
సాక్షి, ఢిల్లీ: పాకిస్తాన్‌పై దౌత్యం విషయంలో భారత్ విజయం సాధించింది. ఎట్టకేలకు భారత బీఎస్‌ఎఫ్ జవాన్ పీకే షాను పాకిస్తాన్ విడుదల చేసింది. 20 రోజుల తర్వాత భారత జవాన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. దీంతో, సదరు జవాన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. బీఎస్‌ఎఫ్‌కు చెందిన భారత జవాన్ పూర్ణం కుమార్ షా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో, పీకే షాన్ పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం, దౌత్యపరంగా భారత్.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో, 20 రోజుల తర్వాత పీకే షాను.. ఈరోజు పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అటారీ సరిహద్దుల వద్ద జవాన్‌ను భారత్‌కు అప్పగించింది.
Today BSF Jawan Purnam Kumar Shaw, who had been in the custody of Pakistan Rangers since 23 April 2025, was handed over to India: BSF
(Pic Source: BSF) pic.twitter.com/TVzagO0AhK— ANI (@ANI) May 14, 2025

182 బీఎస్‌ఎఫ్ బెటాలియన్‌కు చెందిన షా పశ్చిమ బెంగాల్ వాసి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఇండో-పాక్ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్తాన్ రేంజర్లతో చర్చలు జరిపారు. ఇలాంటి సంఘటలు అసాధారణం కాదని, గతంలో కూడా ఇలాంటివి జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పౌరులు కానీ, జవాన్లు కానీ ఇలా అనుకోకుండా ఆవలి దేశ సరిహద్దులోకి వెళ్లిన సందర్భాల్లో ఇరుదేశాల అధికారులు మిలిటరీ ప్రొటోకాల్ ప్రకారం ఫ్లాగ్ మీటింగ్‌ల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు. అయితే, పహల్గాం ఉదంతం తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ఆంక్షలు విధించిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పాక్ రేంజర్లకు పట్టు బడిన సమయంలో సాహు యూనిఫాంలో ఉన్నారని, అతని వద్ద సర్వీస్ రైఫిల్ కూడా ఉన్నట్టు అధికారులు చెప్పారు.