'పెద్ది'.. సమస్యలన్నీ క్లియర్ | Peddi Movie Percentage Issue Resolved | Sakshi
Sakshi News home page

Peddi Movie: పర్సంటేజీ సమస్య.. ఎ‍ట్టకేలకు పరిష్కారం

May 19 2026 9:15 PM | Updated on May 19 2026 9:15 PM

Peddi Movie Percentage Issue Resolved

తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నిరోజుల నుంచి పర్సంటేజీ వివాదం నడుస్తోంది. మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్నట్లే తమకు కూడా షేరింగ్ ఇవ్వాలని సింగిల్ స్క్రీన్స్ నిర్వహిస్తున్న ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే ఇరువురి మధ్య మీటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఓ కమిటీ కూడా వేసింది. ‍‍అయితే 'పెద్ది'కి కూడా పర్సంటేజీ ఇవ్వనున్నారని తెలిసింది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మీటింగే దీనికి కారణం. ఇప్పుడు ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్వయంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.

ఆంధ్రాలో 'పెద్ది' టికెట్ ధరల పెంచితే అందులో 7.5 శాతం సదరు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియర్ షోల కోసమైతే ఏ సెంటర్‌లో ప్రతి షోకు రూ.25 వేలు, బి సెంటర్‌లో ప్రతి షోకు రూ.15 వేలు, సి సెంటర్‌లో ప్రతి షోకు రూ.10 వేలు చొప్పున నిర్మాత చెల్లించాలి.

తెలంగాణలో టికెట్ ధరలు పెంచితే పై నిబంధనలు వర్తిస్తాయి. టికెట్ ధర పెంపు లేకపోతే వారు ఎప్పటిలానే డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానాన్ని అమలు చేసేందుకు అంగీకరించారని కూడా తెలిపింది.

జూన్ 4న పెద్ది సినిమా థియేటర్లలోకి రానుంది. సోమవారం ట్రైలర్ రిలీజ్ చేయగా కొందరికి నచ్చితే మరికొందరికి ల్యాగ్ అనిపించింది. ఇందులో రామ్ చరమ్.. క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా కనిపిస్తాడు. అంటే క్రికెట్, కుస్తీ, రన్నింగ్ చేస్తాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. బుచ్చిబాబు దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement