భారత్ జీడీపీ వృద్ధి అంచనాలకు కోత
6.2 శాతానికి తగ్గించిన ఇక్రా
6.7%కి సవరించిన ఇండ్–రా
అధిక క్రూడ్ ధరలు, రూపాయి బలహీనత ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఘర్షణ లు, హార్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పెరిగిపోవడం దేశ వృద్ధికి ప్రతికూలంగా మారుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. భారత్ జీడీపీ అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థలు దిగు వకు సవరించాయి. 2026–27లో జీడీ పీ వృద్ధి 6.2 శాతానికి పరిమితం కావొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా తాజాగా ప్రకటించింది. గత అంచనా 6.5% కంటే తక్కువ కావడం గమనార్హం. మరోవైపు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) సైతం గత అంచనా 6.9 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపింది. డిమాండ్, సరఫరా నిదానించడాన్ని ఇండ్–రా ప్రస్తావించింది.
ఇండ్–రా అంచనాలు..
⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా, ద్రవ్యోల్బణం 4.4% స్థాయిలో ఉండొచ్చు. ఆర్బీఐ వృద్ధి అంచనాలు జీడీపీ 6.9%, ద్రవ్యోల్బణం 4.6 శాతంకు దగ్గరగా ఈ అంచనాలున్నాయి.
⇒ అధిక ముడి చమురు ధరలు, ఆహార ధరలకు తోడు, 2026 మధ్య నుంచి వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం కారణంగా జీడీపీ వృద్ధి రేటు 2026–27లో 6.7 శాతానికి పరిమితం అవుతుంది.
⇒ ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధం, అ ధిక ద్రవ్యోల్బణం, రూపాయి విలువ క్షీణ త, అంచనాల కంటే కేంద్రం నుంచి త క్కువ మూలధన వ్యయాలు (ద్రవ్యలోటు తగ్గించుకునేందుకు), అంతర్జాతీయంగా బ లహీన వాణిజ్య వృద్ధి, 2025–26లో అధిక వృద్ధి రేటు బేస్‌గా ఉండడం, పారిశ్రామికోత్పత్తి తగ్గడం, ఎల్‌నినో ప్రభావాలను వృద్ధికి అవరోధాలుగా ఇండ్–రా పేర్కొంది.
⇒ 2026–27లో క్రూడ్ ధర సగటున బ్యారెల్‌కు 95 డాలర్ల స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వం, ఆయిల్ మార్కె టింగ్ సంస్థలు (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్), వినియోగదారులు ఈ భారాన్ని పంచుకోవాల్సి వస్తుంది. వినియోగదారులపై తక్కువే భారం వేయొచ్చు.
⇒ ముడి చమురు ధర బ్యారెల్‌కు ప్రతి 10 డాలర్ల పెరుగుదలతో జీడీపీ వృద్ధి రేటు 0.44% తగ్గిపోతుంది. మూలధన వ్యయాలను 10% తగ్గించినా సరే జీడీపీ వృద్ధి రేటు 6 శాతానికి పడిపోవచ్చు.
⇒ రుణ లభ్యతను సులభతరం చేయడం, క్రెడిట్ గ్యారంటీ తదితర చర్యలను ప్రభుత్వం పరిశ్రమల కోసం ప్రకటించొచ్చు.
⇒ 2026–27లో జూన్ క్వార్టర్లో (క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 6.7% మేర ఉంటుంది. ఎల్‌నినో ప్రభా వం ప్రధానంగా సెపె్టంబర్ త్రైమాసికంపై కనిపించొచ్చు.
⇒ డాలర్‌తో రూపాయి మారకం విలువ సగటున 94.28 స్థాయిలో ఉంటుంది.
ఇక్రా అంచనాలు..
⇒ గత ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని ఇక్రా అంచనా. జాతీయ గణాంక కార్యాలయం రెండో ముందస్తు అంచనా 7.6 శాతంగా ఉండడం గమనార్హం.
⇒ ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం (2025–26) క్యూ4 (2026 జనవరి– మార్చి) జీడీపీ వృద్ధి మూడు త్రైమా సికాల కనిష్ట స్థాయిలో 7 శాతంగా ఉండొచ్చు. 2025–26 క్యూ3లో వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది.
⇒ తయారీ వృద్ధి నిదానించడం, ఎగుమతులు తగ్గడం, పశ్చిమాసియా ఘర్షణలతో కంపెనీల మార్జిన్లపై ఒత్తిళ్లు 2025 క్యూ4లో పారిశ్రామిక స్థూల విలువ జోడింపు (జీవీఏ)తోపాటు, వృద్ధి పనితీరుపై ప్రభావం చూపిస్తాయి.
⇒ 2026–27 సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 95 డాలర్ల సగటు స్థాయిలో ఉండొచ్చు. గత అంచనా బ్యారెల్ 85 కంటే ఎక్కువ.


