
ఢిల్లీ: ఢిల్లీలో నిజాముద్దీన్ ఏరియాలో దర్గా పై కప్పు కూలి పలువురు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) సాయంత్ర సమయంలో చోటు చేసుకుంది. నిజాముద్దీన్‌ప్ ప్రాంతంలోని హుమయూన్ సమాధ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.
మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. దర్గా శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది.
#WATCH | Delhi | NDRF personnel conduct a search operation at Dargah Sharif Patte Shah, located near Humayun's Tomb, in the Nizamuddin area, following the collapse of the roof of a room in the dargah premises.
Police and Fire Department personnel are also present.
So far, 11… pic.twitter.com/6oW3XjroAX— ANI (@ANI) August 15, 2025
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యటు చేపట్టారు. శిథిలాల కింది చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్ చర్యలు చేపట్టింది.