breaking news
The Mummy
-
మమ్మీ తిరిగొస్తోంది
హాలీవుడ్ హారర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది మమ్మీ’ రీ రిలీజ్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. స్టీఫెన్ సోమర్స్ దర్శకత్వంలో 1999లో విడుదలైన ‘ది మమ్మీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ యాక్షన్ అడ్వెంచరస్ హారర్ ఫిల్మ్‌లో బ్రెండెన్ ఫ్రేజర్, రాచెల్ వీజ్, జాన్ హాన్యా, ఆర్నాల్డ్ వోస్లూ, జోనాథన్ హైడ్ లీడ్ రోల్స్‌లో నటించారు. జేమ్స్ జాక్స్, సీన్ డేనియల్ నిర్మించిన ‘ది మమ్మీ’ సినిమాను 1999 మే 7న యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీ చేసింది. ఈ సినిమా విడుదలై పాతిక సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంగా ఏప్రిల్ 26న థియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నట్లుగా యూనివర్సల్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఐష్ సూయిసైడ్ : న్యూస్ నిడివి: 1ని.34సె. హిట్స్: 29,26,481 బచన్ల కోడలు ఐశ్వర్యారాయ్ దాంపత్యంలో కలతలు రేగాయని కొంతకాలంగా మీడియాలో వినిపిస్తోంది. ఆ మధ్య భార్యతో కలిసి ఫొటో దిగడానికి అభిషేక్ బహిరంగంగానే నిరాకరించడం, ఫొటోగ్రాఫర్లతో, ‘ఆమెను తీస్కోండి’ అని దూరంగా వెళ్లిపోవడం పెద్ద చర్చ అయింది కూడా. ఇప్పుడు లేటెస్టుగా ఐశ్వర్య ఆత్మహత్యాయత్నం చేశారన్న వార్త రౌండ్లు కొడుతోంది. ఐశ్వర్య మోతాదుకు మించి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందనీ, ఆ విషయాన్ని చివరి నిమిషంలో గుర్తించి, కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చే ర్పించారని ముంబైలోని చిన్న పత్రికలు, టీవీ చానళ్లు బ్రేకింగ్ న్యూస్‌లు ఇచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులేననీ బచన్ల ఫ్యామిలీ ఖండించింది. దంపతులిద్దరూ సంతోషంగా ఉన్నారని, ఆ కుటుంబం ప్రతిష్ట మీద బురద చల్లడానికే, పని లేని వారు ఇలాంటివి పుట్టిస్తున్నారని బచన్లను అభిమానించేవారు అంటున్నారు. అసలేం జరిగింది, ఏం జరగబోతోంది అని తెలుసుకోడానికి ఎం.ఎన్.ఎఫ్ అనే న్యూస్ చానల్ చేసిన ఎనాలసిస్ను మీరీ క్లిప్పింగ్‌లో చూడొచ్చు. మమ్మీ : అఫీషియల్ ట్రైలర్ నిడివి: 2ని.32సె. హిట్స్: 2,31,69,072 జేమ్స్‌బాండ్ సినిమాల్లా ‘మమ్మీ’ సినిమాలు ఒక లైన్లో వచ్చేస్తూ ఉంటాయి. మమ్మీల జానర్లో తాజా చిత్రం ‘ది మమ్మీ’. పాత టైటిలే కానీ, ఈ యాక్షన్ అడ్వెంచర్ హారర్ ఫిల్మ్‌లో కొత్త థ్రిల్లర్స్ మీ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయని డైరెక్టర్ అలెక్స్ కర్జ్మేన్ ఇప్పటికే ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇప్పుడీ ట్రైలర్‌ను చూస్తే ఆ మాట నిజమేననిపిస్తుంది. ఒక పెద్ద మమ్మీని తాళ్లతో కట్టేసుకుని ఓ విమానం గాల్లోకి లాక్కుపోయే దృశ్యాన్ని ఊహించండి. ఆ తర్వాత గంటపాటు అనూహ్యంగా సంభవిస్తూ ఉండే పరిణామాలను ట్రైలర్లో చూడండి. అల్జీరియా నటి సోఫియా బౌటెల్లా ఈ చిత్రంలో మమ్మీగా నటించారు. సోఫియా ఒక ప్రాచీనకాలపు మహారాణి. ఆమె అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. ఆమె ‘మమ్మీ’ని చర్చి అడుగున సమాధి చేస్తారు. కొన్నేళ్ల తర్వాత ఆ మమ్మీ నిద్ర లేస్తుంది. తనను చంపినవాళ్లపై పగ తీర్చుకుంటుంది. 2017 జూన్ 9న విడుదలౌతున్న ఈ హాలీవుడ్ మూవీ ట్యాగ్‌లైన్ ఇప్పటికైతే.. ‘వెల్కం టు ది న్యూ వరల్డ్ ఆఫ్ గాడ్స్ అండ్ మాన్స్టర్స్’. ఈ ట్యాగ్‌లైన్‌ని బట్టికూడా మీ ఊహల్లో కొంత కథను పొడిగించుకోవచ్చు. మూడు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న టామ్ క్రూజ్ కూడా ఈ చిత్రంలో మీ ఊహల్ని నిజం చేయగల పాత్రనే పోషిస్తున్నారు. అమెజాన్ గో : షాపింగ్: నిడివి: 1ని.49సె. హిట్స్: 67,52,460 నో లైన్స్, నో చెకౌట్స్, జస్ట్ గ్రాబ్ అండ్ గో! క్యూలు ఉండవు. చెకింగ్ ఉండదు. బిల్లు అక్కడికక్కడే ఇచ్చేయడం ఉండదు. కావలసింది తీసుకోవడం. వెళ్లిపోవడం. అంతే. ఆన్లైన్ మార్కెటింగ్‌తో ప్రపంచంలో మూలమూలకు చొచ్చుకుపోయిన అమెజాన్ డాట్ కామ్ ఇప్పుడు ఓ పెద్ద సూపర్ మార్కెట్‌ను ప్రారంభించబోతోంది! అందులో మనకు కావలసిన వస్తువుల్ని, పదార్థాలను తీసుకోవడం ఒక్కటే కాదు, అక్కడికక్కడ మనకు వండిపెట్టే చెఫ్‌లూ ఉంటారు. మన స్మార్ట్ ఫోన్లో అమెజాన్ గో ఆప్ యాక్టివేట్ చేస్తే చాలు అమెజాన్ స్టోర్స్‌లోకి ప్రవేశం లభిస్తుంది. ఆ తర్వాత అదంతా మన సామ్రాజ్యం. క్యాష్‌లెస్ కింగ్డమ్. షెల్ఫ్లోంచి మనం ఏం తీసుకున్నా, తీసుకున్న దాన్ని మళ్లీ షెల్ఫ్‌లో పెట్టేసినా, లోపల డైనింగ్ హాల్లో కూర్చొని తిన్నా ఎప్పటికప్పుడు అదంతా మన స్మార్ట్‌ఫోన్‌లోని వర్చువల్ కార్ట్ (స్క్రీన్‌పై కనిపించే సరకుల బుట్ట)లో రికార్డ్ అవుతుంటుంది. షాపింగ్ అయి బయటికి వచ్చేసిన కొద్దిసేపటికే మన అమెజాన్ అకౌంట్లో బిల్లు డెబిట్ అయి, ఆ రసీదు మనకు ఎస్ఎమ్ఎస్ అవుతుంది. క్షణం తీరిక లేకుండా ఉండే కస్టమర్ల కోసం సియాటిల్ 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో తయారౌతున్న ఈ అమెజాన్ స్టోర్స్ 2017 జూన్ లోపు ప్రారంభం అవుతుందట. తర్వాత మిగతా దేశాలకు, ఆ దేశాల్లోని మహా నగరాలకూ! బాగుంది కదా. ది సర్కిల్ : అఫీషియల్ ట్రైలర్ నిడివి: 1ని. 50సె. హిట్స్: 17,21,748 ఇరవై ఆరేళ్ల బ్రిటిష్ నటి ఎమ్మా వాట్సన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ మూవీ ‘ది సర్కిల్’.. ట్రైలర్ ఇది. ఎమ్మా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటుంది. మంచి వర్కర్‌గా పేరు సంపాదించుకుని త్వరత్వరగా పెద్ద పొజిషన్లోకి వెళుతుంది. గోప్యత, నిఘా అవసరమైన అత్యున్నత స్థాయిలోకి వెళ్లాక ఆమెకు కొన్ని రహస్యాలు తెలుస్తాయి. తను తీసుకోబోయే నిర్ణయాలపైనే మానవాళి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలియగానే దిగ్భ్రమకు లోనవుతుంది. అక్కడి నుంచి సినిమా అంతా ఉత్కంఠే. సినిమా నిర్మాతలలో ఒకరైన అరవై ఏళ్ల అమెరికన్ నటుడు టామ్ హ్యాన్స్ ఈ చిత్రంలో విరోధి పాత్రను పోషిస్తున్నారని వినికిడి. ఎవరితో అతడి విరోధం అన్నదానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. నిజానికి ‘ది సర్కిల్’ కథాంశం ఏమిటన్నది కూడా పూర్తిగా బయటికి రాలేదు. ట్రైలర్‌కి హిట్స్ మాత్రం గంటగంటకూ పెరిగిపోతున్నాయి. మూవీ 2017 ఏప్రిల్ 28న విడుదలౌతోంది. -
చేజారిన హాలీవుడ్ ఆఫర్!
‘ఏజెంట్ త్రిబులెక్స్’ సీక్వెల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు కథానాయిక దీపికా పదుకొనే. అయితే ఆమెకు మరో హాలీవుడ్ చిత్రంలో అవకాశం వచ్చినట్టే చేజారిందని సమాచారం. దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ హిట్ సిరీస్ ‘ద మమ్మీ’ని టామ్‌క్రూజ్ హీరోగా రీమేక్ చే యనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రంలోని కథానాయిక పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర దర్శక, నిర్మాతలు. అయితే ఇటీవల లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆడిషన్స్‌లో దీపిక పాల్గొన్నారట. కానీ ఆమె ఎంపిక కాలేదని భోగట్టా. ఇదే సినిమా ఆడిషన్స్ కోసం మరో బాలీవుడ్ తార హ్యూమా ఖురేషీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ, ఈ ఇద్దరికీ పిలుపు మాత్రం రాలేదు. అయితే, చిత్ర బృందం మాత్రం వేరే హీరోయిన్లను అన్వేషించే పనిలో ఉన్నారు. మరి ఈ అదృష్టం ఎవరికి దక్కుతుందో! -
మరో హీరోయిన్‌కు బంపర్ ఆఫర్!
బాలీవుడ్ అందాల రాశులు ఇప్పుడు హాలీవుడ్లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పటికే దీపికా పదుకోనే, ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఆఫర్లతో తమ సత్తా చాటారు. 'ట్రిపుల్ ఎక్స్: జాండర్ కేగ్ రిటర్న్స్ ' షూటింగ్ దీపిక బిజీగా ఉండగా.. 'బేవాచ్' సెట్స్‌లో ప్రియాంక హల్చల్ చేస్తోంది. ఈ ఇద్దరు భామలు ఇలా హాలీవుడ్ కలల వెంట సాగుతుండగానే మరో బాలీవుడ్ సుందరీని బంపర్ ఆఫర్ వరించింది. హాలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూయిజ్ నటిస్తున్న 'ద మమ్మీ' సినిమాకుగాను హ్యుమా ఖురేషి ఎంపికైంది. ద గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ చిత్రంతో వెలుగులోకి వచ్చిన ఖురేషి 'మమ్మీ' సినిమా మూడోపార్టులో నటించనుంది. ఇందుకు సంబంధించిన ఆడిషన్లో ఆమె సక్సెస్ అయిందని ఆమె అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 'ద మమ్మీ', 'ద మమ్మీ-2' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో సంచలన విజయాలు సాధించాయి. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న మూడోపార్టులో టామ్ క్రూయిజ్ సరసన ఖురేషి నటించనుందని విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ సోఫియా బౌటెల్లా కూడా నటించనుంది. ఖురేషి ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో నటిస్తుండగా.. టామ్ 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌లో తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. -
ఈజిప్టు మమ్మీలతో డిష్యుం.. డిష్యుం!
ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హాలీవుడ్ చిత్రాల్లో ‘ద మమ్మీ’ ఒకటి. ఈజిప్టు మమ్మీల చరిత్ర నేపథ్యంలో దాదాపు 16 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి ఆ తర్వాత మరో మూడు భాగాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడీ చిత్రాన్ని రీబూట్ చేయడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థ యూనివర్శల్ సన్నాహాలు చేస్తోంది. విశేషం ఏమిటంటే ఇందులో హీరోగా హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ నటించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులు టామ్‌తో చర్చలు జరిపారట. అన్నీ కుదిరితే మాత్రం మమ్మీలతో టామ్ క్రూజ్ డిష్యుం...డిష్యుం చేయడం చూడొచ్చు.