
మహారాష్ట్రలోని ముంబై మెట్రోలో సోమవారం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
ముంబై మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాంకేతిక లోపం కారణంగా మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నందున ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. వెర్సోవా ఘట్కోపర్ లైన్ వన్‌లో మెట్రో రాకపోకల్లో జాప్యం జరుగుతున్నదన్నారు.
Crazy commuter woes thanks to 1 service withdrawn tech issues with mumbai metro line 1 Stampede like situation in ghatkopar station@Dev_Fadnavis @CMOMaharashtra act fast before lives are lost Line 1 needs 6 bogie rakes & 3 times current rakes@MandarSawant184@BHiren@impuni… pic.twitter.com/bn0ujkJhBT
— ANDHERI LOKHANDWALA OSHIWARA CITIZEN'S ASSOCIATION (@AndheriLOCA) July 7, 2025
ప్రయాణికుల విపరీతమైన రద్దీ కారణంగా ఘాట్కోపర్ స్టేషన్‌లో తొక్కిసలాట తరహా పరిస్థితి ఏర్పడిందని, త్వరగా చర్యలు తీసుకోవాలని ఒక యూజర్ ‘ఎక్స్’ ప్లాట్‌ఫారంలో కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ మెట్రో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ముంబై మెట్రో రద్దీపై సోషల్ మీడియా యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఈరోజు ఆఫీసుకు వెళ్లలేమని, వర్క్ ఫ్రమ్‌హోమ్ కావాలని బాస్‌లకు మెసేజ్ పెట్టామని తెలిపారు. ప్రభుత్వం ముంబైలోని రైలు సేవలపై దృష్టి సారించాలని పలువురు కోరారు.