ప్రైవేట్ ఉద్యోగులకు నాలుగు రోజుల సెలవులు ప్రకటన | Eid Al Adha holidays announced for UAE private sector employees | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఉద్యోగులకు నాలుగు రోజుల సెలవులు ప్రకటన

May 19 2026 3:54 AM | Updated on May 19 2026 3:56 AM

Eid Al Adha holidays announced for UAE private sector employees

అబుదాబి: యూఏఈ వ్యాప్తంగా ప్రైవేటు రంగ ఉద్యోగులకు అరాఫత్ దినోత్సవం, ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగలను పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఈద్ సెలవులు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మే 26న ప్రారంభమై మే 29  వరకు కొనసాగుతాయి.

ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇదే వరకే ప్రకటించారు. వారికి మే 25 నుంచి మే 29 వరకు మొత్తం 5 రోజులు సెలవులు ఉంటాయి. శని, ఆదివారాల వారాంతపు సెలవుల అనంతరం ఇరు రంగాల ఉద్యోగులూ తిరిగి జూన్ 1 నుంచి విధులకు హాజరు కానున్నారు. కాగా ఆదివారం సాయంత్రం (మే 17) 'దుల్ హిజ్జా' నెలవంక కనిపించినట్లు మూన్ సైటింగ్ కమిటీలు, ఖగోళ పరిశోధన కేంద్రాలు అధికారికంగా ధ్రువీకరించాయి. 

ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లో చివరి నెల అయిన ధు అల్ హిజ్జా 10వ రోజున ఈద్ అల్ అధా జరుపుకుంటారు. అరాఫా మే 26 మంగళవారం వచ్చే అవకాశం ఉంది. ఈద్ అల్ అధా పర్వదినం మే 27 బుధవారం ఉదయం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement