ఆర్జీవీ 'శారీ' సినిమా నుంచి ఫస్ట్ రొమాంటిక్‌ సాంగ్ విడుదల | RGV Saree Movie First Song Out Now | Sakshi
Sakshi News home page

ఆర్జీవీ 'శారీ' సినిమా నుంచి ఫస్ట్ రొమాంటిక్‌ సాంగ్ విడుదల

Sep 22 2024 3:11 PM | Updated on Sep 22 2024 3:22 PM

RGV Saree Movie First Song Out Now

కాంట్రవర్సీ టాపిక్స్‌తో పాటు నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకుడిగా రాంగోపాల్ వర్మకు ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన తెరకెక్కిస్తున్న సినిమా 'శారీ'. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. నిజ జీవిత ఘటనల మేళవింపుతో రూపొందుతున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ‘శారీ’ విడుదల కానుంది. సత్య యాదు, ఆరాధ్య దేవి లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. గిరి కృష్ణకమల్‌ దర్శకత్వంలో ఆర్‌జీవీ ఆర్వీప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్‌ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలో యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement