ఒకప్పుడు తెలుగులో హీరోగా సినిమాలు చేసిన మంచు మనోజ్.. రీసెంట్ టైంలో మిరాయ్, భైరవం చిత్రాలతో విలన్‌గా మారిపోయాడు. ఆకట్టుకున్నాడు కూడా. ప్రస్తుతం 'డేవిడ్ రెడ్డి' అనే మూవీలో నెగిటివ్ టచ్ ఉండే హీరోగా చేస్తున్నాడు. తాజాగా ఓ ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. మీడియాతో కలిసి తన ప్రీ బర్త్ డే వేడుకల్ని హైదరాబాద్‌లో చేసుకున్నాడు. ఇందులోనే తండ్రితో గొడవ గురించి ప్రశ్న ఎదురవగా సెటైరికల్‌గా సమాధానమిచ్చాడు.
(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?)
'మీ నాన్నతో గొడవ క్లియర్ అయినట్టేనా?' అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మనోజ్.. అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా? కానీ మైక్‌తో వెళ్ళకండి. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. గతంలో మంచు కుటుంబంలో గొడవ జరుగుతున్నప్పుడు ఓ మీడియా ప్రతినిధిని మోహన్ బాబు మైక్‌తో కొట్టారు. తర్వాత క్షమాపణ చెప్పారు.
మీడియాతో మాట్లాడుతూ మనోజ్ మరికొన్ని విషయాల్ని పంచుకున్నాడు. భైరవం, మిరాయ్ సినిమాలు నాకు ఇచ్చిన డైరెక్టర్స్ ఇద్దరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఇంకో జన్మ ఇచ్చారు. అలానే నా భార్య మౌనిక కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని మనోజ్ చెప్పాడు.
తాజాగా 'ఐక్య ధైర్య సేనా సమితి' పేరుతో ట్రస్ట్ ప్రారంభించిన మనోజ్.. ఎవరైనా బెదిరింపు కాల్స్‌తో బాధపడుతుంటే వాళ్లకు మా ట్రస్ట్ అండగా ఉంటుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికే దీనిని మొదలుపెట్టాం. ఈ ట్రస్ట్ ద్వారా మొదటగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని, వారి చదువు బాధ్యతలను ఈరోజు నుంచే పూర్తిగా తీసుకుంటామని మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ సినిమా.. కానీ)
Media Person: మీ ఫ్యామిలీ ఇష్యూ క్లియర్ అయినట్టేనా ? #ManchuManoj: అది ఎవరిని అడగాలో మీకు తెలుసుగా ? వెళ్ళి అడగండి. కానీ Mic పట్టుకొని వెళ్లొద్దు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. pic.twitter.com/M4WBvEe1rH
— cinee worldd (@Cinee_Worldd) May 19, 2026


