'అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌కు కూడా కష్టమే'.. కొండా సురేఖ కామెం‍ట్స్‌పై ఆర్జీవీ మరో ట్వీట్ | Director Ram Gopal Varma Tweet On Minister Konda Surekha | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: 'అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌కు కూడా కష్టమే'.. కొండా సురేఖ కామెం‍ట్స్‌పై ఆర్జీవీ మరో ట్వీట్

Oct 6 2024 7:05 AM | Updated on Oct 6 2024 9:05 AM

Director Ram Gopal Varma Tweet On Minister Konda Surekha

టాలీవుడ్ డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. అలా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు. తాజాగా కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై సైతం తనదైన శైలిలో స్పందించారు. నాగార్జున ఫ్యామిలీకి మంత్రి క్షమాపణలు చెప్పకుండా.. సమంతను ఆమె కొనియాడారని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాజాగా ఈ వివాదంపై ఆర్జీవీ మరో ట్వీట్ చేశారు. 'గన్ను గురిపెట్టింది కేటీఆర్‌కు ‍అయితే.. కాల్చింది నాగార్జున, నాగచైతన్యలను అని.. కానీ చివరికీ సమంతకు సారీ చెప్పారు' .. అయితే ఈ సమీకరణాన్ని ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కూడా అర్థం చేసుకోవడం కష్టమేనని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఈ విషయంలో నాగార్జున ఫ్యామిలీకి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పకపోవడంపై రాంగోపాల్ వర్మ మండిపడుతున్నారు.

కాగా.. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపాయి. సమంత-నాగచైతన్య విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో మంత్రి వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడి ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఈ విషయంలో నాగార్జున ఇప్పటికే మంత్రిపై పరువునష్టం కేసు దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement