2030 నాటికి పెప్సీకో ఇండియా ప్రణాళికలు
న్యూఢిల్లీ: ఫుడ్, బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో 2030 నాటికి భారత్లో రూ. 5,700 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయ నుంది. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయా రీ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ మొత్తా న్ని వెచ్చించనున్నట్లు సంస్థ ఇండియా, సౌత్ ఏషి యా సీఈవో జాగృత్ కొటేచా తెలిపారు. మధ్యప్రదేశ్లోని కాన్సెంట్రేట్స్ ప్లాంటులో, అస్సాం..తమిళనాడులోని స్నాక్స్ ప్లాంట్లపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఇటీవలే స్థలాన్ని కూడా సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆదాయాలు, వినియోగం స్థిరంగా పెరుగుతున్న భారత్ తమకు టాప్ 13 మార్కెట్లలో ఒకటని ఆయ న చెప్పారు.
గతేడాది (2025)లో రూ. 9,789 కోట్ల ఆదాయంపై రూ. 905 కోట్ల లాభం ఆర్జించినట్లు జాగృత్ తెలిపారు. వరుసగా రెండో ఏడాది కూడా పటిష్టంగా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందినట్లు వివరించారు. ఫుడ్ సెగ్మెంట్లో 11 శాతం వృద్ధి సాధించినట్లు పెప్సీకో ఇండియా, సౌత్ ఏషియా సీఎఫ్వో సవిత బాలచంద్రన్ తెలిపారు. వాతావరణం కారణంగా శీతల పానీయాల విభాగానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, పోటీ కూడా పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ రెండు విభాగాలు మెరుగ్గా రాణించినట్లు పేర్కొన్నారు.


