సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం. వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసుకొని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తున్న కర్నూలు పోలీసులు. ఈనెల 14వ తేదీన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై విమర్శలు చేశారని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్.
ఓ ఫార్మా కంపెనీ వద్ద మంత్రి భరత్ 45 కోట్ల రూపాయలు వసూలు చేశారని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆరోపించారు. దాంతో తనపై, నారా లోకేష్ పై సిద్దార్థ రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందించి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంత్రి టిజి భరత్. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసిన త్రీ టౌన్ పోలీసులు.


