ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి | Rasi Phalalu: Daily Horoscope On 19-05-2026 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఊహించని ధనలబ్ధి

May 19 2026 4:29 AM | Updated on May 19 2026 4:29 AM

Rasi Phalalu: Daily Horoscope On 19-05-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.తదియ సా.6.45 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: మృగశిర ప.12.50 వరకు, తదుపరి ఆరుద్ర,వర్జ్యం: రా.8.40 నుండి 10.09 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి రా.10.48 నుండి 11.33 వరకు, అమృత ఘడియలు: రా.1.55 నుండి 3.24 వరకు.

సూర్యోదయం : 5.31
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం..  ఊహించని ధనలబ్ధి. ప్రముఖుల నుంచి ముఖ్య సందర్శనం. బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

వృషభం...  చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఒప్పందాలలో అవాంతరాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం....  బంధువుల నుంచి ముఖ్య సమాచారం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం...  అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. అనారోగ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

సింహం....  పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకున్న విధంగా కొనసాగుతాయి.

కన్య.....  చిత్రమైనంఘటనలు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ధనలబ్ధి. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.

తుల....  పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటుపోట్లు.

వృశ్చికం...  ఆర్థికంగా ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. లేనిపోని వివాదాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

ధనుస్సు...  సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు నూతన పరిచయాలు. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. గృహయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం...   దూరపు బంధువుల కలయిక. వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.

కుంభం...  పనుల్లో ఆటంకాలు. మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. బంధువుల నుండి ఒత్తిడులు. ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మీనం..  రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

Advertisement
 
Advertisement
Advertisement