లో గత నెల 22న ఉగ్రవాదులు సాగించిన మారణ కాండ మొదలు మన ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్, ఈ నెల 10న కాల్పుల విరమణ, పాకిస్తాన్ దురాలోచనలూ వగైరా ప్రపంచానికి తెలియజెప్పేందుకు అధికార, విపక్ష ఎంపీలతో ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాల కూర్పు ప్రక్రియ వివాదాస్పదంగా మారటం దీన్ని చాటుతోంది. మన దేశంనుంచి సమష్టి స్వరం వినబడితే దాని ప్రభావం వేరుగా వుంటుంది. పాకిస్తాన్ సైతం ఇదే తరహాలో అఖిలపక్ష ప్రతినిధి బృందాలను పంపటానికి సన్నాహాలు చేసుకుంటున్నది. కనీసం ఇందుకోసమైనా విభేదాలు పక్కనబెట్టి ఒక్కటై నిలబడదామన్న స్పృహ అటూ ఇటూ కరువవుతోంది. ఏ దేశంలోనూ ఇలా వుండదు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీసీ)పై ఉగ్రదాడి మొదలు ఇందుకు ఎన్నయినా ఉదాహరణలివ్వొచ్చు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరుతో అమెరికా అఫ్గాన్‌ను వల్లకాడు చేసింది. చివరకు ఒరిగిందేమీ లేదు. అఫ్గాన్‌నుంచి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. అయినా అక్కడి విపక్షం మౌనంగా ఉండిపోయింది. కానీ ఇక్కడలా కాదు. యూపీఏ హయాంలో ముంబైపై ఉగ్రదాడి, దానికి వెనకాముందూ జరిగిన అనేకానేక ఉదంతాల్లో మన దేశంలో అధికార పక్షంపై విపక్షం విరుచుకుపడటం, యక్షప్రశ్నలు వేసి ఇరుకున పడేసే ప్రయత్నం చేయటం రివాజుగా మారింది. యూపీఏ హయాంలో బీజేపీ విపక్షంలోవుండి ఏం చేసేదో, ఇప్పుడు కాంగ్రెస్ సైతం ఆ పనే చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడి సమయంలో మరీ దారుణం. జవాన్ల త్యాగాలూ, వారు దెబ్బకు దెబ్బ తీసిన వైనమూ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారటం ఆశ్చర్యపరిచింది. ఈ ఉదంతాలను బీజేపీ తనకను కూలంగా మలుచుకునే ప్రయత్నం చేయగా, ప్రభుత్వ వైఫల్యంపై విపక్షం చాటింపు వేసింది. అయితే మన దేశంలోనూ ఒకప్పుడు అధికార, విపక్షాలు కలిసికట్టుగా పనిచేసిన ఉదంతాలు లేకపోలేదు. ఇందుకోసం ఎన్నడో 1971 నాటి భారత్–పాక్ యుద్ధం వరకూ పోనవసరం లేదు. 1994లో కశ్మీర్‌పై భారత్ వైఖరిని వివరించటానికి నాటి ప్రధాని పీవీ నరసింహారావు రూపొందించిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించింది అప్పటి విపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి! పాతికేళ్ల క్రితం కార్గిల్ యుద్ధ సమయంలో నాటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, కాంగ్రెస్‌తోసహా విపక్షాలూ దేశభద్రత కోసం కలిసికట్టుగా పనిచేశాయి. కానీ ఇప్పుడెందుకు పరస్పరం తప్పులు వెదుక్కొనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నట్టు? దేశంలో తక్షణం వచ్చే ఎన్నికలేమీ లేవు. అయినా పెహల్‌గామ్‌ను రాజకీయంగా వినియోగించుకోవటానికి అటూ ఇటూ పోటీపడుతున్నారు. త్రివిధ దళాల అధికార ప్రతినిధులు చెప్పేవరకూ ఆగకుండా ఇష్టానుసారం ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి, విపక్షాలను పాకిస్తాన్ అనుకూలురుగా, దేశద్రోహులుగా చూపటానికి బీజేపీ శ్రేణులూ, సాను భూతిపరులూ చేయని ప్రయత్నం లేదు. తొలి ప్రధాని నెహ్రూ ఉదారంగా పాకిస్తాన్‌కు నదీజలాలు, భారీయెత్తున సొమ్ము కట్టబెట్టారని బీజేపీ నేతలు ఇంకా ఆరోపణలు గుప్పిస్తూనే వున్నారు. ఒకపక్క అఖిలపక్షాన్ని పంపుతూ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? వీటిని ఎలా ఎదుర్కొనాలో తెలియక ఇష్టానుసారం మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చులకనవుతున్నారు. యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి... మనవైపు జరిగిన నష్టమెంత అంటూ రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఇవి అడగకూడని ప్రశ్నలేమీ కాదు... కానీ అందుకు తగిన వేదికను ఎంచుకోవాలని కూడా ఆయనకు తోచదు. ఇంతకూ అఖిలపక్ష బృందాల కూర్పుపై ఇంత వివాదం ఎందుకొచ్చినట్టు? విపక్షాలను విశ్వా సంలోకి తీసుకుని, వారు పంపిన పేర్లనుంచి ఎంపికచేసే కనీస మర్యాద అధికార పక్షం పాటించివుంటే సమస్య తలెత్తేది కాదు. విపక్షానికి ఆలోచించే శక్తిసామర్థ్యాలు లేవన్నట్టు సర్కారు ప్రవర్తించింది. కాంగ్రెస్ పార్టీ నలుగురు సభ్యుల పేర్లు పంపితే వారిలో ఒక్కరినే ఎంపిక చేసింది. పోనీ సర్కారు ఎంచుకున్నది కూడా సమర్థుల్నే కదా అనే సర్దుబాటు ధోరణి కాంగ్రెస్‌కు లేదు. అసలు ఆ పార్టీ నుంచి వెళ్లిన జాబితాలో సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్, మనీష్ తివారీ తదితరుల పేర్లు ఎందుకు లేకుండా పోయినట్టు? సీనియర్ నేత ఖుర్షీద్‌ను ఎంపిక చేసిన ప్రభుత్వం తీరా ఆయన సీనియారి టీని కాదని జేడీ(యూ) నేత సంజయ్ ఝాకు సారథ్య బాధ్యతలు ఎందుకిచ్చినట్టు? సమష్టి స్వరం వినబడాల్సిన ఈ సమయంలో ఇన్ని లుకలుకలుండటం మంచిదేనా? ఇంత రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ చివరకు ఈ వివాదాన్ని పొడిగించదల్చుకోలేదని చేతులెత్తేసింది. కానీ ఎప్పుడూ వీరంగం వేసే అలవాటున్న తృణమూల్ మాత్రం ప్రభుత్వం ఎంపిక చేసిన సభ్యుణ్ణి తప్పుకోమని చెప్పింది. దాంతో ప్రభుత్వం తగ్గి ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ సూచించిన నేతకు స్థానం కల్పించింది. అఖిలపక్షం పంపటంలోని ఉద్దేశమే సమష్టితత్వాన్ని, ఈ దేశ సంకల్పాన్ని, పాకిస్తాన్ కుయుక్తులను చాటడానికైనప్పుడు సభ్యుల ఎంపిక వివాదాస్పదం కాకుండా ప్రభుత్వం చూడాల్సింది. ఈమధ్య ఆపరేషన్ సిందూర్ మొదలుకొని పార్టీ వైఖరికి భిన్నంగా పలు ప్రకటనలిస్తూ సంచలనం సృష్టిస్తున్న శశిథరూర్‌ను కాంగ్రెస్ ఎంపిక చేయకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన్ను ఏరికోరి ఎంపిక చేయటం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టడానికేనన్న విషయంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. ఏదేమైనా ఇలాంటి సంక్షోభ సమయాల్లో అవసరమైన సంయమనం, హుందాతనం ఇరువైపులా కనబడకపోవటం దురదృష్టకరం. -
NIA విచారణ, జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు
చండీఘడ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్ఐ విచారణలో ఆమె పాకిస్తానీ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు కొనసాగించిందని, వాటిని రహస్యంగా ఉంచేందుకు పలు ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లు వినియోగించినట్లు తేలింది. ఎన్ఐఏ విచారణలో ఆమె సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్రపంచానికి తాను వ్లాగర్‌గా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే? ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లను ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పాకిస్తానీ ఏజెంట్లతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండేదని హర్యానా పోలీసులు తెలిపారు. హర్యానా రాష్ట్రం హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. అమె తీసిన యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల్లో భారతీయులకు పాకిస్తాన్ మంచి దేశంగా చూపించే ప్రయత్నం చేయడం,ఉగ్రదాడికి ముందు పహల్గాంలో పర్యటన, ఢిల్లీలోని పాక్ దౌత్య కార్యాలయం ఉద్యోగి ఇషాన్ దార్‌తో సన్నిహితంగా ఉండడంతో మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ ఐఆర్ నమోదైంది.గూఢచర్యం కేసులో ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఈషాన్ దార్‌తో సన్నిహిత సంబంధాలు, పాకిస్తాన్లో పర్యటన, ఐఎస్ఐతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి ముందు కశ్మీర్ సందర్శన, కశ్మీర్ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు వెళ్లడం, ఈ రెండు పర్యటనల మధ్య సంబంధం ఉందా? అన్న కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌పై ఆమె తండ్రి హరీష్ మల్హోత్రాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పడం కొత్త అనుమానాలకు తెరతీసినట్లైంది.ఒక సారి తన కుమార్తె జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ కోసం వీడియోలు షూట్ చేసేందుకు ఢిల్లీ వెళుతున్నట్లు తనకు చెప్పిందని, కానీ పాకిస్తాన్‌కు వెళ్లిన విషయం తనకు తెలియదని చెప్పారు. మరోసారి ఢిల్లీకి కాదు తాము ఉంటున్న ఇంట్లోనే వీడియోలు తీసేదని చెప్పారు. ఇంకోసారి తన కూతురు తాను ఏం చేస్తుందో ఎప్పుడూ చెప్పలేదని జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా చెప్పడంపై చర్చాంశనీయంగా మారింది. -
యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా తో పాటు మొత్తం 11 మంది అరెస్ట్
-
ఫౌండేషన్ల ముసుగులో సకల వ్యాపారాలనూ చేయిస్తోన్న పాక్ ఆర్మీ
-
పాక్ చెప్పిందంతా అబద్ధం
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు. -
భారత్- పాక్ వార్.. రూ.50 లక్షల ఆఫర్ వదులుకున్న సింగర్!
విరాట్ కోహ్లీతో వివాదంతో వార్తల్లో నిలిచిన సింగర్ రాహుల్ వైద్య మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇండియా- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశభక్తిని చాటుకున్నారు. టర్కీలో తాను ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించాడు. ఓ పెళ్లిలో ప్రదర్శన ఇచ్చేందుకు దాదాపు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని వెల్లడించాడు. పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగర్ రాహుల్ తెలిపారు.రాహుల్ వైద్య మాట్లాడుతూ.."టర్కీలో నాకు వచ్చిన ఆఫర్‌కు రూ. 50 లక్షలు ఇస్తామన్నారు. కానీ డబ్బు కంటే.. నా దేశ ప్రయోజనాలను ముఖ్యమని వారికి చెప్పా. వారు నాకు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. కానీ నేను వద్దన్నది డబ్బు గురించి కాదని మరోసారి స్పష్టం చేశా. ఎందుకంటే డబ్బు కంటే చాలా ముఖ్యమైన అంశం. ఇది ఒక వ్యక్తిగా కాదు.. నా దేశం గురించే ఈ నిర్ణయం. మన దేశానికి అండగా నిలబడాలన్నదే నా ఆశయం." అని పంచుకున్నారు. మన దేశానికి శత్రువుగా అంటూ మనల్ని అగౌరవపరిచే దేశాన్ని సందర్శించడంలో తనకు ఆసక్తి లేదని రాహుల్ పేర్కొన్నారు.ఇటీవల బాలీవుడ్ నటి రూపాలి గంగూలీ సైతం టర్కీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సినీ ప్రముఖులు, మనదేశ ప్రయాణికులు టర్కీ బుకింగ్‌లను రద్దు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఇప్పటికే టర్కీ విషయంలో భారత్ పలు ఆంక్షలు విధించింది. ఇకపై టర్కీలో భారతీయ సినిమాలు షూటింగ్‌లు ఉండవని స్పష్టం చేసింది. టర్కిష్ సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆదేశించింది. -
IPL 2025: పాకిస్తాన్ సరసన గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ జట్టు పొట్టి క్రికెట్లో ఓ అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 18) ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన ఈ జట్టు.. పాకిస్తాన్ తర్వాత టీ20ల్లో 200, అంతకుమించిన లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన రెండో జట్టుగా నిలిచింది. యావత్ టీ20 ఫార్మాట్ చరిత్రలో ఈ రెండు జట్లే (పాకిస్తాన్, గుజరాత్) ఇప్పటివరకు 200, అంతకుమించిన లక్ష్యాలను వికెట్ కోల్పోకుండా ఛేదించాయి.2022లో పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో 200కు పైగా లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఆ మ్యాచ్‌లో నాటి పాక్ కెప్టెన్ అజేయమైన సెంచరీతో (66 బంతుల్లో 110) విధ్వంసం సృష్టించగా.. అతని పార్ట్నర్, ప్రస్తుత కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (51 బంతుల్లో 88 నాటౌట్) చెలరేగాడు.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ 5, అభిషేక్ పోరెల్ 30, అక్షర్ పటేల్ 25, ట్రిస్టన్ స్టబ్స్ 21 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఓపెనర్లు సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్‌లో గిల్-సాయి సుదర్శన్ నెలకొల్పిన 205 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యంగా రికార్దైంది. ఈ సీజన్లో గిల్-సాయి జోడీ 839 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. లీగ్ చరిత్రలోనే ఓ సీజన్లో అత్యధిక పరుగులు జోడించిన భారత జోడీగా రికార్డుల్లోకెక్కింది. -
పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం
-
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్‌కు టీమిండియా దూరం
పాక్‌తో ఉద్రిక్త పరిస్థితలు నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మంత్రి నేతృత్వం వహిస్తున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనకూడదని డిసైడ్ చేసుకుంది. ఏసీసీ ఆథ్వర్యంలో జరిగే ఈవెంట్లలో భారత క్రికెట్ జట్లు (పురుషులు, మహిళలు) పాల్గొనవని స్పష్టం చేసింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్,ఆ తర్వాత సెప్టెంబర్‌లో భారత్ వేదికగా జరగాల్సిన ద్వైవార్షిక పురుషుల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఏసీసీకి కూడా తెలియజేసింది. క్రికెట్‌కు సంబంధించి పాక్‌ను ఒంటరి చేయడమే లక్ష్యంగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.కాగా, పాకిస్తాన్‌కు చెందిన మంత్రి మొహిసిన్ నఖ్వీ ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తూ, జోడు పదవులను అనుభవిస్తున్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. రోస్టర్ విధానంలో ఏసీసీ చైర్మన్ ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలో ఈ దఫా పాకిస్తాన్‌కు అవకాశం వచ్చింది. అంతకుముందు ఏసీసీ చైర్మన్‌గా ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జై షా ఉండేవాడు. షా.. ఐసీసీ పదవి చేపట్టాల్సి ఉండటంతో ఏసీసీ చైర్మన్‌గిరికి ముందుగానే రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే, భారత్ పురుషుల ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా పాక్ మంత్రి ఏసీసీ చైర్మన్‌గా ఉన్నందుకు బీసీసీఐ ససేమిరా అంటుంది. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనపోతే టోర్నీ జరగడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లకు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే ఉన్నారు. వీరు స్పాన్సర్షిప్కు ముందుకు రాకపోతే టోర్నీ జరుగదు.పెహల్గామ్ దాడితో మొదలు..ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నాయి. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్ దాడులకు పాక్ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి. తదనంతరం పరిణామాల్లో భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. -
జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు.. హైదరాబాద్, పూరీలో ఏం జరిగింది?
ఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తూ పలువురు భారతీయులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కాగా, తాజాగా యూపీకి చెందిన షహజాద్ అనే వ్యక్తిని.. అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటూ పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ జ్యోతి మల్హోత్రా జాడలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పహల్గాం సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. Jyoti Malhotra met Mariyam Nawaz in Pakistan, Hindu influencers are trapped by ISI, Sources claimed ISI motto is to prepare a Hindu to do terrorist attack in IndiaNaam : Jyoti MalhotraKaam : Gaddari A Woke Girl Can never be a True Patriot!!#JyotiMalhotra #YouTuber pic.twitter.com/7H5mPMgoeb— Sumit (@SumitHansd) May 17, 2025హైదరాబాద్‌తో టచ్‌లో..జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ కనిపించాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాజాగా ఆమె అరెస్ట్ కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా? కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా? అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.YouTuber से जासूस तक: Jyoti Malhotra का चौंकाने वाला सफर #JyotiMalhotraArrested #JyotiMalhotraYoutuber #jyotimalhotra pic.twitter.com/UJ2PkufpSA— Rubika liyaquat (@RubikaLiyakatFC) May 19, 2025పూరీలోనూ జాడలు..ఇదిలా ఉండగా.. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితోపాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పూరీ పోలీసు యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.News Flash 🔴 ବେଶ୍ ନିବିଡ଼ ଥିଲା ଜ୍ୟୋତି ଓ ପ୍ରିୟଙ୍କାଙ୍କ ସମ୍ପର୍କ❗ପାକିସ୍ତାନ ପାଇଁ ଗୁପ୍ତଚରୀ ଅଭିଯୋଗରେ ଗିରଫ ୟୁଟ୍ୟୁବର ଜ୍ୟୋତି ମାଲହୋତ୍ରା ଲିଙ୍କର ଖୋଳତାଡ଼, ପୁରୀର ୟୁଟ୍ୟୁବର ପ୍ରିୟଙ୍କା ସେନାପତିଙ୍କୁ ଇଣ୍ଟେଲିଜେନ୍ସ ବ୍ୟୁରୋ ପରେ ପୁରୀ ପୋଲିସର ପଚରାଉଚରା ସୂଚନା #ONL #Jyoti #PriyankaSenapati #Puri #Odisha pic.twitter.com/WSbg7BziAi— OdishaNewsLive (@OdishaNews_Live) May 18, 2025 2024 సెప్టెంబరు 26న పూరీ వచ్చిన జ్యోతి.. ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి, పాక్‌కు ఏదైనా సమాచారం అందించారా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ప్రియాంక మూడు నెలల క్రితం పాక్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అన్న అంశాలు కీలకంగా మారాయి.Puri: IB questioned Odisha YouTuber Priyanka Senapati over suspected Pakistan ties, following Jyoti Malhotra's espionage arrest. Jyoti had visited Puri last year, including the Jagannath Temple, raised security concerns due to sensitive footage.#JyotiMalhotra #PriyankaSenapati pic.twitter.com/MTjO5EuYh8— Ishani K (@IshaniKrishnaa) May 18, 2025 BIG BREAKING 🚨#YouTuber Jyoti Malhotra was arrested on charges of Spying for Pakistan.📍Pakistan Link According to an FIR, #JyotiMalhotra met Ehsan-ur-Rahim alias Danish, a Pakistan High Commission staffer in New Delhi, in 2023. Danish, her alleged handler, connected her… pic.twitter.com/dNRKDq5ogP— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) May 17, 2025 -
పాక్ కన్నా నరకం మేలు: జావెద్ అఖ్తర్
న్యూఢిల్లీ: దేశభక్తి, మతం అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించే సినీ రచయిత జావెద్ అఖ్తర్ (80) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, నరకం ఈ రెండింట్లో ఎక్కడికెళతావని అడిగితే తాను నరకాన్నే ఎంచుకుంటానని చెప్పారు. శనివారం రాత్రి ముంబైలో శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ రాసిన పుస్తకం ‘హెవెన్ ఇన్ ది స్వాంప్’(చిత్తడి నేలలో స్వర్గం) ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. తనను నాస్తికుడని చెప్పుకునే జావెద్ అఖ్తర్ భారత్, పాకిస్తాన్ల నుంచి అతివాదులు నిత్యం తనపై దుర్భాషల వర్షం కురిపిస్తున్నారని వెల్లడించారు. వీరిలో ఎవరైనా నన్ను దూషించడం ఆపేస్తే, చాలా ఆందోళన చెందుతాను. ‘కాఫిర్ అని, నరకానికి వెళ్తావని ఒకరంటే, జిహాదీ, పాకిస్తాన్‌కు పొమ్మంటూ మరొకరు దూషిస్తారు. పాకిస్తాన్, నరకం ఈ రెండింట్లో ఎటు వెళ్లాలన్న ప్రశ్న వస్తే మాత్రం నేను నరకానికే వెళ్తానంటాను’అంటూ జావెద్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలకు ఆహూతుల కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ‘పౌరులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారై ఉండరాదు. ఏ ఒక్క పార్టీకీ విధేయత చూపరాదు. అలాంటప్పుడు మాత్రమే పౌరులు ఏది తప్పో, ఏది రైటో చెప్పగలరు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఇండియా ఇంత బలహీనమైనదా?
ఈ మధ్య కాలంలో ప్రపంచం యుద్ధాల భూమిగా మారింది. గత నాలుగేళ్ళుగా ఉక్రెయిన్ – రష్యా యుద్ధం తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఏడాదిన్నర నుండి ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం భీకర నష్టానికి కారణమైంది. ఏప్రిల్ 22న అమా యక భారతీయులను కశ్మీర్లో టెర్రరిస్టులు దారుణంగా హత్య చెయ్యడంతో దేశం ఉడికిపోయింది. మే 7న పాక్‌లోని టెర్రరిస్టు క్యాంపు మీద ఇండియా దాడి చేసింది. అది ఒక మినీ వార్‌కు దారి తీసింది. అందులో రెండు యుద్ధాలు టెర్రరిస్టులు అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడంతో మొదలయ్యాయి. ఒకటి భూభాగ సమస్యగా మొదలైంది.టెర్రరిజంపై యుద్ధాలుగత కొన్ని దశాబ్దాలుగా టెర్రరిస్టులు ప్లాన్ చేసి అమాయక ప్రజలను చంపడంతో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అవి దేశాలను సైతం ధ్వంసం చేయడానికి దారి తీస్తున్నాయి. ఇప్పుడు ఇండియా–పాకిస్తాన్ మధ్య అటువంటి టెర్రరిస్టు దాడి వల్ల నాలుగు రోజులు కాల్పులు జరిగాయి. చివరికి మే 12న విరమణ జరిగింది. అయితే దీన్ని ఇండియా–పాకిస్తాన్ అధికారులు ప్రకటించకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అదీ యుద్ధం విరమించకపోతే ఈ రెండు దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండవని చెప్పాననీ, అందువల్ల వారు వెంటనే ఆపడానికి అంగీకరించారనీ అన్నారు. ఇది చాలా తీవ్రమైన ప్రకటన.అంతేకాదు, ఆ రెండు దేశాలు ఒక తటస్థ ప్రదేశంలో కశ్మీర్ సమస్యను చర్చించి, పరిష్కరించుకోవడానికి అంగీకరించారని కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదాన్ని ఆపానని కూడా అన్నారు. ట్రంప్ ప్రకటనలు పాక్ కంటే ఎక్కువగా ఇండియాను ఇరకాటంలో పెట్టాయి. అయితే పాక్ కూడా ట్రంప్ మధ్యవర్తిత్వానికి పాకులాడి ఎందుకు లొంగిపోయిందని చైనా నిలదీస్తున్నది. చైనా పాకిస్తాన్‌కు చాలా ఆయుధాలను ఇచ్చిందనేది తెలిసిందే. ఈ నాలుగు రోజుల ఇండియా–పాకిస్తాన్ ఉద్రిక్తతలు... చైనా, యూరప్, అమెరికా ఆయుధాల అమ్మకపు మార్కెట్ బలాబలాలను మార్చేసింది అనే చర్చ ప్రపంచమంతటా జరుగుతోంది.దౌత్య విలువలను మంటగలిపిన ట్రంప్ట్రంప్ భారత ప్రభుత్వానికి దగ్గరి మిత్రుడని బీజేపీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతూ వచ్చారు. కానీ ట్రంప్ రెండోసారి గెలిచాక భారత్‌ను అవమానపరిచే అనేక ప్రకట నలు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్యటనలో ఉండగానే మన దేశ పౌరులను అక్రమ వలసదారులు అనే నెపంతో చేతు లకు బేడీలు వేసి, మిలిటరీ విమానంలో చండీగఢ్ విమానాశ్రయంలో వదిలారు.అలాగే ఇండియా–పాక్ రెండు దేశాలనూ అవమానపరిచేలా, ఆయా ప్రభుత్వాలు ప్రజలకు చెప్పకముందే తాను చేయబట్టే యుద్ధం ఆగిపోతోంది అని ట్వీట్ చేశారు. ఇది అన్ని విధాలుగా అంతర్జాతీయ దౌత్య విలువలకూ, యుద్ధ నీతికీ వ్యతిరేకం. ఆయా ప్రభుత్వాలు చెప్పాల్సిన విషయమది. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా దాన్ని ఆపేందుకు అటు ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ), లేదా ఇతర దేశాలు రాయబారాలు జరిపి రెండు దేశాలనూ ఒప్పించి యుద్ధం ఆగేట్లు చూడటం దౌత్య నీతిలో భాగమే.అందులో ఇండియా–పాక్ న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్న దేశాలు కనుక ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధం ఆపాలని చూడటం అవసరం. కానీ మొన్న యూఎన్ఓ ఎక్కడా కనిపించలేదు. అది నిజానికి ఉక్రెయిన్ – రష్యా, ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధాలను ఆపడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, ఇండియా–పాక్ ఉద్రిక్తతల సమయంలో దాని ఉనికి కనిపించలేదు. యూరోపియన్ దేశాలు కూడా ఇండియా–పాక్ ఉద్రిక్తతలను ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధంలాగా ఘోరంగా అమాయక ప్రజలను టెర్రరిస్టులు చంపడంతో మొదలైనా పెద్దగా పట్టించుకోలేదు. రష్యా కూడా బహిరంగంగా ఇండియాకు మద్దతు పలుకలేదు. చైనా, టర్కీ, ఇరాన్... పాకిస్తాన్‌కు అండగా ఉన్నాయనేది స్పష్టంగానే కనిపించింది.వీటన్నింటినీ మించి యూఎస్, ముఖ్యంగా ట్రంప్ పాత్ర అన్ని యుద్ధ సమయపు దౌత్య విలువలనూ నాశనం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ కొద్ది రోజుల ముందే ఇండియా వచ్చి మిత్రగానం చేసి ‘ఆ యుద్ధంలో జోక్యం చేసుకోవడం మా పని కా’దన్నాడు. కానీ పాక్‌కు 2.3 బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ ద్వారా ఇప్పించారు. పైగా ట్రంప్ కశ్మీర్‌ను మళ్ళీ చర్చల తెర మీదకి తెచ్చి ఒక తటస్థ స్థలంలో ‘వెయ్యి ఏండ్ల’ సమస్యగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామనడం, కాల్పుల విరమణను వాణిజ్య లావాదేవీలతో ముడిపెట్టి ప్రకటించడం చూస్తే, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశాన్ని తన డొమినియన్ స్టేట్‌గా భావిస్తున్నట్టు కనబడుతుంది.ఈ ప్రశ్నలకు జవాబుందా?భారతదేశం నుండి అమెరికా వెళ్ళి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు వేల కోట్ల రూపాయలు అక్కడ ఫీజులుగా చెల్లిస్తున్నారు. వారికి వర్క్ పర్మిట్‌లో 3–5 సంవత్సరాల వరకు వీసాలిచ్చి వారినందరినీ ట్రంప్ దిక్కులేని వారిగా చేశారు. అక్కడి నాణ్యత లేని విద్యా సంస్థల్లో కూడా భారతీయ విద్యార్థులు చేరింది ఉద్యోగం ఆశతో! ఒక ప్రభుత్వ కాలంలో నిర్ణయాలు మార్చదల్చుకుంటే రాబోయే విద్యార్థులకు మార్చాలి. కానీ ఆయన గెలిచే నాటికే ఆ దేశంలో ఉన్న విద్యార్థుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. విచిత్రమేమంటే భారత ప్రభుత్వం వీటి మీద అంతర్జాతీయ విధానాలతో, చట్టపరమైన విధానాలతో అమెరికాను నిలదీసింది లేదు.పైగా కాల్పుల విరమణ పేరుతో ట్రంప్ ఈ దేశం పరువు తీశారు. ఇటువంటి డిప్లమాటిక్ ఇమ్మోరాలిటీని ఈ దేశం ఎదిరించలేదా? భారతదేశం ఇంత బలహీనమైనదా? జాతీయవాదం, ఆత్మగౌరవం అని చెప్పే, బలమైన ఆర్థిక వ్యవస్థగా యుద్ధశక్తిగా ఎదుగుతున్నామని చెప్పే బీజేపీ/ఆరెస్సెస్ ట్రంప్‌కు ఎందుకు భయపడుతున్నాయి? అమెరికా మద్దతు లేకపోతే దేశం బతకలేదు అనే స్థితి ఎందుకొచ్చింది? భారతదేశంలోని పెద్ద వ్యాపారులందరికీ అమెరికన్ ఆర్థిక పెట్టుబడులతో ఉన్న అనుబంధంతో ఈ స్థితి వచ్చిందా? అయినా ఈ సంక్షోభ సమయంలో అమెరికా, ముఖ్యంగా ట్రంప్ పాకిస్తాన్‌కే ఎక్కువ మేలు చేసినట్టు కనిపించింది కదా! టెర్రరిజాన్ని పోషించే పాక్‌కు ఇన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి అంటే అర్థమేమిటి?గత పదేళ్ళుగా బీజేపీ/ఆరెస్సెస్ గ్లోబల్ డిప్లమసీలో మన దేశాన్ని గొప్ప స్థానంలో పెట్టామని చెబుతూ వచ్చాయి కదా! అమెరికాలోని ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు ట్రంప్‌కు ఎంతో సపోర్టు చేస్తూ వచ్చాయి కదా! మరి ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏ ఇతర దేశ పౌరుల్నీ మన పౌరుల్లాగా చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో వెనక్కి పంపలేదే! ఆఖరికి పాక్ అక్రమ వలసదారులకు కూడా ఆ స్థితి వచ్చిన దాఖలాలే లేవే! ఇప్పుడు బీజేపీ/ఆరెస్సెస్ 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్‌ను సంపూర్ణంగా దేశంలో విలీనం చేశామని చెబుతుంటే ట్రంప్ ఆ సమస్యను మళ్ళీ ప్రపంచ సమస్య చేశారు కదా! ఇది కూడా ఆరెస్సెస్/బీజేపీ అనుకూల అంశమేనా? ఇది కూడా ఈ దేశ సమగ్రతను కాపాడే చర్చయేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
పాక్‌కు ఐఎంఎఫ్ మరో 11 షరతులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీ నిధులు విడుదల చేసే విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 11 కొత్త షరతులు విధించింది. అలాగే భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవడం తగదని హితవు పలికింది. ఉద్రిక్తతలు పెంచుకొంటే మీకే ఎక్కువ సమస్యలు వస్తాయని తేల్చిచెప్పింది. ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, సంస్కరణ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుందని తేల్చిచెప్పింది. బిలియన్ డాలర్ల(రూ.8,540 కోట్లు) రుణానికి సంబంధించిన నిధులు పొందాలంటే షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. తాజాగా విధించిన 11 షరతులతో కలిపి పాకిస్తాన్‌పై విధించిన ఐఎంఎఫ్ షరతుల సంఖ్య 50కి చేరుకోవడం గమనార్హం. రూ.17.6 ట్రిలియన్ల బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని, విద్యుత్ బిల్లులపై రుణ సరీ్వసింగ్ సర్‌చార్జి పెంచాలని, మూడేళ్లు దాటిన పాత కార్ల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేయాలని ఐఎంఎఫ్ పేర్కొంది. మొత్తం బడ్జెట్లో రూ.1.07 ట్రిలియన్ల సొమ్మును అభివృద్ధి కోసం కేటాయించాలని నిర్దేశించింది. పాక్‌లోని నాలుగు ప్రావిన్సుల్లో కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలని అమలు చేయాలని తేల్చిచెప్పింది. -
భారత్ అడుగుజాడల్లో...
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్, పరస్పర సైనిక చర్యల తర్వాత ప్రతి అంశంలో భారత్‌ను పాకిస్తాన్ అనుసరిస్తోంది. పాక్ వైఖరిని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు అన్ని పార్టీల ఎంపీలు తదితరులతో ఏడు బృందాలను పలు దేశాలకు పంపుతుండటం తెలిసిందే. పాక్ కూడా అదే తరహాలో పలు దేశాలకు ఎంపీల బృందాలను పంపుతున్నట్టు హడావిడిగా ప్రకటించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో, పలువురు మంత్రులు, మాజీ మంత్రులు వాటికి సారథ్యం వహిస్తారని చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ‘‘సొంత ఆలోచనే లేకుండా భారత్ ఏం చేస్తే పాక్ అదే చేస్తోంది. మక్కికి మక్కి పాలసీని అలవర్చుకుంది. ‘కాపీక్యాట్ పాక్’’ అంటూ నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఇందుకు పలు ఉదంతాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు.బహిష్కరణల నుంచి బృందాల దాకా.. పహల్గాం ఉదంతం తర్వాత భారత్ వెంటనే భారత్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని సిబ్బందిని భారీగా కుదించింది. వాళ్లను తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించింది. పాకిస్తాన్‌లోని భారతీయ హైకమిషన్‌లోనూ కొంత సిబ్బందిని వెనక్కివచ్చేయాలని సూచించింది. పాక్ కూడా అచ్చం అవే చర్యలకు దిగింది. మనం ఆపరేషన్ సిందూర్ అని పేరు పెడితే తానూ ‘ఆపరేషన్ బున్యాన్ మో§అల్ మర్సూస్’ అని నామకరణం చేసింది. మోదీ బాటలో షహబాజ్... ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన ఎయిర్‌ఫోర్స్ బలగాలను మెచ్చుకునేందుకు ప్రధాని మోదీ పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. సుదర్శన చక్ర(ఎస్–400) గగనతల రక్షణ వ్యవస్థ ఎదుట ఎయిర్‌ఫోర్స్ క్యాప్ ధరించి జవాన్లనుద్దేశిస్తూ ప్రసంగించారు. మర్నాడే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అచ్చం ఇలాగే చేశారు. సియాల్కోట్లోని పస్రూర్ కంటోన్మెంట్లో యుద్ధట్యాంక్పై నిలబడి సైనిక యూనిఫామ్‌లో జవాన్లనుద్దేశించి ప్రసంగించారు. గూఢచర్యం ఆరోపణలపై ఢిల్లీలోని పాక్ హై కమిషన్ ఉద్యోగిని బహిష్కరిస్తే మర్నాడే పాక్ కూడా అదే పనిచేసింది. నిజానికి ఆ భారత ఉద్యోగిని కేంద్రం అప్పటికే వెనక్కి రప్పించడం ఇందులో కొసమెరుపు! -
ఆపరేషన్ సిందూర్ న్యూ వీడియో షేర్..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రమూకల్ని అంతమొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి మరో వీడియోను షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిన భారత ఆర్మీ.. పాక్ లోని పలు ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేసింది. తొలుత ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపట్టింది. దీనికి బదులుగా పాక్ లో ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసి సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.దీనికి సంబంధించి ఒక్కో వీడియోను భారత ఆర్మీ షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో వీడియోను భారత ఆర్మీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది పహల్గామ్ లో సృష్టించిన మారణహోమానికి జరిగిన న్యాయం మాత్రమే ఇది.. ప్రతీకారం కాదు’ అని పేర్కొంది. ఈ వీడియోకు ఓ క్యాప్షన్ ను జోడించింది. ‘ప్రణాళిక.. శిక్షణ.. అమలు’ అంటూ ట్యాగ్ చేసింది భారత ఆర్మీ. #StrongAndCapable#OpSindoorPlanned, trained & executed.Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon— Western Command - Indian Army (@westerncomd_IA) May 18, 2025 -
లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతం
లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు పాకిస్థాన్‌లో ఖలీద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన ఖలీద్‌ను దాడి చేసి హతమార్చారు. లష్కరే కమాండర్లతో కలిసి ఖలీద్ పనిచేశాడు. 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఖలీద్ సూత్రధారి.నాగపూర్, రాంపూర్, బెంగుళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఖలీద్‌కు పాకిస్థాన్ సర్కార్ భద్రత కల్పించింది. నేపాల్‌లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్.. ఇటీవల సింధ్ ప్రావిన్స్‌లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. ఇవాళ అక్కడే హతమయ్యాడు. 2001లో రాంపుర్లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై, 2005లో బెంగళూరులోని ఐఐఎస్‌సీపై జరిగిన దాడుల్లోనూ ఖలీద్ హస్తం ఉంది. -
సంగారెడ్డిలో ఉగ్రమూలాల కలకలం.. పాక్‌కు సమాచారం చేరవేత?
సంగారెడ్డి: జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాం(19) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో షాకింగ్ విషయాలు బయడపడినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసుల ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా ఇస్లాం బాగోతం వెలుగులోకి వచ్చింది.అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో అస్సాంలో మొబైల్ షాపులో పని చేసిన ఇస్లాం.. అక్కడే కొందరి గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ లు తీసుకుని అధిక ధరకు విక్రయించాడు.ప్రస్తుతం గొల్లపల్లిలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీయులకు అమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్ ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్ లో వాట్పాప్ అకౌంట్ లు క్రియేట్ కావడంతో ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.ఇటీవల జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భాగంగా మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నట్లు సమాచారం.దేశ వ్యాప్తంగా ఏడుగురు అరెస్ట్.. అంతా అస్సాం వారేఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడుగురు అనుమానితులువివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంగారెడ్డిలో మకాం వేసిన అస్సాం పోలీసులు తమ దర్యాప్తును అత్యంత గోప్యంగా సాగిస్తున్నట్లు సమాచారం.#OperationGhostSIMAssam police has arrested 7 people for helping people from Pakistan to use WhatsApp from Indian numbers by sharing OTPs.7 arrested, 948 SIMs seized.These SIMs were being used for cyber crimes and anti-national operations. pic.twitter.com/crLN5LMmpO— Incognito (@Incognito_qfs) May 18, 2025 Assam Police busts major fake SIM racket in ‘Operation GHOST SIM’; 7 arrested, 948 SIMs seized; WhatsApp OTPs linked to Pakistan. The public is urged to stay alert.Read Full Story: https://t.co/zhwxJLa7Cm#AssamPolice #OperationGhostSim #Crime #SimCardRacket pic.twitter.com/BU94CVK9o1— Pratidin Time (@pratidintime) May 17, 2025 -
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
హైదరాబాద్: ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరులో భాగంగా తన వంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పాకిస్తాన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాంలో హింసకు తావులేదని పదే పదే చెబుతున్న అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన పలువురు ట్రోలింగ్‌కు దిగారు. దీనికి ఓవైసీ నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ పాకిస్తాన్ లో ఉన్న వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి. అది అందరికీ మంచిది. మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది’ అని అసదుద్దీన్ తెలిపారు.‘ ‘మీపై పాకిస్తాన్ ట్రోలింగ్ ఎక్కువైంది కదా’’ ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఓవైసీ నవ్వుతూ స్పందించారు. వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ చమత్కరించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి ఓవైసీ సిద్ధమవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఓవైసీకి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. తొలుత ఓవైసీకి ఆహ్వానం అందలేదనే వార్తల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఓవైసీని అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. అప్పట్నుంచీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్థ శతాబ్దం వెనక్కి పోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు ఓవైసీ.ఇదీ చదవండి:నీ తల్లికి తూటా దింపిందెవరు? -
కాంగ్రెస్ మిమ్మల్ని అవమానిస్తోందా?.. ఎంపీ శశి థరూర్ రియాక్షన్ ఇదే
ఢిల్లీ: ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష నేతల్లో కేంద్ర ప్రభుత్వం తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించుకున్నారు. తాను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజకీయ కోణంలో చూడడం లేదు. ఇది దేశానికి సేవ చేయాల్సిన సమయం’ అని స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ ఎంపికపై శశిథరూర్ స్పందించారు. ‘మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ అనుభవం కారణంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాను ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. కిరణ్ రిజిజు అడిగిన వెంటనే నేను అందుకు అంగీకరించాను. ఇది దేశ సేవకు సంబంధించింది. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరుడిని సహాయం కోరితే ఇంకేం సమాధానం ఇవ్వాలి?అని ప్రశ్నించారు. తాను తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ విషయం పార్టీకి, కేంద్రానికి సంబంధించింది. మీరు కాంగ్రెస్‌ను అడగాలి’ అని సూచించారు. పార్టీ మిమ్మల్ని అవమానించిందా? అన్న ప్రశ్నకు.. నన్ను అంత తేలికగా అవమానించలేరు. నా విలువ నాకు తెలుసని సమాధానమిచ్చారు. దేశంపై దాడి జరిగినప్పుడు, అందరం ఒకే స్వరం వినిపించడం, ఐక్యతగా నిలబడటం దేశానికి మంచిది. కేంద్రం ఆయనను దేశ ప్రతినిధిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
పాకిస్తాన్‌కు ఊహించని షాక్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన IMF
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఫుల్ ఫోకస్ పెట్టింది. పాకిస్తాన్‌పై కొత్త ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో, పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌పై మరో 11 కొత్త ఆర్థికపరమైన షరతులను ఐఎంఎఫ్ విధించింది. తాజాగా విధించిన షరతులతో ఐఎంఎఫ్ విధించిన షరతుల సంఖ్య 50కి చేరుకుంది. పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్గా ప్రణాళిక వేస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.252 బిలియన్లు అంటే 12% అధికం. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్ కొత్త షరతులు విధించినట్టు తెలుస్తోంది.కొత్త షరతులు ఇవే.. జూన్ 2025 లోగా ఐఎంఎఫ్ లక్ష్యాలకు అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదించాలి. ఐఎంఎఫ్ సూచించిన గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రభుత్వం ప్రచురించాలి. అంతేకాకుండా 2027 తర్వాతి ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళిక రూపొందించాలి. ఇది 2028 నుండి సంస్థాగత మరియు నియంత్రణ వాతావరణాన్ని వివరిస్తుంది.🚨BREAKING: IMF imposes 11 new conditions on Pak, warns it against risks to bailout programme: Report#IndiaPakistanWar #IndiaPakistanTensions pic.twitter.com/CqBS9vF6eF— 8bit Market (@8bit_market) May 18, 2025అలాగే, జూన్ నెల లోపు నాలుగు రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీని కోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమం ఇంకా వాటి అమలుకై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకురావాలని తెలిపింది. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది.ఇంకా ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాలని తెలిపింది. వీటితోపాటు, 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా పాకిస్తాన్ సర్కార్‌ను ఐఎంఎఫ్ కోరింది. దీని కోసం ఈ ఏడాది చివర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే జూలై చివరి నాటికి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఐదు సంవత్సరాలలోపు వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని తెలిపింది. ఈ క్రమంలో ఐఎంఎఫ్ విధించిన కొత్త షరతులతో పాకిస్తాన్‌కు టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. -
..మాకు తాకింది నిజమే!
..మాకు తాకింది నిజమే! -
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
ఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదని స్పష్టం చేసింది. ఈ రోజు డీజీఎంవో చర్చలు లేవని తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది.పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం విలవిల్లాడింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ (Pakistan)శరణుగోరింది. పాక్ అర్జించడంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) స్థాయిలో కాల్పుల విరమణ అవగాహనపై ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. Some media houses are reporting that the ceasefire between India and Pakistan is ending today. In addition, queries are also being received if a DGMO-level talk is scheduled today.According to the Indian Army, no DGMO talks are scheduled today. As far as the continuation of a…— ANI (@ANI) May 18, 2025 -
ఆపరేషన్ సిందూర్ తడాఖా.. దేశ భక్తిపై భారత్‌లో నయా ట్రెండ్..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌తో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపించాయి. పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. భారత్ దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు సైతం దెబ్బతిన్నాయి. తీవ్ర నష్టం జరగడంతో పాక్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌పై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన టీషర్టులపై సైనిక నినాదాలు, వాయుసేన ఫొటోలు ముద్రించి దేశభక్తిని చాటుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక, ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఇక యువత సైతం ఆపరేషన్ సిందూర్ గొప్పతనాన్ని చాటేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆపరేషన్ సిందూర్, వాయుసేనకు సంబంధించిన ఫొటోలు ముద్రించిన టీషర్ట్స్‌ని ధరించి.. గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. సైన్యానికి, భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు. కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా నినాదాలు, భారత వాయుసేనకు సంబంధించిన ఫైటర్ జెట్ ఫొటోలను ముద్రించిన టీషర్ట్స్ బయటకు వచ్చాయి. ఇవి యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి."Our job is to hit the target, not to count the body bags!"#OperationSindoor was conceptualised with a clear military aim — to punish the perpetrators and planners of terror, and to destroy their terror infrastructure. - Command pic.twitter.com/oEY3cBXwEP— Ramraje Shinde (@ramraje_shinde) May 12, 2025ఈ టీషర్ట్స్‌పై ‘లక్ష్యాలను ఛేదించడమే మా పని.. శవాల మూటలు ఎన్నో లెక్కజెప్పడం కాదు..’, ‘కినారా హిల్స్‌లో ఏముందో మాకు తెలియదు. తెలిసిందల్లా పని చేసుకుంటూ పోవడమే’ లాంటి నినాదాలు ఉన్నాయి. పలు కంపెనీలు ఇలాంటి టీషర్ట్స్‌ను విడుదల చేశాయి. దీంతో, ఇవన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పలు కంపెనీల ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. దేశ భక్తిని చాటేలా.. మన సైనిక శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా టీషర్ట్స్ డిజైన్ చేస్తున్నారు. యువత వీటిని ధరించి.. ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.@IAF_MCC Proud to wear this. 💕💘🥰😍---@major_madhan In your operation sindoor video, explaining the sequence of events, there was a special series on Airmarshal AK Bharti., in which you spoke of his statement being printed on T-shirt. I got one today. pic.twitter.com/tA8qAmWRCZ— pandurangavittal.vn (@vittal_vn) May 17, 2025 Overnight this statement has become a rage and T shirts are getting printed now.Think and brood over it … why..!~Air Marshal AK Bharati~architect behind #OperationSindoor pic.twitter.com/StLqSazaX9— Braj Mohan Singh (@brajjourno) May 12, 2025 New India. New rules. No mercy.This is Bharat’s new normal: Strike first, strike hard.#OperationSindoor pic.twitter.com/FadCVJVRil— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) May 11, 2025 -
పాక్, తుర్కియేపై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్.. ఇస్లాం పేరుతో చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తుర్కియే దేశానికి విజ్ఞప్తి చేశారు. పాక్ వ్యవహరిస్తున్న తీరుకు ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేదన్నారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాక్ కంటే భారత్‌లోనే ముస్లింల సంఖ్య ఎక్కువ అని, భారత్‌లోనూ గౌరవప్రదంగా జీవిస్తున్న విషయం మరిచిపోవొద్దని వ్యాఖ్యానించారు.తుర్కియే, భారత్‌ల మధ్య చారిత్రక సంబంధాలున్న విషయాన్ని గుర్తు చేశారు. గతంలో తుర్కియే అభివృద్ధికి భారత్ తోడ్పాటును అందించిందని పేర్కొన్నారు. పాక్ వైపు మొగ్గుచూపుతున్న తుర్కియే తమ విధానాన్ని పునరాలోచించుకోవాలని హితవు పలికారు. తనను పాక్ జాతీయులు విమర్శిస్తుండటంపైనా ఒవైసీ దీటుగా బదులిచ్చారు. ‘నా లాగా నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వారిని పాకిస్తానీలు ఇప్పటివరకూ ఎప్పుడూ చూడలేదు. నాలాంటి వారు ఇండియాలో మాత్రమే ఉంటారు. వాళ్లు నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. అప్పుడే వారికి అవగాహన పెరిగి అజ్ఞానం తొలగిపోతుంది’ అని అన్నారు.మానవాళికి ముప్పు పాక్..పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదానికి చేయూతనిస్తూ మానవాళికే ముప్పుగా పరిణమించిందని అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా మారిందన్నారు. పాక్ తనని తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకోవడాన్ని ఒవైసీ కొట్టి పారేశారు. దీర్ఘకాలిక ఎజెండా ప్రకారం, పాకిస్తానీ మిలిటరీ భారత్‌లో అస్థిరతను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. భారత్, పాక్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్నీ ఆయన విమర్శించారు. మతపరమైన విభజనలు సృష్టించడం, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం పాకిస్తాన్ అప్రకటిత సిద్ధాంతమని ఒవైసీ ఆరోపించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికల దృష్టికి భారత్ తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. విదేశాలకు పంపించే అఖిల పక్ష ప్రతినిధుల బృందంలో తాను ఉండే విషయం కానీ, చైర్పర్సన్ ఎవరనేది కానీ తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఒవైసీ చెప్పారు. -
గూఢచర్యం ఆరోపణలపై మహిళా యూట్యూబర్ అరెస్ట్
చండీగఢ్: హరియాణాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్‌చేశారు. పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదుచేశారు. శుక్రవారం ఆమెను హరియాణాలోని హిస్సార్‌లోని న్యూ అగ్రసేన్ ఎక్స్టెన్షన్ కాలనీలో అరెస్ట్‌చేశారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా జ్యోతిని ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ జడ్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించడం తెల్సిందే. పంజాబ్ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచి్చనట్లు తెలుస్తోంది. పాకిస్తానీ అధికారితో కలిసి గూఢచర్యం కేసులో పంజాబ్ పోలీసులు ఇప్పటికే ఒక మహిళ సహా ఇద్దరిని అరెస్ట్ చేయడం తెల్సిందే. ఎవరీ జ్యోతి? హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్రై్కబర్లు ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్‌గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నో వీడియోలు తీసి పోస్ట్‌చేశారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం జ్యోతి రెండేళ్ల క్రితం పాకిస్తాన్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు వెళ్లింది. అక్కడ ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డ్యానిష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత వీసా లభించాక మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో డ్యానిష్ ఆదేశానుసారం అలీ అహా్వన్ అనే వ్యక్తి ఈమెకు పాక్‌లో బస, రవాణా ఏర్పాట్లుచేశాడు. పాకిస్తాన్లో పర్యటించిన కాలంలో జ్యోతి అక్కడి ఐఎస్ఐ అధికారులను కలిసింది. షకీర్, రాణా షహ్‌బాజ్‌లతో పరిచయం పెంచుకుంది. షహ్బాజ్ ఫోన్‌నంబర్‌ను ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్‌ఫోన్‌లో జాట్ రంధావా అనే వేరే పేరుతో సేవ్‌చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాప్ యాప్‌లలో మాత్రమే వివరాలు పంపించేది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు తరచూ వెళ్తూ అక్కడ డ్యానిష్‌ను ఎక్కువగా కలిసేది. అతని ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రతింపులు జరిపి భారత్‌కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డ్యానిష్ తో ఈమెకు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇండోనేసియాలోని బాలీ ద్వీపానికీ వెళ్లొచ్చారు. ఇటీవల పాకిస్తాన్ అనుకూల వీడియోలు తీసి పోస్ట్చేసింది. పాక్‌లో కతాస్ రాజ్ టెంపుల్సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్ పట్ల ఇండియన్లలో మంచి అభిప్రాయం పెరిగేందుకు ప్రయత్నించింది. -
పాక్‌పై దౌత్య యుద్ధానికి బృంద సారథులు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్ దౌత్యపరంగానూ బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. పాక్ అరాచకాలను, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాలకు వివరించనుంది. ఇందుకోసం పలు పార్టిల నేతలు, ఎంపీలు, దౌత్యవేత్తలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం నాలుగు నుంచి ఐదు దేశాల్లో పర్యటించనుంది. విపక్షాల నుంచి శశి థరూర్ (కాంగ్రెస్), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ–పవార్), అధికార ఎన్డీఏ కూటమి నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), శ్రీకాంత్ షిండే (శివసేన–షిండే) వాటికి సారథ్యం వహిస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శనివారం ఈ మేరకు వెల్లడించింది. బృందాల్లో సభ్యులుగా అనురాగ్ ఠాకూర్, అపరాజితా సారంగి, మనీశ్ తివారీ, అసదుద్దీన్ ఒవైసీ, అమర్ సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, సమిక్ భట్టాచార్య, బ్రిజ్‌లాల్, సర్ఫరాజ్ అహ్మద్, ప్రియాంక చతుర్వేది, విక్రమ్‌జిత్ సాహ్నీ, సస్మిత్ పాత్ర, భువనేశ్వర్ కలితాతో పాటు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తదితరులు ఉంటారు. వారంతా ఈ నెలాఖర్లో ఐరాస భద్రతా మండలితో పాటు పలు కీలక దేశాల్లో పర్యటిస్తారు.ఏ బృందం ఏ దేశానికి... శశి థరూర్: అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా సుప్రియా సూలే: ఈజిప్‌్ట, ఖతర్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా కనిమొళి: రష్యా, స్పెయిన్, గ్రీస్, స్లొవేనియా, లాతి్వయా సంజయ్ కుమార్ ఝా: జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేసియా రవిశంకర్ ప్రసాద్: ఈయూ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ బైజయంత్ పండా: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా శ్రీకాంత్ షిండే: యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్ -
పాకిస్థాన్ స్పైగా హర్యానా యూట్యూబర్.. జ్యోతి మల్హోత్రా అరెస్ట్
ఢిల్లీ: హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్‌లో ఐఎస్ఐ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురి అరెస్ట్‌ను చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన జ్యోతి మల్హోత్రా.. ఇటీవల ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో రెండుసార్లు పర్యటించారు. పాకిస్తాన్ అధికారి ఎహ్సాన్ రహీంను కలిసిన జ్యోతి మల్హోత్రా.. ఆ దేశానికి కీలక సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించినట్లు తేలింది. వీరంతా పాక్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. జ్యోతి.. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది.డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగడంతో జ్యోతి గూఢచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు తేలింది.ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్లు సమాచారం. ‘జాట్ రంధావా’ అని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రాణా షాబాజ్ అనే పాకిస్థాన్ వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లిన జ్యోతి.. యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, యూఏఈ దేశాల్లో కూడా పర్యటించింది.పాక్ ఇంటలిజెన్స్ అధికారితో సన్నిహిత పెంచుకుని ఇద్దరూ ఇటీవల ఒక వారం పాటు ఇండోనేషియాలోని బాలి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు. జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు. -
ఆపరేషన్ సిందూర్ తో జరిగిన నష్టాన్ని అంగీకరించిన పాక్
-
భారత్‌కు ద్రోహం.. పాక్‌కు గూఢచర్యం చేస్తున్న విద్యార్థి అరెస్ట్
ఛండీగఢ్: దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న విద్యార్థిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.వివరాల ప్రకారం.. నిందితుడు దేవేంద్ర సింగ్ ధిల్లాన్ హర్యానాలో పాటియాలలో ఉన్న ఖల్సా కళాశాలలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే, మే 12న ధిల్లాన్.. తన ఫేస్బుక్ ఖాతాలో గన్, పిస్టోల్ చిత్రాలను పోస్టు చేశాడు. ఈ విషయం పోలీసులు దృష్టికి చేరడంతో.. కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. అనంతరం, అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దేవేంద్రసింగ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపించారు. ఈ క్రమంలో ధిల్లాన్ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.విచారణలో భాగంగా.. ధిల్లాన్ గతేడాది నవంబరులో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్‌కు వెళ్లినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా అక్కడి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు తేలిపింది. ఈ మేరకు నిందితుడు అంగీకరించాడు. అందుకు పాక్ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు తెలిపాడు. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్‌కు సంబంధించిన చిత్రాలను సైతం అతడు పాక్ అధికారులకు అందించాడు. దీంతో, డబ్బు లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.Kaithal, Haryana! Pak ISI spy Devendra Singh Dhillon arrested! Devendra sent army camps and other sensitive information to Pakistan ISI! Devendra went to Pakistan for a religious trip in 2024, during which an ISI agent caught him in a girl's honey trap. Police investigation is on pic.twitter.com/gnTVuHUDXh— Kalu Singh Chouhan (@kscChouhan) May 17, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తరప్రదేశ్ చెందిన రవీంద్రకుమార్‌కు సైతం ఇలాగే పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐకు గూఢచర్యం చేస్తున్న కారణంగా రవీంద్రకుమార్‌ను విచారిస్తున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రవీంద్రకుమార్ ఓ అమ్మాయితో హానీట్రాప్‌లో చిక్కి.. భారత సైన్యం ఆయుధాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేశాడు. ఐఎస్ఐ సభ్యులతోనూ అతడు నేరుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో, అతడి అంశంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. -
పాకిస్థాన్ తో దౌత్య యుద్ధానికి భారత్ సిద్ధం
-
పాక్‌కు భారత్ చెక్.. ఏడుగురు ఎంపీలతో దౌత్య యుద్ధం!
ఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్ తీరు ఎండగట్టేందుకు భారత్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ మేరకు ప్రతినిధుల బృందాలకు సంబంధించిన వివరాలను కేంద్రం శనివారం వెల్లడించింది.అఖిలపక్ష ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. వీరిలో ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), కనిమొళి (డీఎంకే), రవిశంకర్ ప్రసాద్(బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ) సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), శ్రీకాంత్ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరంతా.. మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని దేశాలు, ఇతర కీలక దేశాలను అఖిలపక్ష బృందం సందర్శించనుంది. ఉగ్రవాదం అణిచివేతకు భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే అనేది భారత విధానమని చెప్పనున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏకతాటిపై నిలబడిందని సందేశం ఇచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను.. దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించనుంది. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వనుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమైన పాక్ రెచ్చగొట్టే చర్యలు, పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ఎలా చేపట్టిందో వివరణ ఇవ్వనుంది. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదని ఆధారాలు చూపించనున్నారు. Union Minister Kiren Rijiju tweets "In moments that matter most, Bharat stands united. Seven All-Party Delegations will soon visit key partner nations, carrying our shared message of zero-tolerance to terrorism. A powerful reflection of national unity above politics, beyond… pic.twitter.com/yYiQF4ufEF— ANI (@ANI) May 17, 2025కాంగ్రెస్ లిస్టులో నో శశిథరూర్.. చివరకు ట్విస్ట్..ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పంపిన జాబితాలో అసలు థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. పాక్‌ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్‌ను కోరగా, అదే రోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగొయ్ ఉన్నారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్ట్‌లో థరూర్ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు మాత్రం అనూహ్యంగా చోటు దక్కింది.మరోవైపు, శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే.. నేను అందుబాటులో ఉంటా. జైహింద్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. Yesterday morning, the Minister of Parliamentary Affairs Kiren Rijiju spoke with the Congress President and the Leader of the Opposition in the Lok Sabha. The INC was asked to submit names of 4 MPs for the delegations to be sent abroad to explain India's stance on terrorism from…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 17, 2025 -
అవును.. భారత్ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas.#nurkhanairbase #Pakistan #PakistanArmy pic.twitter.com/RKnWGP8WeS— Manish Shukla (@manishmedia) May 17, 2025తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్ అన్నారు. ‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’ పాక్ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్‌కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, పాక్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్ దార్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్ చేశారు. మరోవైపు.. తమపై భారత్ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఇక, కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు. -
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
భుజ్: జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించిందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలపాలను మరింత విస్తృతం చేయడానికి ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా శిబిరాలను పాక్ ప్రభుత్వం మళ్లీ నిర్మిస్తోందని చెప్పారు. మురిద్కే, బహవల్పూర్లో ఈ నిర్మాణాలు మొదలయ్యాయని వెల్లడించారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్‌లో రాజ్‌నాథ్ సింగ్ పర్యటించారు. భుజ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సైనికాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. పాకిస్తాన్ ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న సొమ్మంతా ఉగ్రవాదుల జేబుల్లోకే వెళ్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. పాకిస్తాన్‌కు ఆర్థిక సాయంపై ఐఎంఎఫ్ పునరాలోచించాలి పాకిస్తాన్‌కు ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే ఆ సొమ్మంతా ఉగ్రవాద కార్యకలాపాలకే ఖర్చవుతుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విదేశాల నుంచి వచ్చే డబ్బుతో భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోయడం పాకిస్తాన్‌కు అలవాటేనని మండిపడ్డారు. ఆ దేశానికి 2.3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించడంపై పునరాలోచన చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ను కోరారు. దుష్ట పాకిస్తాన్ సంగతి తెలిసి కూడా పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలనుకోవడం సరైంది కాదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు ఆర్థిక సాయం అందిస్తే ఉగ్రవాదులకు సాయం చేసినట్లేనని పేర్కొన్నారు. అందుకే పాక్‌కు ఆర్థిక సాయంపై మరోసారి ఐఎంఎఫ్ ఆలోచించాలని, భవిష్యత్తులో ఎలాంటి సాయం అందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం అంతమయ్యే దాకా తమ పోరాటం ఆగదని రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై ఇప్పటిదాకా తాము తీసుకున్న చర్యలన్నీ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అవసరమైతే ఫుల్ పిక్చర్ చూపిస్తామని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. -
కేంద్రం దౌత్యమార్గం
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి దన్నుగా నిలుస్తున్న పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం దౌత్య మార్గాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా అఖిలపక్ష నేతల బృందాలను వచ్చే వారం నుంచి వివిధ దేశాలకు పంపించాలని నిర్ణయించింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న తేదీన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకోవడం, కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాలను వివరిస్తూ పాక్ వక్రబుద్ధిని విదేశీ ప్రభుత్వాలకు ఈ బృందాలు వివరించనున్నాయి. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, సీనియర్ నేతలుంటారు. బృందాలకు కేంద్ర మాజీ మంత్రులు సారథ్యం వహించనున్నారు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే కొన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఎన్ని బృందాలుంటాయి, అందులో ఎందుకు సభ్యులుంటారనే దానిపై స్పష్టత రాలేదు. కనీసం 30 మంది ఎంపీలకు భాగస్వామ్యం ఉంటుందని కొందరు నేతలంటున్నారు. బృందాలకు ప్రయాణ ప్రణాళికతోపాటు అవసరమైన సూచనలను విదేశాంగ శాఖ అందించనుంది. ఈ బృందాల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ), జేడీయూ, బీజేడీ, శివసేన(యూబీటీ), సీపీఎం తదితర పార్టీల ఎంపీలుండొచ్చని సమాచారం. ఈ నెల 22, 23వ తేదీల్లో బయలు దేరనున్న ఈ బృందాలు 10 రోజుల్లో వివిధ దేశాలకు వెళ్లనున్నాయి. అధికార బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఒడిశా బీజేపీ ఎంపీ అపరాజిత సారంగితోపాటు కాంగ్రెస్ నుంచి శశి థరూర్ సహా నలుగురు ఎంపీలు ఇందులో ఉంటారు. ఇందులో కాంగ్రెస్ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల బృందం దక్షిణ, వాయవ్య ఆసియాలోని దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లనుంది. బారామతి ఎంపీ సుప్రియా సూలే బృందం ఆఫ్రికా, పశ్చిమాసియాలోని ఒమన్, ఈజిప్టు, కెన్యా, దక్షిణాఫ్రికాలకు వెళ్లనుంది. కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూరప్ లేదా మధ్యప్రాచ్యానికి వెళ్లే అవకాశముంది. అమెరికా వెళ్లే బృందానికి శశిథరూర్ నాయకత్వం వహిస్తారు. ప్రతి బృందంలో ఏడెనిమిది మంది సభ్యులుంటారు. వీరు నాలుగు నుంచి ఐదు దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. బృందాలను పంపించడంపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయమై కేంద్ర మంత్రి రిజిజు కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో మాట్లాడారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. -
BSF Jawan: బ్రష్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదట..!
న్యూఢిల్లీ: గత నెల 23వ తేదీన పాకిస్తాన్‌కు బందీగా చిక్కిన భారత బీఎస్ఎఫ్ జవాన్ పీకే(పూర్ణం కుమార్) షాను రెండు రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 20 రోజుల తర్వాత భారత జవాన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. బీఎస్ఎఫ్కు చెందిన భారత జవాన్ పీకే షా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో, పీకే షాన్ పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం, దౌత్యపరంగా భారత్.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. దాంతో పాకిస్తాన్ ఆ బీఎస్ఎప్ జవాన్ విడిచిపెట్టక తప్పలేదునిద్రలేని రాత్రులు.. మానసిక వేధన!జవాన్ పీకే షా పాక్ చెర నుంచి విడుదలైన తర్వాత జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా ఆ జవాన్ భార్య పలు విషయాలను వెల్లడించారు. పీకే షా భార్య రజని మాట్లాడుతూ.. ‘ నా భర్తను శారీకంగా హింసించలేదని, ప్రతీ రాత్రి విచారించారని, ఇది మానసికంగా కుంగదీసిందని భర్త చెప్పినట్లు భార్య రజనీ తెలిపింది.మూడు వారాలకు పైగా పాక్ కస్టడీలో ఉన్న షాను సైనికుడిలా కాకుండా గూఢచారిలా చూశారని, మూడు వేర్వేరు ప్రదేశాలకు తరలించారని చెప్పినట్లు ఆమె స్పష్టం చేసింది. ఆ ప్రదేశాలల్లో ఒకటి ఎయిర్ బేస్ అయి ఉండొచ్చనే అనుమానం కల్గిందని భర్త చెప్పిన విషయాన్ని ఆమె వెల్లడించింది.భర్త పీకే షాకు తిండి పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది పెట్టకపోయినా, బ్రష్ చేసుకోవడానికి అనుమతించే వారు కాదని. భర్త నిద్రలేమితో ఉన్నట్లు తనతో మాట్లాడినప్పుడు అర్థమైందని ఆమె పేర్కొంది. -
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్‌ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు. అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్.. ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే.. -
పార్లమెంట్లో ప్రసంగం.. నవ్వుల పాలైన పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్
ఇస్లామాబాద్: పాక్ ఉప ప్రధాని ఇషాక్‌దార్ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్ వార్తను పార్లమెంట్లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు. పాక్ ఎయిర్‌ఫోర్స్‌ను విదేశీ మీడియా ప్రశంచిందంటూ ప్రకటించుకున్నారు. అయితే విదేశీ మీడియా తమ ఎయిర్‌ఫోర్స్ గురించి నిజంగా ప్రశంసలు కురిపించిందా? అని పాకిస్తాన్ మీడియా సంస్థ ‘డాన్’ నిజనిర్ధారణ చేసింది. అందులో విదేశీ మీడియా కథనం బూటకమని తేల్చి చెప్పింది. అసలు ఇషాక్ దార్ చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ సైన్యానికి సంబంధించిన ఎలాంటి వార్తల్ని ప్రచురించలేదని తెలిపింది.ఇంతకీ ఏం జరిగిందంటే? పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ అందుకు భిన్నంగా ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసంపై ఓ కథనాన్ని ప్రచురించింది’ అంటూ డైలీ టెలిగ్రాఫ్ హెడ్‌లైన్‌ను పార్లమెంట్లో ఇషాక్ దార్ ప్రస్తావించారు. అసలు విషయం ఏంటంటే?Pakistan's Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar falsely told the Senate that The Telegraph headlined the PAF as the ‘Undisputed King of the Skies’—a far-fetched claim that even Dawn News felt compelled to fact-check him. pic.twitter.com/piho3z9Zha— DD India (@DDIndialive) May 16, 2025 ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ వాస్తవానికి డైలీ టెలిగ్రాఫ్ ఆ హెడ్‌లైన్‌ను రాయలేదు. పాకిస్తానీయులే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో తప్పుడు వార్తను సృష్టించారు. దాన్నే నిజమనుకుని ఇషాక్‌దార్ భ్రమపడ్డారు. ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ అంటూ విదేశీ మీడియా కీర్తించిందని ప్రకటన చేశారు. దీంతో కంగుతిన్న డైలీ టెలిగ్రాఫ్ .. అసలు తాము అలాంటి హెడ్లైన్ పెట్టలేదని స్పష్టం చేసింది. డైలీ టెలిగ్రాఫ్ మాత్రమే కాదు.. పాక్ దేశ మీడియా సంస్థ డాన్‌న్యూస్ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.ఇషాక్ దార్‌వి పచ్చి అబద్ధాలు ‘పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశాలలో తిరుగులేని రాజు’ అని పేర్కొంటూ డైలీ టెలిగ్రాఫ్ వార్త రాసిందా? లేదా? అని డాన్ మీడియా ప్రతినిధులు పరిశీలించారు. ఇషాక్ దార్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నట్లుగా మే 10న ది డైలీ టెలిగ్రాఫ్ ఫ్రంట్ పేజీలో ఉన్న వార్తకి.. ఇషాక్ దార్ చదివి వినిపించిన హెడ్‌లైన్‌కు పొంతన లేదని తేలింది. ఆ పత్రిక ఎప్పుడూ అలాంటి కథనాల్ని ప్రచురించలేదని డాన్ తేల్చింది. దీంతో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్‌పై నెటిజన్లు చూసికోవాలని కదాయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
తోక జాడిస్తే.. కార్గిల్ సీన్ రిపీట్ అవుద్ది
-
ఆపరేషన్ సిందూర్‌కి ముందు ట్రంప్,పాక్‌ల మధ్య చీకటి ఒప్పందం?
వాష్టింగన్: పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది.ఆఘమేఘాల మీదఈ ఒప్పందం తర్వాత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాక్ ప్రభుత్వం నియమించింది. ఘన స్వాగతం పలికిన ఆసిమ్ మునీర్ ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఆ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాక్-ట్రంప్ చీకటి ఒప్పందంపై అనుమానంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
పాక్ ప్రధాని సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: భారత్ శక్తి, సామర్థ్యం తెలుసుకున్న పాకిస్తాన్.. చివరకు దిగి వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. భారత్‌తో చర్చలకు పాక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్ వెల్లడించారు.పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ షరీఫ్ సందర్శించారు. అనంతరం, షరీఫ్ పాక్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ శాంతి కోసం సిద్ధంగా ఉంది. అందుకు భారత్‌తో చర్యలకు సిద్ధం. భారత్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, కశ్మీర్ అంశం కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతు అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.పాక్ ప్రధాని ప్రకటన చేసిన సమయంలో షెహబాజ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వైరం వద్దని వారంతా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక.. భారత్, పాకిస్తాన్ యుద్ధం తర్వాత.. పాక్ ప్రధాని షరీఫ్ రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండోసారి.Peace and Pakistan, Biggest Joke of the decade 😆“Pakistan's prime minister, Shehbaz Sharif, said on Thursday he was ready to engage in peace talks with India. Prime Minister Shehbaz Sharif extended an offer of talks to India, saying Pakistan is ready to engage "for peace". pic.twitter.com/NHvt1DNqsB— Vaibhav Rathi 🇮🇳 (@Vaibhavrathi05) May 16, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు పాకిస్తాన్ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కీలక ప్రకటన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్ ఎలా ఖాళీ చేయాలనే అంశంపైనైతే ఆ దేశంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌తో కేవలం ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని, అనేక ఏళ్లుగా దానిపై ఏకాభిప్రాయంతో ఉన్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ముష్కరులపై చర్యలు చేపట్టాల్సిందేనని ఐరాస భద్రతామండలి కూడా నొక్కిచెప్పిందని, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఈ నెల 7న అదే చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్‌ను ప్రారంభించడానికి ముందే పాక్‌కు సందేశం పంపించాం. ఉగ్రస్థావరాలపైనే దాడులు చేస్తామని, సైనిక స్థావరాల జోలికి వెళ్లబోమని చెప్పాం. దానిని వారు పెడచెవినపెట్టారు. మనం వారికి ఎంత నష్టం కలిగించామో, వారు ఎంత స్వల్పంగా మనకు నష్టపరిచారో అందరికీ తెలుసు. శాటిలైట్ చిత్రాలే దీనికి సాక్ష్యం. అందుకే నాలుగు రోజుల్లో వారు వైఖరి మార్చుకున్నారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారు అని తెలిపారు. This video explains the extent of damage caused by @IAF_MCC in Pakistan. Pak PM took a dusty road to reach the PAF base. You know why? Watch this. 👇pic.twitter.com/XYQLEWWB0P— Pramod Kumar Singh (@SinghPramod2784) May 15, 2025 -
కళ్లకు గంతలు కట్టారు.. దూషించారు..
న్యూఢిల్లీ: అనుకోకుండా సరిహద్దు దాటి పాక్ రేంజర్ల చేతికి చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. విడుదల అనంతరం పాకిస్తాన్ కస్టడీలో ఉన్న 21 రోజుల అనుభవాలను బీఎస్ఎఫ్ అధికారులతో షా పంచుకున్నారు. షా నిర్బంధంలో ఉన్నంత కాలం, పాకిస్తాన్‌లోని మూడు గుర్తుతెలియని ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఆ ప్రదేశాల్లో ఒకటి ఎయిర్‌బేస్ సమీపంలో ఉంది. కళ్లకు గంతలు కట్టి ఉంచడంతో.. విమాన శబ్దాలను బట్టి అది ఎయిర్‌బేస్‌గా షా గుర్తించారు. ఇక మరో ప్రదేశంలో జైలు గదిలో కొన్ని రోజులు ఉంచారు. కస్టడీలో ఉన్నన్ని రోజులు కళ్లకు గంతలు కట్టారు. నిద్రలేకుండా చేశారు. దూషించారు. కనీసం పళ్లు తోముకోవడానికి కూడా అనుమతించలేదు. శారీరకంగా హింసించకపోయినా.. సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ భద్రతాదళాల గురించి ప్రశ్నించారు. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న సీనియర్ అధికారుల వివరాలు చెప్పాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. అయినా షా వేటికీ సమాధానం ఇవ్వలేదు. బీఎస్ఎఫ్ ప్రోటోకాల్ ప్రకారం.. విధుల్లో ఉండగా సెల్‌ఫోన్ వినియోగం నిషేధం. అందుకే షా పట్టుబ డిన సమయంలో అతని దగ్గర మొబైల్ ఫోన్ లేదు. దీంతో వివరాలేవీ పాకిస్తాన్ అధికారులకు దొరకలేదు. పాక్ కస్టడీ నుంచి వచి్చన షాపై బీఎస్ఎఫ్ అధికారులు విచారణ, వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ప్రోటోకాల్ ప్రకారం, పాకిస్తాన్ కస్టడీలో ఉండగా ఆయన ధరించి ఉన్న దుస్తులను తనిఖీ చేసి, పారవేశారు. ఆయన శారీరకంగా, మానసికంగా స్థిరంగా ఉన్నారని సమాచారం. ఏప్రిల్ 23న విశ్రాంతికోసం ఓ చెట్టునీడకు చేరిన షా.. అనుకోకుండా సరిహద్దు దాటాడు. -
పాక్ అణ్వాయుధాలను మీరే పర్యవేక్షించాలి
శ్రీనగర్: అత్యంత దుష్ట దేశమైన పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడం ప్రపంచానికి ఎప్పటికైనా ప్రమాదకరమేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పర్యవేక్షణలోకి తీసుకురావాలని అన్నారు. పాక్ అణ్వాయుధాలు ఐఏఈఏ పరిధిలో ఉంటేనే ప్రపంచ భద్రతకు ముప్పు వాటిల్లదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ తొలిసారిగా గురువారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. పహల్గాం ఉగ్రవాద దాడి మృతులతోపాటు పాకిస్తాన్‌పై దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళు లర్పించారు. శ్రీనగర్‌లోని బాదామీబాగ్ కంటోన్మెంట్లో సైనికులను ఉద్దేశించి మాట్లాడా రు. పాక్ అణు బెదిరింపులను భారత్ ఏమాత్రం లెక్కచేయలేదని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన పట్టుదలను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. భారత్‌పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాక్ ఎన్నోసార్లు బెదిరించిందని తెలిపారు. పాక్ నిజస్వరూపం ప్రపంచం మొత్తం చూసిందని పేర్కొన్నారు. ధూర్త దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం సరైనదేనా? అని ప్రపంచ దేశాలను రాజ్‌నాథ్ ప్రశ్నించారు. అందుకే పాక్ అణ్వాయుధాలను ఐఏఈఏ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో ‘ఆపరేషన్ సిందూర్’ అతిపెద్ద చర్య అని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఎంతదూరమైన వెళ్తామని నిరూపించామని పేర్కొన్నారు. -
టర్కీకి భారత్ ఫస్ట్ స్ట్రోక్.. ఇక సర్దేసుకోవడమే!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పై ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సిందూర్ ను భారత్ చేపట్టగా, దానికి వ్యతిరేకంగా పని చేసింది టర్కీ(తుర్కియే). ఇక్కడ ప్రత్యక్షంగా పాకిస్తాన్ కు సాయం చేసి భారత్ ను దెబ్బ కొట్టాలని యత్నించింది. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లలో సింహ భాగం టర్కీకి చెందినవే కావడమే కాకుండా, ఆ డ్రోన్లకు ఆపరేటర్లను కూడా సప్లై చేసింది టర్కీ. ఇది భారత్ కు మరింత కోపం తెప్పించింది. టర్కీ నుంచి ఏమైనా డ్రోన్లను కొనుగోలు చేశారా అని తొలుత భావించినా, ఆ డ్రోన్ల ఆపరేటర్లు కూడా ఆ దేశానికే చెందిన వారే కావడంతో వారి పన్నాగం బయటపడింది.దాంతో టర్కీపై విమర్శలు వెల్లువెత్తాయి. వరదల సమయంలో ఏ దేశం కూడా సాయం చేయడానికి ముందుకు రాకపోతే భారత్ వారికి ఆపన్న హస్తం అందించింది. దానిని మరిచిపోయి మన వేలితో మనల్నే పొడాలని చూసింది టర్కీ. ఇప్పుడు టర్కీకి బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది.సెక్యూరిటీ క్లియరెన్స్ అనుమతులు రద్దు..!భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో సింహభాగాన్ని నిర్వహిస్తున్న టర్కిష్ సంస్థ తన భద్రతా అనుమతిని కోల్పోయింది. ఈ రోజు(గురువారం) సాయంత్రం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ టర్కీకి చెందిన సంస్థకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జాతీయ భద్రత దృష్ట్యాసెలెబి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి ఇది..!భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉంది. .వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు.హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దాంతో భారత ప్రభుత్వం.. చర్యలు చేపట్టి ఆ సంస్థకు చెందిన అనుమతులను రద్దు చేసింది. ఇది తుర్కియేగా పిలువబడుతున్న టర్కీకి భారత్ ఇచ్చిన తొలి స్ట్రోక్. -
కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసు: జైశంకర్
ఢిల్లీ: పాక్ ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాల్సిందేనని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారో అందరికీ తెలుసునంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారత్ కేవలం పీవోకే, టెర్రరిజం గురించి మాత్రమే మాట్లాడుతోంది. సింధూ జలాల నిలిపివేతపై యథాతథ స్థితి కొనసాగుతోంది. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించే వ్యవస్థను రుపుమాపాలి’’ అని జైశంకర్ పేర్కొన్నారు.పాకిస్థాన్‌తో చర్చలు ఉగ్రవాదంపై మాత్రమే ఉంటాయని ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారని జైశంకర్ గుర్తు చేశారు. ఉగ్రవాదంపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని జైశంకర్ చెప్పారు. #WATCH | Delhi | "Our relations and dealings with Pakistan will be strictly bilateral. That is a national consensus for years, and there is absolutely no change in that. The prime minister made it very clear that talks with Pakistan will be only on terror. Pakistan has a list of… pic.twitter.com/j9lugNSpsd— ANI (@ANI) May 15, 2025కాగా, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారుల భద్రతపై కేంద్రం నిశితంగా దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మంత్రి కాన్వాయ్‌లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను చేరుస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైశంకర్‌కు భద్రతను 2023లో వై నుంచి జెడ్ కేటగిరీకి పెంచారు. ఇప్పటికే రెండో అత్యున్నత స్థాయి భద్రత. అందులో భాగంగా 33 మందితో కూడిన సీఆర్పీఎఫ్ కమాండోల బృందం 24 గంటలూ ఆయనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.జెడ్ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), 4 నుండి ఆరుగురు స్థానిక పోలీసు మంది కమాండోలతో సహా 22 మంది సిబ్బంది, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలుంటాయి. సాధారణంగా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, బెదిరింపులను ఎదుర్కొంటున్న వారికి ఈ స్థాయి భద్రత అందిస్తారు. కేంద్ర రక్షణ జాబితాలోని వీఐపీ భద్రతా కవర్ జెడ్–ప్లస్ (అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్), జెడ్, వై, వై–ప్లస్, ఎక్స్ దాకా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 200 మందికి సీఆర్పీఎఫ్ వీఐపీ భద్రతా సంరక్షణ ఉంది. -
మిలటరీ చేతలకు.. నేతల మాటలకు పొంతనేది?
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదు.. సరదా అంతకంటే కాదు. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ మనోజ్ నరవణే చేసిన అర్థవంతమైన వ్యాఖ్య ఇది. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. యుద్ధం ఎల్లప్పుడు ఆఖరి ఆస్త్రం మాత్రమే కావాలని అన్నారు. అయితే.. ఇక విశ్రాంత మిలటరీ అధికారిగా ఆయన వ్యాఖ్యలకు ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నేతల మాటలకు మధ్య తేడా ఉండటమే సమస్య అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన ప్రసంగంలో పాక్‌కు గట్టి హెచ్చరికలే చేసినప్పటికీ వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు మాత్రం బదులిచ్చినట్లు కనిపించదు.👉ఆపరేషన్ సింధూర్ను హఠాత్తుగా ఎందుకు ఆపేశారు అన్నది వీటిల్లో ఒకటి. మిలటరీ అధికారుల స్థాయిలో పాక్ శరణు కోరినంత మాత్రాన అంగీకరించడం సబబేనా అన్నది కొందరి అనుమానం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం జరగాల్సిందేనని దేశ ప్రజలు వాంఛించిన మాట వాస్తవం. అలాగే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం సాగించిన అపరేషన్ సింధూర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిసింది. కానీ యుద్ధం ఆకస్మిక నిలిపివేత.. పహల్గామ్ దాడికి దారితీసిన నిఘా వైఫల్యాల వంటివి మాత్రం ప్రశ్నలుగా మిగిలిపోయాయి.👉కశ్మీర్లో కాల్పులు కొత్త కాకపోవచ్చు. పాక్ సైన్యం జరిపే కవ్వింపు కాల్పులు, చొరబాట్ల కోసం ఉగ్రవాదులు అప్పుడప్పుడూ భారత సైన్యంపైకి కాల్పులు జరుపుతూనే ఉంటారు. అయితే పహల్గామ్ మాత్రం రాక్షస కృత్యం. అమాయకులైన టూరిస్టులను, అది కూడా పేర్లు అడిగి మరీ హిందువులను హత్య చేయడంపై దేశం యావత్తు ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను ఆకస్మికంగా విరమించుకుని వెనక్కు రావడం, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడం వరకూ బాగానే ఉంది. కానీ.. ఆ వెంటనే బీహార్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం మాత్రం చాలామందికి ముఖ్యంగా ప్రతిపక్షాలకు రుచించలేదు. అయినా సరే.. పాక్‌పై మోడీ తీసుకునే చర్యలకు మద్దతిస్తామని స్పష్టం చేశాయి.👉ఈ తరుణంలో మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పిమ్మట భారత సైన్యం ఉగ్ర శిబిరాలను విజయవంతగా ధ్వంసం చేసి వచ్చింది. సుమారు వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సమయంలో పాకిస్తాన్ కూడా సరిహద్దులలో కాల్పులకు, ఇతరత్రా దాడులకు పాల్పడడానికి ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. అంతేకాక రావల్పిండి, తదితర పాక్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. నిజానికి భారత్ సైనిక శక్తి ముందు పాక్ ఎందుకు కొరగాదన్నది వాస్తవం. ఈ సమయంలో కేంద్రంలోని పెద్దలు కాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కాని యుద్దం చేయబోతున్న సంకేతాలు ఇచ్చారు. మనం తలచుకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం కష్టం కాదని, అసలు పాక్ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని ప్రకటనలు చేశారు.👉వీటి ఆధారంగా చాలా మంది యుద్దం ఆరంభమైనట్లే భావించారు. సాంకేతికంగా భారత్ యుద్ధ ప్రకటన చేయకపోయినప్పటికీ ఇకపై పాక్ నుంచి ఎలాంటి చికాకు ఎదురుకాకుండా పీఓకే మన ఆధీనంలోకి వస్తుందని భావించారు. పాక్ నాలుగుగా చీలిపోయే అవకాశం ఉందని కొంతమంది జోస్యం కూడా చెప్పారు. కానీ అలా జరగలేదు. కానీ ఆకస్మాత్తుగా పాక్ మిలటరీ శరణు కోరడంతో కాల్పుల నిలిపివేతకు అంగీకరించామని మోదీ చెప్పడంతో అప్పటివరకూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు, జరిగిన పరిణామాలకు మధ్య తేడా రావడంతో కేంద్రంపై విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణతో మోదీ ప్రభుత్వం సాధించంది ఏమిటి? అని విపక్షాలు ప్రశ్నించాయి.👉ఈ లోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలు పెట్టి ఇదంతా తన ఘనత అని చెప్పుకోవడం మరింత చికాకైంది. దానిని విదేశాంగ శాఖ ఖండించినప్పటికీ, ప్రధాని బహుశా దౌత్యనీతి లేదా మరే కారణం వల్లనో తన ప్రసంగంలో ఆ ప్రస్తావన చేయలేదు. కశ్మీర్ విషయంలో మూడో పక్ష రాయబారానికి అంగీకరించబోమని భారత్ చెబుతుండగా, ట్రంప్ తాను మధ్యవర్తిత్వం చేస్తానని అనడం బాగోలేదు. అంతేకాక, అమెరికా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి భారత్, పాక్‌లను ఒకే దృష్టితో చూడడం ఆశ్చర్యపరిచింది. భారత్ విదేశాంగ విధానంలో ఏమైనా లోపం ఉందా అన్న ప్రశ్నకు తావిచ్చింది. మరో వైపు పాకిస్తాన్ పహల్గామ్ దుశ్చర్యతో తమకు సంబంధం లేదని అబద్ధాలు చెప్పింది.👉ఆ ఉగ్ర ముష్కరులను భారత భద్రత దళాలు పట్టుకుని, వారి మూలాలు అన్నిటిని చెప్పగలిగి ఉంటే పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరై ఉండేది. వారికి పరోక్ష మద్దతు ఇస్తున్న చైనా కూడా బహిరంగంగా పాక్‌ను తప్పు పట్టవలసి వచ్చేది. అయితే పాకిస్తాన్ భారతదేశం వద్ద ఉన్న ఎస్.4 సుదర్శన రక్షణ కవచాన్ని ఏమీ చేయలేక పోయిందన్న విషయాన్ని మోదీ అన్ని దేశాలకు తెలిసేలా అదంపూర్ వెళ్లి ఆ బేస్ నుంచి ప్రసంగించడం బాగుందని చెప్పాలి. అలాగే భారత్‌కు ఉన్న స్వదేశీ పరిజ్ఞాన ఆయుధ సంపత్తి శక్తి సామర్థ్యాలు కూడా దేశ ప్రతిష్టను పెంచాయి. అయినప్పటికీ యుద్దం ఎందుకు ఆగిందన్నది సగటు భారతీయుడికి ఎదురయ్యే ప్రశ్న.👉దానికే మాజీ ఆర్మీ ఛీప్ నరవణే ఇచ్చిన ప్రకటన అర్థవంతమైన జవాబు అవుతుంది. యుద్ధం అంటే సినిమా కాదు..అది చివరి అస్త్రం కావాలన్న ఆయన మాటలు అక్షర సత్యం. పాక్‌కు భారీ నష్టం జరిగినా, మనకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. భారత సైన్యం సాధించిన విజయానికి సెల్యూట్ చేద్దాం. యుద్ధం జరగాలని కోరుకునేవారు కొంత అసంతృప్తికి గురై ఉండవచ్చు.. మిలటరీ ఆపరేషన్స్ వరకు ప్రామాణికంగా తీసుకుంటే భారత్ గొప్ప విజయం సాదించిందని ఒక రిటైర్డ్ మేజర్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ పార్టీలు భావోద్వేగ అంశాలపై బాధ్యతతో మాట్లాడకపోతే అవి ఆత్మరక్షణలో పడతాయని కూడా ఈ అనుభవం తెలుపుతోందని అనుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఇదీ పాకిస్తాన్ పరిస్థితి..!
పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను చూసి.. ప్రపంచ దేశాలే జాలిపడుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర వంటి భారతీయ రాష్ట్రాల కంటే ముందున్న దాయాది దేశం (పాకిస్తాన్) ఆర్థిక స్థితి గత రెండు దశాబ్దాలుగా గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోంది. తమిళనాడు జీడీపీ ఇప్పుడు పాకిస్తాన్ జీడీపీని దాటేసినట్లు కొత్త డేటా ద్వారా తెలుస్తోంది.పాకిస్తాన్ జీడీపీ కంటే తమిళనాడు జీడీపీ ఇప్పుడు ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ జనాభా తమిళనాడు జనాభా కంటే మూడు రెట్లు ఎక్కువ. అంతే కాకుండా తమిళనాడులోని ఒక వ్యక్తి సంపాదన.. పాకిస్థాన్‌లోని ఒక వ్యక్తి సంపాదన కంటే మూడు రెట్లు ఎక్కువ. ఉగ్రవాదాన్ని, కాశ్మీర్ వివాదాన్ని మానుకుని.. ఆర్ధిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య వంటి వాటిపై ద్రుష్టి పెట్టాలి. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలి. అప్పడే మీ దేశం బాగుపడుతుందని నౌక్రీ.కామ్ ఫౌండర్ సంజీవ్ బిఖ్‌చందానీ వెల్లడించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. 1995లో తమిళనాడు జీడీపీ 15.7 బిలియన్ డాలర్ల వద్ద, పాకిస్తాన్ జీడీపీ 57.9 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. కాగా 2025 నాటివి తమిళనాడు జీడీపీ 419.5 బిలియన్ డాలర్లు (రూ. 35.8 లక్షల కోట్లు) కాగా.. పాకిస్తాన్ జీడీపీ 397.5 బిలియన్ డాలర్లు (రూ. 33.9 లక్షల కోట్లు).ఇదీ చదవండి: అమెరికా, చైనా డీల్: ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలుసోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. భారతీయులు తమ గర్వాన్ని చాటుకుంటూ.. పాకిస్థాన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు అని యూజర్ వెల్లడించగా.. ఒక్క కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ సమస్య తీరితే.. ఆ ప్రాంతం ఒక్కటే పాకిస్తాన్ జీడీపీ దాటేస్తుందని మరో యూజర్ అన్నారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు ఎప్పుడో పాకిస్తాన్ జీడీపీని దాటేశాయని ఇంకో యూజర్ అన్నారు.TN GDP is now greater than the GDP of Pakistan. And the population of Pakistan is more than thrice that of Tamil Nadu. In other words the average resident of TN is more than 3X better off than the average resident of Pakistan. To the govt and military of Pakistan - focus on… https://t.co/2AbOw3LAE1— Sanjeev Bikhchandani (@sbikh) May 15, 2025 -
పాకిస్తాన్‌కు స్పాటిఫై ఝలక్.. ఆ పాటలన్నీ డిలీట్
ప్రముఖ మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్ సంస్థ స్పాటిఫై కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా- పాకిస్తాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి చెందిన పాటలను తొలగించింది. భారత ప్రభుత్వం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే అన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్, మీడియా స్ట్రీమింగ్ సేవలు, డిజిటల్ మాధ్యమాల్లో పాకిస్తాన్‌కు సంబంధించిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటలు, పాడ్‌కాస్ట్‌లు, ఇతర కంటెంట్ సైతం తొలగించాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో స్పాటిఫై సైతం పాక్ పాటలను తన ఫ్లాట్‌ఫామ్ నుంచి డిలీట్ చేసింది.దీంతో పాకిస్తాన్‌కు చెందిన ఫేమస్ 'జోల్', 'మాండ్' అనే పాటలను స్పాటిఫై నుంచి తొలగించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ సినిమాపై నిషేధం విధించారు. ఆయన హీరోగా నటించిన అబీర్ గులాల్ సినిమాను కూడా భారత్‌లో బ్యాన్ చేశారు. అంతేకాకుండా ఆయనతో పాటు పలువురు పాక్ నటీనటులను నిషేధించారు. అంతకుముందు పాకిస్తానీ నటులు మావ్రా హోకేన్, మహిరా ఖాన్ సినిమాలైన 'సనమ్ తేరి కసమ్', 'రయీస్' చిత్రాల పోస్టర్లను సైతం తొలగించారు. కాగా.. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, జాతీయ భద్రత కోసమే కేంద్రం చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. -
వేలాది మంది పాక్ సైనికుల్ని ఎలా తరిమేశాయంటే?
-
పీవోకేపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
శ్రీనగర్: ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను అంతం చేశామన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. అలాగే, దేశమంతా సైనికులను చూసి గర్విస్తోందన్నారు. అమరులైన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ నేడు జమ్ము కశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ యుద్ధ వీరులను రాజ్‌నాథ్ అభినందించారు. అనంతరం, రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘సైనికుల ధైర్యసాహసాలు గర్వకారణం. ఉగ్రవాదం అంతానికి ఎంత దూరమైనా, ఎక్కడికైనా వెళ్తాం. ఉగ్రవాదంపైనే కాదు.. పీవోకేపైనా మన యుద్ధం ఆగదు. పాకిస్తాన్ అణ్వయుధాల బ్లాక్‌మెయిల్‌కు భయపడం. ఎలాంటి పరిస్థితులలైనా మన సైన్యం ఎదుర్కోగలదు’ అంటూ ప్రశంసలు కురిపించారు. శత్రువులను నాశనం చేసిన ఆ శక్తిని అనుభూతి చెందడానికి నేను ఇక్కడ ఉన్నాను. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ చౌకీలు, బంకర్లను మీరు ధ్వంసం చేసిన విధానాన్ని, శత్రువు దానిని ఎప్పటికీ మరచిపోలేడని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పర్యవేక్షణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే, పహల్గామ్ దాడి తర్వాత, జమ్ముకశ్మీర్ ప్రజలు పాకిస్తాన్, ఉగ్రవాదులపై తమ కోపాన్ని వ్యక్తం చేసిన విధానం గర్వంగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. #WATCH | Srinagar, J&K: Defence Minister Rajnath Singh says, "...I ask the entire world if nuclear weapons are safe in the hands of such an irresponsible and rogue nation. I believe that Pakistan's nuclear weapons should be taken under the supervision of International Atomic… pic.twitter.com/7tQA7mbZZI— ANI (@ANI) May 15, 2025 #WATCH | Srinagar, J&K: Defence Minister Rajnath Singh, J&K Lt Governor Manoj Sinha and CM Omar Abdullah join the jawans at Badami Bagh Cantonment in raising slogans of 'Bharat Mata ki Jai'. The Defence Minister addressed the jawans here. #OperationSindoor pic.twitter.com/r2sCXZGKkB— ANI (@ANI) May 15, 2025#WATCH | J&K: Defence Minister Rajnath Singh meets and interacts with jawans at Badami Bagh Cantonment. #OperationSindoor pic.twitter.com/vZXzX3W7FL— ANI (@ANI) May 15, 2025 -
ఒంటరిగా ఎదుర్కోలేక.. దుష్ట కూటమిగా..!
-
పాక్, చైనాకు చావు దెబ్బ.. భారత్ సూపర్ ప్లాన్
ఢిల్లీ: పహల్గాం దాడికి పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారంగా తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పీవోకేపై భారత దళాలు దాడులు చేశాయి. ఈ క్రమంలో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం, భారత్ దాడులపై పాక్ ప్రతి దాడులు చేసి బిత్తరపోయింది. భారత్ దాడులను అడ్డుకోలేకపోయింది. దాయాది పాకిస్తాన్‌కు డ్రాగన్ దేశం చైనా అండగా నిలిచినప్పటికీ.. భారత్‌ను ఎదుర్కోలేకపోయింది.ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ దాడులను అడ్డుకోవడానికి పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ వాడుకుంది. అయినప్పటికీ పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను, రాడార్లను భారత్ కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేసింది. మొదట వాటిని జామ్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా పని చేయకుండా ధ్వంసం చేసేసింది. కచ్చితమైన లక్ష్యాలతో విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేశామని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.ఇందులో చైనాకు చెందిన పీఎల్-15 క్షిపణులు, టర్కీకు చెందిన యూఏవీలు, దీర్ఘ శ్రేణి రాకెట్లు, క్వాడ్ కాప్టర్లు, డ్రోన్లు లాంటి వాటిని భారత్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ అధునాతన ఆయుధాలను ఉపయోగించినప్పటికీ, భారతదేశ స్వదేశీ వైమానిక రక్షణ, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ఏమీ చేయలేకపోయిందని అధికారులు వెల్లడించారు.IAF jammed Pakistan's China made air defence system, completed Operation sindoor in just 23 mins ..😳🔥🙌🏻 Jai hind 🇮🇳 Jai hind ki sena ❤️ 🇮🇳 #BalochLiberationArmy #IndianAirForce #IndiaPakistanWar pic.twitter.com/pH5TXcETc1— NEHA (@Neha09857) May 14, 2025టార్గెట్ ఫినిష్..భారత వైమానిక దళం నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్ వంటి కీలకమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో పాటూ ఆత్మాహుతి డ్రోన్లను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా శత్రు రాడార్లు, క్షిపణి వ్యవస్థలు, అధిక-విలువ లక్ష్యాలను ధ్వంసం చేసింది. లాటరింగ్ మందుగుండు సామగ్రి అనేవి ఆయుధ వ్యవస్థలు, ఇవి లక్ష్య ప్రాంతంపై ప్రదక్షిణలు చేసి, తగిన లక్ష్యం కోసం వెతుకుతాయి, ఆపై దాడి చేస్తాయి. వీటినే భారత్ ఉపయోగించింది. భారత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేశామని చెప్పారు.సిందూర్ ఆపరేషన్‌లో ఇస్రో పాత్రభారత అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా కీలక పాత్ర పోషించిందని భారత ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మే 11 నుంచి దేశ పౌరుల భద్రత, వ్యూహాత్మక ప్రయోజనం కోసం కనీసం 10 ఉపగ్రహాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం వ్యూహాత్మక విజయం కాదు. ఇది భారతదేశ రక్షణ స్వదేశీకరణ విధానాలను ప్రపంచానికి చాటిచెప్పింది. వాయు రక్షణ వ్యవస్థల నుండి డ్రోన్ల వరకు భారత్ స్వదేశీ సాంకేతికతను అత్యంత ముఖ్యమైన సమయంలో అందించింది. భారత్ 21వ శతాబ్దంలో హైటెక్ సైనిక శక్తిగా తన పాత్రను విజయవంతం చేసిందని తెలిపారు. -
ఆపరేషన్ సిందూర్ తో మరోసారి లెక్క సరిచేసిన భారత్
-
జైశంకర్ భద్రత పెంపు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో తాజా ఉద్రిక్తతలు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారుల భద్రతపై కేంద్రం నిశితంగా దృష్టి పెట్టింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. తాజా సమీక్ష అనంతరం మంత్రి కాన్వాయ్‌లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను చేరుస్తూ కేంద్ర హోం శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జైశంకర్‌కు భద్రతను 2023లో వై నుంచి జెడ్ కేటగిరీకి పెంచారు. ఇప్పటికే రెండో అత్యున్నత స్థాయి భద్రత. అందులో భాగంగా 33 మందితో కూడిన సీఆర్పీఎఫ్ కమాండోల బృందం 24 గంటలూ ఆయనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. జెడ్ కేటగిరీలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), 4 నుండి ఆరుగురు స్థానిక పోలీసు మంది కమాండోలతో సహా 22 మంది సిబ్బంది, ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలుంటాయి. సాధారణంగా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, బెదిరింపులను ఎదుర్కొంటున్న వారికి ఈ స్థాయి భద్రత అందిస్తారు. కేంద్ర రక్షణ జాబితాలోని వీఐపీ భద్రతా కవర్ జెడ్–ప్లస్ (అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్), జెడ్, వై, వై–ప్లస్, ఎక్స్ దాకా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 200 మందికి సీఆర్పీఎఫ్ వీఐపీ భద్రతా సంరక్షణ ఉంది. -
పాక్ సిబ్బందితో భారత్‌కు నౌక
పారాదీప్: సింగపూర్ మీదుగా దక్షిణకొరియా నుంచి భారత్‌కు వచ్చిన చమురు రవాణా నౌకలో మొత్తం సిబ్బందిలో 21 మంది పాక్ జాతీయులు ఉన్నట్లు తేలడంతో ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులో ఒక్కసారిగా కలకలం రేగింది. పరస్పర సైనిక చర్యలతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్ వ్యతిరేక వర్గాలు నౌకాశ్రయానికి చేరుకుని ఆందోళన చేపట్టకుండా ఉండేందుకు పోర్ట్ అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోసం విదేశాల నుంచి తీసుకొచ్చిన ముడి చమురును నౌక నుంచి కిందకు దింపే వరకు నౌకాశ్రయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు చేపట్టారు. పారాదీప్ పట్టణంలో ఒడిశా పోలీసులు వెంటనే భద్రతను పెంచారు. 25 మంది సిబ్బందితో ‘ఎంటీ సైరన్ ఐఐ’ పేరున్న సరకు రవాణా నౌక బుధవారం తెల్లవారుజామున పారాదీప్ పోర్ట్‌కు రాగానే అధికారులు సిబ్బంది గురించి వాకబుచేశారు. వీరిలో ఒక శ్రీలంకన్, ఒక థాయిలాండ్ దేశస్తుడు, ఇద్దరు భారతీయులు, 21 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇమిగ్రేషన్శాఖ నుంచి సంబంధిత సమాచారాన్ని ఒడిశా మెరైన్ పోలీస్‌కు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు చేరవేశామని మెరైన్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ బబితా చెప్పారు. ప్రస్తుతం ఓడ నౌకాశ్రయం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో లంగరు వేసి ఉంది. క్రూడ్ ఆయిల్ అన్లోడింగ్ అవగానే సిబ్బందితో నౌక వెళ్లిపోతుందని జగత్సింగ్పూర్ ఎస్పీ భవానీశంకర్ స్పష్టంచేశారు. అప్పటిదాకా పాకిస్తాన్ సిబ్బందిని నౌక నుంచి బయటకు అనుమతించబోమని చెప్పారు. -
మన వేలితో మన కన్నే..!
రెండేళ్ల క్రితం భయానక భూకంపం వేళ తుర్కియేకు అందరికంటే ముందు ఆపన్న హస్తం అందించింది భారతే. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట భారీ సాయం చేసింది. కానీ ఆ దేశం మాత్రం తిన్నింటి వాసాలే లెక్కబెడుతోంది. సాయుధ సంఘర్షణ వేళ దాయాది పాకిస్తాన్‌కు ఎడాపెడా డ్రోన్లు, ఇతర ఆయుధాలను అందజేసి కృతఘ్నుతకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. విశ్వాస ఘాతుకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. వాటితో పాటు సైనికులను, శిక్షణా సిబ్బందిని కూడా పాక్‌కు తుర్కియే భారీగా పంపినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. డ్రోన్ల వాడకం తదితరాల్లో వాళ్లు పాక్ జవాన్లకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చినట్టు తేలింది. పాక్‌కు తుర్కిష్ కంపెనీ ఆసిస్‌గార్డ్ సోంగార్ పంపిన బైరక్తార్ టీబీ2, ఈహా డ్రోన్లు ఆత్మాహుతి తరహావి. లక్ష్యంపై పడి పేలిపోతాయి. ఈ డ్రోన్ల తయారీలో భారత్ ఎగుమతి చేసే కీలకమైన మూలకాలు, ముడి సరుకులే ప్రధాన వనరులు కావడం విశేషం! మనకు వ్యతిరేకింగా ఇలా నిస్సిగ్గుగా బరితెగించిన తుర్కియేకు ఆ కీలక ఎగుమతులను తక్షణం నిలిపేయాలని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు. కంట్రోలర్ల నుంచి రిసీవర్ దాకా... ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రశిబిరాలను భారత్ కుప్పకూలి్చన కొద్ది గంటలకే పాక్ దాదాపు 400 డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై దాడికి తెగించడం తెలిసిందే. తుర్కియేకు భారత ఎగుమతుల్లో సింహభాగం అల్యూమినియం, అల్యూమినియం సంబంధ ఉపకరణాలు, ఆటో ఉత్పత్తులు, విమానాల విడిభాగాలు, టెలికం ఉపకరణాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, పరికరాలు తదితరాలే. వీటిలో చాలావరకు డ్రోన్ల తయారీలో కీలకం. డ్రోన్లలోని కంట్రోలర్, ఫ్రేమ్, మోటార్, ప్రొపెల్లర్, కెమెరా, ఫైట్ కంట్రోల్, రిసీవర్, వీడియో ట్రాన్స్మిటర్, యాంటెన్నా, స్పీడ్ కంట్రోలర్, కంట్రోలర్లను కూడా భారత్ నుంచే తుర్కియే దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ఎగుమతులు ఎక్కువచయ్యాయి. ఆ విడిభాగాలతో రూపొందించిన డ్రోన్లను పాక్‌కు అందజేయాలన్నది తుర్కియే అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ నిర్ణయమేనని తెలుస్తోంది. అతనికి అంతులేని భారత విద్వేíÙగా పేరుంది. తమ డ్రోన్లు, ఆయుధాలను భారత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదనే ఒట్టు పెట్టుకున్నారు! మన విమానాశ్రయాల భద్రతతుర్కియే సంస్థ చేతుల్లో! భారత్‌లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉందని వెలుగులోకి వచ్చింది. వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించిందని తేలింది. భారత్‌లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్‌సైడ్ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరు దేశాల్లోని 70 విమానాశ్రయాల్లో కూడా సెలెబీ కాంట్రాక్టులు సంపాదించింది.ముమ్మరంగా ‘బ్యాన్ తుర్కియే’ పాక్‌కు సైనికసాయం చేస్తున్నందుకు నిరసనగా తుర్కియే ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇకపై తుర్కియే యాపిల్ పండ్లను దిగుమతి చేసుకోవద్దని మహారాష్ట్రలోని కీలకమైన పుణె పండ్ల మార్కెట్ ట్రేడర్లు నిర్ణయించుకున్నారు. ‘‘మన సైన్యానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తుర్కియేకు బదులు ఇక హిమాచల్, ఉత్తరాఖండ్ ఇరాన్ నుంచి ఆపిల్స్ తెప్పిస్తాం’’ అని పుణె వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ ట్రేడర్ సుయోగ్ జిందే చెప్పారు. పుణెలో తుర్కియే యాపిల్స్ టర్నోవర్ రూ.1,200 కోట్ల పై చిలుకే. దాంతో ఈ నిర్ణయం ఆ దేశానికి పెద్ద దెబ్బే కానుంది. తుర్కియే నుంచి తెల్ల చలువరాయి దిగుమతులనూ నిషేధించాలన్ల డిమాండ్లు విని్పస్తున్నాయి.యాత్రలూ బంద్! తుర్కియేకు మనోళ్ల విహార యాత్రలు కూడా భారీగా తగ్గాయి. ఆ దేశానికి క్యాన్సలేషన్లు భారీగా పెరుగుతున్నాయని ఈజ్‌మైట్రిప్, ఇగ్జిగో వంటి ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫాంలు తెలిపాయి. తుర్కియే ప్రభుత్వ వార్తా చానల్ ‘టీఆర్టీ’ తాలూకు ‘ఎక్స్’ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. టర్కీతో మన వాణిజ్యం కూడా తగ్గుముఖం పడుతోంది. 2024–25 మధ్య తుర్కియేకు మన ఎగుమతులు 5.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు బాహాటంగా మద్దతు ప్రకటించిన అజర్‌బైజాన్‌కు కూడా ఇదే సెగ తగులుతోంది. దాని రాజధాని బకు ఇటీవలి దాకా భారత పర్యాటకులకు ఫేవరెట్ డెస్టినేషన్లలో ఒకటిగా ఉండేది. ఏటా లక్షలాది మంది అక్కడికి వెళ్లేవారు. బకుకు బుకింగులు కూడా ఇప్పుడు భారీగా తగ్గిపోతున్నాయి. జేఎన్‌యూ కటీఫ్ తుర్కియే విద్యాసంస్థలతోనూ తెగదెంపులు చేసుకోవాలనే డిమాండ్ల నేపథ్యంలో ఆ దేశంలోని ఇనోను వర్సిటీతో అవగాహన ఒప్పందాన్ని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) రద్దు చేసుకుంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. గత ఫిబ్రవరిలో కుదిరిన ఈ మూడేళ్ల ఒప్పందం ప్రకారం రెండు వర్సిటీల విద్యార్థులు, అధ్యాపకుల మారి్ప డికి అవకాశముండేది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్తాన్ వైమానిక శక్తి...మూడోవంతు ఊడ్చుకుపోయింది!
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్‌కు అలా ఇలా తగల్లేదు. మన ప్రతి దాడుల దెబ్బకు దాయాది ఏకంగా మూడో వంతు వైమానిక శక్తిని కోల్పోయింది! ఆ నష్టాల తాలూకు పూర్తి వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. మన బ్రహ్మోస్ తదితర క్షిపణులు పాక్‌లోని 11 కీలక వైమానిక స్థావరాలపై విరుచుకుపడడం తెలిసిందే. వాటి ధాటికి అవి కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలతో పాటు రక్షణ నిపుణులు తేల్చారు. ‘‘పాక్ వైమానిక స్థావరాల్లోని కీలక వ్యవస్థలన్నీ భారీగా దెబ్బతిన్నాయి. పాక్ ఎంతోకాలంగా మిడిసిపడుతున్న ఎఫ్ 16, జేఎఫ్ 17 వంటి అత్యాధునిక అమెరికా, చైనా తయారీ యుద్ధ విమానాల్లో చాలావరకు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి’’ అని వెల్లడించారు. సైనిక ఆపరేషన్లలో స్వావలంబన ప్రస్థానంలో ఆపరేషన్ సిందూర్‌ను మైలురాయిగా రక్షణ శాఖ అభివర్ణించింది. భారత రక్షణ పాటవానికి, ఆ రంగంలో సాధించిన స్వావలంబనకు ప్రతీకగా నిలిచిందని పేర్కొంది. ‘‘సరిహద్దులు దాటకుండానే పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలతో పాటు ఆ దేశ నలుమూలల్లోని కీలక సైనిక, వైమానిక వ్యవస్థలను కూడా తుత్తునియలు చేసి చూపించాం. పాక్ మాత్రం సైనికపరంగా కేవలం విదేశీ సాయాన్నే నమ్ముకుంది. మనపై దాడులకు చైనా తయారీ పీఎల్–15, తుర్కియేకు చెందిన ‘యిహా’ డ్రోన్లు, యూఏవీలను వాడింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ద్వారా తిరుగులేని రుజువులను ప్రపంచానికి చూపించాం’’ అని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.ఐఏఎఫ్ చీఫ్‌దే కీలకపాత్ర పాక్ వైమానిక స్థావరాలపై మన దాడుల్లో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్సింగ్దే కీలక పాత్ర. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ దాడులు పూర్తిగా ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. ముఖ్యంగా అతి కీలకమైన రావల్పిండిలోని చక్లాలా (నూర్ ఖాన్) ఎయిర్‌బేస్‌పై దాడి ప్లానింగ్ పూర్తిగా ఆయనదే. ఆ దాడిలో పాల్గొన్న పైలట్ల ఎంపిక తదితరాలను కూడా సింగ్ స్వయంగా ఎంపిక చేశారు. శనివారం తెల్లవారుజామున చక్లాలాలో మూడు ప్రాంతాలపై మన క్షిపణులు విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించాయి. వాటి దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మూడు గంటలు బంకర్లో తలదాచుకోవడమే గాక తన నివాసాన్ని సురక్షిత ప్రాంతానికి మార్చేశారట!నేవీ త్రిముఖ వ్యూహం పాక్‌పై మన దాడుల సందర్భంగా నేవీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పాక్‌ను అష్టదిగ్బంధం చేసేసింది. అందులో భాగంగా పాక్‌కు జీవనాడి వంటి కరాచీ ఓడరేవుపై మన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక పూర్తిస్థాయిలో గురిపెట్టింది. ఏకంగా 36 నావికా దళాలను మోహరించింది. ఏడు డి్రస్టాయర్లు, ఐఎన్ఎస్ తుషిన్ వంటి యుద్ధనౌకలు వాటిలో ఉన్నాయి. అవన్నీ బ్రహ్మోస్, ఎంఆర్ఎస్ఏఎం తదితర క్షిపణులను ఎక్కుపెట్టి ఏ క్షణమైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచాయి. అంతేగాక వరుణాస్త్ర వంటి అత్యాధునిక టార్పెడోలతో జలాంతర్గాములను కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా సన్నద్ధం చేసింది. దాంతో మరో దారిలేక పాక్ నేవీ కేవలం పోర్టుకే పరిమితం కావాల్సి వచ్చింది.నవాజ్ కనుసన్నల్లోనే...! భారత్‌పై పాక్ సైనిక చర్యలను పూర్తిగా ప్రధాని షహబాజ్ సోదరుడు నవాజ్ షరీఫే పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. మనపై దాడులన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగినట్టు సమాచారం. నవాజ్ మూడుసార్లు పాక్ ప్రధానిగా చేశారు. ప్రస్తుతం అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) సారథి. 1999లో ఆయన ప్రధానిగా ఉండగానే కార్గిల్ యుద్ధం జరిగింది. మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం, పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడం తెలిసిందే. ఆ మర్నాడు షహబాజ్ ఏర్పాటు చేసిన కీలక భేటీలో ప్రభుత్వపరంగా ఏ హోదా లేని నవాజ్ కూడా పాల్గొన్నారు.మా మద్దతు పాక్‌కే: తుర్కియే అంతర్జాతీయంగా ఛీత్కారాలు ఎదురవుతున్నా తుర్కియే బుద్ధి మాత్రం మారడం లేదు. అన్నివేళలా పాక్‌కే మద్దతుగా ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ బుధవారం కుండబద్దలు కొట్టారు. ‘‘పాక్ మా నిజమైన మిత్రదేశం. మా దేశాల సోదర భావం నిజమైన స్నేహానికి నిదర్శనం. పాక్–తుర్కియే దోస్తీ జిందాబాద్!’’ అని చెప్పుకొచ్చారు. -
భారత్‌లో ఆసియా కప్ హాకీ: పాక్‌కు ఎంట్రీ కష్టమే
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో పాకిస్తాన్ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి తదనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కాస్తా యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. చివరకు కాల్పుల విరమణతో భారత్ వైపు నుంచి ప్రతిదాడులు తప్పినా... పాక్ నుంచి చీకటి పడగానే డ్రోన్ల దాడి ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ హాకీ జట్టును కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశాలే లేవు. దీనిపై హాకీ ఇండియా (హెచ్ఐ) భారత ప్రభుత్వ సలహా కోరగా... ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన రాలేదు. ఆగస్టు 27 నుంచి సెపె్టంబర్ 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరగనుంది. ఇందులో ఆతిథ్య భారత్ సహా జపాన్, కొరియా, చైనా, మలేసియా, ఒమన్, చైనీస్ తైపీ, పాకిస్తాన్ పోటీపడతాయి. ప్రపంచకప్ హాకీకి ఈ ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీగా జరుగుతోంది. నెదర్లాండ్స్, బెల్జియం సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్న ప్రపంచకప్ హాకీ టోర్నీ వచ్చే ఏడాది జరుగుతుంది. భారత్‌లో జరిగే టోర్నీ కోసం పాక్‌ను అనుమతించకపోవడం గతంలోనూ జరిగింది. 2016లో పఠాన్‌కోట్‌లో భారత ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి జరగడంతో ఆ ఏడాది జరిగిన జూనియర్ ప్రపంచకప్ హాకీలో పాక్‌కు అనుమతించలేదు. ఏదేమైనా ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోళానాథ్ సింగ్ చెప్పారు. అనుమతిస్తారా, నిరాకరిస్తారా అన్నది ప్రభుత్వం చేతుల్లో ఉందని, దీనిపై ముందస్తుగా తాము చెప్పడానికేమీ లేదని ఆయన చెప్పారు. ఆసియా టోర్నీలో పాక్ స్థానంలో మలేసియాను ఆడించే అవకాశమైంది. ఈ టోర్నీలో ఐదుసార్లు విజేత అయిన దక్షిణ కొరియా డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగుతుంది. కొరియా తర్వాత దాయాది దేశాలు చెరో నాలుగుసార్లు ఆసియా కప్ గెలిచాయి. -
‘నవాజ్ షరీఫ్ కనుసన్నుల్లోనే పాక్ సైనిక దాడులు’
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసింది. అయితే ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. ఆ దాడికి వ్యూహ రచన చేసింది పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజ్మా బుఖారీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. పాక్ సైన్యం.. భారత్‌పై ఎలా దాడి చేయాలనే ప్లాన్ మొత్తం నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగింది. ఆయన చిన్న స్థాయి నాయకుడు కాదు.. ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది’ అని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు. ఇటీవల భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్లో బీభత్సం సృష్టించింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. వాళ్లకు శిక్షణ ఇచ్చే స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్.. భారత్‌పై మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై ప్రతిదాడికి ప్రయత్నించింది. అయినప్పటికీ భారత్ శక్తి, యుక్తులు ముందు అవి తేలిపోయాయి. దీంతో పాకిస్తాన్ సైన్యంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆజ్మా బుఖారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
కర్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. హైకోర్టు సీరియస్, చర్యలకు ఆదేశాలు
భోపాల్: ఆపరేషన్ సింధూర్‌పై ( Operation Sindoor) మీడియా బ్రీఫింగ్లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషీపై (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లను సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కల్నల్ సల్మాన్ ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి విషయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.కర్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు మంత్రి విజయ్ షా (Kunwar Vijay Shah) మంగళవారం మౌలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైనిక విమానంలో వాళ్ల (ఉగ్రవాదులు) మతానికి చెందిన సోదరిని పాక్‌కు పంపించి అదే రీతిలో పాఠం నేర్పించారు’ అని అన్నారు.అయితే, విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. జబల్పూర్ హైకోర్టు న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్, అనురాధ శుక్లాతో కూడిన ధర్మాసనం కల్నల్ సల్మాన్ ఖురేషీపై విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘విజయ్ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవి, తక్కువ చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలను వేర్వేరుగా చూడాలనే భావనను ప్రోత్సహించడమే కాకుండా, ఎవరు ముస్లిం అయితే వాళ్లు దేశభక్తులు కాదనే భ్రమను కలించేందుకు దారితీస్తాయి. ఇది భారత రాజ్యాంగంలో ఐకమత్యం,సోదర భావం అనే మౌలిక విలువలకు విరుద్ధం’అని వ్యాఖ్యానించిందిఈ సందర్భంగా నిజాయితీ, శ్రమ, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థత, స్వభావం, గౌరవం, దైర్యం వంటి విలువలకు ప్రతీక సాయుధ దళాలు’ అని ప్రశంసలు కురిపించింది. ఇలా దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారిపట్ల మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.India Pakistan News: MP Court Orders FIR Against BJP Leader Over Colonel Sofiya Qureshi Remark#DNAVideos | #IndiaPakistanTensions | #MadhyaPradesh | #BJP | #sofiyaqureshi For more videos, click here https://t.co/6ddeGFqedQ pic.twitter.com/W0kMjYhATB— DNA (@dna) May 14, 2025 -
భారత్ కు పాకిస్థాన్ లేఖ
-
భారత్‌కు పాకిస్తాన్ లేఖ
ఇస్లామాబాద్: భారత్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందంపై (indus waters treaty) సమీక్షించుకోవాలని ప్రాధేయపడింది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్‌పై (operation sindoor) జాతినుద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు’ అంటూ ఉగ్రవాదంపై భారత్ వైఖరి గురించి పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్‌పై భారత్ విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సూచించారు.👉పాక్‌పై భారత్ సింధూ అస్త్రం.. ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి (2025 Pahalgam attack) తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనిలో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ దేశంతో వాణిజ్యం రాకపోకలను నిషేధించింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో ఈ వివరాల్ని వెల్లడించారు. అయితే, సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపి వేయడంతో దాయాది దేశంలో నీటి కటకట మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ పంటపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్తాన్.. భారత్‌కు లేఖ రాసింది. ఆ లేఖలో సింధూ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయం విషయంలో పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా.. భారత జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఓ అధికారిక లేఖ రాసారు. సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేలా భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని లేఖలో కోరారు. -
మీ వైఖరేంటో?... మొన్న కాల్పుల విరమణ.. నేడు డిన్నర్!
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు. ఆయన రెండోసారి అధ్యక్షుడైన దగ్గర్నుంచి సుంకాల పెంపుతో ప్రపంచ దేశాల్ని రాజీకి వచ్చేలా చేయడం, ఆపై దేశాల మధ్య సమస్యలకు, యుద్ధాలకు మధ్యవర్తిత్వం వహించడం మాత్రమే చేస్తున్నారు. ట్రంప్.. ఇదే పనిలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అసలు అమెరికా ఎలా ఉందో చూసుకుంటున్నారో, లేదో కానీ మిగతా దేశాలపై ఆసక్తి మాత్రం ట్రంప్‌లో విపరీతంగా పెరిగిపోయింది.ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జపిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకుంటున్నారు ట్రంప్. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్నది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్రరాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.భారత్, పాకిస్తాన్ ల యుద్ధాన్ని తానే ఆపేశానని ;పదే పదే చెప్పుకుంటున్నారు ట్రంప్. ఇది మంచిదే. యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు. అయితే ఏ సందర్బంలో పాక్ బుద్ధి చెప్పేందుకు భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది.ఉగ్రదాడులతో జనాల ప్రాణాల్ని తీసేస్తుంటే, భారత్ కు యుద్ధ పరిస్థితిని కల్పించింది దాయాది పాక్ . అది ఆపరేషన్ సిందూర్ తో మొదలుపెట్టింది. ఇక్కడ పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ షురూ చేసింది. అయితే పాక్ కవ్వింపు చర్యలతో పాకిస్తాన్ రక్షణ స్థావరాలపై దాడులకు చేసి ఆ దాయాది దేశానికి చెందిన పలు ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసి తగిన బుద్ధి చెప్పింది.మిమ్మల్ని అడిగింది ఎవరు?అసలు విషయం వదిలేసి, కొసరు విషయం చెప్పే అలవాటు ట్రంప్ కే ఉందా.. లేదా అగ్రరాజ్యమే అలా ఉంటుందా? అనేది మరో ప్రశ్న. భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ గురించి ప్రకటించిన ట్రంప్.. యుద్ధం ఆపడానికి తనను ఎవరు ఆశ్రయించారనే విషయాన్ని ఎక్కడా వెల్లడించలేదు.భారత్, పాక్‌ల కాల్పుల విరమణ అంటూ తనకు తానుగా ప్రకటించారు ట్రంప్. తమకు క్లయింట్ అయిన పాకిస్థాన్‌కు పూర్తి సహకారం అందిస్తూనే, మరొకవైపు ఇండియాతో స్నేహాన్ని నటిస్తున్నారనేది భారత ప్రజలకు బాగా అర్ధమైంది. భారత్ దాడి ముమ్మరం చేసిన వేళ.. పాక్ ప్రధాని మిమ్మల్ని ఆశ్రయించారా? లేదా? అనేది మీరు చెప్పకపోయినా భారత్ ప్రజలకు ఆ విషయం అర్దమైంది. పాక్ భారీగా నష్టపోతుందనే ఉద్దేశంతోనే కాల్పుల విరమణకు ఒప్పించారని అంతా అనుకుంటున్నారు. కశ్మీర్ సమస్యను కూడా పరిష్కరిస్తే ఓ పనైపోతుందన్నట్టుగా ట్రంప్ చేసిన వాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ అంశంలో ఎవరి జోక్యం అవసరం లేదని, పీవోకేను భారత్‌కు పాక్ అప్పగించడమే ఒక్కటే మార్గమని క్లియర్ చేసేశారు.ఇప్పుడు కలిసి డిన్నర్ చేయాలా?తాజాగా ట్రంప్ మరో రాగం అందుకున్నారు. భారత్, పాకిస్థాన్‌లు కలిసి డిన్నర్ చేయాల్సిందేనని అంటున్నారు. రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్.. తొలిసారి మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో పర్యటించారు. దీనిలో భాగంగా సౌదీ అరేబియాలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌లు కలిసి డిన్నర్ చేస్తే చూడాలని అంటున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో భారత్ ఎలా కలిసి డిన్నర్ చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాల్పుల విరమణ అన్న మూడు గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడిందని మరి ఆ దేశాన్ని ఎలా నమ్మాలని కొంతమంది నిలదీస్తున్నారు. మీ వైఖరేంటో మాకు బాగా అర్ధమైందని మరికొందరు ట్రంప్‌ను విమర్శిస్తున్నారు. -
ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో హైలెవిల్ సీసీఎస్ సమావేశం జరిగింది. పలువురు కీలక కేబినెట్ మంత్రులతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాలు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ తో పాక్ లోని ఉగ్రస్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే వరుసగా సీసీఎస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ.గత 20 రోజుల్లో సీసీఎస్ భేటీ కావడం ఇది ఐదోసారి. అయితే భారత్-పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపిన తర్వాత సీసీఎస్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం తొలిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కేబినెట్ ప్రశంసించింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పారని మోదీని అభినందించింది. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని కేబినెట్ కొనియాడింది.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది. -
భారత జవాన్ ను విడిచిపెట్టిన పాకిస్థాన్
-
దేశంలో తాజా భద్రత పరిస్థితులపై సమీక్షించిన సీసీఎస్
-
అమ్మాయితో అశ్లీలంగా.. అడ్డంగా బుక్కైన పాక్ హైకమిషనర్
-
భారత్ జవాన్ ను విడిచిపెట్టిన పాకిస్థాన్
-
మా వాళ్లు ఎంతమంది పోయారంటే.. పాకిస్తాన్ కీలక ప్రకటన
-
భారత్ విజయం.. పాక్ నుంచి BSF జవాన్ విడుదల
సాక్షి, ఢిల్లీ: పాకిస్తాన్‌పై దౌత్యం విషయంలో భారత్ విజయం సాధించింది. ఎట్టకేలకు భారత బీఎస్ఎఫ్ జవాన్ పీకే షాను పాకిస్తాన్ విడుదల చేసింది. 20 రోజుల తర్వాత భారత జవాన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. దీంతో, సదరు జవాన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. బీఎస్ఎఫ్కు చెందిన భారత జవాన్ పూర్ణం కుమార్ షా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో, పీకే షాన్ పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం, దౌత్యపరంగా భారత్.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో, 20 రోజుల తర్వాత పీకే షాను.. ఈరోజు పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అటారీ సరిహద్దుల వద్ద జవాన్‌ను భారత్‌కు అప్పగించింది. Today BSF Jawan Purnam Kumar Shaw, who had been in the custody of Pakistan Rangers since 23 April 2025, was handed over to India: BSF(Pic Source: BSF) pic.twitter.com/TVzagO0AhK— ANI (@ANI) May 14, 2025182 బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు చెందిన షా పశ్చిమ బెంగాల్ వాసి. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో ఇండో-పాక్ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్తాన్ రేంజర్లతో చర్చలు జరిపారు. ఇలాంటి సంఘటలు అసాధారణం కాదని, గతంలో కూడా ఇలాంటివి జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పౌరులు కానీ, జవాన్లు కానీ ఇలా అనుకోకుండా ఆవలి దేశ సరిహద్దులోకి వెళ్లిన సందర్భాల్లో ఇరుదేశాల అధికారులు మిలిటరీ ప్రొటోకాల్ ప్రకారం ఫ్లాగ్ మీటింగ్‌ల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు. అయితే, పహల్గాం ఉదంతం తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ఆంక్షలు విధించిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పాక్ రేంజర్లకు పట్టు బడిన సమయంలో సాహు యూనిఫాంలో ఉన్నారని, అతని వద్ద సర్వీస్ రైఫిల్ కూడా ఉన్నట్టు అధికారులు చెప్పారు. -
మా మదర్సాపై బాంబులు పడ్డాయి! పూంచ్ ముస్లింల ఆవేదన..
-
వివాదంలో పాకిస్తాన్ హైకమిషనర్.. యువతితో వీడియోలు లీక్
ఢాకా: పాకిస్తాన్ హైకమిషనర్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. సదరు అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.వివరాల ప్రకారం.. సయ్యద్ అహ్మద్ మరూఫ్ పాకిస్తాన్ తరఫున బంగ్లాదేశ్‌కు హైకమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ హైకమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, మరూఫ్ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఉన్న తిరుగుతున్న ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసింది. మరూఫ్ మే 11న ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్‌కు విమానంలో వెళ్లారని బంగ్లాదేశ్ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. హనీట్రాప్ కారణంగా అతడు బంగ్లాదేశ్ వీడినట్టు చెప్పుకొచ్చింది.The Pakistani Ambassador to Bangladesh, Syed Ahmed Maroof, was in a relationship with a Bangladeshi Muslim girl. After some intimate details became public, he was sent on leave. There was a time when Pakistanis used to rape Bangladeshi Muslim women nowadays, some Bangladeshi… pic.twitter.com/p60WkJJslU— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) May 12, 2025అయితే, అధికారులు మాత్రం.. మారూఫ్ అధికారికంగా సెలవులో ఉన్నారని నిర్ధారించారు. కానీ, ఎన్ని రోజులు అతను సెలవులో ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు.. ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ ముహమ్మద్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.Pakistan Ambassador to Bangladesh Syed Ahmed Maroof is reportedly untraceable after his honey trapped videos emerged online.There's a leaked video too. pic.twitter.com/UfYmLYfKVl— Avinash K S🇮🇳 (@AvinashKS14) May 13, 2025ఇక, ఇటీవల మరూఫ్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని తెలుస్తోంది. ఆయన వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయన్ని అవాంఛిత వ్యక్తి (పర్సనా నాన్‌గ్రేటా)గా ప్రకటించి 24 గంటల్లోగా మన దేశాన్ని వీడివెళ్లిపోవాలని గడువు విధించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
అణ్వాయుధాలకు బెదిరే ప్రసక్తేలే..!
-
ప్రధాని మోదీ ప్రసంగంపై పాక్ ఓవరాక్షన్.. హెచ్చరిక అంటూ..
ఇస్లామాబాద్: భారత్, పాక్ ఘర్షణల వేళ పాకిస్తాన్ వ్యవహారశైలిని పరిశీలిస్తామని, భవిష్యత్తులో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని ప్రధాని మోదీ (Modi) హెచ్చరించిన నేపథ్యంలో పాక్ స్పందించింది. మోదీ వ్యాఖ్యలు 'రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదమైనవి'గా ఉన్నాయని పేర్కొంటూ పాక్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.పాకిస్తాన్ యుద్ధం, కాల్పుల విరమణ తదనంతర పరిణామాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ ప్రసంగంపై తాజాగా పాక్ విదేశాంగశాఖ స్పందిస్తూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో..‘భారత ప్రధాని చేసిన రెచ్చగొట్టే, వివాదాస్పద వ్యాఖ్యలను పాకిస్తాన్ తిరస్కరిస్తోంది. ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ కట్టుబడి ఉంది. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. భారత్ కూడా ప్రాంతీయ స్థిరత్వానికి, తమ పౌరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరిగినా పూర్తిస్థాయిలో ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించింది. కాల్పుల విరమణను తామే కోరినట్లు చెప్పడంలో వాస్తవం లేదని తెలిపింది. భారత్ చర్యలు ఈ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదం అంచుల్లో పడేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.అంతకుముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతంగా పూర్తిచేసిన భారత సాయుధ బలగాలను అభినందించారు. ఈ ఆపరేషన్‌లో కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని, డజన్ల కొద్దీ ఉగ్రవాదులు హతమయ్యారని, 'అత్యంత కీలక' లక్ష్యాలు అనదగ్గ కొందరు ఉగ్రవాదులు కూడా మృతుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలను భారత్ కేవలం విరామం ఇచ్చిందని, పూర్తిగా ముగించలేదని మోదీ గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదం-వాణిజ్యం, ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి సాధ్యం కావు. ఒకేచోట నీళ్లు, రక్తం ప్రవహించదు. అణుబాంబు బెదిరింపుల్ని భారత్ సహించదని.. ఈ ముసుగులో విజృంభిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన, నిర్ణయాత్మకమైన దాడి చేస్తుందని హెచ్చరించారు. భారత్ చేసిన దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందన్నారు.మంగళవారం కూడా పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరంలో వైమానిక దళ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్‌లో మరో ఉగ్రదాడికి పాకిస్తాన్ అనుమతిస్తే మట్టికరవక తప్పదని హెచ్చరించారు. భారత్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుంది, కానీ దాడి జరిగితే శత్రువును తుదముట్టించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. -
మోదీ ఇంటిపై పాక్ దాడి చేయాలి.. నవాజ్ అరెస్ట్
బెంగళూరు: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకుడిని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు యువకుడు.. ప్రధాని మోదీ ఇంటిపై బాంబు దాడి చేయాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. దీంతో, అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మంగనమ్మనపాళ్యకు చెందిన నవాజ్.. ఇటీవల పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో ప్రధాని మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియో తీశాడు. దీనిని పబ్లిక్ సర్వేంట్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నవాజ్ వీడియోలో మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌పై బాంబు దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇంటిపై పాకిస్తాన్ ఎందుకు బాంబులు వేయడం లేదు. బాంబు దాడికి నేను పిలుపునిస్తున్నా. బాంబు దాడి చేయాలనుకుంటున్నా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో గురించి తెలిసి పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించి నిర్బంధించారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ (తూర్పు) రమేష్ బానోత్ మాట్లాడుతూ..‘ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన నవాజ్ కంప్యూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రెచ్చగొట్టే కంటెంట్ ఉన్నందుకు అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. బండేపాళ్య పోలీసులు అతన్ని అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు రిమాండ్ చేశారు. అతనిపై తుమకూరులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసు పెండింగ్‌లో ఉందని తేలింది. ఈ పోస్ట్ వెనుక ఉన్న ఉద్దేశ్యంపై పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నవాజ్‌ను జ్యుడీషియల్ కస్టడీ కోసం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. -
దడ పుట్టించే ‘డ్రోణా’స్త్రం
సాక్షి స్పెషల్ డెస్క్,సాక్షి, హైదరాబాద్:రాజుల కాలంలో కత్తులు, బల్లేలతో సైనికులు రణక్షేత్రంలో పోరాడారు. తరవాత.. యుద్ధ భూమిలో తుపాకులు, బాంబుల మోత మోగింది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక మానవ రహిత విమానాలు, క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు.. ఏకంగా వేల మైళ్ల దూరం నుంచే శత్రుదేశంపై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్.. తాజాగా భారత్–పాక్... యుద్ధం ఏదైనా.. డ్రోన్స్ (మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీ)) ఇప్పుడు సైనిక సంపదలో అత్యంత కీలకంగా మారాయి. పెళ్లిళ్ల వంటి వేడుకల్లో ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్స్ మాత్రమే చాలా మందికి సుపరిచితం. కానీ, డ్రోన్స్ అంటే అంతకుమించి. డ్రోన్లు అధునాతన ఆయుధాలు. ఎవ్వరూ ప్రాణాలను పణంగా పెట్టకుండానే కచి్చతమైన దాడులు చేయడం, వేగంగా మోహరించే సామర్థ్యం వీటి సొంతం. క్షిపణులతో పోలిస్తే వీటి అభివృద్ధికి అయ్యే వ్యయమూ తక్కువే. మన దేశంలో డ్రోన్ల వాడకం.. 1999లో కార్గిల్ యుద్ధంలో మన సైన్యం తొలిసారి యూఏవీలను వినియోగించింది. ఆ తర్వాత ఇండియా అధికారికంగా వీటి కొనుగోలు మొదలు పెట్టింది. ప్రస్తుతం మన సైన్యం వద్ద ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న సెర్చర్ ఎంకే–2 టాక్టికల్ డ్రోన్స్, హెరాన్మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (ఎంఏఎల్‌ఈ), హార్పీ యాంటీ రాడార్ డ్రోన్లు ఉన్నాయి. హార్పీ అనేది ఆత్మాహుతి డ్రోన్(లాహోర్ వైమానిక రక్షణ వ్యవస్థను కూల్చివేసే క్రమంలో దీన్ని వినియోగించారు). వీటితో పాటు హరోప్ లాయిటరింగ్ అటాక్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. రాడార్ సైట్లు, వాహనాలే లక్ష్యంగా మందుగుండుతో ఢీకొట్టి సర్వనాశనం చేయడం దీని స్పెషాలిటీ. దీంతో పాటు అధిక మన్నిక, పేలోడ్ సామర్థ్యం కలిగిన ఇజ్రాయిల్ ఎంఏఎల్‌ఈ డ్రోన్’హెరాన్టీపీ/మార్క్ 2’కూడా మన దగ్గర ఉంది.మొదటి ప్రపంచ యుద్ధంలో..మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, అమెరికా రెండూ తొలిసారిగా యూఏవీతో ప్రయోగాలు చేశాయి. 1950–60లలో శత్రు భూభాగంపై గూఢచర్యం చేయడానికి యూఎస్ చిన్న రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు ఉపయోగించింది. వియత్నాం యుద్ధంలో నిఘా యూఏవీలు తొలిసారిగా మోహరించారు. 2000వ సంవత్సరంలో అమెరికా హెల్ఫైర్ క్షిపణులతో కూడిన ప్రిడేటర్ డ్రోన్‌ను రూపొందించింది. ఇక్కడి నుంచే సైనిక ఆయుధ భాండాగారంలోపెనుమార్పులు వచ్చాయి. మగ తేనెటీగను ఇంగ్లీషులో డ్రోన్ అంటారు. శ్రామిక తేనెటీగలకన్నాఇవి పెద్దగానే ఉంటాయి. కానీ తేనెనూ సంపాదించలేవు. తమను తామూపోషించుకోలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇవి చేసే పని ఏమీ ఉండదు. కానీ, ఆడ తేనెటీగ కోసం వెతుకుతూ ఎగిరి, దాన్ని కలిశాక పడిపోతుంది. డ్రోన్ మాత్రం అలాకాదు.. చూసి రమ్మంటే కాల్చి వస్తుంది.హైదరాబాద్ నుంచి..రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో ఇప్పటికే నిలిచింది. డిఫెన్స్ డ్రోన్విభాగంలోనూ ఇదే బాటలో పయనిస్తోంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్.. భారత రక్షణ శాఖ కోసం ఏఎల్ఎస్–250 యూఏవీలను ఉత్పత్తి చేస్తోంది. అదానీ–ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇండియా.. హెర్మీస్ 900 యూఏవీలను తయారు చేస్తోంది. రక్షణ రంగానికి కావాల్సిన కీలక యంత్ర, పరికరాల తయారీలో ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ సంస్థ ఎస్ఈసీ ఇండస్ట్రీస్‌కు చెందిన ట్రిన్నోవేట్ సినర్జీ టెక్నాలజీస్ చిన్న యూఏవీలు, హైబ్రిడ్ డ్రోన్స్ సరఫరా చేస్తోంది.ఆయుధాలను మోసే యూఏవీలను ఇండియన్ ఆర్మీకి అందిస్తోంది. జెన్ టెక్నాలజీస్ చిన్న యూఏవీలను భారత రక్షణ విభాగాలకు సరఫరా చేస్తోంది. ఎస్ఈసీ డీఆర్వీఏఎన్ఇన్నోవెన్షన్స్.. మిలిటరీ టెస్టింగ్ కోసం టార్గెట్ డ్రోన్లను; శిక్షణ, మదింపు కోసం శత్రు డ్రోన్లను అనుకరించే యూఏవీలను ఆఫర్ చేస్తోంది. మారుత్ డ్రోన్స్ రక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. టీ–హబ్, టీ–వర్క్స్ కేంద్రంగా కొన్ని స్టార్టప్స్ ఈ సెగ్మెంట్లోకి రానున్నాయి. భారత్ ఎలక్ట్రికల్స్ – హిందూస్థాన్ ఏరోనాటిక్స్ తయారీ భాగస్వాములుగా డీఆర్డీఓ రుస్తోమ్ – 2 డ్రోన్స్ అభివృద్ధి చేసింది. దక్ష యూఏవీ, ఐడియా ఫోర్జ్ వంటివి కూడా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2030 నాటికి రూ.34,860 కోట్లకు..డ్రోన్స్, యూఏవీల తయారీలో 75% వరకు విడి భాగాలు దేశీయంగా ఉత్పత్తి అయినవే. కొన్ని నెలల్లో ఇది 100 శాతానికి చేరడం ఖాయమని పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. డిఫెన్స్ డ్రోన్కంపెనీలు పరిశోధన, అభివృద్ధి, తయారీకి ఇప్పటికే రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టాయి. పరిశ్రమకు రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. భారత సైనిక డ్రోన్ మార్కెట్ 2024లో రూ.13,040 కోట్లు. 2030 నాటికి ఇది రూ.34,860 కోట్లకు చేరుతుందని గ్రాండ్ వ్యూ రిసర్చ్ అంచనా. -
బద్దలైన బేస్‌లు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో కీలక మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోయాయని స్పష్టమైంది. తాజాగా విడుదలైన శాటిలైట్ ఉపగ్రహాల స్పష్టమైన ఫొటోలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ వ్యాప్తంగా 11 మిలటరీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. వైమానిక స్థావరాల్లోని విమాన రన్వేలు, విమానాలను నిలిపి ఉంచే హ్యాంగర్లు ధ్వంసమైనట్లు ఈ శాటిలైట్ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఒక ప్రైవేట్ వాణిజ్య ఉపగ్రహ సంస్థ ఈ హై–రెజల్యూషన్ ఫొటోలను తీసింది. ఏమాత్రం అటూఇటూగా కాకుండా, గురిచూసి సరిగ్గా వాయుసేన స్థావరాల మీదనే బాంబులు పడేసినట్లు ఫొటోల్లో కనిపిస్తోంది. భారత్‌పై మరింతగా దాడులకు తెగిస్తే ఆకాస్త స్థావరాలనూ పూర్తిగా నేలమట్టం చేస్తారనే భయంతోనే మూడ్రోజులకే పాకిస్తాన్ కాళ్లబేరానికి వచి్చందనే వాదనకు పూర్తి బలం చేకూర్చేలా ఫొటోలు ఉన్నాయి. మాక్సార్ అనే శాటిలైట్ సంస్థ తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు జాతీయమీడియాలో మంగళవారం ప్రత్యక్షమయ్యాయి. సింధ్‌లోని సిక్కూర్, రావర్పిండిలోని నూర్ ఖాన్, దక్షిణ పంజాబ్ ప్రావిన్స్‌లోని రహీం యార్ ఖాన్, సర్గోధాలోని ముషాఫ్, ఉత్తర సిం«ద్‌లోని జకోబాబాద్, ఉత్తర థటా జిల్లాలోని భోలారీ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైన తీరు ఫొటోలో వివరంగా తెలుస్తోంది. దాడి తర్వాత కీలక మిలటరీ బేస్‌లలో రన్‌వేలపై భారీ గొయ్యి, కార్యనిర్వాహక భవనాలు, నిల్వ కేంద్రాల పైకప్పులకు పెద్ద రంధ్రాలు పడటం, భవంతుల గోడలు కూలి శిథిలాలు, శకలాలు సమీప ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడిన వివరాలు ఫొటోల్లో తెలుస్తున్నాయి. పస్రూర్, సియాల్కోట్లోని రాడార్ కేంద్రాలు క్షిపణుల దెబ్బకు పేలిపోయాయి. సుక్కూ ర్ ఎయిర్‌బేస్‌లో రెండు విమాన షెల్టర్లు కూలిపోయాయి. చక్లాలాలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో భారీ సైనిక, సరకు రవాణా వాహనాలు రెండు బాగా దెబ్బతిన్నాయి. రహీం యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఒక్కటే రన్‌వే ఉంది.దానిపై బాంబులేయడంతో 19 అడుగుల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. 43 అడుగుల పరిధిలో రన్‌వే పాక్షికంగా ధ్వంసమైంది. ముషాఫ్ ఎయిర్‌బేస్ రన్‌వేపై రెండు పేద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. ఒకటి 10, మరోటి 15 అడుగుల విస్తీర్ణంలో ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడి విమానాల రాకపోకలు ఆగిపోయాయి. సమీప రవాణా వాహనాలూ దెబ్బతిన్నా యి. జకోబాబాద్‌లోని షాబాజ్ ఎయిర్‌బేస్‌తోపాటు భోలారీ ఎయిర్‌బేస్‌లో చెరో విమాన హ్యాంగర్‌కు భారీ నష్టం జరిగింది. హ్యాంగర్‌లో నిలిపిఉంచిన విమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. -
IPL 2025: ఎవరు ఆడతారు... ఎవరు ఆగిపోతారు?
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఇప్పుడు లీగ్‌లో జరగాల్సిన తర్వాతి మ్యాచ్‌లపై అందరి దృష్టీ నిలిచింది. ఆరు నగరాలు బెంగళూరు, ముంబై, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్లలో మిగిలిన 13 లీగ్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమైన గవర్నింగ్ కౌన్సిల్... ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌ల వేదికలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు మ్యాచ్‌ల వేదికలకంటే ఆయా జట్లకు ఎవరెవరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారనే విషయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు మే 9న ప్రకటించడంతోనే దాదాపు అందరు విదేశీ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నవారు కూడా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవుతున్నట్లుగా బీసీసీఐ సోమవారమే ప్రకటించింది. దాంతో ఫ్రాంచైజీలు తమ జట్లలోని కీలక ఆటగాళ్లను రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆటగాళ్ల ఇష్టానికి... యుద్ధం కారణంగా టోర్నీ వాయిదా పడకుండా ఉంటే మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ ముగియాల్సి ఉంది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 3 వరకు టోర్నీ పొడిగించాల్సి వచ్చింది. అయితే విదేశీ ఆటగాళ్లందరూ మే 25 ప్రకారమే సిద్ధమై లీగ్ కోసం తమ ప్రణాళికలకు రూపొందించుకున్నారు. ఆ తేదీ తర్వాత ఆయా జాతీయ జట్ల సిరీస్‌లు, ఇతర ఒప్పందాల ప్రకారం వారు ఐపీఎల్లో కొనసాగే అవకాశం లేదు. ఐపీఎల్ తేదీల ప్రకారమే తాము ఎన్ఓసీలు జారీ చేశామని, దీనిపై మళ్లీ చర్చించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. న్యూజిలాండ్ బోర్డు కూడా దాదాపు ఇదే తరహాలో స్పందించింది. మరో వైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఆటగాళ్ల ఇష్టానికి వదిలేసింది. వారి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రధానంగా రెండు సిరీస్‌ల కారణంగా ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లు ఆడే విషయంలో ఇబ్బంది ఎదురు కావచ్చు. ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్‌లో పాల్గొనే ఆటగాళ్లలో చాలా మంది ఐపీఎల్లో భాగంగా ఉన్నారు. ఐపీఎల్ కొత్త తేదీల్లోనే ఈ సిరీస్ ఉంది. మరో వైపు జూన్ 11 నుంచి ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది. ఇందులో ఆడే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లలో చాలా మంది కోసం ఐపీఎల్ టీమ్‌లు ఎదురు చూస్తున్నాయి. మే 31న ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్టు టీమ్ ఒక చోటకు చేరాలని దక్షిణాఫ్రికా బోర్డు స్పష్టంగా ఆదేశించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన దక్షిణాఫ్రికా జట్టులోంచి రబడ, ఎన్గిడి, స్టబ్స్, మార్క్రమ్, రికెల్టన్, బాష్, యాన్సెన్, ముల్డర్ ప్రస్తుతం ఐపీఎల్ జట్లలో ఉన్నారు.అహ్మదాబాద్‌లోనే ఫైనల్! ‘ప్లే ఆఫ్స్’ మ్యాచ్‌ల వేదికల విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పాత షెడ్యూల్ ప్రకారం రెండు మ్యాచ్‌లు హైదరాబాద్, మరో రెండు కోల్‌కతాలో జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు నగరాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక ఏర్పాట్ల సమస్యను దృష్టిలో ఉంచుకొని ‘ప్లే ఆఫ్స్’ను ఇక్కడి నుంచి తరలించాలని బోర్డు యోచిస్తోంది. మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన ఎక్విప్మెంట్ను సిద్ధం చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా కొత్త వేదికలో కష్టమని భావిస్తోంది. పైగా ‘ప్లే ఆఫ్స్’ తేదీల్లో హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో వర్ష సూచన ఉంది. అందుకే మిగిలిన లీగ్ మ్యాచ్‌ల కోసం ఇప్పటికే ఎంపిక చేసిన ఆరు వేదికల నుంచి ఏవైనా రెండింటిలో ‘ప్లే ఆఫ్స్’ జరపాలనేది ఆలోచన. ఇదే కారణంగా చెన్నై, హైదరాబాద్ తమ హోం గ్రౌండ్లో ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌లను కూడా ఫ్రాంచైజీలకు చెప్పి అక్కడి నుంచి తరలించారు. టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఈ రెండు జట్ల చివరి మ్యాచ్‌లకు ఢిల్లీ వేదికవుతోంది. బీసీసీఐ యోచన ప్రకారం క్వాలిఫయర్–1, ఎలిమినేటర్లను ముంబైలో నిర్వహించి... క్వాలిఫయర్–2, ఫైనల్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లో నిర్వహించవచ్చు. -
అపూర్వం.. అనూహ్యం.. అద్భుతం.. వాయుసేనకు వందనం
ఇది నవయుగ భారతం. దేశం శాంతినే కోరుకుంటుంది. కానీ శాంతిమయ మానవత్వంపై దాడి చేస్తే ఊరుకోం. అవసరమైనప్పుడు సమరమూ చేస్తాం. యుద్ధక్షేత్రంలో శత్రువును ఎలా అణగదొక్కాలో భారత్‌కు బాగా తెలుసు. వాయుసేన వేగం, సత్తా చూసి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది. సమరంలో నేరుగా పోరాడే దమ్ములేక వైమానిక స్థావరంలో పౌరవిమానాలను ముందు నిలిపి పాక్ వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయినా వాయుసేన కచ్చితత్వంతో పాక్ సాయుధ సంపత్తి, వైమానిక స్థావరాలనే గురిచూసి కొట్టింది. – ప్రధాని మోదీన్యూఢిల్లీ: దుష్టదేశ గగనతలాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్లి ముష్కర మిన్నాగుల పుట్టలను నేలమట్టంచేస్తూ, దాయాదిదేశం యుద్ధం ఆపాలని కాళ్లబేరానికి వచ్చే స్థాయిలో శత్రువుల వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసి తిరుగులేని ధైర్యసాహసాలను ప్రదర్శించిన భారత వాయుసేనను ప్రధాని మోదీ పొగడ్తల్లో ముంచెత్తారు. పాక్ సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి స్వయంగా వెళ్లి అక్కడి వాయుసేన బలగాలపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. వారి అసమాన పోరాట పటిమను భుజం తట్టి ప్రోత్సహించి పొగిడారు.తర్వాత అక్కడి ఎయిర్‌ఫోర్స్ జవాన్లనుద్దేశించి దాదాపు అరగంటపాటు ప్రసంగించారు. మరోసారి తెగించేందుకు దుస్సాహసం చేయొద్దని సరిహద్దు వెంట భారతవాయుసేన బలగాలు లక్ష్మణరేఖ గీశాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆదంపూర్ వైమానిక స్థావరంలోని భారత అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ అయిన సుదర్శన చక్ర(ఎస్–400) మిస్సైల్ లాంఛర్లను ముక్కలుచెక్కలు చేశామని పాక్ పలికిన ప్రగల్భాలన్నీ ఉత్తమాటలని నిరూపిస్తూ మోదీ మంగళవారం ఆ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ ఎదుటే నిలబడి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ విజయంపై జాతినుద్దేశించి ప్రసంగించిన మరుసటి రోజే మోదీ ఎయిర్‌ఫోర్స్‌నుద్దేశిస్తూ మాట్లాడటం గమనార్హం. త్రిశూలం చిహ్నంతో ఉన్న ఎయిర్ కమాండ్ క్యాప్ ధరించి భారత్ మాతా కీ జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. అనుపమాన పరాక్రమం ‘‘పాక్ గడ్డపై మీరు చేసిన యుద్ధం అనుపమానం. అపూర్వం. అసాధారణం. అద్భుతం. పాకిస్తాన్ నడిబొడ్డున బాంబులు పేల్చారు. కేవలం 20–25 నిమిషాల్లో లక్ష్యాలను నేలమట్టంచేశారు. మీ మెరుపువేగం, కచ్చితత్వం శత్రువులను నిశ్చేష్టులను చేసింది. చూసుకునేలోపే ఛాతీని చీల్చేశాం. మీ పోరాటంతో ప్రతి ఒక్క భారతీయుడు గౌరవంతో ఉప్పొంగిపోయాడు. మేం మీకు రుణపడిపోయాం. ఇది ఎన్నటికీ తీర్చుకోలేని రుణం. ఊహకందనంతటి శక్తియుక్తుల్ని ప్రదర్శించి దేశానికి విజయం చేకూర్చిన మీ నుంచి ఆశీస్సులు తీసుకోవడానికే నేను వచ్చా.ఆపరేషన్ సిందూర్ ధాటికి ఇక లక్ష్మణరేఖ దాటొద్దని పాకిస్తాన్‌కు బాగా అర్థమైంది. తరచూ అణుబాంబులతో బెదిరించాలని చూస్తున్న దాయాదికి మన బలగాలు భారత్ మాతాకీ జై నినాదంలోని అపారశక్తిని బయటకు తీసి చూపారు. భారత్ మాతాకీ జై అనేది కేవలం నినాదం కాదు. దేశం కోసం తమ ప్రాణాలనైనా పణంగా పెడతామని బలగాలు చేసిన ప్రతిజ్ఞ. మన డ్రోన్లు, క్షిపణుల మోత పాక్ గడ్డపై ప్రతిధ్వనించిన ప్రతిసారీ పాకిస్తాన్ సైనికుల చెవుల్లో భారత్ మాతాకీ జై అనే నినాదమే మార్మోగింది. వాయుసేన శౌర్యం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మన సైనిక, వాయు, నావికా దళాలకు నా సెల్యూట్’’ అంటూ మోదీ సెల్యూట్ చేశారు. కన్నేస్తే కనుమరుగు ఖాయం ‘‘భారత గడ్డపై కన్నేస్తే తాము కనుమరుగు అవడం ఖాయమని ఉగ్రపోషకులకు ఆపరేషన్ సిందూర్ తర్వాత బాగా గుర్తుంటుంది. మీ పరాక్రమంతో ఆపరేషన్ సిందూరం నినాదం ప్రపంచమంతా మార్మోగుతోంది. శత్రువులు ఈ ఎయిర్‌ఫోర్స్‌ను నాశనంచేద్దామని కంకణం కట్టుకుని ఎడాపెడా దాడులు చేశారు. వాళ్ల ప్రయత్నాలను మీరు సులభంగా వమ్ముచేశారు. మన వైమానిక స్థావరాలు, రక్షణ మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో వాళ్ల 9 కీలక ఉగ్రస్థావరాలను సమాధులుగా మార్చేశాం. 100 మందికిపైగా ముష్కరులను మట్టుపెట్టాం. పాక్‌కు చెందిన ఎనిమిది సైనిక స్థావరాలను నాశనం చేశాం. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ గీసిన లక్ష్మణరేఖ ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. ధర్మ సంస్థాపనకు యుద్ధం ‘‘ధర్మ సంస్థాపనే లక్ష్యంగా శత్రు సంహారం కోసం ఆయుధం చేతబట్టి యుద్ధంచేయడం భారతీయుల సంప్రదాయం. మన అక్కచెల్లెళ్ల, కుమార్తెల పసుపు కుంకుమలు, సిందూరాన్ని తుచ్ఛమైన ముష్కరులు తుడిచేయగానే మనం వాళ్ల నట్టింట్లోకి వెళ్లి మరీ నాశనం చేశాం. కనీసం పారిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు. పహల్గాంలో వాళ్లు దొంగదెబ్బ తీస్తే మనం మాత్రం నేరుగా వెళ్లి, ఎదురునిలిచి పోరాడాం. పాకిస్తాన్ సైన్యం చంకనెక్కి భద్రంగా ఉండొచ్చని ఇన్నాళ్లు ఉగ్రవాదులు భావించారు. కానీ మన బలగాలు ఇక పాక్‌లో ఉగ్రవాదానికి సురక్షిత స్థలమంటూ ఏదీ లేదని నిరూపించాయి.సూర్యోదయం వేళ మీ సుందర దర్శనం చేసుకునేందుకే నేను ఇక్కడికొచ్చా. మీరు ఈ తరానికే కాదు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాతలు. మరోసారి సాహసిస్తే నాశనం, వినాశనం అని శత్రువులకు సందేశం ఇచ్చారు. భారత్ మాతాకీ జై అన్నప్పుడల్లా భయంతో శత్రువుల గుండెలు జారిపోయాయి. పరాక్రమవంతుల అడుగులతో నేల కూడా పులకిస్తుంది. అంతటి ధైర్యవంతులను నేరుగా చూడటంతో జన్మ ధన్యమవుతుంది. ఆ భాగ్యం కోసమే నేను ఇక్కడికొచ్చా. వీరుల నేలపై నిలబడి ఇప్పుడు నేను ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లోని యోధులకు సలామ్ చేస్తున్నా. మీ వీరత్వంతో ఆపరేషన్ సిందూర్ నినాదం నేల నలుచెరుగులా ప్రతిధ్వనిస్తోంది’’ అంటూ బలగాలను మోదీ పొగిడారు.త్రికరణ శుద్ధితో..‘‘ఇప్పుడు భారత్ మూడే సూత్రాలతో ముందుకెళ్తోంది. ఒకటి.. ఉగ్రదాడి జరిగితే మనదైన శైలిలో సమయం చూసి దీటుగా బదులిస్తాం. రెండు.. అణుబాంబులకు భయపడేదే లేదు. మూడు.. ఉగ్రవాదాన్ని పెంచిపోíÙంచే వాళ్లను, ఉగ్రవాదాన్ని జాతీయవాదంగా మార్చేసిన ప్రభుత్వాలను ఇకపై భారత్ వేర్వేరుగా చూడబోదు’’ అని మోదీ స్పష్టంచేశారు. ఆదంపూర్ ఎయిర్‌బేస్ అనేది దేశంలోని రెండో అతిపెద్ద వైమానిక స్థావరం. ఇక్కడ అత్యంత అధునాతన రఫేల్, మిగ్–29 యుద్ధవిమానాల స్క్వాడ్రన్ దళాలు ఉంటాయి. 1965, 1971 యుద్ధాల్లోనూ ఆదంపూర్ వైమానిక స్థావరం అత్యంత కీలకపాత్ర పోషించింది. మానవ యుక్తి.. మెషీన్ శక్తి‘‘వాయుసేన ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల వేగం, సత్తా చూసి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది. సమరంలో నేరుగా పోరాడే దమ్ములేక వైమానికస్థావరంలో పౌరవిమానాలను ముందు నిలిపి పాక్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. అయినాసరే మన వాయుసేన అత్యంత కచ్చితత్వంతో పాక్ సాయుధ సంపత్తి, వైమానిక స్థావరాలనే గురిచూసి కొట్టింది. అమాయక పౌరులకు ఏ హానీ తలపెట్టలేదు. ఒక్క పౌరవిమానాన్నీ మీరు ధ్వంసంచేయలేదు. ఈ విషయంలో నేను నిజంగా గర్వపడుతున్నా. దాడుల్లో మీరు శత్రు స్థావరాలు, ఉగ్రశిబిరాలనే కాదు మరోసారి దుస్సాహసం చేయాలనే దుర్బుద్ధినీ దెబ్బతీశారు.గగనతల, భూతల యుద్ధ వ్యవస్థల మధ్య అద్భుతమైన సమన్వయం సాధించారు. మానవ యుక్తిని మెషీన్ శక్తిని చక్కగా మేళవించారు. మీరు భారత్ మాతా కీ జై అన్న ప్రతిసారీ శత్రువుల వెన్నులో వణుకుపుట్టింది. మీ సారథ్యంలో దేశీయ తయారీ ఆకాశ్ మిస్సైళ్లు, అధునాతన సుదర్శన చక్ర(ఎస్–400) వ్యవస్థలు శత్రు దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆపరేషన్ సిందూర్ ద్వారా మీరు దేశ ఆత్మవిశ్వాసం, సమైక్యత, ప్రతిష్టను నూతన శిఖరాలపై నిలిపారు. అణుబూచికి ఏమాత్రం భారత బలగాలు బెదరవని నిరూపించారు. మన శక్తియుక్తుల ముందు పాకిస్తాన్ అన్ని డ్రోన్లు, యూఏవీలు, క్షిపణులన్నీ దిగదుడుపే. నమ్మశక్యంకాని రీతిలో రణతంత్రం ప్రదర్శించారు.గత దశాబ్దకాలంలో అత్యంత అధునాతన సమర సాంకేతికతలన్నింటినీ మన బలగాలు అందిపుచ్చుకున్నాయి. టెక్నాలజీ వాడకంలో, యుద్ధం వచ్చినప్పుడు ఎలా వినియోగించుకోవాలో మీకు బాగా తెలుసు. రియల్ గేమ్‌లో మీరు అదరగొట్టారు. మీరు ఆయుధాలతో మాత్రమే యుద్ధం చేయలేదు. భారత్ ఇప్పుడు డ్రోన్లు, డేటా, టెక్నాలజీ సహిత రణాల్లో రాటుదేలింది. మీరు దమ్ము చూపించి శత్రువులను దుమ్ములో కలిపేశారు’’ అని మోదీ అన్నారు. మహారాణా ప్రతాప్ అశ్వమైన చేతక్ చూపిన తెగువ, సాహసం ఇప్పుడు మన ఆధునిక యుద్ధవిమానాలకు పాటవానికి సరిగ్గా సరిపోతుంది అంటూ నాటి వచనాలను మోదీ గుర్తుచేశారు. ‘‘కదలికల్లో నైపుణ్యం కనబరిచాయి. మెరుపువేగంతో దూకుడు చూపాయి. శత్రుసైన్యం మధ్యల్లోంచే శ్రస్తాలు సంధించాయి’’ అని మోదీ ఆ వచనాలను వల్లెవేశారు. శాంతంగా ఉంటాం.. సమరమూ చేస్తాం‘‘ఇది నవయుగ భారతం. దేశం శాంతినే కోరుకుంటుంది. శాంతంగా ఉంటాం. శాంతిమయ మానవత్వంపై దాడి చేస్తే ఊరుకోం. యుద్ధ క్షేత్రంలో శత్రువును ఎలా అణగదొక్కాలో భారత్‌కు బాగా తెలుసు. శాంతంగా ఉంటాం. అవసరమైనప్పుడు సమరమూ చేస్తాం. ఆపరేషన్ సిందూర్ అంటే పోరాటానికి పెట్టుకున్న పేరు కాదు. భారత విధాననిర్ణయ పతాక. దృఢ సంకల్పానికి, శక్తిసామర్థ్యాలకు ప్రతీక. శాంతిమయ జీవనం సాగించాలని ప్రపంచానికి బోధించిన బుద్ధుని నేల మాత్రమేకాదు శత్రువులను చీల్చి చెండాడిన గురు గోవింద్ సింగ్ లాంటి వీరపరాక్రముల పవిత్రభూమి’’ అని అన్నారు. -
నీళ్ల కోసం ఇక పాక్ కాళ్లబేరం!
ఇండియా, పాకిస్తాన్ మే 10న కాల్పులను విరమించాయి. దీనికి అమెరికా చొరవ చూపి నట్టుగా వార్తలొచ్చాయి. ఏప్రిల్ 22 పహల్ గామ్ దాడి నుంచి మే 10 కాల్పుల విరమణ వరకు గడచిన ఈ స్వల్పకాలంలో ఇరు దేశాల సంబంధాలు మౌలికంగా కొత్త రూపు సంతరించుకున్నాయి. ఉగ్రదాడికి ముందు ఇండియా–పాకి స్తాన్ సంబంధాలు ఎలా ఉండేవో ముందుగా తెలుసుకోవాలి. రెండు దేశాల నడుమ పరిష్కారం కాని సమస్యలపై ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, కాల్పుల విరమణ సజావుగా కొనసాగుతోంది. సింధూ నదీ జలాల ఒప్పందానికి (ఇండస్ వాటర్ ట్రీటీ– ఐడబ్ల్యూటీ) ఇండియా కట్టుబడి ఉంది. పరిమిత కాల పర్యటనలకు వీలుగా అటారీ–వాఘా సరిహద్దు తెరిచే ఉంటోంది. రాజధానుల్లో హై కమిషనర్లు మినహా సీనియర్ దౌత్యాధికారులు పనిచేస్తున్నారు. ఏదో ఒకరోజు కశ్మీర్ మీద చర్చలు సాధ్యమేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి మరునాడు, అంటే ఏప్రిల్ 23న, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. అటారీ– వాఘా సరిహద్దును మూసేసింది. రక్షణ సహాధి కారుల పోస్టులను రద్దు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ భగ్నమైంది. పాకిస్తాన్ ఒకడుగు ముందుకేసి 1972 సిమ్లా ఒప్పందం రద్దు చేస్తానని బెదిరించింది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే నీళ్లు!కట్ చేస్తే... మే 11న అకస్మాత్తుగా వైరాలు నిలిచిపోయాయి. మళ్లీ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో మారిన పరిస్థి తులు ఏవి? దీని తర్వాతా మారనివేమిటి? మే 10న రెండు దేశాల డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్)లు టెక్నికల్ అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. దీని ప్రకారం, నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్–ఎల్ఓసీ) పొడవునా కాల్పులు జరగవు. డ్రోనులు, క్షిపణులు ప్రయోగించుకోరు. ఇతర లాంగ్ రేంజ్ ఆయు ధాల ప్రయోగం జరగదు. పరస్పర సైనిక దాడులు నిలిచిపోతాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందం వమ్ము చేయలేనివి ఏమిటో చూద్దాం. ఏప్రిల్ 23న ఇండియా, ఆ తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలను మే 10 ఒప్పందం రద్దు చేయలేదు. ఇది టెక్నికల్ స్థాయి పత్రం తప్ప రాజకీయ ఒప్పందం కాదు. డీజీఎంఓలకు రాజకీయ ఒప్పందాలు చేసుకునే అధికారం లేదు. వీటిని విదేశీ వ్యవహారాల శాఖలు మాత్రమే కుదుర్చుకోగలవు. మరో విధంగా చెప్పాలంటే, ఏప్రిల్ 22 నాటి పరిస్థితిని ఇరు దేశాలూ పునరుద్ధరించలేదు. అందుకే, ఇండియా, పాకిస్తాన్ నడుమ ఇప్పుడున్నది నయా స్టేటస్ కో! అంటే, ఐడబ్ల్యూటీ ఇక ముందు కూడా నిలుపుదలలోనే ఉంటుంది. సింధు జలాలు ఇండియా ఇష్టానుసారం ప్రవహిస్తాయి. ఈ జలాల గణాంకాలను పాకిస్తాన్‌తో పంచుకోవడానికి ఇండియా సుముఖంగా లేదు. దాయాది దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్గత రాజకీయాలను దీర్ఘ కాలంలో ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఐడబ్ల్యూటీ నిలిపివేత ఇండియా–పాకిస్తాన్ దౌత్య సంబంధాల రూపురేఖలను మౌలికంగా మార్చేసిన తీవ్ర చర్య. పాక్ టెర్రరిజానికి స్వస్తి పలికితే తప్ప సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించబో మని ఇండియా తేల్చిచెప్పింది. ఏకపక్షంగానో, లేదా ద్వైపాక్షిక చర్చల అనంతరమో దీన్ని పునరుద్ధరించడం పూర్తిగా ఇండియా చేతిలో ఉంది. మే 10 కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి ఈ అంశం రాదు.భవిష్యత్ చర్చల్లో పాకిస్తాన్ మెడలు వంచడానికి ఈ ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ గొప్ప అస్త్రం అని చెప్పాలి. పాకిస్తాన్‌కు సింధూ బేసిన్ నీళ్లు కావాలంటే, టెర్రరిజం విషయంలో ఇండియా డిమాండ్లకు అది తలొగ్గాల్సిందే. కశ్మీర్ అనేది భావోద్వేగాలకు సంబంధించిన అంశం. అయితే, పాకిస్తాన్ ప్రజలకు నీరు జీవన్మరణ సమస్య. పాకిస్తాన్ ఇకముందు కూడా కశ్మీర్ పాట పాడుతుంది. కానీ, ఐడబ్ల్యూటీ విషయంలో ఇండియాను సానుకూలం చేసుకోడమే మున్ముందు వారి అసలు లక్ష్యం అవుతుంది. ఉభయ పక్షాల చర్చల్లో కశ్మీర్ అంశం ప్రాముఖ్యం కోల్పోతుంది. దాని స్థానంలో ఐడబ్ల్యూటీ కీలకాంశంగా మారుతుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియా తీసు కున్న ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ అనే ఒకే ఒక్క చర్యతో... ఇరు దేశాల సంబంధాల్లో ఇప్పటి వరకు కేంద్రబిందువుగా ఉన్న కశ్మీర్ స్థానాన్ని ఇప్పుడు నీరు ఆక్రమించింది. నిగ్రహం బాధ్యత పాక్ మీదే...1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అనంతరం, 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసినప్పుడు కూడా ఇండియా ఇలానే వ్యవహరించింది. యుద్ధం ముందు ఉన్న ప్రాదేశిక స్థితిని (1965 యుద్ధానంతరం మాదిరిగా) యథాతథంగా అంగీకరించలేదు. కశ్మీర్ సరిహద్దు పేరును ‘కాల్పుల విరమణ రేఖ’ నుంచి ‘నియంత్రణ రేఖ’ (ఎల్ఓసీ)గా మార్చింది. ఇలా చేయడం ద్వారా కశ్మీర్లో తృతీయ పక్షం జోక్యాన్ని వ్యతిరేకించగలిగింది. అప్పటి నుంచి జమ్ము– కశ్మీర్లో యూఎన్ పరిశీలకుల ఉనికి నామమాత్రమైంది. సారాంశం ఏమిటంటే, పహల్గామ్ ఉగ్రదాడి, దాని పర్యవ సానాలు ఇండియా–పాకిస్తాన్ సంబంధాలను రెండు విధాలుగా ప్రభావితం చేశాయి. మొదటిది: పాకిస్తాన్ కోరుకున్నట్లు కశ్మీర్ అంశం కొంతవరకు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అయితే ద్వైపాక్షిక చర్చల నుంచి కశ్మీర్‌ను తప్పించడంలో ఇండియా విజయం సాధించింది. పాకిస్తాన్ ఇప్పుడు సర్వశక్తులూ ఐడబ్ల్యూటీ మీదే కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్‌కు నీళ్లు కావాలి.ఇండియాకు టెర్రరిజం అంతం కావాలి. ఇప్పటి వరకు, టెర్రరిజం అంతానికి పాకిస్తాన్ అంగీకరించాలంటే ఇండియా కశ్మీర్‌పై చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడది మారింది.రెండవది: ఇరు దేశాల నడుమ సంఘర్షణ తలెత్తినప్పుడు, వైరాన్ని ఉప–సాంప్రదాయిక (సబ్–కన్వెన్షనల్) స్థాయిని దాటనివ్వ లేదని ఇండియా తన చర్యలు, ప్రతిచర్యల ద్వారా చాటిచెప్పింది. భవిష్యత్తులో మాత్రం ఇది కుదరదని, సబ్–కన్వెన్షనల్ దాడులకు సాంప్రదాయిక స్థాయిలోనే ప్రతి చర్యలు ఉంటాయని ప్రకటించింది. అంటే, ఇండియాతో పూర్తిస్థాయి యుద్ధం వద్దనుకుంటే, ఉప–సాంప్రదాయిక స్థాయిలోనూ పోరు ప్రారంభించకుండా నిగ్రహం పాటించాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీదే ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, టెర్రరిజానికి ఇక సాంప్రదాయిక యుద్ధంతోనే జవాబు చెబుతామని ఇండియా స్పష్టం చేయగలిగింది. ఇందుకోసం భారీ మిలిటరీ సంక్షోభం ఉత్పన్నమై అనేక మంది బలి కావలసి రావడం దురదృష్టకరం. వైరి దేశం ఉగ్ర దాడులకు తెగబడ కుండా నిరోధకత సాధించడానికి, దాన్ని కొనసాగించడానికి ఈ పాటి మూల్యం చెల్లించక తప్పదు.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా ఫారిన్ పాలసీ బోధకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
ఢిల్లీ :న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారి తన దౌత్య కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సదరు అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది. -
కాశ్మీర్ అంశంపై మా విధానంలో మార్పు లేదు: విదేశాంగ శాఖ
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌కు భారత్ గట్టి గుణపాఠం చెప్పింది. పహల్గాం ఘటన తరువాత సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం జరిగింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. భారత్ అమెరికా నాయకులు మాట్లాడారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి 'రంధీర్ జైస్వాల్' పేర్కొన్నారు.కాల్పుల విరమణకు కోసం పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంపై రెండు దేశాల DGMOల మధ్య అవగాహనా కుదిరింది. సింధూ నదీ జలాల రద్దు ఒప్పందం కొనసాగుతుంది. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.కాశ్మీర్ అంశంపై ద్వైపాక్షింగా చర్చిస్తాం. ఈ అంశంపై మా విధానంలో ఎలాంటి మార్పు లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైన చర్చలు ఉంటాయి. టీఆర్ఎఫ్ లష్కరితోయోబా సంస్థ. దీనిపైన అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న ఏకైక పరిష్కారం కాని సమస్య.. అక్రమంగా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి ఇవ్వడం. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని విడిచిపెట్టడం అనేది పరిష్కారం కాని విషయం' అని జైస్వాల్ అన్నారు. -
PM Modi: వచ్చేది వినాశనమే పాక్ కు నిద్ర పట్టనివ్వను
-
పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా ఆర్సీబీ మాజీ కోచ్
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్ల హెడ్ కోచ్‌గా ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ (న్యూజిలాండ్) నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ ఇవాళ (మే 13) వెల్లడించారు. 50 ఏళ్ల హెస్సెన్ మే 26న బాధ్యతలు చేపడతారు. పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా హెస్సన్ కాంట్రాక్ట్ ఎంత వరకు ఉంటుందో తెలియరాలేదు.కోచ్‌గా హెస్సన్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 2012 నుండి 2018 వరకు అతను న్యూజిలాండ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. హెస్సన్ కోచ్‌గా ఉండగా న్యూజిలాండ్ అద్భుత విజయాలు సాధించి మూడు ఫార్మాట్లలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. హెస్సన్‌కు ఐపీఎల్‌లోనూ మంచి ట్రాక్ రికార్డే ఉంది. 2019 నుంచి 2023 సీజన్ వరకు అతను ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు.ప్రస్తుతం హెస్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. హెస్సన్‌కు ముందు పాక్ పరిమిత ఓవర్ల హెడ్ కోచ్‌గా ఆకిబ్ జావిద్ వ్యవహరించాడు. గతేడాది అక్టోబర్‌లో అప్పటి హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఆకిబ్ జావిద్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. హెస్సన్ కొత్త కోచ్‌గా నియమితుడు కావడంతో తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావిద్ పాక్ క్రికెట్ జట్టు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. ఈ హోదాలో అతను పాక్ సెలెక్షన్ కమిటీలోనూ భాగస్తుడు కావచ్చు.పాక్ పరిమిత ఓవర్ల జట్లకు హెడ్ కోచ్‌గా హెస్సన్ ప్రయాణం త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే సిరీస్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే భారత్, పాక్ మధ్య యుద్దం, తదనంతర పరిస్థితుల కారణంగా ఈ సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న సమాచారం మేరకు పాక్, బంగ్లాదేశ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మే 25, 27, 30, జూన్ 1, 3 తేదీల్లో జరుగనుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు ఫైసలాబాద్, మిగతా మూడు మ్యాచ్‌లు లాహోర్‌లో జరుగనున్నాయి. -
నాటి భారత్-పాక్ యుద్ధం: ఆ 300 మంది మహిళలు 72 గంటల్లోనే..!
ఆపరేషన్ సిందూర్‌లో ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ రోజు ప్రధాని మోదీ పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి..ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ముచ్చటించి వారిని అభినందించారు. అలాగే పాక్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసలు కురిపించారు కూడా. ఈ నేపథ్యంలో 1971 ఇండియా-పాక్ యుద్ధంలో ధ్వంసమైన భుజ్ వైమానిక దళ స్థావరాన్ని గంటల వ్యవధిలో పునర్నిర్మించి.. పాక్ దాడులను తిప్పిగొట్టిన గాథ గురించి తెలుసుకుందామా..!.1971 ఇండియా-పాక్ యుద్ధంలో..డిసెంబర్లో ఒక రాత్రి గుజరాత్‌లోని భుజ్ వైమానిక స్థావరంపై 14 ప్రాణాంతకమైన నాపామ్ బాంబులను జారవిడిచి కల్లోలం సృష్టించింది. ఆబాంబుల ధాటికి భుజ్ రన్‌వే ధ్వంసమైపోయింది. దాంతో భారత్ యుద్ద విమానాలు ఎగరలేని పరిస్థితి ఎదురైంది. మరోవైపు యుద్ధ కొనసాగుతోంది. ఈ విపత్కర పరిస్థితిలో వైమానికి దళాలకు ఏం చేయాలో పాలిపోలేదు. అదీగాక ఆ స్థావరంపై కేవలం రెండు వారాల్లోనే 35 సార్లకు పైగా బాంబు దాడులు జరిగాయి. మరోవైపు పాక్ శత్రు మూకలు ఆస్థావరాన్ని ఆక్రమించుకునేంత చేరువలో ఉన్నారు. చెప్పాలంటే..రన్‌వే లేకపోతే మొత్తం భారతవైమానిక రక్షణ వ్యవస్థ నేలమట్టం అయినట్లేనని పేర్కొనచ్చు. అలాగే అక్కడ ఉన్న సైన్యం, ఇంజనీర్లు కూడా తక్కువే మందే. సరిగ్గా అప్పుడే భుజ్ ఎయిర్‌బేస్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ మెరుపులాంటి ఆలోచన తట్టింది. అది ఫలిస్తుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేసే వ్యవధిలేని సంకటస్థితి. పైగా ప్రతి సెకను అత్యంత అమూల్యమైనది. దాంతో ఆయన సమీపంలోని మాదాపూర్ గ్రామంలోని మహిళలను సాయం తీసుకున్నారు. మొత్తం 300 మంది మహిళలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో తల్లులు, కుమార్తెలు, వితంతువులు కూడా ఉన్నారు. ఆకుపచ్చ చీరలే ఎందుకంటే..వారంతా శత్రు విమానాలకు కనపడకుండా ఆకుపచ్చ చీరలు ధరించి రన్‌వే నిర్మాణంకు పూనుకున్నారు. బరువైన రాళ్లను, సిమెంట్ బకెట్లను మోసుకెళ్లారు. చేతులతో మెర్టార్ కలిపారు. తమ ఇంటిని నిర్మించినంత శ్రద్ధతో రన్‌వేని తిరిగి నిర్మించారు. అయితే వైమానిక దాడి సైరన్లు మోగినప్పుడల్లా పొదల్లోకి వెళ్లి దాక్కునేవాళ్లు. ఆ ఆకుపచ్చని వస్త్రం ప్రకృతిలో కలిసిపోవడానికి ఉపయోగపడుతుందని..ఆ వస్త్రం ధరించే ఈ పనికి పూనుకున్నట్లు సమాచారం. ఆ మహిళలంతా ఆకలి, భయం, నిద్రలేని రాత్రులతో ఆహర్నిశలు కష్టపడ్డారు. పగుళ్లు మూపివేసేలా ఆవుపేడ ఉపయోగించారు. అలా వారంతా కేవలం 72 గంటల్లోనే రన్‌వేని తిరిగి నిర్మించారు. దాంతో గగనంలో కూడా యుద్ధం చేయగల శక్తిని భారత్ అందుకోగలిగింది. నిజానికి ఆ మహిళలకు ఆ నిర్మాణ పనిలో శిక్షణ లేదు, అలాగే యుద్ధ అనుభం, రక్షణాయుధాలు కూడా లేకుండా అజేయమైన ధైర్యమైన సాహసాలతో ముందుకొచ్చిన వీర వనితలు. ఆ రాత్రి ఏం జరిగిందంటే..నాటి రన్‌వే పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న మహిళల్లో ఒకరైన కనాబాయి శివ్జీ హిరానీ మాట్లాడుతూ..1971 భారత్-పాక్‌కి యుద్ధం జరుగుతున్నప్పుడూ..నాకు 24 ఏళ్లు. డిసెంబర్లో ఒక రోజు రాత్రి భుజ్‌లోని విమానాశ్రయం రన్‌వేపై బాంబు దాడి చేసింది పాక్. రాత్రిపూట దాడి చేయడంతో అక్కడున్న ప్రతిదీ నాశనమైపోయింది. ఏం చేయాలో తోచని స్థితి. కాని యావత్తు దేశాన్ని ప్రమాదంలో పెట్టే పరిస్థితి కాబట్టి మా గ్రామంలోని మహిళ ఇందుకు తమ వంతుగా సహకరించేందుకు ముందుకొచ్చారు అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు". హిరానీ. దశాబ్దాలు గడుస్తున్న పాక్ తీరులో మార్పురావడంలో లేదు. కచ్చితంగా ప్రధాని మోదీ దీనిపై గట్టి చర్య తీసుకోవాలి. అలాగే పాక్‌కు నీరు, ఆహార సరఫరాను పూర్తిగా నిలిపివేయాలి. అప్పుడుగానీ వారికి తాము ఏం తప్పు చేశామన్నాది తెలియదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. పైగా తాను పాక్‌పై ద్వేషంతో ఇలా అనడం లేదని..తన జీవితానుభవంతో చెబుతున్న ఆవేధనభరితమైన మాటలని అన్నారు హిరానీ.(చదవండి: Indian Army soldier: మనసును కదిలించే సైనికుడి రియల్ స్టోరీ..నటుడు మోహన్ లాల్ సైతం ఫిదా..!) -
పాక్ కు కోలుకోలేని దెబ్బ, బలోచిస్తాన్‌కు భారత్ సపోర్ట్ ?
-
త్రివిధ దళాదిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రకటన చేసిన వేళ..కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కీలక సమావేశం ప్రారంభమైంది.ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాదిపతులు, డిఫెన్స్ సెక్రటరీ,సీడీఎస్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. ఈ కీలక భేటీలో కాల్పుల విరమణ, సరిహద్దుల్లో తాజా పరిస్థితుల గురించి చర్చ జరే అవకాశం ఉంది. Delhi | Defence Minister Rajnath Singh held a meeting with Defence Secretary, CDS, Navy Chief and Army Chief(Source: Defence Minister's office) pic.twitter.com/BF9AHZwkc4— ANI (@ANI) May 13, 2025మధ్యాహ్నం 3గంటలకు రక్షణ శాఖ ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ ప్రెస్మీట్లో ఆపరేషన్ సిందూర్‌పై వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పాక్ ఎయిర్ బేస్ ధ్వంసంపై కీలక విషయాలు వెల్లడించనుంది. పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రక్షణ శాఖ బ్రీఫింగ్ ఇవ్వనుంది. -
Magazine Story: పాక్ ని ఆర్థికంగా, వాణిజ్యపరంగా అష్టదిగ్బంధనం చేయడం పై ఫోకస్
-
పాకిస్థాన్‌కు ఆయుధాలు సరఫరా చేసిన డ్రాగన్ కంట్రీ
-
ప్రయాణికులకు అలెర్ట్.. ఆ నగరాలకు విమానాల రాకపోకలు బంద్!
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగన తలంపై ఆంక్షలు విధించింది. అయితే, భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో,ఎయిరిండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మే 13 నుంచి మే 17 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేసింది. రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిరిండియా మంగళవారం (మే 13) జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తాజా పరిణామాలు, ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొంది.#TravelAdvisoryIn view of the latest developments and keeping your safety in mind, flights to and from Jammu, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot are cancelled for Tuesday, 13th May.We are monitoring the situation and will keep you updated.For more…— Air India (@airindia) May 12, 2025 -
‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్
-
చూపింది శాంపిలే
న్యూఢిల్లీ: దాయాదికి మన సైన్యం మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘‘పాక్ ఇప్పుడు చవిచూసిన తీవ్ర సైనిక నష్టాలు కేవలం శాంపిల్ మాత్రమే. మరోసారి యుద్ధమంటూ వస్తే అది పూర్తి భిన్నంగా, వాళ్లూ ఊహించలేనంత తీవ్రంగా ఉంటుంది’’ అని స్పష్టం చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ (డీజీఏఓ) ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ (డీజీఎన్‌ఓ) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ సోమవారం మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘మన సైనిక వ్యవస్థలు, స్థావరాలు నిరంతరం అప్రమత్తంగా, పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఎలాంటి ఆపరేషన్లౖMðనా క్షణాల్లో రంగంలోకి దిగిపోతాయి’’ అని ప్రకటించారు. ‘‘మనం పోరాడింది కేవలం ఉగ్రవాదులతో. కానీ వారికి దన్నుగా పాక్ సైన్యం రంగంలోకి దిగడం శోచనీయం. ఆ దేశాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో చెప్పేందుకు ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు’’ అని డీజీఏఓ భారతి అన్నారు. మన వైమానిక దాడుల్లో కరాచీ సమీపంలోని మరో కీలక వైమానిక స్థావరం కూడా నేలమట్టమైందని ఆయన వెల్లడించారు. అయితే పాక్ తన అణ్వాయుధ, అణు కమాండ్ వ్యవస్థలను దాచి ఉంచినట్టు చెబుతున్న కిరానా హిల్స్‌పై తాము దాడులు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కూల్చేసిన అత్యాధునిక పాక్ యుద్ధ విమానాల్లో ఒక మిరాజ్ కూడా ఉందని చెప్పారు. అనంతరం దాని తాలూకు శకలాల ఫొటోలను సైన్యం ఎక్స్‌లో షేర్ చేసింది.ఆకాశ్.. హైలైట్మనవి కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలని డీజీఎంఓ రాజీవ్, డీజీఏఓ భారతి గుర్తు చేశారు. పాక్ దాడులను తిప్పికొట్టడంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ హైలైట్‌గా నిలిచిందంటూ కొనియాడారు. ‘‘నిరంతరాయంగా దూసుకొచ్చిన డ్రోన్లను ఆకాశ్, కాస్ వంటి దేశీయ రక్షణ వ్యవస్థలు అడ్డుకుని కూల్చేసిన తీరు మనకు గర్వకారణం. దశాబ్ద కాలంగా మన రక్షణ వ్యవస్థలు సాధించిన అద్భుత ప్రగతికి నిదర్శనం’’ అని చెప్పారు. పాక్‌కు అతి కీలకమైన రహీంయార్ ఖాన్ వైమానిక స్థావరంలో జరిగిన విధ్వంసం తాలూకు వీడియో, ఫొటోలను ఈ సందర్భంగా విడుదల చేశారు. రాజస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఈ స్థావరంలో ఎక్కడ చూసినా భారీ గోతులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రన్‌వేపై అతి భారీ గొయ్యి ఏర్పడింది. దాన్ని పూర్తిగా పూడ్చి సరిచేసేదాకా అక్కడ ఎలాంటి వైమానిక కార్యకలాపాలూ జరిగే అవకాశం లేదు. ఇవన్నీ మన దాడుల తాలూకు కచ్చితత్వానికి తిరుగులేని నిదర్శనాలని డీజీఏఓ భారతి చెప్పారు.యోధుని నోట రాముని మాటపాక్పై దాడులు తదితర వివరాలతో సీరియస్‌గా సాగుతున్న మీడియా భేటీలో డీజీఏఓ భారతి ఉన్నట్టుండి రామయణంలోని వారధి ఉదంతాన్ని ఉటంకించి ఆకట్టుకున్నారు. ‘‘లంకకు వెళ్లేందుకు దారివ్వాలని మర్యాదగా కోరితే సముద్రుడు మూడు రోజులైనా స్పందించలేదు. భయపెట్టనిదే పనికాదంటూ రాముడు ఆగ్రహంతో కోదండం ఎక్కుపెట్టగానే తక్షణం కాళ్లబేరానికి వచ్చాడు’’ అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి రామచరిత్ మానస్‌లోని ‘వినయ్ న మానత్ జలధి...’ పద్య పంక్తులను ఆశువుగా చెప్పి అలరించారు. ‘‘నేనేం చెప్పదలచిందీ అర్థమైందిగా! తెలివైనవాడికి కనుసైగ చాలు’’ అంటూ చమత్కరించడంతో అంతా నవ్వుల్లో మునిగిపోయారు. పాక్ నిరంతర కవ్వింపులు మనం గట్టిగా బదులివ్వక తప్పని పరిస్థితి కల్పించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆది, సోమవారాల్లో సైనిక డీజీల మీడియా బ్రీఫింగ్ సందర్భంగా కూడా రాయబార ఘట్టంలో కౌరవులకు కృష్ణుని హిత వచనాలు, హెచ్చరికలకు సంబంధించిన పద్యాలు, శివతాండవ స్తోత్రం తదితరాలను నేపథ్యంలో విన్పించడం విశేషం.ఎయిర్ డిఫెన్స్‌కు క్రికెట్‌పరంగా భాష్యంమన వైమానిక స్థావరాలను, సైనిక కేంద్రాలను లక్ష్యం చేసుకోవడం అత్యంత కష్టమని డీజీఎంఓ రాజీవ్ స్పష్టం చేశారు. పాక్ దాడుల వేళ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎంత శత్రు దుర్భేద్యంగా నిలిచిందో క్రికెట్ పరిభాషలో వివరించి అలరించారు. ‘‘1970ల్లో జరిగిన ఓ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ద్వయం జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీ ఇంగ్లండ్‌కు వణుకు పుట్టించింది. అయితే జెఫ్, లేకపోతే లిల్లీ అన్నట్టుగా సిరీస్ పొడవునా ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలు చేశారు. ఎస్–400 మొదలుకుని ఆకాశ్, కాస్, ఏడీ గన్స్ దాకా పలు శ్రేణులతో కూడిన మన ఎయిర్ డిఫెన్స్ కూడా అంతే. వాటిలో ఏదో ఒక వ్యవస్థ పాక్ వైమానిక దాడులను దీటుగా అడ్డుకుని పూర్తిగా తిప్పికొట్టింది’’ అని చెప్పారు. సోమవారమే టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటర్ అని చెప్పారాయన. -
పాక్‌కు సైనిక సామగ్రి తరలింపు అబద్ధం: చైనా
బీజింగ్: పాకిస్తాన్‌కు సరుకు రవాణా విమానంలో సైనిక సామగ్రిని తాము సరఫరా చేశామంటూ వస్తున్న వార్తలను చైనా ఖండించింది. ఇటువంటి వదంతులను వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జియాన్ వై–20 రకం విమానంలో పెద్ద మొత్తంలో సామగ్రిని పాకిస్తాన్ తరలించినట్లు ఆన్లైన్లో వస్తున్న వార్తలు అసత్యాలని పేర్కొంది. ‘ఇంటర్నెట్ చట్టానికి అతీతం కాదు. సైనిక సంబంధమైన వదంతులను, అసత్యాలను వ్యాప్తి చేసే వారిని బాధ్యులను చేస్తాం’అని స్పష్టం చేసింది. భారత్‌తో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరాక పాక్‌కు అత్యవసరమైన సామగ్రిని చైనా పంపించిందంటూ ఆన్లైన్లో వార్తలు షికారు చేశాయి. పాక్, చైనాల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. పాక్ ఆయుధ సామగ్రి, వ్యవస్థల్లో ఏకంగా 81 శాతం చైనా నుంచి కొనుగోలు చేసినవేనని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సిప్రి) తెలిపింది. -
కిరానా హిల్స్ కథేంటి ?
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్ కొండప్రాంతంపై బాంబులు వేశారనే వార్తలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. పాకిస్తాన్ అణు స్థావరాల జోలికి వెళ్లలేదని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం స్పష్టంచేశారు. ‘‘ ఆ కొండలో అణుస్థావరం ఉన్నట్లు మాకైతే తెలీదు. ఇప్పుడు మీరు చెప్తేనే తెల్సింది. రహస్యం చెప్పినందుకు థాంక్యూ’’ అని ఏకే భారతి సరదాగా మాట్లాడారు. తర్వాత సీరియస్‌గా సమాధానం చెప్పారు. ‘‘ పాక్ అణుస్థావరాలపై భారత్ ఎలాంటి దాడులు చేయలేదు. ముఖ్యంగా మీరు చెబుతున్న కిరానా న్యూక్లియర్ బేస్‌పై బాంబులు వేయలేదు’’ అని సోమవారం మీడియా ప్రతినిధులకు ఏకే భారతి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఈ కిరానా కొండల గురించి చర్చ మొదలైంది. పాకిస్తాన్ అణుస్థావరాలు భద్రంగా ఉన్నాయా?. వాటిపై నిజంగానే భారత్ దాడులు చేసిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కిరానా హిల్స్ విశేషాల కోసం నెటిజన్లు ఆన్లైన్లో తెగ వెతికేస్తున్నారు. కొండల్లో అణుబాంబులు!?పాకిస్తాన్ తన అణువార్హెడ్లను పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోదా జిల్లాలోని కిరానా కొండల్లో దాచిందని దశాబ్దాల క్రితం వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత వాయుసేన ఇక్కడ కూడా కొన్ని క్షిపణులు, బాంబులను పడేసిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ కొండల్లో పేలుళ్లు వినిపించాయని, కనిపించాయంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రక్షణ శాఖ పరిధిలోని అణు విభాగానికి సంబంధించిన స్థావరం ఈ కొండల్లో ఉందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులుచేయడం తెల్సిందే. రావల్పిండి సమీపంలోని నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పైనా క్షిపణులు వేసింది. ఈ ఎయిర్‌బేస్‌కు అత్యంత సమీపంలోనే పాక్ ‘స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్’ ఉంది. పాక్ అణు వార్హెడ్ల నిర్వహణ బాధ్యతలను ఇదే చూసుకుంటుంది. ఎయిర్‌బేస్‌పై దాడిచేసినప్పుడే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్పైనా భారత్ దాడి చేసిందని వార్తలొచ్చాయి. అదీగాక ముషాఫ్ ఎయిర్‌బేస్‌పైనా భారత్ దాడిచేసింది. ఈ బేస్ అడుగుభాగంలోనే అణువార్హెడ్ల నిల్వకేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. సర్గోదా ఎయిర్‌బేస్‌కు రోడ్డుమార్గంలో కిరానా హిల్స్ కేవలం 20 కి.మీ.ల దూరంలో ఉంది. కుషాబ్ అణుకేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అణ్వాయుధంలో వాడే ప్లుటోనియం తయారీకోసం నాలుగు భారజల రియాక్టర్లు కుషాబ్లో పనిచేస్తున్నట్లు 3 నెలల క్రితం వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదించింది. 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆ కొండప్రాంతంలో 39 కి.మీ.ల పరిధిని మిలటరీ జోన్‌గా పాక్ ఏనాడో ప్రకటించింది. ఇక్కడ బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఇక్కడ స్పెషల్ వర్క్స్ శాఖ 10 సొరంగాలను తవ్వింది. పొరపాటున లోపల పేలుళ్లు జరిగినా సమీప జనావాసాల్లో ప్రాణనష్టం జరక్కుండా సొరంగాల గోడలను అత్యంత మందంగా నిర్మించారని భారత ఆర్మీలో రిటైర్డ్ కల్నల్ వినాయక్ భట్ ఎనిమిదేళ్ల క్రితం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
'అణు'మాత్రం బెదరం!.. దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక
న్యూఢిల్లీ: ‘‘ఉగ్రవాద చర్యలకు ఇకపై ఆపరేషన్ సిందూర్‌తోనే బదులిస్తాం. ఇదే భారత ప్రభుత్వ నీతి. ఇదే మన నూతన విధానం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘దాయాది అణు బెదిరింపులకు దిగితే సహించే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఉగ్రవాదాన్నీ, దానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పాక్ ప్రభుత్వాన్నీ ఇకనుంచి వేర్వేరుగా చూడబోం. పాక్ చర్యలన్నింటినీ ఇకపై ‘సిందూర్’ గీటురాయితోనే పరిశీలిస్తాం. మనపై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డా ‘సిందూర్’ తరహాలో ఆ దేశంపై నిర్ణాయక రీతిలో దాడులు చేస్తాం. జన్మలో మర్చిపోలేని రీతిలో గుణపాఠం నేర్పుతాం’’ అని కుండబద్దలు కొట్టారు. పాక్ ‘అణు’ ఆటలు మనముందు సాగవని ఆ దేశ సైనిక స్థావరాలపై జరిపిన దాడులతో ప్రపంచానికి ఇప్పటికే నిరూపించామన్నారు. ‘‘కశ్మీర్ మంచుకొండల నుంచి రాజస్తాన్ ఎడారుల దాకా పాక్ దాడులన్నింటినీ తిప్పికొట్టాం. కేవలం మన సరిహద్దులపై దాడికి ప్రయత్నించినందుకే దాయాది ఆయువుపట్లను తూట్లు చేశాం. అది గొప్పగా చెప్పుకునే వైమానిక స్థావరాలన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చాం. భారత్‌తో యుద్ధానికి దిగిన ప్రతిసారీ పాక్‌ను మట్టి కరిపించాం’’ అని గుర్తు చేశారు. ఆ విజయ పరంపరలో ఆపరేషన్ సిందూర్‌ను కలికితురాయిగా అభివర్ణించారు. పాక్ ప్రభుత్వం, సైన్యం కలసికట్టుగా దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాద భూతం చివరికి ఆ దేశాన్నే కబళిస్తుందని మోదీ హెచ్చరించారు. ‘‘ఆ దేశం మనుగడ సాగించాలంటే ఉగ్రవాదాన్ని దాని గడ్డపై నుంచి కూకటివేళ్లతో పెకిలించాల్సిందే. దానికి మరో మార్గం లేదు’’ అంటూ హితవు పలికారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... సిందూర్... దేశ భావనకు ప్రతిరూపం ‘‘సిందూరం కేవలం పేరు కాదు. సరైన న్యాయానికి అఖండ ప్రతిజ్ఞ. కోట్లాది భారతీయుల భావనలకు ప్రతిరూపం. ఉగ్రవాదం తాలూకు వికృత రూపమే పహల్గాం దాడి! అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నన్నెంతగానో కలచివేసింది. భార్యాపిల్లల కళ్లముందే ఒక్కొక్కరిని కాల్చి పొట్టన పెట్టుకున్న వికృతత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అందుకు ప్రతీకారం కోసం దేశమంతా ఒక్కటైంది. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. వారు కలలో కూడా ఊహించని విధంగా పాక్, పీఓకేలోని బహావల్పూర్, మురిద్కే తదితర ఉగ్రవాద కేంద్రాలు, శిక్షణ శిబిరాలపై మన సైన్యం విరుచుకుపడి నేలమట్టం చేసింది. అవన్నీ నిజానికి ప్రపంచ ఉగ్రవాద యూనివర్సిటీలు. అమెరికాపై 9/11, లండన్ మెట్రో తదితర దాడులన్నింటికీ అక్కడినుంచే పథకరచన జరిగింది. అలాంటి కేంద్రాలతో పాటు ఉగ్రవాదుల స్థైర్యాన్ని కూడా మన ధ్వంసం చేసింది. దశాబ్దాలుగా పాక్ గడ్డపై బాహాటంగా రొమ్ములు విరుచుకుని సంచరిస్తున్న 100 మందికి పైగా అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చింది. మన మహిళల నుదుటి సిందూరం తుడిపేస్తే ఏమవుతుందో ప్రతి ఉగ్ర ముఠాకూ తెలిసొచ్చేలా చేశాం. ఉగ్రతండాలనే సమూలంగా తుడిచిపెట్టేశాం. కాల్పులకు కేవలం విరామమే ఉగ్ర కేంద్రాలపై మన దాడితో పాక్ బిక్కచచ్చిపోయింది. మన దాడుల్లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. వాటిలో పాక్ సైనిక ఉన్నతాధికారులు బాహాటంగా పాల్గొన్నారు. పాక్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారనేందుకు ఇది తిరుగులేని రుజువు. తన గడ్డ మీది ఉగ్ర శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయనే నిరాశతో పాక్ దుస్సాహసానికి దిగింది. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుంది. కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. పాక్ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి. దాంతో బెంబేలెత్తిపోయి దాయాది కాళ్లబేరానికొచ్చింది. ఎలాగోలా పరువు కాపాడుకునే ప్రయత్నాలకు దిగింది. కాపాడండంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. మే 10న మన పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓకు కాల్ చేశారు. ‘‘ఇకపై మా గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలూ, సైనిక దుస్సాహాసాలూ జరగబోవు’’ అని స్పష్టంగా హామీ ఇచ్చారు. అప్పటికే పాక్ గుండెలపై పుట్టుకొచ్చిన ఉగ్ర తండాలన్నింటినీ మనం నేలమట్టం చేయడమే గాక దాని పీచమణచాం. కనుక వారి అభ్యర్థనపై ఆలోచించాం. అయినా కాల్పులకు కేవలం విరామం మాత్రమే ఇచ్చాం. ఎలాంటి కవి్వంపులకు దిగినా పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పేందుకు మన సైన్యం, వైమానిక, నావికా దళాలు, బీఎస్ఎఫ్ సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఐక్యతే మన శక్తి ఉగ్రవాదాన్ని ఇకముందు ఏమాత్రమూ సహించేది లేదు. మన ఐక్యతే దానికి మరణశాసనం. అదే మన అతిపెద్ద శక్తి. ఇది యుద్ధాల యుగం కాదు. నిజమే. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదని ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి స్పష్టమైన సందేశమివ్వాలి. 21వ శతాబ్దపు అధునాతన యుద్ధ రీతులతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే మెరుగైన సమాజానికి బాటలు పరిచిన వాళ్లమవుతాం.’’ పీఓకేను అప్పగించాల్సిందే ఏ చర్చలైనా ఆ అంశంపైనే ఉగ్రవాదంపై భారత వైఖరి సుస్పష్టమని మోదీ చెప్పారు. ‘‘ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు ఏకకాలంలో కొనసాగలేవు. నీళ్లు, రక్తం కలసికట్టుగా పారడం జరగని పని’’ అని స్పష్టం చేశారు. తద్వారా ఉగ్రవాదానికి పాక్ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేదాకా ఆ దేశంపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తదితర చర్యలు కొనసాగుతాయని చెప్పకనే చెప్పారు. ‘‘ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించి తీరాల్సిందే. పాక్‌తో ఏ చర్చలైనా కేవలం ఈ రెండు అంశాలపైనే జరుగుతాయి. పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నా’’ అంటూ ప్రధాని కుండబద్దలు కొట్టారు. శక్తితోనే శాంతి ‘‘నేను బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి బుద్ధుడు చూపిన శాంతిమార్గం కూడా శక్తి గుండానే సాగుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘ప్రతి భారతీయుడూ శాంతియుతంగా జీవించాలి. వికసిత భారత స్వప్నం సాకారం కావాలి. అందుకు భారత్ శక్తిమంతమైన దేశంగా మారడం తప్పనిసరి. ఆ శక్తిని అవసరమైనప్పుడు ప్రదర్శించి చూపాలి. గత కొద్ది రోజులుగా మనం చేసింది సరిగ్గా అదే. ఆ యజ్ఞంలో భాగస్వాములైన సైనిక బలగాలకు, నిఘా వర్గాలకు, శాస్త్రవేత్తలకు అందరికీ ప్రతి భారతీయుని తరఫునా నా సెల్యూట్. -
దృఢనిశ్చయం
ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వాణిజ్యం అంటే కుదరదని, ఉగ్రవాదానికి ఊతమిస్తూ నీళ్లు కావాలంటే చెల్లదని, ఉగ్రవాదానికి అండదండలందిస్తూ చర్చలంటే అంగీకరించబోమని, అణు బెదిరింపులు తమను భయపెట్టలేవని మోదీ పంపిన సందేశంతోనైనా పాకిస్తాన్ ఇకపై బుద్ధెరిగి ప్రవర్తించాలి. జాతినుద్దేశించి సోమవారం ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతమూ కశ్మీర్ విషయంలో పాక్ తీరుతెన్నులపై భారత్ వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దం పట్టింది. ఒక కొత్త క్రమం బయల్దేరిందన్న సంకేతాన్నిచ్చింది. ఇకపై ఉగ్రవాదులనూ, వారికి సాయం చేసే ప్రభుత్వాన్నీ వేర్వేరుగా పరిగణించబోమని ఆయన ప్రకటించటం ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదు...ప్రపంచ దేశాలన్నీ గమనించాల్సిన అత్యంత కీలక అంశం. కాల్పుల విరమణ తాత్కాలిక దశేనని, ఉగ్రవాదం శిరసెత్తినప్పుడల్లా ‘ఆపరే షన్ సిందూర్’ కొనసాగుతూనే వుంటుందని మోదీ చెప్పటం గమనార్హం. ఉగ్రవాదం విషయంలో అమెరికా నిర్లిప్తంగా ఉంటున్నది. 2001లో తమ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ‘ఉగ్ర వాదంపై యుద్ధం’ పేరిట ప్రపంచంలో ఎక్కడున్నా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని ప్రక టించిన అమెరికా... కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను ఎప్పటికప్పుడు వెనకేసు కొస్తోంది. మొన్నటికి మొన్న పాక్‌కు ఐఎంఎఫ్ అప్పు పుట్టడంలో యథోచితంగా సహకరించింది. దాని చీకటి వ్యవహారాలు తెలియనట్టే ప్రవర్తిస్తూ ఎప్పటికప్పుడు నిధులూ, ఆయుధాలూ ఉదారంగా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతుందని మోదీ ప్రకటించాల్సి వచ్చింది. దారుణ ఉదంతాలు జరిగినప్పుడల్లా ఏదో కారణం చూపి పాకిస్తాన్‌ను గట్టెక్కి స్తున్న దేశాలు ఇకముందు దీన్ని గమనించుకోక తప్పదు. ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా పట్టువిడుపులు ప్రదర్శించటంలోనే పరిణతి వ్యక్తమవుతుంది. ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్‌లోని ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయటంలోనూ, అక్కడి సైన్యం ప్రతిఘటనను తిప్పికొట్టడంలోనూ తెగువనూ, సాహసాన్నీ చూపిన భారత్... లక్ష్యసాధన పూర్తికాగానే కాల్పుల విరమణకు కూడా సిద్ధపడి తన పరిణతిని తెలియజెప్పింది. కానీ విఫల రాజ్యం అనే పేరును సార్థకం చేసుకుంటూ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఆ వెంటనే ఉల్లంఘించి పాక్ తన నైజాన్ని చాటుకుంది. ఆ దేశంలో రాజకీయ నాయకత్వానికీ, సైన్యానికీ ఎప్పుడూ సరైన సంబంధాలు ఉండవన్నది ప్రపంచానికి తెలిసిన సత్యం. కానీ సైనిక దళాలు సైతం ముఠాలుగా చీలివున్నాయని, వాటిపై ఎవరికీ అదుపులేదని తాజా పరిణామాలు నిరూపించాయి. ఈ నిజాన్ని గ్రహించకుండా, పాకిస్తాన్‌కు చీవాట్లు పెట్టకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణు యుద్ధాన్ని నివారించామని స్వోత్కర్షకు పోవటం... భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టడం ఆశ్చర్య కరం. పాకిస్తాన్ చర్యల పర్యవసానం తమ వరకూ రానేరాదన్న భ్రమేదో ఆయనకున్నట్టుంది. కానీ ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేయకపోతే అది ఏ దేశాన్నీ విడవకుండా మింగేస్తుందని ట్రంప్ గ్రహించటం అవసరం. ఉగ్రముఠాలను ప్రోత్సహించి ఊచకోతలను సాగిస్తున్న దేశాన్ని ఎవరైనా ఎలా ఉపేక్షించగలరు? దాని దగ్గర అణ్వాయుధాలున్నాయనీ, అది ముప్పు కలిగిస్తుందనీ... కనుక నోర్మూసుకు పడివుండాలనీ ట్రంప్ చెప్పదల్చుకున్నారా? వాణిజ్యాన్ని ఆపేస్తానని బెదిరించటంవల్ల రెండు దేశాలూ దారికొచ్చి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ఆయన అనటం కూడా అత్యంత అభ్యంతరకరమైంది. ఇలాంటి తర్కంతో ప్రోత్సహిస్తున్నదెవరినో గమనించుకుంటున్నారా? తాను ప్రపంచ దేశాలతో అధిక సుంకాల పేరిట యుద్ధం సాగిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ను నియంత్రించటం లేదు. అక్కడి మారణకాండను ఆపటం లేదు. మరి భారత్–పాక్ విషయంలో ఇంత ఆత్రుత దేనికో? ఎవరూ కోరకుండానే కశ్మీర్ సమస్యలో వేలెడతానని ఆయన తనకు తానుగా ఎలా చెప్పుకుంటారు? 2019లో సైతం ట్రంప్ ఇవే తరహా మాటలు మాట్లాడారు. ఆ తర్వాత జ్ఞానో దయమై ఆ సమస్యను రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకుంటాయని స్వరం మార్చారు. మళ్లీ ఇప్పుడేమైంది? తాజా ఘర్షణలకు మూలం ఎక్కడున్నదో ఆయన గ్రహించలేకపోయారని ట్రంప్ మాటలు గమనిస్తే తెలుస్తుంది. పహల్గామ్లో 26మంది పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ని ప్రారంభించింది. పాక్‌లోని 24చోట్ల ఉగ్రముఠాల స్థావ రాలను ధ్వంసం చేసింది. వందమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. కశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దాడికిది ప్రతీకారమే తప్ప కశ్మీర్ సమస్య పరిష్కారాన్ని ఉద్దేశించి మొదలెట్టిన దాడులు కాదు. అమెరికాకు చిత్తశుద్ధి ఉంటే ఉగ్రవాదులకు ప్రోత్సాహం అందించినంతకాలమూ తమ వైపుగా ఎలాంటి సాయమూ అందబోదని పాకిస్తాన్‌కు చెప్పాలి. ఆ దేశంతో సంబంధ బాంధవ్యాలు కొన సాగించే దేశాలపై కూడా ఆంక్షలుంటాయని ప్రకటించాలి. కానీ అందుకు విరుద్ధంగా ఆ దేశం కారణంగా నష్టపోతున్న భారత్‌నూ, దాన్నీ ఒకే గాటన కట్టడం ఎలాంటి సందేశం పంపుతుంది? ఇరు దేశాల మధ్యా చర్చలంటూ ఉంటే అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనా, ఉగ్రవాదుల అప్పగింతపైనా మాత్రమే ఉంటాయని తన సందేశంలో మోదీ చెప్పటం ప్రశంసించదగ్గది. అమెరికా పోకడలు గమనిస్తే వర్తమాన ప్రపంచంలో ఎలాంటి న్యాయం అమలవుతున్నదో స్పష్టంగానే అర్థమవుతుంది. దశాబ్దాలుగా చీకాకు పెడుతున్న ఉగ్రవాద సమస్యపై మోదీ దృఢ నిశ్చయాన్ని ప్రకటించటం ఈ తరహా న్యాయాన్ని ప్రశ్నించటమే! -
ముక్కలు చేయడమే మార్గం!
క్రమం తప్పకుండా జరుగుతున్న భారీ ఉగ్ర వాద దాడులు భారత్, పాకిస్తాన్ సంబంధాలను ఘోరంగా దెబ్బతీశాయి. సాధారణంగా, ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి దాడులు జరుగుతాయి. ఎక్కువకాలం సైనిక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, పౌర అధికారంపై మరింతగా నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు లేదా అతని బలగాలు దేశంలో గౌరవాన్ని కోల్పోతున్నప్పుడు ఉగ్రవాద దాడులు చోటు చేసుకుంటాయి. భారతదేశం నుండి సైనిక ముప్పు ఉందన్న ప్రచారం కంటే పాకిస్తాన్ ప్రజలను మరేదీ కలిపి ఉంచదు. పైగా వరదలు, కరవులు, ఉగ్రవాద ఘటనలతో సహా పాకిస్తాన్ లో జరిగే ప్రతిదానికీ భారతదేశంపైనే నిందలు మోపుతూ వస్తారు.భారతదేశం మన పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేయాలని చూస్తోందనీ, దాన్ని రక్షించే ఏౖకైక శక్తి పాక్ సైన్యమే అనీ పాక్ ప్రజలకు తొలి నుంచీ నేర్పించారు. భారత్ సహన పరిమితిని దాటిన ప్రతి ఉగ్రవాద ఘటన తర్వాత, పాకిస్తాన్ సాధారణ వ్యాఖ్యలను పునరావృతం చేస్తుంటుంది. వారి మంత్రులు దీనిని భారతదేశం ప్రారంభించిన ‘తప్పుడు’ ఆపరేషన్ అని, లేదంటే ఇది కశ్మీర్ ‘స్వాతంత్య్ర సమరయోధుల’ పని అని గావుకేకలు పెడతారు. తమ గడ్డపైనే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నామనే ఆరోపణను వారు నిరంతరం తిరస్కరిస్తారు. పైగా ఉగ్రవాదానికి అత్యంత ప్రభావి తమైన దేశం తమదే అని వాపోతుంటారు. అయితే దాదాపు ప్రతి ప్రపంచ స్థాయి ఉగ్రవాద ఘటనకూ పాకిస్తాన్‌తో సంబంధం ఉందనీ, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులలో అత్యధికులు పాక్‌లోనే ఆశ్రయం పొందారనీ ప్రపంచానికి తెలుసు.ఎన్నని సహిస్తాం?కథ పునరావృతమవుతుంది. పైగా విసుగు పుట్టిస్తుంది. బహిరంగ అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్ వైపు నుంచి ఎప్పుడూ హామీ ఉంటుంది, కానీ ఈ ప్రతిపాదనను ఎవరూ నమ్మరు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వుర్ రానాను అమెరికా ఇటీవలే భారతదేశానికి అప్పగించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ముంబై ఉగ్రవాద దాడులపై ఇంకా దర్యాప్తు చేయవలసి వస్తోంది. ఉగ్రవాద నాయకులపై పాకిస్తాన్ ఎప్పటికీ చర్య తీసు కోదు. ఎందుకంటే వారే పాక్ ప్రధాన ఆస్తులు. పహల్గామ్ ఉగ్ర దాడిపై దర్యాప్తు కూడా దశాబ్దాలుగా నిగూఢంగా ఉండిపోతుంది. దావూద్ ఇబ్రహీమ్ ఉనికిని అది ఎల్లప్పుడూ ఖండిస్తూ వచ్చింది. అయినప్పటికీ ప్రతి ప్రపంచ సంస్థకూ పాకిస్తాన్ లో అతని బహుళ నివాసాల గురించి తెలుసు. దీనికి విరుద్ధంగా, ప్రతీకారం తీర్చు కుంటామని ఇండియా బెదిరిస్తే, వారు అకస్మాత్తుగా తమ భూ భాగంపై ఉగ్రవాద కార్యకలాపాలలో భారతదేశ ప్రమేయం ఉందని ఇష్టారాజ్యంగా అబద్ధాలాడతారు.ప్రజల మద్దతు పొందాలనే ఆశతో, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంపై భారతదేశాన్ని పాక్ బెదిరించడం ప్రారంభించింది. దాని ఆనకట్టలు భారతీయ రక్తంతో నిండిపోతా యని రెచ్చ గొట్టేంత వరకు వెళ్ళింది. చరిత్ర గమనిస్తే, భారత ప్రభు త్వాలు రావల్పిండిని నియంత్రించడంపై ప్రపంచ మద్దతు కోరుతూ పాకిస్తాన్ ఉగ్రవాద దాడులపై తీవ్ర విమర్శ చేస్తూ వచ్చాయి. కానీ అది ఎప్పుడూ పని చేయలేదు. దీనికి విరుద్ధంగా, తరచుగా విరామాలతో కూడిన ఉగ్రవాద దాడులకు పాక్ తలుపులు తీసింది. 2001 అక్టోబర్‌లో జమ్మూ–కశ్మీర్ శాసనసభపై దాడి, ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో పార్లమెంటుపై దాడి, 2002 సెప్టెంబర్‌లో అక్షరధామ్‌పై దాడి, 2003 ఆగస్టులో ముంబై బాంబు దాడులు, ఆ తర్వాత 2005 అక్టోబర్‌లో ఢిల్లీలో బహుళ బాంబు దాడులు, 2006 జూలైలో ముంబై రైలు దాడులు, 2008 నవంబర్‌లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కొన్ని ఉదాహరణలు. బాలాకోట్‌పై జరిగిన దాడి తర్వాత మాత్రమే భారత్ సందేశం అంతటా వినిపించింది. కానీ సరిహద్దులు దాటి భారత్ చేసిన బాలాకోట్ సర్జికల్ దాడి కూడా పాకిస్తాన్‌ను నిరోధించడంలో విఫలమైంది. ఎందుకంటే భారత్ దాడిలో సంభవించిన ప్రాణనష్టాన్ని పాక్ దాచగలిగింది. కారణం... హతమార్చబడిన వారు ఉగ్రవాదులు!పెద్ద మార్పు ఉండదు!సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన ప్రభావం ఇస్లామాబాద్‌కు బాగా తెలుసు. వారి నాయకత్వాన్ని అది భయ పెట్టింది. కానీ, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని చెప్పడం తప్ప వారికి వేరే పరిష్కారం లేదు. భారతదేశం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని వారు ఇక ఒప్పించలేరు. రెండు దేశాల మధ్య సంబంధాలు శాంతియుతంగా ఉండాలనే ముందస్తు షరతు పైనే ఈ ఒప్పందంపై సంతకం చేశారనేది వాస్తవం. మరోవైపున అఫ్గానిస్తాన్‌కు భారతదేశం సన్నిహితం కావడం పాకిస్తాన్లో ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా పాకిస్తాన్ తన బలగాలను భారత సరిహద్దుకు తరలించినప్పుడల్లా బలోచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ ఈ అంతరాన్ని బాగా ఉపయోగించు కుంటాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట పాకి స్తాన్ తన సైన్యాన్ని మోహరించి ఉంచినంత కాలం, వారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భారత్ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, అది ఏ సైనిక చర్య తీసుకున్నా, పెద్దగా మార్పు ఉండదు. పాక్‌లో కొత్త ఆర్మీ చీఫ్ వచ్చి తనవంతుగా ఏదైనా చేయాలని భావించే వరకు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తక్కువ స్థాయిలో మద్దతు ఇస్తూనే ఉంటుంది. తర్వాత, మరొక ఘటన జరుగుతుంది. కథ పునరావృతమవుతూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని రక్షించడానికి ఏకైక పరిష్కారం దాని బాల్కనైజేషన్ మాత్రమే (అంటే ఒక దేశం లేదా ప్రాంతాన్ని బహుళ చిన్న, శత్రు యూనిట్లుగా విభజించే ప్రక్రియ). దీని కోసం, పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమూహాలకు భారతదేశం తన మద్దతును ఇవ్వాలి.హర్ష కక్కడ్ వ్యాసకర్త భారత సైన్యంలో రిటైర్డ్ మేజర్ జనరల్(‘ద స్టేట్స్‌మన్’ సౌజన్యంతో) -
మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్, పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో దూసుకొచ్చిన పాకిస్థాన్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్‌లోని పలు జిల్లాల్లో అధికారులు బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు.ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత పాకిస్థాన్ రెచ్చిపోయింది. వాస్తవాధీన రేఖ వెంట పాక్ కాల్పులకు తెగబడింది. డ్రోన్లను భారత్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చివేసింది. హోషియార్‌పూర్‌లో సైరన్లు మోగాయి. సాంబా, ఆర్నియాలో డ్రోన్ కదలికలను గుర్తించారు. #WATCH | J&K: Red streaks seen and explosions heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Samba.(Visuals deferred by unspecified time) pic.twitter.com/EyiBfKg6hs— ANI (@ANI) May 12, 2025 -
చావుదెబ్బ తిన్నా, విజయోత్సవ ర్యాలీ అంటూ హడావుడి చేసిన అఫ్రిది.. వైరల్ వీడియో
గత వారం రోజులుగా పాక్‌తో జరిగిన యుద్దంలో భారత్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో యుద్దం ముగిసింది. సీస్ ఫైర్ ఒప్పందం తర్వాత కూడా పాక్ కొన్ని గంటల పాటు భారత్‌పై దాడులకు తెగబడింది. ఎట్టకేలకు నిన్నటి నుంచి పాక్ అన్నీ మూసుకుని కామ్‌గా కూర్చుంది. యుద్దానికి పుల్‌స్టాప్ పడిన తర్వాత పైచేయి సాధించిన భారత్ ఎలాంటి గొప్పలకు పోకుండా తమ పని తాము చేసుకుని పోతుండగా.. భారత దళాల చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ మాత్రం హడావుడి చేస్తుంది. Shahid Afridi leading a so called 'victory rally' in Karachi. - Just like their army, everyone is delusional. pic.twitter.com/OnHRvmbzax— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2025భారత్‌పై యుద్ధం గెలిచామని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గొప్పలు చెప్పుకోగా.. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ఓ అడుగు ముందుకేసి కరాచీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో అఫ్రిది కారు పైకప్పుపైకి ఎక్కి ఏదో సాధించామన్నట్లు ఫోజులు కొడుతూ కనిపించాడు. అతని వెనుక పలువురు పాకిస్తాన్ జెండాలతో కనిపించారు. ఈ వీడియోపై భారతీయులు భగ్గుమంటున్నారు. చావు దెబ్బ తిన్నా సిగ్గులేకుండా విజయోత్సవ ర్యాలీ ఎలా జరుపుకుంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా అఫ్రిది భారత్‌పై నోరు పారేసుకున్నట్లు తెలుస్తుంది. భారత సైన్యమే ముందుగా పాక్‌పై దాడి చేసిందని అఫ్రిది అన్నాడట. భారత దాడులను పాక్ బలగాలు తిప్పికొట్టాయని బిల్డప్ ఇచ్చాడట. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా అవాక్కులు చవాక్కులు పేలాడట. దయ్యాలు వేదాలు వల్లించినట్లు తాము శాంతికాముకులమని ప్రకటించుకున్నాడట.అఫ్రిది భారత్‌పై, భారత సైన్యంపై కొద్ది రోజుల కిందట కూడా ఇలాంటి చెత్త వాగుడే వాగాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని అన్నాడు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్ విసిరాడు.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్ దాడులకు పాక్ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి. -
భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని నేనే ఆపా: ట్రంప్
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని నేనే ఆపా. అణుయుద్ధం జరిగి ఉంటే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారు. అందుకే అణుయుద్ధాన్ని ఆపేలా భారత్-పాక్‌లపై ఒత్తిడి తెచ్చా. యుద్ధం కొనసాగిస్తామంటే మీతో వ్యాపారం చేయనని చెప్పా. దీంతో ఆ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దాయాది దేశాల కాల్పుల విరమణ క్రెడిట్ నాదే’ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు యుద్ధం విషయంలో ప్రస్తుతం భారత్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు. త్వరలో పాక్‌తో కూడా మాట్లాడుతానని వివరించారు. #WATCH | US President Donald Trump says, "...I'm very proud to let you know that the leadership of Indian and Pakistan was unwavering and powerful, but unwavering in both cases - they really were from the standpoint of having the strength and the wisdom and fortitude to fully… pic.twitter.com/rFbznHMJDF— ANI (@ANI) May 12, 2025 -
ఆపరేషన్ సిందూర్ పై మోదీ కీలక ప్రకటన
-
ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు: పీఎం మోదీ
ఢిల్లీ : ‘మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై తొలిసారి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 8గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు’ అని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి.భారత సైన్యానికి,సైంటిస్టులకు నా సెల్యూట్. పహల్గాంలో ఉగ్రవాదుల అరాచకం ప్రపంచాన్ని కలిచి వేసింది. పహల్గాం ఘటన నన్ను వ్యక్తి గతం కలిచివేసింది. మా తల్లుల నుదుటున సిందూరం చెరిపేస్తే ఏం జరుగుతుందో చేసి చూపించాం.ఉగ్రవాదులు కలలో కూడా దాడిని ఊహించి ఉండరుపహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకుల్నిటార్గెట్ చేశారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేసేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.ఆపరేషన్ సిందూర్ అంటే పేరు కాదు, ఆవేదన. ఆపరేషన్ సిందూర్ అంటే ప్రతిజ్ఞ. ఏడో తేదీన తెల్లవారున ఈ ప్రతిజ్ఞ నెరవేరడం ప్రపంచమంతా చూసింది. పహల్గాం ఘటన తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాంభారత సైన్యం ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్లను ధ్వంసం చేసింది. భారత డ్రోన్లు ఉగ్రవాదుల స్థావరాల్ని మట్టిలో కలిపేశాయి. వందమంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాం. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ బెంబేలెత్తిపోయింది. పాక్ గుండెలపై భారత సైన్యం దాడి చేసింది. భయంతో,రక్షణ కోసం పాకిస్తాన్ ప్రపంచ దేశాలను ఆశ్రయించిందిపాక్ శరణు గోరిందిఈ నెల 10 భారత్ డీజీఎంవోను పాక్ శరణు గోరింది. మరోసారి ఉగ్రవాద చర్యలకు పాల్పడబోమని,సైన్యంపై కాల్పులు జరపొద్దని ప్రాధేయపడింది. 3రోజుల్లో పాక్‌పై ఊహకందని విధంగా దాడి చేశాం. ఎడారి,కొండలు,ఆకాశంలో పాక్‌ను వదిలిపెట్టలేదు. యుద్ధరంగంలో ప్రతిసారి పాక్‌ను మట్టి కరిపించాం. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌ను ఓడించాం.ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాంఅణ్వాయుధాల బ్లాక్ మెయిల్‌ను ఇక సహించేది లేదు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. అదే ఉగ్రవాదం చేతిలో అంతమవుతుంది. ఈ యుద్ధంలో మేకిన్ ఇండియా ఆయుధాలు బాగా పనిచేశాయి. చనిపోయిన ఉగ్రవాదుల్ని చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీన్ని బట్టి పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారని అర్ధమవుతుంది. ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేశాం. భవిష్యత్‌లో పాక్ చర్యను బట్టి భారత్ అదే స్థాయిలో స్పందిస్తోంది.నీరు,రక్తం కలిసి పారలేవు ఉగ్రవాదం,వాణిజ్యం కలిసి సాగలేవు. నీరు,రక్తం కలిసి పారలేవు. పాక్‌తో చర్చించాల్సింది పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే. మన ఐక్యతే.. మన శక్తి.ఈ రోజు బుద్ధపూర్ణిమ. బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపాడు.అదే మనకు ఆదర్శం అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ఆపరేషన్ సిందూర్‌ను పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత్ -పాకిస్తాన్ల మధ్య మూడురోజుల పాటు భీకర కాల్పులు జరిపాయి. భారత్ జరిపిన భీకర దాడులకు పాకిస్తాన్ తోక ముడిచింది. కాల్పులు జరపొద్దంటూ భారత్‌ను ప్రాధేయపడింది. కాల్పుల విరమణతో ఇరుదేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. Prime Minister Narendra Modi will address the nation at around 8 PM today. pic.twitter.com/NobQiY66Nh— ANI (@ANI) May 12, 2025ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహించారు. రక్షణ శాఖ,విదేశాంగ శాఖ, త్రివిధ దళాదిపతులతో ఆపరేషన్ సిందూర్ గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. -
పాకిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం
పాకిస్థాన్‌లో ఇవాళ మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికి పలు ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. భూకంప కేంద్రం తజికిస్తాన్లోని అష్కాషెమ్కు పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది.కాగా, అంతకుముందు.. ఈ నెల 10న భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళనకు గురైన పాకిస్థాన్ ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. తాజాగా, మరో భూకంపం రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎన్సీఎస్ నివేదిక ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని.. 29.67 డిగ్రీల ఉత్తర అక్షాంశం... 66.10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద నమోదైంది. -
ఉగ్రవాదులతోనే మా పోరాటం
-
DGMO press briefing: పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఏర్పాటు చేసిన త్రివిధ దళాల డీజీఎంవోల (director general of military operations) మీడియా సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మాట్లాడిన డీజీఎంవోలు ఆపరేషన్ తీరుతెన్నుల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల డీజీఎంవోలు మాట్లాడుతూ.. ఉగ్రవాదులతోనే మా పోరాటం. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాం. ఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్.కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోంది. ఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోంది. అందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాం. ఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్‌దే. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్‌తో పాకిస్తాన్‌ను అడ్డుకున్నాం. #WATCH | Delhi | Air Marshal AK Bharti presents the composite picture of targets engaged by the Indian Air Force during #OperationSindoor pic.twitter.com/hBNJAFyLTD— ANI (@ANI) May 12, 2025 పాక్ వివిధ రాకల డ్రోన్లను వినియోగించింది. మనం దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్‌తో అడ్డుకున్నాం. చైనా తయారు చేసిన పీ-15 మిసైళ్లతో పాక్ భారత్‌పై దాడి చేసింది. వాటిని మనం ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతో శత్రువును అడ్డుకున్నాం. పాకిస్తాన్‌లోని నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. ఈ దాడిలో నూర్ఖాన్ ఎయిర్‌బేస్ పూర్తిగా ధ్వంసమైంది. సైనికులనే కాకుండా యాత్రికులను, భక్తులను టార్గెట్ చేసింది ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాల్ని మార్చుకుంటున్నారు. లాంగ్ రేంజ్ మిసైళ్లతో శత్రు స్థావరాలపై ప్రయోగించాం. 9,10వ తేదీలలో పాకిస్తాన్ భారత్‌లోని వైమానిక స్థావరాల్ని టార్గెట్ చేసింది. పాకిస్తాన్‌కు సాధ్యం కాలేదు. మనకు ఎలాంటి నష్టం జరగకుండా పక్కా స్ట్రాటజీతో ఎయిర్ డిఫెన్స్‌ను వినియోగించాం. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఓ వైపు పాక్ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేస్తూనే.. మన ఎయిర్ బేస్‌లను సురక్షితంగా ఉండేలా చూసుకున్నాం. ఆపరేషన్ సిందూర్‌ను త్రివిధ దళాలు సమన్వయంతో కలసి పనిచేశాయి. దేశ ప్రజలంతా మాకు అండగా నిలిచారు’ అని వ్యాఖ్యానించారు. -
భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా
-
కాళ్లబేరానికి పాక్.. భారత్ డిమాండ్లు ఇవే
-
పాకిస్తాన్ ఒప్పుకోవాల్సిందే! DGMOల మీటింగులో మోదీ మాస్టర్ ప్లాన్
-
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?.. ఆర్మీ మాజీ చీఫ్ సీరియస్
ఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై పెదవి విరుస్తున్న వారికి నరవణే కౌంటర్ ఇచ్చారు. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటో ఎవరికైనా తెలుసా? అని ప్రశ్నించారు.ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే తాజాగా మాట్లాడుతూ.. ‘భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై అందరూ మాట్లాడుతున్నారు. అసలు యుద్ధం అంటే ఏం తెలుసా?. యుద్ధమంటే బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?. యుద్ధం అంత రొమాంటిక్‌గా ఉండదు. యుద్ధానికి వెళ్లడానికి నేను సిద్ధమే అయినా దౌత్యాన్ని తొలి అవకాశంగా చూస్తాను. యుద్ధం అనేది మనం ఎంచుకునే చివరి అవకాశంగా ఉండాలి. అందుకే ప్రధాని మోదీ ఇది యుద్ధాల శకం కాదని చెప్పారు. తెలివితక్కువ వాళ్ల వల్ల బలవంతంగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినా.. దాన్ని నివారించేందుకే మనం మొగ్గు చూపాలి. ఇప్పుడు చాలామంది పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నిస్తున్నారు. సైన్యంలో పనిచేసిన వ్యక్తిగా.. చర్చలతోనే సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటాను. యుద్ధం వల్ల సరిహద్దు గ్రామాల ప్రజల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం బిక్కుబిక్కుమంటూ రాత్రి పూట ఆశ్రయ కేంద్రాలకు పరిగెత్తాల్సి పరిస్థితులు ఉంటాయి. ఇవేవీ మిగతా వారికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. కొన్నిసార్లు దాడుల కారణంగా పిల్లలు సైతం తీవ్రంగా గాయపడతారు. యుద్ధం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. యుద్ధమంటే ఖరీదైన వ్యాపారం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆపరేషన్ సిందూర్‌పై మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో, ఆయన కామెంట్స్‌పై తీవ్రమైన చర్చ జరిగింది.మరోవైపు.. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఈ ఒప్పందానికి భారత్ ఎందుకు ఒప్పుకుందని అటు ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా భారత్‌కు జరిగిన లాభమేంటి? అని కామెంట్స్ చేశారు. -
ఈ ఛాన్స్ వదలొద్దు.. దేశం కోసం యుద్ధం చేయాల్సిందే! మోదీ వెనక్కి తగ్గొద్దు
-
ఇవాళ భారత్-పాక్ మధ్య హాట్ లైన్ లో చర్చలు
-
ముగిసిన భారత్-పాక్ DGMOల తొలిరౌండ్ చర్చలు
DGMO Meeting Updatesఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా భారత్-పాక్ దేశాల మధ్య తొలిదశ చర్చలు జరిపాయి. హాట్‌లైన్ ద్వారా జరిపిన చర్చల్లో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. సుమారు గంటపాటు కొనసాగింది. భారత్ తరపున సమావేశంలో పాల్గొన్న ఇరు దేశాల డీజీఎంవోల సమావేశంలో కాల్పుల విరమణపై విధివిధానాలపై చర్చించారు. ఉగ్రవాదులతోనే మా పోరాటం: అంతకుముందుకు ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల డీజీఎంవో (director general of military operations) మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో డీజీఎంవోలు మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులతోనే మా పోరాటంమనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నాంఉగ్రవాదులు,వారి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్కానీ పాకిస్తాన్ తమపై దాడి చేస్తున్నామని భావిస్తోందిఉగ్రవాదానికి అండగా పాక్ నిలుస్తోందిఅందుకే మేము పాకిస్తాన్‌పై దాడి చేశాంఏ నష్టం జరిగిన దీనికి బాధ్యత పాకిస్తాన్దేచర్చలు వాయిదా.. భారత్, పాకిస్తాన్ డీజీఎంవోల చర్చలు వాయిదా. ఈరోజు సాయంత్రం చర్చలు జరిగే అవకాశం. సాయంత్రం ఐదు గంటలకు ఇరు దేశాల డీజీఎంవోల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. హాట్‌లైన్ ద్వారా రెండు దేశాల డీజీఎంవోలు చర్చలు జరపనున్నారు. చర్చలు ప్రారంభం..భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు ప్రారంభం,హాట్లైన్లో భారత్, పాక్ డీజీఎంవోల చర్చలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ..ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశంసమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో కీలక భేటీ 👉భారత్-పాక్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో కాసేపట్లో(మధ్యాహ్నం 12 గంటలకు) కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.👉ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో గత రాత్రి సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణను పాకిస్తాన్ రేంజర్స్ అతిక్రమించలేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు సైతం పాల్పడలేదు. అయితే, పాకిస్తాన్ నమ్మలేమని.. అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి.👉ఇక, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు డీజీఎంవో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై మీడియాకు ఆయన వివరించనున్నారు. Delhi | Media briefing by Director General Military Operations of All Three Services - Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM— ANI (@ANI) May 12, 2025👉ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్థాన్ డీజీఎంవో హాట్ లైన్లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. కాగా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైన తీవ్రమైన ప్రతిదాడి తప్పదని భారత్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తూటా కాలిస్తే.. భారత్ ఫిరంగి గుండు పేల్చాలని ప్రధాని మోదీ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు. -
పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి.. పలువురు పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. దాయాది దేశం పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్తాన్లో తాజాగా ఆత్మాహుతి దాడి ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాకిస్తాన్ పోలీసులు మృతిచెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. An explosion near Ring Road, Mal Mandi in Peshawar, the capital of Khyber Pakhtunkhwa, leaves two dead and three injured. pic.twitter.com/oIwp31n0Sq— Aftab Mohmand (@AftabMohmand101) May 12, 2025 -
లాస్ట్ పంచ్.. బ్రహ్మోస్ మిస్సైల్ తో దెబ్బ అదుర్స్..
-
ఉచ్చులోకి దించి.. మాట మార్చి!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, గూఢచర్యం, వీరికి సహాయ సహకారాలు అందించడం కోసం పాకిస్థాన్ తన దేశీయుల్ని భారత్‌లోకి పంపిస్తూనే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ పట్టుబడితే వారిని తమ దేశీయుడని అంగీకరించడానికి మాత్రం వెనకడుగు వేస్తోంది. కొందరిని మాత్రమే తమ జాతీయులని అంగీకరిస్తూ.. మిగిలిన వారితో తమకు సంబంధం లేనట్లు చేతులు దులుపుకొంటోంది. ఈ కారణంగానే 2004లో నమోదైన కేసులో 2013లో అరెస్టు అయి, 2015లో ఆ కేసు వీగిపోయినా 76 ఏళ్ల వయసున్న పాకిస్థానీ షేర్ అలీ కేశ్వానీ ఇప్పటికీ చర్లపల్లి కేంద్రం కారాగారంలో మగ్గుతున్నాడు. ఐఎస్ఐ ఆదేశాలతో వచ్చిన అర్షద్... పాకిస్థాన్‌లోని రహీమైఖర్‌ఖాన్ జిల్లా ఖాన్పూర్కు చెందిన అర్షద్ మహమూద్ అలియాస్ అర్షద్ మాలిక్‌ను 2002 నవంబరులో పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అధికారులు ఫీర్జీ, లియాఖత్ సంప్రదించారు. మూడు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి, భారత ఆర్మీ యూనిట్ల సమాచారం అందించడానికి సిద్ధం చేశారు. అర్షద్‌కు పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ఇచ్చి బంగ్లాదేశ్ పంపారు. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లు అర్షద్ పేరుతో బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ ఇచ్చి 2003 మార్చిలో బెహ్‌రామ్‌పూర్ మీదుగా కోల్‌కతా పంపారు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని 2003 జూలైలో పాస్‌పోర్ట్ అందుకున్నాడు. దీంతో సిటీకి వచ్చిన అర్షద్ ముత్యాల్‌బాగ్‌లో మకాం ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టుపక్కల వారితో తాను వైద్య పరికరాలు అమ్మే చిన్న వ్యాపారినంటూ, కోల్‌కతా నుంచి వచ్చినట్లు చెప్పుకొన్నాడు. 2004లో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. నగరంలోని భద్రతా బలగాలకు చెందిన సున్నిత ప్రాంతాల్లో తిరిగి, వివరాలు సేకరించే అర్షద్ మాలిక్ రాత్రి వేళల్లో వాటిని ఐఎస్ఐకి పంపేవాడు. కింగ్‌కోఠి అగర్వాల్ చాంబర్స్‌లో ఉండే హైదరాబాద్ సైబర్ కేఫ్ నుంచి ఈ–మెయిల్స్ ద్వారా షేర్ చేసేవాడు. ఇందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్ నుంచి ఫీర్జీ హవాలా ద్వారా ఎప్పటికప్పుడు ఇతనికి సొమ్ము పంపేవాడు. 2004 మార్చి 9న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ పోలీసులు సైబర్ కేఫ్‌లో ఉన్న అర్షద్‌ను పట్టుకున్నారు. ఇతడి నుంచి ఆర్మీ లొకేషన్స్ ఫొటోలు, సికింద్రాబాద్–హైదరాబాద్‌ల్లో ఉన్న ఆర్మీ లొకేషన్స్ స్కెచ్‌లు, ఆర్మీ అధికారుల టెలిఫోన్ డైరెక్టరీలు స్వా«దీనం చేసుకున్నారు. తొలుత అబిడ్స్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసుల ఆ తర్వాత సిట్‌కు బదిలీ అయింది. ఇతడి విచారణలో వెలుగులోకి .. అర్షద్ విచారణ నేపథ్యంలోనే ఇతడికి షేర్ అలీ కేశ్వానీ అనే పాకిస్థానీ సహకరించినట్లు వెలుగులోకి వచి్చంది. ఇతడిని ఉగ్ర ఫైనాన్షియర్‌గా మార్చిన పాకిస్థాన్.. భారత్‌కు పంపింది. ఇక్కడ ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు ఆర్థిక సాయం చేస్తున్న కేశ్వానీని ఆగ్రా పోలీసులు 2004 జనవరిలోనే అరెస్టు చేశారు. అక్కడ కేసు విచారణ పూర్తికావడం, జైలు శిక్ష సైతం విధించడంతో సుదీర్ఘకాలం సిటీకి తీసుకురాలేకపోయారు. అర్షద్‌కు నాంపల్లి కోర్టు 2009లో జీవితఖైదు విధించింది. కేశ్వానీని నగర పోలీసులు 2013లో ఇక్కడికి తీసుకువచ్చారు. 2015 మార్చి 9న ఇతడిపై ఉన్న కేసు వీగిపోయింది. ఇలాంటి వాళ్ల శిక్షాకాలం పూర్తయినా, కేసు వీగిపోయినా జైలు నుంచి బయటకు పంపాలంటే పాకిస్థాన్ సదరు వ్యక్తి తమ పౌరుడే అని అంగీకరించాలి. అర్షద్ తమ జాతీయుడేనని అంగీకరించడంతో 2017లో అతడిని పాక్‌కు పంపేశారు. కేశ్వానీ విషయంలో ఇలా జరగకపోవడంతో ఇప్పటికీ చర్లపల్లి జైలులోనే ఉన్నాడు. -
భారత్ సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఆపరేషన్ సిందూర..
-
తూటా పేలిస్తే క్షిపణితో బదులిస్తామని పాక్ కు ప్రధాని మోదీ హెచ్చరిక
-
అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్ అధికారిక ప్రకటన
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. భారత ముప్పెట దాడి చేస్తూ పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ యుద్ధ విమానంపై అటాక్ చేయడంతో అది ధ్వంసమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళ సీనియర్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల భారత్ జరిపిన దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానం ధ్వంసమైందని అధికారికంగా ప్రకటించారు. భారత్ దాడులను ఎదుర్కొనే క్రమంలో ఇలా జరిగిందన్నారు. అయితే నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, భారత్-పాకిస్తాన్ మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఇదే సమయంలో భారత పైలట్.. పాకిస్తాన్ సైన్యానికి పట్టుబడ్డారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చౌదరి స్పందించారు. ఇది ఫేక్ వార్త అని ఖండించారు. భారత్ పైలట్ ఎవరూ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. అలాగే, భారత్ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు. పాక్‌ను దెబ్బకొట్టాం..మరోవైపు.. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్ విమానాలను నేల కూల్చామని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి తెలిపారు. అయితే, ఆ సంఖ్య ఎంత అన్నది ఆయన చెప్పలేదు. ‘‘మన సరిహద్దు లోపలికి పాక్ యుద్ధవిమానాలను రాకుండా నిరోధించాం. కాబట్టి వాటి శకలాలు మా దగ్గర లేవు. కాకపోతే కచ్చితంగా కొన్ని విమానాలను కూల్చాం’’ అని తెలిపారు.బ్రహ్మోస్ సూపర్ పవర్..ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో.. అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్‌లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. -
నేనూ సైన్యంలో చేరతా
ఝున్ఝును: పెద్దయిన తరువాత తానూ సైన్యంలో చేరతానని, తన తండ్రి ప్రాణాలు తీసిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని పాక్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడు సురేంద్ర సింగ్ మోగా కూతురు వర్తిక ప్రతిజ్ఞ చేసింది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ శనివారం జరిపిన డ్రోన్ దాడుల్లో జమ్మూ కశ్మీర్‌లోని ఉద్ధంపూర్ వైమానిక స్థావరంలో విధులు నిర్వహిస్తున్న రాజస్థాన్‌కు చెందిన జవాను సురేంద్ర సింగ్ మోగాతోపాటు బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. పాక్ డ్రోన్ శకలం ఢీకొని సురేంద్ర మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ‘‘శనివారం రాత్రి 9 గంటలకు కూడా నాన్నతో మాట్లాడా. ఆకాశంలో పాక్ డ్రోన్లు తిరుగుతున్నాయని, తాము బాగానే ఉన్నామని నాతో చెప్పాడు. అంతలోనే ఇలా జరిగింది’’ అంటూ 11 ఏళ్ల వర్తిక విలపించింది. తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడైనందుకు గర్వంగా ఉందని చెప్పింది. పాక్ పేరు కూడా వినపడని రీతిలో అంతం కావాలని ఆకాంక్షించింది. ‘‘నా తండ్రి ప్రాణా లు తీసిన పాక్‌ను వదలను. సైన్యంలో చేరి వాళ్లను ఒకరి తర్వాత ఒకరిగా ఖతం చేస్తా’’ అని చెప్పింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సురేంద్రకు నాలుగు రోజుల కిందట సరిహద్దుకు రావాలని పిలుపు వచి్చంది. దీంతో తన భార్య, 11 ఏళ్ల వర్తిక, 7 ఏళ్ల కొడుకు ద„Š ను స్వస్థలమైన రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా మెహ్రదాసికి పంపించాడు. అంనతరం తాను ఉద్ధంపూర్కు బయల్దేరి వెళ్లాడు. అయితే ఊర్లోని కొత్త ఇల్లు గృహప్రవేశానికి వస్తాడనుకున్న కొడుకు.. త్రివర్ణ పతకాన్ని కప్పుకొని నిర్జీవంగా రావడంతో సురేంద్ర తల్లి కుప్పకూలిపోయింది. ధైర్యవంతుడైన సురేంద్రకు వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గ్రామంలో నెలకొన్న ఉద్విగ్నభరిత వాతావరణంలో, ఆదివారం అధికారిక లాంఛనాలతో సురేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
అన్నివిధాలా పైచేయి
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే. లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశీ్మర్ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్ హాహాకారాలు పాక్ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్ సిందూర్ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్ తేల్చిచెప్పింది. -
పాక్‌ను చావుదెబ్బ కొట్టాం రాజధానిపైనే దాడి చేశాం
న్యూఢిల్లీ: త్రివిధ బలగాలు నాలుగు రోజుల పాటు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్తాన్ కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నట్టు భారత సైన్యం వెల్లడించింది. పాక్ సైన్యం అత్యంత తీవ్రస్థాయిలో నష్టాలు చవిచూసిందని తెలిపింది. ఇకముందు కూడా పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేసింది. ‘‘పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. కానీ గంటల్లోనే ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం కాల్పులు, దాడులకు దిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే మన ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. మన బలగాలు అందుకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు దీటుగా స్పందించేందుకు బలగాలకు సైన్యాధ్యక్షుడు పూర్తి అధికారాలిచ్చారు’’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ప్రకటించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్(డీజీఏఓ) ఎయిర్ మార్షల్ ఏకే భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్(డీజీఎన్‌ఓ) వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్‌తో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, తదనంతరం సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులు, మన సైనిక ప్రతిచర్య తదితరాల అంశాలను కూలంకషంగా వివరించారు. మొత్తం ఆపరేషన్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులైనట్లు వెల్లడించారు. అమర జవాన్లకు, పాక్ మతిలేని దాడుల్లో దుర్మరణం పాలైన భారత పౌరులకు ఘనంగా నివాళులు అరి్పంచారు. సైనిక ఆపరేషన్ల గురించి త్రివిధ దళాల అత్యున్నతాధికారులు ఇలా సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించడం అత్యంత అరుదు కావడం విశేషం. ఆ ముష్కరులు హతం ‘‘పలు అత్యాధునిక పాక్ యుద్ధ విమానాలను నేలకూల్చాం. మనకున్న సమాచారం మేరకే 40 మందికి పైగా పాక్ సైనికులు మరణించారు. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కరడుగట్టిన ఉగ్రవాదులు యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ తదితరులు ఉన్నారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినవారు, 2019లో పుల్వామా దాడికి పాల్పనవారు మరణించారు. పాక్, పీఓకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ ఉగ్రవాద శిక్షణ పొందిన కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కూతవేటు దూరంలోని అతి కీలకమైన చక్లాలా సహా ప్రధాన వైమానిక స్థావరాలన్నీ మన దాడుల్లో కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. లాహోర్ తదితర సైనిక స్థావరాల్లోని కీలక రాడార్ వ్యవస్థలు నేలమట్టమయ్యాయి. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు’’ అని డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ వివరించారు. ఇకపై తమ భూభాగంలో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని పాకిస్తాన్‌కు పూర్తిస్థాయిలో తెలిసొచ్చిందన్నారు. ‘‘మనం ఎంతో సంయమనం పాటించాం. కేవలం పాక్ ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని కచ్చితత్వంతో కూడిన దాడులు చేశాం. సామాన్య ప్రజల నివాసాలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తపడ్డాం. మన దేశ సార్వ¿ౌమత్వం ప్రాదేశిక సమగ్రతకు, పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లినా నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’’ అని ఉద్ఘాటించారు. పాకిస్తాన్ డీజీఎంఓ శనివారం మధ్యాహ్నం తనతో మాట్లాడారని, దాడులు ఆపాలని కోరారని తెలిపారు. ఉగ్రవాద క్యాంపులు భస్మీపటలం పాక్ దాడుల్లో భారత్ కూడా యుద్ధ విమానాలు నష్టపోయిందా అని ప్రశ్నించగా, యుద్ధంలో కొన్ని నష్టాలు సహజమని ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి బదులిచ్చారు. అయితే, ‘‘లక్ష్యాలన్నీ సాధించాం. మన పైలెట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు’’ అని చెప్పారు. ‘‘పాక్ యుద్ధ విమానాలు మన భూభాగంలోకి ప్రవేశించకుండా తిప్పికొట్టాం. అయితే, కచ్చితంగా ఎన్ని యుద్ధ విమానాలు కూల్చేశామన్నది ఇప్పుడే బయటపెట్టలేం. పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు, కమాండ్ సెంటర్లు, సైనిక మౌలిక సదుపాయాలు, గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేశాం. పాక్ రాజధాని ఇస్లామాబాద్ దాకా చొచ్చుకెళ్లాం. అక్కడ వైమానిక స్థావరాన్ని నేలమట్టం చేశాం. ఉగ్రవాదుల క్యాంప్‌లను నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యం ఇప్పటికే సాధించాం. ఈ ఫలితాలు మొత్తం ప్రపంచానికి అనుభవంలోకి వస్తాయి’’ అని ఎ.కె.భారతి స్పష్టం చేశారు. పాక్ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని ఫొటోల సాయంతో వివరించారు.పాక్ హార్బర్లకు తీవ్ర నష్టం ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా సముద్రంతోపాటు భూఉపరితలంపై నిర్దేశిత లక్ష్యాలపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేశామని వైస్ అడ్మిరల్ ఎ.ఎన్.ప్రమోద్ చెప్పారు. పాకిస్తాన్లో ప్రధానమైన కరాచీలోనూ దాడులు జరిగాయని తెలిపారు. ‘‘పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం మేము అప్రమత్తమయ్యాం. అరేబియా సముద్రంలో లైవ్–ఫైరింగ్ డ్రిల్స్, లాంచ్ టెస్టులు, కాంబాట్ ఆపరేషన్ డ్రిల్స్ నిర్వహించాం. పాకిస్తాన్ ముష్కరులకు గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో మా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. మన సైనిక దళాలు అరేబియా సముద్రంలో నిత్యం అప్రమత్తంగా ఉన్నాయి. ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదురైనా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాం. పాకిస్తాన్ సైన్యం దాడులను గట్టిగా తిప్పికొట్టాం. పాక్ నావికాదళంపై మన నావికాదళం పైచేయి సాధించింది. పాక్ ఎత్తుగడలు గమనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాం. ఇండియన్ నేవీ దాడుల్లో పాక్ హార్బర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాక్ చర్యల పట్ల మన ప్రతిస్పందన దీటుగా, ప్రణాళికాబద్ధంగా సాగింది’’ అని ఎ.ఎన్.ప్రమోద్ స్పష్టం చేశారు. -
పాక్ తూటాలకు... క్షిపణులతో బదులివ్వండి
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్‌తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై విస్తృతంగా చర్చించారు. పాక్ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను, పాక్‌లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్‌కు అప్పగించాల్సిందేనని, పాక్‌కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్‌కు అంగీకరించడం లేదు.దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్‌కు మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాకిస్తాన్ ఒకవేళ భారత్‌పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం మోదీతోఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌తో కూడా వాన్స్ చర్చించారు. పాక్ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్–పాక్ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ పాక్ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆదేశం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్ శనివారం ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ పాక్ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు. -
IPL 2025: 16 లేదా 17 నుంచి ఐపీఎల్!
న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్ వినోదాన్ని పంచే ఐపీఎల్‌కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్‌ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవనుంది. ఫైనల్ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది. అన్నీ డబుల్ హెడర్‌లేనా? ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్‌ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్ పాలకమండలి మిగతా లీగ్ మ్యాచ్‌ల్ని డబుల్ హెడర్ (రోజూ రెండు మ్యాచ్‌ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది. హైదరాబాద్‌లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్ హైదరాబాద్ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్’ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్ సహా ఫైనల్ పోరుకు వేదికైన కోల్‌కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్‌కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్‌ను ఫైనల్ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్‌పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. -
శాంతితోనే స్థిరమైన అభివృద్ధి
ఇరుదేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు కాల్పుల విరమణ ఒప్పందంతో కొంతలో కొంత చల్లబడినప్పటికీ, దక్షిణాసియా అభివృద్ధికి శాశ్వత శాంతి నెలకొనాల్సి ఉంది. దీనికి కావాల్సిన రాజకీయ నాయకత్వ కొరత ఉందన్నది కాదన లేని నిజం. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుండి ఉత్పన్నమయ్యే సీమాంతర ఉగ్రవాద దాడులపై తాను ఎలా స్పందిస్తాను అనే అంశాన్ని భారతదేశం సరికొత్తగా నిర్వచించింది. సింపుల్‌గా చెప్పాలంటే భారత్ తిరిగి దాడి చేస్తుంది. దీని ప్రకారమే భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని వివిధ లక్ష్యాలను గురి చూసి కొట్టి తన పనిని పూర్తి చేసింది. పహెల్గామ్లో జరిగిన దారుణమైన, విషాదకరమైన, మత తత్వ ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా, భారతదేశం పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే కాకుండా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేసింది. పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి అవసరమైన వరుస చర్యలను చేపట్టడం ద్వారా భారత్ ముందడుగువేసింది. దీనిపై రాజకీయ పరంగా దేశంలో విస్తృత స్థాయిలో ఐక్యత ఏర్పడింది.కొత్త యుగానికి నాంది పలకాలి!అయితే, భారతదేశమైనా, పాకిస్తాన్ అయినా తమను తాము తీవ్రంగా గాయపరచుకోకుండా పూర్తి స్థాయి సైనిక యుద్ధాన్ని చేపట్టలేవని, చేపట్టినా దాన్ని కొనసాగించలేవని అన్ని పక్షాలకూ స్పష్టంగా తెలిసిపోయి ఉండాలి. ఇరుదేశాల మధ్య యుద్ధంలో ఓడిపోయిన వారు వాస్తవానికి– భారత్, పాక్ ప్రజలే! ఒక పక్షాన్ని మరొక పక్షం అనుమానించిన ప్రతిసారీ ఈ రెండు దేశాలూ పరస్పర దాడులకు పాల్పడతాయనే అభిప్రాయం ఇప్పుడు స్థిరపడింది. తన భూభాగంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడిలో 25 మంది మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పహెల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కార ణాన్ని వివరించింది. అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనలను పరి శీలిస్తే కొన్ని దేశాలు మాత్రమే ఒక పక్షం కథనాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. సంఘటనలపై భారతీయ కథనానికి ఎక్కువ మంది మద్దతుదారులు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ కూడా తనదైన మద్దతుదారులను కూడగట్టింది.రెండు దేశాల ముందు ఉన్న సవాలు, నిజానికి భారత ఉపఖండం అంతటా ఇప్పుడు ఉన్న సవాలు – గత శతాబ్దంలో ఉనికిలోకి వచ్చిన అనేక దేశాలు కూడా ప్రాంతీయ, దేశీయ శాంతికి, అభివృద్ధికి చెందిన కొత్త యుగానికి నాంది పలికే నాయకత్వాన్ని కనుగొనడమే! విచార కరంగా, దక్షిణాసియాలో అలాంటి రాజకీయ నాయకత్వ కొరత ఉంది. వలసవాదం నుండి విముక్తి పొందినప్పటి నుండి ఈ ప్రాంతం స్వీయ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, గత చరిత్రలతో అంతర్గత పోరాటాల కారణంగా వెనుకబడి ఉంది.పొరుగు సంబంధాలు కీలకందక్షిణాసియా విషాదం ఏమిటంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాలలో చాలా మందికి తమ బండిని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చుననీ, పొరుగువారితో సంబంధాలను మెరుగు పర్చుకోకుండానే అభివృద్ధిని కొనసాగించవచ్చుననీ నమ్మకం ఉంది. గత పావు శతాబ్దంలో భారతదేశపు విశ్వసనీయ ఆర్థిక పనితీరు, తన పొరుగువారితో ప్రబలంగా ఉన్న వివాదాలను పరిష్కరించకుండానే ఎదగడాన్ని భారత్ కొనసాగించగలదని చాలా మంది నమ్మేలా చేసింది. కొంతవరకు, అది సాధ్యమైంది. అయితే, భారతదేశం దీర్ఘకా లిక యుద్ధంలోకి లాగబడితే అది కూడా ఆర్థికంగా దెబ్బతింటుంది. చెలరేగిన ఘర్షణ వాతావరణపు దుమ్ము కాస్తా అణిగి, ‘యుద్ధం పొగమంచు’ నుండి బయటపడిన తర్వాత, రెండు దేశాలలోని రాజకీయ నాయకత్వం ప్రాంతీయ భద్రత అంటే ఏమిటో సుదీర్ఘంగా పరిశీలించాలి. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం ప్రాంతీయ వాతావ రణాన్ని తప్పకుండా నిర్వచించాలి. భూభాగం గురించిన నిరంతర వివాదాల ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి? ప్రతి దేశంలోనూ, ప్రాంతం అంతటా మతపరమైన ప్రాంతీయ విభజనల నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?సరిహద్దుకు ఇరువైపులా గొప్ప వ్యూహకర్తల జ్ఞానం ఉన్నప్పటికీ, నేడు ఏ పక్షమూ ప్రాంతీయ శాంతి, భద్రత కోసం కొత్త చట్రాన్ని నిర్వచించలేకపోయింది. ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2000–2007 కాలంలో చివరిసారిగా ఒక ప్రయత్నం జరిగింది. పాకిస్తాన్ అధ్య క్షుడు పర్వేజ్ ముషారఫ్ కొంతకాలం వారి చొరవతో ముందుకు సాగారు. కానీ ఆయన త్వరలోనే పదవీచ్యుతుడయ్యారు. అప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి ‘మన్మోహన్ – ముషారఫ్’ ఫార్ములాను తిరస్కరించింది.ఈ రోజు ఆ ఫార్ములా గురించి ప్రస్తావిస్తే ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే... దీనిని తప్పక ప్రస్తావించాలి. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉంది. జపాన్ను అధిగమించింది. స్వదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, భారత వృద్ధి ప్రక్రియలో లోపాలు ఉన్నప్పటికీ, భారతదేశం అభివృద్ధి చెందడం కొనసాగించడానికీ, ప్రపంచాన్ని అనుకూలమైన నిబంధనలతో నిమగ్నం చేయడానికీ తప్పక అవకాశం ఉంది.నియంత్రణ రేఖే సరిహద్దుభారతదేశం తన సొంత పొరుగు ప్రాంతాన్ని సురక్షితం చేసుకోకుండా అలా చేయగలదని భావించడం చాలా మంది సమకాలీన విశ్లేషకులు, వ్యూహకర్తల ఊహ మాత్రమే! భారత్ పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భారతదేశానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, వారు భారత్ నుండి ఎటువంటి ప్రయో జనాలనూ పొందకపోతే ఈ వృద్ధి వ్యయాలు పెరుగుతాయి. మోదీ ప్రభుత్వం పాటించిన గత దశాబ్దపు భారత విధానం ఏమిటంటే, కష్టాల్లో ఉన్న పొరుగువారిపై భారీ ఖర్చులను విధించడమే. ఇది స్వల్పకాలిక ప్రయోజనాలను అందించవచ్చు కానీ దాని పర్యవస నాలు భారత్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.మేము పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని భారత్ ప్రదర్శించే రాజకీయ ధైర్యం, కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడం గురించిన పాకిస్తాన్ వాక్చాతుర్యానికి చెల్లిపోతుంది. కానీ రెండూ ఎప్పటికీ జరగవు! సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్, మన్మో హన్–ముషారఫ్ ఫార్ములా ముఖ్య ఉద్దేశ్యం అదే! అన్ని ప్రధాన శక్తులు – అమెరికా, రష్యా, చైనా – నియంత్రణ రేఖ వాస్తవానికి అంతర్జాతీయ సరిహద్దు అనే ఆలోచనను సమర్థించాయి. నేడు రెండు దేశాలలోని ప్రముఖులు అలాంటి పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవికత నుండి తప్పించుకునే అవకాశం లేదనీ, ఈ వాస్తవికత అందరికీ పెనుభారంగా మారవచ్చనీ ఇరువైపులా ఉన్న వాస్తవికవాదులకు తెలుసు.సంజయ బారు వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ వ్యవస్థాపకుడు,భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు -
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
మాంగోచార్ తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. మరోసారి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామన్నారు. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్లో 40 శాతం భూభాగం తమదేనని, తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టగా, అందుకు బలూచ్ తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. -
మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాంఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్ కసబ్,డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్ స్ట్రైక్‌లో హతమయ్యారుమేం ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్ చేశాంలాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాం లాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి చెందారు మరోసారి కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్ డీజీఎంవో మాకు ఫోన్ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్ మెసేజ్ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్ అంతు చూస్తాంపాక్ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్ చేస్తున్నాం -
2019 Pulwama attack: ‘పుల్వామా దాడి చేసింది మేమే’: పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ (Pakistan) మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లోని పుల్వామాలో (2019 Pulwama attack) 40మంది భారత సీఆర్పీఎఫ్ (central reserve police force) జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి వెనుక తమ హస్తం ఉందని అంగీకరించింది. ఇన్ని రోజులు పుల్వామా దాడిలో తమకు ప్రమేయం లేదన్న పాక్.. ఇప్పుడు బహిరంగంగా అంగీకరించడంపై అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్‌కు భారత్ తగిన గుణం పాఠం చెబుతోంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో ఇండియన్ ఆర్మీ.. పాక్,పాక్ ఆక్రమిత కశ్మీర్లో క్షిపణి దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాల్ని, ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేసింది. దీంతో భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. భారత్ కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్‌పై బహిరంగంగా స్పందించింది.Did he really admit about Pulwama attack,,,😳😳😳#ceasefireviolations#IndiaPakistanWar #IndiaFightsTerroristan pic.twitter.com/6C4l5ohSjb— Vyky Garia (@VkyGaria) May 11, 2025 ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీ ఐఎస్పిఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి,పాక్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ వైస్ మార్షల్,పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ ఔరంగజేబ్ అహ్మద్ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పుల్వామా దాడితో మా ఎత్తుగడ ఎలాంటిదో చూపించాం. మా దేశ గగనతలం, భూమి, జలాలు, ప్రజలకు ముప్పు పొంచి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోం. దేశ ప్రజల రుణం తీర్చుకుంటాం. ఇప్పటికే పుల్వామాలో మా వ్యూహాత్మక చతురత ప్రదర్శించాం’ అని ఔరంగజేబ్ అహ్మద్ అన్నారు.ఔరంగజేబ్ అహ్మద్ ప్రకటనతో ఇన్ని రోజులు పుల్వామా దాడి వెనుక తమ పాత్రలేదని బుకాయించిన పాకిస్తాన్ ఇప్పుడు బహిరంగంగా ఉగ్రవాదంతో నెరుపుతున్న సంబంధాల గురించి ప్రకటన చేయడంపై విమర్శలకు దారి తీసింది. -
పాకిస్తాన్‌కు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదు: హీరో నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మే 1వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియా- పాకిస్తాన్ యుద్ధం గురించి ఆయన మాట్లాడారు.హీరో నాని మాట్లాడుతూ..'ప్రస్తుతం పాక్‌తో యుద్ధం వల్ల పరిస్థితి సెన్సిటివ్‌గా ఉంది కదా మా టీమ్‌తో మాట్లాడా. అవతలి వాళ్లు మనకు ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు. దానికి మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా తిరిగి ఇచ్చేసింది. అంటే వాళ్ల వల్ల మనదేశంలో ఒక సినిమా ఈవెంట్ కూడా రద్దు అయిందన్న సంతోషం కూడా పాకిస్తాన్‌కు ఇవ్వకూడదు. అందుకే ఈరోజు సక్సెస్ మీట్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. దేశ సరిహద్దుల్లో ఉండి మనల్ని కాపాడుతున్నా ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌కు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు' అని తెలిపారు.అనంతరం సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. 'ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఊహించలేదు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ని పెద్ద మాస్ కమర్షియల్ సినిమాలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తే అద్భుతంగా అనిపించింది. మాకు ఇంతటి విజయాన్నిచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని నాని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రోడక్షన్స్, వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు -
బ్రహ్మోస్ క్షిపణి పనితీరు ఎలా ఉంటుందో పాక్ కు అడగండి
-
పాక్ ను వణికించిన BRAHMOS
-
Jana Tantram: కాల్పుల విరమణ వ్యవహారంలో ట్రంప్ పాత్రపై ఆసక్తికరం
-
పాక్ వైమానిక కీలక స్థావరాలను లక్ష్యంగా విరుచుకుపడ్డ బ్రహ్మోస్
-
పాక్‌ను ఎలా నమ్మగలం.. శశిథరూర్
ఢిల్లీ: పాక్‌ను ఎలా నమ్మగలం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ దేశ తీరుపై మండిపడ్డారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో.. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. అయినా కూడా పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల వద్ద మళ్లీ కాల్పులకు తెగబడింది. దీనిపై శశి థరూర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం, మాట మీద నిలబడకపోవడం పాక్ స్వభావం అంటూ దుయ్యబట్టారు.భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదని ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిందని.. కానీ.. ఉగ్రవాదులు మన దేశం జోలికి వస్తే ఎలా ఉంటుందో కూడా వారికి తెలిసేలా చేసిందన్నారు. పాక్ గుణపాఠం నేర్చుకోవాలని.. ఉగ్రవాదులను పోషించడం మానుకోవాలంటూ శిశిథరూర్ వార్నింగ్ ఇచ్చారు.కాగా, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే ఉల్లంఘించి పాక్ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్ మొదలుకుని గుజరాత్ దాకా పలుచోట్ల డ్రోన్ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కన్పించాయి.మరో వైపు, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్ తదితర చోట్ల పాక్ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్ తదితర చోట్ల కూడా డ్రోన్లు కనిపించాయి. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
పాక్ ఫేక్ ప్రచార సారధి ఓ ఉగ్రవాది కొడుకు
-
ఆపరేషన్ సిందూర్.. భారత వజ్రాయుధాలకు పాక్ గజగజ
-
యుద్ధానికి మా సైన్యం పనికిరాదు.. పాక్ ప్రజల రియాక్షన్