అత్యాచార నిందితుడికి వీరోచిత స్వాగతం : దుమారం | UP sexual assault Accused Released On Bailand Garlanded Carried On Shoulders | Sakshi
Sakshi News home page

అత్యాచార నిందితుడికి వీరోచిత స్వాగతం : దుమారం

May 19 2026 5:18 PM | Updated on May 19 2026 5:41 PM

UP sexual assault Accused Released On Bailand Garlanded Carried On Shoulders

సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జైలు నుండి విడుదలైన సుశీల్ ప్రజాపతి అనే రేప్ నిందితుడికి, అతని మద్దతుదారులు పూలదండలతో ఘన స్వాగతం పలికిన వీడియో ఒకటి  సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ వీడియోలో, నిందితుడు ప్రజాపతిని భుజాలపై మోస్తూ, నినాదాలు చేస్తూ, అదేదో విజయయాత్రలా ఊరేగింపు నిర్వహించడం, ఒకరికొకరు, అందరూ కరచాలనాలు చేసుకుంటూ, నవ్వుతూ వీరోచిత స్వాగతం పలకడం ఆశ్చర్యానికి గురిచేసింది. 

హీరోలా ర్యాలీ
నిందితుడు సుశీల్ ప్రజాపతి 'హిందూ యువ వాహిని'నేతగా తెలుస్తోంది.  ఇతనిపై ఒక ఎల్‌ఎల్‌బీ (LLB) విద్యార్థినిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక లాయర్‌కు పరిచయం చేస్తానన్న నెపంతో నిందితుడు ఆ విద్యార్థినిని ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడనేది ప్రధాన ఆరోపణ. దాదాపు తొమ్మిది నెలల తర్వాత, మే 17న నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. విడుదలైన వెంటనే, రాజకీయ నాయకుడిలా తెల్లటి దుస్తులు, మెడలో కాషాయ కండువాలు,  పూలదండలతో  రోడ్‌షో నిర్వహించడం నెట్టింట తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సమాజంలో ఇలా హీరోలా స్వాగతం పలకడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

<

 

ఇదీ చదవండి: నీట్‌ లీక్‌పై నాడు గళమెత్తాడు, సరిగ్గా రెండేళ్లకు!
ఇదీ చదవండి: మేయర్‌ పీఠంపై ఇండియన్‌.. ఎవరీ తుషార్‌ కుమార్‌?

Advertisement
 
Advertisement
Advertisement