ఏఐతో పాటలు | Indian film director Ram Gopal Varma switches to AI music | Sakshi
Sakshi News home page

ఏఐతో పాటలు

Sep 23 2024 3:44 AM | Updated on Sep 23 2024 3:44 AM

Indian film director Ram Gopal Varma switches to AI music

సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న థ్రిల్లర్‌ మూవీ ‘శారీ’. ఈ సినిమాకు గిరికృష్ణ కమల్‌ దర్శకుడు. ఆర్జీవీఆర్వీప్రొడక్షన్స్‌ పతాకంపై రవి వర్మ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నవంబరులో రిలీజ్‌ కానుంది. ‘ప్రేమా... ప్రేమా.. ప్రేమా... నీ కోసం నా నిరీక్షణ.. నీ కోసం నా అన్వేషణ’ అంటూ మొదలై,  ‘ఐ వాంట్‌ లవ్‌... ఐ వాంట్‌ లవ్‌...’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

‘‘మా భాగస్వామి రవివర్మతో కలిసి ‘ఆర్జీవీ డెన్‌ మ్యూజిక్‌’ను ఆరంభిస్తున్నానని చెప్పడానికి థ్రిల్‌ అవుతున్నాను. ఇందులో ఏఐ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృతిమ మేధ) యాప్స్‌తో రూపొందిన సంగీతం మాత్రమే ఉంటుంది. ‘శారీ’ మొత్తం ఏఐ సంగీతంతోనే సాగుతుంది. నేపథ్య సంగీతానికి కూడా ఏఐ మ్యూజిక్‌నే వాడాం. వందేళ్ల భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏఐ మ్యూజిక్‌తో వస్తున్న పూర్తి స్థాయి, మొదటి చలన చిత్రంగా ‘శారీ’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలశ్రీశ్రీం’’ అని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement