గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధికజ్యేష్ఠ మాసం, తిథి: శు.చవితి సా.4.22 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: ఆరుద్ర ఉ.11.13 వరకు తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.28 నుండి 11.58 వరకు, దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.21 వరకు, అమృత ఘడియలు: లేవు.
సూర్యోదయం : 5.31
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం.... ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన పనులు చకచకా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. స్థిరాస్తి వృద్ధి. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
వృషభం... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందగోళంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.
మిథునం.... సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం... బడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
సింహం... శ్రమ ఫలించే సమయం. నూతన విద్యావకాశాలు. కొత్త వ్యక్తులతో పరిచయం. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.
కన్య.... వ్యవహారాలలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి సైతం సాయం అందుతుఉంది. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు.
వృశ్చికం.... పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
ధనుస్సు.... మిత్రుల చేయూతతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థికాభివృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖుల పరిచయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మకరం.... దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనప్రాప్తి. పాతమిత్రుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
కుంభం... బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని పనుల్లో అవాంతరాలు ఎదురుకావచ్చు. శ్రమాధిక్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దైవదర్శనాలు.
మీనం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.


