90స్ కిడ్స్ అందరూ తమ చిన్నప్పుడు చూసి హాలీవుడ్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా 'మమ్మీ' ఫ్రాంచైజీ ఉంటుంది. ఇప్పటివరకు మూడు మూవీస్ రాగా అవన్నీ ఆకట్టుకున్నాయి. ఇదే ఫ్రాంచైజలో వచ్చిన లేటెస్ట్ చిత్రం 'ద మమ్మీ' గత నెలలో థియేటర్లలోకి రాగా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)
గతంలో వచ్చిన 'మమ్మీ' సినిమాలన్నీ అడ్వెంచర్, కామెడీ తరహాలో వచ్చాయి. వాటికి భిన్నంగా పూర్తిగా డార్క్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో లేటెస్ట్ మూవీ తీశారు. 'ద మమ్మీ' పేరుతో తీసిన ఈ చిత్రానికి లీ క్రోనిన్ దర్శకత్వం వహించారు. గత నెల 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. హారర్ సినిమా లవర్స్‌ని మెప్పించింది. ఇప్పుడీ చిత్రం విదేశాల వరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి రావొచ్చు. అప్పుడు తెలుగు డబ్బింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
'ద మమ్మీ' విషయానికొస్తే.. ఎనిమిదేళ్ల క్రితం కనిపించకుండాపోయిన తన కూతురు తిరిగి రావడం చూసి ఓ కుటుంబం ఆనందిస్తుంది. కానీ ఆమెలో ఉన్న రాక్షస శక్తులు ఆ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాయి. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇందులో హారర్ సీన్స్ భయపెట్టేలా ఉన్నాయని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందనే కామెంట్స్ వినిపించాయి.
(ఇదీ చదవండి: 'పెద్ది' స్టోరీ ఏంటి? ఊహించని ట్విస్ట్ అదేనా?)


