సెప్టెంబర్‌లో భారత్‌కు పుతిన్‌ | Russian President Putin To Visit India In September For BRICS Summit In Delhi | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో భారత్‌కు పుతిన్‌

May 20 2026 5:02 AM | Updated on May 20 2026 5:06 AM

Russian President Putin To Visit India In September For BRICS Summit In Delhi

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్రంలో అధ్యక్షుడు పుతిన్‌ పాల్గొంటారని క్రెమ్లిన్‌ ప్రతినిధి యూరి ఉషకోవ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ ఆయన వేరుగా భేటీ అవుతారని వివరించారు.

బ్రిక్స్‌ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్‌ ఈ శిఖరాగ్రానికి ఆతిథ్యం ఇస్తోంది. భారత్‌కు పుతిన్‌ చివరిసారిగా 2025 డిసెంబర్‌లో వచ్చారు. అప్పట్లో ఆయన భారత్‌–రష్యా వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. బ్రెజిల్, భారత్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పాటైన బ్రిక్స్‌లో ప్రస్తుతం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, ఇండోనేసియా కూడా సభ్యదేశాలుగా ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement