నేను ఒంటరివాడిని కాను: సల్మాన్‌ ఖాన్‌ | Salman Khan says mother Salma Khan got worried after his alone and lonely post went viral | Sakshi
Sakshi News home page

నేను ఒంటరివాడిని కాను: సల్మాన్‌ ఖాన్‌

May 20 2026 4:29 AM | Updated on May 20 2026 4:29 AM

Salman Khan says mother Salma Khan got worried after his alone and lonely post went viral

‘‘కోట్లాది మంది అభిమానులు, స్నేహితులు, ఇంత పెద్ద కుటుంబం నాకు ఉన్నప్పుడు నేనెలా ఒంటరివాడిని అవుతాను?’’ అంటున్నారు సల్మాన్‌ ఖాన్‌. ఓ షర్ట్‌లెస్‌ ఫొటోని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి, ‘‘ఒంటరిగా ఉండటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి అలోన్‌...  రెండోది లోన్లీ. అలోన్‌గా ఉండటం మన నిర్ణయం. కానీ, ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది లోన్లీనెస్‌.

దీని తర్వాత ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి’’ అంటూ సల్మాన్‌ ఖాన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌ అయింది. ‘మీరు (సల్మాన్‌) ఒంటరిగా ఉన్నానని ఎందుకు బాధపడుతున్నారు?’ అంటూ ఆయన ఫ్యాన్స్‌ ఆందోళనకు గురై పోస్ట్‌లు పెట్టడంపై సల్మాన్‌ మరోసారి స్పందించారు. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి ఆ పోస్ట్‌ చేయలేదు. అయినా... ఇంత పెద్ద కుటుంబం, కోట్లాది మంది స్నేహితులు, అభిమానులు ఉన్నప్పుడు నేను ఒంటరివాడిని ఎలా అవుతాను.

మీరంతా నాతో ఉంటున్నప్పటికీ నేను ఒంటరిగా ఉన్నాననుకుంటే కృతజ్ఞత లేనివాడిని అవుతాను. షూటింగ్స్‌ నుండి నా కోసం కొంచెం సమయం కేటాయించుకోవాలనిపించింది. అంతే... దాన్ని అందరూ హైలైట్‌ చేసి హెడ్‌లైన్స్‌గా మార్చేశారు. ఆ వార్తలు చూసి మా అమ్మ నన్ను ‘ఏమైంది?’ అని కంగారుగా అడుగుతోంది. రిలాక్స్‌ అవ్వండి ఫ్రెండ్స్‌... నాకేం కాలేదు’’ అని సల్మాన్‌ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement