breaking news
Ram gopal Varma
-
రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్
-
‘రామాయణం’పై ఆర్జీవీ సంచలన కామెంట్స్
తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రామాయణం’. ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ రాజమౌళి, మహేశ్‌బాబు, సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శంకర్ వంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించగా ఇప్పుడీ జాబితాలోకి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేరారు.వారసత్వాన్ని అందించారు‘నేను ఇప్పటివరకు చదివిన, విన్న, చూసిన రామాయణాలన్నింటిలోనూ నమిత్ మల్హోత్రా రూపొందించిన రామాయణం ఎంతో గొప్పగా ఉంది. ‘రామాయణం’ గురించి మాట్లాడినప్పుడల్లా నమిత్ మల్హోత్రా పేరు ఆకాశంలో వెలుగొందుతుంది. ఈ పేరు చరిత్రలో గుర్తిండిపోతుంది. ఆయన కేవలం ఓ చిత్రాన్ని మాత్రమే రూపొందించలేదు. తరతరాలకు గుర్తుండిపోయే వారసత్వాన్ని అందించారు’ ‘నమిత్ మల్హోత్రా.. నువ్వు కేవలం సినిమా తీయలేదు.. ఓ వారసత్వాన్ని మిగిల్చావు’’ అంటూ ఆర్జీవీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.రణ్‌బీర్, యశ్, సాయిపల్లవి, కాజల్‌ల నటనలను మెచ్చుకుంటూ..‘రామయాణం’ని ఒక భక్తి శక్తిగా పోల్చారు. దీంతోపాటు విమర్శలను పట్టించుకోవద్దంటూ చిత్రబృందానికి సూచించారు. కాగా రణబీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాకి నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు. నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు. యశ్ ఇందులో రావణుడి పాత్రలో కనిపించారు. (ఇదీ చదవండి: ‘రామాయణం’ మూవీ రివ్యూ)The #Ramayana is not a devotional film. It is a devotional force.The hero is not a blue god floating above the story. He is a man who has already seen the end of the world and still willfully chooses to walk into it. The rise is not of a kingdom. It is of a mind that challenges weakness. Every frame carries the weight of someone who has burned the old rules and is now moving only by the logic of power . The violence is not spectacle. It is the clarity of consequences What separates this from every other cinematic telling is that In a time when most films are still wary to move , this one simply moves. It does not explain itself. That is why it hits harder than anything that has come before it. You do not leave the film having watched a story. You leave it after living an experience Ranbir In the sequence after Sita’s abduction, when he stands in the empty ashram and simply looks at the place where she was, the camera holds long enough to show that grief has already been converted into a arithmetic Yash does not play opposition. He plays the mind that has already accepted what it decided to destroy. In the long confrontation before the final night, when he speaks to Ram across the open ground with no army between them, he does not raise his voice. He simply states the price. The face never flinches. The body never shifts. @AnupamPkher in Jatayu’s interception of the pushpak is not an act of mere loyalty. Wings half broken, bloodied, he keeps on coming because the mind has not yet accepted what the body is telling it. When he falls, the camera stays on the face. There is no cry. There is only the last argument continuing behind the eyes after his wings have stopped. That is not sacrifice. That is a man who understood the only rule left is to continue until you cannot. All in all I want to say this to each and everyone of all the greats who collaborated to make this great film is to treat any and all negative critics of this film as barking street dogs against the elephantine effort you all put in to create this magnifique piece of WONDER🙏🙏🙏🙏🙏— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2026 -
నేను నమ్మలేకపోతున్నాను.. ఎప్పటికీ మర్చిపోను!
''మీరు వెళ్లిపోయారంటే నమ్మశక్యంగా లేదు. కొద్ది రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం. అదే మన చివరి సంభాషణ అంటూ ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు'' అంటూ ముంబై పోలీసు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌ను స్మరించుకుంటూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారాయన. ఆత్మీయుడైన నానా మరణం తనకెంతో లోటు అని పేర్కొన్నారు. ప్రతి సందర్భంలోనూ తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.''మీరు అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞాశాలి. వెండితెరపై మీరు పోషించిన ప్రతి పాత్రలోనూ అసాధారణ రీతిలో ఒదిగిపోయారు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన సినిమాలో మీరు చేసిన పోలీసు పాత్ర నాకు ప్రేరణగా నిలిచింది. మీరు కేవలం ఒక పోలీస్ అధికారిగా నటించలేదు.. యూనిఫాం వెనుక ఉన్న వ్యక్తిని, ఒత్తిళ్లను, మానవత్వాన్ని తెరపై ఆవిష్కరించారు. ఒక పోలీస్ అధికారిగా ఉండటంలో నిజమైన అర్థాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు.నటుడిగా కంటే కూడా మీరు నాకు మంచి స్నేహితుడు. అవసరమైనప్పుడల్లా నాకు అండదండలు అందించారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. మిమ్మల్ని తెలుసుకోవడం, అన్నింటికన్నా ముఖ్యంగా మిమ్మల్ని నా స్నేహితుడిగా, సోదరుడిగా పిలుచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమగా గుర్తుంచుకుంటాను'' అంటూ నివాళి అర్పించారు. కాగా, దయా నాయక్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'అబ్ తక్ ఛప్పన్' సినిమాలో ఇన్స్పెక్టర్ సాధు అగాషే పాత్రను నానా పటేకర్ పోషించిన సంగతి ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.'దయ' టైటిల్ అనుకున్నారు!రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో షిమిత్ అమిన్ దర్శకత్వంలో అబ్ తక్ ఛప్పన్ సినిమా తెరకెక్కింది. 2004లో విడులైన ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ సాధు అగాషే పాత్రను నానా పటేకర్ పోషించారు. దయా నాయక్ నిజ జీవితం నుంచి ప్రేరణ పొంది ఈ పాత్రను రూపొందించారు. ఈ సినిమాకు మొదట 'దయ' అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. నానా పటేకర్ పోషించిన సాధు అగాషే పాత్ర ఆయన కెరీర్లో బెస్ట్ ఫెర్మారెన్స్లో ఒకటిగా ప్రశంసలు అందుకుంది. ఇదీ చదవండి: అదే మా ఇద్దరి చివరి సంభాషణ.. తుకారం ముండే -
జపాన్‌లో ‘నాగ్ సామా’.. ‘శివ’కు అదిరిపోయే స్పందన
అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ ‘శివ’ 4K డాల్బీ అట్మాస్ వెర్షన్‌గా జపాన్‌లో రీ-రిలీజ్ అయింది. 1989లో విడుదలైన ఈ చిత్రం 37 ఏళ్ల తర్వాత కూడా జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో ‘శివ’ గ్లోబల్ ఆడియన్స్‌లోనూ తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కింగ్ నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సన్నివేశాలకు జపాన్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అక్కడి అభిమానులు నాగార్జునను గౌరవంగా ‘నాగ్ సామా’ అని సంబోధించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.అధునాతన 4K విజువల్స్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు శివ చిత్రం వచ్చింది. తన ప్రభావం కాలంతో పాటు ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా అప్పట్లో సౌండ్ డిజైన్, టేకింగ్, యాక్షన్ ప్రెజెంటేషన్ పరంగా టాలీవుడ్ దిశను మార్చిన చిత్రంగా నిలిచింది. అప్పట్లో టాలీవుడ్ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్‌లోనూ కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషమనే చెప్పాలి. -
చుట్టమల్లే సాంగ్ వివాదం.. సెలబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్..!
దేవర సాంగ్ చుట్టమల్లే ఏఐ వీడియోపై టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్పందించారు. ఈ వివాదంపై సెలబ్రిటీలు స్పందించడాన్ని ఆయన మండిపడ్డారు. అసభ్యకర లింక్, కంటెంట్ కోట్లాది మంది చూసే సెలబ్రిటీలే మరింత పబ్లిసిటీ చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోట్లాది మంది దృష్టికి ఆ కంటెంట్‌ను తీసుకెళ్లే బదులు, దానికి బాధ్యులైన నిందితులను గుర్తించి పట్టుకోవడంపై దృష్టి పెట్టాల్సిందని ఆర్జీవీ తన ట్వీట్లో ప్రస్తావించారు.ఏఐ వీడియో వివాదంపై సినీ ప్రముఖులు స్పందించడాన్ని రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. బాధితురాలికి, అభ్యంతరకరమైన కంటెంట్‌కు మరింత ప్రచారం కల్పించేలా పోస్టులు చేయడం కూడా తప్పేనని ఆర్జీవీ తన ట్వీట్లో ప్రస్తావించారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరలోని చుట్టమల్లే వీడియో సాంగ్‌ను అసభ్యంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇది చూసిన ఎన్టీఆర్ సైతం ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. సాంకేతికతను దుర్వినియోగం చేసేవారిని వదిలిపెట్టనంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, చిరంజీవి సైతం ఎన్టీఆర్‌కు మద్దతుగా పోస్టులు పెట్టారు. The only thing all the celebrities succeeded in , is to publicise and thereby make crores and crores of people see the objectionable link ..The smart thing would have been to concentrate on catching the perpetrator and publicise that ..Instead what they did is to tweet and bring enormous attention to the victim’s identity and the offensive content which is also a crime— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2026 -
ఉద్యోగుల భవిష్యత్తు.. RGV హెచ్చరిక!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ దర్శకుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు, మానవ ఆలోచనా సామర్థ్యం ఎలా మారవచ్చనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీ అనేది మొదటి నుంచి మన జీవితాన్ని సులభతరం చేయడానికి వచ్చింది. శారీరక శ్రమను తగ్గించడం, సమయాన్ని ఆదా చేయడం, రోజువారీ విసుగు పుట్టించే పనులను మనకు దూరం చేయడం టెక్నాలజీ ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఏఐ కూడా అదే పని చేస్తోంది.అయితే.. ఈసారి ఏఐ కేవలం మన చేతులతో చేసే పనులను కాకుండా.. మనం మెదడుతో చేసే పనులను కూడా చేయడం మొదలుపెట్టింది. ఇది ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని వర్మ పేర్కొన్నారు.మనిషికి రెండు బలాలుమనిషికి ప్రధానంగా రెండు బలాలు ఉన్నాయని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఒకటి శారీరక శక్తి, అంటే.. కష్టపడి పనిచేయడానికి ఉపయోగించే కండరాల బలం. రెండోది మేధస్సు, అంటే.. ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, కొత్త విషయాలను సృష్టించడం.పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత యంత్రాలు మనుషులు చేసే అనేక శారీరక పనులను చేయడం ప్రారంభించాయి. ఫ్యాక్టరీల్లో యంత్రాలు రావడంతో మనిషి చేయాల్సిన శారీరక శ్రమ తగ్గింది. ఇప్పుడు ఏఐ రావడంతో మనిషి చేసే మేధోపరమైన పనులు కూడా ఆటోమేట్ అవుతున్నాయని చెప్పారు.ఉద్యోగాలు వాళ్ల చేతుల్లోకి!ఇప్పటికే ఏఐతో రాయడం, డిజైన్లు రూపొందించడం, డేటాను విశ్లేషించడం, కోడింగ్ చేయడం, కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం వంటి అనేక పనులు సాధ్యమవుతున్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత పెరిగితే.. కొన్ని ఉద్యోగాల్లో మనుషుల అవసరం భారీగా అవకాశం ఉంది. అందుకే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం కంటే, ఏఐని ఎవరైతే ఎక్కువ ఉపయోగిస్తున్నారో.. అలాంటి వాళ్ల చేతుల్లోకి ఉద్యోగాలు వెళ్ళిపోతాయని వర్మ వెల్లడించారు. పాత పద్దతులను అవలంబిస్తూ ముందుకు వెళ్లాలనుకునే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.చివరగా ''నువ్వు కోరుకునే విషయంలో జాగ్రత్తగా ఉండు.. అది నిజమైపోవచ్చు'' అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అంటే.. మనిషి ఎప్పుడూ శ్రమ తగ్గించుకోవాలని, ఎక్కువ ఖాళీ సమయం కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏఐ ఆ కోరికను నిజం చేసే దిశగా వెళ్తోంది. కానీ ఆ కోరిక నిజమైతే?.. మన ఉద్యోగాలు, మన అవసరం, చివరకు మనిషిగా మన ప్రత్యేకత ఏమిటనే ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.With A I , the first jobs to vanish will be of those who immediately don’t embrace it Technology has always been designed for our convenience , to save us from physical hardships and to save our time from wasting it on mundane tasks .. we all wish for more and more free time…— Ram Gopal Varma (@RGVzoomin) September 7, 2026 -
అల్లు అరవింద్ కామెంట్స్‌పై వివాదం.. ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
అల్లు అరవింద్- యశ్ వివాదంపై సంచలన డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. గతంలో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలను ఇప్పుడు వివాదం చేస్తున్నారని అన్నారు. ఎక్కడా కూడా యశ్‌ను ఆయన విమర్శించేదని తెలిపారు. కేజీఎఫ్ తర్వాత యశ్ రేంజ్ మారిపోయిందని మాత్రమే చెప్పారని గుర్తు చేశారు. అది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక శుక్రవారంతో కెరీర్ మారిపోతుందనే అర్దంలొ అదే విషయాన్ని కేజీఎఫ్ హీరో యశ్ కూడా చెప్పారని అన్నారు. ఈ విషయంలో యశ్ మదర్ తెలియక మాట్లాడి ఉంటారని రాం గోపాల్ వర్మ తన ట్వీట్లో ప్రస్తావించారు. ఇలా గతంలో మాట్లాడిన పాత వీడియోలను పట్టుకుని మనం మాట్లాడడం సరైంది కాదన్నారు. బాహుబలికి ముందు హిందీ ప్రేక్షకులకు ప్రభాస్ గురించి తెలియదు.. అలాగే కాంతారాకు ముందు రిషబ్ గురించి ఎవరికీ తెలియదు.. గాడ్ ఫాదర్‌కు ముందు బ్రాండో గురించి నాకు తెలియదు.. బహుశా 'ఎ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్', 'ఆన్ ది వాటర్ ఫ్రంట్' వంటి సినిమాలతో అతను అంతకు ముందే స్టార్ అయ్యి ఉండవచ్చని అన్నారు.. అవి భారతదేశంలో కూడా విడుదలయ్యాయో లేదో నాకు తెలియదు.. ఎందుకంటే ఆ సినిమాలే వారిని పెద్ద స్టార్లుగా చేశాయని రాసుకొచ్చారు. అంతేగాని వారు స్టార్లు కాదు.. హాలీవుడ్ ఎప్పుడూ కాన్సెప్ట్ సినిమాలపైనే ఎక్కువగా ఖర్చు చేస్తుంది.. కానీ స్టార్లపై కాదు.. నోలన్ వంటి దర్శకులు కూడా నటులను వారి నటన ప్రతిభ కోసమే వాడుకుంటారు తప్ప వారి స్టార్‌డమ్‌పై ఆధారపడరు.. అది ఓపెన్‌హైమర్ సినిమా అయినా, ఒడిస్సీ అయినా, అందులో ఎవరున్నా అవి అంతే విజయం సాధిస్తాయని మనందరికీ తెలుసు కదా అన్నారుఇక విషయానికి వస్తే అల్లు అరవింద్ విషయానికి వస్తే.. అత్యంత సాధారణమైన, మంచి ఉద్దేశంతో కూడిన ఆలోచనను ఆయన అన్న మాటను వ్యక్తిగతంగా తీసుకోవడం అంటే కేవలం విపరీతమైన అహంకారం ఉన్నవారేనని ప్రస్తావించారు.. నిజానికి.. ఇలాంటి ప్రతిచర్యే వారు అలాంటివి ఎందుకు చేస్తున్నారో కూడా వివరిస్తుందని అన్నారు. కాగా.. 2023లో కోటబొమ్మాలి ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడిన విడియో క్లిప్‌పై యశ్ మదర్ కామెంట్స్ చేయడమే ఈ వివాదానికి కారణమైంది. The controversy regarding #AlluAravind ‘s statement regarding #Yash is ridiculously laughable because what he clearly meant when he talked about big films with unknown actors and saying he dint know of Yash before KGF , even a dumbo should understand that it was in context of the…— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2026 -
అంత ఈగో ఎందుకు? యష్ తల్లిపై ఆర్జీవీ సెటైర్లు
'కేజీఎఫ్' తర్వాత యష్ హీరోగా చేసిన 'టాక్సిక్' సినిమా అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తోంది. రిలీజ్ రోజు కాస్త హడావుడి కనిపించింది. కానీ తర్వాత నుంచి ఘోరంగా కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. అయితే ఎన్ని వందల కోట్లు నష్టాలు వచ్చాయనేది కొన్నాళ్ల తర్వాత క్లారిటీ వస్తుంది. కానీ ఇంతలోనే యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ కారణంగా అవసరం వివాదం తెరపైకి వచ్చింది. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం నిర్మాత అల్లు అరవింద్ అన్న మాటలపై ఇప్పుడు ఈమె స్పందించడం చర్చనీయాంశమైంది. ఇక ఈ వివాదంలో ఎంటరైన ఆర్జీవీ.. తనదైన శైలిలో ఆమెకు చురకలు అంటించాడు.(ఇదీ చదవండి: 'పుష్ప'లో చీర కట్టుకోవడం.. నేను చేసిన పెద్ద 'ఆల్ఫా' పని: అల్లు అర్జున్)'యష్‌పై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యల చుట్టూ జరుగుతున్న వివాదం మరీ నవ్వు తెప్పించేలా ఉంది. ఎందుకంటే పెద్ద సినిమాలని అప్పటివరకు పెద్దగా తెలియని నటులతో చేయడం గురించి ఆయన మాట్లాడినప్పుడు 'కేజీఎఫ్'కి ముందు తనకు యష్ ఎవరో తెలియదని చెప్పారు. ఆయన ఉద్దేశం ఏంటో కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.''హిందీ ప్రేక్షకులు బాహుబలి ముందు ప్రభాస్ ఎవరో తెలీదు. కాంతార ముందు రిషభ్ శెట్టి గురించి కూడా వారికి తెలీదు. అలానే నాకు 'గాడ్ ఫాదర్' ముందు మార్లన్ బ్రాండో గురించి తెలీదు. అంతకు ముందే వచ్చిన సినిమాలతో బ్రాండో స్టార్ అయ్యిండొచ్చు. కానీ అవి మన దేశంలో రిలీజయ్యేంతవరకు నాకు తెలీదు. అసలు విషయం ఏంటంటే ఆ సినిమాలు వాళ్లని పెద్ద స్టార్లుగా చేశాయి తప్పితే పెద్ద స్టార్లు కావడం వల్ల ఆ మూవీస్ పెద్దవి కాలేదు''హాలీవుడ్లో సాధారణంగా స్టార్స్‌పై కాకుండా కాన్సెప్ట్లపై పెట్టుబడి పెడతారు. క్రిస్టోఫర్ నోలన్ లాంటి దర్శకులు కూడా నటుల స్టార్డమ్ మీద ఆధారపడకుండా, వారి నటనా సామార్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పేరున్న నటీనటులని ఎంపిక చేస్తారు. ఓపెన్ హైమర్ అయినా, ద ఒడిస్సీ అయినా అందులో ఎవరు నటిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఆ సినిమాలు వర్కౌట్ అవుతాయని మనకు తెలుసు''అల్లు అరవింద్ విషయానికొస్తే మంచి ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటల్ని కూడా వ్యక్తిగతంగా తీసుకునేవాళ్లు చాలా ఈగోతో(అహంకారం) ఉన్నావాళ్లే. నిజానికి అలాంటి కామెంట్స్‌కి వచ్చిన స్పందనే వాళ్లు ఎలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారో కూడా ఓ రకంగా అర్థమవుతోంది' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: యశ్ టాక్సిక్.. మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ఘోరమైన రేటింగ్) -
స్టార్ హీరోయిన్‌తో ఆర్జీవీ సీక్రెట్ పెళ్లి.. చిరంజీవినే చెప్పాడు
ప్రముఖ సీనీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) పర్సనల్ గురించి గత మూడు, నాలుగు రోజులుగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ స్టార్ హీరోయిన్ని ఆయన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడట. ఈ విషయాన్ని అప్పట్లో చిరంజీవినే మీడియాకు లీకు చేశాడని బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేశ్ చెప్పారు. తాజాగా ఆయన ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఆర్జీవీ సీక్రెట్ పెళ్లి గురించి చిరంజీవినే తనతో చెప్పాడని అన్నారు.‘ఓ రోజు చిరంజీవి దగ్గరకు వెళ్తే.. 'హేయ్ జ్యోతి... ఊర్మిళను రామ్ గోపాల్ వర్మ పెళ్లి చేసుకుంది రాయలేదని చిరంజీవి నాతో అన్నారు. వారికి పెళ్లి ఎప్పుడు జరిగింది? అని నేను ఆయన్ను అడిగాను. ఆంధ్రప్రదేశ్‌ో ఓ ప్రముఖ ఆలయంలో ఊర్మిళను తీసుకెళ్లి ఆర్జీవీ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. మీ దగ్గర ప్రూఫ్ ఏంటని అడిగాను. వారి పెళ్లి చేసిన పూజారి ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు. నేను ఆర్టికల్ రాయడానికి ముందే ఊర్మిళకు ఫోన్ చేశా. ఆమె ఏడుస్తూ.. ‘ నా గురించి మీరు అలా ఎలా రాస్తారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి నా గురించి మీకు తెలుసు కదా’ అని అన్నారు. ఇదే విషయం ఆర్జీవీకి కాల్ చేస్తే 'నో కామెంట్' అని అన్నారు. దీంతో ఇద్దరి సైడ్ నుంచి స్టోరీ రాశాను’ అని జ్యోతి వెంకటేశ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే సీక్రెట్ పెళ్లిపై అటు ఊర్మిళా కనీ, ఇటు ఆర్జీవి కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.ఆర్జీవీతో పెళ్లి జరిగిందో లేదో తెలియదు కానీ.. 2016 లో మోహ్సిన్ అక్తర్ మీర్ ని ఊర్మిళ వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. 2024లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఊర్మిళ సింగిల్ గానే ఉంటుంది. అప్పట్లో ఆర్జీవీ, ఊర్మిళ కాంబో ఓ సంచలనం. వీరిద్దరి కాంబోలో వచ్చిన గాయం, రంగీలా, సత్య, అంతం, దౌడ్ వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. Jyothi Venkatesh spills tea on SECRET marriage of Ramgopal verma with urmila mamdodkat🤯They married in Temple, Chiranjevii leaked temple priest's direct phone number to expose the secret wedding👀When asked Urmila, she started crying & Ram Gopal Varma replied "no comments" pic.twitter.com/xxeGrfMudP— Chota Don (@choga_don) July 30, 2026 -
నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. ‘లెనిన్’పై ఆర్జీవీ రివ్యూ
అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం ‘లెనిన్’ తో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. “వస్తున్నాం.. మనోడు కొడుతున్నాడు” అంటూ ప్రమోషన్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వసూళ్ల వివరాలు పక్కన పెడితే.. అఖిల్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంతో ఆయన తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొనియాడారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) సోషల్ మీడియాలో అఖిల్‌ను అభినందించారు. హే అఖిల్ అక్కినేని ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నందుకు బిగ్ కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. థ్యాంక్యూ సార్.. ప్లీజ్ సినిమా చూడండి అని రిప్లై ఇచ్చారు. Hey @AkhilAkkineni8 Just saw #Lenin , and apart from the FILM being GREAT , I realised that you are the BEST ACTOR in the #Akkineni family and I swear this on @iamnagarjuna 🔥🔥 Your ease is remarkable even when there’s no emotion in the scenes and in the emotional scenes you… https://t.co/az4x6dFsTL— Ram Gopal Varma (@RGVzoomin) July 12, 2026తాజాగా సినిమా చూసిన ఆర్జీవీ, ఎక్స్ వేదికగా తన రివ్యూని పంచుకున్నారు. ఆయన అఖిల్ నటనపై ప్రశంసలు కురిపించారు. నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. అక్కినేని ఫ్యామిలీలోనే అఖిల్ అత్యుత్తమ నటుడు అని ఆర్జీవీ పేర్కొన్నారు. సాధారణ సన్నివేశాల్లో కూడా అఖిల్ నటనలో కనిపించే ఈజ్ అద్భుతం, భావోద్వేగ సన్నివేశాల్లో అయితే అదరగొట్టేశాడని వర్మ అభిప్రాయపడ్డారు. అఖిల్‌కు ఇలాంటి అద్భుతమైన పాత్రను అందించిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
రామ్‌గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
రక్త చరిత్రను మించిన బయోపిక్ ఆ పోలీస్ స్టోరీపై ఆర్జీవీ కన్ను
-
నేపాలీ గ్యాంగ్స్‌పై ఆర్జీవీ కన్ను?
హైదరాబాద్‌తో పాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో నేపాలీ గ్యాంగ్స్ సృష్టించిన హత్యలు, దోపిడీలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన ఘటనతో ఈ నేపాలీ ముఠాల ఆగడాలు మరింతగా వెలుగులోకి వచ్చాయి. దాంతో ఈ పరిణామాలపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దృష్టి పడింది. ఎప్పుడూ రియల్ లైఫ్ కథలను తనదైన శైలిలో సినిమాగా మలచడంలో ఆసక్తి చూపుతుంటాడు వర్మ. తాజాగా ఈ దర్శకుడు నేపాలీ ముఠాల కథను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడని సమాచారం. దీనికి సంబంధించి సరైన పాయింట్ కోసం ఆయన వెతుకుతున్నాడని తెలుస్తోంది. గతేడాది తన సూపర్ హిట్ చిత్రం 'సత్య' సినిమాను మళ్లీ చూశాడు వర్మ. అనంతరం ఎందుకు దానిని బెంచ్‌మార్క్‌గా పెట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై తన ప్రతిభకు తగ్గ గొప్ప సినిమాలు తీస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అయితే ఆ తర్వాత తాను ప్రకటించిన 'సిండికేట్' సహా పలు ఇతర ప్రాజెక్టులు సైతం కార్యరూపం దాల్చలేదు. -
నాగబాబుకు బిగ్ షాక్ ప్రకాష్ రాజ్ కు RGV సపోర్ట్
-
MLC నాగబాబుకు RGV అదిరిపోయే కౌంటర్
-
ప్రకాశ్ రాజ్‌కు ఆర్జీవీ మద్దతు.. నాగబాబుకు కౌంటర్
సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తరచూ స్పందించే ఆర్జీవీ.. తాజాగా జనసేన నేత నాగబాబు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వివాదంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రకాశ్ రాజ్‌కు తన మద్దతు తెలుపుతూ పరోక్షంగా నాగబాబుకు చురకలు అంటించాడు.ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘నాయకుడి మాటే శిరోధార్యం. ఏది సరైనదో, ఏది కాదో నాయకుడికే తెలుసు. సందేహాలను పక్కనపెట్టి, ప్రశ్నలు వేయకుండా నాయకుడిని అనుసరించాలి’ అంటూ పవన్ కల్యాణ్ ఫోటోని షేర్ చేశాడు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ‘మేము గొర్రెలం కాదు, బానిసలమూ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు. ఏ నాయకుడైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది’ అని నాగబాబుకు కౌంటర్ ఇచ్చాడు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతో ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు. అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు’ అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.In effect what you mean is , in a democracy, a leader is given a responsible position by people who trusted him to take care of their issues ..He’s not been crowned as a king 🙏 https://t.co/k9OaxI2Mn8— Ram Gopal Varma (@RGVzoomin) June 7, 2026 -
రణ్వీర్ సింగ్‌ని కాదు... ఎఫ్డబ్య్లూఐసీఈని బ్యాన్ చేయండి
‘‘డాన్ 3’ సినిమా వివాదంలో రణ్వీర్ సింగ్‌కు మద్దతుగా నిలిచారు దర్శక–నిర్మాత రామ్‌గోపాల్ వర్మ. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్ 3’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభానికి మూడు వారాల ముందు ఈ ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ తప్పుకోవడంతో దాదాపు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్ ఆరోపించారు. ఆ నష్టాన్ని భర్తీ చేయాలని ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎం΄్లాయీస్’ (ఎఫ్డబ్య్లూఐసీఈ) యూనియన్‌కు రణ్‌వీర్‌పై ఫర్హాన్ ఫిర్యాదు చేశారు.ఈ విషయమై చర్చించేందుకు ‘ఎఫ్‌డబ్లూఐసీఈ’ ప్రతినిధులు రణ్వీర్ సింగ్‌కు మూడుసార్లు నోటీసులు పంపారు. అయితే సరైన స్పందన లేక΄ోవడంతో దాదాపు మూడేళ్ల పాటు రణ్వీర్æసినిమాల చిత్రీకరణలో పాల్గొనకూడదని, ఎఫ్డబ్య్లూఐసీఈ తీర్మానించడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై రామ్‌గోపాల్ వర్మ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసిన సుధీర్ఘ పోస్ట్ సారాంశం ఇలా... ‘‘రణ్వీర్ సింగ్‌ని కాదు ఎఫ్‌డబ్ల్యూఐసీఈని నిషేధించండి. ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అనేది ప్రభుత్వ గుర్తింపు పొందిన నియంత్రణ సంస్థ కాదు. చట్టపరమైన నిబంధనలను పక్కనపెట్టి కొందరు వ్యక్తులు ప్రైవేటుగా సమావేశమై, ఒక ఎజెండాతో ఈ తీర్పును ముందుగానే నిర్ణయించినట్లు ఉన్నారు. ‘ధురంధర్’ సినిమాతో రణ్వీర్ సింగ్ సాధించిన భారీ క్రేజ్ చూసి భయపడుతున్న కొందరు నటులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నట్లున్నారు. నిర్మాత ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌లో నష్టం జరిగిందని చెబుతున్నారు. భారతదేశంలో చాలా వ్యాపారాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇలాంటి సివిల్ వివాదాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ వారిలో ఒకరు లేదా ఇద్దరూ కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు న్యాయమూర్తి ఆ విషయాన్ని తేలుస్తారు. నేను ఫైనల్‌గా చెప్పేది ఒకటే... ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న సివిల్ వివాదంలోకి అనవసరంగా తలదూర్చవద్దు’’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు రామ్‌గోపాల్ వర్మ. -
విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!
తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అద్బుత విజయం అందుకున్నాడు. తొలిసారి బరిలో నిలిచినప్పటికీ ఏకంగా 108 స్థానాల్లో కైవసం చేసుకోవడం తలలు పండిన రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్‌ని రెండు వారాల సమయం అడిగిన విజయ్.. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇకపోతే విజయ్ గెలుపు గురించి చాలామంది చాలారకాలుగా ట్వీట్స్ చేస్తుంటే దర్శకుడు రాంగోపాల్ వర్మ కాస్త వ్యంగ్యంగా ఫొటోతో పాటు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: తమిళనాడు 'కింగ్'గా విజయ్.. ట్రెండింగ్‌లో త్రిష)తమిళనాడుకు గతంలో ముఖ్యమంత్రిగా చేసి, డీఎంకే పార్టీని కూడా నడిపించిన కరుణానిధితో పాటు విజయ్ ఉన్న పాత ఫొటోని షేర్ చేసిన వర్మ.. 'తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీనే నాశనం చేస్తాడని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమిళనాడులో 234 స్థానాలుండగా విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసి 108 స్థానాలు దక్కించుకుంది. డీఎంకే కూటమి 73, ఏఐఏడీఎంకే కూటమి 53 స్థానాల్లో గెలిచారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌తో కలిసొచ్చేది ఎవరా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, తమిళనాడులోని చిన్న చిన్న పార్టీలు.. విజయ్‌కి మద్ధతుగా నిలిచే అవకాశమున్నట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: టీవీకే విజయం.. త్రిష కూడా రాజకీయాల్లోకి?)Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026 -
' నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యా'.. ఆర్జీవీ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొద్దిమంది డైరెక్టర్లలో ఆర్జీవీ ఒకరు. ఆయన ఏం మాట్లాడినా సరే అందులో ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. రోటీన్‌కు భిన్నంగా తన పంచ్‌లతో ఆకట్టుకుంటారు. అలా టాలీవుడ్లో విలక్షణ దర్శకుడిగా రాం గోపాల్ వర్మ అభిమానుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు.ఇవాళ ఆర్జీవీ మరో వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 7న రాం గోపాల్ వర్మ బర్త్ డే కావడంతో తనదైన స్టైల్లో మరో ట్వీట్ చేశారు. ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యానంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు. అందువల్ల మీకు సంతోషం కలిగించే మరే ఇతర కారణాల కోసమైతే తప్ప.. ఈ రోజును వేడుకలా జరుపుకోవద్దు! ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన కొందరు అభిమానులు ఆర్జీవీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. Today i reached 1 more year closer to my death and so let’s not celebrate unless for whatever reasons that makes you happy ! Thanks 💐💐💐 pic.twitter.com/mkKLW9G32t— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2026 -
దురంధర్ 2 హిట్‌పై RGV & బాలీవుడ్ డైరెక్టర్స్ భయపడ్డారు
-
దేవుళ్లనుకునే ఆ హీరోలకు ఇక మనుగడ లేదు: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నిరోజుల నుంచి 'ధురంధర్ 2' మేనియాలోనే ఉన్నాడు. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తెలుగు స్టార్ హీరోలని కౌంటర్ వేస్తూ పెద్ద ట్వీట్ చేశాడు. అది ఆయా హీరోలకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: 'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి')'ధురంధర్ 2 ఓ హారర్ సినిమా. కానీ ఇది ప్రేక్షకులని భయపెట్టలేదు. కేవలం మాస్ మసాలా, లౌడ్నెస్, లాజిక్ లేని చిత్రాలతో కెరీర్ నిర్మించుకున్న దర్శకుల గుండెల్లో వణుకు పుట్టించింది. బుర్రని ఇంట్లోనే వదిలేసి సినిమా చూడాలనే కాలం చెల్లిన డైరెక్టర్లకు ఈ మూవీ ఓ పీడకల. ఇన్నాళ్లు నొప్పి తెలియకుండా గాయపడకుండా కేవలం ఎలివేషన్ల మీద బతికే 'దేవుళ్లు' అనే ఫీలింగ్ ఉన్న హీరోలని రణ్వీర్ సింగ్ తనదైన నటనతో పాతిపెట్టాడు. ఇందులో హీరోకు బలహీనతలు ఉంటాయి. నిజమైన రక్తం చిందస్తూ, తన తెలివైన హీరోయిజం పండించడం చూస్తుంటే పాతకాలపు హీరోలు.. సర్కస్‌లో జోకర్లలా కనిపిస్తున్నారు. గాల్లో యాభై అడుగులు ఎగిరే ఫైట్స్, గ్రావిటీని అవహేళన చేసే యాక్షన్ సీన్స్ నమ్ముకున్న వారికి ఇక మనుగడ లేదు' అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.'పాన్ ఇండియా దర్శకులు.. కేవలం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, ఫొటోషాప్‌తో చేసిన సిక్స్ ప్యాక్‌లతో పాత్రలని సృష్టించవచ్చని భ్రమపడుతున్నారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం మెదడుతో సినిమా తీసి చూపించారు. ధురంధర్ 2 సాధిస్తున్న భారీ కలెక్షన్స్.. పాతకాలపు దర్శకుల నమ్మకాలని పూడ్చి పెడుతున్న శబ్దాలు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోయే డైరెక్టర్స్.. ఇప్పటికైనా 'ధురంధర్ 2'ని పదేపదే చూసి పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డబ్బు ఉండొచ్చు కానీ ఆదిత్య ధర్ లాంటి విజన్ ఎక్కడ నుంచి తెస్తారు?' అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఆర్జీవీ ట్వీట్ చూస్తే చాలామందికి నిజమే కదా అనిపించకమానదు. ఎందుకంటే ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని చాలా తక్కువగా చూస్తే లాజిక్ లేని సినిమాలు తీస్తూ చాలామంది దర్శకులు కాలం గడిపేస్తున్నారు. ప్రేక్షకులు కూడా మరో దారి లేక వాటిని చూస్తున్నారు. ఇప్పుడు 'ధురంధర్ 2' లాంటి మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ కచ్చితంగా మార్పు వచ్చే అవకాశముంటుందనేది ఆర్జీవీ ఉద్దేశం అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)The @Dhurandhar2 is a HORROR.It is a horror for all filmmakers who built their careers and their fortunes on dumbed down, over the top cinema. The cinema that demanded the brain to be left at home . The cinema that was rammed down our throats full of LOUDNESS and MASALA which…— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2026 -
ఆ జంట పతనం కోసం అందరు వెయిటింగ్: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దురంధర్ మూవీ హిట్ కావడం చాలామందిని భయపెట్టిందన్నారు. ఆదిత్య ధర్‌కు ఆదరణ పెరగడం కొందరికీ నచ్చడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతన్ని చూసి చాలామంది అసూయ పడుతున్నారని అన్నారు. ఆదిత్య ధర్, ఆయన సతీమణి యామీ గౌతమ్ పతనం కోసం సినీ పరిశ్రమలో ఎంతోమంది ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జీవీ దురంధర్ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ స్పై థ్రిల్లర్ మూవీ భారతీయ సినిమా గతిని మార్చిందని అన్నారు. ఆయన వల్ల సినీ ఇండస్ట్రీలో మిగిలిన వాళ్లంతా పునరాలోంచించేలా చేసిందని తెలిపారు. ఇలాంటి సమయంలో ఆదిత్య ధర్, యామి గౌతమ్ మరింత జాగ్రత్తగా ముందడుగు వేయాలని సూచించారు.ఆర్జీవీ మాట్లాడుతూ..' తెరపై కథ చెప్పే విధానం, మేకింగ్ స్టైల్ ఆదిత్య ధర్ పూర్తిగా మార్చేశారు. మన సినిమాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు. ఇక్కడ నేను హిందీ మాత్రమే కాకుండా అన్ని భాషల గురించి మాట్లాడుతున్నా. తెలుగులో రాబోయే అనేక పెద్ద-బడ్జెట్ యాక్షన్ చిత్రాలు భారీ రీ షూటింగ్‌కు రెడీ అవుతున్నాయి. దీనివల్ల నిర్మాతలపై అదనపు భారం తప్పదు. ఆదిత్య ధర్ వల్లే ఇలా చేయాల్సి రావడం పరిశ్రమలోని కొందరికి నచ్చడం లేదు. అందుకే వారంతా అతన్ని ద్వేషిస్తారు. ఆయన అందరిని కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు తీసుకొచ్చేలా చేశాడు. అందుకే ఆదిత్య ధర్ ఫెయిల్యూర్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారని' అన్నారు. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తోన్న దురంధర్-2 ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఇకపై రూ. 1000 కోట్లు అక్కర్లేదు.. రాజమౌళితో పోలుస్తూ ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
రామ్‌గోపాల్ వర్మ.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ . తాజాగా ఆయన 'సీడెన్స్ 2.0'( Seedance 2.0) అనే ఏఐ(AI) టూల్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినిమా రంగాన్ని ఏఐ ఏ విధంగా 'ఖూనీ' చేయబోతోందో, అదే సమయంలో సామాన్యుడికి ఏ విధంగా ముక్తి ప్రసాదించబోతోందో ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు.టెక్నాలజీ మారుతున్న కొద్దీ సినిమా మేకింగ్ విధానం మారుతుందని అందరికీ తెలుసు, కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఏకంగా సినిమా ఇండస్ట్రీ మరణం గురించి జోస్యం చెప్పారు. 'సీడెన్స్ 2.0' వంటి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ రాకతో, కోట్లాది రూపాయల బడ్జెట్లు, వేలమంది టెక్నీషియన్లతో కూడిన ప్రస్తుత సినిమా ఎకోసిస్టమ్ 'బ్రూటల్ మర్డర్' కాబోతోందని ఆయన ట్వీట్ చేశాడు.అత్యంత ఖరీదైన సినిమాలు తీసి, అత్యంత విజయవంతమై సినిమాలు తీయడం వల్ల రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడు. రూ. 1000 కోట్లు కాదు అంతకంటే ఎక్కువ రాబట్టగలడనే ట్రాక్ రికార్డు ఆయనకు ఉంది. ఇదంతా ఆయనకు ఉన్న అసమానమైన క్రియేటివ్ ఊహాశక్తి వల్లే సాధ్యం అయింది. కానీ ఇప్పుడు 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో, ఎంతమంది రాజమౌళిలు లేదా ఆయన కంటే మెరుగైనవాళ్లు చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండొచ్చు? క్రియేటివ్ విజన్ ఉన్నవాళ్లు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి యాక్సెస్ లేనివాళ్లు, డబ్బులు లేనివాళ్లు... వాళ్లకు అవకాశం తలుపు మూసేసి, కీలు కొందరి దగ్గరే ఉంది. కానీ సీడెన్స్ 2.O ఆ తలుపులను తన్ని పారేసింది. ఇక టాలెంట్ ఉంటే చాలు, అవకాశం కోసం ముంబై రానక్కర్లేదు. ఇది కేవలం వాళ్ల డిస్క్రిప్టివ్ ప్రాంప్ట్‌లు తీసుకొని, సినిమాటిక్‌గా, మల్టీ-షాట్లతో, సౌండ్ డిజైన్‌తో, వందల కోట్ల ఖర్చుతో, నెలలు పట్టే సీన్లను క్రియేట్ చేస్తుంది. ఇకపై నటులు, కెమెరామెన్లు, ఎడిటర్లు, ఫైట్ మాస్టర్లు, లైట్ బాయ్స్.. ఇలా భారీ సైన్యం అవసరం లేకుండానే థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు వస్తాయి.స్టార్ ఇష్యూస్ లేవు . బడ్జెట్ గురించి ప్రొడ్యూసర్లు భయపడాల్సిన అవసరం లేదు ."పోస్ట్‌లో ఫిక్స్ చేద్దాం" అనే పని లేదు. ఒక షాట్ కోసం 300 మంది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒకరు. ఒక ప్రాంప్ట్. ఒక మైండ్. అడ్వాన్స్డ్ AIలు ఫుల్ లెంగ్త్ థియేట్రికల్ క్వాలిటీ సినిమాలు తయారు చేయగలిగినప్పుడు... యూనియన్లు, కోట్ల ఓవర్‌హెడ్స్, "మాకే సినిమాలు తీయడం తెలుసు" అనే అహంకారం ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ మరణిస్తుంది. నెమ్మదిగా కాదు. శాంతియుతంగా కాదు. బ్రూటల్‌గా మర్డర్ అవుతుంది. కానీ దాని హార్ట్‌లో... ఇది సినిమాకు నిజమైన లిబరేషన్. డైనోసార్లు 100 ఏళ్లు రాజ్యం చేశాయి. ఇప్పుడు ఆస్టరాయిడ్ వచ్చేసింది. దాని పేరు AI. కొత్త ఎరాకు స్వాగతం. ఇక్కడ టాలెంట్ మాత్రమే ముఖ్యం, యాక్సెస్ కాదు. అదే చంపేస్తుంది. అదే రక్షిస్తుంది. ఇక వెనక్కి తిరిగి రానిది. కాబట్టి ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మరణమా? లేక ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క అల్టిమేట్ డెమోక్రటైజేషనా?’ అని ఆర్జీవీ ప్రశ్నించారు. SEEDANCE 2.0 , the MURDERER of FILM INDUSTRY Leaving aside its copyright infringements etc which is another matter , here’s my take on Seedance 2.0 @ssrajsmouli is the no. 1 director because he makes the most expensive films and the most successful ..People fund him a 1000…— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2026 -
గల్ల పట్టుకొని కొట్టుకున్న రాజమౌళి, మహేశ్.. ఏఐ వీడియో వైరల్
సాంకేతికత ఎంత ఎదిగితే అంత ముప్పు కూడా ఉంటుందనే మాట నిజమనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న దృశ్యాలు అసలు-నకిలీల మధ్య తేడాను చెరిపేస్తున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే.. అవి నిజమా కాదా అనేది కూడా కనిపెట్టలేకపోతున్నాం. అలాంటి ఓ ఫన్నీ ఏఐ వీడియోని ఎక్స్‌లో షేర్ చేశాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ. అందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఒకరినొకరు గల్ల పట్టుకొని కొట్టుకుంటున్నారు.ఏఐతో క్రియేట్ చేసిన ఈ వీడియోని ఎక్స్‌లో షేర్ చేస్తూ.. ‘సినిమా చనిపోయింది’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. ఈ వీడియోలో మహేష్ బాబు, రాజమౌళి అత్యంత సహజంగా గొడవ పడుతుండటం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘ఏఐతో ఏదైనా సాధ్యమే’, ‘బహుశా పాస్‌పోర్ట్ విషయంలోనే(వారణాసి షూటింగ్ మొదలైనప్పుడు మహేశ్ పాస్‌పోర్ట్ లాక్ చేసినట్లుగా జక్కన్న ఓ పోస్ట్ పెట్టాడు) ఈ గొడవ జరుగుతుందేమో’, ‘వారణాసి ప్రచారం సమయంలో కచ్చితంగా ఈ వీడియోను ప్లే చేస్తా’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమది ఇలాంటి వీడియోల వల్ల సెలబ్రిటీల ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారణాసి విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. మహేశ్‌బాబుకి జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమరన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు .వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుది. CINEMA IS DEAD https://t.co/JUPhPHPTDz— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2026 -
ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి
సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేదు. అయితే మార్చిలో 'ధురంధర్ 2', టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటి గురించి సగటు ప్రేక్షకుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రాల మధ్య పోటీ గురించి.. ప్లస్ మైనస్సుల గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఈ మేరకు ట్విటర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.'నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ చూడని ఓ భీకర యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో 'కేజీఎఫ్ 2' సాధించిన భారీ వసూళ్లు.. 'ధురంధర్' ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' అనే డేవిడ్ ముందు 'టాక్సిక్' అనే గోలియత్ నిలబడింది. ధురంధర్ మేకర్స్.. ప్రేక్షకుల తెలివితేటలని గౌరవిస్తున్నారు. 'టాక్సిక్' మేకర్స్ మాత్రం ప్రేక్షకుల్ని మూర్ఖులని భ్రమపడుతున్నారు' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. అలానే కొన్ని పాయింట్స్ కూడా దేనికదే చెప్పుకొచ్చాడు.హీరోయిజం: గుడ్డిగా హీరోని ఆరాధించడం ఓవైపు ఉంటే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోని ప్రేక్షకులని అభిమానించడం మరోవైపు.యాక్షన్: గాలిలో ఎగిరే స్టంట్స్, న్యూటన్ ఫార్ములాని వెక్కిరించే ఫైట్స్ 'టాక్సిక్'లో ఉంటే.. ఒళ్లు గగుర్పొడితే సహజ యాక్షన్ 'ధురంధర్' సొంతంమ్యూజిక్: ప్రతి ఐదు నిమిషాలకు విజిల్స్ వేయించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే, నటనకు అవకాశమిస్తూ నిశ్శబ్దంగా సాగే సంగీతం మరోవైపుకేవలం ఓ నటుడిని దేవుడిలా చూపించడానికి రూ.700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రని మనిషిలా చూపించడానికి రూ.130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప. ప్రేక్షకులని పిల్లలనుకుని ప్రతిదీ వివరించి చూపించడం మానేయాలి. క్లిష్టంగా ఉండే స్టోరీలని కూడా అర్థం చేసుకోగలరని 'ధురంధర్' నిరూపించింది. అయితే ఇదంతా కూడా ఆదిత్య ధర్ మీద ప్రేమతో రాయడం లేదు. మన సినిమాపై ఉన్న ఆశతో రాస్తున్నాను. మార్చి 19న మన దేశం.. ధురంధర్ 2ని ఎంచుకుంటుందో లేదా టాక్సిక్ మాస్ మత్తులో పడుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాంగోపాల్ రాసుకొచ్చాడు.ఈ ట్వీట్ చూసిన చాలామంది.. 'ధురంధర్ 2'ని పొగుడుతూ 'టాక్సిక్'ని తక్కువ చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు. తాను సినిమాల గురించి మాట్లాడట్లేదని.. స్టైల్ ఆఫ్ మూవీస్ గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చాడు.For all the dumbos , who dint understand I just wanted to clarify that , in the context of the 2 releases , I was talking about the styles of cinema and not in particular about a film https://t.co/Ydy61Nr32F— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2026 -
వేల కోట్ల బడ్జెట్ మూవీ.. ఏఐతో ఒక్కరోజులోనే తీస్తే?
సినిమాల తీయడంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్, కలర్ నుంచి యానిమేటెడ్, ఇప్పుడేమో కొత్తగా ఏఐ మూవీస్ రెడీ అయిపోతున్నాయి. ఓవైపు కెమెరాతో ఎప్పటిలానే సినిమాలు తీస్తున్నప్పటికీ కొందరు ఏఐ ఉపయోగించి వందలాది కోట్ల బడ్జెట్ అయ్యే చిత్రాల్ని ఎంచక్కా ఒక్కరోజులోనే తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఇదే విషయమై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.(ఇదీ చదవండి: వాళ్లు తప్పు చేశారు.. నేను క్షమాపణలు చెబుతున్నా: రాజమౌళి తండ్రి)ఆర్జీవీ లేటెస్ట్గా ఓ ఏఐ మూవీకి సంబంధించిన చిన్న బిట్‌ని తన ట్విటర్లో షేర్ చేశాడు. 'సినిమాలకు ఇది అంతం కాకపోతే మరేంటి?' అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దాదాపు మూడున్నర నిమిషాలున్న ఈ వీడియో చూస్తే.. ఎక్కడా ఏఐతో తెరకెక్కించారనే సందేహం రాదు. హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీస్ స్టైల్లోనే చాలా భారీగా ఉంది. బిల్డింగ్స్ కుప్పకూలడం, ఆకాశం నుంచి విమానం నేలకూలడం, అమెరికాలోని బ్రిడ్జ్ విరిగిపోవడం, ఇలా ప్రతి సీన్ ఎంతో రియలస్టిక్‌గా అనిపించింది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏఐతో సినిమాలకు భారీ ప్రమాదమే పొంచి ఉంది.(ఇదీ చదవండి: హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు: సుహాస్)If this is not the end of films , I don’t know what is ?😳 Watch till END https://t.co/MVZA7mJKYH— Ram Gopal Varma (@RGVzoomin) February 18, 2026 -
పిచ్చ కొట్టుడు కొట్టాలని పించింది! రెహమాన్ పై RGV షాకింగ్ కామెంట్స్
-
సౌత్ సినిమాలను వణికిస్తున్న 'ధురంధర్'.. ఎడమ కాలితో తన్నేశాడు: ఆర్జీవీ
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ధురంధర్.. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఆపై 2025లో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా చాలాచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మూవీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌పై సౌత్ సినిమాల ఆధిపత్యానికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చిందని వర్మ అన్నారు. 2026 మార్చిలో రాబోయే 'ధురంధర్ 2' దక్షిణాదిని వణికించేలా ఉందని వర్మ అన్నాడు.దర్శకుడు ఆర్జీవీ తాజాగా ధురంధర్ సినిమా క్రేజ్ గురించి మరోసారి కామెంట్ చేశారు. వచ్చే ఏడాది రానున్న ధురంధర్ 2 దక్షిణాది సినిమాను భయపెడుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు బాలీవుడ్లో పుష్ప, కల్కి, కేజీఎఫ్, కాంతార వంటి దక్షిణాది చిత్రాల ప్రభావాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.దక్షిణాదిలో ధురంధర్ ప్రభావం ఎలా ఉందో వర్మ ఇలా అన్నారు. 'బాలీవుడ్ మీదకు సడెన్‌గా దూసుకొచ్చిన సౌత్ సినిమాల ఫైర్‌ను ధురంధర్ మూవీతో దర్శకుడు ఆదిత్య ధర్ తన ఎడమ కాలితో వెనక్కి తన్నాడు. ఇప్పుడు తన కుడి కాలుతో 'ధురంధర్ 2' ని రెడీ చేస్తున్నాడు. పార్ట్-2 గురించి నాకు తెలిసినంతవరకు మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది. పార్ట్-1 మిమ్మల్ని భయపెట్టి ఉంటే.., పార్ట్-2 మిమ్మల్ని వణికించేస్తుంది.' అని వర్మ ట్వీట్ చేశాడు.‘ధురంధర్ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2026 మార్చి 19న సీక్వెల్ విడుదల కానుంది. హిందీతో పాటు, దక్షిణాది అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల కానుంది. ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. -
అనసూయకు 'ప్రకాష్ రాజ్' ట్వీట్.. శివాజీకి 'వర్మ' కౌంటర్
మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పేర్కొన్నారు. ఈ అంశంలో శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన నటి అనసూయ, సింగర్ చన్మయిలను నెట్టంట ట్రోలింగ్‌కు దిగారు. దీంతో వారు కూడా గట్టిగానే తిరిగి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అనసూయకు మద్ధతుగా తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు.శివాజీ, అనసూయల మధ్య మొదలైన వివాదం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ ఇలా అన్నారు. సంస్కారి అని పిలవబడే వారిని మొరుగుతూనే ఉండనివ్వండి అంటూ అనసూయకు మద్ధతుగా పోస్ట్ చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి నీచమైన మనస్తత్వం ఇలా బయటపడుతుంది. ఇలాంటి అంశంలో ఇంకా బలంగా నిలబడాలని, అందుకోసం ఎప్పుడూ కూడా అండగా ఉంటామని అనసూయను ట్యాగ్ చేస్తూ పేర్కొన్నారు. శివాజీని రేపిస్ట్‌తో పోల్చిన ఆర్జీవీనటుడు శివాజీ వ్యాఖ్యలపై మరోసారి దర్శకుడు ఆర్జీవీ భగ్గుమన్నారు. ఏకంగా నిర్భయ కేసు రేపిస్టుతో శివాజీని పోల్చడమే కాకుండా మహిళలపై అతను చేసిన వ్యాఖ్యలను వర్మ షేర్ చేశారు. మహిళలపై నిర్భయ రేపిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఇలా ఉన్నాయి. ' రాత్రి 9గంటల తర్వాత పద్ధతిగల అమ్మాయి రోడ్ల మీద తిరగదు. అత్యాచారా కేసుల్లో ఆడవాళ్లదే ఎక్కువ తప్పుంది. ఇందులో మగవారి తప్పు ఎక్కడుంది..?' అని నిర్భయ రేపిస్ట్ పేర్కొన్నాడు.PR Sir ❤️💪🏻🙏🏻 https://t.co/2J11PKzqI5— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 27, 2025This says it all 👍💪 https://t.co/NK7i8ipiHb— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2025 -
‘శివ’ చూసి ‘ఓం’ స్క్రిప్ట్ మొత్తం మార్చేశా: ఉపేంద్ర
తెలుగు సినిమా చరిత్ర,ఇండియన్ సినిమా గతిని మలుపు తిప్పిన కల్ట్ క్లాసిక్ ‘శివ’. అప్పటివరకు తెలుగు తెరపై చూడని బొమ్మని శివలో చూపించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే తెలుగు సినిమాను శివకు ముందు.. శివకు తర్వాత అని డిఫైన్ చేస్తారు. అయితే ఈ సినిమా ప్రభావం తెలుగు తెరకే పరిమితం కాలేదు.. అన్ని భాషల చిత్రాలకు మరో కొత్త మార్గం చూపించింది. ఎంతలా అంటే.. కన్నడ ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకునే ‘ఓం’ సినిమా స్క్రిప్ట్‌నే మార్చేసేలా చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఓం దర్శకుడు ఉపేంద్రనే చెప్పాడు.తాజా ఇంటర్వ్యూలో ఉపేంద్ర మాట్లాడుతూ, “నేను కాలేజీ రోజుల్లోనే ఒక గ్యాంగ్‌స్టర్ కథ రాసుకున్నాను. కానీ ‘శివ’ విడుదలైన తర్వాత నా కథ దాదాపు ఒకేలా ఉందని గ్రహించాను. ప్లాగియారిజం ఆరోపణలు రాకుండా స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చేశాను. రెండేళ్లు కష్టపడి కొత్త స్క్రీన్‌ప్లేతో ‘ఓం’ను తెరకెక్కించాను” అని చెప్పారు.శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన ఓం కన్నడ సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచి, అత్యధిక సార్లు (550కు పైగా) రీ-రిలీజ్ అయిన రికార్డును సృష్టించింది. 'ఓం'కు ప్రేరణ తన స్నేహితుడు పురుషోత్తమ్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటన అని ఉపేంద్ర గతంలో వెల్లడించారు. 'శివ' చిత్రం తెలుగు సినిమాను మార్చేసినట్లే, 'ఓం' కన్నడ ఇండస్ట్రీలో గ్యాంగ్‌స్టర్ జోనర్‌కు కొత్త ఒరవడి ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ కూడా తన 'సత్య' చిత్రానికి 'ఓం' నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉపేంద్ర, శివరాజ్‌కుమార్ కలిసి అర్జున్ జన్య దర్శకత్వంలో ‘45’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది."When I saw #Shiva, I left that script for two years and it kept haunting me. Then I thought of making the screenplay of #OM in a different way."– #Upendra | #NagarjunaAkkineni pic.twitter.com/A6mkbLvCNQ— Whynot Cinemas (@whynotcinemass_) December 22, 2025 -
రామ్‌గోపాల్ వర్మ షో మ్యాన్
రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్ మార్చారు. దర్శకుడిగా తెరవెనకకు పరిమితమైన వర్మ ఇప్పుడు తెరపైకి హీరోగా రానున్నారు. ఆయన హీరోగా ‘షో మ్యాన్’ టైటిల్‌తో ఓ చిత్రం రూపొంందుతోంది. ‘మ్యాడ్ మాన్స్టర్’ అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో సుమన్ విలన్‌గా నటిస్తున్నారు. నూతన్ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ కార్పొరేట్ సంస్థతో కలిసి భీమవరం టాకీస్‌పై ప్రోడక్షన్ 120గా తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వర్మతో ‘ఐస్‌క్రీమ్–1, ఐస్‌క్రీమ్–2’ చిత్రాలను రామసత్యనారాయణ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘షో మ్యాన్’ ట్రైలర్‌ను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
హీరోగా మారిన ఆర్జీవీ.. టైటిల్ ఇదే!
దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షో మ్యాన్’. ‘మ్యాడ్ మాన్స్టర్’ అన్నది ట్యాగ్ లైన్. ప్రముఖ నటుడు సుమన్ ఇందులో విలన్ గా నటిస్తుండడం విశేషం. ‘నూతన్’ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఆర్జీవీతో ఇంతకుముందు ‘ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2’ చిత్రాలు నిర్మించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ... ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి... భీమవరం టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ 120గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రాంగోపాల్ వర్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. -
రవిని కాదు.. ముందు వాళ్లను అరెస్ట్ చేయండి: ఆర్జీవీ
సినీ పరిశ్రమను ఊపిరాడకుండా చేస్తున్న పైరసీ సమస్య గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కూడా పైరసీ ఆగదని ఆయన చెప్పారు. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందడం, పోలీసింగ్ చాలా బలహీనంగా ఉండటం వల్లనే ఇలాంటి వెబ్సైట్లు వస్తున్నాయనుకుంటే పొరపాటే అన్నారు. పైరేటెడ్ సినిమా చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నంత కాలం వారికి సర్వీస్ అందించడానికి రవి లాంటి సరఫరాదారులు ఎల్లప్పుడూ ఉంటారని ఆర్జీవీ పేర్కొన్నారు.చాలామంది నెటిజన్లు రవిని రాబిన్ హుడ్‌తో పోలుస్తున్నారని ఆర్జీవి (RGV) ఇలా అన్నారు. 'రాబిన్ హుడ్ హీరో కాదు.. నేటి నిర్వచనాల ప్రకారం చూస్తే, అతను ప్రపంచంలోనే మొట్టమొదటిగా నమోదైన ఉగ్రవాది. అతను ఉన్నవారిని దోచుకుని, చంపి, లేనివారికి ఇస్తాడు. అలా అయితే ధనవంతులు చేసిన ఏకైక నేరం వారు ధనవంతులు కావడమేనా.. కష్టపడి ఆర్థికంగా విజయం సాధించిన వారిని దోచుకోవడం ఎంత నీచమైనదో ఊహించుకోండి. నేరస్థుడిని సాధువుగా చూపించడానికి టన్నుల కొద్దీ అజ్ఞానం అవసరం' అని ఆర్జీవీ పేర్కొన్నారు.పైరసీ విషయంలో లాజిక్స్ కొన్ని పాయింట్స్ చెబుతున్నవారికి కూడా వర్మ కౌంటర్ ఇచ్చారు. 'సినిమా ఖరీదైనదా..? -పైరసీ ఓకే, పాప్‌కార్న్ ఖరీదా..? — సినిమాను లీక్ చేయండి, మూవీ టికెట్ రేట్లు ఎక్కువా..? -పైరసీ ఓకే ఈ లాజిక్ ప్రకారం చూస్తే.. BMW కారు ఖరీదైతే షోరూమ్‌ను దోచుకోవాలి కదా.. మురికివాడలో ఉన్న అందరికీ ఆ కార్లను ఇవ్వాలి కదా.. అలా ఎందుకు చేయరని ప్రశ్నించారు. బంగారం (Gold) ఖరీదైనదే కదా.. ఆ దుకాణాన్ని దోచుకుని ఉచితంగా ఎందుకు పంపిణీ చేయరంటూ.. అన్ని వస్తువులకు ఇదే లాజిక్ వర్తిస్తుందని గుర్తుచేశారు. ఇలాంటి ఆలోచనలు సమాజంలో అరాచకానికి దారితీస్తాయని వర్మ హెచ్చరించారు. పైరసీ ద్వారా సినిమా చూడటం వల్ల కొంతమందికి డబ్బు ఆదా చేయవచ్చు.. మరికొందరికి థియేటర్‌కి వెళ్లడం కంటే లింక్‌పై క్లిక్ చేసి సినిమా చూడటం ద్వారా సమయం ఆదా కావచ్చన్నారు. తనతో సహా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా ఇదే కారణంతో పైరసీ కంటెంట్‌ను చూస్తారని వర్మ ఓపెన్‌గానే చెప్పారు. నిజంగా పైరసీని ఆపాలంటే చూసే వారినీ నేరస్తులుగా పరిగణించాలని పేర్కొన్నారు. పైరసీ ద్వారా సినిమా చూస్తున్న 100 మందిని అరెస్టు చేసి వారి పేర్లను ప్రచారం చేస్తే ఆగిపోయే ఛాన్స్ ఉందన్నారు. పైరసీ విషయంలో నైతికత (Moral) పనిచేయదని కేవలం భయం మాత్రమే పనిచేస్తుందన్నారు.ROBIN HOOD RAVIPiracy will never stop. Not because technology is too advanced or policing too weak , but because as long as there are a large number of people to watch a pirated film there will always be Ravis to serve them. Now the funniest thing is Ravi supporters proudly…— Ram Gopal Varma (@RGVzoomin) November 22, 2025 -
అర్థరాత్రి 2 గంటలకు ఫోన్..నాకేంటి అనేవాళ్లు : నటి
‘తెలుగమ్మాయిలు ఎక్స్‌ఫోజింగ్ చేయమంటే చేయలేరు.. అందుకే అవకాశాలు రావు’ అని చెప్పేవాళ్లకు..‘అది తప్పు మేం కూడా కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్ చేయగలం’ అని నిరూపించడానికే బోల్డ్ ఫోటో షూట్ చేశానని అంటోంది నటి దక్షి గుత్తికొండ(Dakkshi Guttikonda). ఆర్జీవీ ‘కరోనా వైరస్’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ విజయవాడ అమ్మాయి.. కొత్త పోరడు వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇన్‌స్టాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. అయితే ఒకరు ధరించే దుస్తులను చూసి వారి క్యారెక్టర్ని అంచనా వేయొద్దని చెబుతోంది దక్ష. తాజాగా ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.అలా సినిమాల్లోకి.. చిన్నప్పటి నుంచి నాకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చినా..అమ్మ చేయనీయలేదు. చదవు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వెళ్లమని చెప్పింది. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చా. కరోనా సమయంలో ఆర్జీవీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆడిషన్స్ కోసం వెళ్లాను. ఒక్కరోజులోనే ఆడిషన్స్, లుక్‌టెస్ట్ పూర్తి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. అలా ‘కరోనా వైరస్’ సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను.ఆర్జీవీ బోల్డ్‌గా చూపిస్తారు కానీ..ఆర్జీవీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు భయపడ్డాను. మీడియాలో ఆయనను చూపించే కోణం వేరు. ఆయనను బోల్డ్‌గా చూపించారు. నాకే కాదు కొత్తగా వచ్చిన అమ్మాయిలకు ఆర్జీవీని కలవాలంటే కాస్త భయమే. కానీ బయట మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకున్నంత సినిమా నాలెడ్జ్ ఇంకెవరీకీ లేదు. చాలా తక్కువ మాట్లాడతారు. కరోనా వైరస్ సినిమా సమయంలో నేను 12 రోజుల పాటు షూటింగ్లో పాల్గాన్నా. చాలా బాగా చూసుకున్నారు.కొత్త అమ్మాయిలకు తప్పవు..సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కాదు ఎక్కడగా అమ్మాయిలకు వేధింపులు ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్ అనేది అంతటా ఉంది. కెరీర్ ప్రారంభంలో నేను కూడా అది ఫేస్ చేశా. కొంతమంది అర్థరాత్రి 2-3 గంటలకు ఫోన్ చేసేవారు. చాలా పెద్ద సినిమాలో అవకాశం ఇప్పిస్తామని.. నీ కెరీర్‌కు చాలా హెల్ప్ అవుతుందని చెప్పి చివరిలో ‘నాకేంటి’ అనేవాళ్లు. స్టార్టింగ్‌లో అలా అడిగితే చాలా ఏడ్చాను. కానీ కొన్నాళ్ల తర్వాత తిరిగి నేనే మారిపోయాను. ఎవరైనా కాల్ చేస్తే..‘మీకు అలాంటి వాళ్లు కావాలంటే వేరే వాళ్లు ఉంటారు అక్కడకు వెళ్లండి...ఆర్టిస్ట్ కోసం అయితే నా దగ్గరకు రండి’ అని చెప్పేదాన్ని. అర్థరాత్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉదయం చేసేదాన్ని.కొంతమంది ఫోన్ లిప్ట్ చేసేవాళ్లు కాదు. నాకే కాదు ఏ అమ్మాయికి అయినా ఇలాంటి వేధింపులు కామన్. కొత్తగా ఓ అమ్మాయి వస్తుందంటే చాలు..అలాంటి వెదవలు కాల్ చేస్తునే ఉంటారు. అమ్మాయిలు ఎలా డీల్ చేశారనేది ముఖ్యం. కొంతమంది అమ్మాయిలు స్కిన్ షో చేసి చాన్స్‌లు కొట్టేస్తారు. అయితే వాళ్లకు నాలుగైదు చాన్స్ వస్తాయంటే..అంతకు మించి ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేరు’ అని దక్షి చెప్పుకొచ్చింది. -
'శివ' చైల్డ్ ఆర్టిస్ట్‌కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ
తెలుగులో ఓ కొత్త శకానికి నాంది పలికిన సినిమా శివ (Siva Movie). ఫస్ట్ మూవీతోనే రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇండస్ట్రీ హిట్ కొట్టడంతోపాటు స్టార్ హీరోగా నాగార్జున దశ తిరిగిపోయింది. అమల హీరోయిన్గా జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం 1989 అక్టోబర్ 5న విడుదలైంది. 36 ఏళ్ల తర్వాత శివ నవంబర్ 14న రీరిలీజ్ అవుతోంది.చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తోందంటే?ఈ సందర్భంగా ఆర్జీవీ సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటో పోస్ట్ చేశాడు. ఆమె మరెవరో కాదు, శివ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్. శివ సినిమాలో భవానీ గ్యాంగ్.. నాగార్జునను చేజ్ చేస్తుంటుంది. నాగ్ ఓ చిన్నపాపను ముందు కూర్చోబెట్టుకుని వేగంగా సైకిల్ తొక్కుతుంటాడు. ఇంతలో యాక్సిడెంట్ అయి ఇద్దరూ కిందపడిపోతారు. అప్పుడు పాపను ఎత్తుకుని నాగ్.. గూండాలతో ఫైటింగ్ చేస్తుంటాడు. ఇదీ ఆ సీన్.క్షమించండిఆ సీన్లో ఉన్న పాప పేరు సుష్మ. ఆమె ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందని తెలియజేస్తూ వర్మ ఓ పోస్ట్ పెట్టాడు. సైకిల్ చేజ్ సీన్లో ఉన్న చిన్నారే ఈ సుష్మ. ప్రస్తుతం అమెరికాలో ఏఐ, కాగ్నిటివ్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తోంది అని పేర్కొన్నాడు. మరో ట్వీట్లో.. సుష్మ, నువ్వు చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. అప్పుడు ఆ సీన్ ఎంత ప్రమాదకరమనేది నాకు అర్థం కాలేదు. దర్శకుడిగా నా స్వార్థం మాత్రమే చూసుకుని ఇలాంటి రిస్కీ షాట్స్ తీశాను. అందుకు నన్ను క్షమించు అంటూ 36 ఏళ్ల తర్వాత ఆమెకు సారీ చెప్పాడు.Being part of Shiva is a cherished memory. That cycle chase adventure influenced me and prepared me for later intellectual endeavors and adventures. I felt safe and excited to be part of something magical. Shiva remains a souvenir. 🙏https://t.co/bzdtBwMCVP— Sushma Anand Akoju. She/Her (@symbolicsushi) November 12, 2025చదవండి: PR కోసం రూ.16 లక్షలు.. తెలుగులోనూ ఇదే జరుగుతోందా? -
'శివ తీయడానికి అసలు కారణమదే'.. ఆర్జీవీ కామెంట్స్
టాలీవుడ్ స్థాయిని ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన కల్ట్ మూవీ శివ. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ మూవీ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వస్తోంది. ఆర్జీవీ- నాగార్జున కాంబోలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 14న థియేటర్లలో సైకిల్ చైన్ సీన్‌తో కింగ్ నాగార్జున మరోసారి అలరించనున్నారు.ఈ మూవీ రీ రిలీజ్‌కు ముందు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో శివ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ సినిమా నుంచే ప్రేరణ పొంది ఈ కల్ట్ క్లాసిక్ మూవీని తెరకెక్కించానని తెలిపారు. శివ తీయడానికి ముఖ్య కారణం బ్రూస్లీ నటింంచిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగనే కారణమని ఆర్జీవీ వెల్లడించారు.తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు బ్రూస్ లీకి పెద్ద అభిమానిని. నాగార్జున కోసం స్క్రిప్ట్ రాయమని వెంకట్ అడగడానికి ఒక రోజు ముందు.. బ్రూస్లీ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' 15వ సారి చూశా. నేను ఆ సినిమా నుంచి ప్రైమరీ కాన్సెప్ట్ తీసుకున్నా. రెస్టారెంట్‌ను కళాశాలగా, మార్షల్ ఆర్ట్స్‌ను మన స్టైల్లో ఫైట్లకు మార్చా. అలా మొదటి డ్రాఫ్ట్‌ను 20 నిమిషాల్లోనే రాశా. చాలా పాత్రలను నా కళాశాల అనుభవాలతో క్రియేట్ చేశా" అని అన్నారు.మొదట నాగార్జునతో ఇంత పెద్ద స్థాయిలో సినిమా చేయాలని ఎప్పుడూ అనుకోలేదని చిత్ర నిర్మాత నాతో చెప్పారని ఆర్జీవీ తెలిపారు. నేను రాత్రి కూడా స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్నా.. చిన్న చిన్న హర్రర్ సినిమాలు తీయాలనుకునేవాన్ని.. కానీ నాగార్జున నా స్క్రిప్ట్ అంగీకరిస్తారని కూడా ఎప్పుడూ అనుకోలేదని ఆర్జీవీ అన్నారు. కాగా.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున అక్కినేని, అమల, రఘువరన్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు. 1989లో విడుదలైన శివ మూవీకి ఇళయరాజా సంగీతమందించారు. -
‘శివ’లో చిరంజీవి హీరో అయితే.. ఆర్జీవీ ఏం చెప్పారంటే...
‘శివ’.. టాలీవుడ్ హిస్టరీలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ చిత్రం ఇది. రాజమౌళి మొదలు సందీప్‌రెడ్డి వంగా వరకు చాలా మంది దర్శకులకు ‘శివ’ఒక భగవద్గీత లాంటిది. ఆ సినిమా నుంచే చాలా నేర్చుకున్నామని పలువురు దర్శకులు చెప్పారు. 36 ఏళ్ల కిత్రం(1989) రామ్ గోపాల్‌వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం.. ఇప్పుడు మరోసారి థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. సరికొత్త సాంకేతిక హంగులతో నవంబర్ 14న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆర్జీవీ తాజాగా ‘సాక్షి’తో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.నాగార్జున కోసమే ‘శివ’ పేరుశివ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఈ సినిమా తీసినప్పుడు నా వయసు 26 ఏళ్లు మాత్రమే. ఒకటి రెండు హాలీవుడ్ సినిమాలు చూసి మనం ఎందుకు ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని శివ కథ రాసుకున్నా. అప్పటికీ తెలుగు తెరపై ఇలాంటి సినిమాలు రాలేదు. ముద్దుల మామయ్య లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఆడుతున్న రోజులవి. ఒక రియలిస్టిక్ కథలా చెబితే జనాలు చూస్తారనే నమ్మకం కూడా లేదు. కానీ నా కోసమే ఈ సినిమా తీశా. నాకు నచ్చినట్లుగా తెరకెక్కించా. హిట్ కోసం తీయాలనుకుంటే.. ఇప్పటికే హిట్ అయిన సినిమాలను కాపీ చేసి తీయాలి. ఆ పని నేను చేయలేదు. ఇలాంటి కథలు ఆడవని అంతా చెప్పేవారు.కానీ తీస్తే కదా ఆడుతుందో లేదో తెలిసేదని నేను శివ తీశాను. వాస్తవంగా ఈ సినిమాలో ‘శివ’ పేరు ముందుగా విలన్ రఘువరన్‌కి పెట్టాను. కానీ నాగార్జున కథ విని.. శివ పేరు బాగుంది కదా.. నా పాత్రకు పెట్టొచ్చు కదా అన్నాడు. అప్పుడు హీరో పాత్రకి శివ పేరు మార్చాను. విలన్‌కి భవానీ పేరు పెట్టాను. తక్కువ బడ్జెట్ఈ సినిమా రిలీజై 36 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారంటే.. ఇదేదో బాహుబలి చిత్రం అని కాదు. కానీ అప్పటికీ ఇలాంటి కథతో సినిమా తీసిన దాఖలాలు లేవు. నిజం చెప్పాలంటే శివలో అసలు కథే లేదు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు వాస్తవికంగా ఉంటాయి. ఆడియన్స్‌కి కొత్త సౌండ్స్‌తో సినిమా చూపించాం. నాతో పాటు అందరూ కొత్తవాళ్లే కాబట్టి.. ఇళయరాజా లాంటి సీనియర్ సంగీత దర్శకుడు ఉండాలని పట్టుపట్టి మరీ ఆయనను ఒప్పించాను. కారు బురలో పడిన సౌండ్స్ తో, హీరో-విలన్ షర్ట్ పట్టుకొని కొట్టుకునే సౌండ్స్ అన్ని రికార్డు చేసి మరీ వాడాం. అంతకు ముందు అన్ని సినిమాల్లో యాక్షన్ సీన్లలో అరుపులు వినిపించేవి.కానీ శివలో మాత్రం ఎవరూ కూడా నోటితో అరవొద్దని ముందే చెప్పా. సౌండ్స్‌తో యాక్షన్ సీన్స్ తీశాం.చిరంజీవితో తీస్తే.. శివ రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉందనే విషయం నాతో పాటు నాగార్జునకు కూడా పూర్తిగా తెలియదు. రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత నాగేశ్వరరావుతో నాగార్జున కారులో వెళ్తుంటే.. ‘సినిమాకు హిట్ టాక్ వచ్చింది...ఎంత పెద్ద విజయం అవుతుందో చెప్పలేం’అని అంటున్నారని చెప్పారట. అప్పుడు కానీ ఈ సినిమా హిట్ అయిందనే విషయం నాగార్జునకు తెలియలేదట. నేను కూడా ఇంత హిట్ అవుతుందని ఊహించలేదు’ అని ఆర్జీవి చెపుకొచ్చాడు. ఇక ఈ సినిమా హిట్ అయిన తర్వాత ‘చిరంజీవి’ అనే మ్యాగజైన్లో ఈ సినిమాలో నాగార్జున కాకుండా చిరంజీవి హీరో అయితే ఎలా ఉండేది అనే శీర్షికతో ఓ స్టోరీ ముద్రించారని.. నిజంగానే చిరంజీవితో తీస్తే ఎలా ఉండేది?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ సమాధానం చెబుతూ.. ‘అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక చిన్న హీరో సినిమా హిట్ అయితే.. ఇదే సినిమాను పెద్ద హీరోతో చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యేది అని చెబుతుంటారు. కానీ ఆ పాత్రకు నాగార్జున సెట్ అయ్యాడు కాబట్టే హిట్ అయింది. చిరంజీవితో అయితే ఎలా ఉండేదో చెప్పలేం’ అని ఆర్జీవీ అన్నారు. -
సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!
-
చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ
నాగార్జునను స్టార్‌గా మార్చిన సినిమా శివ. ఈ చిత్రంతోనే రామ్‌గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు. తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ శివ మూవీకి ఆయన కెరీర్లోనే ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ చిత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోంది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.చిరంజీవి స్పెషల్ విషెస్ఈ క్రమంలో అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్‌బాబు.. తదితర హీరోలు ఆల్‌ద బెస్ట్ చెప్తూ వీడియోలు చేశారు. తాజాగా చిరంజీవి (Chiranjeevi) సైతం ఓ వీడియో వదిలారు. శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్టర్.. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పడంతో కొత్త ఒరవడికి నాంది పలికిన మూవీ. ఆ సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికీ జనాల మనసుల్లో అలాగే నిలిచిపోయింది.ఆర్జీవీపై ప్రశంసలునాగార్జున నటనలోని తీవ్రత, శక్తి ఫెంటాస్టిక్. అమల, రఘువరన్.. ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోశారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ.. ఆయన విజన్, కెమెరా యాంగిల్స్, లైట్స్, సౌండ్ ప్రజెంటేషన్.. అన్నీ కొత్తగా వావ్ అనిపించాయి. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని అప్పుడే అనుకున్నాను. హ్యాట్సాఫ్ రామ్‌గోపాల్ వర్మ.. తెలుగు సినిమా ఉన్నంతకాలం 'శివ' చిరంజీవిలా చిరస్మరణీయం. శివ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ అని పేర్కొన్నాడు.బాధపెట్టి ఉంటే క్షమించండిఈ వీడియోను ఆర్జీవీ (Ram Gopal Varma) ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపాడు. అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్జీవీ - చిరంజీవి కాంబినేషన్లో గతంలో వినాలని వుంది అనే సినిమా ప్లాన్ చేశారు. 20% షూటింగ్ కూడా పూర్తి చేశారు. కానీ, సడన్‌గా ఆ సినిమాను అటకెక్కించారు. అప్పటినుంచే వైరం మొదలు?ఆ సమయంలో సంజయ్ దత్ జైలు నుంచి రిలీజవడంతో ఆయనతో ఓ సినిమా చేస్తానని చిరు ప్రాజెక్ట్‌ను వర్మ మధ్యలోనే వదిలేసి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. కథలో హీరో జోక్యం చేసుకోవడం వల్లే సినిమా ఆపేశాడన్న ప్రచారమూ ఉంది. అలా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటినుంచే చిరు- వర్మ మధ్య వైరం మొదలైందని అంటుంటారు. సమయం దొరికినప్పుడల్లా వర్మ.. చిరంజీవిపై సెటైర్లు వేస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా చిరుకు సారీ చెప్పడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. Thank you @KChiruTweets gaaru, Also on this occasion I want to sincerely apologise to you if I ever unintentionally offended you ..Thank you once again for your large heartedness 🙏🙏🙏 pic.twitter.com/08EaUPVCQT— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2025చదవండి: ఓటీటీలో 'తెలుసు కదా' మూవీ.. అఫీషియల్ ప్రకటన -
ఇదీ నా కాలే.. అదీ నా కాలే.. లైవ్ లో ఇచ్చిపడేసిన RGV
-
బిగ్‌బాస్ ప్రోమో: అమలతో డ్యాన్స్ చేసిన నాగార్జున..
టాలీవుడ్ పవర్ఫుల్ కపుల్ నాగార్జున (Nagarjuna Akkineni)-అమల.. కిరాయిదాదా, చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం సినిమాల్లో కలిసి నటించారు. వీటిలో శివ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. 1989 అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. శివ సాంగ్‌తో ఎంట్రీఅన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా నవంబర్ 14న శివ రీరిలీజ్ (Siva Movie ReRelease) చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ స్టేజీపైకి ఆర్జీవీతో పాటు శివ రీల్ కమ్ రియల్ లైఫ్ హీరోయిన్ అమల సైతం వచ్చారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. అందులో నాగార్జున.. బోటనీ పాఠముంది, మ్యాట్నీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా.. పాటతో ఎంట్రీ ఇచ్చాడు. అమలతో నాగ్ డ్యాన్స్ఆ వెంటనే అమల రంగంలోకి దిగి.. నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ జంట కోసం బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సైతం జోడీలుగా విడిపోయి స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో వారు డ్యాన్స్ చేస్తుంటే స్టేజీపై అమల ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. నిన్ను బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజులు ఉండమంటే ఉంటావా? అని నాగ్.. ఆర్జీవీని అడిగాడు. అందుకాయన.. అందరూ సంజనాలాంటి అందమైన అమ్మాయిలుంటే కచ్చితంగా ఉంటానన్నాడు వర్మ. చదవండి: ఓరీపై ట్రోలింగ్.. కొంచెమైనా బుద్ధుందా? అవేం మాటలు! -
శివతో పెద్ద స్టార్‌ని చేశారు: నాగార్జున
‘‘శివ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ప్రేమతో వచ్చిన మీ అందరికీ (ఫ్యాన్స్) ధన్యవాదాలు. ఈ సినిమాని మీ తల్లిదండ్రులు థియేటర్స్‌లో చూసుంటారు. ఇప్పుడు అదే ప్రేమతో మీరూ వచ్చారు. 36 ఏళ్ల క్రితం నాతో ‘శివ’ సినిమా తీసి, నన్ను పెద్ద స్టార్‌ని చేసిన నా మిత్రుడు రామ్‌గోపాల్ వర్మకి థ్యాంక్స్. మంగళవారం ఉదయం ‘శివ’ చూశాను. అద్భుతంగా అనిపించింది’’ అన్నారు నాగార్జున. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున, అమల జోడీగా నటించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలైంది.అన్నపూర్ణ స్టూడి యోస్ 50 ఏళ్ల సందర్భంగా సరికొత్త 4కె డాల్బీ అట్మాస్‌లో ఈ నెల 14న ‘శివ’ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని అభిమానుల సమక్షంలో రీ రిలీజ్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘దాదాపు 6 నెలల పాటు రాము చాలా ప్రేమతో ఇష్టపడి ప్రతి సౌండ్ ట్రాక్‌ని మళ్లీ ఒరిజినల్ సినిమా చేసినట్టుగా అద్భుతంగా డిజైన్ చేశాడు. శివ ఈజ్ ఫరెవర్.మరో 36 ఏళ్ల తర్వాత కూడా ‘శివ’ని మళ్లీ మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ‘శివ’కి ముందు ‘శివ’కి తర్వాత అని రాజమౌళిగారు అన్నట్టు ‘శివ’ ఎప్పటికీ నిలిచిపోతుంది’’ అని చెప్పారు. 36 ఏళ్ల తర్వాత మేమిద్దరం (నాగార్జున, వర్మ) ఒకే వేదికపై ఇలా మీ ముందు రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ మాట్లాడతామని ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా గొప్ప అనుభూతి. రీ రిలీజ్ కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించాం. మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చిరంజీవిగారు చెప్పినట్టు సినిమా ఉన్నంత వరకు ‘శివ’ చిరంజీవిలా చిరస్మరణీయం’’ అని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. -
శివగామిని ఇలా మార్చేశారేంటి!
రమ్యకృష్ణ పేరు చెప్పగానే ఇప్పటి జనరేషన్‌కి అయితే శివగామి పాత్ర గుర్తొస్తుంది. ఎందుకంటే 'బాహుబలి'లో ప్రభాస్, రానానే కాదు రమ్యకృష్ణ తన యాక్టింగ్‌తో చూపించిన డామినేషన్.. ఈమె సెకండ్ ఇన్నింగ్స్‌కి మంచి పునాది వేసింది. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. మునుపెన్నడూ లేని విధంగా ఓ దెయ్యం సినిమా కోసం కనిపించనుంది. ఆ లుక్స్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.(ఇదీ చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ)గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోతున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం 'పోలీస్ స్టేషన్ మైన్ భూత్' అనే హారర్ మూవీ తీస్తున్నాడు. మనోజ్ బాజ్‌పాయ్ పోలీస్‌గా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఈ చిత్రం గురించి చెప్పిన ఆర్జీవీ.. ఓ డాన్ చనిపోయి దెయ్యమవుతాడని, తర్వాత పోలీసులని ఎలా ఇబ్బంది పెట్టాడనేది కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తోందని, ఆమె లుక్ ఇదేనంటూ ఆర్జీవీ రెండు ఫొటోలని పోస్ట్ చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాసీగా కనిపించింది. చేతిలో సిగరెట్, ముఖంపై బొట్లు, జీన్స్ ప్యాంట్ ఇలా టామ్ బాయ్ తరహాలో కనిపించింది. అయితే ఈమెది దెయ్యం పాత్ర కాదని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్‌గానే 'బాహుబలి' మూవీ ఎపిక్ పేరిట రిలీజైంది. దీంతో ఆ మూవీ లవర్స్.. మా శివగామిని ఇలా మార్చేశారేంటి? అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు) -
'శివ' రీ-రిలీజ్.. సైకిల్ చైన్‌తో రెడీగా ఉండండి: నాగార్జున
అక్కినేని నాగార్జున నటించిన చిత్రాల్లో 'శివ' చాలా ప్రత్యేకం. ఈ చిత్రం రీరిలీజ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సినిమాతో రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇప్పుడు తెలుగులో మరోసారి వెండితెరపైకి రానుంది.35 ఏళ్ల తర్వాత ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. నేడు (సెప్టెంబర్ 20) అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా శివ రీరిలీజ్ విడుదలను నాగార్జున ప్రకటించారు. నవంబర్ 14న శివ వస్తున్నాడంటూ నాగ్ ఒక పోస్టర్‌తో ప్రకటించారు. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు శివ రానున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ. -
దర్శకుడు రాంగోపాల్ వర్మపై క్రిమినల్ కేసు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ(ఆర్జీవీ)పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘దహనం’.. 2022లో ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీని దర్శకుడు అగస్త్య మంజు తెరకెక్కించారు. అయితే, ఇందులో ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటాన్ని తెరకెక్కించారు. ఓ కమ్యూనిస్ట్ నేత రాములును ఏ విధంగా హత్య చేశారు.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. అయితే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెప్పిన వాస్తవ ఘటనల ఆధారంగా వెబ్ సిరీస్ రూపొందించినట్లు ఆర్జీవీ చెప్పారని, ఇది అవాస్తవమని రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా రెండు రోజుల క్రితం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తాను ఎవరితోనూ వాస్తవ ఘటనలంటూ చెప్పలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత గుర్తింపును దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండానే చిత్రంలో ఆమె పేరును ఉపయోగించుకోవడం విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం తన ప్రతిష్టకు భంగం కలిగించడమేనంటూ ఆమె పేర్కొన్నారు. -
'మిరాయ్' రివ్యూ ఇచ్చిన ఆర్జీవీ.. నన్ను నేనే కొట్టుకున్నానంటూ..
తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా (Mirai Movie) భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఎడారిలో ఒయాసిస్సులా.. ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు మనోజ్‌కు సక్సెస్ దొరికినట్లైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ గ్రాండ్‌గా ఉండటం సినిమాకు మరింత ప్లస్సయింది.చివరిసారి ఎప్పుడు చూశానో..ఈ సినిమా చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎక్స్ (ట్విటర్) వేదికగా రివ్యూ ఇచ్చారు. మిరాయ్ చూశాక.. ఇంత మంచి వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమా చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తు రావడం లేదు. రూ.400 కోట్లకుపైగా ఖర్చు పెట్టి తీసిన సినిమాల్లోనూ ఇంత గ్రాండ్ విజువల్స్ చూడనేలేదు. ముందుగా మనోజ్‌ను ఈ సినిమాలో విలన్‌గా తీసుకుని తప్పు చేశారనుకున్నాను. కానీ సినిమా చూశాక అతడి పర్ఫామెన్స్ చూసి నన్ను నేనే కొట్టుకున్నా.. నా అంచనా తప్పుఇంత పెద్ద యాక్షన్ అడ్వెంచర్ మూవీలో తేజ మరీ చిన్నపిల్లాడిలా కనిపిస్తాడేమో అనుకున్నా.. ఇక్కడ కూడా నా అంచనా తప్పయింది. విజువల్స్, బీజీఎమ్, స్క్రీన్‌ప్లే.. అన్నీ అదిరిపోయాయి. ఇంటర్వెల్ సహా మరికొన్ని చోట్ల సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్లింది. కత్తులు, అతీంద్రియ శక్తుల బెదిరింపుల మధ్యలో ప్రేమ, మోసం వంటి అంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించారు. లాభాలొక్కటే కాదు..కార్తీక్.. మిరాయ్ మీరు కన్న అద్భుతమైన కల. పురాణాలను, హీరోయిజాన్ని కలగలిపి చూపించారు. అన్ని విభాగాలపై మీకున్న పట్టు వల్లే ఇది సాధ్యమైంది. విశ్వప్రసాద్.. మీరు సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాకపోయినా మీకున్న ప్యాషన్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. ఇండస్ట్రీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయలేదు, మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. తద్వారా విజయం సాధించారు. లాభాలు తీసుకురావడమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడం కూడా చిత్రయూనిట్ బాధ్యత అని నిరూపించారు.మనోజ్ రిప్లైచివరగా నేను చెప్పేదేంటంటే.. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని రాసుకొచ్చారు. దీనికి మంచు మనోజ్ (Manchu Manoj).. అన్నా, మీ స్పంద చూస్తుంటే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. చిన్నప్పటినుంచి మీ సినిమాలు చూస్తూ, మీతో కలిసి పనిచేస్తూ పెరిగాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు మీ నోటి నుంచి నా నటనకు ప్రశంసలు దక్కుతుంటే సంతోషంగా ఉంది అని రిప్లై ఇచ్చాడు. Annaaaa …..reading this from you gave me goosebumps 🙏🏻 I grew up watching your cinema, working with you, learning from it and today to hear you speak of my performance like this… it’s beyond special ❤️ thank you anna 🙏🏼🙌🏽#Mirai #BlackSword https://t.co/y9hfmJUGkR— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 14, 2025 చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి -
బాహుబలి తర్వాత ఈ సినిమానే: రాం గోపాల్ వర్మ ట్వీట్
తేజ సజ్జా హీరోగా వచ్చిన లేటేస్ట్ పాన్ ఇండియా చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో విడుదలైంది. మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే మొదటి షో నుంచే మిరాయ్కు పాజిటివ్ టాక్ వస్తోంది. తేజ సజ్జా ఖాతాలో హనుమాన్ లాంటి సూపర్ హిట్ ఖాయమని అంటున్నారు.ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జా, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వప్రసాద్‌కు కంగ్రాట్స్ తెలిపారు. బాహుబలి తర్వాత ఏ సినిమాకు ఇంత ఏకపక్షంగా ప్రశంసలు రాలేదని పోస్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్తో పాటు కథనం కూడా.. రెండు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయని ఆర్జీవీ కొనియాడారు. ఇది చూసిన టాలీవుడ్ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. A BIG SHOUT OUT to @tejasajja123 @Karthik_gatta and @vishwaprasadtg for delivering a iNDUSTRY HIT ..Not since BAHUBALI did I hear such UNANIMOUS PRAISE for any other film #Mirai .. Both the VFX and the Narrative GRIP are of HOLLYWOOD STANDARD 👍🙏💪🔥💐— Ram Gopal Varma (@RGVzoomin) September 12, 2025 -
టాలీవుడ్‌కు స్టార్ డైరెక్టర్లను అందించిన గురువులు
జన్మనిచ్చిన అమ్మా, నాన్నల తర్వాత మన జీవితంలో అంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి ఆయన ఒక్కరే. తల్లిదండ్రులు మనల్ని పెంచి పోషిస్తే.. మనకు జీవిత పాఠాలు నేర్పేది మాత్రం గురువులే. అది ఏ రంగమైనా సరే గురువు లేకుండా మనం సక్సెస్ అవ్వడం చాలా అరుదు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గురువుల సాయంతో స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు గురు పూజోత్సవం సందర్భంగా మన తెలుగు సినీ దర్శక గురువుల గురించి తెలుసుకుందాం.తన డైరెక్షన్‌తో ఓ మార్క్ వేశారు క్రియేట్ చేశారు సుకుమార్. 'ఆర్య' చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో రాణించారు. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సుకుమార్ శిష్యులు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్ చేస్తూ అండగా నిలిచారు. ఆయన స్కూల్ నుంచి వచ్చినవారందరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు.స్టార్ డైరెక్టర్లుగా సుకుమార్ శిష్యులు'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన బుచ్చిబాబు సనా.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్‌కు ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్లో డైరెక్టర్‌గా లాంఛ్ చేశారు. ప్రస్తుతం మెగా హీరో రామ్ చరమ్తో పెద్ది అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్లో మరో సంచలన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈయన కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల స్టార్ హోదాను సొంతం చేసుకున్నారు.'కరెంట్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F'తో మంచి సక్సెస్ అందుకున్నాడు. జక్కా హరి ప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే. డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా 'ఆర్య' సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంటట్గా పనిచేశాడు. 'భమ్ భోలేనాథ్' ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడే. సుకుమార్ బ్యానర్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ రైటర్‌గా రాణిస్తోన్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 పేజీస్ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుకుమార్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఆయన రైటర్‌గా పనిచేస్తున్నారు.ఆర్జీవీ తీర్చిదిద్దిన దర్శకులు..అప్పట్లో ఇండియన్ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన ఘనత రామ్ గోపాల్ వర్మదే. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందరో డైరెక్టర్లు బయటకు వచ్చి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను తెచ్చుకున్నారు. వర్మ శిష్యుల్లో గొప్పగా తెచ్చుకున్న వాళ్లలో కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, గుణశేఖర్, శివనాగేశ్వరరావు, నివాస్, అజయ్ భూపతి, జీవన్ రెడ్డి, హరీశ్ శంకర్, జేడీ చక్రవర్తి, బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ అగ్రదర్శకుడు మధుర్ బండార్కర్ ఉన్నారు. వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే.చిరంజీవి- విశ్వనాథ్- కమల్ హాసన్ గురు శిష్యుల బంధం..తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి.. తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్‌కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్లో మైలురాయిగా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్‌గా నిలుస్తాయనడంలో సందేహం ఉండదు. అలాగే కె.విశ్వనాథ్ - ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్ మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే సాగర సంగమం, శుభ సంకల్పం చిత్రాలొచ్చాయి. కె.విశ్వనాథ్ జీవించి ఉన్న రోజుల్లో ఆయనతో కొంత సమయం గడిపేవారు కమల్‌హాసన్.. మరో దిగ్గజ దర్శకుడు కె బాల చందర్ కూడా కమల్‌కు గురువే.. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. -
పోలీస్ స్టేషన్లో దెయ్యాలు.. ఆర్జీవీ కొత్త సినిమా పోస్టర్
కెరీర్ మొదట్లో ఎన్నో గొప్ప సినిమాలు తీశాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma). తర్వాత ట్రాక్ తప్పి అన్నీ ఫ్లాపులే తీశాడు. ఇటీవలే తన తప్పు తెలుసుకున్న ఆర్జీవీ.. ఇకపై మంచి సినిమాలే చేస్తానని శపథం చేశాడు. అప్పుడే సిండికేట్ అనే భారీ చిత్రాన్ని ప్రకటించాడు. కానీ తర్వాత సిండికేట్ గురించి మళ్లీ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దాన్ని పక్కనపెట్టి ఓ హారర్ సినిమా చేస్తున్నాడు. అదే పోలీస్ స్టేషన్ మే భూత్. యు కాంట్ అరెస్ట్ ద డెడ్ అన్నది క్యాప్షన్!కాంబినేషన్ రిపీట్బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ‘సత్య (1988), కౌన్ (1999), శూల్’ (1999) చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది! ఇందులో జెనీలియా హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా పోస్టర్ గ్లింప్స్‌ను ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎవరి వల్లయినా మనకు భయం వేస్తే పోలీసుల దగ్గరకు వెళ్తాం.. మరి పోలీసులే భయపడితే వాళ్లెక్కడికి పరుగుతీస్తారు? అంటూ ట్వీట్ చేశాడు. ఈ పోస్టర్ గ్లింప్స్ ఏఐ వీడియో అని తెలుస్తోంది.కథ అదేనా?పోలీస్ స్టేషన్ మే భూత్ సినిమా విషయానికి వస్తే.. ఓ పోలీస్ స్టేషన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కొంతమంది గ్యాంగ్స్టర్స్ చనిపోతారు. వాళ్లందరూ భూతాలుగా మారడంతో ఈ పోలీస్ స్టేషన్ ఓ హాంటెడ్ స్టేషన్‌గా మారి పోతుంది. భూతాలైన గ్యాంగ్స్టర్స్ పోలీసులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారు? ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా తప్పించుకోగలిగారు? అన్నదే సినిమా కథ అని తెలుస్తోంది! A DREADED GANGSTER is KILLED by an ENCOUNTER COP and he COMES BACK as a GHOST to HAUNT the POLICE STATION ..Hence the title “POLICE STATION MEIN BHOOT” You Can’t Arrest The Dead @BajpayeeManoj @geneliad @VauveEmirates @KarmaMediaEnt #uentertainmenthub #PoliceStationMeinBhoot pic.twitter.com/eMOyusT8iy— Ram Gopal Varma (@RGVzoomin) September 1, 2025 చదవండి: జున్ను కాలికి ఫ్రాక్చర్.. అర్ధరాత్రి నొప్పితో ఏడుపు.. చూడలేకపోయా! -
ఎందుకంత ఏడుపు? కుక్కలనే పెళ్లి చేసుకోవచ్చుగా!: ఆర్జీవీ
ఢిల్లీ వీధుల్లో శునకాలు కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆగస్టు 11న తీర్పు వెలువరించింది. 8 వారాల్లోగా కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని ఎవరు అడ్డుకున్నా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ తీర్పును జంతుప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూగజీవాలపై దయ చూపించాలని కోరుతున్నారు. తీర్పు వెనక్కు తీసుకోవాలని హీరోయిన్ సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హ.. ఇలా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకుంటున్నారు.కుక్క కోసం కన్నీళ్లా?సదా అయితే శునకాలను చంపేస్తారు, ఏం చేయాలో తెలియట్లేదు దేవుడా.. అంటూ బోరున ఏడ్చేసింది. ఇలాంటివారిపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనుషులు చనిపోతే పాపం అనట్లేదుకానీ కుక్కల కోసం కన్నీళ్లు కారుస్తున్నారా? అని మండిపడ్డాడు. అదే సమయంలో జంతుప్రేమికులకు ఇవే నా సలహాలు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశాడు.🐶 పేద ప్రజలను దత్తత తీసుకుని వారిని మీ ఇంట్లో ఉంచుకోండి. అన్ని వీధులను కుక్కలకు వదిలేయండి.🐶 శునకాలు మీ కుటుంబసభ్యులైతే వాటినే పెళ్లి చేసుకోవచ్చుగా!🐶 శునకాల జనాభా నియంత్రణకు బదులు వాటిపై మీ ప్రేమను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందిగా!🐶 మీ పిల్లల్ని వీధి కుక్కలతో ఆడుకునేందుకు పంపించండి.🐶 వీధుల్లో శునకాలు స్వేచ్ఛగా తిరగాలంటున్నారు. మరి మీ బ్రీడ్ డాగ్స్‌ను కూడా వీధుల్లో ఉండనివ్వండి. ఏసీ గదుల్ని వదిలేసి అవి వీధుల్లో ఎలా మనుగడ సాగిస్తాయో చూద్దాం.🐶 పిల్లలతో సమానంగా కుక్కలకూ సమానహక్కులు ఉన్నాయంటున్నారు. అలాంటప్పుడు డాగ్స్ కోసం పాఠశాలలు, పిల్లల కోసం బోన్లు నిర్మించండి.🐶 మీరెప్పుడైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్‌కు వెళ్లొద్దు, వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోండి.🐶 మీరు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చేసి వీధి కుక్కల్ని ఆ గదుల్లో నిద్రపోనివ్వండి.🐶 మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. కాబట్టి గుడిలో దేవుళ్ల స్థానంలో కుక్కలను పెట్టండి. మోక్షం కోసం వాటినే ప్రార్థించండి.🐶 'కుక్కలను దత్తత తీసుకోండి- పిల్లల్ని చంపండి' పేరిట ఓ ఫౌండేషన్ ప్రారంభించండి.🐶 వీధికుక్కలు నిరుపేదలపైనే దాడి చేస్తుంటే.. మురికివాడలో ఉన్నవాళ్లందరినీ మీ విల్లాలోకి పంపించండి. మీ బ్రీడ్ శునకాలను వీధుల్లో కాపలాగా పెట్టండి.🐶 పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల్ని ఎవరైనా చంపేస్తే వాటికోసం సంతాపసభ నిర్వహించండి. HERE are some FANTASIC SOLUTIONS for DOG LOVERS regarding their Mmmmuuuaahhh for STREET DOGS 1.Why don’t you adopt all the poor people and bring them into your homes and leave the streets for the dogs?2.If dogs are like your family, then why not marry your Labradors, Huskies…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025Here are my 10 points addressing the DOG LOVERS who are UPSET about the SUPREME COURT’S decision on STRAY DOGS 1. People are being bitten and killed all over by stray dogs. And dog lovers are busy tweeting about dog rights.😳https://t.co/9RLkoJdqOE can love your pets in your…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025చదవండి: అఖిల్ మూవీలో జగపతిబాబును వద్దన్న నాగార్జున -
డాగ్ లవర్స్.. ఈ వీడియో చూడండి: ఆర్జీవీ
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కుక్కడ బెడద ఎక్కువైపోయింది. వీధి కుక్కల దాడిలో పలువురు యువకులు, చిన్న పిల్లలు తీవ్రంగా గాయపడుతున్నారు. దీంతో సుమోటోగా కేసు తీసుకున్న సుప్రీం కోర్టు.. 8 వారాల్లోగా నగరంలోని వీధి కుక్కలన్నింటిని షెల్టర్లకు తరలించాలని ఆగస్ట్ 11న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు దీన్ని అడ్డుకోవాలని జంతు ప్రేమికులు ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పుని పలువురు జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇందులో సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హా లాంటి సినీ తారలు కూడా ఉన్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma ) వీరందరికి కౌంటర్ ఇస్తూ ఓ ట్వీట్ చేశాడు.వీధి కుక్కల దాడిలో చనిపోయిన ఓ చిన్నారికి సంబంధించిన వీడియోని ఎక్స్‌లో షేర్ చేస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పుపై ఏడుస్తున్న డాగ్ లవర్స్ ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక నగరం మధ్యలో పట్టపగలు నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. పలువురు నెటిజన్స్ ఆర్జీవీ పోస్ట్‌కి మద్దతు తెలుపుతున్నారు. గతంలో ఇలాంటివి చాలా జరుగాయంటూ ఆయా వీడియోలను షేర్ చేస్తున్నారు. To all the DOG LOVERS who are crying hoarse on the SUPREME court’s judgement on STRAY DOGS , please check this video , where a 4 year old boy was killed by street dogs in broad day light in the middle of a city pic.twitter.com/DWtVnBchvQ— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025 -
రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్.. విడుదల
ఒంగోలు టౌన్: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఒంగోలు రూరల్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించి.. వెంటనే ఆయనను బెయిల్‌పై విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ చిత్రాలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పెట్టారని ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో కేసు నమోదు చేసింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నేత ముత్తెన రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మపై కేసు నమోదైంది. వర్మ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తొలిసారిగా ఆయన ఫిబ్రవరిలో పోలీసు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 5న మరోసారి విచారణకు హాజరుకావాలని కోరుతూ జూలై 22న పోలీసులు వాట్సప్ మెసేజ్ పంపించినట్టు సమాచారం. అయితే తాను షూటింగుతో బిజీగా ఉన్నందున 12న విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారంరూరల్ సీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు విచారణ మొదలవగా రాత్రి 10 గంటల వరకు సుమారు 11 గంటలకు పైగా పోలీసులు విచారించారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయనను అరెస్టు చేసినట్టు ప్రకటించిన పోలీసులు హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులు పూచీకత్తుపై వెంటనే విడుదల చేశారు. విచారణ సందర్భంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్ వ్యంగ్య చిత్రాలను ఎవరు పోస్టు చేశారు? ఎక్కడ తయారు చేశారు? దీనివెనక మరెవరైనా ఉన్నారా? ఎవరి ప్రోద్బలమైనా ఉందా? అని ప్రశ్నించినట్టు సమాచారం. విచారణకు వర్మతో పాటు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు హాజరయ్యారు. -
నన్ను ఐకానిక్ హీరోగా నిలబెట్టిన సినిమా శివ: నాగార్జున
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘శివ’ ఓ ట్రెండ్‌సెట్టర్ మూవీ. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1990 డిసెంబరు 7న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సినిమాను అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెలుగులో రీ–రిలీజ్ చేయనున్నారు.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ– ‘‘నన్ను ఐకానిక్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘శివ’. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుండటం చూసి, నా అన్నయ్య అక్కినేని వెంకట్, నేను ఈ సినిమాను గ్రాండ్‌గా రీ–రిలీజ్ చేయాలని భావించాం. ఈ ‘శివ’ సినిమాను కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకులకే కాకుండా, యూట్యూబ్‌లో చూసిన కొత్త జెనరేషన్‌కి కూడా థియేటర్స్‌లో మంచి అనుభవం ఇవ్వాలని అనుకున్నాం.అందుకే రామ్‌గోపాల్ వర్మ, వెంకట్, నేను కలసి డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో, 4కే విజువల్స్‌తో మళ్లీ ప్రెజెంట్ చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘నాగార్జున, నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకమే ఈ సినిమాను ఇంత ఎత్తుకు తీసుకుని వెళ్లింది. ఈ సినిమాని రీ–రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం నాకు థ్రిల్ ఇచ్చింది. అడ్వాన్డ్స్ ఏఐ టెక్నాలజీతో, మోనో మిక్స్‌ను డాల్బీ అట్మాస్‌కి మార్చాం. ‘శివ’ని అందరూ చూసే ఉంటారు. కానీ ఈ కొత్త సౌండ్‌తో ఎవరూ ఇంతవరకూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈసారి ఆ అనుభూతి గ్యారంటీ’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. -
కూలీ సినిమా రిలీజ్.. అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున బిగ్ సర్ప్రైజ్!
అక్కినేని నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. 1990లో రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున సైతం శివ రోజులను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని నాన్న చెప్పారని అన్నారు.4కెలో శివ ..అయితే అప్పట్లో సినీ ప్రియులను ఓ రేంజ్లో అలరించిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజైతే ఎలా ఉంటుంది. శివ సినిమాను ఇప్పుడున్న టెక్నాలజీతో మీ ముందుకు తీసుకొస్తే మీ ఫీలింగ్ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే మీ కోసమే నాగార్జున బిగ్ ప్లాన్‌తో వస్తున్నారు. సరికొత్త టెక్నాలజీతో శివ మూవీ చూసే అవకాశం త్వరలోనే రానుంది. మొట్ట మొదటిసారి అత్యాధునిక 4కె డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ చిత్రాన్ని వీక్షించే ఛాన్స్ అభిమానులకు దక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాగార్జున వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులకు నాగ్ గుడ్ న్యూస్ చెప్పారు.కూలీ థియేటర్లలో ట్రైలర్..అంతే కాకుండా రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ మూవీ రిలీజ్ రోజే నాగార్జున్ ఈ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదే రోజు థియేటర్లలో శివ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దీంతో కూలీ సినిమా చూసే నాగ్ ఫ్యాన్స్‌కు డబుల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. శివ రీ రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నాగార్జున ట్వీట్ చేశారు. ఇది చూసిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కంగ్రాట్స్ టూ శివ టీమ్ అంటూ పోస్ట్ చేశారు.Hey @iamnagarjuna CONGRATS to #ShivaTeam ,and all your FANS #Shiva4KDolbyAtmos https://t.co/6zfsam7uvr— Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2025 -
గ్యాంగ్స్టర్స్ భూతాలైతే..!
నటి జెనీలియాను పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వెళ్లనున్నారట రామ్‌గోపాల్ వర్మ. ‘సత్య (1988), కౌన్ (1999), శూల్’ (1999) చిత్రాల తర్వాత బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం పోలీస్ స్టేషన్ మే భూత్’. ఈ సినిమాలోని ఓ లీడ్ రోల్ కోసం జెనీలియాను సంప్రదించగా, ఆమె ఓకే చెప్పారని బాలీవుడ్ సమాచారం. ఈ హారర్ కామెడీ సినిమా చిత్రీకరణ ఈ వారంలోనే హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోందట.ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను ప్రకటించారు రామ్‌గోపాల్ వర్మ. ఓ పోలీస్ స్టేషన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో కొంతమంది గ్యాంగ్స్టర్స్ చని పోతారు. ఆ చని పోయిన గ్యాంగ్స్టర్స్ భూతాలుగా మారడంతో ఈ పోలీస్ స్టేషన్ ఓ హాంటెడ్ స్టేషన్‌గా మారి పోతుంది. భూతాలైన గ్యాంగ్స్టర్స్ పోలీసులను ఎలా ఇబ్బంది పెడతారు? ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా తప్పించుకోగలిగారు? అన్నదే పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమా కథ అని సమాచారం. -
కోట శ్రీనివాసరావు మరణం.. ఆ సినిమాను గుర్తు చేసుకున్న ఆర్జీవీ
తెలుగు సినీ ప్రియులను వెండితెరపై అలరించిన కోటా శ్రీనివాసరావు ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ప్రాణం ఖరీదు మూవీతో మొదలైన ఆయన జర్నీ.. వందలకు పైగా చిత్రాల్లో నటించి తనదైన నటనలో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో తనదైన ముద్రవేశారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.లెజెండరీ నటుడు మరణంతో ఆయనతో ఉన్న క్షణాలను టాలీవుడ్ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ మధుర జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. తాజాగా సంచలన డైరెక్టర్‌గా పేరున్న రాం గోపాల్ వర్మ కోట శ్రీనివాసరావుతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన అనగనగా ఒక రోజు మూవీ సెట్స్‌లో కోటతో ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. అంతకుముందుకోట శ్రీనివాసరావు మృతి పట్ల ఆర్జీవీ సంతాపం వ్యక్తం చేశారు.నిస్సందేహంగా నేను చూసిన గొప్ప నటులలో కోట శ్రీనివాసరావు ఒకరని ట్వీట్ చేశారు. శివ,గాయం, డబ్బు, సర్కార్, రక్తచరిత్ర లాంటి సినిమాలకు ఆయన చేసిన కృషి గొప్పదని అన్నారు. ఇప్పుడు మీరు వెళ్లిపోయి ఉండవచ్చు.. కానీ మీ పాత్రలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయని ఆర్జీవీ పోస్ట్ చేశారు.Me having a chat with the LEGENDARY #KotaSrinivasaRao on the sets of ANAGANAGA OKA ROJU pic.twitter.com/KpMmILqxWE— Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2025KOTA SRINIVASA RAO is undoubtedly one of the greatest actors cinema has ever seen ..The effect of his contribution to my films SHIVA. GAAYAM, MONEY, SARKAR and RAKTACHARITRA is immeasurable..Sir #kotasrinivasarao Gaaru, you might have gone but your characters will live forever…— Ram Gopal Varma (@RGVzoomin) July 13, 2025 -
ఓటీటీలో 'శారీ' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘శారీ’(Saaree Movie ) సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, 'ఆహా'లో కూడా ఈ చిత్రం విడుదల కానున్నట్లు తాజాగా ప్రకటన వచ్చేసింది. జుల్లై 11 నుంచి ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ ఉవుతుందని ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆరాధ్య దేవి, సత్య యాదు జంటగా నటించారు.కథ ఏంటి..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ. -
కన్నప్పపై 'ఆర్జీవీ' ట్వీట్.. మంచు విష్ణు రియాక్షన్
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప సినిమాపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న కన్నప్ప చిత్రాన్ని తాజాగా చూసినట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని వాట్సప్ ద్వారా మంచు విష్ణుతో పంచుకున్నారు. అయితే, ఇదే విషయాన్ని విష్ణు సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఆర్జీవీ పంపిన మెసేజ్‌ను కూడా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు.కన్నప్ప సినిమా చూశానంటూ ఆర్జీవీ ఇలా మెసేజ్ చేశారు. 'మొదటి నుంచి నాకు దేవుడు, భక్తి వంటి అంశాలపై నమ్మకం లేదు. ఈ కారణం వల్లే భక్తితో వచ్చే సినిమాలను నేను చూడలేదు. అయితే, నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో భక్త కన్నప్ప మూవీని నాలుగుసార్లు చూశాను. కానీ, ఆ సినిమాలో నటించిన నటీనటుల కోసమే చూశాను. ఇప్పటి కన్నప్ప సినిమా విషయానికొస్తే తిన్నడుగా నువ్వు అద్భుతంగా నటించావు అనడం కంటే జీవించేశావ్ అని చెప్పడం కరెక్ట్. ఆలయంమంత భక్తితో ఉన్న వ్యక్తిలా వెండితెరపై కనిపించావు. కొన్ని సీన్లు చూస్తున్నప్పడు నీ నటన అద్భుతం.. ఒక్కోసారి ఊపిరి తీసుకోనివ్వలేదే కూడా.. సినిమా క్లైమాక్స్‌లో శివలింగం నుంచి వచ్చే రక్తాన్ని ఆపేందుకు తిన్నడు తన రెండు కళ్లను సమర్పించే సీన్లో నీ నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది.నేనొక నాస్తికుడిని. ఇలాంటి సన్నివేశాలు పెద్దగా నచ్చవు. కానీ, నీ నటనతో నన్ను మార్చేశావ్.. వాటిని ఇష్టపడేలా చేశావు. శివభక్తుడిగా నువ్వు నటించిన ఈ రోల్ ఎప్పికటికీ మాస్టర్‌క్లాస్‌గా నిలుస్తోంది. సినిమా చివరి సీన్లో నీవు పలికించిన భావోద్వేగాలు పతాకస్థాయికి చేరుతాయి. అప్పుడు ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.' అని విష్ణుకు వాట్సాప్‌లో ఆర్జీవీ మెస్సేజ్ చేశారు. తన సినిమాపై ఆర్జీవీ చూపిన ప్రేమకు మంచు విష్ణు కూడా ఇలా రియాక్ట్ అయ్యారు. 'రామూ గారు.. మీరు నన్ను ఏడిపించేశారు. చాలా రోజులుగా నా కన్నీళ్లను ఆపుకొంటున్నా. ఈ సినిమా నా జీవితంలో అత్యంత సవాల్‌తో కూడుకుంది. ఇప్పటి వరకు చాలామంది ఈ ప్రాజెక్ట్‌పై ద్వేషాన్నే చూపారు. కానీ, నమ్మకంతో ముందుకు వెళ్లాను.' అని ఆయన అన్నారు.This text message is like a dream come true for the actor in me. 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/cB4CEjcmGo— Vishnu Manchu (@iVishnuManchu) June 28, 2025 -
ఓటీటీలో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసిన రెండు సినిమాలు
నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ‘23’ (23 Movie) మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన చిలకలూరి పేట, చుండూరు, జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుడు సంఘటనల గురించి ఈ సినిమా ఉంటుంది. మే 16న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. అయితే, తాజాగా భారత్‌లోని యూజర్స్‌కు కూడా చూసేలా మేకర్స్ ఛాన్స్ కల్పించారు.‘మల్లేశం’ (Mallesam) సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న రాజ్.ఆర్ 23 మూవీని తెరకెక్కించారు. తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో స్టూడియో 99 సంస్థ ఈ మూవీని నిర్మించింది. అయితే, ఈ చిత్రం జూన్ 27 నుంచి సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. 1991 సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మారణకాండ ఘటన, 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్ బాంబు దాడి గురించి 23 సినిమాతో తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్‌తో '23' చిత్రంలో చూపించారు. ఈ మూడు కేసుల్లో నేరం ఒక్కటే అయినప్పటికీ శిక్షల్లో ఎక్కువ తక్కువలు ఎందుకంటూ మన న్యాయ వ్యవస్థని ఈ చిత్రం ప్రశ్నిస్తుంది.ఓటీటీలో ఆర్జీవీ సైకలాజికల్ థ్రిల్లర్ 'శారీ' సినిమాఆర్జీవీ డెన్ నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘శారీ’(Saaree Movie ) సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో కూడా విడుదల కావచ్చని సమాచారం. ఆరాధ్య దేవి, సత్య యాదు జంటగా ఇందులో నటించారు.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ. -
అమితాబ్ వల్లే చిరంజీవి, రజనీకాంత్లకు స్టార్డమ్: ఆర్జీవీ
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో దక్షిణాది చిత్రాలను రీమేక్ చేయడానికి బాలీవుడ్ తహతహలాడటమే కాక ఆయా సినిమాల కథలను కాపీ కొడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ఇప్పుడు మనల్ని కాపీ కొడుతుంది కానీ ఒకప్పుడు సౌత్ సినిమాకు హిందీ ఇండస్ట్రీయే ఆధారం అంటున్నాడు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. హిందీ సినిమాలను రీమేక్ చేసే సౌత్ హీరోలు స్టార్ స్టేటస్ అందుకున్నారంటున్నాడు.సౌత్‌లో హిందీ సినిమాల రీమేక్స్తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. మొదట్లో దక్షిణాదిన ఉన్న నాలుగు భాషల్లోనూ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సినిమాలు రీమేక్ అయ్యేవి. 70's, 80's కాలంలో రజనీకాంత్ (Rajinikanth), చిరంజీవి (Chiranjeevi), ఎన్టీ రామారావు, రాజ్‌కుమార్.. వీళ్లంతా కూడా బిగ్‌బీ సినిమాల రీమేక్స్‌లో నటించేవారు. అయితే 1990 తర్వాత బచ్చన్ ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నాడు.మసాలా సినిమాలుసరిగ్గా అప్పుడే మ్యూజిక్ కంపెనీలు రంగంలోకి దిగాయి. కేవలం వారి పాటల్ని, సంగీతాన్ని అమ్ముకోవడం కోసం సినిమాలు తీసేవి. మైనే ప్యార్ కియా వంటి సినిమాలు అలా వచ్చినవే.. కానీ సౌత్‌లో మసాలా సినిమాలు తీయడం మాత్రం ఆగలేదు. వాటిక్కూడా బిగ్‌బీ చిత్రాలే మూలం. దానివల్లే ఇక్కడున్న హీరోలు అభిమానులకు దేవుడిలా మారిపోయారు. అలా ఆ హీరోల స్టార్డమ్ ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది అని వర్మ చెప్పుకొచ్చాడు.చదవండి: కమల్ హాసన్ అంటే ఎంత ప్రేమో.. 42 కి.మీ ప్రయాణించి మరీ.. -
అలా చేసుంటే సత్య సినిమా సర్వనాశనమయ్యేది: ఆర్జీవీ
హారర్ సినిమాలు హిట్టయ్యాయంటే వరుసపెట్టి మరీ అవే తీస్తూ ఉంటారు. అదేవిధంగా యాక్షన్ మూవీ బ్లాక్‌బస్టర్ అయిందంటే అలాంటివే వరుసగా వదులుతూ ఉంటారు. ఈ ధోరణిలో మార్పు రావాలంటున్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kahsyap). ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనురాగ్ మాట్లాడుతూ.. కేజీఎఫ్, సలార్ సినిమాలు వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరంతా చూశారుగా.. తర్వాత వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఒకేలా కనిపించేవి. హింసపై ఫోకస్యానిమల్ విషయానికి వస్తే ఇందులో హింస, రక్తపాతం బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమా రూ.900 కోట్లు సంపాదించింది. ఇది చూసిన ఫిలిం మేకర్స్ తమ చిత్రాల్లోనూ రెట్టింపు హింసను ప్రవేశపెట్టారు. కొన్నిసార్లు అవసరం ఉన్నా, లేకపోయినా బలవంతంగా వాటిని చొప్పించేవారు. వాళ్లు తప్పు దారిలో వెళ్లడం చూసి నాకు భయమేసేది అని అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడదే ట్రెండ్ఇదే ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. బాహుబలి సినిమా తర్వాత అందరూ బడ్జెట్, స్పెషల్ ఎఫెక్ట్స్‌పైనే ఫోకస్ చేశారన్నాడు. భారీ బడ్జెట్ సినిమాలు తీయడమే ప్రస్తుతమున్న ట్రెండ్ అని, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. తాను కూడా సత్య సినిమాకు మరో రూ.5 కోట్లు ఎక్కువ పెట్టుంటే ఆ మూవీ సర్వనాశనమయ్యేదన్నాడు.బాలీవుడ్‌కు గుడ్బైబాలీవుడ్లో దర్శకుడిగా, నటుడిగా రాణించిన అనురాగ్ కశ్యప్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాడు. హిందీలో ప్రయోగాలు చేయడం కష్టమని, అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, అందుకే బాలీవుడ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. పూర్తిగా దక్షిణాది సినిమాల్లోనే ఉంటానని తెలిపాడు. ఈయన ప్రస్తుతం అడివిశేష్ హీరోగా నటిస్తున్న డకాయిట్ సినిమాలో నటిస్తున్నాడు.చదవండి: ఓటీటీలో 'జాట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? -
గేమ్ ఛేెంజర్ హీరోయిన్‌పై ఆర్జీవీ పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు డిలీట్ చేసిన డైరెక్టర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం వార్-2. ఈ మూవీలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ ఫుల్ యాక్షన్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోయిన్ కియారా బికినీలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఆ హీరోయిన్ను అలా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.అయితే ఈ టీజర్ చూసిన టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం టీజర్ చూసి ఓ పోస్ట్ పెట్టారు. అందులో కియారా అద్వానీ బికినీ డ్రెస్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదానికి దారితీసింది. ఆర్జీవీ పోస్ట్ చూసిన నెటిజన్స్ చెత్త పోస్ట్ అంటూ రాం గోపాల్ వర్మపై విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మ భాయ్, ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్తా ఆలోచించండి.. అప్పుడు మీరు ఇలాంటివి పోస్ట్ చేయరంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చారు.తన ట్వీట్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆర్జీవీ తన పోస్ట్‌ను సోషల్ మీడియాలో తొలగించాడు. కియారా అభిమానులు, నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా.. వార్- 2 లో హృతిక్ రోషన్ రా ఏజెంట్ మేజర్ కబీర్ ధిలావాల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది: ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద సందడి చేశారు. హాలీవుడ్ మూవీని థియేటర్లో వీక్షించేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా సినిమాను చూసి బయటకు వచ్చిన ఆర్జీవీని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. సినిమా ఎలా ఉందని అడగడంతో సూపర్‌గా ఉందంటూ రాం గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. టామ్ క్రూయిజ్ అద్భుతంగా చేశాడని కొనియాడారు. ఇప్పటి వరకు రిలీజైన వాటిలో ఇది చాలా బెస్ట్ అని అన్నారు. ఈ సినిమాను మించిన కథ రాదేమో అని అనుకుంటున్నట్లు ఆర్జీవీ మాట్లాడారు.కానీ ఈ సినిమా చూశాక ఆయన చేసిన ఓ కామెంట్ తెగ వైరలవుతోంది. మనం కూడా ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి- మహేశ్ కాంబోలో వస్తోన్న మూవీలో స్టంట్స్ ఇలాగే ఉంటున్నాయని అంటున్నారని ఆర్జీవీ ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలీదన్నారు. కాగా.. హాలీవుడ్ హీరో టామ్ క్రూయిజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ మే 17న ఇండియాాలో రిలీజైంది. ఈ సినిమా చూసిన రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. #MissionImpossibleTheFinalReckoning#MissionImpossibleMANAM KUDA FILM MAKERS ANI CHEPPU KOVADANIKI SIGGU ESTADI - @RGVzoomin 💥💥💥💥💥I don't think anyone can say like what RGV has said . A BRUTAL HONEST OPINION pic.twitter.com/OkrXxyEvva— EXISTENTIAL NIHILIST 👻 (@Forced_Existenc) May 17, 2025 -
పోలీస్ స్టేషన్లో భూతాలు!
‘సత్య (1998), కౌన్ (1999), శూల్’ (1999) వంటి సినిమాల తర్వాత బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, దర్శక–నిర్మాత రామ్‌గోపాల్ వర్మ మరో సినిమా చేయనున్నారు. తన తాజా చిత్రం ‘పోలీస్ స్టేషన్ మే భూత్’లో మనోజ్ బాజ్‌పాయ్ నటించనున్నట్లు రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ టైటిల్‌కి ‘యూ కెనాట్ కిల్ ది డెడ్’ అనేది క్యాప్షన్. ‘‘హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్, అడ్వెంచర్, థ్రిల్లర్స్... వంటి సినిమాలు చేశాను. కానీ ఇప్పటివరకు నేను హారర్ కామెడీ జానర్లో సినిమా చేయలేదు. ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ హారర్ కామెడీ ఫిల్మ్. పోలీస్‌స్టేషన్‌లో ఓ భయంకరమైన ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్స్ భూతాలు అవుతారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్ హాంటెడ్ స్టేషన్‌గా మారిపోతుంది. మరి... ఈ గ్యాంగ్‌స్టర్ భూతాల నుంచి పోలీసులు ఎలా తప్పించుకుంటారు? అన్నదే ఈ సినిమా కథ’’ అని ‘ఎక్స్’ వేదికగా రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. -
'రామ్ గోపాల్ వర్మ'.. బర్త్‌డే స్పెషల్ ఫోటోలు చూశారా..?
-
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
ఆర్జీవి డెన్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శారీ’(Saaree Movie Review ). ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు(ఏప్రిల్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని డైరెక్ట్‌గా చెప్పే ఏకైక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్‌ని క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా తీయడం లేదు. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ డెన్ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. మరి ‘శారీ’ అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అనక తప్పదు. అయితే ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే.. ఇది కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలిసారి ఆర్జీవి తన చిత్రంతో ఓ సందేశం అందించాడు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారు. అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలి అనే దానిపైనే ఎక్కువ పెట్టాడు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అనేలా సినిమాను తెరకెక్కించారు. ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ అది వర్కౌట్ కాలేదు.(Saaree Movie Review ) తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చిరాకు కలుగుతుంది. సత్య యాదు పాత్ర కూడా అంతే. ప్రతిసారి ఫోటో తీయడం.. చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం.. ఓ పాట.. ఫస్టాఫ్ అంతా ఇలానే సాగుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కిడ్నాప్ తర్వాత ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కథంతా అక్కడక్కడే తిప్పుతూ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. మితీమీరిన వయోలెన్స్‌ని పెట్టి భయపెట్టె ప్రయత్నం చేశారు. అంతకు మించి కథ-కథనంలో కొత్తదనం ఏమి లేదు. ఆర్జీవి నుంచి అది ఆశించడం కూడా తప్పే సుమా..!ఎవరెలా చేశారంటే.. శారీ సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసింది. వర్మ మెచ్చిన నటి కాబట్టి.. ఆయనకు ‘కావాల్సినట్లుగా’ తెరపై కనిపించి కనువిందు చేసింది. యాక్టింప్ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక సైకో కిట్టుగా సత్య యాదు అదరగొట్టేశాడు. ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడు. మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శశిప్రీతమ్ రీరికార్డింగ్ కొన్ని చోట్ల మోతాదును మించి పోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. ఆర్జీవీ సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉండడు. రెండు మూడు పాత్రలు, ఒక ఇళ్లు చాలు.. సినిమాను చుట్టేస్తాడు. ఈ సినిమా కూడా అలానే ఉంది. పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ సినిమాను ఉన్నంతలో రిచ్‌గానే తీర్చిదిద్దారు. -
సోషల్ మీడియాని మితిమీరి వాడితే...
‘‘సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి? అనే అంశంపై తీసిన చిత్రమే ‘శారీ’. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. కథ రాసినప్పుడు నేను ఊహించనదానికంటే సినిమాను బాగా తీశాడు దర్శకుడు గిరికృష్ణ కమల్. ఈ సినిమా సబ్జెక్ట్‌ను చర్చిస్తున్నప్పుడు, అతని ఆలోచనలు నచ్చి, ‘శారీ’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించాను’’ అని దర్శక–నిర్మాత–రచయిత రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘శారీ’. గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ పతాకాలపై రవిశంకర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో గిరికృష్ణ కమల్ మాట్లాడుతూ– ‘‘సత్య, ఆరాధ్య... ఇలా ప్రధానంగా రెండు పాత్రలతో సాగే ఇంటెన్స్ డ్రామా ఫిల్మ్ ఇది’’ అన్నారు. ‘‘ఇది నాకో డ్రీమ్ ప్రాజెక్ట్’’ అని పేర్కొన్నారు ఆరాధ్య దేవి. ‘‘ఈ మూవీలో ఉన్నవి తక్కువ పాత్రలే అయినా, అవి ఎఫెక్టివ్‌గా ఉంటాయి’’ అని తెలిపారు సత్య యాదు. ‘‘గులాబి’ సినిమా నుంచి రామ్‌గోపాల్ వర్మతో వర్క్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు ఏ మూవీ కోసం పిలిచినా రెడీగా ఉంటాను’’ అని చె΄్పారు ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్. -
'శారీ' మూవీ ప్రీరిజ్లో మెరిసిన నటి ఆరాధ్య దేవి (ఫొటోలు)
-
రామ్ గోపాల్ వర్మ 'శారీ'మూవీ ప్రీరిజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ‘ఆరాధ్య దేవి’ క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
బెట్టింగ్ యాప్స్.. సడన్‌గా ఇలా చేయడం సరికాదు: ఆర్జీవీ
‘‘సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనే నేపథ్యంలో ‘శారీ’ రూపొందింది. నేనీ చిత్రానికి మూల కథ రాశాను. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు. ‘శారీ’లో సందేశం ఉంటుందని చెప్పను గానీ, ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్త పడతారు’’ అని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. సత్య యాదు, ఆరాధ్యా దేవి ప్రధాన పాత్రల్లో గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శారీ’. Cబెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినవారిపై కేసులు పెట్టడంపై స్పందిస్తూ.. తాము చేస్తున్న యాడ్స్ లీగలా? కాదా? అనేది యాక్టర్స్‌కు, స్టార్స్‌కు తెలియకపోవచ్చు. దానిపై అధికారులు నటీనటులకు అవగాహన కల్పించాలి. అంతేగానీ సడెన్‌గా చర్యలు తీసుకోవడం సరికాదు’’ అన్నారు. ‘‘ఆరాధ్య, సత్య బాగా నటించడం వల్ల దర్శకుడిగా నాపై ఒత్తిడి తగ్గింది’’ అని గిరి కృష్ణకమల్ చెప్పారు. ‘‘ఈ సినిమాలో నా పాత్ర చిన్నదే అయినా కథలో కీలకంగా ఉంటుంది’’ అని సత్య యాదు తెలిపారు.చదవండి: పాన్ ఇండియా సినిమాకు నిర్మాతగా 20ఏళ్ల యువతి సక్సెస్ -
రామ్ గోపాల్ వర్మ 'శారీ' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వుమెన్స్ డే.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )..ఎప్పుడు ఏ పని చేస్తాడో, ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఎవరికీ తెలియదు. ఓ అంశంపై అందరూ ఒకలా అభిప్రాయం వ్యక్తం చేస్తే.. ఆయన మాత్రం కాస్త డిఫరెంట్‌గా స్పందిస్తుంటాడు. దానికి లాజికైన సమాధానం కూడా ఆయన దగ్గర ఉంటుంది. అందుకే ఆర్జీవీ ట్వీట్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. కేవలం సినిమాల గురించే కాదు.. సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై ఇతరులకు భిన్నంగా స్పందిస్తుంటాడు. నేను(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day 2025 ). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జీవీకి కూడా వుమెన్స్ డే విషెస్ తెలియజేశాడు. అయితే అందరిలా శుభాకాంక్షలు తెలిపితే ఆర్జీవీ ఎందుకు అవుతాడు? ఆయన విషెస్ కూడా కాస్త డిఫరెంట్‌గానే ఉంటాయి. ‘నా ఉనికి లేకుండా నేను జీవించగలను, కానీ స్త్రీల ఉనికి లేకుండా నేను జీవించలేను .. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆర్జీవీ కూడా ఇలాంటి పోస్టులు పెడతారా’ అని కొంతమంది షాకవుతుంటే.. ‘సూపర్ సార్.. మీకు మీరే లెజెండ్’, ‘భళే చెప్పావ్ సర్’ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్లో ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ‘శారీ’అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సత్య యాదు, ఆరాధ్య జంటగా నటించారు. మార్చి 21న ఈ చిత్రం రిలీజ్ కానుంది. I can live without my existence , but i can’t live without women’s existence ..HAPPY WOMEN’S DAY🙏🙏🙏— Ram Gopal Varma (@RGVzoomin) March 8, 2025 -
ఆర్జీవీ శారీ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రొడక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం శారీ. ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సత్య యాదు, ఆరాధ్య దేవీ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ శారీ మూవీ ఓ క్రేజీ సాంగ్ విడుదల చేశారు. మొదటిసారి అంటూ సాంగే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను కీర్తన శేష్, అర్జున్ విజయ్ ఆలపించగా.. రాజశేఖర్ సుద్మూన్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి కీర్తన శేష్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మార్చి 21న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాహిల్ సంభయాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత కీలక పాత్రలు పోషించారు.శారీ కథేంటంటే..ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఏపీ హైకోర్టులో RGVకి బిగ్ రిలీఫ్
-
హైకోర్టులో ఆర్జీవీకి భారీ ఊరట!
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court)లో భారీ ఊరట లభించింది. ఆయన దర్శకత్వం వహించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆర్జీవీ బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఐదేళ్ల క్రితం(2019)లో రిలీజైన సినిమాపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించి, తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. ఏం జరిగింది?2019లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'(kamma rajyam lo kadapa reddlu) పేరుతో ఆర్జీవీ ఒక సినిమాను రూపొందించారు. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై మంగళగిరి సమీపంలోని ఆత్మకూరుకు చెందిన బండారు వంశీకృష్ణ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. -
ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటిషన్
-
ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పిటిషన్
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై సీఐడీ నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలని రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. దీంతో సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ గురువారం విచారణకు వచ్చే ఛాన్సుంది.ఆర్జీవీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆర్జీవీ డెన్ నుంచి శారీ అనే మూవీని నిర్మిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని పలు నిజ జీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.కాగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. -
ఆ సినిమాలో మోహన్‌లాల్ నటన నాకు నచ్చలేదు.. కానీ: రాం గోపాల్ వర్మ
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2002లో ఆర్జీవీ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. అజయ్ దేవగణ్, మనీషా కొయిరాలా జంటగా నటించిన కంపెనీ అనే మూవీలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాంగోపాల్ వర్మ మోహన్ లాల్ నటన గురించి వివరించారు. తన సినిమాలో ఎక్కువ రీటేక్‌లు తీసుకున్నాడని అన్నారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. ' నా సినిమా కంపెనీ కోసం మొదటిసారి మోహన్ లాల్‌ను కలిశా. నా సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడా. తన పాత్ర గురించి చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడిగుతాడేమోనని నేను ముందుగానే సిద్ధం అయ్యా. కథ మొత్తం చెప్పడం పూర్తయిన తర్వాత అతను నన్ను అడిగిన ఏకైక ప్రశ్న ఇదే. సార్, మీకు ఎన్ని రోజులు కావాలి? అన్నారు. ఇలాంటి క్లైమాక్స్ నేను ఊహించలేదు. నాతో మాత్రమే కాదు.. అందరితోనూ ఆయన ఇలానే చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే అతనికి సినిమాల గురించి పూర్తి అవగాహన ఉంది. డైరెక్టర్ నమ్మకానికి తగినట్లుగా ఏ పాత్రనైనా చేస్తాడని భావించా' అని తెలిపారు.కంపెనీ షూటింగ్ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు మోహన్ లాల్ ప్రదర్శన పట్ల నేను అసంతృప్తిగా ఉన్నా. అతను సరిగ్గా చేయడం లేదని అనుకున్నా. ఆయన ఓ సీన్లో ఎక్కువ టేక్‌లు అడుగుతూనే ఉన్నాడు. దాదాపు ఆరు, ఏడు టేక్‌ల తర్వాత వాటిని చెక్ చేశా. ఆ తర్వాత తెలిసింది. మొదటి టేక్‌లోనే అద్భుతంగా చేశాడనిపించింది. నిజంగా మోహన్ లాల్ సహ నటుడు.' అంటూ కొనియాడారు. కాగా.. 2002లో వచ్చిన కంపెనీ చిత్రంలో మోహన్‌లాల్.. వీర్పల్లి శ్రీనివాసన్ అనే ఐపీఎస్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించాడు. -
రామ్ గోపాల్ వర్మ 'శారీ' మూవీ HD స్టిల్స్
-
'శారీ' ట్రైలర్.. చీరలో కనిపిస్తే టార్గెట్ చేసే మృగం
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో వస్తున్న తాజా చిత్రం శారీ నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. కేవలం ఆమె ఫోటోతోనే సినిమాపై అంచనాలు పెంచేసిన వర్మ.. తాజాగా ట్రైలర్‌తో మరింత బజ్ క్రియేట్ చేశారు. ఒక వ్యక్తిపై ప్రేమ మరీ ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. పాన్ ఇండియా రేంజ్లో ఫిబ్రవరి 28న తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రముఖ బిజినెస్‌మాన్ రవి వర్మ నిర్మిస్తున్నారు. పలు నిజజీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'శారీ' తీశారు. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు.ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలో యూనిట్ పేర్కొంది. -
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ఆరాధ్య దేవి 'వైల్డ్' ఫోటోగ్రఫీ.. (ఫొటోలు)
-
ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రాంగోపాల్ వర్మ
-
ముగిసిన రాంగోపాల్ వర్మ విచారణ
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు రాంగోపాల్ వర్మ వచ్చారు. ఒంగోలు రూరల్ సర్కిల్ పరిధిలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారణకు ఆయన హాజరయ్యారు. గతంలో చంద్రబాబు, పవన్‌పై పోస్టులు పెట్టారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆర్జీవీపై టీడీపీ కార్యకర్త రామలింగం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని ఇటీవల మూడోసారి వర్మకు నోటీసులు జారీ చేశారు. 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వర్మ.. ఇవాళ విచారణకు హాజరయ్యారు.ముగుసిన అర్జీవి విచారణమధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు రాం గోపాల్ వర్మ ను విచారించారు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు.మద్దిపాడు పీఎస్ 0 గంటల పాటు అర్జీవి విచారించారు. విచారణ ముగిసిన అనంతరం రాం గోపాల్ వర్మ హైదరాబాద్‌కు బయల్దేరారు. -
సిండికేట్‌లో వెంకీమామ, బిగ్‌బీ, ఫహద్..? ఆర్జీవీ ఏమన్నారంటే?
ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తీసిన రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) రానురానూ గతి తప్పాడు. చౌకబారు సినిమాలు తీసుకుంటూ పోయాడు. కానీ ఈ మధ్యే వర్మకు తను చేసిన తప్పు అర్థమైంది. సత్య సినిమా (Satya Movie) రీరిలీజ్ సందర్భంగా తన సినిమాను తనే మరోసారి చూసుకున్నాడు. అంత అద్భుతాన్ని తెరకెక్కించిన తాను ఆ స్థాయి సినిమాలు ఎందుకు చేయలేకపోయానని బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు.మాటిచ్చి కొత్త సినిమా ప్రకటించిన వర్మఇకమీదట సత్యలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తానని మాటిచ్చాడు. ఇది నిజమేనా? అని అందరూ అనుమానిస్తున్న సమయంలో ఆర్జీవీ కొత్త మూవీ ప్రకటించాడు. సిండికేట్ సినిమా తీయబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. 70వ దశకంలో వీధి రౌడీల గ్యాంగ్స్ నుంచి మొదలుకుని ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను భారత్ చూసింది. కానీ గత పదిహేనేళ్లలో చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవు. అతి భయంకరమైన జంతువు మనిషేఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు పుట్టుకొస్తే ఎలా ఉంటుందో సిండికేట్‌లో చూపించబోతున్నా అన్నాడు. ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్ (అత్యంత క్రూరమైన మృగం మనిషి మాత్రమే) అని ఓ ట్యాగ్‌లైన్ కూడా జోడించాడు. ఇలా సిండికేట్‌ను ప్రకటించాడో లేదో నెట్టింట రూమర్లు మొదలయ్యాయి. తెలుగు నుంచి వెంకటేశ్ దగ్గుబాటి, హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, మలయాళం నుంచి ఫహద్ ఫాజిల్‌ను సెలక్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాలో స్టార్స్మనోజ్ బాజ్‌పాయ్, అనురాగ్ కశ్యప్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై వర్మ స్పందించాడు. సిండికేట్ సినిమాలో భాగం కాబోయే నటీనటుల గురించి వస్తున్న ప్రచారమంతా ఫేక్. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని వివరాలు చెప్తాను అని ట్వీట్ చేశాడు. There are all kinds of speculations going around the casting of SYNDICATE film which are all completely FALSE ..Will share the details when ready— Ram Gopal Varma (@RGVzoomin) January 25, 2025 చదవండి: ప్రియుడితో ఆరెంజ్ హీరోయిన్ 'రోకా'.. పెళ్లెప్పుడంటే? -
మారిపోయిన ఆర్జీవీ.. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసే సినిమాలు.. (ఫోటోలు)
-
రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష
ముంబై: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma)కు బిగ్ షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో అంధేరి మెజిస్ట్రేట్.. ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఏడేళ్ల క్రితంనాటి చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేల్చిన న్యాయస్థానం దర్శకుడికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దర్శకుడు విచారణకు గైర్హాజరవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడికి రూ.3.72 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఈ కేసు ఇప్పటిది కాదు! 2018లో రామ్‌గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. మశ్చీంద్ర మిశ్రా తరపున శ్రీ కంపెనీ ఈ కేసు దాఖలు చేసింది. 2022 జూన్‌లో వర్మ ఈ కేసులో బెయిల్ కూడా తెచ్చుకున్నాడు.వర్మ రియాక్షన్దీనిపై వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇది ఏడేళ్లనాటి కేసు. నా దగ్గర పని చేసిన మాజీ ఉద్యోగితో రూ.2.38 లక్షల వివాదానికి సంబంధించినది. ప్రస్తుతం మా లాయర్లు ఈ వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను అన్నాడు. With regard to the news about me and Andheri court, I want to clarify that it is to do with a 7 year old case of Rs 2 lakh 38 thousand amount , relating to my ex-employee .. My advocates are attending to it. and since the matter is in court i cannot say anything further— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2025 చదవండి: ‘సిండికేట్’తో నా పాపాలన్నీ కడిగేసుకుంటా: ఆర్జీవీ బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు -
‘సిండికేట్’తో నా పాపాలన్నీ కడిగేసుకుంటా: ఆర్జీవీ
ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ..ఒకప్పుడు మాత్రం ఆర్జీవీ సినిమాలు ట్రెండ్ సెట్ చేశాయి. శివ, సత్య, సర్కార్, రంగీలా లాంటి సినిమాల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. అలాంటి కల్ట్,క్లాసిక్స్ చిత్రాలను తెరకెక్కించిన ఆర్జీవీ.. ఇటీవల మాత్రం ఆ స్థాయి సినిమాలను తీయలేకపోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. 27 ఏళ్ల తర్వాత తను తీసిన సత్య సినిమా మరోసారి చూశానని, కన్నీళ్లు వచ్చాయని, అలాంటి సినిమాను ఎందుకు బెంచ్ మార్క్‌గా పెట్టుకోలేకపోయానని ఆయన పశ్చాత్తాప పడ్డాడు. ఇకపై మంచి సినిమాలే చేస్తానని ప్రామిస్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే కొంతమంది ఆయన ట్వీట్‌ని నమ్మితే..మరికొంత మంది ఆర్జీవీ ఇలాంటి ట్వీట్స్ చేయడం కొత్తేమి కాదు.. మాట మార్చడం ఆయనకు అలవాటే అనుకున్నారు.కానీ వర్మ ఈ సారి సీరియస్‌గానే చెప్పారు. గత కొంతకాలంగా నాసిరకం సినిమాలు చేస్తున్న ఆయన.. ఈ సారి ఓ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. పెద్ద కాస్టింగ్‌తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. తాజాగా ఆ సినిమాను అధికారికంగా ప్రకటించాడు. ఆర్జీవీ తెరకెక్కించబోతున్న ఈ కొత్త సినిమా పేరు ‘సిండికేట్’(Syndicate).అంతేకాదు ఈ సినిమా కాన్సెప్ట్ కూడా చెప్పుకొచ్చాడు. 70వ దశకంలో భారత్ స్ట్రీట్ గ్యాంగ్స్‌తో మొదలుపెట్టి ఐసిస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను చూసిందని.. ఐతే గత పది పదిహేనేళ్లుగా చెప్పుకోగదగ్గ కొత్త గ్రూప్స్ లేవని.. ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు ఎలా ఉంటుందో ‘సిండికేట్’ రూపంలో చూపించబోతున్నానని వర్మ ట్వీట్ చేశాడు. ‘ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్’ అంటూ ఈ సినిమాకు ఒక ట్యాగ్ లైన్ కూడా జోడించాడు వర్మ. తాను గత కొన్నేళ్లుగా చేసిన సినిమా పాపాలన్నింటినీ కడిగేసే ఒకే ఒక్క చిత్రంగా ‘సిండికేట్’ను వర్మ అభివర్ణించాడు. ఈ సినిమాకు పని చేసే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో పంచుకుంటానని వర్మ వెల్లడించాడు.“ONLY MAN CAN BE THE MOST TERRIFYING ANIMAL “In CONTINUATION to my CONFESSION note on SATYA film , I DECIDED to make the BIGGEST film ever The film is called SYNDICATE It’s about a terrifying organisation which threatens the very EXISTENCE of INDIA The CONCEPT STREET…— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2025 -
ఆర్జీవీతో విభేదాలు.. స్పందించిన హీరోయిన్
చిత్ర పరిశ్రమలో రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)పై రూమర్స్ రావడం చాలా తక్కువ. ఏదైనా ఉంటే ఓపెన్‌గానే మాట్లాడతాడు. అంతేకాని తన ప్రవర్తనతో నటీనటులకు ఇబ్బంది మాత్రం కలగనీయడని సినీ ఇండస్ట్రీ మొత్తం చెబుతుంది. ముఖ్యంగా హీరోయిన్లతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ.. హద్దులు దాటి ప్రవర్తించరు. అందుకే అతనితో సినిమా చేసేందుకు చాలా మంది హీరోయిన్లు ఆసక్తి కనబరుస్తారు. అలాంటి ఆర్జీవీపై చాలా కాలంగా ఓ రూమర్ వినిపిస్తోంది. అలనాటి అందాల తార ఊర్మిళా మాతోండ్కర్(Urmila Matondkar)తో ఆర్జీవీకీ గొడవైందని, వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని బాలీవుడ్లో వార్తలు వినిపించాయి.తాజాగా ఈ రూమర్స్‌పై ఊర్మిళ స్పందించింది. ఆర్జీవీతో తనకు ఎలాంటి అభిప్రాయభేదాల్లేవని స్పష్టం చేసింది.ఆర్జీవీ దర్శకత్వంలో నటించినందుకు గర్విస్తున్నాఆర్జీవీ దర్శకత్వం వహించిన ‘అంతం’, ‘గాయం’, ‘రంగీలా’, ‘సత్య’ సినిమాల్లో ఊర్మిళ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. అయితే ‘ఆగ్’(2007) తర్వాత ఊర్మిళ మళ్లీ ఆర్జీవీ చిత్రాల్లో నటించలేదు. దీంతో బాలీవుడ్లో పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ‘సత్య’(satya) రీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్జీవీతో విభేదాలు వచ్చాయట కదా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఊర్మిళ సమాధానం చెబుతూ..‘మా మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు. ఆయనతో నాకు మంచి స్నేహమే ఉంది. ఆయన తెరకెక్కించిన ‘కంపెనీ’ (2002), ‘రామ్‌గోపాల్ వర్మ కీ ఆగ్’ (2007) చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ నటించాను. ఆ తర్వాత మేం మళ్లీ కలిసి పని చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు. ఆయన దర్శకత్వంలో నటించినందుకు గర్వపడుతున్నా. అవకాశం వస్తే రామ్‌గోపాల్ వర్మ, మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి మళ్లీ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాను’ అని ఊర్మిళ చెప్పుకొచ్చింది.‘రంగీలా’తో ఫేమస్ముంబైలో పుట్టి పెరిగిన ఊర్మిళ.. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. 'కర్మ' మూవీతో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత హీరోయిన్గా మారింది. రాంగోపాల్ వర్మ తీసిన 'రంగీలా'.. ఈమెకు ఎక్కడలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీని తర్వాత జుదాయి, సత్య తదితర చిత్రాలతో స్టార్ అయిపోయింది. తెలుగు తమిళంలోనూ అంతం, గాయం, భారతీయుడు, అనగనగా ఒక రోజు లాంటి మూవీస్ చేసింది. 2018లో చివరగా 'బ్లాక్ మెయిల్' సినిమాలో కనిపించిన ఊర్మిళ.. 2019లో రాజకీయాల్లోకి వెళ్లింది. తొలుత కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ఏడాది శివసేన పార్టీలో చేరిపోయింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ.. మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ట్రై చేస్తోంది.ప్రస్తుతం పలు రియాలిటీ షోలకు ఊర్మిళ జడ్జిగా వ్యవహరిస్తోంది. -
గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్.. రాం గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్
టాలీవుడ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. అందరికంటే భిన్నంగా తన అభిప్రాయాన్ని చెబుతుంటారు. ఏ విషయమైనా సరే తన మనసులో ఉన్నదే బయటికి చెప్పేస్తారు. అందువల్లే ఆర్జీవీకి సంచలన దర్శకుడిగా పేరు తెచ్చకున్నారు. తాజాగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.తాజాగా ఓ టాలీవుడ్ మూవీ గేమ్ ఛేంజర్‌పై తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్‌ను ఉద్దేశించి ఆర్జీవీ పోస్ట్ పెట్టారు. గేమ్ ఛేంజర్‌కు రూ.450 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ లెక్కన రాజమౌళి ఆర్ఆర్ఆర్కు రూ.4500 కోట్లు అయి ఉంటుందని రాసుకొచ్చారు. అలా గేమ్ ఛేంజర్‌కు మొదటి రోజు కలెక్షన్స్ రూ.186 కోట్లు వచ్చాయంటే.. అల్లు అర్జున్ పుష్ప-2 రూ.1860 కోట్లు రావాల్సిందని ట్విటర్లో రాశారు. ఇక్కడ ఏదైనా నిజానికి కావాల్సిన ప్రాథమిక సూత్రం ఏంటంటే నిజమనేది నమ్మదగినదిగా ఉండాలి.. అబద్ధం చెప్పినా కూడా నమ్మేలా ఉండాలి అంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.తొలి రోజు రూ.186 కోట్లు..రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ వసూళ్లను ఉద్దేశించి రాం గోపాల్ వర్మ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. If G C costed some 450 cr then RRR in its extraordinary never before seen visual appeal should have costed 4500 cr and if G C film’s first day collections are 186 cr on day 1 , then PUSHPA 2 collections should have been 1,860 cr ..The point is that the fundamental requirement of…— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2025 -
ఆ హీరోయిన్‌తో సినిమా చేయను : ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ..సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ ఈ పేరు. ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా షేక్ చేశాయి. అయితే ఇటీవల ఆయన తీస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు కానీ..సోషల్ మీడియాలో మాత్రం ఆయన పెట్టే పోస్టులు వైరల్‌గా మారుతుంటాయి. ఏ అంశంపైనైనా కాస్త వ్యంగ్యంగా స్పందించడం ఆయనకున్న అలవాటు. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. సినిమా విషయాల్లోనే కాదు పర్సనల్ విషయాల్లోనూ అలానే వ్యవహరిస్తాడు. తాజాగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జాన్వీతో సినిమా తీసే ఉద్దేశమే లేదన్నాడు. దానికి గల కారణం ఏంటో కూడా వివరించాడు.శ్రీదేవి అంటేనే ఎక్కువ ఇష్టంరామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )కి దివంగత నటి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఆమె మరణించినా.. తనపై ఆర్జీవీకి ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. చిన్న సందర్భం దొరికినా.. ఆమె గురించి గొప్పగా మాట్లాడతాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవిని ఎవరితోనూ పోల్చలేం. ఆమె అందం, అభినయం ఎవరికి రాలేదన్నారు. ‘పదహారేళ్ళ వయసు’ లేదా ‘వసంత కోకిల’.. సినిమా ఏదైనా సరే శ్రీదేవి ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె యాక్టింగ్ చూసిన తర్వాత నేనొక ఫిల్మ్ మేకర్ననే విషయం మర్చిపోయా. ఆమెని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయా. అది ఆమె స్థాయి’ అని ఆర్జీవీ అన్నారు.జాన్వీతో సినిమా చేయనుశ్రీదేవి(sridevi) కూతురు జాన్వీ కపూర్‌తో సినిమా చేస్తారా? అనే ప్రశ్నకుల ఆర్జీవీ సమాధానం ఇస్తూ ఇప్పట్లో ఆ ఉద్దేశమే లేదన్నారు. శ్రీదేవిని జాన్వీతో పోల్చడం సరికాదన్నారు. శ్రీదేవి అందం జాన్వీకి రాలేదని, ఏ విషయంలోనైనా ఆమెతో పోల్చలేమని అన్నారు. ‘నాకు శ్రీదేవి అంటే ఇష్టం. ఆమెను ఎంతో అభిమానిస్తుంటా. ఇన్నేళ్ల కెరీర్లో చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో నేను కనెక్ట్ అవ్వలేకపోయా. అలాగే జాన్వీతో కూడా కనెక్ట్ కాలేదు. ఈ జనరేషన్ వాళ్లకి జాన్వీనే గొప్పగా కనిపిస్తుందేమో. నాకు మాత్రం శ్రీదేవినే గొప్ప. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. ఇప్పుడైతే జాన్వీతో సినిమా చేసే ఉద్దేశం లేదు’ అని ఆర్జీవీ అన్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న జాన్వీశ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ధడక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనూ రాణిస్తోంది. గతేడాది విడుదలైన ‘దేవర’లో జాన్వీ టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్గా నటించబోతుంది. -
అప్పటి వరకు మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్: రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్
న్యూ ఇయర్ సందర్భంగా రాం గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త ఏడాది అనేది కేవలం అప్పటి వరకు మాత్రమే ఉంటుందని పోస్ట్ చేశారు. ఈ రోజు 31 రాత్రి నుంచి జనవరి 1 మధ్యాహ్నాం వరకు మాత్రమేనని రాసుకొచ్చారు. మీరు మీ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి వచ్చాక అసలు విషయం అర్థమవుతుందన్నారు. గతేడాదిలో వెంటాడిన సమస్యలు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయని.. హ్యాపీ ఓల్డ్ ఇయర్ అంటూ ట్విటర్లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. రాంగోపాల్ వర్మ టాలీవుడ్లో సంచలన డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జున నటించిన శివ మూవీతో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. ఆ తర్వాత ఆర్జీవీ డైరెక్షన్లో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆర్జీవీ డెన్ పేరుతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.శారీ మూవీ..తాజాగా ఆర్జీవీ ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'శారీ'. ఇప్పటికే ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్‌గా శారీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీలో సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు.శారీ కథేంటంటే..ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది.HAPPY NEW YEAR will last only from 31st night till 1st afternoon , when u wake up from ur hangover and realise that all the OLD YEAR’S problems are still there in the NEW YEAR 😎 #HappyOldYear— Ram Gopal Varma (@RGVzoomin) December 31, 2024 -
కీర్తి సురేశ్ పెళ్లిలో సందడి చేసిన ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ ఫోటోలు వైరల్!
-
రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌నెట్ లీగల్ నోటీసులు
టాలీవుడ్ సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరోసారి లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా పేరుతో ఏపీ ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేస్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా వర్మతో పాటు ఆర్జీవి ఆర్వీ సంస్థ, పార్టనర్ గొట్టుముక్కల రవి శంకర్ వర్మకి నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఫైబర్ నెట్ మాజీ ఎండి మధు సుధన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. -
వైఎస్ జగన్‌కి బర్త్ డే విషెస్ చెప్పిన ఆర్జీవీ
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్విటర్ వేదికగా పుట్టినరోజు విషెస్ చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ట్వీట్ చేసిన తన శుభాకాంక్షలు తెలియజేశారు.(ఇదీ చదవండి: #HBDYSJAGAN: ట్రెండ్ సెట్ చేసిన అభిమానం)'వెరీ హ్యాపీ బర్త్ డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వైఎస్ జగన్ గారు, రాబోయే ఏడాది మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయాలని ఆశిస్తున్నా' అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. (ఇదీ చదవండి: వైఎస్ జగన్‌కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు) -
RGV: దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా ?
-
అల్లు అర్జున్, సీఎం రేవంత్ అరెస్ట్‌లో కామన్ పాయింట్ గమనించారా?: ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత డైరెక్టర్ ఆర్జీవీ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. వరుసగా ట్వీట్స్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రశ్నలు సంధించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో అరెస్టైన వీడియోను పోస్ట్ చేశారు. అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయంలో కామన్ పాయింట్ ఏంటి? అని ఆర్జీవీ ప్రశ్నించారు. వాళ్లిద్దరినీ బెడ్రూమ్లోకి వెళ్లి మరి అరెస్ట్ చేశారని ఆయనే సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇది చదవండి: అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ)కాగా.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం హైదారాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. 14 రిమాండ్ విధించింది. కానీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయమే బన్నీ జైలు నుంచి విడుదలయ్యారు. What’s common between the HONOURABLE CHIEF MINISTER OF TELANGANA @revanth_anumula and INDIA’S BIGGEST STAR @alluarjun is , they both got ARRESTED FROM THEIR BEDROOMS 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/bg7YJH1Qdl— Ram Gopal Varma (@RGVzoomin) December 15, 2024 -
అక్కడ 29 మంది చనిపోతే చట్టం గుర్తుకు రాలేదా: ఆర్జీవీ
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ ఘటనలో A11గా ఉన్న వ్యక్తిని నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఇప్పటికే నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని వర్మ గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. రేవతి కుటుంబానికి ముమ్మాటికి నష్టం జరిగిందని చెప్పిన వర్మ ఆ పేరుతో మరోక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఏంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలని ఆయన అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీ అరెస్ట్ గురించి చేసిన కామెంట్లు కూడా అభ్యంతరంగా ఉన్నాయని వర్మ అన్నారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారని అంటున్నారు... వారిపై నమోదైన కేసులకు, బన్నీ మీద నమోదు అయిన కేసుకు చాలా తేడా ఉందని ఆయన గుర్తు చేశారు.పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా?.. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? అంటూ వర్మ ప్రశ్నించారు. బన్నీ అరెస్ట్ గురించి ఆర్జీవీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో ద్వారా ఇంటర్వ్యూ చూడగలరు. -
అల్లు అర్జున్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు: స్టార్ డైరెక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్‌వర్మ మరోసారి కామెంట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వర్మ తనదైన రీతిలో ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. 'అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అధికారులకు నా 4 ప్రశ్నలు' అంటూ అందరినీ ఆలోచింపచేసిన ఆయన మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కేంద్రమంత్రుల నుంచి ఇక్కడ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా ఆయనకు మద్ధతుగా నిలిచారు. ఇప్పటికే బన్నీకి సపోర్ట్‌గా మాట్లాడిన ఆర్జీవి మరోసారి ఇలా ట్వీట్ చేశారు. ' తెలంగాణకు చెందిన అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీని అందించి, రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందించారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అల్లు అర్జున్ను జైలుకు పంపి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.' అంటూ తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు.నేషనల్ అవార్డ్‌తో తెలుగు సినిమా కీర్తిని పాన్ ఇండియా రేంజ్‌కు అల్లు అర్జున్ తీసుకెళ్లాడని తెలిసిందే. ఇన్నేళ్ల తెలుగు ఇండస్ట్రీలో జాతీయ అవార్డ్ అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డ్ క్రియేట్ చేశాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు మన సత్తా ఏంటో చూపించాడు. అంతటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో అరెస్ట్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమ మొత్తం షాక్ అయింది.. @alluarjun the BIGGEST STAR of INDIA, a resident of TELANGANA STATE has given the GREATEST GIFT to the TELANGANA STATE by giving the BIGGEST HIT in the ENTIRE HISTORY of iNDIAN CINEMA and the TELANGANA STATE in turn gave him the BIGGEST RETURN GIFT by sending him to JAIL…— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2024 -
ఎవరిది వైఫల్యం.. ఎవరికి శిక్ష?
అధికారులకు నాలుగు ప్రశ్నలు..1. పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్ల ను అరెస్ట్ చేస్తారా?2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా? 3. సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో ఎవరైనా చని పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా?4. భద్రతా ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహ కులు తప్ప సినిమా హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు?– ఎక్స్‌లో దర్శకుడు రాంగోపాల్ వర్మఅల్లు అర్జున్ హార్డ్‌వర్క్‌తో ఎదిగిన స్టార్పబ్లిక్ ర్యాలీల్లో, పలు ఘట నల్లో తొక్కిసలాటలు జరిగి ఎందరో అమాయ కులు చనిపోయారు. వారి జాబి తా కోసం వెతుకుతున్నా. ఈ మధ్యకాలంలో ఓ యంగ్ యాక్టర్ తొక్కి సలాటలో అసౌకర్యానికి గురై, కార్డియాక్ అరె స్ట్‌తో చనిపోయారు. అల్లు అర్జున్ హార్డ్‌వర్క్ తో ఎదిగిన స్టార్.. వారస త్వంతో కాదు. – పూనమ్ కౌర్, నటి నమ్మలేకపోతున్నానుఇప్పుడు నేను చూస్తున్న పరిణామాలను నమ్మలేక పోతున్నాను (అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఉద్దేశించి). జరి గిన ఘటన చాలా బాధాకరం.. దురదష్టకరం. అయితే అందుకు ఒక వ్యక్తిని నిందించడం మాత్రం చాలా బాధగా ఉంది. ఈ ప్రస్తుత పరిస్థితి చాలా బాధాకరం.. – రష్మిక మందన్నా, నటి ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదుప్రభుత్వ అధికారులు, మీ డియా వారు సినిమా పరి శ్రమకు సంబంధించిన వా ళ్లపై చూపించే ఉత్సాహం సాధారణ ప్రజల విషయంలోనూ చూపించాలని కోరుకుంటున్నాను. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చు కోవాలి. మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్య త్లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసు కోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించటం సరికాదు. – నాని, సినీ నటుడుఒక్కరినే నిందించటం సరికాదుజరిగిన ఘటన హృదయ విదారకం. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఒక నటుడు భద్రతాపరమైన చర్యలకు పూర్తి బాధ్యత వహించలేడు. ఈ ఘటనకు ఒక వ్యక్తినే బాధ్యుణ్ణి చేసి, నిందించడం సరికాదు. – వరుణ్ ధావన్, సినీ నటుడు అందరూ బాధ్యులేనేను అల్లు అర్జున్‌కు గొప్ప మద్దతుదారును. జరిగిన ఘటన దురదృష్టకరం. మనం హైప్రొఫైల్ వ్యక్తు లం. ఇలాంటి పరిణామాలకు బాధ్యులుగా మారకూడదు. ప్రజల ప్రాణాలు ఎంతో విలు వైనవి. ఇలాంటి ఘటనలకు అందరూ బాధ్యత వహించాలి. – కంగనా రనౌత్, సినీనటి, ఎంపీ -
అలా జరిగితే దేవుళ్లను కూడా అరెస్ట్ చేస్తారా?.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఆర్జీవీ రియాక్షన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో బన్నీని అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులకు తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు. నాలుగు రకాల ప్రశ్నలతో ఆయన ట్వీట్ చేశారు.సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన అధికారులకు ఆర్జీవీ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి. అవేంటో మీరు కూడా చూసేయండి. పుష్కరాలు ,బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ? అంటూ ప్రశ్నించారు. అలాగే ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ? అని ట్విటర్ వేదిక నిలదీశారు.ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు ఇవే..1.పుష్కరాలు , బ్రహ్మోత్సవాల్లాంటి ఉత్సవాల తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?2.ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో ఎవరైనా పోతే హీరో , హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ?4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ,ప్రజా నాయకులూ ఎలా కంట్రోల్ చెయ్యగలరు ? . @alluarjun కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు . 1.పుష్కరాలు , బ్రహ్మోస్తవాల్లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ?2.ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ?3.ప్రీ రిలీజ్…— Ram Gopal Varma (@RGVzoomin) December 13, 2024 -
మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు: RGV
-
ఆర్జీవీపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఏపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన ఇప్పటకే హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తనపై కావాలనే కేసులు పెడుతున్నారని పలు ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. దీంతో వారం క్రితం వర్మకు ఊరట కల్పిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పేర్కొన్న విషయం తెలిసిందే.వర్మపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. తాజాగా కోర్టులో విచారణ జరిగింది. గతంలో వర్మకు ఊరట కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో చెప్పిన వ్యాఖ్యలను మరోసారి కోర్టు ఆదేశించింది. వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానంలో రేపు విచారణ జరగనుంది.సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో వర్మ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఆ తర్వాత ఏపీలో సుమారు 9 జిల్లాలలో వర్మపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
సంధ్య థియేటర్ వంటి ఘటనలు గతంలో జరగలేదా..?: ఆర్జీవీ
అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం డిసెంబర్ 4న ప్రీమియర్స్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడంతో అల్లు అర్జున్‌తో పాటు ఆయన అభిమానులు కూడా బాధ పడ్డారు. అయితే, రేవతి మరణానికి కారణం బన్నీనే అంటూ కొందరు సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు.. ఆపై తెలంగాణలో బెన్ఫిట్ షోలు ఉండబోవని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశాల గురించి ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్‌వర్మ తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ను తప్పుపట్టడం చాలా ఆశ్చర్యంగా ఉందని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా విడుదల సమయంలో ఇలాంటి తొక్కిసలాట ఘటనలు గతంలో చాలా జరిగాయని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. ఈ కారణంతో బెనిఫిట్ షోలను బ్యాన్ చేయడాన్ని వర్మ తప్పుపట్టారు. అయితే, రేవతి కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూర్తి చేయలేరని పేర్కొన్నారు.'సినిమా సెలబ్రిటీలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు.. వారు ఎక్కడికైనా వెళ్తే అభిమానులు భారీగానే పోటెత్తుతారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాటలు చాలా సాధారణంగా జరుగుతాయి. అయితే, తొక్కిసలాట ప్రమాదం వల్ల జరిగిందా..? నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? అసమర్థత, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా..? అనేది ఒక కేసు ఆధారంగా దర్యాప్తు కోణం నుంచి మాత్రమే తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సంఘటన కారణంగా బెనిఫిట్ షోలను నిషేధించడం సమాధానం కాదు.బెనిఫిట్ షోలు అనే బదులు వాటిని స్పెషల్ షో అనేది సరైన పేరు.. స్పెషల్ కాఫీ, స్పెషల్ మీల్స్ సాధారణ వాటి కంటే ఎలా ఖరీదైనవో, స్పెషల్ షో టిక్కెట్లు కూడా ఖరీదైనవిగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సభలు, ర్యాలీలు, కచేరీలు మొదలైన వాటికి తగిన అనుమతులు ఇచ్చినట్లే, థియేటర్‌కి కూడా వివిధ సంబంధిత అధికారులు సినిమా ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారు.సినిమా నటులు థియేటర్లను సందర్శించడం అనేది కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతున్న విషయమే.. అక్కడికి జనం పోటిత్తుతారు. ఆ సమయంలో ఒక్కోసారి ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరం. ఒక స్టార్ థియేటర్‌కు రావాడానికి పోలీసులు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి, కానీ బెనిఫిట్ షోలను ఎందుకు నిషేధించాలి..? రాజకీయ సమావేశాల తొక్కిసలాటలు ఎన్నో జరిగాయి. కుంభమేళా వంటి వాటిలో జరిగిన తొక్కిసలాటలో వ్యక్తులు చనిపోయినప్పుడు వాటిని నిషేధించారా..?' అంటూ వర్మ తన సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.It is truly ridiculous to blame @alluarjun for the unfortunate death of a woman in a stampede outside a theatre playing #Pushpa2Celebrities by their very appeal draw huge crowds whether they are Film Stars , Rock stars and even Gods for that matter And stampedes happen very…— Ram Gopal Varma (@RGVzoomin) December 9, 2024 -
'పుష్ప-2 పాన్ ఇండియా కాదు'.. ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్!
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పుష్ప-2 సినిమాపై సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు లేని రికార్డులు సృష్టిస్తోందని పోస్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ క్రియేట్ చేస్తోన్న రికార్డులపై ఆయన తనదైన శైలిలో రాసుకొచ్చారు. హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ వసూళ్లు రావడంపై ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.ఆర్జీవీ తన ట్వీట్లో రాస్తూ.. 'హిందీలో తెలుగు డబ్బింగ్ చిత్రం అత్యధిక వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసింది.. అలాగే బాలీవుడ్ యాక్టర్ కాకుండా మన అల్లు అర్జున్ అక్కడ బిగ్గెస్ట్ స్టార్‌గా నిలిచారు.. పుష్ప-2 పాన్ ఇండియా కాదు.. తెలుగు ఇండియా' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మీరు స్టైలే వేరంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సత్తా అంటే ఇది అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.కాగా.. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల వసూళ్లు సాధించింది. హిందీలో తొలిరోజే రూ.72 కోట్ల నెట్ వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో రోజు రూ.59 కోట్లు రాబట్టిన పుష్పరాజ్.. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లు సాధించింది. దీంతో హిందీలో బన్నీ చిత్రం రికార్డ్ స్థాయి వసూళ్లను ఉద్దేశించి ట్వీట్ చేశారు. The BIGGEST HINDI FILM ever in HISTORY of BOLLYWOOD is a DUBBED TELUGU FILM #Pushpa2 The BIGGEST HINDI FILM ACTOR in HISTORY of BOLLYWOOD is a TELUGU ACTOR @alluarjun who CAN’T SPEAK HINDI So it’s not PAN INDIA anymore , but it is TELUGU INDIA 💪💪💪— Ram Gopal Varma (@RGVzoomin) December 8, 2024 -
తప్పుడు చానళ్లపై కేసులు వేస్తా: ఆర్జీవీ
సాక్షి, హైదరాబాద్: తనపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలిగించిన టీవీ5, ఏబీఎన్, మహాటీవీ సహా మరికొన్ని చానళ్లపై పరువు నష్టం కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తనపై, తన భాగస్వామి రవివర్మపై దుష్ఫ్రచారాన్ని సహించేది లేదని అన్నారు. వ్యూహం సినిమాకు దాసరి కిరణ్‌కుమార్ నిర్మాత కాగా, శ్రీకాంత్ ఫైనాన్స్ సహకారం అందించారని, భాగస్వామి రవివర్మ సొంతంగా శ్రీకాంత్ నుంచి ఏపీ ఫైబర్‌నెట్ ప్రసార హక్కులను కొనుగోలు చేశారని, రవి వర్మ నుంచి ఏపీ ఫైబర్‌నెట్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసి, కోటి రూపాయలు మాత్రమే ఇచ్చిందని ఆర్జీవీ తెలిపారు. 60 రోజులపాటు ఏపీ ఫైబర్‌నెట్‌కు హక్కులు ఇస్తే, లక్షన్నర వరకు వ్యూస్ వచ్చాయని చెప్పారు. టీడీపీ ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసారాలు నిలిపేశారని, కానీ తనకు రావాల్సిన మిగిలిన మొత్తం కోసం రవివర్మ సివిల్ కోర్టులో దావా వేశారని ఆర్జీవీ చెప్పారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ తనతో పాటు రవి వర్మపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్లను చట్టప్రకారం ఎదుర్కొంటానని ఆర్జీవీ తన ప్రకటనలో హెచ్చరించారు. -
అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకోనన్న రామ్ గోపాల్ వర్మ
-
Pushpa 2 : ‘పుష్ప’ పాత్రపై ఆర్జీవీ రివ్యూ
అంతా అనుకున్నట్లే పుష్ప 2 మూవీ రికార్డులను బద్దలు కొడుతోంది. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా .. పుష్ప 2 మూవీ గురించే చర్చిస్తున్నారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి రోజు ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా.. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. సినీ ప్రముఖులంతా ఈ సినిమాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ముందు నుంచి కూడా పుష్ప 2 చిత్రానికి తన మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఈ మూవీపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు. ‘పుష్ప 2 చిత్రంలోని పుష్ప పాత్రపై నా రివ్యూ’ అంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ని ఎక్స్(ట్విటర్) షేర్ చేస్తూ.. భారతీయ సినీ చరిత్రలోనే పుష్ప లాంటి పదునైన పాత్రను చూడడం చాలా అరుదని అన్నారు. ఓ స్టార్ హీరో ఇమేజ్‌ని పక్కనపెట్టి పాత్ర కోసం సినిమా చూడడం పుష్ప 2 చిత్రానికి సాధ్యమైందని ప్రశంసించాడు.‘పుష్ప వంటి పాత్రను చూడటం చాలా అరుదు. ఒక వీక్షకుడిగా నేను సినిమా చూసినప్పుడు నిజంగా పుష్ప లాంటి పాత్ర బయట ఉందని నమ్మాను. ఇలా ఓ కమర్షియల్ ఫార్మాట్లో క్రియేట్ చేసిన పాత్రను వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్లు చూపించడం అంత సులభతరమైన పని కాదు.పుష్పరాజు పాత్రలో గమనిస్తే..అమాయకత్వం, చాకచక్యంతో మిళితమై ఉంటాయి. అలాగే దుర్బలత్వంతో కూడిన సూపర్ అహం వంటి అత్యంత విరుద్ధమైన లక్షణాలన్నీ ఈ పాత్రలో కనిపిస్తాయి. వైకల్యంతో ఉన్న వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని నేను ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే సూపర్ హీరో అనేవాడు ఫర్ఫెక్ట్గా ఉంటాడని మాత్రమే మనం చూశాం. కానీ పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఆ వైకల్యాన్ని శక్తిగా మార్చారు. మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్,హావభావాలు ఆ పాత్రకు మరింత బలమైన బలాన్ని అందించాయి. ఈ పాత్రని దశాబ్దాల కాలం పాటు ప్రేక్షకుల గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు చాలా మందికి రిఫరెన్స్ పాయింట్‌గా పుష్ప పాత్ర ఉంటుంది. ఏ నటుడైనా తనకు సంబంధించిన సన్నివేశాల్లో బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు. కొన్ని అవాస్తవిక దృశ్యాలు కూడా నిజమైనవిగా అనిపించేంత పరిపూర్ణతను ప్రదర్శించారు. కేవడం బాడీ లాంగ్వేజ్‌తో మాత్రమే కాకుండా ఎమోషన్స్ సీన్లని కూడా ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా నటించాడు. సీఎం సెల్ఫీకి నిరాకరించినప్పుడుకానీ, బాగా తాగి తన అహంకారాని పక్కన పెట్టి సారీ చెప్పే సీన్ కానీ.. అన్నింట్లిలోనూ అద్భుతంగా నటించాడు.ఇది చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. పుష్పరాజ్ జర్నీని చూస్తూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాకా.. ఆ పాత్ర ముందు అల్లు అర్జున్ కూడా చిన్నగా కనిపిస్తాడు’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. My REVIEW of the CHARACTER of PUSHPA in #pushpa2—Ram Gopal Varma It is extremely rare that Indian films have sharply etched characters and it is even more rare that a star himself will ignore his own image and literally become the character Seeing…— Ram Gopal Varma (@RGVzoomin) December 7, 2024 -
అల్లు అర్జున్ 'ప్లానెట్ స్టార్'.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఇప్పటికే మెగా vs అల్లు అన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ నడుస్తోంది. అటు మెగా హీరోల అభిమానులు బన్నీపై ట్రోలింగ్ చేస్తుంటే.. ఇతడి ఫ్యాన్స్ వాళ్ల హీరోలని ట్రోల్ చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఈ తంతు నడుస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త చల్లారుతుందేమో అనుకుంటున్న టైంలో దర్శకుడు ఆర్జీవీ మంటపెట్టేలా ట్వీట్ చేశాడు. ఇందులో భాగంగా బన్నీని రాంగోపాల్ వర్మ ఆకాశానికెత్తేసినట్లు అనిపించింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్)'అల్లు మెగా కంటే చాలా రెట్లు ఎక్కువ.. గ్లోబల్ స్టార్ కంటే ఎక్కువే.. అల్లు అర్జున్ ప్లానెట్ స్టార్ అనడానికి 3 కారణాలు..పుష్ప 2 భారతీయ సినిమా చరిత్రలో ఏ సినిమాకు లేని క్రేజ్‌తో రిలీజ్ కాబోతుంది. మొదటి రోజు దాని కలెక్షన్లు బాక్సాఫీస్ యూనివర్స్ స్ట్రాటోస్పియర్ను విచ్ఛిన్నం చేస్తాయి. బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా..ప్రపంచవ్యాప్తంగా ప్లానెట్ స్టార్ అని పిలిచే ఏకైక స్టార్ అల్లు అర్జున్. ఎందుకంటే, బన్నీ మూవీ పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రభంజనాన్ని సృష్టించడం పక్కా.అలానే బన్నీ సినిమా భారీ బడ్జెట్‌తో తీశారు. ఇది మెగా మెగా కంటే మెగా రెట్లు ఎక్కువ. సినిమా చరిత్రలో ఏ స్టార్ కూడా ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోలేదు, అందుకే ఇతడు నిజమైన టవర్ స్టార్' అని వర్మ ట్విటర్లో(ఎక్స్) రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: నేడు హీరో నాగచైతన్య-శోభితల వివాహం)Here are 3 REASONS why ALLU is many times more MEGA than MEGA , and why he is not just a global star , but a PLANET STAR REASON 1.His film #Pushpa2 is the BIGGEST release in the ENTIRE HISTORY of INDIAN CINEMA and its COLLECTIONS on the 1st day are bound to BREAK the… https://t.co/WJClSl8VcZ— Ram Gopal Varma (@RGVzoomin) December 3, 2024 -
Ram Gopal Varma: ఎవరి మనోభావాలో దెబ్బతింటే కేసులు పెట్టడమేంటి?: ఆర్జీవీ
-
నా పోస్ట్‌పై ఏడాది తర్వాత కేసులు పెట్టడమేంటి? : రాం గోపాల్ వర్మ
ఏపీలో తనపై నమోదైన కేసులపై టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాట్లాడారు. ఏడాది క్రితం తాను పెట్టిన పోస్టుపై ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని కేసులు పెట్టడం ఏంటో నాకర్థం కావడం లేదన్నారు. ఒక ఏడాదిలో నేను వందల పోస్టులు పెడతానని.. కానీ అవన్నీ నాకు గుర్తుండవని ఆర్జీవీ తెలిపారు. నేను పోస్ట్ పెట్టిన ఏడాది తర్వాత నలుగురు, ఐదుగురు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో తనపై నమోదైన కేసులపై స్పందించారు.గతనెల 25న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారని ఆర్జీవీ వెల్లడించారు. ఆ తర్వాత నేను పోలీసులకు మేసేజ్ పెట్టానని.. కానీ వాళ్లు కొందరు మీడియావాళ్లతో కలిసి వచ్చారని తెలిపారు. దానికి ఆ మీడియా సంస్థలు ఏవేవో కథనాలు రాశాయని ఆర్జీవీ అన్నారు. సోషల్ మీడియా కంటే ముందుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా నన్ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో రాస్తారని.. నేను టీవీ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తుంటే పారిపోయాడంటూ ప్రచారం చేశారని రాంగోపాల్ వర్మ వెల్లడించారు.(ఇది చదవండి: రాంగోపాల్ వర్మ పిటిషన్.. ఏపీ హైకోర్టులో ఊరట)గవర్నమెంట్ మారినా పోలీసులు ఇంకా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని కొందరు తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అర్జీవీ అన్నారు. మీ అభిప్రాయం చెప్పినప్పుడు.. నా అభిప్రాయంగా కూడా తీసుకోవాలి కదా.. అదే స్పిరిట్ అని ప్రశ్నించారు. నాపై కూడా ఎన్నో మీమ్స్ వస్తుంటాయి.. నేను ఏదైనా పోస్ట్ పెడితే 90శాతం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ఇంత మంది ఒకేసారి కేసులు పెట్టడంపై ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేసినట్లు వెల్లడించారు.అయితే నేను వ్యూహం రిలీజ్ టైములో పొలిటికల్ సినిమా తీయనని చెప్పానని.. ఆ మూవీ విషయంలో సెన్సర్ వాళ్లతో ఇబ్బంది పడి ఇక చేయనని చెప్పినట్లు ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి డెన్‌కు వచ్చామని పోలీసులు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. కాగా.. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపై కొందరు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే ఆ కేసులను క్వాష్ చేయాలంటూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మకు ఊరట
-
రాంగోపాల్ వర్మ పిటిషన్.. ఏపీ హైకోర్టులో ఊరట
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. తాను చేసిన ఒక్క పోస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను తొమ్మిదో తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాదికి సూచించింది.కేసులకు భయపడటం లేదు: ఆర్జీవీఆంధ్రప్రదేశ్లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్‌వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. కాగా.. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఆర్జీవీపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
సోషల్ మీడియా డెవిల్స్.. RGV స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో!
సాక్షి, అమరావతి: ‘నేను ఏడాది కిందట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఇప్పుడు కొందరి మనోభావాలు హఠాత్తుగా దెబ్బతినడం ఏమిటో అర్థం కావడం లేదు. పత్రికల్లో ప్రచురించే కార్టూన్ల మాదిరిగానే నేను కూడా కొన్ని పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. పత్రికలకు ఉన్నట్టే వ్యక్తులకు కూడా కాస్త భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించవచ్చు. ఆ పోస్టులు పెట్టినప్పుడు.. అంటే ఏడాది కిందట ఎవరూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అనలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయనూ లేదు. ఆ పోస్టుల్లో నేను పేర్కొన్నవారు కూడా కనీసం అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయనేలేదు.కానీ హఠాత్తుగా ఏడాది తరువాత.. అదీ ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లోని వ్యక్తులకు ఒకేసారి మనోభావాలు దెబ్బతినడం ఏమిటో..! వాళ్లు ఒకేసారి వేర్వేరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడం ఏమిటో..! పోలీసులు వెంటనే కేసులు పెట్టడం ఏమిటో..! దీన్నిబట్టి ఈ ఫిర్యాదులు, కేసుల వెనుక ఏం జరిగిందన్నదీ.. ఎంత పక్కా స్క్రిప్ట్ ఉందన్నదీ స్పష్టం అవుతునే ఉంది..’ అని సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ఆయన ఆదివారం వివిధ టీవీ చానళ్ల డిబేట్లలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. -
RGV: తొమ్మిది చోట్ల కేసులు పెట్టారు..
-
RGV: రామ్ గోపాల్ వర్మను ఈడ్చుకుని వెళ్లారు... వినడానికి నాకు బాగుంటుంది
-
'ఆర్జీవీ' పరారీలో ఉన్నారనుకునే వారికి బ్యాడ్ న్యూస్
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసులకు భయపడి పరారీలో ఉన్నారని అనుకునే వారి కోసం ఆయన సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో తనపై పెట్టిన కేసులు వాటి సెక్షన్ల వివరాలను పొందుపరిచారు. తాను చేసిన తప్పేంటి..? పోలీసులు నమోదు చేసిన కేసు ఏంటి..? అనేది అందరికీ అర్థం అయ్యేలా తెలుపుతూ.. తన సోషల్ మీడియాలో భారీ ట్వీట్ చేశారు.వర్మ భయపడి పరారీలో ఉన్నారనుకునే వారికి ఆయన పెద్ద షాకిచ్చారని చెప్పవచ్చు. అలాంటి ప్రచారాలతో ఆనందపడి సెలబ్రేట్ చేసుకునే వారికి బ్యాడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నారో తెలుపుతూ.. సుమారు 20కి పైగా పాయింట్లతో ఒక ట్వీట చేశారు.వర్మ తన ట్విటర్లో ఇలా షేర్ చేశారు..1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ .. ఎందుకంటే ఈ టైమ్ అంత నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకి వెళ్ళడం తప్ప.2. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు..?3. నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్, ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం మూలన ఆ కంప్లయింట్ ఇచ్చారట.4.ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు , ఆంధ్ర ప్రదేశ్‌లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదు అయ్యాయి, అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు, ఇవన్నీ కూడా కేవలం గత 4 , 5 రోజుల్లోనే నమోదు అయ్యాయి.5.నాకు నోటీసు అందిన వెంటనే , నా సినిమా పనుల వల్ల, సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది . కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం , లేకపోతే విడియో ద్వారా హాజరు అవుతాను అని తెలియజేయడం జరిగింది. .. అదే టైమ్‌లో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు ,నా వాళ్లకు అనుమానం కలిగింది.6. నేను సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటాను, చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని, ఒక సంవత్సర కాలంలో కొన్ని వేళ పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టాను అంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించినవి, ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింది.7. నేను పెట్టాను అంటున్న పోస్టులు , వేటి వల్ల ఐతే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాలలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారో అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది.8. ఈ మీమ్స్ కారణంగా నా మీద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352 of BNS and section 67 of IT సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి.9. BNS 336(4) ఏం చెబుతుందంటే.. ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్టును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. అయితే, నేను చేసిన పోస్టుల చూస్తే , అందులో ఫోర్జరీ ఎక్కడుంది? , అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి? 10. BNS 353(2)తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా, మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం . అయితే, నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు.11. BNS 356. (1)ఎవరైనా మాటల ద్వారా గానీ , రాతల ద్వారా గానీ , సంకేతాల ద్వారా గానీ , చిహ్నాల ద్వారా గానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం. ఇలాంటి మీమ్స్లపై పరువు నష్టం కేసులేస్తే రోజుకి లక్ష కేసులు కూడా దాటుతాయి.12. BNS 61(2)ఒక చట్ట విరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక: మోసపూరిత విధానంలో చద్దబద్దమైన ఫలితం పొందడం. అయితే, దీనితో నాపై ఉన్న కేసుకు లింక్ కెంటి..?13. BNS 196 వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మ స్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం.14. SECTION 67 IT act ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా, కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించటం. Section 67 కేవలం అసభ్యకర విషయాల్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. అయితే, ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది.. ?15. నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం , భారత రాజ్యాంగం ARTICLE 19(1)a ప్రకారం న్యాయబద్దమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్చగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు.16. ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూలస్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం, ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్‌గా మాట్లాడగలగడం.. అదే విధంగా ఇతరుల నుంచి ఏ విధంగానైనా వచ్చే వాటినీ స్వీకరించటం. ఇది స్వేచ్చ ప్రధాన హక్కు, ఈ హక్కు ను నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం.17. ఈ మీమ్ అనే భావప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచనలను,భావాలను, ఉద్దేశాలను, శైలీని,ప్రవర్తనలు వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం. విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్లొ ముఖ్య భాగం అయ్యింది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే.18. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ,బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు… ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్‌గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలి.19. ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే.. నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీసుకు వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీసులోపలకి రాలేదు, నన్ను అరెస్టు చేయటానికి వచ్చాం అని కూడా చెప్పలేదు.20. ఇప్పుడూ మీడియాలో వస్తున్న కథనాలు… నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు, వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు, నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు.. కానీ ఈ మీడియా ప్రతిసారి మాదిరే హై డ్రామా క్రియేట్ చేసింది.21. నేను నా మొబైల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం, లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్‌కి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నామీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుంది అనిపించింది. అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తీనీ లేక ఒక గ్రూప్‌నీ నిందించటం లేదు. కానీ, వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థం అవుతోంది.22. నేను చట్టాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తాను. కాని దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను.ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్‌గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?నా కేసు —- RGV @ndtv @IndiaToday @TimesNow @republic @TV9Telugu @NtvTeluguLive @sakshinews @tv5newsnow @BBCWorld @DDNewslive @ZeeNews 1.నేను ఏదో పరారీలో ఉన్నాను , ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్ళందరికీ…— Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2024 -
'సారీ' చెప్తారా అనే ప్రశ్నకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చిన వర్మ
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన నివాసానికి వచ్చిన సమయం నుంచి ఏపీలో పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే, తాజాగా వర్మ పాల్గొన్న ఇంటర్వ్యూలో తన కేసుల విషయంపై పలు సంచలన విషయాలను వెళ్లడించారు. ఇంతకీ వర్మను అరెస్ట్ చేసేందుకే పోలీసులు ఆయన డెన్‌కు వెళ్లారా..? కేసుల భయంతో వర్మ తప్పించుకున్నారా..? పారిపోయారా..? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.'సంవత్సర క్రితం నేను చేసిన పోస్ట్‌కు నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విషయంలో నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాలేదు. వర్మను అరెస్ట్ చేస్తున్నామని వారు కూడా ఇంతవరకు తెలపలేదు. నేను తప్పించుకుని తిరుగుతున్నానని ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడా చెప్పలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు గేటు బయటే ఎందుకున్నారు. అరెస్ట్ చేయాలనుకున్నవారు లోపలికి రావచ్చు కదా.. కానీ, వాళ్లు రాలేదు. ఈ కేసుల వెనక ఎవరున్నారని తెలుసుకునేందుకే నేను కోర్టుకు వెళ్లాను. నేను బాగానే ఉన్నాను. అయితే, ఎలా ఉన్నానంటూ నా సన్నిహితులు చూపుతున్న సానుభూతి భరించలేకున్నా.' అని తనదైన స్టైల్లో ఆయన చెప్పారు.నేను ఎప్పుడో చేసిన పోస్ట్‌లపై ఇప్పుడు కేసులు పెడుతున్నారు. నాపై కేసులు పెట్టిన ఆ తొమ్మిది మంది నా పోస్టులను ఇప్పుడే చూశారట. అందుకే కేసులు పెట్టారట. ఇది నమ్మే విషయమా..? నేను కేసులకు భయపడను ఐ డోంట్ కేర్. న్యాయవ్యవస్థ అంటే నాకు గౌరవం ఉంది.పోలీసుల మీదా నమ్మకం ఉంది. చట్ట ప్రకారం వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తా.' అని ఆయన అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా కేసులు విషయంలో సారీ ఏమైనా చెప్తారా..? అనే ప్రశ్నకు వర్మ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. కేసులు, ఏపీ రాజకీయ అంశాలపై వర్మ చెప్పిన సంచలన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. -
RGV Interview: డైరెక్టర్ RGVతో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్‌వర్మ మరో పిటిషన్
కేసుల నేపథ్యంలో ఏపీ హైకోర్టులో డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్‌పై ఆంధ్రప్రదేశ్‌లో అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనల్లో వర్మ పేర్కొన్నారు. ఒకే విషయంపై ఇన్ని కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు చేయడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. ఇకపై ఇదే పోస్ట్ విషయంలో కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని కోర్టును ఆర్జీవీ కోరారు. ఆపై ఇప్పటి వరకు తన మీద నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషనల్లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారించనుంది.ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని రాంగోపాల్‌వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం తాను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఆయన అన్నారు. సంబంధంలేని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన వీడియోలో పేర్కొన్నారు. -
ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన
-
కేసులకు భయపడటంలేదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను భయపడటం లేదని సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్పష్టం చేశారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో మంగళవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘ఏడాది క్రితం నేను చేసిన ట్వీట్లకు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? అలాంటప్పుడు ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి? ప్రస్తుతం రాజకీయ నాయకులు పోలీసులను ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తున్నారు. అమెరికా, యూరఫ్, ఇక్కడా అదే జరుగుతోంది. ప్రస్తుతం నేను ఓ మూవీ షూటింగ్లో ఉన్నాను. మధ్యలో వదిలేసి వస్తే నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాలేకపోతున్నా’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణసోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ జరపనుంది. ఈ వ్యాజ్యాల గురించి వర్మ తరఫు న్యాయవాది మంగళవారం న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయమూర్తి బుధవారం విచారణ జరుపుతామని చెప్పారు. -
కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి!
ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరందని చెప్పకతప్పదు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏకపక్షంగా పోలీసులను ప్రయోగిస్తున్న తీరు దారుణం. ప్రతిపక్షంలో ఉండగా సోషల్ మీడియా స్వేచ్చ గురించి నీతులు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చిన పోలీసులు హైదరాబాద్‌లో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద హడావుడి చేయడం చూస్తే ఏపీ పోలీసుల ప్రాధాన్యత క్రమం మారిపోయినట్లు అనిపిస్తుంది. ఒక సినిమా విడుదల సందర్భంగా వర్మ ఎప్పుడో ఏవో ఫోటోలు పెట్టారట. దానిపై ఇప్పుడు ఎవరో ఫిర్యాదు చేశారట. పోలీసులు వాయు వేగంతో వర్మకు నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల ముందు హాజరయ్యేందుకు వర్మ కారణాలు చూపుతూ సమయం కోరారు. పైగా అంతేకాక కొత్త చట్టం ప్రకారం వర్చువల్ విచారణకు సిద్దపడ్డారు. వర్మ ప్రత్యక్ష విచారణకు హాజరు కాబోరని కనిపెట్టిన పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలివచ్చారు.వర్మ కొన్నేళ్ల క్రితం తప్పు చేసి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కేవలం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఆయనను ఇబ్బంది పెట్టే లక్ష్యంతో కక్షకట్టి పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. రాజకీయాలతో సంబంధం లేని ఒక సినీ ప్రముఖుడిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది. వర్మ తప్పు చేసి ఉంటే చర్య తీసుకోరాదని ఎవరూ చెప్పరు. కానీ కావాలని దురుద్దేశంతో వ్యవహరిస్తున్న తీరే విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ఇది సినీ పరిశ్రమపై దాడిగా కనిపిస్తుంది. వర్మ ఒకవేళ ఒంగోలుకు వెళ్లి కేసు విచారణకు హాజరై ఉంటే ,అక్కడ నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పేవారో ఊహించుకోవడం కష్టం కాదు. వర్మపై వచ్చిన అభియోగం ఏమిటో చెప్పకుండా పోలీసులు విచారణకు పిలవడం, హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద సీన్ క్రియేట్ చేయడం శోచనీయం.అలాగే మరో నటుడు పోసాని కృష్ణ మురళీ మీద అనేక పోలీస్ స్టేషన్లలో టీడీపీ, జనసేన వారు ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయన ఈ రకమైన వేధింపులకు తట్టుకోలేమని భావించి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా వదలిపెట్టబోమని టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి హెచ్చరిస్తున్నారు.ఏపీలో ఇవన్ని కొత్త ట్రెండ్ లో భాగంగానే కనిపిస్తాయి. నిజంగానే ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయడం ఒక పద్దతి. అలా కాకుండా టీడీపీ నుంచి ఎవరుపడితే వారు ఫిర్యాదులు చేస్తే, వెంటనే టేకప్ చేసి ఆరోపణలకు గురైనవారిని అదుపులోకి తీసుకుని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిప్పుతూ, కొన్ని చోట్ల రిమాండ్‌కు పంపుతూ, మరికొన్ని చోట్ల విచారణ చేసి, మళ్లీ వేరే స్టేషన్‌కు తరలించడం, తద్వారా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్న తీరు కచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్దం. ఇంటూరి రవికిరణ్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయనపై ద్వేషంతో ఇప్పటికి పదిహేను కేసులు పెట్టారట. అటు ఉత్తరాంద్ర నుంచి ఇటు రాయలసీమ వరకు ఈ కేసులు పెట్టడంలోనే దురుద్దేశం ఉంది. ఇంటూరి భార్య ఆవేదనతో ఈ విషయాలు చెబుతూ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను సీఎం. ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాపై కేసులు పెడతామని చెప్పిన వెంటనే టీడీపీ, జనసేనకు చెందిన కొంతమంది రంగంలోకి దిగి ఫిర్యాదుల పరంపర సాగిస్తున్న తీరు చూస్తే ఇదంతా కుట్ర అని, ఆర్గనైజ్డ్గా చేస్తున్నారని అర్థమవుతుంది.మాజీ మంత్రి కొడాలి నాని పై మరీ చిత్రంగా ఒక లా విద్యార్ది ఫిర్యాదు చేస్తే రాత్రి 11 గంటల సమయంలో కేసు నమోదు చేశారట. అంత ఆకస్మికంగా కేసు కట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు. నాని మీడియా సమావేశాలలో, అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ తదితరులపై చేసిన వ్యాఖ్యల వల్ల ఆ విద్యార్ది మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేయడం విచిత్రంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి మనో భావాలు అయినా దెబ్బతింటే ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే ఫిర్యాదులు చేయాలి. అలా కాకుండా ఎప్పుడో చేసిన విమర్శలు వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలలకు ఫిర్యాదు చేయడం ఏమిటో తెలియదు. పవన్ కళ్యాణ్ ఏపీలో 31 వేల మంది మహిళలు మిస్ అయిపోయారని, మహిళల అక్రమ రవాణా జరిగిందని ఆరోపిస్తే మహిళల మనోభావాలు దెబ్బ తినలేదా? లోకేష్ రెడ్‌బుక్ అంటూ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బెదిరిస్తే వారి మనోభావాలు దెబ్బ తినలేదా? జగన్‌ను సైకో అని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడితే వైఎస్సార్సీపీ వారి మనోభావాలు దెబ్బ తినలేదా? అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితరులు ఎంత దారుణంగా మాట్లాడినా, వారిపై ఎవరూ కేసులు పెట్టలేదు.రాజకీయంగానే చూశారు.కానీ ఇప్పుడు వీరు పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నట్లు వ్యవహరిస్తున్నారు. కొడాలి నాని ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో, అంతకన్నా ఘాటుగా టీడీపీ నేతలు పలువురు మాట్లాడారు. మరి వారిపై ఎందుకు కేసులు రావడం లేదు?శాసనసభలో జరిగే ప్రసంగాలు, చర్చలు, వాదోపవాదాలపై కోర్టులే జోక్యం చేసుకోవు. అలాంటిది ఏకంగా పోలీసులు ఎలా చర్య తీసుకుంటారంటే, అది ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ స్పెషాలిటీ అని భావించాలి. వైఎస్సార్సీపీ నేతలు పలువురు టీడీపీ సోషల్ మీడియా చేసిన దారుణమైన పోస్టింగ్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? మాజీ మంత్రి రోజా మీడియాలో ఈ విషయమై కన్నీరు పెట్టుకున్నారు.అయినా కూటమి ప్రభుత్వం ఆమె చేసిన ఫిర్యాదును స్వీకరించడం లేదు. అలాగే మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుటుంబంపై పెట్టిన అసభ్య పోస్టింగ్‌లకు సంబంధించి ఫిర్యాదు చేస్తూ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై పెట్టిన నీచమైన పోస్టింగ్‌ల మాటేమిటని అడిగినా స్పందించే నాథుడు లేకుండా పోయారు. ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేష్ లపై ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోరా? వైఎస్సార్సీపీ వారిపై మాత్రం ఏదో ఒక కేసు పెడతారా? ఏమిటి ఏపీని ఇలా మార్చుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీని పోలీసు రాజ్యంగా చేయడం ద్వారా శాశ్వతంగా ఏలవచ్చని పాలకులు భ్రమ పడుతున్నట్లుగా ఉంది. కానీ చరిత్రలో అది ఎల్లవేళలా సాధ్యపడదని అనేకమార్లు రుజువైంది. టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడం కోసం ఇలాంటి టెక్నిక్స్ ను వాడవచ్చు. తమ పాతకక్షలను తీర్చుకోవడానికి పోలీసులను టూల్స్ గా వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇంటూరి రవికిరణ్, వర్రా రవీంద్ర రెడ్డి మొదలైన వారితో బలవంతంగా స్టేట్ మెంట్స్ పై సంతకాలు పెట్టించుకుంటున్నారట. సోషల్ మీడియా కేసులు పెట్టడం కుదరకపోతే ఏదో ఒక క్రిమినల్ కేసులో ఇరికించడానికి యత్నిస్తున్నారు. అర్ధరాత్రి వేళ పోలీసులు కొంతమంది నాయకుల ఇళ్లలోకి చొరబడి ఆడవాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేత గౌతం రెడ్డి ఇంటిపై దాడి చేసి పోలీసులు సృష్టించిన గలభానే ఇందుకు నిదర్శనం. ఇలాంటివి వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడైనా ఒకటి,అరా జరిగితే టీడీపీ కానీ, ఎల్లో మీడియా కానీ నానా రచ్చ చేసేవి. కానీ ఇప్పుడు టీడీపీతోపాటు అదే ఎల్లో మీడియా పోలీసుల అరాచకాలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ తరహాలో పోలీసులను ఉపయోగిస్తే, వచ్చే కాలంలో ప్రభుత్వాలు మారితే, ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అప్పుడు టీడీపీ, జనసేనలకు చెందిన ముఖ్యనేతలపై కూడా ఇలాగే ఎక్కడపడితే అక్కడ కేసులు పెట్టే ప్రమాదం ఉంటుంది. గత టరమ్‌లో టీడీపీ ముఖ్యనేతలకు సంబంధించి కేసులు వచ్చినా ఇంత అరాచకంగా వారి పట్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసులు ప్రవర్తించలేదు. నిబంధనల ప్రకారం చర్య తీసుకోవడానికి యత్నించారు.అయినా ఆ రోజుల్లో మీడియా అండతో టీడీపీ నేతలు గందరగోళం సృష్టించే వారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని కావాలని కోర్టులో ప్రవేశపెట్టడంలో జాప్యం చేసిన వైనం కూడా అభ్యంతరకరమే. గతంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న సందర్భంలో నందిగామ వద్ద ఏదో గొడవ జరిగింది.ఇప్పుడు దానిని హత్యయత్నం కుట్ర కేసుగా మార్చి అక్కడి వైఎస్సార్సీపీ ముఖ్యనేతలపై కేసులు పెడుతున్నారట.మాజీ ఎంపీనందిగం సురేష్ ను ఎలా వేధిస్తున్నది అంతా గమనిస్తున్నారు. ఎవరు తప్పు చేశారన్న ఫిర్యాదులు వచ్చినా పోలీసులు చర్య తీసుకోవచ్చు. కానీ చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని మాత్రమే ఎవరైనా చెబుతారు. అలా కాకుండా ఇష్టారీతిన పోలీసులతో చట్టవిరుద్దమైన పనులు చేయిస్తున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ పరిస్థితి అంత తీవ్రంగా లేదు. అయినా బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ పై ఇప్పటికి ఆయా పోలీస్ స్టేషన్ లలో ఆరు కేసులు నమోదు చేశారట.వాటిని గమనిస్తే ఏదో కావాలని కేసులు పెట్టారన్న భావన కలుగుతుంది. చిన్న, చిన్న ఉదంతాలను కూడా కేసులుగా మార్చి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలను వేధించాలన్న దోరణి మంచిది కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు గా ఉన్న రేవంత్ రెడ్డి ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు పరుష భాషతో చేసింది తెలిసిందే. అలాగే కేసీఆర్ కూడా చేసి ఉండవచ్చు. అయినా ఎక్కడా ఈ కేసుల గొడవ రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా ఈ ట్రెండ్ కు వెళితే కాంగ్రెస్ పార్టీకి నష్టం. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలను గురుశిష్యులుగా అంతా చెప్పుకుంటారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తే అది ఆయనకే అప్రతిష్ట.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రాంగోపాల్ వర్మ ఇంటి నుంచి వెనుదిరిగిన ఏపీ పోలీసులు
-
‘వర్చువల్ విచారణకు హాజరవుతానని వర్మ ముందే చెప్పారు’
దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసులో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు చేరి ‘అరెస్ట్’ పేరిట హడాడివి చేశారు. అయితే.. వర్మ తాను ఫిజికల్‌గా హాజరయ్యేందుకు సమయం కోరిన విషయాన్ని ఆయన లాయర్ బాల మీడియాకు వివరించారు. ‘‘విచారణకు రెండు వారాల సమయం కోరాం. ఈలోపు వర్చువల్‌గా విచారణకు తాను హాజరవుతానని వర్మ ఇదివరకే చెప్పారు. ఫిజికల్‌గా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలన్నారు అని న్యాయవాది తెలిపారు. అయితే.. ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ అందించలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. తమకు ఇచ్చిన నోటీసుల్లోనూ ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. ఆర్జీవీ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని.. అందువల్లే డిజిటల్ విచారణకు హాజరవుతామని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని న్యాయవాది స్పష్టం చేశారు. అయితే.. ఈలోపే ఏపీ ప్రకాశం జిల్లా పోలీసులు ఇవాళ హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి వచ్చారు. ఆయన కోసం వేచిచేస్తూ.. మీడియాలో హడావిడి ప్రదర్శించాక అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. -
రాంగోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు
-
రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఏపీ పోలీసులు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. ఒంగోలు పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, వర్మ ఒంగోలుకు రావడం లేదని తెలియడంతో పోలీసులే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణకు సహకరించకుంటే వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉండగా.. ఆ సమయంలో తనకు సినిమా షూటింగ్స్ ఉండటం వల్ల హాజరు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వాటికి కూడా వర్మ సమాధానం ఇచ్చారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే విషయాన్ని వాట్సాప్ ద్వారా డీఎస్పీకి సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. అయినా సరే పోలీసులు వర్మ ఇంటికి రావడంలో కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.విచారణ పేరుతో తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. -
అనకాపల్లిలో రాంగోపాల్ వర్మపై మరో కేసు
-
RGV పోలీస్ కేసుపై జగన్ రియాక్షన్
-
ఏపీ హైకోర్టులో రాంగోపాల్ వర్మ మరో పిటిషన్..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్లో ప్రస్తావించారు. తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని బెయిల్ పిటిషన్లో వివరించారు.కాగా.. అంతకుముందు విచారణకు హాజరయ్యేందుకు తన సమయం కావాలని పోలీసులకు సందేశం పంపారు ఆర్జీవీ. నాలుగు రోజులు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు.మరోవైపు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. -
ఒంగోలు పోలీసులకు రాంగోపాల్ వర్మ సమాచారం
-
పోలీస్ విచారణకు హాజరుకాని రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదైంది. లెక్క ప్రకారం ఈరోజు (నవంబర్ 19) విచారణకు హాజరు కావాలి. అయితే తాను సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు. విచారణకు సహకరిస్తానని, కాకపోతే నాలుగైదు రోజుల తర్వాత విచారణకు వస్తానని చెప్పారు. అయితే వర్మ నిజంగానే షూటింగ్ బిజీలో ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటానని సీఐ అన్నారు.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)ఇకపోతే సోమవారం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. (ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!) -
Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో పిటిషన్ పై విచారణ
-
ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటిషన్ విచారణ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అయితే.. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రామ్ గోపాల్ వర్మ అభ్యర్థనపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల నుంచి అరెస్టు ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణకు తనకు మరికొంత సమయమిచ్చేలా ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు. ఆ అభ్యర్థనను కూడా పోలీసులు ముందు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని వేసిన ఆర్జీవీ వేసిన పిటిషన్‌ను రెండు వారాల తర్వాతే విచారణ జరపనుంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉంది. -
రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసుల నోటీసులు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 'వ్యూహం' ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టాడని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం)ఇప్పుడు ఈ కేసు విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు.. నోటీసులు జారీ చేశారు. ఈనెల 19వ తేదీన ఒంగోలు రూరల్ సర్కిల్ ఆఫీస్‌కి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా) -
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు
-
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మపైనా కేసు
సాక్షి నెట్వర్క్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదలలేదు. వ్యూహం సినిమా నిర్మించే క్రమంలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణిలను కించపరిచేలా పోస్టింగ్ పెట్టారన్న ఫిర్యాదు మేరకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.వివేకానందరెడ్డి సినిమాను దారుణంగా తీసి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై డైరెక్టుగా ఎన్నో అభాండాలు వేస్తూ యూట్యూబ్‌లోనూ, ఇతర ప్రసార మాధ్యమాలలోనూ చేసిన ప్రచారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. సెన్సార్ బోర్డు పర్మిషన్ తీసుకుని సినిమా తీసిన ఆర్జీవీపై వ్యక్తిగతంగా కేసు పెట్టడంపై సినిమా వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మరి సెన్సార్ బోర్డు ఉన్నది దేనికి అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యక్తిగతంగా కేసులు పెట్టడం దుర్మార్గమని సినిమా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద మద్దిపాడు పోలీసులు 336/4, 356/4, 196/356, ఐటీ/67 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
సంచలన డైరెక్టర్ ఆర్జీవీపై కేసు నమోదు..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, నారా బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జీవీపై పోలీసు కేసు నమోదు చేశారు.కాగా.. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. పలువురు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌ను టార్గెట్ చేసి మరీ కేసులు నమోదు చేస్తున్నారు. కాగా.. అక్రమ కేసులపై కార్యకర్తలకు అండగా ఉంటామని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. -
గ్రాండ్‌గా ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లిలో రష్మిక, విజయ్, కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
సినీ చరిత్రలోనే తొలిసారి... ఓకేసారి మూడు వర్షన్స్
ఆర్జీవీ సమర్పణలో తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం శారీ. ఈ సినిమాలో కోలీవుడ్ భామ ఆరాధ్యదేవి లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ బోల్డ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ పంచుకున్నాడు రాంగోపాల్ వర్మ. ఈ చిత్రంలోని సాంగ్‌కు సంబంధించిన టీజర్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. కేవలం టీజర్‌తోనే సాంగ్‌పై అంచనాలను మరింత పెంచేశాడు. ఈ సినిమాలోని ఐ వాంట్ లవ్ అనే పాటకు సంబంధించిన మూడు వర్షన్ల ప్రోమోను ఆర్జీవీ తన ట్విటర్ ద్వారా విడుదల చేశారు. సినిమా చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ మూవీలోని సాంగ్ టీజర్ చూస్తుంటే కుర్రకారుకు హీటు పుట్టించేలా ఉంది. పూర్తి పాటను అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు.సినీ చరిత్రలో ఏఐ ద్వారా రూపొందించిన ఒకే పాటకు మూడు వర్షన్స్ రిలీజ్ చేయడం విశేషం. కాగా.. ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ సమర్పణలో.. గిరీశ్ కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్‌లో ఆరాధ్యదేవి తన అందాల ఆరబోత ఖాయంగా కనిపిస్తోంది.Here’s a sneak peak teaser reel of I WANT LOVE AI song ONE (Crazy ) from SAAREE film featuring https://t.co/4vViOc25qQ Full song releasing Oct 17 th 5 pm #SaareeSongsAI #RGVsSAAREE pic.twitter.com/RgNnwHGdx6— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2024 -
ఆ రోజు నాన్నగారు చెప్పిందే నిజమైంది: నాగార్జున
టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ- నాగార్జున కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం శివ. 1990లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన 35 ఏళ్లు పూర్చి చేసుకున్న సందర్భంగా హీరో నాగార్జున ట్వీట్ చేశారు. శివ మూవీ రోజులను గుర్తు చేసుకున్నారు.నాగార్జున తన ట్వీట్లో రాస్తూ..'శివ రిలీజై నేటికి 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆ రోజు మా నాన్నగారు ఏఎన్ఆర్ కలిసి కారులో డ్రైవింగ్ చేయడం ఇప్పటికీ మరిచిపోలేను. ఆరోజు రాత్రి నాన్నాగారు శివ సినిమా చూసి..తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని చెప్పారు. ఆ రోజు నాన్న చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఇన్నేళ్ల తర్వాత కూడా శివ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. ముఖ్యంగా శివని సూపర్‌హిట్ చేసిన అభిమానులకు.. అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ ఆర్జీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు.నాగార్జున పోస్ట్‌కు దర్శకుడు ఆర్జీవీ సైతం స్పందించారు. నా జీవితంలో గొప్ప బ్రేక్ ఇచ్చారంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతు, నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. శివ లేకపోతే ఈ రోజు నేను ఉండేవాన్ని కాదంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. కాగా.. శివ చిత్రంలో అమలా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రఘువరన్, జేడీ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించారు.And thank you for giving me a BREAK of a LIFE TIME ..Without ur unwavering support and absolute trust in me , there wouldn’t have been neither SHIVA nor ME 🙏🏻 https://t.co/a5W2Y8BcUn— Ram Gopal Varma (@RGVzoomin) October 6, 2024 -
'అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు కూడా కష్టమే'.. కొండా సురేఖ కామెంట్స్‌పై ఆర్జీవీ మరో ట్వీట్
టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. అలా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు. తాజాగా కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సైతం తనదైన శైలిలో స్పందించారు. నాగార్జున ఫ్యామిలీకి మంత్రి క్షమాపణలు చెప్పకుండా.. సమంతను ఆమె కొనియాడారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజాగా ఈ వివాదంపై ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు. 'గన్ను గురిపెట్టింది కేటీఆర్‌కు అయితే.. కాల్చింది నాగార్జున, నాగచైతన్యలను అని.. కానీ చివరికీ సమంతకు సారీ చెప్పారు' .. అయితే ఈ సమీకరణాన్ని ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా అర్థం చేసుకోవడం కష్టమేనని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఈ విషయంలో నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పకపోవడంపై రాంగోపాల్ వర్మ మండిపడుతున్నారు.కాగా.. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపాయి. సమంత-నాగచైతన్య విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో మంత్రి వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడి ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ విషయంలో నాగార్జున ఇప్పటికే మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.Her GUN was aimed at @KTRBRS and she SHOT @iamnagarjuna and @chay_akkineni and APOLOGIED to @Samanthaprabhu2 ..I DOUBT even ALBERT EINSTEIN can decipher this EQUATION 😳😳😳— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2024 -
కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించిన రాంగోపాల్ వర్మ
-
నేను షాకయ్యా.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ రియాక్షన్
అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి హోదాలో ఉండి అలాంటి ఆరోపణలు చేయడంపై టాలీవుడ్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాగర్జున, అమల, నాగచైతన్య, సమంత, ప్రకాశ్ రాజ్, ఎన్టీఆర్, నాని, అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మంత్రి చేసిన వాఖ్యలను తప్పుపట్టారు. ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా కొండా సురేఖ వ్యాఖ్యల పై మండిపడుతూ వరుస ట్వీట్స్ చేశాడు.(చదవండి: మంత్రి మాటలు విని చాలా బాధపడ్డా: మెగాస్టార్ చిరంజీవి)నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు. కేటీఆర్‌ను దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు ? తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం.4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణంఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద… https://t.co/rMpA6UL798— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024 (చదవండి: ఇలాంటి ప్రవర్తన మన తెలుగు సంస్కృతికి విరుద్ధం: అల్లు అర్జున్, వెంకటేశ్) ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే కలుగజేసుకొని ఇకపై ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నాము’ అని ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. కాగా, కొండా సురేఖ ఫ్యామిలీతో ఆర్జీవీకి మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో కొండా సురేఖ దంపతులపై ‘కొండా’ అనే సినిమాను తెరకెక్కించాడు. -
రామ్‌నగర్ బన్నీ ఇద్దరికీ హిట్ ఇవ్వాలి: రామ్‌గోపాల్ వర్మ
‘‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. బాగా నటించాడు కూడా. ఈ చిత్రం చంద్రహాస్‌తో పాటు ప్రభాకర్‌కు పెద్ద విజయం ఇవ్వాలి’’ అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. చంద్రహాస్ హీరోగా శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహించిన చిత్రం ‘రామ్‌నగర్ బన్నీ’. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ ΄÷డకండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ– ‘‘రామ్‌నగర్ బన్నీ’ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘మా అన్నయ్య చంద్రహాస్‌కు ‘రామ్‌నగర్ బన్నీ’ పెద్ద సక్సెస్ ఇవ్వాలి’’ అని దివిజ ప్రభాకర్ చెప్పారు. ‘‘మా మూవీని రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వారికి థ్యాంక్స్’’ అని మలయజ ప్రభాకర్ పేర్కొన్నారు. ‘‘నన్ను ఇంతకాలం ఆదరించిన తల్లులు, అక్కా చెల్లెళ్లు మా ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రభాకర్ ΄÷డకండ. ‘‘మా ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా నచ్చని ప్రేక్షకులు మీ టికెట్‌ని ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు పంపితే మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను’’ అని చంద్రహాస్ తెలిపారు. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర ప్రసాద్, కరాటే రాజు, హీరోయిన్లు రిచా జోషి, రీతు మంత్ర, అంబికా వాణి, విస్మయ శ్రీ, సంగీత దర్శకుడు అశ్విన్ హేమంత్, నటులు సమీర్, సలీమ్ ఫేకు, ఫైట్ మాస్టర్ రాము, లిరిక్ రైటర్స్ అవినాష్, సాగర్ తదితరులు మాట్లాడారు. -
ఐఫా వేదికపై ఆర్జీవీకి కృతజ్ఞతలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) (IIFA Awards-2024) అవార్డుల కార్యక్రమం తాజాగా అబుదాబిలో జరిగింది. ఆ వేదికపై దర్శకులు రామ్‌గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమాకు తొమ్మిది విభాగాల్లో ఐఫా నుంచి అవార్డులు అందాయి. దీంతో ఈ సినిమాను తెరకెక్కించిన సందీప్‌పై భారీగా ప్రశంసలు అందాయి.యానిమల్ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు సందీప్ థ్యాంక్స్ చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ సినిమాలు చూసి తాను ఎడిటింగ్ నేర్చుకున్నానని అబుదాబి వేదికగా సందీప్ అన్నారు. వర్మ సినిమాలకు తాను పని చేయకపోయినప్పటికీ ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే 'థాంక్యూ ఆర్జీవీ సర్' అని సందీప్ చెప్పారు. ఇప్పటికే పలు వేదికల మీద ఆర్జీవీ పట్ల తనకున్న గౌరవాన్ని సందీప్ చాటుకున్నారు. తాజాగా మరోసారి తన అభిమానాన్ని ఇలా పంచుకున్నారు.సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన మాటలను రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తనదైన స్టైల్లో ఆయన ఇలా స్పందించారు. 'సార్.. సందీప్ రెడ్డి వంగా గారు. ఇప్పుడు మీ నుంచి నేను సినిమా తీయడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను. మియా మాల్కోవా, దావూద్ ఇబ్రహీం, అయాన్ రాండ్తో పాటు మీపై ఒట్టేసి చెబుతున్నా.' అని ఆర్టీవీ ట్వీట్ చేశారు.యానిమల్ చిత్రం 2023లో విడుదలైంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్వీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి నటించారు. రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 917 కోట్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. యానిమల్ చిత్రానికి దర్శకుడిగానే కాకుండా ఎడిటర్‌గానూ సందీప్ తన ప్రతిభను చూపించారు. అలా బాలీవుడ్లో తన సత్తా ఏంటో చూపించారు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రానికి సందీప్ దర్శకత్వం వహించనున్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.Sirrrrrrr @imvangasandeep I now want to LEARN film making from YOU and I SWEAR this on Mia Malkova, Dawood Ibrahim ,Ayn Rand and YOU pic.twitter.com/sY0MtdJ7KG— Ram Gopal Varma (@RGVzoomin) September 30, 2024 -
‘శారీ’ హీరోయిన్ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో ఆర్జీవీ సందడి (ఫోటోలు)
-
ఏఐతో పాటలు
సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘శారీ’. ఈ సినిమాకు గిరికృష్ణ కమల్ దర్శకుడు. ఆర్జీవీఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రవి వర్మ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నవంబరులో రిలీజ్ కానుంది. ‘ప్రేమా... ప్రేమా.. ప్రేమా... నీ కోసం నా నిరీక్షణ.. నీ కోసం నా అన్వేషణ’ అంటూ మొదలై, ‘ఐ వాంట్ లవ్... ఐ వాంట్ లవ్...’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.‘‘మా భాగస్వామి రవివర్మతో కలిసి ‘ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ను ఆరంభిస్తున్నానని చెప్పడానికి థ్రిల్ అవుతున్నాను. ఇందులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృతిమ మేధ) యాప్స్‌తో రూపొందిన సంగీతం మాత్రమే ఉంటుంది. ‘శారీ’ మొత్తం ఏఐ సంగీతంతోనే సాగుతుంది. నేపథ్య సంగీతానికి కూడా ఏఐ మ్యూజిక్‌నే వాడాం. వందేళ్ల భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏఐ మ్యూజిక్‌తో వస్తున్న పూర్తి స్థాయి, మొదటి చలన చిత్రంగా ‘శారీ’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలశ్రీశ్రీం’’ అని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. -
ఆర్జీవీ 'శారీ' సినిమా నుంచి ఫస్ట్ రొమాంటిక్ సాంగ్ విడుదల
కాంట్రవర్సీ టాపిక్స్‌తో పాటు నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడిగా రాంగోపాల్ వర్మకు ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'శారీ'. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్‌గా ‘శారీ’ విడుదల కానుంది. సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్జీవీ ఆర్వీప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలో యూనిట్ పేర్కొంది.


