పీవోకేపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు | Minister Rajnath Singh Key Comments On POK | Sakshi
Sakshi News home page

పీవోకేపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

May 15 2025 12:47 PM | Updated on May 15 2025 1:28 PM

Minister Rajnath Singh Key Comments On POK

శ్రీనగర్‌: ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదులను అంతం చేశామన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. అలాగే, దేశమంతా సైనికులను చూసి గర్విస్తోందన్నారు. అమరులైన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ నేడు జమ్ము కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌ యుద్ధ వీరులను రాజ్‌నాథ్‌ అభినందించారు. అనంతరం, రాజ్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘సైనికుల ధైర్యసాహసాలు గర్వకారణం. ఉగ్రవాదం అంతానికి ఎంత దూరమైనా, ఎక్కడికైనా వెళ్తాం. ఉగ్రవాదంపైనే కాదు.. పీవోకేపైనా మన యుద్ధం ఆగదు. పాకిస్తాన్‌ అణ్వయుధాల బ్లాక్‌మెయిల్‌కు భయపడం. ఎలాంటి పరిస్థితులలైనా మన సైన్యం ఎదుర్కోగలదు’ అంటూ ప్రశంసలు కురిపించారు. 

శత్రువులను నాశనం చేసిన ఆ శక్తిని అనుభూతి చెందడానికి నేను ఇక్కడ ఉన్నాను. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ చౌకీలు, బంకర్లను మీరు ధ్వంసం చేసిన విధానాన్ని, శత్రువు దానిని ఎప్పటికీ మరచిపోలేడని నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పర్యవేక్షణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే, పహల్గామ్ దాడి తర్వాత, జమ్ముకశ్మీర్ ప్రజలు పాకిస్తాన్, ఉగ్రవాదులపై తమ కోపాన్ని వ్యక్తం చేసిన విధానం గర్వంగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement