IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్‌ | LSG Superstar Leaves India, Set To Miss Remainder Of IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: స్వదేశానికి వెళ్లిపోయిన సౌతాఫ్రికా ప్లేయర్‌

May 19 2026 12:22 PM | Updated on May 19 2026 12:35 PM

LSG Superstar Leaves India, Set To Miss Remainder Of IPL 2026

ఐపీఎల్‌ 2026 సీజన్‌ కీలక దశకు చేరింది. ఇప్పటికి మూడు జట్లు (ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. రెండు జట్లు (లక్నో, ముంబై) రేసు నుండి నిష్క్రమించాయి. మిగిలిన ఏకైక బెర్త్‌ కోసం ఐదు జట్లు (రాజస్థాన్‌, కేకేఆర్‌, ల్లీ, పంజాబ్‌, సీఎస్‌కే) పోటీ పడుతున్నాయి.

లీగ్‌ నుండి అధికారికంగా నిష్క్రమించిన జట్లలో ఒకటైన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇవాళ (మే 19) రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు లక్నోకు షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. లక్నో ఆడాల్సిన చివరి రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడు. వ్యక్తిగత కారణాల చేత మార్క్రమ్‌ స్వదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అతడి భార్య నికోల్‌ డానియెల్లా ఓ’కానర్‌ త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, రిషబ్‌ పంత్‌ నేతృత్వంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సీజన్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచింది. జట్టు నిండా విధ్వంసకర బ్యాటర్లు (మార్క్రమ్‌, మార్ష్‌, పూరన్‌, పంత్‌, ఇంగ్లిస్‌) ఉన్నా, ఆ జట్టు ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. బౌలింగ్‌లోనూ ఆ జట్టు ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనలే చేసింది. షమీ, ప్రిన్స్‌ యాదవ్‌, ఆవేశ్‌ ఖాన్‌, దిగ్వేశ్‌ రాఠీ, మొహిసిన్‌ ఖాన్‌ అంచనాలకు మించి రాణించారు. అయినా లక్నోను విజయాలు వరించలేదు. 

ఈ జట్టులో ఎక్కడో ఏదో లోపం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుంది. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో ఈ జట్టు రాజస్థాన్‌, పంజాబ్‌తో తలపడాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement