నేను అడ్వైజర్ కాదు.. పెట్టుబడులు మీ ఇష్టం | Iam Not a Financial Advisor Rich Dad Poor Dad Author Robert Kiyosaki | Sakshi
Sakshi News home page

నేను అడ్వైజర్ కాదు.. పెట్టుబడులు మీ ఇష్టం

May 19 2026 9:11 PM | Updated on May 19 2026 9:17 PM

Iam Not a Financial Advisor Rich Dad Poor Dad Author Robert Kiyosaki

పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు.. ఆర్థికపరమైన సమాచారం వెల్లడించే రాబర్ట్ కియోసాకి తొలిసారి ఘాటుగా స్పదించారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని, ఇతరులకు పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేను ఆర్ధిక సలహాదారుని కారు.. అయితే నా పేరును ఉపయోగించి, కొందరు వ్యక్తులు.. నేను చెప్పినట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయాలను చెబుతున్నారు. వారికి నా లాయర్ ద్వారా నోటీసులు పంపించాను. నా పేరు వాడి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాను.

నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో మాత్రమే చెబుతాను. నేను ఎవరిని ఇక్కడే పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదని కియోసాకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఏథీరియం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాను అని చెప్పారు. నాకు 401(k), లేదా IRA వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు లేవని.. స్టాక్స్ లేదా బాండ్స్‌లో కూడా పెట్టుబడి పెట్టడం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా

నేను ఏం చేస్తున్నానో చెబుతాను. కానీ ఇతరులు వాటిని తప్పకుండా అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక నిర్ణయాలను తన ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తీసుకోవడం మంచిది. కియోసాకి మాటలను బట్టి చూస్తే.. ఎవరుపడితే వారు చెప్పినమాటలు విని పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement