ప్రైవేట్ సంస్థకు బాబు సర్కార్ దాసోహం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రైవేట్ సంస్థలకు దాసోహం అవుతోంది. పీపీపీ ప్రాజెక్ట్‌ల పేరిట అస్మదీయులకు రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకు బరితెగిస్తోంది. ఈ పరంపరలో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ)లో వైద్య పరీక్షల పేరిట మెడాల్ తరహా కుంభకోణానికి తెరలేపుతోందనే విమర్శలు హోరెత్తుతున్నాయి. టీడీపీ డాక్టర్స్ సెల్‌లోని ఓ డాక్టర్‌కు చెందిన భవ్య అనే సంస్థకు రూ.3 వేల కోట్ల విలువైన 108 అంబులెన్స్‌లు, 104 ఎంఎంయూ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ) నిర్వహణ కాంట్రాక్ట్‌ను గతేడాది కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సంస్థకు ఎంఎంయూల ద్వారా రక్త పరీక్షల నిర్వహణ పేరిట ఏటా రూ.162.72 కోట్ల చొప్పున సమర్పించడానికి సోమవారం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలో 2014–19 మధ్య రాష్ట్ర వైద్య శాఖలో చోటు చేసుకున్న మెడాల్ స్కామ్‌ను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. మెడాల్ ద్వారా పీపీపీ విధానంలో రక్త పరీక్షలు చేపట్టి అప్పట్లో రూ.300 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారనే ఆరోపణలున్నాయి. ధిప్పుడు ఎంఎంయూల్లో రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఇదే రీతిలో దోపిడీకి తెర తీయడమేనని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఐదేళ్ల కాంట్రాక్ట్ కాల పరిమితితో గతేడాది భవ్య సంస్థ 104, 108 నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. మరో నాలుగేళ్ల పాటు ఆ సంస్థకు కాంట్రాక్ట్ పరిమితి ఉంది. ఈ లెక్కన పరిశీలిస్తే నాలుగేళ్లలో ఎంఎంయూల్లో వైద్య పరీక్షల పేరిట రూ.700 కోట్ల మేర నిధులు మళ్లించబోతున్నారు. ఒక్కొక్కరికి పరీక్షలకు రూ.288 రాష్ట్రంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 104 ఎంఎంయూ వాహనాలు కొత్తగా 904 సమకూర్చారు. నాడు–నేడు కింద వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. 10,032 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రాథమిక వైద్యంతో పాటు, 14 రకాల పరీక్షలను అందుబాటులోకి తెచ్చారు. 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఏడాది పొడవునా బీపీ, షుగర్ బాధితులు, గర్భిణులు, వృద్ధులకు ఇక్కడ వైద్య సేవలు అందేవి. నెలలో రెండు పర్యాయాలు 104ల ద్వారా పీహెచ్సీ వైద్యులు విలేజ్ క్లినిక్‌లు సందర్శించి, రోజంతా గ్రామంలో ఉంటూ వైద్య సేవలు అందించేవారు. ఇందుకోసం అధునాతన ల్యాబ్ సౌకర్యంతో పీహెచ్‌సీలను తీర్చిదిద్దారు. మరోవైపు గ్రామాలకు నాలుగు, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీలను బలోపేతం చేసి వాటిలోని ల్యాబ్‌లకు అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. తద్వారా ప్రతి పీహెచ్సీలో 63 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. ఇలా ప్రభుత్వ పరిధిలోనే రోగ నిర్ధారణకు ఎంతో పకడ్భందీ వ్యవస్థ ఉండగా, ఎంఎంయూల్లో వైద్య పరీక్షల పేరిట ప్రస్తుత చంద్రబాబు సర్కార్ పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎంఎంయూల్లో వైద్య పరీక్షలు మెడాల్ తరహా స్కామ్‌కు దారితీస్తుందని టెండర్ల సమయంలోనే వైద్య శాఖ అధికారులు తటపటాయించినట్టు సమాచారం. ఈ భయంతోనే గతేడాది 104, 108 నిర్వహణ టెండర్లోనే వైద్య పరీక్షల కాంట్రాక్ట్‌ను కూడా ఖరారు చేసినప్పటికీ అమలును వాయిదా వేసినట్టు తెలిసింది. ప్రభుత్వ పెద్దలు అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో తాజాగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయిస్తున్నారు. ఫలితంగా ఒక్కో ఎంఎంయూలో ఒక్కొక్కరికి రూ.288 చొప్పున రోజుకు 20 మందికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇలా నెలలో 520 మందికి పరీక్షల కోసం ప్రభుత్వం రూ.1.5 లక్షలు చెల్లించడానికి సిద్ధమైంది. ఇలా ఏడాదికి 904 ఎంఎంయూలకు రూ.162.72 కోట్ల చొప్పున కాంట్రాక్ట్ సంస్థకు ముట్టనుంది. 104 వాహనాల్లో వైద్య పరీక్షలు చేయడానికి అనుమతి ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యం ప్రభుత్వ రంగంలోనే అందుబాటులో ఉన్న ప్రివెంటివ్ కేర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బాబు సర్కార్ ఇప్పుడు ప్రైవేట్ సంస్థకు నిధులు ధారబోయనుంది. ప్రజారోగ్యం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందుబాటులో ఉన్న వ్యవస్థలనే వాడుకోవచ్చని వైద్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విలేజ్ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్‌వో) ఉన్నారు. వీరికి రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించడంలోనూ అనుభవం ఉంది. ఈ క్రమంలో 104 గ్రామానికి వచ్చిన రోజు వైద్యులు సూచించిన రోగుల నుంచి నమూనాలు సేకరించి పీహెచ్‌సీలకు తరలిస్తే ఉచితంగా 63 రకాల పరీక్షలు చేయడానికి వీలుంది. వాటి ఫలితాల ఆధారంగా పీహెచ్‌సీలోని వైద్యుడు సీహెచ్‌వోలకు వర్చువల్‌గా అవసరమైన మందులు సూచిస్తే.. సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశాల ద్వారా నేరుగా రోగి ఇంటి వద్దకు డెలివరీ చేయవచ్చు. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనిక్ వంటి స్పెషలిస్ట్ కన్సల్టెషన్.. అవసరమైతే విలేజ్ క్లినిక్ నుంచే టెలీమెడిసిన్ ద్వారా వర్చువల్ కన్సల్టేషన్‌కు కూడా అవకాశం ఉంది. ఒకవేళ మెరుగైన వైద్యం అవసరమైతే గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ద్వారానే ప్రభుత్వాస్పత్రులు/ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేసే ఆస్కారం ఉంది. ఇంత పకడ్బందీ వనరులను కాదని 104లో పరీక్షల పేరిట ఏకంగా రూ.700 కోట్ల మేర ప్రజాధనం ఖర్చు చేయడానికే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపుతోందంటే ఇందులో ‘మాకింత–మీకింత’ వ్యవహారం తప్ప మరోటి కాదని సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతికూలతలను పట్టించుకోని సర్కారు⇒ 104 ఎంఎంయూలు నిత్యం పీహెచ్‌సీల నుంచి గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో కదిలే వాహనాల్లో ల్యాబ్‌ను ఏర్పాటు చేసి నిర్వహించే పరీక్షల్లో కచ్చితత్వంపై వైద్య వర్గాల్లో అనేక అనుమానాలు ఉంటున్నాయి. ⇒ వాహనం నిరంతరం రోడ్లపై ప్రయాణించడం, గుంతల్లో పడటంతో మిషన్లలో ఉండే సెన్సార్లు, లెన్సులు, గ్లాస్ ట్యూబ్‌లు వాటి కచ్చితమైన స్థానాల నుంచి స్వల్పంగా కదలడానికి వీలుంటుంది. దీంతో మిషన్లు తప్పుడు రీడింగ్స్ చూపే అవకాశం లేకపోలేదు. ⇒ స్థిరమైన ల్యాబ్‌లలో సెంట్రలైజ్డ్ ఏసీ ద్వారా ల్యాబ్‌కు అవసరమైన ఉష్ణోగ్రతలను నిర్వహించడానికి వీలు ఉంటుంది. కదిలే వాహనాల్లో అది అసాధ్యమని తెలుస్తోంది. ⇒ రక్త పరీక్షలకు వాడే రసాయనాలు సున్నితంగా ఉంటాయి. వాహనం ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు, ఏసీ ఆగిపోయినప్పుడు ల్యాబ్ లోపల వేడి వేగంగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఈ రసాయనాల పనితీరు దెబ్బతిని, తప్పుడు ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ⇒ రోడ్లపై తిరిగే వాహనాల్లోకి దుమ్ము, ధూళి, పొగ ప్రవేశించే అవకాశం కూడా ఉంటుంది. వాహనంలోకి వచ్చే సూక్ష్మ దుమ్ము కణాలతో రిపోర్టులో తేడా రావచ్చు.
డబ్బు కన్నా... పట్టుదల ముఖ్యం
బెంగళూరు: ఐపీఎల్‌తో తక్షణమే పేరు ప్రఖ్యాతలు వచ్చినా... సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ప్రస్తుతం కాలంలో ఐపీఎల్ వల్ల యువ ఆటగాళ్లకు భారీగా డబ్బు, పేరు వస్తోందని... అయితే అక్కడితో ఆగిపోకుండా మరింత కష్టపడితేనే ఆటలో గొప్ప స్థాయికి చేరగలరని కోహ్లి వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆర్సీబీ స్పోర్ట్స్ సమ్మిట్ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ... ‘అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్ల ఆటగాడిగా కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం. పట్టుదలను డబ్బుతో ముడిపెట్టలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఐపీఎల్ రూపంలో 20 బంతుల్లో 40–50 పరుగులు చేస్తే చాలు ఎనలేని పేరు, డబ్బు వస్తున్నాయి. అది సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ 10–15 ఏళ్లు ఏకబిగిన అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దానికి ఎంతో పట్టుదల ఉండాలి. అది టి20 క్రికెట్ ఆడినంత సులువు కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అభిమానుల ఆదరణ, ఆట నుంచి గౌరవం పొందగలం. అలా అని టి20 క్రికెట్‌ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఇటీవలి కాలంలో చూస్తే... గొప్ప గొప్ప పవర్ హిట్టర్లు పుట్టుకొస్తున్నారు. వారు బంతిని బాదుతున్న విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవలీలగా సిక్స్‌లు కొడుతున్నారు. ఐపీఎల్ ఆరంభంలో మాదిరిగా ప్రతిసారి భారీ స్కోర్ల పిచ్‌లు ఎదురుకావు. కొన్నిసార్లు కఠినమైన పిచ్‌పై రెండు, మూడు వికెట్లు కోల్పోయినప్పుడు 175–180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించాల్సి వస్తుంది. అలాంటి స్థితిని తట్టుకున్న బ్యాటర్ దీర్ఘకాలం నిలబడగలుగుతాడు. పరిస్థితులు పరీక్షిస్తున్న సమయంలో అత్యుత్తమ ఆట తీరు కనబర్చడం ముఖ్యం. నా వరకైతే ఆటను ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని... పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతా. నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవాలి అంటే బలమైన పునాది అవసరం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక బంతిని ఎదుర్కొనే ముందు మీ దగ్గర ఎక్కువ మార్గాలు ఉండాలి. అప్పుడే కష్టమైన పిచ్‌పై కూడా పరుగులు రాబట్టగలం. అది కేవలం సాధన వల్లే సాధ్యమవుతుంది’ అని వివరించాడు.
పెంకులేకుండానే గుడ్లను పొదిగారు!
వాషింగ్టన్: అంతరించిపోయిన జీవులను డీఎన్ఏల సాయంతో మళ్లీ పునర్సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలోని జీవసాంకేతికరంగ సంస్థ ‘కొలోసల్ బయోసైన్సెస్’తన ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. న్యూజిలాండ్‌లో చాలా శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ పక్షిజాతి ‘మోవా’ను పునర్సృష్టించే క్రతువులో మరో ముందడుగువేశామని కొలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. మోవాకు జన్యువులపరంగా అత్యంత సారూప్యత ఉండే ఇతర జాతుల పక్షుల డీఎన్ఏతో సింథసిస్ చేసి తొలుత మోవా గుడ్డును తయారుచేయాలని సంకల్పించింది.అయితే ఆనాటి మోవాజాతి గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే ఏకంగా గరిష్టంగా 80 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇంతటి భారీ గుడ్డును పొదగాలంటే అంతపెద్దస్థాయిలో కృత్రిమ ఎగ్‌షెల్ అవసరం అవుతుంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కృత్రిమమేధతో త్రిమితీయ(3డీ) ముద్రిత చిన్నపాటి ఎగ్‌షెల్‌ను తయారుచేశామని కంపెనీ ప్రకటించింది. ఇందులో సాధారణ కోడి గుడ్లలోని పచ్చ, తెల్లసొనలను బయటకుతీసి ఈ 3డీ ముద్రిత ఎగ్షెల్లో పెట్టి విజయవంతంగా పొదిగామని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఇలా ఇప్పటిదాకా 26 కోడిపిల్లలను సృష్టించారు. ఏఐ ఎగ్‌షెల్ ఎలా? పెంకును పగలగొట్టి పచ్చ, తెల్లసొనలను కప్పులాంటి ఇతర గోళాకార ఆకృతుల్లో పొదగడంపై గతంలోనూ చాలా మంది ప్రయోగాలు చేశారు. అయితే సహజసిద్ధ పెంకు నుంచి మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దాంతోనే లోపల గుడ్డు పొదుగుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ సరైన మోతాదులో అందేలా లోపలివైపు జల్లెడ లాంటి దానిని కొలోసల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దానికి బయటివైపు పారదర్శకంగా ఉండేలా మరో కణత్వచాన్ని తయారుచేశారు. వీటి సాయంతో పచ్చ,తెల్లసొనలు ఏమాత్రం పాడవకుండా సహజసిద్ధ వాతావరణాన్ని వాటికి అందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చ,తెల్లసొన కోడిపిల్లగా మారే క్రమంలో సాధారణ పెంకు నుంచి కాల్షియంను సంగ్రహించుకుంటుంది.ఇదే తరహాలో తాము కూడా ఈ ఏఐ ఎగ్‌షెల్ ద్వారా కాల్షియంను అందించామని పరిశోధకులు తెలిపారు. ఈ ఎగ్‌షెల్‌ను ఇంక్యుబేటర్‌లో పెట్టి సరిపడా వేడిని అందించి పొదిగారు. తమ ప్రయోగం విజయవంతంకావడంపై కొలోసల్ సంస్థ సీఈఓ బెన్లామ్ ఆనందం వ్యక్తంచేశారు. సింథటిక్ బయాలజీ పితామహుడిగా పేరొందిన అమెరికా దిగ్గజ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ చర్చ్ ఆధ్వర్యంలో కొలోసల్ సంస్థ పనిచేస్తోంది. ‘‘కృత్రిమమేధతో పనిచేసే కృత్రిమ ఎగ్‌షెల్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అంతరించిపోయిన పక్షిజాతులకూ తిరిగి ప్రాణం పోయవచ్చు. న్యూజిలాండ్‌లో ప్రాచీనకాలంలో కలియతిరిగిన మోవా జాతిని పునర్సృష్టించాలంటే దాని గుడ్డును మోయగలిగే భారీ పక్షిజాతులు ఇప్పుడులేవు. అందుకే ఇలా కృత్రిమ ఎగ్‌షెల్ తయారీకి పూనుకున్నాం’’అని బెన్లామ్ వివరించారు.
ఈ రాశి వారికి శుభవార్తా శ్రవణం.. ధనప్రాప్తి
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.చవితి సా.4.22 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.11.13 వరకు తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.28 నుండి 11.58 వరకు, దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: లేవు.సూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన పనులు చకచకా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. స్థిరాస్తి వృద్ధి. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.వృషభం... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందగోళంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.మిథునం.... సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.కర్కాటకం... బడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.సింహం... శ్రమ ఫలించే సమయం. నూతన విద్యావకాశాలు. కొత్త వ్యక్తులతో పరిచయం. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.కన్య.... వ్యవహారాలలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి సైతం సాయం అందుతుఉంది. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు.వృశ్చికం.... పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.ధనుస్సు.... మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థికాభివృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖుల పరిచయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.మకరం.... దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనప్రాప్తి. పాతమిత్రుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.కుంభం... బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని పనుల్లో అవాంతరాలు ఎదురుకావచ్చు. శ్రమాధిక్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దైవదర్శనాలు.మీనం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
అవన్నీ అసత్య కథనాలు: కేంద్రం
మహిళ వెనుక వెళ్లి.. డ్రెస్‌ను పైకెత్తి
జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?
బీజేపీ రాజకీయం.. కేంద్ర కేబినెట్లో సమూల మార్పులు?
#Melodi: నా స్నేహితుడికి స్వాగతం
నేడు మెడికల్ షాపులు బంద్
ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఖండూరీ కన్నుమూత
నియోజకవర్గాల పునర్విభజనకు మిశ్రమ ప్రాతినిధ్య విధానమే మేలు
‘లింకు’ లేకపోయినా రిజిస్ట్రేషన్లు
ఎకరం రూ. 200 కోట్లు
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
అవన్నీ అసత్య కథనాలు: కేంద్రం
మహిళ వెనుక వెళ్లి.. డ్రెస్‌ను పైకెత్తి
జూ.ఎన్టీఆర్ ఆస్తి ఎంత? ఖరీదైన కార్ల కలెక్షన్ ఏంటి?
బీజేపీ రాజకీయం.. కేంద్ర కేబినెట్లో సమూల మార్పులు?
#Melodi: నా స్నేహితుడికి స్వాగతం
నేడు మెడికల్ షాపులు బంద్
ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఖండూరీ కన్నుమూత
నియోజకవర్గాల పునర్విభజనకు మిశ్రమ ప్రాతినిధ్య విధానమే మేలు
‘లింకు’ లేకపోయినా రిజిస్ట్రేషన్లు
ఎకరం రూ. 200 కోట్లు
నేటి నుంచి త్రిగ్రహ సంయోగం… ఈ రాశులవారికి జాక్‌పాట్
రజినీ కుట్టీస్టోరీ.. అది విజయ్ హుందాతనం
నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్!!
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
మమతకు సీఎం సువేందు ఝలక్
ఇదంతా అప్పు చేసి రాష్ట్రం నెత్తిన పెడతారని భయపడిపోతున్నారు సార్!
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఉచిత బస్సు ప్రయాణానికి మంగళం
బీజేపీ సంచలన నిర్ణయం.. అన్నామలైకి భారీ గుడ్‌న్యూస్
ఇడ్లీ నటి కామెంట్స్.. ఖుష్బు సుందర్ రియాక్షన్..!
ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి
జీవిత కాలపు కలగానే మిగిలిపోతుంది!
IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్
ఈ వారం ఓటీటీల్లో సందడి.. ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్..!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
పళనిస్వామికి భారీ షాక్
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
కేంద్రం వార్నింగ్.. వెనక్కి తగ్గిన కూటమి సర్కార్!
దగ్గుపాటి రాజకీయం.. టీడీపీలో భారీ పొలిటికల్ ట్విస్ట్
ఫొటోలు
పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా 'ఫస్ట్ టైమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
'పెద్ది' కోసం జాన్వీ కపూర్ రెడీ అయిందిలా (ఫొటోలు)
రాశీ ఖన్నా గ్లామర్ ఫోటోషూట్
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
మంచు మనోజ్ కొత్త ట్రస్ట్ ప్రారంభం (ఫొటోలు)
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
పెట్రో బాదుడు: వైఎస్సార్సీపీ పోరుబాటకు విశేష స్పందన
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
ఫ్యామిలీ ట్రిప్‌లో హీరోయిన్ శ్రీదేవి విజయ్‌కుమార్.. (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో ఆది పినిశెట్టి దంపతులు.. (ఫొటోలు)
సినిమా
రాజకీయాల్లోకి నా భార్య.. మంచు మనోజ్ స్టేట్మెంట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. తన భార్య మౌనిక రాజకీయ ఎంట్రీపై స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి బయటపెట్టారు. తాము నెలకొల్పిన సేవా సంస్థ 'ఐక్య' గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?)'ఐక్య' స్వచ్ఛంద సంస్థ. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ప్రజల కోసం దీన్ని ప్రారంభించాం. దీని కోసం మేం మా సొంత నిధులే ఖర్చు పెట్టనున్నాం. నా భార్య మౌనిక రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రస్తుతం మేం రాజకీయాల్లో భాగమయ్యాయం అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.మౌనిక విషయానికొస్తే.. ఉమ్మడి కర్నూలుకి చెందిన భూమా కుటుంబం ఈమెది. ఈమె తండ్రి భూమా నాగిరెడ్డి వైసీపీ, టీడీపీ, ప్రజారాజ్యం తరఫున రెండుసార్లు ఎమ్మెల్మేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి కూడా రెండుసార్లు ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శోభా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత పెద్ద కుమార్తె అఖిలప్రియ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ నుంచి గెలిచిన ఈమె.. తర్వాత టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది. తల్లిదండ్రుల రాజకీయ వారసురాలగా అఖిలప్రియ కొనసాగుతున్నారు. ఇప్పుడు చిన్నకుమార్తె మౌనిక కూడా రాజకీయాల్లోకి వస్తుండటంతో రాయలసీమ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. మరి మౌనిక.. ఏ పార్టీ తరఫున ఎక్కడ పోటీ చేస్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనడా నుంచి వచ్చి కిడ్నాప్- హత్య
పంజాబ్‌లో లేడీ సింగర్ హత్య ఉదంతం సంచలనం సృష్టించింది. యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్ (29) మృతదేహాన్ని ఆరు రోజుల తర్వాత పోలీసులు నీటి కాలువలో గుర్తించారు. మే 13న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇందర్ కౌర్.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మృతదేహం లభించడంతో అసలేం జరిగిందనే విషయాలు బయటకొచ్చాయి.(ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)హత్యకు గురైన ఇందర్ కౌర్ సోదరుడు జోటిందర్ సింగ్ ఫిర్యాదు ప్రకారం.. ఇందర్ మే 13న రాత్రి 8:30 గంటలకు కారులో సరుకులు కొనుగులు చేసేందుకు వెళ్లింది. కాసేపటి తర్వాత నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. అయితే ఈమె కనిపించకపోవడం వెనక మోగా జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మూడేళ్ల క్రితం ఇందర్ కౌర్‌కి ఇన్ స్టా ద్వారా సుఖ్విందర్ సింగ్ పరిచయమయ్యాడు. ప్రేమ పేరిట పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయిందని తెలుసుకున్న ఇందర్ కౌర్, సుఖ్విందర్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు.. ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసుల దర్యాప్తు ప్రకారం.. కెనడాలో ఉంటున్న సుఖ్విందర్, నేపాల్ గుండా పంజాబ్‌కి చేరుకున్నాడు. 13వ తేదీన తన సహచరులతో కలిసి ఇందర్ కౌర్ కారుని అడ్డగించి తుపాకీతో బెదిరించి ఆమెని కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆమెని హత్య చేసి నీటి కాలువలో పడేశాడు. నేరం చేసిన వెంటనే నేపాల్ ద్వారానే తిరిగి కెనడాకి పారిపోయాడని తెలుస్తోంది.అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15వ తేదీనే జమాల్పూర్ పోలీస్ స్టేషన్లో సుఖ్విందర్ సింగ్, కరమ్‌జిత్ సింగ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇందర్ కౌర్ మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. నిందితులని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదు.. కొత్త తెలుగు సినిమా)
పెద్ది.. జాన్వీకి మైనస్ కానుందా?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది, కానీ తమని తాము నిరూపించుకోవడమే అసలైన టాస్క్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బిగ్ బ్రేక్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి, ఇక్కడి కమర్షియల్ ఫార్మాట్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.'దేవర'లో గ్లామర్ షోకే పరిమితంభారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'తంగం' అనే పల్లెటూరి పడచు పాత్రలో జాన్వీ లుక్స్, ముఖ్యంగా ‘చుట్టమల్లే’ పాటలో ఆమె పండించిన గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఒక నటిగా చూస్తే మాత్రం దేవరలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కేవలం గ్లామర్ షోకే, కమర్షియల్ ఎలిమెంట్స్‌కే ఆమెను పరిమితం చేసేశారనే విమర్శలు వచ్చాయి.'పెద్ది’లోనూ అదే రిపీట్ అవుతుందా?ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే, నిన్న రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇందులోనూ ఆమె కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయినట్లుగా అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ ప్లస్ కావచ్చు. కానీ, ‘పెద్ది’ లాంటి రా అండ్ రస్టిక్, ఇంటెన్స్ కథలకు గ్లామర్ మాత్రమే నమ్ముకుంటే అది సినిమాకే మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమాలోనూ జాన్వీ పాత్రకు నటన పరంగా స్కోప్ లేకపోతే, ఆమె టాలీవుడ్ కెరీర్‌కు అది పెద్ద మైనస్ అవుతుంది. టాలీవుడ్లో లాంగ్ రన్ ఉండాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, బలమైన పాత్రలు కూడా పడాలి.దాచి పెట్టారా?గ్లింప్స్, ట్రైలర్లో జాన్వీ గ్లామర్ షోకే పరిమితం చేశారు. ప్రతి సీన్ లో పైట గాల్లోకి ఎగరేస్తూ నడుము హైలైట్ అయ్యేలా పదే పదే ఫ్రేమ్ సెట్ చేశాడు దర్శకుడు. కానీ హీరో రామ్ చరణ్ మాత్రం జాన్వీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. పెద్దిలో జాన్వీ నటన ఓ రేంజ్లో ఉంటుందని చెబుతున్నాడు. డాన్స్ కూడా అద్భుతంగా చేసిందని ప్రశంసించాడు. చరణ్ మాటల బట్టి చూస్తే.. ట్రైలర్లో జాన్వీని కావాలనే గ్లామర్ డాల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఆమె నటనకు సంబంధించిన సీన్‌ని పెడితే.. రిలీజ్ ముందే కథపై ఊహగానాలు ఎక్కువైపోతాయని దర్శకుడు భావించాడట. అందుకే ట్రైలర్లో చరణ్‌ని మాత్రమే హైలెట్ చేస్తూ.. మిగతావాళ్ల సీన్లను దాచిపెట్టాడని టాలీవుడ్ టాక్. ఒకవేళ అదే నిజమై.. జాన్వీకి మంచి సీన్లు పడితే ఒకే. కేవలం పాటలకే పరిమితం అయితే మాత్రం.. ఆమె కెరీర్‌కి ఇబ్బంది తప్పదని సినీ పండితులు చెబుతున్నారు.
మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే
ఒకప్పుడు తెలుగులో హీరోగా సినిమాలు చేసిన మంచు మనోజ్.. రీసెంట్ టైంలో మిరాయ్, భైరవం చిత్రాలతో విలన్‌గా మారిపోయాడు. ఆకట్టుకున్నాడు కూడా. ప్రస్తుతం 'డేవిడ్ రెడ్డి' అనే మూవీలో నెగిటివ్ టచ్ ఉండే హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఓ ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. మీడియాతో కలిసి తన ప్రీ బర్త్ డే వేడుకల్ని హైదరాబాద్‌లో చేసుకున్నాడు. ఇందులోనే తండ్రితో గొడవ గురించి ప్రశ్న ఎదురవగా సెటైరికల్‌గా సమాధానమిచ్చాడు.(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?)'మీ నాన్నతో గొడవ క్లియర్ అయినట్టేనా?' అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మనోజ్.. అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా? కానీ మైక్‌తో వెళ్ళకండి. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. గతంలో మంచు కుటుంబంలో గొడవ జరుగుతున్నప్పుడు ఓ మీడియా ప్రతినిధిని మోహన్ బాబు మైక్‌తో కొట్టారు. తర్వాత క్షమాపణ చెప్పారు.మీడియాతో మాట్లాడుతూ మనోజ్ మరికొన్ని విషయాల్ని పంచుకున్నాడు. భైరవం, మిరాయ్ సినిమాలు నాకు ఇచ్చిన డైరెక్టర్స్ ఇద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఇంకో జన్మ ఇచ్చారు. అలానే నా భార్య మౌనిక కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని మనోజ్ చెప్పాడు.తాజాగా 'ఐక్య ధైర్య సేనా సమితి' పేరుతో ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. ఎవరైనా బెదిరింపు కాల్స్‌తో బాధపడుతుంటే వాళ్లకు మా ట్రస్ట్ అండగా ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికే దీనిని మొదలుపెట్టాం. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని, వారి చదువు బాధ్యతలను ఈరోజు నుంచే పూర్తిగా తీసుకుంటామని మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ)Media Person: మీ ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ అయినట్టేనా ? #ManchuManoj: అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా ? వెళ్ళి అడగండి. కానీ Mic పట్టుకొని వెళ్లొద్దు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. pic.twitter.com/M4WBvEe1rH— cinee worldd (@Cinee_Worldd) May 19, 2026
క్రీడలు
మెయిన్ 'డ్రా'కు సాత్విక్ - రాధిక జోడీ
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కణపురం సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ (భారత్) ద్వయం మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో జాతీయ చాంపియన్స్ సాత్విక్ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్) జోడీ 21–15, 21–17తో దాతు అనీఫ్ ఇసాక్–క్లారిస్సా సాన్ (మలేసియా) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో అలెగ్జాండర్ డున్–జూలీ మెక్‌పర్సన్ (స్కాట్లాండ్) జంటతో సాత్విక్–రాధిక ద్వయం తలపడుతుంది. మరోవైపు మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అష్మిత చాలిహా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించగా... ఆకర్షి కశ్యప్ క్వాలిఫయింగ్‌లో నిష్క్రమించింది. అష్మిత 21–23, 21–16, 21–16తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై గెలిచింది. ఆకర్షి 21–15, 20–22, 7–21తో పార్క్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో హరిహరన్–ఎంఆర్ అర్జున్ 21–19, 21–15తో ఏడో సీడ్ క్రిస్టో పొపోవ్–టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)లపై గెలిచారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో శిఖా గౌతమ్–అశ్విని భట్ (భారత్) జంట 15–21, 21–17, 17–21తో జాకీ డెంట్–క్రిస్టల్ లాయ్ (కెనడా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
‘ఏఐటీఏలోకి అడుగు పెడతా’
ముంబై: భారత మాజీ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఇప్పుడు పరిపాలనా వ్యవహారాల వైపు పూర్తి స్థాయిలో రావాలని ఆశిస్తున్నాడు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎన్నికల్లో పాల్గొని జాతీయ స్థాయిలో అన్ని రకాలుగా భాగం కావాలని అతను భావిస్తున్నాడు. ఏఐటీఏలో చేరితే టెన్నిస్‌లో పలు కీలక మార్పులు తీసుకొచ్చేందుకు తాను సిద్ధమని బోపన్న ప్రకటించాడు. 2024లో జరిగిన ఎన్నికల ఫలితాలపై చెలరేగిన వివాదం కోర్టు జోక్యంతో ఇటీవలే సమసిపోగా... త్వరలోనే మళ్లీ పూర్తి స్థాయిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బోపన్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బోపన్న ఇప్పటికే కర్ణాటక టెన్నిస్ సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ‘ఏఐటీఏలో ఎన్నికల సమయం వచ్చింది. నాకూ ఏదైనా అవకాశం దొరికితే ఈ పరిపాలనలో భాగం కావాలని కోరుకుంటున్నా. భారత టెన్నిస్‌ను అభివృద్ధి చేసే దిశగా కీలక మార్పులు చేయగలననే విశ్వాసం నాకుంది. అలాంటి అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఏదో ఒక పదవి తీసుకోవడం నా ఉద్దేశం కాదు. నా వంతుగా ఏదైనా చేయగలనని నమ్మితే కచ్చితంగా వస్తా’ అని బోపన్న చెప్పాడు. మరోవైపు భారత టెన్నిస్‌లో డబుల్స్ ఆటగాళ్లను తీర్చిదిద్దే క్రమంలో తన సొంత అకాడమీలో సాగుతున్న ‘డబుల్స్ డ్రీమ్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంపై కూడా బోపన్న మాట్లాడాడు. ఇటీవలి కాలంలో డబుల్స్‌కు కూడా ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో తాను దానిపై దృష్టి పెట్టానని, పైగా స్పాన్సర్ల సహకారం కూడా లభించిందని అతను వెల్లడించాడు. ‘మా అకాడమీలో డబుల్స్ ఆటగాళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. దీనికి స్పాన్సర్లు కూడా లభించడం సానుకూలాంశం. సింగిల్స్‌తో పోలిస్తే ఇటీవల డబుల్స్‌కు మంచి ప్రాధాన్యత పెరిగింది. అందుకే దీనికి డబుల్స్ డ్రీమ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టాం. మా అకాడమీలో మొత్తం 175 మంది ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఇప్పటికే దక్షిణేశ్వర్ సురేశ్, వైష్ణవి అడ్కర్, దేవ్ జావియా, ప్రార్థన తోంబరే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అసోం, జమ్మూకు చెందిన కొందరు ప్రతిభ గల పేద కుర్రాళ్లకు గుర్తించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో అత్యుత్తమ ఆటగాళ్లు రావాలనేదే నా లక్ష్యం’ అని గతంలో డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన రోహన్ బోపన్న వివరించాడు.
82 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టాతో...
లాస్ ఏంజెలిస్: మహిళల టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు... సుదీర్ఘ కెరీర్లో 12 సింగిల్స్ ట్రోఫీలు సహా ఏకంగా 39 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఘనత... ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు... ఆమె పేరుతోనే మహిళల టెన్నిస్‌లో టీమ్ ఈవెంట్ నిర్వహణ... ఇవన్నీ బిల్లీ జీన్ కింగ్ సొంతం. అయితే ఇంత అసాధారణ కెరీర్ తర్వాత కూడా జీన్ కింగ్ మదిలో ఒక తీరని కోరిక మిగిలిపోయింది. ఆటలో పడి తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయలేకపోయానని అనిపించేది. రెండేళ్ల క్రితమే చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు దానిని సాధించి చూపించింది. 82 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పట్టాతో సగర్వంగా నిలిచింది. లాస్ ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో జీన్ కింగ్ 1961లో అడ్మిషన్ తీసుకుంది. అదే ఏడాది వింబుల్డన్‌లో డబుల్స్ టైటిల్ సాధించడంతో జీన్ కింగ్ చదువుకు దూరమైంది. ఆమె విజయప్రస్థానంలో ఇది మొదటి ట్రోఫీ కాగా... దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె ఆటను శాసించింది. అడ్మిషన్ తీసుకున్న 65 ఏళ్ల తర్వాత ఆమె చేతుల్లోకి డిగ్రీ రావడం విశేషం. ‘దీని విలువ ఎంతో నేను మాటల్లో చెప్పలేను. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే, మీపై మీకు నమ్మకం ఉంటే వయసులో సంబంధం లేదు. దేనికైనా ఆలస్యం అనేదే ఉండదు’ అని బిల్లీ జీన్ కింగ్ వ్యాఖ్యానించింది. 2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న మరో 6 వేల మందితో కలిసి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కరతాళ ధ్వనుల మధ్య ఆమె తన డిగ్రీ పట్టాను అందుకుంది.
వైభవ్,జురేల్ ఊచకోత.. లక్నోపై రాజస్తాన్ విక్టరీ
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు మరింత దగ్గరైంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. లక్నో విధించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ (93) విధ్వంసానికి తోడు ధ్రువ్ జురేల్ (53 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్, మోసిన్ ఖాన్ చెరొక వికెట్ తీశారు.అంతకముందు లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (57 బంతుల్లో 96 పరుగులు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోస్ ఇంగ్లిస్ (60) అర్థశతకంతో రాణించాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన పూరన్ (16) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పంత్ (23 బంతుల్లో 35) పర్వాలేదనిపించాడు. అయితే లక్నో చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి 220 పరుగులకు పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో యష్ రాజ్ 2 వికెట్లు తీయగా, ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.ఈ విజయంతో రాజస్తాన్ 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన రాజస్తాన్ తమ చివరి మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరుకోనుంది. రాజస్తాన్ తమ చివరి మ్యాచ్‌ను మే 24 (ఆదివారం) ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.Joy and jubilation in Jaipur 🩷🥳A statement chase from @rajasthanroyals sees them jump back into the 🔝4️⃣ 👏Scorecard ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #KhelBindaas | #RRvLSG pic.twitter.com/7lJD2IYOUF— IndianPremierLeague (@IPL) May 19, 2026చదవండి: వైభవ్ విధ్వంసం.. లక్నో బౌలర్లకు చుక్కలు!
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భవ్యంగా మరో దోపిడీ... మొబైల్ మెడికల్ యూనిట్స్‌లో వైద్య పరీక్షల పేరిట ఏటా 162 కోట్ల రూపాయల పందేరం
‘పెట్రో’ ధరల మంట..భగ్గుమన్న జనం. వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ విజన్, స్కామ్‌కు డిజైన్... గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా బండారం బట్టబయలు
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన
భారత్‌కు ఇంధన భద్రత... భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు...
ఈ నెల 30 నుంచి మూడో విడత ఎస్ఐఆర్... 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన
కొనుగోలుదారులకు బిగ్ షాక్... బంగారం, వెండిపై దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు
ప్రధాని మోదీ హెచ్చరికలతో వణికిన మార్కెట్లు... పొదుపు చర్యల పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు
తెలంగాణలో బండి సంజయ్ తనయుడు భగీరథపై నమోదైన కేసు
తెలంగాణలోనూ గెలుస్తాం... పరేడ్‌గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
బిజినెస్
నేను అడ్వైజర్ కాదు.. పెట్టుబడులు మీ ఇష్టం
పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు.. ఆర్థికపరమైన సమాచారం వెల్లడించే రాబర్ట్ కియోసాకి తొలిసారి ఘాటుగా స్పదించారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని, ఇతరులకు పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఆర్ధిక సలహాదారుని కారు.. అయితే నా పేరును ఉపయోగించి, కొందరు వ్యక్తులు.. నేను చెప్పినట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయాలను చెబుతున్నారు. వారికి నా లాయర్ ద్వారా నోటీసులు పంపించాను. నా పేరు వాడి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాను.I AM NOT A FINANCIAl ADVISORMy attorney has sent a “Cease and Decist” notice to someone or group who is using my name to state investments I recommend.Please be aware I will always share with you what I am investing in and why.I do not recommend anyone invest in what I am…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 19, 2026నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో మాత్రమే చెబుతాను. నేను ఎవరిని ఇక్కడే పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదని కియోసాకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఏథీరియం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాను అని చెప్పారు. నాకు 401(k), లేదా IRA వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు లేవని.. స్టాక్స్ లేదా బాండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టడం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహానేను ఏం చేస్తున్నానో చెబుతాను. కానీ ఇతరులు వాటిని తప్పకుండా అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక నిర్ణయాలను తన ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తీసుకోవడం మంచిది. కియోసాకి మాటలను బట్టి చూస్తే.. ఎవరుపడితే వారు చెప్పినమాటలు విని పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Vodafone Idea: రూ.లక్ష కోట్లు సమీకరణపై ఆశలు
వచ్చే మూడేళ్లలో అవసరమయ్యే రూ. 1 లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు కొత్త రుణాలు, ట్యాక్స్ రిఫండ్లు, ప్రమోటర్ల నుంచి మరిన్ని పెట్టుబడులపై టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) భారీగా ఆశలు పెట్టుకుంది. మార్కెట్లో నిలబడే దిశగా నెట్వర్క్ని మెరుగుపర్చుకునేందుకు కంపెనీ దాదాపు రూ. 45,000 కోట్లు వెచ్చించనుంది. అలాగే, వచ్చే మూడేళ్లలో స్పెక్ట్రం చార్జీల కింద సంస్థ రూ. 49,000 కోట్లు, రుణభారానికి సంబంధించిన వడ్డీల కోసం మరో రూ. 5,000-6,000 కోట్లు చెల్లించాల్సి రానుంది.అయితే.. మరింత రుణాన్ని ఈక్విటీ కింద మార్చాల్సిన అవసరం లేకుండానే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తేజస్ మెహతా తెలిపారు. తాము రూ. 25,000 కోట్ల నిధులతో పాటు మూడేళ్ల వ్యవధిలో రూ. 60,000 కోట్ల వరకు ఎబిటాను సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఇక ట్యాక్స్ రిఫండ్ కింద మరో రూ. 10,000 కోట్లు రావాల్సి ఉంటుందని వివరించారు.కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలు..పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా మరిన్ని ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలను ఆవిష్కరించినట్లు వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా తెలిపారు. ఇవి 7 రోజులు, 14 రోజులు, 21 రోజుల కాలవ్యవధితో లభిస్తాయని వివరించారు. దీనితో మొత్తం 1 రోజు నుంచి 30 రోజుల వరకు వేలిడిటీతో 17 రకాల ప్యాక్‌లను అందిస్తున్నట్లవుతుందన్నారు.
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) త్వరలో, భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టబోతోందని వచ్చిన సమాచారం.. టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈసారి కంపెనీ సుమారు 10 శాతం మందిని తొలగించే అవకాశం ఉంది.మెటా కంపెనీ సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. 2025 చివరి నాటికి సంస్థలో పనిచేసేవారి సంఖ్య సుమారు 78,000గా ఉండేది. దీన్నిబట్టి చూస్తే లేఆఫ్స్ ప్రభావం సుమారు 10 శాతం ఉద్యోగులపై పడుతుందని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఖర్చులు తగ్గించడమే కాకుండా, కంపెనీని కొత్త దిశగా మలచడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అని తెలుస్తోంది.మెటా ఇప్పుడు తన సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకోవడంలో భాగంగా.. పెద్ద పెద్ద టీమ్‌లకు బదులుగా చిన్న, వేగంగా పనిచేసే టీమ్‌లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఏఐ కేంద్రంగా మారుతోంది. సంస్థ భవిష్యత్ పెట్టుబడుల్లో భారీ భాగాన్ని ఏఐ డేటా సెంటర్లు, చిప్‌లు, మోడల్ ట్రైనింగ్ వంటి రంగాల్లో పెట్టనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాదు, 7000 మంది కొత్త ఏఐ ఆధారిత ప్రాజెక్ట్‌ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఉద్యోగుల్లో అసంతృప్తిని కూడా పెంచుతున్నాయి. దీంతో కంపెనీ అంతర్గత వాతావరణం కొంత ఒత్తిడిగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని AI టూల్స్ ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తాయన్న భయం కూడా ఉంది. కంపెనీ మాత్రం వాటిని కేవలం AI శిక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరణ ఇస్తోంది.
పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!
వంటనూనెల దిగుమతులు 2025–26 నూనెల సీజన్లో (నవంబర్–ఏప్రిల్) 13 శాతం పెరిగి 7.94 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా పామాయిల్ దిగుమతులు భారీగా పెరిగినట్టు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో దిగుతులు 7.04 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.విలువ పరంగా చూస్తే రూ.73,000 కోట్ల నుంచి రూ.87,000 కోట్లకు చేరాయి. మొత్తం నూనెల దిగుమతుల్లో వంటనూనెలు 7.82 మిలియన్ టన్నులుగా ఉంటే, 1,21,000 టన్నులు నాన్ ఎడిబుల్ నూనెలు ఉన్నాయి. పామాయిల్ దిగుమతులు దాదాపు రెట్టింపై 3.97 మిలియన్ టన్నులకు చేరాయి. సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతులు 3.85 మిలియన్ టన్నులకు తగ్గాయి.పామాయిల్ ధరలు 14–15 శాతం, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల ధరలు 17–22 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి. మే చివరికి దేశంలో మొత్తం నూనె నిల్వలు 2.12 మిలియన్ టన్నులకు చేరాయి.
ఫ్యామిలీ
ఇరాన్లో 134 ఏళ్ల నాటి పురాతన విష్ణు ఆలయం..!
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎన్ని ఇక్కట్లు వచ్చాయో తెలిసిందే. గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు దాని అన్నిట్లపై దాని ప్రభావం ఏం రేంజ్లో ఉందో తెలసిందే హార్బూజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. భారత్ పట్ల సముచితంగా ఇరాన్ ఉన్నా..మనకు ఈ ఇబ్బందులు మాతరం ఇప్పట్లో తగ్గేలే లేని పరిస్థితి. ఈ తరుణంలో ఇరాన్లో మన భారతీయవ దేవాలయంకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పైగా విష్ణు మంత్రాలు సైతం పర్షియన్ భాషలోనే ఉండటం విశేషం. మరి ఆ ఆలయ విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందామా.!బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్ రాజధాని అయిన బందర్ అబ్బాస్‌లో ఉన్న విష్ణు దేవాలయం ఉన్న వీడియోని నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఏంటా ఆలయం అంటూ చర్చలు మొదలయ్యాయి. ఆ వీడియో క్యాప్షన్‌లో రాన్‌లోని బందర్ అబ్బాస్‌లో ఉన్న పురాతన హిందూ విష్ణు దేవాలయం. 1892లో, ఖజార్ యుగంలో నిర్మించబడింది. ఈ నగరంలో పనిచేస్తున్న భారతదేశానికి చెందిన హిందూ వ్యాపారుల కోసం దీనిని నిర్మించారు, ఆ గుడిలోని పాట సైతం పర్షియన్ భాషలోనే ఉంది అని పేర్కొన్నారు. 83 ఏళ్ల నటుడు అమితాబ్ షేర్ చేసిన వీడియో కారణంగా అందరిలో ఒక్కసారిగా ఆ ఆలయ విశేషాలు గురించి తెలుసుకునే ఆసక్తిని రేకెత్తించింది. ఆలయ చరిత్రచారిత్రక కథనాలు, యూట్యూబ్‌లోని వివిధ ట్రావెల్ వ్లాగ్‌ల ప్రకారం..ఈ ఆలయం 1892లో మహమ్మద్ హసన్ సాద్-ఓల్-మాలిక్ పాలనలో హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో నిర్మించారని తెలుస్తోంది. బందర్ అబ్బాస్, భౌగోళికంగా ఇది ప్రసిద్ధిగాంచిన ప్రదేశం, అదీగాక ముఖ్యమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి వెంబడి ఉంది. ఇది విష్ణుమూర్తి ఆలయం. ఒకప్పుడు, భారతీయులకు, ఇరాన్‌లకు మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు ప్రతికగా ఈ దేవాలయం నిలుస్తోంది. ఇది ఇండో-ఇరానియన్ వాస్తుశైలికి నిలువెత్తు నిదర్శనం. అలాగే చరిత్రకారుల ప్రకారం..కవి,రచయిత మహమ్మద్ అలీ సదీద్ అల్-సల్తానే తన ఒక రచనలో బ్రిటిష్ ఇండియన్ కంపెనీ కోసం పనిచేస్తున్న భారతీయులకు 1888లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి లభించిందని పేర్కొన్నారు. ఈ నిర్మాణం పూర్తి కావడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది, ఆ తర్వాత హిందూ కమ్యూనిటీలకు ప్రత్యేకంగా ఒక దేవాలయం ఏర్పడింది. అప్పట్లో ఇరు వర్గాలు ఎంత శాంతియుతంగా జీవించాయనేందుకు నిదర్శనం ఈ కట్టడం. స్థానికులు హిందువులను 'గూర్' లేదా 'గాబర్' అని పిలిచేవారు కాబట్టి, ఈ ఆలయాన్ని స్థానికులు 'గూరన్' అని పిలుస్తారు. భారత్‌లో ఉండే ఆలయాల మాదిరిగా సాంప్రదాయ వాస్తుశిల్పం ఈ ఆలయానికి లేదు. మధ్యలో ఉన్న చతురస్రాకార గది ఉల్లిపాయ ఆకారంలో ఉన్న గోపురంతో కప్పబడి ఉంటుంది, దానిపై తామర పువ్వుల చెక్కి ఉన్నాయి. ఈ గుడిలోనే పూజారులు, సన్యాసుల కోసం గదులు కూడా నిర్మించారు. 1979 ఇస్లామిక విప్లవం కారణంగా ఈ గుడిలోని చాలా విగ్రహాలు, చిత్రాలు ధ్వసం అయ్యాయి. పైగా అధిక సంఖ్యల్లో భారతీయులు ఇరాన్‌ను విడిచిపెట్టారు. ఈ ఆలయంలో బుద్ధుడు, విష్ణుమూర్తి విగ్రహాలు, శ్రీకృష్ణుని చిత్రాలను చూడవచ్చు. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా, ఆయన పక్కన రాధ కూర్చుని ఉన్న ఒక చిత్రం ఉంది. పునరుద్ధరణ అవసరమైన హిందూ దేవతల పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకుని ఉన్న ఒక గది మ్యూజియంగా మారింది. అక్కడి పెట్టెలలో ఒకదానిలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజు శివుని పురాతన విగ్రహం ఉంది. కాగా ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు, ఇరాన్‌లోని సిస్తాన్ , బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్‌లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.ఆ ఆలయంలో పాటలు..ఏయ్ విష్ణు జాన్ (ఓ ప్రియమైన విష్ణు)ఏయ్ రామ జాన్ (ఓ ప్రియమైన రామా)ఏయ్ కృష్ణ జాన్ (ఓ ప్రియమైన కృష్ణా)దర్ ఖల్బ్-ఎ మా బేమన్ (మా హృదయాలలో ఉండిపో)హమీషే బేమన్-2 (శాశ్వతంగా ఉండిపో)నూర్-ఎ తో బేతాబాద్ (నీ కాంతి ప్రకాశించుగాక)ఇష్క్-ఎ తో బేతాబాద్ (నీ ప్రేమ ప్రకాశించుగాక) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) (చదవండి: లాటరీ విధానం మొదలైంది ఆ ఆలయ నుంచే..! పాప పరిహార క్షేత్రం)
పాటలు పాడటం ఇంత మంచిదా..? హార్వర్డ్ నిపుణుల షాకింగ్ విషయాలు
సంగీతానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన పెద్దలు చెబతుండటం విన్నాం. అంతెందుకు శ్రావ్యమైన సంగీతం వింటుంటే శారీరకంగా, మానసికంగా బాగుంటాం అని నిపుణులు సైతం అంటున్నమాటే. తాజాగా వినడమే కాదు పాటలు పాడితే మన జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందట. పైగా గట్ హెల్త్ బాగుంటుందని సాక్షాత్తు హార్వర్డ్ నిపుణులే చెబుతున్నారు. అదేవిధంగానో ఆ నిపుణుల మాటల్లోనే తెలుసుకుందామా.!.పాడటం అనేది కళాత్మక ప్రక్రియ. మరి దీనికి జీర్ణక్రియకు సంబంధం ఎలా అంటే.. పాటలు పాడినప్పుడు మనసు, పేగులు, నాడీ వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉంటుందో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. ఒక బృందంగా పాడుతున్నప్పుడు శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ (ఏ), కార్డిసాల్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో గమనించారు. పాడటం అనేది మానవ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందట. ఒత్తిడి, ఆందోళనతో చాలామంది బాధపడుతుంటారు. కానీ కొందరు దీన్ని అధిగమించిగలుగుతారు అందుకు ఇదే కారణమని అంటున్నారు.పాడినప్పుడు ఏం జరుగుతుందంటే..శరీరంపై సానుకూల ప్రభావం మెదడు నుంచి మొదలై వేగస్ నాడి ప్రేరణ ద్వారా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకోసం బీథోవెన్ సంగీతాన్ని ఆలపిస్తున్న బృందంపై పరిశోధనలు చేయగా, వారందిరలోనూ పాడటం కారణంగా లాలాజలంలో ఒక కీలకమైన రోగనిరోధక యాంటీబాడీ నాటకీయంగా పెరగడం గుర్తించామని తెలిపారు. ఆ యాంటీబాడీ.. జీర్ణవ్యవస్థ లోపలి పొర, గొంతు, శ్వాస మార్గాలలో మన శరీరానికి మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుందట. ఫలితంగా వ్యాధికారకాలు మనపై పట్టు సాధించే అవకాశం రాకమునుపే ఈ యాంటీబాడీ అడ్డుగోడగా మారుతుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే గానానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉందని చెబుతున్నారు. మెదడుకు, పేగుకి మధ్య ఉన్న ప్రధాన సమాచార ప్రసార మార్గం అయిన వేగస్ నాడి పాటను ఆలపించగానే ఉత్తేజితమవుతుందట. ఎప్పుడైతే పాట కోసం ఉదర శ్వాసను ఉపయోగిస్తామో అప్పుడు ఈ వేగస్ నాడీ తక్షణమే యాక్టివ్ అవుతుందట. దాంతో విశ్రాంతి, జీర్ణక్రియ అనే ప్రక్రియ ఆటోమేటిగ్గా ఆన్ అయ్యి ప్రేగులు అత్యుత్తమంగా పనిచేయడం ప్రారంభిస్తాయట. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమేగాక, ప్రేగుల లోపలి పొర ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు శరీరంలో మంచి సూక్ష్మజీవుల సమతుల్యతకు మద్దతిస్తుందట. గానం ఎలా హెల్ప్ అవుతుందంటే..గానం విశ్రాంతిని ప్రోత్సహించి ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా మనం రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోతాం. దాంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ పాట పడటం కోసం ఉదర శ్వాసను వినియోగిస్తాం దాంతో శ్వాశ, నాడీవ్యవస్థ నియంత్రణ ఫలితం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. జీర్ణవ్యవస్థకు మెదడు నుంచి సరైన సంకేతాలు అందితేనే తన పనిని సజావుగా జరపగలదట. అందువల్లే గానం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నొక్కి చెప్పగలమని అన్నారు. గానం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అది సమర్థవంతంగా సంకేతాలను అందించడంతో ప్రేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని అన్నారు. అందరూ పాడేటప్పుడు లోతైన శ్వాసను తీసుకుంటే వేగస్ నాడీ ఉత్తేజమయ్యి..జీర్ణవ్యవస్థ బాగుండేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. అందుకే మన పూర్వీకులు మన చేత నిరంతరం జపాలు, పారాయణాల పేర్లతో మంత్రాలు, భక్తిపాటలను లయబద్ధంగా ఆలపించేలా చేసేవారని అంటున్నారు. అంటే మెరుగైన ఆరోగ్యానికి చక్కటి జీవనశైలి, శ్వాస, మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమనేది గుర్తురెగండి అని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం View this post on Instagram A post shared by Akanksha Pandey (@acanxa) (చదవండి: వడదెబ్బకు పారాసెటమాల్ ఉపయోగిస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే..)
ఆమె ఐస్‌క్రీమ్ బ్రాండ్‌కి అమెరికన్లే ఫిదా..! ఏడాదికి రూ. 2 వేల కోట్లు..
ఫుడ్‌తో కొంగొత్త పరిచయాలే కాదు..ఓ దేశాన్నే మైమరిపించొచ్చు. ఎంతటి శత్రుత్వాలు, కోపతాపలు..ఒక్క విందుతో సమసిపోతాయి. అలాంటి టేస్టీ ఫుడ్‌తో ఇతర దేశాల మనసును దోచుకుని కోట్లు ఆర్జించడం మాటలు కాదుకదా. అలాంటి ఘన విజయాన్నే అందుకుంది ఈ భారత సంతతి మహిళ. మన భారతీయ రుచులను జోడించి తయారు చేసిన ఐస్‌క్రీమ్ బ్రాండ్‌తో దూసుకుపోతూ..శెభాష్ అనిపించుకుంటోంది పూజా బావిషి. ఎవరామె అంటే..భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త పూజా బావిషి, 'మలై' అనే ఐస్ క్రీమ్ బ్రాండ్‌తో అమెరికన్లను ఆకట్టుకుంటోంది. ఇది ఏడాదికి రూ. రెండు వేల కోట్లు టర్నోవర్‌ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇద హోల్‌సేల్ ఈ కామర్స్ వ్యాపారంగా మారింది. 46 ఏళ్ల వ్యవస్థాపకురాలు, సీఈఓ 2015లొ ఈ మలైని ప్రారంభించారు. ఈ వ్యాపారం న్యూయార్క్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలలో నాలుగు దుకాణాలను నిర్వహిస్తోంది. చాలామటుకు ఐస్‌క్రీమ్‌లలో చాక్లెట్, వెనిలా వంటి ఫ్లేవర్లు చూశాం. కానీ అంతకుమించిన రుచి కోసం మలై వంటి వెరైటీ టేస్ట్‌ని పరిచయం చేశారు. దీని తయారీలో ఉపయోగించిన యాలకులు, గులాబీ, కుంకుమపువ్వు, జాజికాయ వంటి రుచులను జోడించడంతో అమెరికా వాసుల మనసులను దోచుకుంది ఈ మలై ఐస్ క్రీమ్. ఈ కంపెనీ 2025లోనే సుమారు రూ. రెండు వేల కోట్లు పైనే ఆర్జించేలా అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతకుముందు ఏడాది 2024, 2025 సంత్సరాలలో సంస్థ లాభదాయకంగా సాగింది. ఇక పూజా విద్యా నేపథ్యం వచ్చేసి..బావిషి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే ఆమె ఆమె వాషింగ్టన్ డిసి-ఆధారిత లాభాపేక్షలేని సంస్థ అయిన ఈక్వల్ రైట్స్ సెంటర్లో పౌర హక్కుల ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిందిలా..స్నేహితులకు ఇంట్లో తయారు చేసిన ఐస్క్రీంల రుచి చూపించినప్పుడు వ్యాపారం చేయాలనే ఆలోచనకు అంకురార్పణ చేసినట్లు గుర్తు చేసుకుంది. అల్లం-స్టార్ సోంపు ఐస్ క్రీమ్ - ఒక డిన్నర్ పార్టీలో తక్షణమే అందర్నీ ఆకట్టు కోవడంతో..ఇలాంటి టేస్టే టేస్టీ ఐస్‌క్రీం షాపు పెట్టాలని భావించారట ఆమె. అయితే తన ఉత్పత్తులు మార్కెట్లో క్లిక్ అవుతాయో లేతో అన్న సందేహం మాత్రం బాగా ఉండేదని చెప్పుకొచ్చారామె. అయితే తన షాపుకు వచ్చే కస్టమర్ ఎలాంటి ఫ్లేవర్ కోరుకుంటున్నారు అనేది నిశితంగా గమనిస్తూ..టేస్టీ, టేస్టీ..మలై ఐస్‌క్రీమ్‌ని తీసుకొచ్చినట్లు తెలిపారు. అలాగే తన షాపు కి వచ్చే కస్టమర్ ఎవరు?, వాళ్లకేం కావాలన్నదే పూర్తిగా అవగాహన ఉండాలని, లేదంటే వ్యాపారం లాభదాయకంగా ఉండదని అంటోంది. అలాగే తాను కేవలం లాభాల మీదే గాక, వ్యాపార విస్తరణపై కూడా దృష్టిపెట్టానని అన్నారు. అలాగే తాను వ్యాపారాన్ని చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి..అన్ని విధాల క్లిక అవుతుందని నమ్మకం కొనసాగేక ముందుకు తీసుకెళ్లానని అన్నారు. అలాగే భారతీయ రుచులు ప్రయోగాత్మకమైనవి కావు, ఈ రుచులను ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించడం విశేషం. పైగా మార్కెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది. అందుకు చాలా గర్వకారణంగా ఉందంటోంది పూజ. View this post on Instagram A post shared by Malai (@malai_icecream) (చదవండి: సూటు వేసుకుని వంట..! నెలకు ఏకంగా రూ. 7 లక్షలు..)
స్కూలు బస్సుకి పసుపు రంగే ఎందుకు?
ఫ్రెండ్స్.. మనం రోజూ స్కూలుకి వెళ్లే బస్సు పసుపు రంగులోనే ఉంటుంది. ఎందుకలా ఉంటుందో మీరెపుడైనా ఆలోచించారా? ఎందుకంటారు? ఎందుకంటే పసుపు రంగు ఎంత దూరం నుంచైనా ఆకర్షిస్తుంది. దానివల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి.టాక్సీలు, స్కులు బస్సులకు, రసాయనాలను సూచించే ఫలకాలకు ఈ రంగును వాడుతుంటారు. ప్రమాదాన్ని సూచించే సందర్భాలకి ఎరుపు రంగుని వాడితే, జాగ్రత్త పాటించాల్సిన సూచనల కోసం పసుపుని వాడుతారన్నమాట. అలాగే ట్రాఫిక్ సిగ్నల్‌లో ఈ రంగు లైట్ వెలిగితే.. నెమ్మదిగా వెళ్లాలని అర్థం. ఔనా?హార్న్‌బిల్ అనే పక్షి తన పిల్లల్ని ఎవరూ చూడకుండా, తాకకుండా వుండాలని వాటి నివాసం కోసం చాలా సురక్షితమైన ప్రదేశం ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక చెట్టుతొర్రలో వుంచి, ఆ తొర్రను వుట్టి లేదా బెరడుతో కప్పేస్తుంది. అయితే గాలి, వెలుతురు కోసం చిన్న రంధ్రం ఒకటి వుంచుతుంది. పిల్లలకు ఆ రంధ్రంలోంచి వుుక్కుతో ఆహారాన్ని అందిస్తుంది. అలా పిల్లలు పెద్దవయ్యేదాకా ఆ తల్లికి ఈ కష్టం తప్పదు వురి.
అంతర్జాతీయం
ప్రైవేట్ ఉద్యోగులకు నాలుగు రోజుల సెలవులు ప్రకటన
అబుదాబి: యూఏఈ వ్యాప్తంగా ప్రైవేటు రంగ ఉద్యోగులకు అరాఫత్ దినోత్సవం, ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగలను పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఈద్ సెలవులు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మే 26న ప్రారంభమై మే 29 వరకు కొనసాగుతాయి.ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇదే వరకే ప్రకటించారు. వారికి మే 25 నుంచి మే 29 వరకు మొత్తం 5 రోజులు సెలవులు ఉంటాయి. శని, ఆదివారాల వారాంతపు సెలవుల అనంతరం ఇరు రంగాల ఉద్యోగులూ తిరిగి జూన్ 1 నుంచి విధులకు హాజరు కానున్నారు. కాగా ఆదివారం సాయంత్రం (మే 17) 'దుల్ హిజ్జా' నెలవంక కనిపించినట్లు మూన్ సైటింగ్ కమిటీలు, ఖగోళ పరిశోధన కేంద్రాలు అధికారికంగా ధ్రువీకరించాయి. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్లో చివరి నెల అయిన ధు అల్ హిజ్జా 10వ రోజున ఈద్ అల్ అధా జరుపుకుంటారు. అరాఫా మే 26 మంగళవారం వచ్చే అవకాశం ఉంది. ఈద్ అల్ అధా పర్వదినం మే 27 బుధవారం ఉదయం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇరాన్‌తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై జరపాలనుకున్న సైనిక దాడిని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల అధినేతలు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రతిపాదనల విషయంలో తిరస్కరణల పరంపర కొనసాగుతుండడంతో మరోసారి మధ్యప్రాచ్యంలో బాంబుల మోత మోగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ట్రంప్ తాజా నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి కాస్త పక్కకు తొలిగాయి."ఇరాన్‌తో ప్రస్తుతం కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై మేము తలపెట్టిన సైనిక దాడిని వాయిదా వేయమని ఖతార్ అమీర్ షేక్ తమీమ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్‌లు నన్ను కోరారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు లేకుండా చేస్తామమని" ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో రాసుకొచ్చారు. కాగా ఇరాన్ విషయంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ భిన్నమైన వైఖరులను కలిగి ఉన్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చలు సఫలం కాకపోతే భారీ దాడి చేస్తామని ట్రంప్ ఇటీవలే మరోసారి హెచ్చరించారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే మొత్తం తమ ప్రాంతమే అతలాకుతలం అవుతుందని భావించిన గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇకపై ఒకటో తేదీనే జీతం.. లేదంటే కంపెనీ క్లోజ్!
అబుదాబి: యూఏఈలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి శ్రమకు తగ్గ ఫలితం సమయానికి దక్కేలా 'మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 0340 ఆఫ్ 2026' పేరుతో కొత్త చట్టాన్ని యూఏఈ మానవ వనరులు, స్వదేశీకరణ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. ప్రైవేట్ రంగ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తేదీ నాడే జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటో తేదీ లోపు జీతం అకౌంట్లో పడకపోతే, దానిని 'ఆలస్యమైన వేతనం' గా పరిగణిస్తారు. కంపెనీ సేఫ్ జోన్లో ఉండాలంటే 1వ తేదీ నాటికి ఉద్యోగి మొత్తం జీతంలో కనీసం 85% డబ్బులు అకౌంట్లో వేయాలి. ఒకవేళ జీతం చెల్లించకపోతే రెండో రోజు నుంచి సదరు కంపెనీపై ప్రభుత్వం నిఘా పెట్టి, నోటీసులు జారీచేస్తోంది. ప్రభుత్వం ఐదు రోజుల వరకు చూస్తోంది. అప్పటికి ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమ కాకపోతే సదరు కంపెనీలకు కొత్త వర్క్ పర్మిట్లను జారీ చేయడం అధికారులు నిలిపివేస్తారు.16 రోజులు దాటితే కార్మికుల తరపున మంత్రిత్వ శాఖే స్వయంగా రంగంలోకి దిగి కేసు నమోదు చేస్తోంది. ఈ నిబంధనలు జూన్ 1, 2026 నుండి అమలుల్లోకి రానున్నాయి. ఈ కొత్త చట్టంతో యూఏఈలో పనిచేస్తున్నప్రవాస భారతీయులకు మేలు జరగనుంది.అయితే 11 ప్రత్యేక కేసులకు మాత్రం ఈ గడువు చట్టం నుండి మినహాయింపు ఇచ్చారు:కోర్టులో వేతన వివాదాల క్లెయిమ్ నడుస్తున్న కార్మికులు.కంపెనీ నుండి పారిపోయినట్లు రిపోర్ట్ నమోదైన వారు.జైలు లేదా కస్టడీలో ఉండి విధులకు హాజరుకాలేని వారు.అధికారికంగా జీతం లేని సెలవులో ఉన్న కాలంలో.ఓడలపై పనిచేసే నావికులు (సీఫేరర్స్).విదేశీ కంపెనీల బ్రాంచ్‌లలో పనిచేస్తూ, యూఏఈ వెలుపల జీతాలు పొందే విదేశీయులు.3 నెలల లోపు కాలపరిమితి గల 'మిషన్ వర్క్ పర్మిట్'లపై ఉన్నవారు.స్థానిక యూఏఈ పౌరుల యాజమాన్యంలోని చేపల వేట పడవలు.స్థానిక పౌరుల స్వంత యాజమాన్యంలోని పబ్లిక్ టాక్సీలు.బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.మతపరమైన ప్రార్థనా స్థలాలు.
రెస్టారెంట్లో బుల్లెట్ల వర్షం.. నలుగురిని బలితీసుకున్న 17 ఏళ్ల కుర్రాడు!
దక్షిణ టర్కీలోని మెర్సిన్ నగరంలో సోమవారం తుపాకుల మోత మోగింది. ఓ దుండగుడు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. టర్కిష్ వార్తా సంస్థ డీహెచ్ఏ ప్రకారం... నిందితుడు మొదట ఒక రెస్టారెంట్లోకి చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత నగరంలోని మరో ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. అనంతరం దుండగుడు కారులో పారిపోయినట్లు డీహెచ్ఏ తమ కథనంలో పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తిని 17 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. నిందుతుడి కోసం పోలీసులు హెలికాప్టర్లతో సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్ధానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్పుల్లో మరణించిన వారిలో రెస్టారెంట్ యజమాని, అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ఉన్నారు. నగరంలోని వేరే చోట జరిగిన కాల్పుల్లో పశువులను మేపుకుంటున్న ఒక యువకుడు, అలాగే ఒక ట్రక్ డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు.చదవండి: పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్‌కు రహస్యంగా..
జాతీయం
నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఆర్సీసీ బ్రాంచి నిర్వాహకుడు తమ ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ నుంచే నీట్లో ప్రశ్నలు వస్తాయని ధీమాగా చెప్పాడు. ఒక్కో సబ్జెక్టులో ఉండే 180 ప్రశ్నలకుగాను ఏకంగా 180 ప్రశ్నలు తామిచ్చే మెటీరియల్ నుంచే ఉంటాయంటూ గొప్పలు చెప్పుకున్నాడు. తమ కోచింగ్‌తో మెడికల్ సీటు గ్యారెంటీ అంటూ భరోసా ఇచ్చాడు. నీట్–2026 ముందు ఎన్డీటీవీ చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. ఓ అభ్యర్థి సోదరుడినంటూ ఎన్డీటీవీ ప్రతినిధి ఒకరు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని కలిశారు. కోచింగ్‌తో ర్యాంకు గ్యారెంటీపై ఆయన అనుమానం వ్యక్తం చేయగా అతడు చెప్పిన విషయాలన్నీ రహస్య కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దేశంలోనే ఏ ఇన్స్టిట్యూట్లోనూ తమ మాదిరి కోచింగ్ ఇవ్వరంటూ అతడు గొప్పలు చెప్పాడు. ఎయిమ్స్ సహా దేశంలోని ఏ మెడికల్ కాలేజీకి వెళ్లి చూసినా తమ కోచింగ్ తీసుకున్న కనీసం ఒక్క స్టూడెంటయినా కనిపిస్తారన్నాడు. 2025 నీట్‌లోనూ తామిచి్చన మెటీరియల్లోని ప్రశ్నలే వచ్చాయని తెలిపాడు. రిజల్టు పక్కా అని చెప్పగలిగేది దేశం మొత్తమ్మీద కేవలం తమ ఇన్స్టిట్యూట్ మాత్రమేనన్నాడు. ఏ ఇతర కోచింగ్‌లోనూ ఇప్పటి వరకు ఇలాంటి ఫలితాలు రాలేదని ధీమా వ్యక్తం చేశాడు. నీట్–2025లో వచ్చిన ప్రశ్నలు అచ్చుగుద్దినట్లుగా తమ మెటీరియల్‌లో ఎక్కడున్నదీ కచ్చితంగా చెప్పగలనన్నాడు. ‘పరీక్షలో అడిగిన 180 ప్రశ్నలకు గాను 180 ప్రశ్నలు ఇప్పటికే మా స్టడీ మెటీరియల్‌లో ఎక్కడో ఒకచోట వచ్చాయని మేం నిరూపించగలం. యాదృచ్ఛికంగానే ఈ క్వశ్చన్ బ్యాంకులోని ఏదైనా ఒక పేజీని తెరిచి మరీ ఇలాంటి ప్రశ్నలను చూపించగలను..’అంటూ బల్లగుద్ది చెప్పడం గమనార్హం. ఈ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు శివరాజ్ రఘునాథ్ మోటెగావొంకర్ను లాతూర్‌లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడం తెల్సిందే.
పంటల దిగుబడులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం : ఐసీఏఆర్ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దీని కారణంగా పంటల దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదముందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) వెల్లడించింది. గతంలో ఇదేమాదిరి ఎల్‌నినో పరిస్థితులు తలెత్తినప్పుడు వరి సహా మొక్కజొన్న, సజ్జ వంటి వర్షాధార పంటల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ఈసారి పంటల దిగుబడులు కనీసం 10 శాతం మేర తగ్గుతాయని అంచనా వేసింది. నైరుతి రుతు పవనాలతో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే అంచనా వేసింది. జూన్– సెప్టెంబర్ మధ్య కాలంలో తక్కువ వర్షాల కారణంగా నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని ఐసీఏఆర్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 2002, 2004, 2009 సీజన్లలో ఎల్‌నినో ఏర్పడినప్పుడు 77 జిల్లాల్లో వరి దిగుబడి 10 శాతానికి పైగా పడిపోగా, మొక్కజొన్న ఉత్పత్తి 65 జిల్లాల్లో ఇదే స్థాయిలో తగ్గినట్లు గుర్తించింది. ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో వరిపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపించి నట్లు తెలిపింది. ఇదే సమయంలో జొన్న, సజ్జ దిగుబడులు కూడా 36 జిల్లాల్లో 10 శాతానికి పైగా తగ్గినట్లు గుర్తించామంది. వర్షాధార ప్రాంతాలే ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయని వివరించింది. ఈ ఏడాది సైతం ఎల్‌నినో పరిస్థితులు కొనసాగనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ఐసీఏఆర్ సూచించింది. కరువును తట్టుకునే విత్తనాల ప్రోత్సాహం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, సమర్థవంతమైన నీటి నిర్వహణ, ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాల అమలు ద్వారా రైతుల నష్టాలను తగ్గించాలని రాష్ట్రాలకు సూచించింది. ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?
నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!
బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించడం ప్రతీ భారతీయ యువకుడి కల. అది ఏ ఐటీ ఉద్యోగమో, ప్రభుత్వ రంగ సంస్థ (PSU)లో ఉద్యోగమో అయితే జీవితం సెట్ అన్నంత సంబరం. మంచి జీతం, ఉద్యోగ భద్రత, సమాజంలో లభించే గౌరవం వల్ల ఈ ఉద్యోగాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే, ఈ మధ్య కాలంలో యువ ఉద్యోగుల్లో ట్రెండ్ మారింది. జాబ్‌లో పని ఒత్తిడి (Workplace Stress) కంటే, జీవితంలో మానసిక ప్రశాంతత, ఉద్యోగంలో సంతృప్తి అనేది ప్రధానంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, ఎన్ఐటీ కురుక్షేత్ర (NIT Kurukshetra) పూర్వ విద్యార్థి, 25 ఏళ్ల ఇంజనీర్ సౌరభ్ మిట్టల్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.భారత్ పెట్రోలియం (BPCL) సంస్థలో ఏడాదికి రూ. 19 లక్షల ప్యాకేజీతో లభించిన ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని, ఆయన వదులుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు.కలల ఉద్యోగం... కానీ ఏం లాభంసౌరభ్ మిట్టల్ తన 22వ ఏటనే BPCLలో చేరాడు. ఎన్నో ఆశలతో, ఆశయలతో ఉద్యోగంలో చేరినప్పటికీ, అక్కడి పని వాతావరణం, పరిస్థితులు ఆయన ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. కనీస వసతులు కూడా లేని జీవితం. తనకు పని చేయడానికి కేటాయించిన ఆఫీసు వాస్తవానికి ఒక గిడ్డంగి లాంటిదని సౌరభ్ వివరించారు. అక్కడ తాగడానికి నీళ్లు గానీ, టాయిలెట్ గానీ లేవు. ఏసీ కూడా పాడైందని, దాన్ని తానే స్వయంగా బాగు చేసుకోవాల్సి వచ్చిందని అతను చెప్పాడు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, అతను ఈ విషయాన్ని తన మేనేజర్, హెచ్ఆర్, ఉన్నతాధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకువచ్చినా, ఎలాంటి పరిష్కారం లభించలేదు. దీంతో తన ఇల్లు సుమారు 10 నిమిషాల నడక దూరంలో ఉండటంతో రోజుకు చాలాసార్లు ఇంటికి వెళ్ళేవాడు. తాను ఉద్యోగం మానేసే వరకు పరిస్థితి అలాగే ఉందని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు అక్కడి పని చాలా ఒత్తిడితో కూడుకున్నదని, పాతకాలపు పద్ధతుల్లో సాగేదని విమర్శించారు.అంతేకాకుండా సీనియర్ అధికారుల కోసం ఎయిర్పోర్ట్ పికప్‌లు, హోటల్ బుకింగ్‌లు వంటి వారి వ్యక్తిగత పనులను కూడా తనతో చేయించేవారట. అమ్మకాలు తగ్గినప్పుడు, ఉన్నతాధికారులు నేరుగా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేవారు. వీడియో కాన్ఫరెన్సులు, ఫోన్ కాల్స్ సమయంలో తిట్టడం సర్వసాధారణమైపోయింది.ఆఫీస్ వేళలు ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు, వీకెండ్స్ (శని, ఆదివారాలు) లోనూ ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేవని చెప్పారు. దీంతో లీవ్‌లు దొరకడం కష్టంగా ఉండేదని, ఇక ప్రమోషన్లు, జీతాల పెంపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని పెదవి విరిచారు.. వీటన్నింటికీ మించి, తన చుట్టూ ఉన్న ఉద్యోగులంతా చాలా పెద్ద వయసు వారు కావడంతో, అక్కడ కొత్తగా నేర్చుకోవడానికి గానీ, కెరీర్ ఎదుగుదలకు గానీ పెద్దగా అవకాశం లేదనిపించిందని, "నా జీవితాంతం ఇలాగే గడపడాన్ని నేను ఊహించుకోలేక పోయాను" అని సౌరభ్ తన నిర్ణయాన్ని వివరించాడు.ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశసౌరభ్ నిర్ణయంపై కుటుంబంలో వ్యతిరేకత అయితే ఈ ఉద్యోగాన్ని వదలేయాన్ని సౌరభ్ నిర్ణయాన్ని అమలు చేయడం అంత సులువు కాలేదు. ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే భద్రత, గౌరవం కారణంగా ఆయన తండ్రి ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కొడుకు పడుతున్న మానసిక ఒత్తిడిని గమనించిన తల్లి మాత్రం ఆయన నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్?నెటిజన్ల స్పందన సౌరభ్ మిట్టల్ కథనం ఆన్లైన్లో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. చాలా మంచి, ఆలోచనాత్మకమైన నిర్ణయం. ఆల్ ది బెస్ట్ చాలామంది సౌరభ్ నిర్ణయాన్ని సమర్ధించారు. "నేను కూడా 16 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను, మీ నిర్ణయాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలను. భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని మరొకరు, మంచి పని చేశావు, సోదరా”, “మీకు అంతా మంచే జరగాలి” అంటూ పలువురు సౌరభ్‌కు మద్దతుగా నిలిచారు.
ఆమెకు 74, అతనికి 76.. ఒక్కటయ్యారిలా..
తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. కానీ ఆ ఇద్దరూ జీవితపు చివరి దశలో తోడును సంపాదించుకున్నారు. వారి ఆసక్తికర కథ ఇప్పుడు అందరి హృదయాలను దోచుకుంటోంది. కేరళలోని కొట్టాయం జిల్లాలో 76 ఏళ్ల థామస్, 74 ఏళ్ల లీలమ్మ తమ మిగిలిన జీవితాన్ని కలసి పంచుకోవాలని నిర్ణయించుకుని, పవిత్రమైన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వృద్ధాప్యంలో ఒంటరితనంతో కుమిలిపోవడం కంటే, ఒకరికొకరు అండగా నిలవడమే జీవితానికి అర్థం అని ఈ జంట నిరూపిస్తోంది.ఒంటరి పోరాటం.. థామస్ గతంకల్లర కన్నరతిల్ కు చెందిన కేసీ థామస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు, కేరళ పోలీసు విభాగంలో టెక్నికల్ వింగ్ ఆఫీసర్‌గా సేవలందించి పదవీ విరమణ పొందారు. 2020లో ఆయన భార్య కన్నుమూశారు. ఆయన కుమారుడు అలెక్స్ కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలో స్థిరపడగా, వివాహం చేసుకున్న కుమార్తె మెర్సీ స్థానికంగా ఉంటూ, తండ్రి బాగోగులు చూసుకుంటోంది. పిల్లలు అండగా ఉన్నప్పటికీ, జీవితంలో ఆయనకు ఏదో తెలియని ఒంటరితపం వెంటాడుతోంది. ఆస్పత్రిలో పరిచయం.. కలసిన మనసులు కడుతురుతికి చెందిన లీలమ్మ 16 ఏళ్ల క్రితమే భర్తను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమారులు జోమోన్, జైమోన్ ఇటలీలో స్థిరపడ్డారు. ఏడాదిన్నర క్రితం ఓ ప్రైవేట్ హెల్త్‌కేర్ సెంటర్లో థామస్, లీలమ్మ తొలిసారిగా కలుసుకున్నారు. ఆమెతో ఏర్పడిన అనుబంధంతో థామస్ తన జీవితాన్ని పంచుకోవాలని ఆహ్వానించగా, మొదట్లో ఆమె అంగీకరించలేదు. కానీ నెలన్నర క్రితం ఆయన మళ్లీ ఫోన్ చేసి ప్రతిపాదించడంతో, పిల్లలతో మాట్లాడిన తర్వాత లీలమ్మ తన అంగీకారాన్ని తెలిపారు.థామస్, లీలమ్మల పిల్లలు అనుమతవ్వడంతో..ఇద్దరి పిల్లలు కూడా ఈ వివాహానికి మనస్ఫూర్తిగా మద్దతు పలకడంతో, సోమవారం సాయంత్రం కల్లరలోని సెయింట్ మేరీస్ పుతెన్పల్లి చర్చిలో థామస్, లీలమ్మల వివాహం జరిగింది. బంధువుల సమక్షంలో, థామస్ బంధువు ఫాదర్ అబ్రహం తరతట్టెల్ ఈ వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు థామస్ కుమార్తె కుటుంబంతో పాటు, పారిష్ వికార్ ఫాదర్ థామస్ కరింపుకలాయిల్ హాజరయ్యారు.ఇది కూడా చదవండి: భోజ్‌శాల: 700 ఏళ్ల తర్వాత వెలిగిన అఖండ జ్యోతి
ఎన్ఆర్ఐ
డబ్లిన్‌లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ మహానగరమందు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా చండీ స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయం నందు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి, “జై జై వాసవి మాత” నినాదాల మధ్య పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.సనాతన ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉండటంతో, ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా శాస్త్రోక్తంగా గోపూజను నిర్వహించారు. భక్తులు గోమాత,దూడను దర్శించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను పొందారు. పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని అందరికీ వివరించారు. ఈ సందర్భంగా జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు, ప్రస్తుత పరిస్థితులను అద్దంపట్టే విధంగా మన సంస్కృతిని సంప్రదాయాన్ని దైనందిన జీవితంలో ఎలా తీసుకోవాలనే అంశంపై చిన్నపిల్లల కార్యక్రమం, పిల్లలచే ఆలపించిన మంత్రపుష్పం వంటి సాంస్కృతిక మరియు దైవిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.తరువాత వాసవి స్వరూపమైన కన్యకలతో శాస్త్రోక్తంగా కన్యపూజ నిర్వహించబడింది. అనంతరం దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో దంపతులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అన్నప్రసాద వితరణ జరగగా, కార్యక్రమానికి సహకరించిన ఉభయదారులు మరియు వ్యాపార సంస్థల యజమానులందరికి పినాక శర్మ గారు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సేవాదళ సభ్యులను, ఉభయదారులను, హాజరైన సభ్యులందరినీ కార్యక్రమ నిర్వాహకులు అభినందించారు.(చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం)
ఈ అనుభవంతో భారత్‌ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్‌కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్‌లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్‌లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్‌లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్‌నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్‌లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_)
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్!
అరవింద కృష్ణ స్వామికి అట్లాంటా శంకర నేత్రాలయ సత్కారం
అట్లాంటా: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం Crowne Plaza Atlanta NE నార్క్రాస్లో అత్యంత ఉత్సాహభరితమైన, భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఒక "Meet ’n Greet" (పరిచయ సమావేశం) కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియా, పొరుగు రాష్ట్రాల నుండి 250 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమం, ఆ సంస్థ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా, Medlytix LLC CEO అయిన అరవింద్ కృష్ణ స్వామిని తమ సలహా మండలి (Board of Advisors)లో సరికొత్త సభ్యుడిగా సంస్థ అధికారికంగా ఆహ్వానించింది.అట్లాంటాలోని ప్రముఖ సంగీత, నృత్య అకాడమీల సాంస్కృతిక ప్రదర్శనలు పురోహిత నరసింహాచార్యులు దివ్య సన్నిధిలో, ఈ సమావేశం అర్థవంతంగా, విజయవంతంగా జరగాలని ఆశీస్సులు కోరుతూ, అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి గారితో పాటు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. జగదీష్ శెత్, మెగా దాతలు మరియు బ్రాండ్ అంబాసిడర్లు శ్రీ శంకర్ సుబ్రమణియన్, శ్రీ అరవింద్ కృష్ణస్వామి, శ్రీమతి జయ కృష్ణస్వామి, మరియు డా. కిషోర్ చివుకుల, సలహాదారుల మండలి సభ్యులు, కోశాధికారి మూర్తి రేకపల్లి; జె.సి. శేఖర్ రెడ్డి; పాలక మండలి సభ్యులు డా. రెడ్డి ఊరిమిండి మరియు మెహర్ లంక; సాంస్కృతిక సమన్వయకర్త నీలిమ గడ్డమనుగు; చాప్టర్ ఉపాధ్యక్షుడు వెంకీ నీలం; మరియు అట్లాంటా ఎస్ఎన్ బృందంలోని ఇతర అంకితభావం గల సభ్యులు పాల్గొన్న సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలన, అనగా లాంఛనప్రాయంగా జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.అట్లాంటాలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య, సంగీత అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమంతో ఈవెంట్ ప్రారంభమైంది. సుస్వర సంగీత విద్యాలయంకు చెందిన శాంతి మెడిచెర్ల, భరత దర్శన్ స్కూల్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ అండ్ మ్యూజిక్కు చెందిన సౌజన్య మధుసూదన్, కళాక్ష్య అకాడమీకి చెందిన మిటల్ పటేల్, మరియు నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీకి చెందిన నీలిమ గడ్డమనుగు దీనికి నాయకత్వం వహించారు. ఈ సాంస్కృతిక విభాగంలో భారత్‌కు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు రాము (చెన్నై) అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ప్రతిభావంతులైన స్థానిక గాయకులు శిల్పా ఉప్పులూరి (ఈమె కార్యక్రమ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు), ఫణి డొక్కా, రామ్ దుర్వాసుల, ఉషా మోచర్ల, శాంతి మెడిచర్ల, మరియు అట్లాంటాకు చెందిన రాగ వాహినిలతో కలిసి, ఎంతో ఇష్టపడే క్లాసిక్ చిత్రాల నుండి హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో బహుభాషా మేళవింపును ప్రదర్శించి రాము ఆ సాయంత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు. బహుభాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ప్రదర్శనకు, అధ్యక్షులు బాల ఇందుర్తి ఆయనను ఆప్యాయంగా “ఎస్పీబీ మానసపుత్ర” అని సంబోధించారు.మొబైల్ కంటి శస్త్రచికిత్స విభాగానికి భారీ విరాళంఅరవింద్ కృష్ణస్వామికి సంబంధించిన ఆడియో-విజువల్ (AV) ప్రజెంటేషన్ ప్రదర్శించినప్పుడు, ఆయన చేసిన అద్భుతమైన $555,000 విరాళాన్ని గుర్తించి, ప్రేక్షకులు కరతాళధ్వనులతో హోరెత్తిస్తూ, లేచి నిలబడి ఘన సన్మానం (standing ovation) చేశారు. 12 MESU (Mobile Eye Surgical Unit) 'Adopt-A-Village' కంటి వైద్య శిబిరాలకు మద్దతుగా అరవింద్ $155,000 విరాళం అందించారని అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశంలో వైద్య సేవలు సరిగా అందని అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకచోట కొత్త MESU కేంద్రాన్ని స్థాపించడానికి అరవింద్ ఉదారంగా ప్రకటించిన $400,000 విరాళం వినియోగించబడుతుంది.మహారాష్ట్ర మరియు గుజరాత్‌లలో అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యక్షుడు బాల, ప్రస్తుతం 'శంకర నేత్రాలయ ఇండియా' అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావుతో కలిసి సన్నిహితంగా పనిచేస్తున్నారు. డల్లాస్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు మరియు SMUలో అరవింద్ కృష్ణస్వామికి పూర్వ సహవిద్యార్థి అయిన డాక్టర్ రెడ్డి ఊరిమిండి, అరవింద్‌ను 'శంకర నేత్రాలయ USA'కు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పరోపకార నాయకత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తూ, ప్రసాద్ రెడ్డి కాటమ్రెడ్డితో పాటు అరవింద్ కూడా అర్ధ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించడం చూడటం గర్వకారణం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర నేత్రాలయ అట్లాంటా బృంద సభ్యులలో డా. కిషోర్ రెడ్డి రాసమల్లు; రమేష్ చాపరాల, గిరి కోటగిరి; ప్యాడీ రావు, సుబ్బారావు; శ్రీనివాస్ దుర్గం; చరిత్ర జూలపల్లి; మరియు చాప్టర్ లీడ్లు కార్తికేయన్ వినాయగం మరియు లోగియ అవిలినేలి ఉన్నారు. శంకర నేత్రాలయతో తన ప్రయాణం 2016లో అప్పటి ఉపాధ్యక్షుడు డాక్టర్ శేషు శర్మ చొరవతో ప్రారంభమైందని అధ్యక్షుడు బాల తెలిపారు. ఆ సమయంలో, సంస్థకు కేవలం ఏడు శాఖలు మాత్రమే ఉండేవి; నేడు, ఇది దేశవ్యాప్తంగా ముప్పై శాఖలకు విస్తరించింది. ఈ అద్భుతమైన విస్తరణకు అంకితభావం గల బలమైన వాలంటీర్ల బృందం, వ్యవస్థాపకులు, పద్మభూషణ్ దివంగత డాక్టర్ ఎస్. ఎస్. బద్రీనాథ్ మరియు SNUSA వ్యవస్థాపకులు శ్రీ ఎస్. వి. ఆచార్యల ఆశీస్సులే కారణమని ఆయన పేర్కొన్నారు.
క్రైమ్
రేయ్.. నాశనం అయిపోతారు
దేవుడా ప్లీజ్ ఇలాంటి వాళ్లను ఏం చేయాలో నువ్వే చూడు- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోకు నెటిజన్ పెట్టిన కామెంట్ ఇది. వృద్ధులు అని కూడా చూడకుండా ఆస్తి కోసం అమ్మనాన్నలపై అమానవీయంగా కొడుకు, అతడి పిల్లలు దాడికి తెగబడిన వీడియో చూసినవారంతా ఇలాగే స్పందిస్తున్నారు. అసలు వీళ్లు మనుషులేనా, మనసంటూ ఉందా అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొమ్ముల కోసం కన్నవారిని కిందపడేసి కర్కోటకంగా కాళ్లతో తన్నుతూ దాడి చేస్తున్న దృశ్యాలు సమాజంలో దిగజారుతున్న విలువలకు నిలువెత్తు రుజువుగా సాక్షాత్కరిస్తున్నాయి.సమాజంలో బంధాలు, అనుబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో చెప్పడానికి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని కొత్తోట గ్రామంలో జరిగిన ఈ ఘోర సంఘటన నిదర్శనం. రెక్కలు ముక్కలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని కూడా చూడకుండా, కేవలం ఆస్తి కోసం ఓ కొడుకు, అతడి బిడ్డలు (మనవళ్లు, మనవరాలు) కలిసి వృద్ధ దంపతులపై అమానుషంగా దాడికి తెగబడ్డారు. సుమారు రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.కొత్తోట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సూర్యనారాయణ, కొప్పనాతి కస్తూరిబాయిలకు ముత్యాలరాజు అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా ఆస్తి విషయమై తల్లిదండ్రులతో అతడు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే ముత్యాలరాజు తన కొడుకులు రాధాకృష్ణ, శేఖర్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధ దంపతులపై కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశాడు. వయసుపైబడిన వారనే కనీస మానవత్వం లేకుండా, ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. వృద్ధులను కిందపడేసి కర్రలతో కొట్టి కాళ్లతో తన్నుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తీవ్ర గాయాలపాలైన సూర్యనారాయణ, కస్తూరి బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కఠిన చర్యలు తప్పవు: పోలీసులుఈ కేసును తాము పట్టించుకోవడం లేదంటూ కొన్ని మీడియా ఛానెళ్లలో వచ్చిన వార్తలను మొగల్తూరు పోలీసులు ఖండించారు. ఆ వార్తలు అవాస్తవాలని మొగల్తూరు ఎస్సై జి.వాసు పేర్కొన్నారు. బాధితురాలు కొప్పనాతి కస్తూరి బాయి ఈ నెల 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొత్తాటలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఆస్తి వివాదం నేపథ్యంలో కొడుకు, మనవళ్లు కలిసి వృద్ధ తల్లిదండ్రులపై దారుణంగా దాడి చేశారు. సూర్యనారాయణ, కస్తూరి దంపతులను కాళ్లతో తన్నుతూ హింసించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కొడుకు… pic.twitter.com/7w0F9Kd880— greatandhra (@greatandhranews) May 18, 2026 చదవండి: రఘురామ కృష్ణంరాజుకు చెంపపెట్టు
అత్యాచార నిందితుడికి వీరోచిత స్వాగతం : దుమారం
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జైలు నుండి విడుదలైన సుశీల్ ప్రజాపతి అనే అత్యాచార నిందితుడికి, అతని మద్దతుదారులు పూలదండలతో ఘన స్వాగతం పలికిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ వీడియోలో, నిందితుడు ప్రజాపతిని భుజాలపై మోస్తూ, నినాదాలు చేస్తూ, అదేదో విజయయాత్రలా ఊరేగింపు నిర్వహించడం, ఒకరికొకరు, అందరూ కరచాలనాలు చేసుకుంటూ, నవ్వుతూ వీరోచిత స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురిచేసింది. హీరోలా ర్యాలీనిందితుడు సుశీల్ ప్రజాపతి 'హిందూ యువ వాహిని'నేతగా తెలుస్తోంది. ఇతనిపై ఒక ఎల్ఎల్బీ (LLB) విద్యార్థినిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక లాయర్‌కు పరిచయం చేస్తానన్న నెపంతో నిందితుడు ఆ విద్యార్థినిని ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడనేది ప్రధాన ఆరోపణ. దాదాపు తొమ్మిది నెలల తర్వాత, మే 17న నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. విడుదలైన వెంటనే, రాజకీయ నాయకుడిలా తెల్లటి దుస్తులు, మెడలో కాషాయ కండువాలు, పూలదండలతో రోడ్‌షో నిర్వహించడం నెట్టింట తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సమాజంలో ఇలా హీరోలా స్వాగతం పలకడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. <UP lives upto its local traditional grandeur, they garland, applaud and celebrate a Rape Accused. Accused in Ghaziabad, UP, LLB student rape case, Hindu Yuva Vahini leader Sushil Prajapati, released from jail, supporters hoisted him on shoulders, took out procession !!Tears… pic.twitter.com/FtpSiC14p6— We The People (@WithYou2023) May 19, 2026 ఇదీ చదవండి: నీట్ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్.. ఎవరీ తుషార్ కుమార్?
నీట్ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!
సాక్షి, న్యూఢిల్లీ : 2024లో నీట్ (NEET UG) పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినప్పుడు, విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తిగా మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కెమిస్ట్రీ టీచర్ శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ గుర్తింపు పొందారు. విద్యార్థులు ఆయన్ను ఆప్యాయంగా "ఎమ్ సర్" (M Sir) అని పిలుచుకునేవారు. నాడు విద్యార్థులకు "ఘోర అన్యాయం" జరిగిందంటూ వాదించిన ఆయన కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కానీ, సరిగ్గా రెండేళ్ల తర్వాత.. 2026 నీట్ (NEET UG) పేపర్ లీక్ కేసులో ఆయనే ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.శివరాజ్ మొతేగావ్కర్ అరెస్ట్ అయిన నేపథ్యంలో, 2024లో ఆయన విద్యార్థుల కోసం మాట్లాడిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. "నీట్ 2024లో భారీ కుంభకోణం జరిగింది. దీనివల్ల మహారాష్ట్రలో చదువు కుంటున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. సంభాజీనగర్‌లోని ఔరంగాబాద్ హైకోర్టు బెంచ్‌లో మేము ఇప్పటికే పిల్ (PIL) దాఖలు చేశాం. విద్యార్థుల తరఫున మరో ప్రత్యేక పిటిషన్ కూడా వేశాము. ఈ రోజు మేము ముంబై వచ్చాము. బాంబే హైకోర్టులో అవసరమైన సమాచారాన్ని సేకరిస్తాము. మహారాష్ట్రలోని అన్ని న్యూస్ ఛానళ్ల ప్రతినిధులను కలిసి, దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని కోరతాము. పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు మీడియా మద్దతు చాలా అవసరం."అని విద్యార్థుల తరపున గళమెత్తాడు. కట్ చేస్తే సరిగ్గా రెండేళ్లకు అదే విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ సీబీఐ చేతికి చిక్కాడు.'ఎమ్ సర్' అరెస్ట్ లాతూర్‌లోని ప్రముఖ 'రేణుకాయ్ కెమిస్ట్రీ క్లాసెస్' (RCC) వ్యవస్థాపకుడైన శివరాజ్ రఘునాథ్ మొతేగావ్కర్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మే 17 (ఆదివారం) నాడు అరెస్ట్ చేసింది. ఆయన నివాసాలు, కార్యాలయాలపై జరిపిన సోదాల్లో.. ఆయన మొబైల్ ఫోన్లో లీకైన నీట్ క్వశ్చన్ పేపర్ లభ్యమవ్వడంతో సీబీఐ ఈ చర్య తీసుకుంది.ఇదీ చదవండి: నీట్లో ప్రశ్నలన్నీ మా క్వశ్చన్ బ్యాంకులోనివే : ఎవరీ కెమిస్ట్రీ టీచర్ఎవరీ కెమిస్ట్రీ టీచర్ 'ఎమ్ సర్'?లాతూర్‌లోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన మొతేగావ్కర్, మొదట్లో సైకిల్‌పై తిరుగుతూ విద్యార్థులకు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పేవారు 1990ల చివర్లో ఒక చిన్న అద్దె గదిలో కేవలం 10 మంది విద్యార్థులతో ఆయన కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. చేత్తో రాసిన నోట్స్ ఇస్తూ, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల కాంపిటేటివ్ పరీక్షల్లో టాపర్లను అందిస్తూ ఆయన స్వల్ప కాలంలోనే ఎంతో ప్రసిద్ధి చెందారు.ఇదీ చదవండి: నో టాయిలెట్, నో లీవ్స్ : రూ. 19 లక్షల జాబ్ వదిలేశా!ప్రస్తుతం 'ఆర్సీసీ' (RCC) క్లాసెస్‌కు మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన బ్రాంచ్ అయిన లాతూర్‌తో సహా 9 బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది విద్యార్థులు నీట్, జేఈఈ, సెట్ (NEET, JEE, CET) పరీక్షల కోసం ఇక్కడ చేరుతుంటారు. సోషల్ మీడియాలో (ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్) కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. నాడు విద్యార్థుల రక్షకుడిగా ఫోజులిచ్చిన ప్రముఖ విద్యావేత్తే, నేడు అదే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
నన్ను చంపాలని చూస్తున్నారు: పాస్టర్ అభినయ్
విశాఖపట్నం: పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగే తనను చంపాలని చూస్తున్నారని భరోసా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ధార అభినయ్ దర్శన్ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని అన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలేసి, తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారని వాపోయారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నందునే తనపై దాడి జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.''నాపై నేనే దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. నాపై దాడి విషయంలో పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు. పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారు. నాపై దాడి వెనుక కుట్ర దాగి ఉంది. నాపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి సంబంధం ఉందని అనుకోను. కొంతమందిపై నాకు అనుమానం ఉంది. వారి పేర్లు త్వరలోనే బయట పెడతాను. ప్రవీణ్ పగడాల నాలుగు బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించారు. ప్రవీణ్ పగడాల విషయంలో జరిగింది పూర్తిగా అన్యాయమే. ప్రవీణ్ పగడాలపై వేసినట్టుగానే నాపై నిందలు వేస్తున్నారు. దాడులకు నేను భయపడను. ప్రజల సమస్యలపై ప్రభుత్వాధికారులను ప్రశ్నిస్తూనే ఉంటాన''ని అభినయ్ అన్నారు.దాడిని ఖండించిన పాడేరు ఎమ్మెల్యే పాస్టర్ అభినయ్‌పై దాడి చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. అభినయ్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభినయ్‌పై దాడి చేసిన వారిని ప్రజల ముందు పోలీసులు నిలబెట్టాలని కోరారు.''జరిగిన దాడిపై నేనే పోలీసులకు ఫోన్ చేసి పూర్తిస్థాయి విచారణ జరపాలని సూచించాను. ఈ దాడి తన అనుచరులు చేశారని కూటమి నాయకులు ప్రచారం చేయడం దురదృష్టకరం. ఒక గిరిజన బిడ్డపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు నాకు క్షమాపణ చెప్పాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నార''ని విశ్వేశ్వరరాజు మండిపడ్డారు.అసలేం జరిగింది?అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలో మొండిగెడ్డ పంచాయతీ నీరుతోటపాలెం కాఫీ తోటల సమీపంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు అభినయ్‌పై దాడి చేశారు. కడపకు చెందిన అభినయ్ కొన్ని రోజులుగా జిల్లాలో ఉంటున్నారు. నీరుతోటపాలెంలో సమస్యలపై పాదయాత్ర చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసి కారులో తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అభినయ్, ఆయనతో పాటు ఉన్న మరో ఇద్దరిని వాహనం నుంచి దింపి, కాఫీ తోటల సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ అభినయ్‌పై బ్లేడుతో దాడి చేశారు. తల, కాళ్లపై కోసేశారు.అభినయ్‌తో పాటు ఉన్న ఇద్దరిపై కూడా దాడి చేశారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అభినయ్ స్పృహ తప్పి పడిపోవడంతో మృతి చెంది ఉంటాడని భావించి, దుండ గులు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అభినయ్‌ను జెర్రెల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారు ఎవరో, ఎందుకు దాడి చేశారో తెలియడం లేదు. కడప నుంచి వచ్చిన అభినయ్‌కి ఇక్కడ ఎవరు శత్రువులున్నారో తెలియడం లేదని స్థానికులు తెలిపారు. అభినయ్ కారుపై కూడా దాడి చేయడంతో కారు అద్దం పగిలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వీడియోలు
వైభవ్ ఊచకోత.. టాప్ 4లోకి రాజస్థాన్..
దివ్యాంగులకు జగనన్న భరోసా
బీర్ బాటిల్ పగలగొట్టి.. నాలుగు చోట్ల పొడిచారు.. పాస్టర్ అభినయ్ సంచలన నిజాలు
వీడు మామూలోడు కాదు.. తొవ్వేకొద్ది గోల్డ్, ఆస్తులు
ఉచిత బస్సు పథకానికి మంగళం..! ఇటు బాదుడు.. అటు అమ్ముడు..!
ఏపీకి ముగ్గురు సీఎంలు
విజయ్ కేబినెట్ మీటింగ్ లో సెల్ఫీ తీసుకుంటున్న అంకుల్
చెపాక్ ధోనీ కన్నీటి వీడ్కోలు..సురేష్ రైనాని హగ్ చేసుకుని ధోని ఎమోషనల్
రఘురామకృష్ణ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు..!
విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి


